ఇండస్ట్రీ పెద్దలు.. డైరెక్టర్ త్రివిక్రమ్‌ని ప్రశ్నించాలి: పూనమ్ కౌర్ | Actress Poonam Kaur Tweet On Director Trivikram Latest | Sakshi
Sakshi News home page

Poonam Kaur Trivikram: త్రివిక్రమ్‌పై ఆరోపణలు.. పూనమ్ షాకింగ్ ట్వీట్

Sep 17 2024 3:43 PM | Updated on Sep 17 2024 3:56 PM

Actress Poonam Kaur Tweet On Director Trivikram Latest

స్టార్ దర్శకుడు త్రివిక్రమ్‌తో హీరోయిన్ పూనమ్ కౌర్ గొడవ ఇప్పటిది కాదు. చాన్నాళ్ల నుంచి ఉన్నదే. వీలు చిక్కినప్పుడల్లా గురూజీపై పూనమ్ విమర్శలు చేస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి అలాంటి కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీ పెద్దలు త్రివిక్రమ్‌ని గట్టిగా ప్రశ్నించాలని కోరింది. కొరియోగ్రాఫర్ కమ్ జనసేన నాయకుడు జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో ఈ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది.

హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన పూనమ్ కౌర్.. తెలుగులో పలు సినిమాలు చేసింది. అయితే త్రివిక్రమ్, పవన్ కల్యాణ్‌తో ఈమెకు ఏం గొడవ ఉందో తెలీదు గానీ ఎప్పటికప్పుడు వీళ్లని విమర్శిస్తూనే ఉంటుంది. తాజాగా జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో అతడిని మాస్టర్ అని పిలవొద్దు అని ట్వీట్ చేసింది.

(ఇదీ చదవండి: జానీ మాస్టర్ కేసు.. బయటకొస్తున్న నిజాలు!?)

ఇది పెట్టిన కాసేపటికే త్రివిక్రమ్ గురించి మరో ట్వీట్ చేసింది. 'త్రివిక్రమ్‌పై గతంలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశా. కానీ సినీ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదు. నన్ను రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. సినీ పెద్దలు ఈ విషయమై త్రివిక్రమ్‌ని ప్రశ్నించాలి.' అని పూనమ్ కౌర్ అని ట్విటర్(ఎక్స్)లో రాసుకొచ్చింది.

మరి పూనమ్ కౌర్ చెప్పినట్లు త్రివిక్రమ్‌.. మూవీ ఆర్టిస్ట్ అసిసోయేషన్‌లో ఫిర్యాదు చేసేంతలా ఏం చేశారు? ఈ విషయం సినీ పెద్దలు ఎందుకు బయటకు రానీయలేదు. పూనమ్ కౌర్‌ని రాజకీయంగా ఇబ్బంది పెట్టడం వెనక ఎవరెవరున్నారు? అనేది తెలియాల్సి ఉంది. ఇదంతా చూస్తుంటే కేరళ ఇండస్ట్రీలోని హేమ కమిటీలా ఇక్కడ కూడా ఒకటి ఏర్పాటు చేయాలేమో?

(ఇదీ చదవండి: ప్రముఖ సింగర్ మనో కొడుకులు అరెస్ట్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement