
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. 21 ఏళ్ల అమ్మాయి హైదరాబాద్‌లోని రాయదుర్గ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనని అత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని పేర్కొంది. అలానే ఇండస్ట్రీలోని అవకాశాలని అడ్డుకోవడంతో పాటు శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని వాపోయింది. దీనితో పాటే ఎఫ్ఐఆర్‌లో పలు కీలక అంశాలు ఉన్నాయి.
మధ్యప్రదేశ్‌కి చెందిన బాధితురాలు 2017లో జానీ మాస్టర్‌కి పరిచయమైంది. 2019లో అతని వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరింది. ఓ షో కోసం ముంబయికి వెళ్లిన టైంలో తనని లైంగికంగా వేధించాడని బాధితురాలు చెబుతోంది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపివేస్తానని తనని బెదిరించే వాడని, షూటింగ్‌కు సంబంధించిన వాహనంలో కూడా తనని వేధించాడని బాధితురాలు చెప్పింది.
(ఇదీ చదవండి: కౌగిలించుకోవడం కోసం 17సార్లు రీ షూట్.. మాలీవుడ్ 'తెర' వెనుక అగ్లీ స్టోరీస్)
అందరి ముందు అసభ్యంగా శరీరభాగాలను తాకేవాడని, పెళ్లి చేసుకోవాలంటే మతం మార్చుకోవాలని భార్యతో కలిసి జానీ మాస్టర్ తనని వేధించాడని చెప్పుకొచ్చింది. గత నెల 28న అనుమానాస్పద పార్శిల్ తన ఇంటి ముందు ఉందని, ఇదే నీ చివరి షూటింగ్ అని దానిపై రాసి ఉందని బాధితురాలు పేర్కొంది. తనకు అవకాశాలు లేకుండా చేయడంతో పాటు జానీ మాస్టర్ నుంచి తనకు ప్రాణ హాని కూడా ఉందని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. దీనిపై నార్సింగి పోలీసులు ప్రస్తుతం విచారణ చేస్తున్నారు.
ఇదే కాదు గతంలోనూ జానీ మాస్టర్‌పై సతీష్ అనే కొరియోగ్రాఫర్ కేసు పెట్టాడు. అంతకు ముందు కాలేజీకి వెళ్లి ఓ యువతిని కొట్టిన కేసులో 2019లో కోర్టు ఇతడికి ఆరు నెలల జైలు శిక్ష కూడా విధించింది. ఇప్పుడు లైంగిక వేధింపుల కేసు. ఇలా వరస వివాదాలతో జానీ మాస్టర్ హాట్ టాపిక్ అయిపోయాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 మూవీస్.. ఆ మూడు కాస్త స్పెషల్)
Comments
Please login to add a commentAdd a comment