Jani Master
-
'మహిళల భద్రతకు ఈ తీర్పే నిదర్శనం'.. జానీ మాస్టర్ కేసుపై ఝాన్సీ పోస్ట్
టాలీవుడ్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఓ మహిళ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతనికి బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఇటీవల వేధింపులకు గురైన లేడీ కొరియోగ్రాఫర్ ఓ టీవీ ఇంటర్వ్యూకు హాజరైంది. జానీ మాస్టర్ గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టింది.అయితే ఈ కేసుపై టాలీవుడ్ నటి ఝాన్సీ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది. జానీ భాష విషయంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజయం సాధించిందని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. పని ప్రదేశంలో ఎక్కడైనా సరే మహిళలపై వేధింపులను సహించేది లేదని ఈ తీర్పు చూస్తే అర్థమవుతోందని.. దీనిపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమాఖ్య పోరాటం చేసినందుకు ఝాన్సీ ధన్యవాదాలు తెలిపింది. (ఇది చదవండి: జానీ మాస్టర్ కేసు: తొలిసారి నోరు విప్పిన శ్రేష్టి, సిగ్గుండాలంటూ ఫైర్!)ఝాన్సీ తన ఇన్‌స్టాలో రాస్తూ..' ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ కేసును గెలుచుకుంది. కొరియోగ్రాఫర్ జానీ బాషా జిల్లా కోర్టులో ఛాంబర్ ఆదేశాలను సవాల్ చేశారు. ఈ రోజు కోర్టు ఆయన మధ్యంతర పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఇది చాలా ముఖ్యమైన తీర్పు. పని ప్రదేశంలో మహిళల భద్రత ముఖ్యమని ఈ తీర్పు చెబుతోంది. ఈ విషయంలో సీరియస్‌గా తీసుకుని పోరాటం చేసినందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమాఖ్యకు నా ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
జానీ మాస్టర్ కేసు: తొలిసారి నోరు విప్పిన శ్రేష్టి, సిగ్గుండాలంటూ ఫైర్!
కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Jani Master)పై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ తన దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడంతో జానీ మాస్టర్ని అరెస్ట్ కూడా చేశారు. దాదాపు నెల రోజుల వరకు జైల్లో ఉండి..కొన్నాళ్ల క్రితం బెయిల్‌పై బయటకు వచ్చాడు. తను ఏ తప్పు చేయలేదని, తనేంటో నిరూపించుకుంటాననీ, తన నిర్దోషిత్వాన్ని బయటపెడతానని వరుస ఇంటర్వ్యూల్లో చెబుతున్నాడు. జైలు నుంచి బయటకు వచ్చాక..భార్యతో కలిసి జానీ మాస్టర్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. కానీ ఫిర్యాదు చేసిన లేడి కొరియోగ్రాఫర్ మాత్రం ఇంతవరకు ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. చాలా కాలం తర్వాత తాజాగా ఆమె మీడియా ముందుకు వచ్చారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచనల విషయాలు వెల్లడించారు.మాస్క్ ఎందుకు వేసుకోవాలి?సదరు మీడియా చానల్ ఇంటర్వ్యూకి ముందు జానీ మాస్టర్‌పై కేసు పెట్టిన లేడి కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ(Shrasti Verma )ను మాస్క్ వేసుకోవాలని కోరింది. అయితే తాను ఏ తప్పు చేయలేదని.. మాస్క్ వేసుకోకుండా ఇంటర్వ్యూ ఇస్తానని శ్రేష్ట చెప్పింది. అంతేకాదు ఒక అమ్మాయి అన్యాయం జరిగిందని కేసు పెట్టినప్పుపు మాస్క్ వేసుకొని మీడియా ముందుకు రావాల్సిన అవసరం లేదన్నారు. తాను వారియర్‌ని అని..మంచి కోసం ఫైట్ చేస్తున్నాని చెప్పింది. తనను ఆదర్శంగా తీసుకొని పది మంది అమ్మాయిలు మారినా చాలని అంటున్నారు. ఇక జానీ మాస్టర్ కేసు విషయం గురించి మాట్లాడుతూ.. రివేంజ్ కోసం ఆ కేసు పెట్టలేదని.. సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమే ఫిర్యాదు చేశానని చెప్పింది. అమ్మాయి అంటే ఆట బొమ్మ కాదని..వాళ్లకు ఇష్టం లేదని చెబితే దాన్ని గౌరవించాలని కోరింది.అందుకే నాలుగేళ్ల తర్వాత ఫిర్యాదుజానీ మాస్టర్ నాలుగేళ్ల క్రితం వేధిస్తే..ఇప్పుడెందుకు కేసు పెట్టావని చాలా మంది అడుగుతున్నారు. నేను ఒక అమ్మాయిని. అప్పుడు మైనర్ని కూడా. ఒక పలుకుబడి ఉన్న వ్యక్తితో పోరాడే శక్తి నాకు లేదు. పైగా ఆ పర్సన్(జానీ మాస్టర్) మారతాడేమోనని భావించాను. కానీ నేను ఆశించినట్లుగా ఆయనలో మార్పు రాలేదు. వేధింపులు ఇంకా కొనసాగించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాను. కేసు పెట్టే ముందు నా దగ్గర రెండే ఆప్షన్లు ఉన్నాయి. ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడమా లేదా ఆత్మహత్య చేసుకోవడమా? వాటిలో నేను మొదటిదే ఎంచుకున్నాను.నేను ఫైట్ చేయగలను అనుకున్నప్పడే బయటకు వచ్చాను. సొసైటీ గురించి ఆలోచించలేదు. సోషల్ మీడియాను పట్టించుకోలేదు. ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేశాను. అందుకే మాస్క్ లేకుండా మీడియా ముందుకు వచ్చాను. ఫ్యామిలీ ఏదో అంటుంది. స్నేహితులు అలా అంటారు అని ఆలోచించకుండా నాలాగే అన్యాయం జరిగిన అమ్మాయిలంతా ధైర్యంగా ముందుకు రావాలి.ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు?నేను కేసు పెట్టిన తర్వాత సమీర్ అనే అబ్బాయితో నాపై ఫిర్యాదు చేయించే ప్రయత్నం చేశాడు. అతను నిందితుడు(జానీ మాస్టర్) బంధవు. ఆయన భార్యనే స్వయంగా తీసుకెళ్లి నాపై ఫిర్యాదు చేయించేందుకు ప్రయత్నించింది. కానీ పోలీసులు అతని ఫిర్యాదు స్వీకరించలేదు. నేను అతన్ని మోసం చేశానని, లైంగికంగా వేధించానని సమీర్ చెప్పాడు. అదంతా మీడియా ప్రసారం చేసింది కూడా. అంతేకాదు పోలీసులు స్వీకరించకపోతే సూసైడ్ చేసుకుంటాను అన్నాడు. మరి నిజంగా సూసైడ్ చేసుకున్నాడా? ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? మీడియా అతని గురించి ఎందుకు ఆరా తీయడం లేదు? బెదిరింపులకు భయపడే అమ్మాయిని కాదు. అతనికి తల్లి, చెల్లి ఉన్నారు కదా.. భవిష్యత్తులో భార్య కూడా వస్తుంది. ఇలాంటి చీప్ ఆరోపణలు చేయడానికి సిగ్గు ఉండాలి. నాలుగేళ్ల తర్వాత కేసు ఎందుకు పెట్టావని నన్ను అంటున్నారు. మరి సమీర్ నాలుగేళ్ల తర్వాత నాపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నాడు? నేనంటే అమ్మాయిని భయపడి ఇన్నాళ్లు ఫిర్యాదు చేయకుండా ఉన్నాను అనుకో. అతను అబ్బాయి కదా.. అప్పుడు ఎందుకు కేసు పెట్టలేదు? ఇదంతా నిందితుడి భార్య ఆడుతున్న డ్రామా. ఆమె కొంచెం కూడా సిగ్గులేదు.నేషనల్ అవార్డు రద్దుతో నాకు సంబంధం లేదుజానీ మాస్టర్‌కి ప్రకటించిన నేషనల్ అవార్డు రద్దు కావడానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని శ్రేష్ట చెప్పారు. ‘నేషనల్ రద్దు కోసం నేను ఎలాంటి లేఖలు రాయలేదు. నాకు లాయర్ కూడా లేరు. అతనిపై ఆరోపణలు వచ్చాయి కనుకే అవార్డు రద్దు అయింది. వ్యక్తిగత జీవితం వేరు..ప్రొఫెషినల్ లైఫ్ వేరు కదా.. అవార్డు ఎందుకు రద్దు చేస్తారని కొంతమంది అంటున్నారు. కానీ ప్రొఫెషనల్‌గా ఎంత బాగున్నప్పటికీ..బుద్ది మంచిగా లేకపోతే ఎలా? నేషనల్ అవార్డు అనేది చాలా పెద్దని.. అన్ని చూస్తారు. ఆరోపణలు ఉన్నాయనే అవార్డు రద్దు చేశారు. అంతేకానీ నేను అయితే ఎలాంటి లేఖ రాయలేదు. -
రివైండ్-2024: గతంలో ఎన్నడూ లేని విధంగా సినీ ఇండస్ట్రీని వెంటాడిన వివాదాలు, కేసులు
-
జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు.. పోలీసుల ఛార్జ్ షీట్లో కీలక అంశాలు!
జానీ మాస్టర్ (Jani Master) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ మహిళ కొరియోగ్రాఫర్(choreographer) ఫిర్యాదుతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపుల కేసులో ఆయనను అరెస్ట్ చేసిన నార్సింగి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత బెయిల్ మంజూరు కావడంతో జానీ విడుదలయ్యారు. తాజాగా ఈ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.లైంగిక వేధింపులకు పాల్పడ్డారు: ఛార్జ్ షీట్లో పోలీసులుపలు ఈవెంట్స్ పేరుతో మహిళ కొరియోగ్రాఫర్‌ను లైంగిక వేధింపులకు గురి చేశాడని పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఆమెను పలు ప్రాంతాలకు తీసుకెళ్లి వేధింపులకు గురి చేసినట్లు అందులో ప్రస్తావించారు. కాగా.. తనను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ ఓ మహిళ కొరియోగ్రాఫర్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.(ఇది చదవండి: పెళ్లి చేసుకోమని ఆమె నన్ను వేధించేది: జానీ మాస్టర్)అసలేం జరిగిందంటే..టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై 21 ఏళ్ల అమ్మాయి హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనని అత్యాచారం చేయడంతో పాటు శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని వాపోయింది. మధ్యప్రదేశ్‌కి చెందిన బాధితురాలు 2017లో జానీ మాస్టర్‌కి పరిచయమైంది. 2019లో అతని వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరింది. ఓ షో కోసం ముంబయికి వెళ్లిన టైంలో తనని లైంగికంగా వేధించాడని బాధితురాలు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపివేస్తానని తనని బెదిరించే వాడని, షూటింగ్‌కు సంబంధించిన వాహనంలో కూడా తనని వేధించాడని బాధితురాలు వాపోయింది. దీంతో జానీపై లైంగిక వేధింపుల కేసుతో పాటు పోక్సో కేసు కూడా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న.. జానీ మాస్టర్ రియాక్షన్?
గతకొన్నిరోజుల నుంచి అల్లు అర్జున్ (Allu Arjun) వివాదం ఎంతలా రచ్చ రచ్చ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రెండు మూడు రోజుల్లో అయితే పీక్‌కి చేరిందని చెప్పొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఏకంగా అసెంబ్లీలో బన్నీపై ఘాటు వ్యాఖ్యలు చేయడం, ఇది జరిగిన కాసేపటికే అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టి వాటిని ఖండించడం హాట్ టాపిక్ అయిపోయింది.ఇదలా ఉంచితే బన్నీకి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. విచారణ కోసం మంగళవారం ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని ఆదేశించారు. రీసెంట్గా లైంగిక ఆరోపణల కేసులో జైలుకెళ్లొచ్చిన జానీ మాస్టర్ని (Jani Master) తాజాగా మీడియా ప్రతినిధులు కలిశారు. అల్లు అర్జున్ అరెస్ట్ (Arrest) గురించి ప్రశ్నించారు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్.. ఇంత సన్నబడ్డాడేంటి?)'ఈ విషయంలో నేనేం మాట్లాడుదలుచుకోలేదు. నేను ఓ ముద్దాయినే. నాపై ఆరోపణలు ఉన్నాయి. నా కేసు కోర్టులో ఉంది. కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదు. న్యాయస్థానంపై నాకు నమ్మకముంది. అందరికీ మంచి జరగాలి' అని జానీ మాస్టర్ చెప్పాడు.'జైలుకు వెళ్లకముందు.. వెళ్లొచ్చిన తర్వాత మీకు ఇండస్ట్రీలో మర్యాద ఎలా ఉంది? అని అడగ్గా.. ఒకేలా ఉందని జానీ మాస్టర్ సమాధానమిచ్చాడు. గుండెల మీద చెయ్యి వేసి మరీ చెబుతున్నా బాగానే ఉంది అని అన్నాడు' అని జానీ మాస్టర్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: సింగర్ రమణ గోగుల 'గుండు' వెనక ఇంత స్టోరీ ఉందా?) -
డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో వివాదం.. స్పందించిన జానీ మాస్టర్
లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయి, ఇటీవల బెయిల్‌పై బయటకొచ్చిన జానీ మాస్టర్‌కి ఊహించని షాక్ తగిలిందంటూ వార్తలు వచ్చాయి. ఆయనను డ్యాన్స్ అసోసియేషన్ నుంచి తొలగించారని సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్లో కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే, తాజాగా జానీ మాస్టర్ తన సోషల్‌మీడియా ద్వారా రియాక్ట్ అయ్యారు.మొన్నటివరకు డ్యాన్సర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జానీ మాస్టర్ కొనసాగుతూ వచ్చారు. ఎప్పుడైతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ని లైంగికంగా వేధించాడనే ఆరోపణలు వచ్చాయో.. ఇతడి పదవిపై నీలినీడలు కమ్ముకున్నాయి. అందుకు తగ్గట్లే తాజాగా ఆదివారం అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించగా.. జోసెఫ్ ప్రకాశ్ విజయం సాధించారు. 5వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2023లో అధ్యక్షుడిగా ఎన్నికైన జానీ.. తన పదవీ కాలం 2025 వరకు ఉంది. అయితే, గుట్టుచప్పుడు కాకుండా అసోషియేషన్‌లో ఎలక్షన్లు నిర్వహించడంపై ఆయన తప్పుబట్టారువారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా: జానీతనను అసోసియేషన్ నుంచి తొలగించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని జానీ మాస్టర్ తెలిపారు. సోషల్‌మీడియాలో కావాలనే ఎవరో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని ఇలా చెప్పారు. 'నన్ను ఏ యూనియన్ నుంచి తొలగించలేదు. నేను డ్యాన్సర్ యూనియన్‌లో మెంబర్. అందులో నుంచి శాశ్వితంగా ఎవర్నీ తొలగించలేరు. నిన్న జరిగిన ఎన్నికలపై నేను ఫైట్ చేస్తాను. నా పదవీ కాలం ఇంకా ఉంది. కొందరు అనధికారికంగా, అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు, హోదాలు తీసుకున్నారు. వారికి ఆ హక్కు లేదు. దీనికి కారణమైన వారిపై చట్టపరంగా వెళుతున్నాను. టాలెంట్ ఉన్నవారికి పనివ్వకుండా, దొరక్కుండా ఎవ్వరూ ఆపలేరు. నా కొరియోగ్రఫీలో గేమ్ ఛేంజర్ నుంచి ఓ మంచి పాట రాబోతుంది, మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.' అని జానీ అన్నారు.డ్యాన్స్ అసోసియేషన్ కోసం తీసుకున్న భూ వివాదంలలో భారీ స్కామ్ జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. శంకర్‌పల్లిలో డ్యాన్సర్ అసోసియేషన్ కోసం 15 ఎకరాలు భూమి కొనుగోలు సమయంలో కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని. ఆ స్కామ్ వివరాలను జానీ మాస్టర్ బయటకు తీయడం వల్లే జానీ మాస్టర్‌పై ఆరోపణలు వస్తున్నాయని తెలుస్తోంది. డ్యాన్సర్ అసోసియేషన్ కార్డుల జారీ విషయంలో కూడా భారీగా వసూళ్లకు పాల్పిడినట్లు జానీ ఆరోపించడంతో తనపై ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. నిర్ధారణవ్వని ఆరోపణలని కారణంగా చూపిస్తూ నన్ను శాశ్వతంగా యూనియన్ నుండి తొలగించినట్టు మీడియాలో పుకార్లు పుట్టిస్తున్నారు. అవేవీ నమ్మకండి!!నా పదవీ కాలం ఇంకా ఉన్నా కూడా అనధికారికంగా, అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు, హోదాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదు. దీనికి… pic.twitter.com/qroJxE5Uxv— Jani Master (@AlwaysJani) December 9, 2024 -
జానీ మాస్టర్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత
ఢిల్లీ: ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. లైంగిక వేధింపుల కేసులో అతని బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది.తన అసిస్టెంట్‌పై జానీ లైంగిక దాడికి పాల్పడ్డాడన్నది అతనిపై నమోదైన ప్రధాన అభియోగం. ఈ కేసులో అరెస్టై జైల్లో ఉన్న జానీకి తెలంగాణహైకోర్టు అక్టోబర్ 24వ తేదీన బెయిల్ మంజూరు చేసింది. అయితే..ఆ బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఫిర్యాదుదారు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దీనిని పరిశీలించిన జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ సతీష్‌చంద్ర మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణకు నో చెప్పింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని ఫిర్యాదుదారు లాయర్‌కు చెబుతూ.. పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. -
‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
జైలు నుంచి విడుదలైన జానీ మాస్టర్!
లైంగిక వేధింపుల కేసులో జైలులో ఉన్న జానీ మాస్టర్ ఇవాళ విడుదలయ్యారు. గురువారం ఆయనకు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. న్యాయస్థానం బెయిల్ ఇవ్వడంతో చంచల్ గూడ జైలు నుంచి బయటకొచ్చారు. దాదాపు 36 రోజులుగా జానీమాస్టర్ జైలులోనే ఉన్నారు.కాగా.. లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో ఆయిన అరెస్టైన విషయం తెలిసిందే. జానీ మాస్టర్ తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారని మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి సెప్టెంబర్ 15న నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పైగా మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి కూడా చేశారని ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుల మేరకు జానీ మీద పోక్సో చట్టం కింద నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి.. గత నెల గోవాలో అరెస్టు చేశారు. -
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బెయిల్
సాక్షి, హైదరాబాద్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేల వ్యక్తిగత బాండ్‌తో పాటు ఇద్దరి పూచీకత్తును రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కోర్టులో మేజి్రస్టేట్‌కు సమర్పించాలని జానీని ఆదేశించింది. బాధితురాలి వ్యక్తిగత జీవితంలో జానీగాని, అతని కుటుంబ సభ్యులుగానీ ఎలాంటి జోక్యం చేసుకోవద్దని, బాధితురాలిని కలిసే ప్రయత్నం కూడా చేయవద్దని స్పష్టం చేసింది. జానీ మాస్టర్ తనను వేధించారని, పలుమార్లు అత్యాచారం చేశారని, మైనర్‌గా ఉన్నప్పుడే తనపై అత్యాచారం చేశారంటూ అతని అసిస్టెంట్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.పైగా మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి కూడా చేశారని ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుల మేరకు జానీ మీద పోక్సో చట్టం కింద నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి.. గత నెలలో గోవాలో అరెస్టు చేశారు. అయితే, జాతీయ అవార్డు తీసుకునేందుకు ఈ నెల 6 నుంచి 10 వరకు ట్రయల్ కోర్టు మధ్యంతర బెయిల్ ఇచి్చంది. కానీ ఆయనకు ఇచి్చన అవార్డును వెనక్కు తీసుకోవడంతో బెయిల్ రద్దయింది. ఈ నేపథ్యంలో చంచల్‌గూడ జైలులో ఉన్న జానీ మాస్టర్ రెగ్యులర్ బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి గురువారం విచారణ చేపట్టారు. వాదనలు విన్న న్యాయమూర్తి, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
కొరియోగ్రాఫర్ 'జానీ మాస్టర్'కు బెయిల్
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరు అయింది. లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో ఆయిన అరెస్టైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు రంగారెడ్డి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇప్పటికే పలుమార్లు బెయిల్ కోసం జానీ పిటిషన్ పెట్టుకున్నప్పటికీ దానిని కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా బెయిల్ ప్రకటన రావడంతో ఆయన కుటుంబ సభ్యులు సంతోషిస్తున్నారు.జానీ మాస్టర్ తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారని మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి సెప్టెంబర్ 15న నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అవకాశాల పేరుతో తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న యువతిపై జానీ మాస్టర్ లైంగిక దాడి చేశారని ఫిర్యాదు రావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం యువతి మైనర్‌గా ఉన్నప్పటి(2019) నుంచి తనపై లైంగిక దాడి జరుగుతున్నట్లు తెలింది. దీంతో ఎఫ్ఐఆర్లో పోక్సో కేసుగా నమోదు చేశారు. అయితే, ఈ కేసులో ఆయనకు తాజాగా బెయిల్ లభించింది. అక్టోబర్ 25న చంచల్గూడా జైలు నుంచి జానీ మాస్టర్ విడుదల కానున్నారని సమాచారం. -
జానీ మాస్టర్‌కు భారీ షాక్
-
కోర్టులో జానీ మాస్టర్‌కు చుక్కెదురు
లైంగిక వేధింపుల కేసులో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు కొద్దిరోజుల క్రితం జానీని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అయితే, ఈ క్రమంలో బెయిల్ కోసం రంగారెడ్డి కోర్టులో జానీ ఒక పిటీషన్ పెట్టుకున్నారు. తాజాగా న్యాయస్థానంలో తన బెయిల్‌పై విచారణ పూర్తి అయింది.ఇప్పటికే పలుమార్లు జానీ బెయిల్ పిటీషన్‌పై విచారణ వాయిదా పడింది. కానీ, నేడు (అక్టోబర్ 14) జానీ బెయిల్ పిటిషన్‌పై రంగారెడ్డి పోక్సో ప్రత్యేక కోర్టు వాదనలు విన్నది. కేసు విచారణ పూర్తి అయిన అనంతరం రంగారెడ్డి జిల్లా ఫోక్సో కోర్టు జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. బెయిల్ వస్తుందని ఆశలు పెట్టుకున్న జానీకి కోర్టులో నిరాశ ఎదురైంది. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఆయన ఉన్నారు.జానీ మాస్టర్ తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారని మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి సెప్టెంబర్ 15న నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం బయట చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని జానీ భయపెట్టాడంటూ ఫిర్యాదులో ఆమె పేర్కొంది. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం యువతి మైనర్‌గా ఉన్నప్పటి(2019) నుంచి తనపై లైంగిక దాడి జరుగుతున్నట్లు తెలింది. దీంతో ఎఫ్ఐఆర్లో పోక్సో కేసుగా నమోదు చేశారు. -
జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లి బీబీజాన్‌కు గుండెపోటు వచ్చింది. జానీ జైలుపాలవడంతో అతడిపై బెంగ పెట్టుకున్న ఆమెకు శనివారం ఒక్కసారిగా ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను నెల్లూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న జానీ మాస్టర్ భార్య ఆయేషా ఆస్పత్రికి వెళ్లి అత్తమ్మ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసింది.జైల్లో ఖైదీగా..మహిళా కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం, బెదిరింపుల కేసులో షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్ అరెస్టయ్యాడు. లైంగికదాడి ఆరోపణల నేపథ్యంలో అతడికి రావాల్సిన జాతీయ అవార్డు (బెస్ట్ కొరియోగ్రఫీ) సైతం రద్దయింది. ప్రస్తుతం ఇతడు చంచల్‌గూడ కేంద్రకారాగారంలో విచారణ ఖైదీగా ఉన్నాడు.చదవండి: జిగ్రా చూద్దామని వెళ్లా.. థియేటర్ మొత్తం ఖాళీ.. అయినా..! -
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై జానీమాస్టర్ బంధువు ఫిర్యాదు
నెల్లూరు (క్రైమ్): సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ వ్యవహారంలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. జానీమాస్టర్ కేసులో బాధితురాలైన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తనను లైంగికంగా వేధిస్తోందని ఓ యువకుడు శుక్రవారం నెల్లూరు సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సేకరించిన సమాచారం మేరకు.. రంగనాయకులపేటకు చెందిన సమీర్ ప్రస్తుతం బిటెక్ చదువుతున్నాడు. అతను కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ మేనమామ కుమారుడు. సమీర్ ఎక్కువగా హైదరాబాద్‌లో జానీమాస్టర్ వద్ద ఉండేవాడు. ఆయనతో పాటు షూటింగ్‌లకు వెళ్లేవాడు. ఈ క్రమంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్న యువతితో అతనికి పరిచయం అయింది. ఆమె 2020 నుంచి తనను తరచూ లైంగిక వేధింపులకు గురిచేసిందని సమీర్ ఆరోపించారు. ఆమైపె చర్యలు తీసుకోవాలని సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే సదరు యువతి జానీమాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టడం, అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండడం తెలిసిందే. తాజాగా ఆ యువతిపై జానీమాస్టర్ మేనమామ కొడుకు ఫిర్యాదు చేయడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వ్యవహారం మొత్తం తెలంగాణ, చైన్నె రాష్ట్రాల్లో జరగడంతో పోలీసులు న్యాయ నిపుణుల సలహాలను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
నా మధ్యంతర బెయిల్ రద్దు చేయండి: జానీ మాస్టర్
రంగారెడ్డి కోర్టులు: లైంగికదాడి ఆరోపణల నేపథ్యంలో నృత్య దర్శకుడు జానీ మాస్టర్ చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. తనకు ఉత్తమ నృత్య దర్శకుడి అవార్డు వచ్చిందని, అవార్డు అందుకునేందుకు ఢిల్లీ వెళ్లాల్సి ఉన్నందున ఈ నెల 6నుంచి 10 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గత సోమవారం రంగారెడ్డి జిల్లా ప్రధాన పోక్సో కోర్టు కమ్ 9వ అదనపు జిల్లా కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న కోర్టు గత గురువారం జానీ మాస్టర్‌కు ఈ నెల 6నుండి 9వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. కాగా జానీ మాస్టర్ అందుకోబోయే పురస్కారాన్ని రద్దు చేసినట్లు తెలియడంతో ఆయన తనకు మంజూరైన మధ్యంతర బెయిల్‌ను వినియోగించుకోబోనని కోర్టులో మెమో దాఖలు చేశాడు. ఇదిలా ఉండగా జానీ మాస్టర్ సాధారణ బెయిల్ పిటిషన్ బుధవారానికి వాయిదా పడింది. -
జానీ మాస్టర్ దగ్గర ఛాన్స్.. నా కూతురిని పంపొద్దన్నారు: నైనిక తల్లి
బిగ్‌బాస్ 8 తెలుగు షోలో కాస్త జోష్ వచ్చినట్లు కనిపించింది. కొత్తగా ఎనిమిది మంది వైల్డ్ కార్డ్స్ పేరిట ఎంట్రీ ఇచ్చారు. మరోవైపు గతవారం మిడ్ వీక్ ఆదిత్య ఎలిమినేట్ కాగా.. ఆదివారం ఎపిసోడ్లో నైనిక ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఈమె తల్లికి సంబంధించిన ఓ ఇంటర్వ్యూ క్లిప్ వైరల్ అవుతుంది. అందులో జానీ మాస్టర్ ప్రస్తావన రావడమే కాస్త ఆసక్తికరంగా అనిపించింది.(ఇదీ చదవండి: బెయిల్ విషయంలో జానీ మాస్టర్‌కు షాకిచ్చిన పోలీసులు)ఢీ షోలో డ్యాన్సర్‌గా కాస్త గుర్తింపు తెచ్చుకున్న నైనిక.. గత కొన్నాళ్లు నుంచి మాత్రం నటిగా అవకాశాలు వెతుక్కుంటోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం బిగ్‌బాస్ 8లో ఓ కంటెస్టెంట్‌గా వచ్చింది. కానీ పట్టుమని ఐదు వారాల్లోనే ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసింది.గతంలో ఢీ డ్యాన్స్ షో తర్వాత గణేశ్ మాస్టర్, జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా అవకాశాలు వచ్చాయని తాను పంపించలేదని నైనిక తల్లి చెప్పింది. జానీ మాస్టర్ దగ్గరకు అయితే వద్దని శశి మాస్టర్ తమతో చెప్పాడని అన్నారు. రీసెంట్గా తన అసిస్టెంట్‌ని వేధించారనే ఆరోపణలతో జానీ అరెస్ట్ అయ్యారు. దీంతో నైనిక తల్లి కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'నేనేమన్నా యుద్ధానికి పోతున్నానా?'.. మొదటి రోజే బుక్కైన అవినాశ్!) -
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు పోలీసులు బిగ్ షాక్
-
బెయిల్ విషయంలో జానీ మాస్టర్‌కు షాకిచ్చిన పోలీసులు
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్ విషయంలో ఎదురుదెబ్బ తగలనుంది. అక్టోబర్ 8న జాతీయ అవార్డు అందుకునేందుకు బెయిల్ కోసం జానీ మాస్టర్ పిటీషన్ వేశారు. దీంతో రంగారెడ్డి కోర్టు ఈనెల 6 నుంచి 10 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఇప్పుడా బెయిల్ రద్దు అయ్యే ఛాన్స్ ఉంది.2022లో తమిళ సినిమా 'తిరుచిత్రబలం' తెలుగులో 'తిరు' చిత్రానికిగాను జాని మాస్టర్‌కు ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డును కేంద్రప్రభుత్వం ప్రకటించింది. అయితే జానీ మీద పోక్సో చట్టం కింద వచ్చిన ఆరోపణలతో కేసు నమోదు అయింది. ఈ కారణంతో అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు జాతీయ అవార్డుల కమిటీ ప్రకటించింది. దీంతో జానీమాస్టర్‌కు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని రంగారెడ్డి కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. విచారణ అనంతరం ఆయన బెయిల్ రద్దు చేసే అవకాశమే ఎక్కువగా ఉంది. తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న యువతిపై ఆయన లైంగిక దాడి చేశారని ఫిర్యాదుతో జానీ మాస్టర్ రిమాండ్‌లో ఉన్నారు. -
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు రద్దు
-
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
మహిళా కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసులో జైలులో ఉన్న జానీ మాస్టర్‌కు ఇటీవలే బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. నేషనల్ అవార్డు అందుకునేందుకు గానూ తనకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అయితే జానీ పోక్సో కేసు నమోదు కావడంతో పలువురు తనకు నేషనల్ అవార్డు రద్దు చేయవలసిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దాంతో జానీ మాస్టర్‌కు ప్రకటించిన నేషనల్ అవార్డును రద్దు చేస్తున్నట్టు కేంద్ర అవార్డు కమిటీ నిర్ణయం తీసుకుంది. 2022 బెస్ట్ కొరియోగ్రఫీకి గాను ఈ నెల 8న ఢిల్లీలో జతీయ అవార్డు అందుకోవలసి ఉంది. అందుకు గాను అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 9 వరకు జానీ మాస్టర్‌కు కోర్టు గురువారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ జానీపై పోక్సో కేసు కారణంతో అవార్డు రద్దు అయింది. దీంతో అతని బెయిల్‌పై అనిశ్చితి నెలకొంది. -
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్
-
జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్.. కారణం ఇదే
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్ లభించింది. కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇస్తున్నట్లు రంగారెడ్డి కోర్టు తెలిపింది. అయితే, ఈనెల 6 నుంచి 10 వరకు మాత్రమే ఆయనకు ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న యువతిపై ఆయన లైంగిక దాడి చేశారని ఫిర్యాదు రావడంతో నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి ఫిర్యాదుతో జానీ మాస్టర్‌కు ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్‌ను విధించిన విషయం తెలిసిందే. దీంతో చంచల్‌గూడ జైలుకు ఆయన్ను తరలించారు. అయితే, అక్టోబర్ 3 తో ఆయనకు విధించిన గడువు ముగిసింది. అయితే, జాతీయ అవార్డుల కార్యక్రమానికి హాజరవ్వాలని బెయిల్ కోసం జానీ మాస్టర్ దరఖాస్తు చేసుకున్నారు. దానిని పరిశీలించిన రంగారెడ్డి న్యాయస్థానం ఈనెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 8న ఢిల్లీలో జరిగే జాతీయ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. 70వ జాతీయ అవార్డ్స్‌లో జానీ మాస్టర్‌కు చోటు చోటు దక్కిన విషయం తెలిసిందే. తమిళ్లో తిరుచిట్రంబళం (తిరు) సినిమాలో ఆయన కొరియోగ్రఫీ చేసిన ఒక పాట నేషనల్ అవార్డ్‌ను తెచ్చిపెట్టింది. ఉత్తమ కొరియోగ్రఫీ విభాగంలో జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్ మాస్టర్ సంయుక్తంగా ఈ అవార్డ్‌ను అందుకోనున్నారు. -
నేషనల్ అవార్డు తీసుకోవాలి బెయిల్ ఇవ్వండి..
-
ముగిసిన జానీ మాస్టర్ కస్టడీ.. మళ్లీ జైలుకు తరలింపు
లైంగిక ఆరోపణలు, పోక్సో కేసులో అరెస్టయిన జానీ మాస్టర్ పోలీసు కస్టడీ ముగిసింది. నాలుగు రోజులపాటు కస్టడీకి తీసుకుని ఆయన్ను అనేక ప్రశ్నలతో పోలీసులు విచారణ జరిపారు. ఈనెల 25వ తేదీ నుంచి జానీ మాస్టర్‌ను నార్సింగ్ పోలీసులు విచారించారు. నేటితో కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో ఆయన్ను మళ్లీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. అయితే, జానీ మాస్టర్‌ను మరోసారి విచారించేందుకు పోలీసులు కస్టడీకి కోరలేదు.పోలీసు కస్టడీలో జానీ మాస్టర్‌ను నార్సింగ్ పోలీసులు అనేక ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. బాధితురాలితో తనకు ఉన్న సంబంధం ఏంటి..? ఆమెతో మొదట ఎలా పరిచయం అయింది..? ఆ యువతి ఇచ్చిన ఆధారాలను జానీ మాస్టర్ ముందు ఉంచి విచారణ జరిపినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నాలుగు రోజులపాటు అతడిని విచారించిన నార్సింగి పోలీసులు.. అనంతరం ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు. అక్కడి నుంచి జానీ మాస్టర్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. జానీ మాస్టర్ తనపై లైంగిక దాడి చేశారని అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాను మైనర్‌గా ఉన్నప్పడే ఈ ఘాతుకానికి జానీ పాల్పడినట్లు ఫిర్యాదులో యువతి పేర్కొంది. అక్టోబర్ 3న జానీ మాస్టర్ రిమాండ్ గడువు ముగుస్తుంది. -
‘నా భర్తను ట్రాప్ చేసింది.. ఇంటికి రాకుండా అడ్డుకునేది’
సాక్షి, హైదరాబాద్: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. తన భర్తపై ఫిర్యాదు చేసిన బాధితురాలపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు ఆయన భార్య సుమలత ఫిర్యాదు చేసింది. కొరియోగ్రాఫర్‌గా పని చేయడం కోసం నా భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసిందని పేర్కొన్నారు. ఐదేళ్లుగా నరకం అంటే చూపిందని.. తాను ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు తీసుకెళ్లిందంటూ ఫిర్యాదులో తెలిపింది.‘‘నాకు అమ్మ వద్దు.. నాన్న వద్దు.. నువ్వు పెళ్లి చేసుకో అంటూ నా భర్తపై తీవ్ర ఒత్తిడి చేసింది. నా భర్తను ఇంటికి రాకుండా అడ్డుకునేది. కేవలం 2 నుంచి 3 గంటలు మాత్రమే ఇంటికి పంపేది. బాధితురాలు ఇంటికి వెళ్లి జానీ మాస్టర్‌ను నువ్వు ఇష్టపడితే.. ఆయన జీవితం నుంచి నేను వెళ్లిపోతానని చెప్పాను. బాధితురాలు మాత్రం మాస్టర్ నాకు అన్నయ్య లాంటివాడు మీరు నాకు వదిన అంటూ నమ్మించింది. నా భర్తతో కాకుండా చాలా మంది మగవాళ్లతో ఆమెకు అక్రమ సంబంధం ఉంది. ఇవన్నీ తెలుసుకున్న జానీ మాస్టర్ ఆ అమ్మాయిని దూరం పెట్టాడు. దీంతో కక్ష కట్టి తన భర్త లైంగిక దాడి చేశాడంటూ అక్రమ కేసు పెట్టింది’’ అని ఫిర్యాదులో సుమలత పేర్కొంది.‘‘పేరున్న డబ్బున్న మగవారిని టార్గెట్ చేసి ఆమె వేధింపులకు గురిచేస్తుంది. ఆమె తల్లి కూడా ఇబ్బందులకు గురి చేసింది. ఆమె పెట్టిన అక్రమ కేసు ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు, నా పిల్లలకు ఏం జరిగినా తల్లి కూతుళ్లదే బాధ్యత. నాకు నా పిల్లలకు న్యాయం చేయాలని కమిటీని కోరుకుంటున్నాను’’ అని సుమలత తెలిపింది.ఇదీ చదవండి: పెళ్లి చేసుకోమని ఆమె నన్ను వేధించేది: జానీ మాస్టర్ -
పెళ్లి చేసుకోమని ఆమె నన్ను వేధించేది: జానీ మాస్టర్
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను విచారించేందుకు రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. మూడు రోజులుగా ఆయన్ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ నెల 28 వరకు నార్సింగి పోలీసులు ఆయన్ను ప్రశ్నించనున్నారు. అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొని జానీ మాస్టర్ చిక్కుల్లో పడ్డారు. బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ కాపీని జానీ మాస్టర్ ముందు ఉంచి నార్సింగి పోలీసులు విచారించారు. అయితే, బాధితురాలే తనను గతంలో వేధించిందని తాజాగా జరిగిన పోలీసుల విచారణలో జానీ మాస్టర్ పేర్కొన్నట్లు సమాచారం.పోలీసుల విచారణలో నేడు (సెప్టెంబర్ 27) పాల్గొన్న జానీ మాస్టర్ కాస్త అనారోగ్యంగా ఉన్నారు. దీంతో ఆయనకు వైద్య పరీక్షలు జరిపించారు. పోలీసుల విచారణలో భాగంగా బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్తో జానీ మాస్టర్ ఏకీభవించలేదని తెలుస్తోంది. తనపై ఆమె చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని జానీ మాస్టర్ తెలిపాడు. ఒక టీవీ కార్యక్రమంలో ప్రసారం అవుతున్న ఢీ షో ద్వారా తనకు తానే పరిచయం చేసుకుందని జానీ పేర్కొన్నాడు. అయితే, తను మైనర్‌గా ఉన్న సమయంలో లైంగిక దాడి చేశాననేది అబద్ధమని చెప్పాడు. తన టాలెంట్‌ను గుర్తించి మాత్రమే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా అవకాశం ఇచ్చానన్నాడు. పెళ్లి చేసుకోవాలని బాధితురాలే తనను మానసికంగా హింసించేదని జానీ మాస్టర్ తెలిపాడు. ఈ క్రమంలో ఎన్నోసార్లు బాధితురాలు తనను బెదిరించినట్లు తెలిపాడు. దీంతో ఈ సమస్యను డైరెక్టర్ సుకుమార్ దృష్టికి తీసుకెళ్లాగా.. బాధితురాలితో మాట్లాడారు. అయినా కూడా ఆమెలో మార్పు రాలేదని అన్నాడు. తనపై కుట్ర జరిగిందని, తన వెనుక ఎవరో ఉండి ఇదంతా చేస్తున్నారని ఆయన అన్నాడు. తన ఎదుగుదలను ఓర్వలేకనే ఈ కేసులో ఇరికించారని జానీ మాస్టర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పటికే మూడు రోజుల పాటు జానీమాస్టర్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. రేపటితో (సెప్టెంబర్ 28) జానీ మాస్టర్ కస్టడీ విచారణ ముగియనుంది. రేపు ఉదయం జానీ మాస్టర్‌ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. -
మరికాసేపట్లో నార్సింగి పోలీస్ కస్టడిలో జానీ మాస్టర్
-
జానీ మాస్టర్ కి.. 4 రోజుల పోలీస్ కస్టడీ
-
జానీ మాస్టర్ కి 4 రోజుల పోలీస్ కస్టడీ
-
పోలీస్ కస్టడీకి జానీ
హైదరాబాద్, సాక్షి: లైంగిక ఆరోపణల కేసులో అరెస్టైన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ చుట్టూ ఉచ్చు మరింతగా బిగుస్తోంది. బుధవారం జానీ కస్టడీకి రంగారెడ్డి కోర్టు పోలీసులకు అనుమతించింది. దీంతో చర్లపల్లి జైల్లో ఉన్న జానీని.. నేటి నుంచి నాలుగు రోజులపాటు కస్టడీకి తీసుకుని పోలీసులు ప్రశ్నించనున్నారు. లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో జానీని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జానీ తన నేరాన్ని అంగీకరించారు. అయితే కస్టడీలో జానీ అఘాయిత్యాలు మరిన్ని వెలుగు చూసే అవకాశం లేకపోలేదు. అంతకు ముందు.. పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగుచూశాయి. ‘‘2019లో జానీతో బాధితురాలికి పరిచయం ఏర్పడింది. దురుద్దేశంతోనే ఆమెను అసిస్టెంట్‌గా చేర్చుకున్నాడు. 2020లో ముంబయిలోని హోటల్లో ఆమెపై లైంగిక దాడి చేశాడు. అప్పుడు బాధితురాలి వయసు 16ఏళ్లు. నాలుగేళ్లలో బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. విషయం బయటకు చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడు. తన పలుకుబడిని ఉపయోగించి బాధితురాలికి సినిమా అవకాశాలు రాకుండా అడ్డుకున్నారు. జానీ మాస్టర్ భార్య కూడా బాధితురాలిని బెదిరించారు’’ అని రిమాండ్ రిపోర్ట్‌లో ఉంది. యువతి ఫిర్యాదు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన జానీని.. నాలుగు రోజుల తర్వాత గోవాలోని ఓ హోటల్లో తెలంగాణ ఓఎస్టీ అదుపులోకి తీసుకుంది. గోవా కోర్టు అనుమతితో హైదరాబాద్‌కు తరలించింది. ఆపై ఉప్పరపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
అందులో వాస్తవం లేదు: నిర్మాత రవిశంకర్
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ను లైంగికంగా వేధించాడనే ఆరోపణలపై కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై తాజాగా ‘పుష్ప’ సినిమా నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ స్పందించారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ‘మత్తు వదలరా 2’ సినిమా సక్సెస్ మీట్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘జానీమాస్టర్ వ్యవహారంలో హీరో అల్లు అర్జున్ , డైరెక్టర్ సుకుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. దానిపై మీ స్పందన ఏంటి?’ అనే ప్రశ్నకు రవిశంకర్ బదులిస్తూ... ‘‘ప్రస్తుతం నడుస్తున్న వివాదం పూర్తీగా వాళ్ల (జానీ మాస్టర్, బాధితురాలు) వ్యక్తిగతం. ‘పుష్ప 2: ది రూల్’ సినిమాకి గణేశ్ ఆచార్య మెయిన్ కొరియోగ్రాఫర్. విజయ్ పోలకి, ఆ అమ్మాయి (బాధితురాలు) అడిషనల్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ‘పుష్ప 2: ది రూల్’ప్రారంభం నుంచే ఆ అమ్మాయిని తీసుకున్నాం. సినిమాలోని అన్ని పాటలకు ఆమె పని చేస్తారు. ఐదారు నెలల క్రితం మేము రిలీజ్ చేసిన ఓ లిరికల్ వీడియోలోనూ ఆమె పేరు ఉంటుంది. ప్రస్తుతం రెండు పాటలు బ్యాలñ న్స్ ఉన్నాయి. అక్టోబర్ 15 తర్వాత ఆ పాటల చిత్రీకరణకు సన్నాహాలు చేశాం. ఈ సినిమాలోని ఓ ప్రత్యేక పాటని జానీ మాస్టర్‌తో చేయించాలనుకున్నాం. ఇంతలోగా ఈ గొడవ తెరపైకి వచ్చింది.ఎవరైనా డ్యాన్స్ మాస్టర్స్, డ్యాన్సర్ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవెనింగ్ చెబితే స్పందించడం తప్ప హీరోకు (అల్లు అర్జున్) ఏమీ తెలియదు. ఈ విషయంపై బాధ్యత కలిగిన ప్రధాన మీడియా వార్తలు రాయడం లేదు. కానీ, కొత్తగా వచ్చిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సెన్సేషన్ కావడం కోసం ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు. జానీ మాస్టర్ని ఆపి ఆ అమ్మాయిని ప్రమోట్ చేయాలనే వ్యక్తిత్వం బన్నీగారిది కాదు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇదంతా కొందరి అలజడి మాత్రమే. వారిద్దరి మధ్య గొడవలు ఉన్నా అది వారి వ్యక్తిగతం.. దాని గురించి మనం మాట్లాడటానికి కూడా ఏం లేదు’’ అన్నారు. -
జానీ మాస్టర్‌ను కస్టడీకి కోరిన పోలీసులు
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతన్ని చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే, తాజాగా నార్సింగ్ పోలీసులు రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసిన సమయంలోనే నార్సింగ్ పోలీసులు విచారించారు. రిమాండ్ రిపోర్ట్‌లో పలు విషయాలను పొందుపరిచారు. విచారణలో భాగంగా జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారని తెలుస్తోంది. మరిన్నీ విషయాలు తెలుసుకునేందుకు ఆయన్ను మరోసారి విచారించాలని నార్సింగ్ పోలీసులు భావించారు. ఈమేరకు వారం రోజుల పాటు తమ కస్టడీలో జానీ మాస్టర్‌ను ఉంచాలని రంగారెడ్డి కోర్టులో తాజాగా పిటీషన్ దాఖలు చేశారు. ప్రస్తుతానికి కోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు అయితే రాలేదు. -
జానీ మాస్టర్ వివాదంలో అల్లు అర్జున్.. క్లారిటీ ఇచ్చిన ప్రముఖ నిర్మాత
కొరియెగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఆయన అసిస్టెంట్ లైంగిక వేధింపుల కేసు పెట్టిన విషయం తెలిసిందే. కోర్ట్ రిమాండ్ విధించడంతో జానీని చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే, ఈ విషయంపై తాజాగా 'పుష్ప' నిర్మాతల్లో ఒకరైన మైత్రి మూవీస్ రవిశంకర్ రియాక్ట్ అయ్యారు. జానీమాస్టర్ వ్యవహారంలో అల్లు అర్జున్, సుకుమార్ పేర్లు వినిపిస్తున్నాయని మీడియా వారు ఆయన్ను ప్రశ్నించడంతో క్లారిటీ ఇచ్చారు.జానీ మాస్టర్ వివాదంలో అల్లు అర్జున్, సుకుమార్ ఉన్నారనే వార్తలను నిర్మాత రవిశంకర్ ఖండించారు. 'జానీ మాస్టర్, ఆ యువతి (బాధితురాలు) గొడవలతో అల్లు అర్జున్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఈ వివాదం పూర్తిగా జానీ మాస్టర్, ఆమెకు సంబంధించినది మాత్రమే. పుష్ప 2 సినిమా ప్రారంభం నుంచి అన్ని పాటలకు అడిషనల్ కొరియోగ్రఫర్‌గా ఆమె పనిచేశారు. ఇంకా రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. అక్టోబర్ 15 తర్వాత ఆ పాటల చిత్రీకరణకు ప్లాన్ చేస్తున్నాం. ఆరు నెలల క్రితం మేము విడుదల చేసిన లిరికల్ సాంగ్‌లో కూడా ఆమె పేరు ఉటుంది. అయితే, జానీ మాస్టర్‌తో రెండురోజుల్లో ఒక స్పెషల్ సాంగ్ చేద్దామనుకునేలోపే ఈ గొడవ తెరపైకి వచ్చింది. షూటింగ్ సెట్లో అంతర్గతంగా జరిగే విషయాలు అల్లు అర్జున్‌కు తెలీదు. ఎవరైనా విషెస్ చెబితే స్పందించడం తప్ప హీరోకు ఏమీ తెలియదు. సినిమా ఇండస్ట్రీలో ఎంతో విలువలతో కలిగిన వ్యక్తిగా బన్నీకి గుర్తింపు ఉంది. బన్నీ గురించి ప్రధాన మీడియా ఇలాంటి వార్తలు రాయడం లేదు. కానీ, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వారు తమ ఉనికి కోసం అల్లు అర్జున్‌పై ఇష్టం వచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ' అని తెలిపారు. -
జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు
-
జానీ భార్య అయేషా అరెస్ట్‌కు రంగం సిద్ధం?
సాక్షి, హైదరాబాద్: లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ బాషాకు కోర్టు 14రోజులు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో జానీ బాషాను చంచల్గూడా జైలుకు తరలించారు పోలీసులు. ఇక, జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. కేసులో జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.జానీ బాషా లైంగిక వేధింపులకు పాల్పడిన విషయంలో తన నేరాన్ని ఒప్పుకున్నట్టు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. అలాగే, దురుద్దేశంతోనే ఆమెను తన అసిస్టెంట్‌గా చేర్చుకున్నాడు. 2019 నుంచే జానీతో బాధితురాలికి పరిచయం ఉన్నట్లు రిపోర్ట్‌లో తెలిపారు. 2020లో ముంబైలోని ఒక హోటల్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. లైంగిక దాడి జరిగిన సమయానికి ఆమె వయసు 16 ఏళ్లు మాత్రమే. వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి సుమారు నాలుగేళ్లు దాటుతుంది.షూటింగ్ సమయంలో కూడా వ్యాన్లోనే ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశాడు. అందుకు ఆమె నిరాకరిస్తే జుట్టు పట్టుకుని బాధితురాలి తలను అద్దానికేసి కొట్టాడు. మత మార్పిడి సైతం చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి చేశాడు. ఈ విషయాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని బెదిరింపులకు దిగాడు. తనకున్న పలుకుబడి ఉపయోగించి ఆ యువతికి అవకాశాలు కూడా రాకుండా చేశాడు. జానీ మాస్టర్ భార్య కూడా ఆ యువతిని బెదిరించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలంటూ..మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ బాధితురాలిని బలవంతం పెట్టాడు. ఒక రోజు జానీ మాస్టర్ బాధితురాలికి ఫోన్ చేసి షూటింగ్‌కు రావాలని సూచించాడు. దీంతో తన తల్లి ఇంట్లో లేదని, ఆరోగ్యం బాలేక ఇంట్లో ఉన్నానని తెలిపింది. దీన్ని ఆసరా చేసుకున్న నిందితుడు బాధితురాలి ఇంటికి వెళ్లి బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జానీ తన భార్య సుమలత అలియాస్ ఆయేషాతో కలిసి బాధితురాలికి ఇంటికి వెళ్లి ఆమెను భయభ్రాంతులకు గురి చేశాడు. చిత్ర పరిశ్రమలో జానీకి ఉన్న పరిచయాల కారణంగా బాధితురాలికి ఎక్కడా పని దొరకుండా ఇబ్బందులకు గురి చేశాడు.ఈ క్రమంలో బాధితురాలు ఇంట్లో లేని సమయం చూసి ఓ రోజు ఆమె ఇంటికి వెళ్లి బాధితురాలితో ఉన్న శారీరక సంబంధం గురించి ఆమె తల్లికి వెల్లడించాడు. ఇక, చిట్టచివరికి బాధితురాలు జానీ అసిస్టెంట్ మోయిన్‌కు ఈ విషయాలు తెలిపింది. అతని సూచన మేరకు బాధితురాలు తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ (టీఎఫ్‌టీడీడీఏ) సంఘం అధ్యక్షుడికి ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న జానీ వెంటనే సంఘం డ్రైవర్ రాజేశ్వర్ రెడ్డిని తీసుకొని గోవాకు పరారయ్యాడు. కాగా, కోర్టు వద్ద జానీ మాస్టర్ భార్యను ఈ విషయమై ప్రశ్నించగా అంతా కోర్టులో తేలుతుందని సమాధానం ఇచ్చారు.ఇదిలా ఉండగా.. జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. జానీ మాస్టర్ భార్య సుమలత(అలియాస్ ఆయేషా)పై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్టు సమాచారం. బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించారన్న కారణంగా సుమలతపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: అభయ్ నోటిదురుసు వల్ల అందరికీ నష్టం.. అర్ధరాత్రి బిగ్‌బాస్ వార్నింగ్ -
జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టు
-
Jani Master: పక్కా స్కెచ్‌తో.. డోర్ వెనకాల దాక్కొని..!
సాక్షి, హైదరాబాద్/రాజేంద్రనగర్: తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్‌కు న్యాయస్థానం 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. జానీ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న బాధితురాలు (21) తనపై జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఈనెల 15న పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటినుంచి పరారీలో ఉన్న జానీని గురువారం గోవాలోని గ్రాండ్ లియోనీ రిసార్ట్‌లో సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అతడిని ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించారు.ఆస్పత్రిలో వైద్య పరీక్షల తర్వాత నార్సింగి పోలీసులు అతడిని శుక్రవారం మధ్యాహ్నం రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లిలోని కోర్టులో హాజరు పరిచారు. దీంతో జానీ మాస్టర్‌కు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య జానీ మాస్టర్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. నార్సింగి పోలీసులు న్యాయస్థానానికి సమరి్పంచిన రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన అంశాలను పొందుపరిచారు. చిన్నతనం నుంచే డ్యాన్స్‌పై మక్కువ.. బాధితురాలికి చిన్నతనం నుంచే డ్యాన్స్ అంటే మక్కువ ఉండటంతో ఆమె తల్లిదండ్రులు నృత్య శిక్షణ ఇప్పించారు. తర్వాత వివిధ ప్రాంతాలలో స్టేజ్ షోలు ఇస్తుండేది. ఈ క్ర మంలో 2017లో పదో తరగతి చదువుతున్న క్రమంలో బాధితురాలికి ఢీ–11 డ్యాన్స్ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. దీంతో తల్లితో సహా కలసి తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చింది. ఈ షోకు న్యాయనిర్ణేతగా నిందితుడు జానీ మాస్టరే వ్యవహరించా డు. అనంతరం బాధితు రాలు ఢీ–12లోనూ పా ల్గొంది కానీ మధ్యలోనే ఆమెను తొలగించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు జానీ మాస్టర్ బృందంలోని సభ్యురాలు దర్శిని బాధితురాలికి ఫో న్ చేసి మాస్టర్‌కు అసిస్టెంట్‌గా పనిచేస్తావా? అని అడిగింది. దీంతో ఒప్పుకున్న బాధితురాలు 2019 డిసెంబర్ 15న హైదరాబాద్‌కు వచ్చింది. అల వైకుంఠపురంతో కలిసి.. ‘అల వైకుంఠపురం’సినిమాలోని ఓ పాట చిత్రీకరణ సమయంలో తొలిసారిగా జానీ మాస్టర్‌తో బాధితురాలికి పరిచయం ఏర్పడింది. అదే రోజు మాస్టర్ మేనేజర్ ఒకరు బాధితురాలికి ఫోన్ చేసి జానీ మాస్టర్, మరో ఇద్దరు అసిస్టెంట్లు రాహుల్, మోయిన్లతో కలిసి 2020 జనవరి 10న ముంబై వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించాడు. ముంబైలోని ఓ హోటల్లో చెకిన్ అవుతున్న క్రమంలో జానీ తన ఆధార్ కార్డు, ఇతరత్రా డాక్యుమెంట్లను బాధితురాలికి ఇచ్చాడు. అదే రోజు రాత్రి 11–12 గంటల సమయంలో జానీ మాస్టర్ బాధితురాలికి ఫోన్ చేసి ఉదయం తాను ఇచ్చిన ఆధార్, డాక్యుమెంట్లను తీసుకొని గదికి రావాలని ఆదేశించాడు. డోర్ వెనకాల దాక్కొని.. అప్పటికే జానీ మాస్టర్ గది తలుపులు తెరిచి, వెనకాల దాక్కొని ఉన్నాడు. బాధితురాలు గది లోపలికి వెళ్లగానే ఒక్కసారిగా తలుపులు మూసేసి, లాక్ వేసేశాడు. దీంతో భయపడిపోయిన బాధితురాలు తనను వదిలేయాలని ప్రాధేయపడుతూ తలుపులు తెరిచేందుకు ప్రయతి్నంచగా.. జానీ మాస్టర్ ఆమెను అడ్డుకొని, లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయట ఎవరికైనా చెబితే అసిస్టెంట్ జాబ్ నుంచి తీసేయడమే కాకుండా చిత్ర పరిశ్రమలో అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడు. బాధితురాలి నిస్సహాయతను ఆసరా చేసుకున్న జానీ మాస్టర్ షూటింగ్‌ల పేరు చెప్పి వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి హోటల్ గదులు, వ్యానిటీ వ్యాన్లలో అత్యాచారానికి పాల్పడ్డాడు. జానీ మాస్టర్ వేధింపులు, ఆగడాలను తట్టుకోలేకపోయిన బాధితురాలు కొన్ని నెలల పాటు ఇంట్లో ఒంటరిగా ఉండిపోయింది. కానీ, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఏమైనా పని ఉంటే అవకాశం ఇప్పించాలని నిందితుడు జానీ మాస్టర్‌ను సంప్రదించింది. తన లైంగిక వాంఛను తీర్చనన్నందుకు షూటింగ్ సమయంలో అందరి ముందు బాధితురాలిని అవమానపరిచేవాడు. మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలంటూ..మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ బాధితురాలిని బలవంతం పెట్టాడు. ఒక రోజు జానీ మాస్టర్ బాధితురాలికి ఫోన్ చేసి షూటింగ్‌కు రావాలని సూచించాడు. దీంతో తన తల్లి ఇంట్లో లేదని, ఆరోగ్యం బాలేక ఇంట్లో ఉన్నానని తెలిపింది. దీన్ని ఆసరా చేసుకున్న నిందితుడు బాధితురాలి ఇంటికి వెళ్లి బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జానీ తన భార్య సుమలత అలియాస్ ఆయేషాతో కలిసి బాధితురాలికి ఇంటికి వెళ్లి ఆమెను భయభ్రాంతులకు గురి చేశాడు. చిత్ర పరిశ్రమలో జానీకి ఉన్న పరిచయాల కారణంగా బాధితురాలికి ఎక్కడా పని దొరకుండా ఇబ్బందులకు గురి చేశాడు.ఈ క్రమంలో బాధితురాలు ఇంట్లో లేని సమయం చూసి ఓ రోజు ఆమె ఇంటికి వెళ్లి బాధితురాలితో ఉన్న శారీరక సంబంధం గురించి ఆమె తల్లికి వెల్లడించాడు. ఇక, చిట్టచివరికి బాధితురాలు జానీ అసిస్టెంట్ మోయిన్‌కు ఈ విషయాలు తెలిపింది. అతని సూచన మేరకు బాధితురాలు తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ (టీఎఫ్‌టీడీడీఏ) సంఘం అధ్యక్షుడికి ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న జానీ వెంటనే సంఘం డ్రైవర్ రాజేశ్వర్ రెడ్డిని తీసుకొని గోవాకు పరారయ్యాడు. కాగా, కోర్టు వద్ద జానీ మాస్టర్ భార్యను ఈ విషయమై ప్రశ్నించగా అంతా కోర్టులో తేలుతుందని సమాధానం ఇచ్చారు. -
నేరం అంగీకరించిన జానీ మాస్టర్
-
జానీ మాస్టర్‌కు రిమాండ్ విధించిన కోర్టు
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు 14 రోజుల రిమాండ్‌ను ఉప్పరపల్లి కోర్టు విధించింది. అక్టోబర్ 3 వరకు ఆయన చంచల్‌గూడ జైలులో ఉండనున్నారు. గత నాలుగైదు రోజులుగా పరారీలో ఉన్న జానీ మాస్టర్‌ను గోవాలోని ఓ లాడ్జిలో నార్సింగి స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన్ను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది.కోర్టు ఆవరణలో జానీ మాస్టర్ మాట్లాడుతూ.. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నాడు. తనను కావాలని ఇరికించిన వారిని మాత్రం ఎట్టిపరిస్థితిల్లో వదిలిపెట్టనంటూ వార్నింగ్ ఇచ్చాడు. అతని దగ్గర సహాయక కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన మైనర్ ఈనెల 15న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు జానీ మాస్టర్‌పై ఐపీసీ 376 (2) (ఎ¯Œ), 506, 323 సెక్షన్లతో పాటు పోక్సో కింద కేసు నమోదు చేశారు. -
చంచల్గూడా జైలుకు జానీ మాస్టర్
సాక్షి, హైదరాబాద్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా(జానీ మాస్టర్)కు ఉప్పర్‌పల్లి కోర్టు 14 రోజుల వరకు రిమాండ్ విధించింది. అక్టోబర్ మూడో తేదీ వరకు జానీ మాస్టర్ పోలీసుల రిమాండ్‌లోనే ఉండనున్నారు.కాగా, స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) పోలీసులు జానీ మాస్టర్‌ను గోవాలో అదుపులోకి తీసుకుని గురువారం హైదరాబాద్‌కు తరలించారు. శుక్రవారం ఉదయం జామీ మాస్టర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో జానీ బాషాకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో, జానీ మాస్టర్‌ను చంచల్గూడా జైలుకు తరలిస్తున్నారు పోలీసులు.తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అతని దగ్గర సహాయక కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన మైనర్ ఈనెల 15న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు జానీ బాషాపై ఐపీసీ 376(2), 506, 323 సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇది కూడా చదవండి: వర్క్ ప్లేస్‌లో మహిళలకు భద్రత కల్పించాలి: మంత్రి సీతక్క -
జానీ మాస్టర్ పై పోక్సో..
-
నిజం ఎప్పటికైనా బయటపడుతుంది..!
-
నేడు ఉప్పర్ పల్లి కోర్టుకు జానీ
-
ఉప్పర్‌పల్లి కోర్టులో జానీ మాస్టర్
Jani Master Case Live Updates..👉 ఉప్పర్‌పల్లి కోర్టులో జానీ మాస్టర్‌ను పోలీసులు హాజరుపరిచారు. 👉 రాజేంద్రనగర్ సీసీఎస్ నుంచి జానీ మాస్టర్‌ను ఉప్పర్‌పల్లి కోర్టుకు తరలించారు పోలీసులు. 👉 కాసేపట్లో కోర్టుకు జానీ మాస్టర్.. రాజేంద్రనగర్ సీసీఎస్ కార్యాలయంలో జానీ మాస్టర్సీసీఎస్ కార్యాలయానికి చేరుకున్న నార్సింగి ఏసీపీ 👉జానీ మాస్టర్‌కు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. పోలీసులు కాసేపట్లో జానీ మాస్టర్‌ను కోర్టులో హాజరుపరుచనున్నారు. 👉లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా(జానీ మాస్టర్) నార్సింగి పోలీసుల అదుపులో ఉన్నాడు. స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) పోలీసులు జానీ మాస్టర్‌ను గోవా నుంచి హైదరాబాద్‌కు తరలించారు. అనంతరం, రహస్య ప్రదేశంలో జానీని విచారిస్తున్నారు.👉గత నాలుగైదు రోజులుగా పరారీలో ఉన్న జానీ మాస్టర్‌ను గోవాలోని ఓ లాడ్జిలో ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచి అనంతరం ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం జానీ మాస్టర్ నగర శివారులోని ఓ ఫాంహౌజ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. రహస్య ప్రదేశంలో ఉంచి అతడిని పోలీసులు విచారిస్తున్నారు. గోవా కోర్టు ఆదేశాల మేరకు.. ఇవాళే జానీ మాస్టర్‌ను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరుచనున్నారు. 👉తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అతని దగ్గర సహాయక కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన మైనర్ ఈనెల 15న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు జానీ బాషాపై ఐపీసీ 376(2), 506, 323 సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇది కూడా చదవండి: నాకే కెమెరా పెడతారా?.. మీడియాపై జానీ భార్య చిందులు -
జానీ మాస్టర్ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసులకు చిక్కాడు. గత నాలుగైదు రోజులుగా పరారీలో ఉన్న జానీ మాస్టర్‌ను గోవాలోని ఓ లాడ్జిలో నార్సింగి స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచి అనంతరం ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించారు. ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచిన అనంతరం న్యాయస్థానం ఆదేశాల మేర కు జ్యుడీíÙయల్ రిమాండ్‌కు తరలిస్తామని రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అతని దగ్గర సహాయక కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన మైనర్ ఈనెల 15న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు జానీ మాస్టర్‌పై ఐపీసీ 376 (2) (ఎ¯Œ), 506, 323 సెక్షన్లతో పాటు పోక్సో కింద కేసు నమోదు చేశారు. భార్య ఇచి్చన సమాచారంతోనే.. జానీ మాస్టర్‌తో పాటు ఆయన భార్య కూడా పలుమార్లు తనపై శారీరకంగా దాడికి పాల్పడిందంటూ మైనర్ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జానీ మాస్టర్ భార్యను నార్సింగి పోలీసులు స్టేషన్ లో విచారించారు. ఈనెల 15 నుంచే పరారీ లో ఉన్న జానీ మాస్టర్ తన ఫోన్‌ను స్విఛాఫ్ చేసుకున్నా డు. పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. జానీ భార్యను విచారిస్తున్న క్రమంలో ఆయన ఎక్కడున్నాడనే సమాచారాన్ని పోలీసులు రాబట్టారు.ఆ సమాచారం ఆధారంగా గోవాకు వెళ్లిన ప్రత్యేక బృందం జానీని అరెస్టు చేసింది. అతని వద్ద నుంచి పాస్ పోర్ట్, సెల్ఫోన్లను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. బాధితురాలితో జానీ మాస్టర్ జరిపిన కాల్స్, వాట్సాప్ చాటింగ్, ఇతరత్రా ఆధారాలను సేకరించేందుకు సెల్ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. తదుపరి విచారణ నిమిత్తం జానీ మాస్టర్‌ను కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించిన పోలీసులు.. ఈమేరకు సోమవారం కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మైనర్‌పై లైంగిక వేధింపులు! ఓ డ్యాన్స్ షోలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచి్చన బాధితురాలికి జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో జానీ 2019లో తన నృత్య బృందంలో సహాయ కొరియోగ్రాఫర్‌గా ఆమెను నియమించుకున్నాడు. ఓ డ్యాన్స్ ప్రాజెక్టు నిమిత్తం జానీ మాస్టర్‌తో పాటు ముంబై వెళ్లిన బాధితురాలిపై అక్కడి ఓ హోటల్లో జానీ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అప్పటికి బాధితురాలు వయసు 17 ఏళ్లే కావడం గమనార్హం. కాగా జానీ ఆ తర్వాత కూడా తనపై పలుమార్లు వేధింపులకు పాల్పడినట్లు పోలీసులకు చేసిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. -
విన్న ప్రతిదాన్నీ నమ్మొద్దు
సాక్షి, హైదరాబాద్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు తర్వాత నటుడు, జనసేన పార్టీ నేత నాగబాబు ‘ఎక్స్’లో చేసిన రెండు పోస్టులు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ‘న్యాయస్థానంలో నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తినీ నేరానికి పాల్పడినట్లుగా పరిగణించలేరు’అన్న బ్రిటిష్ లాయర్ సర్ విలియం గారో కొటేషన్‌ను ఆయన రాసుకొచ్చారు. అలాగే ‘మీరు విన్న ప్రతిదాన్నీ నమ్మొద్దు.ప్రతి కథకు మూడు పార్శా్వలు ఉంటాయి. మీ వైపు, నా వైపు మరియు నిజం’అని అమెరికా జర్నలిస్ట్ రాబర్ట్ ఎవాన్స్ రాసిన కొటేషన్‌ను కూడా పోస్టు చేశారు. జానీ మాస్టర్ గురించి ప్రత్యక్షంగా ఆయన ఎక్కడా ప్రస్తావించకపోయినా పరోక్షంగా మద్దతు పలికారనే అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. జనసేన పారీ్టలో జానీ మాస్టర్ కీలకంగా వ్యవహరించడం వల్లే నాగబాబు ఇలా స్పందించారని అంటున్నారు. జానీ మాస్టర్.. తప్పు చేస్తే అంగీకరించండి: మంచు మనోజ్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు, అరెస్టు నేపథ్యంలో నటుడు మంచు మనోజ్ స్పందించారు. ‘ఎక్స్’లో ఓ పోస్టు పెట్టారు. ‘జానీ మాస్టర్.. కెరీర్ పరంగా ఈ స్థాయికి వచ్చేందుకు మీరు ఎంతగా కష్టపడ్డారో అందరికీ తెలుసు. అలాంటిది ఈరోజు మీపై ఇలాంటి తీవ్ర ఆరోపణలు రావడం చూస్తుంటే నా హృదయం ముక్కలవుతోంది. ఇప్పుడు కాకపోయినా నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. ఎవరిది తప్పు, ఎవరిది కరెక్ట్ అన్నది చట్టం నిర్ణయిస్తుంది. ఒక మహిళ తన స్వరాన్ని వినిపించినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి, రానున్న తరాలకు ఒక ప్రమాదకరమైన సందేశాన్ని ఇస్తుంది. ఈ కేసు విషయంలో త్వరితగతిన స్పందించి చర్యలు తీసుకున్న హైదరాబాద్ సిటీ పోలీసులకు నా అభినందనలు.ఈ సమాజంలో చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఇది తెలియజేస్తుంది. జానీ మాస్టర్.. మీరు ఏ తప్పూ చేయకపోతే పోరాటం చేయండి. తప్పు చేసి ఉంటే దానిని అంగీకరించండి..’అని మనోజ్ పేర్కొన్నారు. ‘ఇచి్చన మాట ప్రకారం ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌ని వెంటనే ఏర్పాటు చేయాలని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)ను కోరుతున్నా. దానికంటూ ప్రత్యేకంగా సోషల్ మీడియా ఖాతాలు ఏర్పాటు చేయండి. పరిశ్రమలోని మహిళలకు గొంతుగా నిలపండి. మీరు ఒంటరిగా లేరని, మీ ఆవేదన, బాధలను వింటామనే విషయాన్ని ప్రతి మహిళకు తెలియజేయండి. కుమార్తె, సోదరి, తల్లి.. ఇలా ప్రతి మహిళ కోసం ఈ పోరాటం. వారికి అన్యాయం జరగకుండా చూద్దాం..’అంటూ మనోజ్ పోస్టు చేశారు. -
బాధితురాలిపై జానీ మాస్టర్ భార్య చౌకబారు వ్యాఖ్యలు
లైంగిక వేధింపుల వ్యవహారం, పోక్సో కేసులో జానీ మాస్టర్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ క్రమంలో అతడి భార్య ఆయేషా అలియాస్ సుమలత తొలిసారి ఈ వ్యవహారంపై స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. జానీ మాస్టర్ ఎదగకూడదనే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కొరియోగ్రాఫర్స్‌తో ఎఫైర్స్అయితే హీరోయిన్ అవ్వాలి, లేదంటే టాప్ కొరియోగ్రాఫర్ అవ్వాలన్న లక్ష్యంతోనే ఆమె ఇలాంటి పనులు చేస్తోంది. 16 ఏళ్లకే అత్యాచారం జరిగిందంటున్నారు.. అందుకు సాక్ష్యం ఉందా? దానికంటే ముందు ఎవడి దగ్గరకు వెళ్లలేదని గ్యారెంటీ ఏంటి? తనకు చాలామంది కొరియోగ్రాఫర్స్‌తో ఎఫైర్స్ ఉన్నాయి. మహిళ అనే పదానికే ఆమె కళంకం అని బాధితురాలి గురించి నీచమైన వ్యాఖ్యలు చేసింది.జానీపై కేసుఅవకాశాల కోసం ఇండస్ట్రీకి వస్తే, సాయం చేస్తాడనుకున్న జానీ మాస్టర్ తనను లైంగికంగా, మానసికంగా హింసించాడని ఓ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తను మైనర్‌గా ఉన్నప్పుడే అత్యాచారం జరిగిందని చెప్పడంతో పోక్సో కేసు నమోదు చేశారు. అప్పటినుంచి జానీ మాస్టర్ కనిపించకుండా పోయాడు. పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరిగాడు. నిప్పు లేనిదే పొగ రాదునిజంగానే అతడు ఏ తప్పూ చేయకపోతే అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఇన్నిరోజులు పోలీసులకు చిక్కకుండా దాక్కోవాల్సిన గత్యంతరం ఏంటి? ఈ ప్రశ్నలకు సుమలత సమాధానాలు చెప్పలేకపోయింది కానీ తానే ఒప్పని చూపించుకోవడం కోసం బాధితురాలిపై నానా నిందలు వేసింది. తనకు చాలా ఎఫైర్స్ ఉన్నాయని, ఎంతోమందితో తిరిగిందన్నట్లుగా చౌకబారు వ్యాఖ్యలు చేసింది. ఆమె ఎన్ని చెప్పినా సరే నిప్పు లేనిదే పొగ రాదు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.చదవండి: సోనియా దిగజారుడు ప్రవర్తన.. ఛీ కొడుతున్న జనం -
జానీ మాస్టర్ ను కఠినంగా శిక్షించాలి
-
జానీ మాస్టర్ భార్య ఓవరాక్షన్ మీడియా ప్రతినిధులపై చిందులు
-
నాకే కెమెరా పెడతారా?.. జానీ భార్య చిందులు
హైదరాబాద్, సాక్షి: కొరియోగ్రాఫర్ జానీ పోలీసులకు పట్టుబడ్డానన్న వార్తల తర్వాత ఆయన భార్య అయేషా అలియాస్ సుమలత బయటకు వచ్చారు. గురువారం మధ్యాహ్నాం నార్సింగి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆమె మీడియాపై చిందులు తొక్కారు.ఓ ఫేక్ కాల్ రావడంతో తాను పీఎస్‌కు రావాల్సి వచ్చిందని ఆమె మీడియాకు తెలిపారు. అయితే.. భర్త లైంగిక వేధింపుల వ్యవహారంపై స్పందించాలని అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు ఆమెను కోరారు. ఏం సమాధానం ఇవ్వాలో అర్థంకాని అయేషా.. ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. నాకే కెమెరా పెడతారా? అంటూ వాళ్ల మీద ఫైర్ అయ్యారు.మరోవైపు మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడిన కేసులో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన జానీ అలియాస్ షేక్ జానీ బాషాను పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు. గోవా కోర్టు పీటీ వారెంట్‌కు అనుమతి ఇస్తూ.. 24 గం.లో ఉప్పరపల్లి కోర్టులో హాజరుర్చాలని తెలంగాణ ఎస్‌వోటీని ఆదేశించింది. ఇక ఈ కేసులో.. తనపై అయేషా సైతం దాడికి పాల్పడిందని బాధితురాలు ఆరోపించడం గమనార్హం. ఇదీ చదవండి: ఆపరేషన్ జానీ.. సాగిందిలా! -
జానీ కేసుపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: లవ్ జిహాదీకి పాల్పడిన కొరియోగ్రాఫర్ జానీ బాషాను కఠినంగా శిక్షించాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. అలాగే, జానీ బాషా ఇప్పటి వరకు ఎంత మంది అమ్మాయిలను మత మార్పిడి కోసం ఒత్తిడి తెచ్చాడో బయటపెట్టించాలని పోలీసులకు సూచించారు.లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తాజాగా రాజాసింగ్ మాట్లాడుతూ.. జానీ బాషా అరెస్ట్ ఎందుకు ఆలస్యమవుతోంది?. జానీని త్వరగా అరెస్ట్ చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. అతడు ఎంత మంది అమ్మాయిలను మత మార్పిడి కోసం ఒత్తిడి చేశాడో బయటపెట్టించాలి. ఒక దొంగకి, ఒక రౌడీకి, ఒక హంతకుడికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో అదే విధంగా అతడికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలని నేను పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. లవ్ జిహాదీకి పాల్పడిన జానీ బాషాను కఠినంగా శిక్షించాలి. బాలీవుడ్చిత్ర పరిశ్రమకు జానీ బాషా మచ్చ తెచ్చాడు. ఇలాంటి వారి పట్ల చిత్ర పరిశ్రమకు చెందిన ప్యానల్ సీరియస్‌గా వ్యవహరించాలి. ఇండస్ట్రీలో ఇలాంటి వారు మళ్లీ అడుగుపెట్టకుండా ప్యానల్ కఠిన చర్యలు తీసుకోవాలి’ అంటూ వ్యాఖ్యలు చేశారు.జనసేన నేత, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తాట తీయండి - బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్#Janasena #JaniMaster x #RajaSingh #UANow #STopRape pic.twitter.com/dVpZHyaKzN— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) September 19, 2024Video Credit: ఉత్తరాంధ్ర నౌ!ఇదిలా ఉండగా.. కొరియోగ్రాఫర్ జానీ బాషాను హైదరాబాద్ ఎస్వోటీ పోలీసులు కాసేపటి క్రితమే గోవాలో అరెస్ట్ చేశారు. అనంతరం, అతడిని గోవా కోర్టులో హాజరుపరిచారు. పీటీ వారెంట్ కింద.. పోలీసులు జానీని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. రేపు ఉప్పరపల్లి కోర్టులో జానీ బాషాను హాజరుపరుచనున్నారు. ఇక, అంతకుముందు బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీ బాషాపై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: లైంగిక వేధింపుల కేసు.. జానీ మాస్టర్‌కు బిగుస్తున్న ఉచ్చు! -
జూనీ మాస్టర్ వివాదం.. బాధితురాలుకి అండగా ఐకాన్ స్టార్..?
-
జానీ మాస్టర్ గొడవలోకి ఐకాన్ స్టార్..
-
ఎస్ వోటీ పోలీసుల అదుపులో కొరియోగ్రాఫర్ జానీ
-
కొరియోగ్రాఫర్ జానీ అరెస్ట్ కు రంగం సిద్ధం
-
కొరియోగ్రాఫర్ జానీ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్, జనసేన సస్పెండెడ్ నేత జానీ మాస్టర్(షేక్ జానీ బాషా) ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. గోవాలో జానీని ట్రేస్ చేసిన సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు.. అక్కడే అరెస్ట్ చేశారు. సహా కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న జానీపై.. నార్సింగి పీఎస్‌లో సెప్టెంబర్ 15వ తేదీన కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆపై జానీ ఆచూకీ లేకపోవడంతో.. పరారైనట్లు పోలీసులు ప్రకటించారు. చివరకు.. గోవాలో అరెస్ట్ చేసి అక్కడే కోర్టులో హాజరుపరిచ్చారు. గోవా కోర్టు పీటీ వారెంట్‌కు అనుమతిస్తూ.. 24 గంటల్లోగా ఉప్పరపల్లి కోర్టులో జానీ బాషాను హాజరుపరచాలని ఆదేశించింది. దీంతో జానీని పోలీసులు తరలించే ప్రయత్నాల్లో ఉన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆపై ఆమె మైనర్‌గా ఉన్నప్పటి నుంచే వేధించసాగాడని బాధితురాలు చెప్పడంతో జానీపై పోక్సో చట్టం కింద కేసు జత చేశారు. అయితే కేసు తర్వాత జానీ ఆచూకీ తెలియరాలేదు. భార్యతో సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోయి.. తన ఫోన్ స్విచ్ఛాప్ చేసుకున్నాడు. ఇది కూడా చదవండి: లైంగిక వేధింపుల కేసు.. జానీ మాస్టర్‌కు బిగుస్తున్న ఉచ్చు!తొలుత పోలీసులు కొండపూర్లోని నివాసానికి వెళ్లి చూడగా.. తాళం వేసి ఉంది. ఆపై స్వస్థలం నెల్లూరులో ఉండొచ్చని వెళ్లి చూడగా.. అక్కడా లేడు. ఆ తర్వాత లడ్ఢాఖ్‌లో ఉన్నాడన్న సమాచారంతో అక్కడికి వెళ్లి స్థానిక పోలీసులను సంప్రదించారు. మొత్తంగా నాలుగు టీంలతో ఆపరేషన్ జానీ ముమ్మరంగా కొనసాగగా.. చివరకు గోవాలో పట్టుబడ్డాడు. తెలుగుతో పాటు కోలీవుడ్, హిందీలోనూ పలు స్టార్ హీరోలకు జానీ కొరియోగ్రాఫ్ చేశాడు. అంతేకాదు.. పవన్ కల్యాణ్ జనసేనలోనూ మొదటి నుంచి క్రియాశీలకంగా పని చేస్తున్నాడు. అయితే.. లైంగిక వేధింపులు వెలుగులోకి రావడంతో పార్టీ అతన్ని దూరం పెడుతున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది కూడా చదవండి: జానీ మాస్టర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి: బీజేపీ మహిళా మోర్చా -
బయటకొస్తున్న జానీ అరాచకాలు.. భయపడుతున్న కొరియోగ్రాఫర్స్!
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఓ యువతి చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదుతో ఆయన చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఇప్పటికే జానీ మాస్టర్‌పై నార్సింగి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. తాను 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తనపై అత్యాచారం చేశాడంటూ బాధిత యువతి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో అత్యాచారం కేసుతో పాటు పోక్సో కేసు నమోదైంది.తాజాగా కొరియోగ్రాఫర్ జానీకి సంబంధించిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి. జనసేన పార్టీలో కీలక సభ్యుడిగా ఉన్న జానీ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఏపీలో జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో జానీ మరింత రెచ్చిపోయారు. తన తోటి కొరియోగ్రాఫర్లను తీవ్ర వేధింపులకు గురి చేసినట్లు తెలుస్తోంది.(ఇది చదవండి: ముమ్మరంగా ఆపరేషన్ ‘జానీ’)సభ్యత్వం ఇవ్వకుండా వేధింపులు..జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జానీ మాస్టర్ దారుణాలకు అడ్డులేకుండా పోయింది. తెలుగు ఫిల్మ్, టీవీ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తర్వాత తోటి కొరియోగ్రాఫర్స్‌ను వేధింపులకు గురి చేశారు. కార్యవర్గం నిర్ణయాలను సైతం లెక్కచేయకుండా ఏకపక్షంగా వ్యవహారించారు. అసోసియేషన్ ఆడిషన్స్‌లో సెలక్ట్ అయిన వారికి సభ్యత్వం ఇవ్వకుండా వేధించారు. దాదాపు 90 మంది కొరియోగ్రాఫర్స్‌ను సభ్యత్వం ఇవ్వకుండా జానీ మాస్టర్ వేధింపులకు గురిచేశారు. ఇండస్ట్రీలో అతనికి పలుకుబడి ఉండడంతో అరాచకాలపై మాట్లాడేందుకు కొరియోగ్రాఫర్స్ జంకుతున్నారు.గాలిస్తున్న పోలీసులు..యువతి ఫిర్యాదుతో కేసులు నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రస్తుతం అతను జమ్మూకశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పోలీసులు అతని కోసం లడఖ్ బయలుదేరి వెళ్లారు. త్వరలోనే జానీమాస్టర్ అరెస్ట్ అయ్యే అవకాశముంది. -
జానీ మాస్టర్ కోసం గాలింపు ముమ్మరం
-
ముమ్మరంగా ఆపరేషన్ ‘జానీ’
హైదరాబాద్: ప్రముఖ కొరియోగ్రాఫర్, జనసేన సస్పెండెడ్ నేత జానీ మాస్టర్(షేక్ జానీ బాషా) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఒకవైపు పోక్సో యాక్ట్ కేసుతో పాటు ఆయన లైంగిక వేధింపుల వ్యవహారంపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు.. జానీ పరారీలో ఉన్నట్లు ప్రకటించిన పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేశారు.జానీ మాస్టర్ పై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశాం. ప్రస్తుతం పరారీలో లో ఉన్నాడు. అతన్ని పట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నాం.::రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇప్పటికే జానీ మాస్టర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసింది తెలిసిందే. మరోవైపు జానీ బాధితురాలు నిన్న స్టేట్ విమెన్ కమిషన్‌ను ఆశ్రయించింది. మహిళా సంఘాలతో కలిసి మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదను కలిసిన బాధితురాలు.. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని.. మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడని ఫిర్యాదు చేసింది. దీంతో ఫిర్యాదును విచారణ స్వీకరించిన మహిళా కమిషన్.. జానీ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే టైంలో బాధితురాలికి భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది.ఇక.. లైంగిక దాడి కేసు తర్వాత జానీ ఆచూకీ తెలియరాలేదు. రాజకీయ, సినీ ప్రముఖుల అండతో జానీ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ విమర్శలకు తలొగ్గి ఆయన్ని అరెస్ట్ చేస్తారని అంతా భావించారు. అయితే ఇప్పుడు ఆచూకీ లేకుండా పోయాడంటూ ప్రకటనలు ఇస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోందంటున్నారు కొందరు.ఈ అభియోగాల తర్వాత జానీ ఏ మీడియాతో మాట్లాడలేదు. మూడు రోజుల కిందటే అజ్ఞాతంలోకి వెళ్లిపోయి తన ఫోన్ స్విచ్ఛాప్ చేసుకున్నాడు. కొండపూర్లోని నివాసానికి తాళం వేసి ఉంది. తొలుత నెల్లూరులో ఉన్నాడన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన నార్సింగి పోలీసులు.. ఆ తర్వాత లడ్ఢాఖ్‌లో ఉన్నాడన్న సమాచారంతో అక్కడికి వెళ్లి స్థానిక పోలీసులను సంప్రదించారు. ఆయన భార్య ఆచూకీ కూడా తెలియరావడం లేదు. మొత్తంగా నాలుగు టీంలతో ఆపరేషన్ జానీని ముమ్మరం చేశారు. కేసులో రెండ్రోజులకే ట్విస్ట్జానీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన అసిస్టెంట్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘2017లో జానీ మాస్టర్ పరిచయమయ్యాడు. 2019లో అతని బృందంలో సహాయ నృత్య దర్శకురాలిగా చేరాను. ముంబయిలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్‌తో పాటు నేను, మరో ఇద్దరు సహాయకులుగా వెళ్లాం. అక్కడ హోటల్లో నాపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని, సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పని చేయలేవని బెదిరించాడు. .. దీన్ని అవకాశంగా తీసుకుని.. హైదరాబాద్ నుంచి ఇతర నగరాలకు సినిమా చిత్రీకరణకు తీసుకెళ్లిన సందర్భాల్లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. షూటింగ్ సమయంలోనూ వ్యానిటీ వ్యాన్‌లో అసభ్యంగా ప్రవర్తించేవాడు. వేధింపులు భరించలేక జానీ మాస్టర్ బృందం నుంచి బయటకొచ్చేశాను. అయినా సొంతంగా పని చేసుకోనివ్వకుండా, ఇతర ప్రాజెక్టులు రానీయకుండా ఇబ్బంది పెట్టాడు’’ అని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు.ఈమేరకు బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును నార్సింగికి బదిలీ చేశారు. అయితే.. మైనర్‌గా ఉన్న సమయంలోనే ముంబయి హోటల్లో ఆయన తనపై అత్యాచారం చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. దీంతో పోక్సో యాక్ట్‌ను పోలీసులు ఎఫ్ఐఆర్లో యాడ్ చేశారు. ఇదీ చదవండి: జానీ వ్యవహారంపై పవన్ మౌనం -
లడఖ్ బయల్దేరిన పోలీసులు మతమార్పిడిపై కేసు..?
-
లడఖ్ పారిపోయిన జానీ మాస్టర్ పోక్సో కేసు నమోదు
-
జానీమాస్టర్‌పై పోక్సో కేసు నమోదు
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడంటూ ఇటీవలే ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో యువ డ్యాన్సర్ ఇచ్చిన ఫిర్యాదుతో అతనిపై పోలీసులు అత్యాచార కేసు నమోదు చేశారు. ప్రస్తుతం జానీ మాస్టర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.(ఇది చదవండి: తప్పించుకు తిరుగుతున్న జానీ మాస్టర్.. అరెస్ట్ ఎప్పుడు?)అయితే తాజాగా ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. జానీమాస్టర్‌పై నార్సింగి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతను జమ్ముకశ్మీర్‌లోని లడఖ్‌లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అతని కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. జానీమాస్టర్ కోసం ప్రత్యేక బృందం లడఖ్ బయలుదేరినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.అసలు కేసు ఏంటంటే?మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ టీనేజ్ అమ్మాయి 2017లో ఢీ డ్యాన్స్ షోలో పాల్గొంది. ఇదే షోకు జడ్జిగా వచ్చిన జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషా ఆమెకు అవకాశమిస్తానని మాటిచ్చాడు. అందుకు తగ్గట్లే 2019 నుంచి సదరు మహిళ జానీ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తోంది. అయితే తనని లైంగికంగా, మానసికంగా చాలారోజుల నుంచి వేధిస్తున్నాడని.. ఓ షో కోసం ముంబై వెళ్లినప్పుడు హోటల్ రూంలో తనని బలవంతం చేసి లైంగిక వేధింపులకు పాల్పడడ్డాని సదరు యువతి చెప్పింది.అలానే షూటింగ్ టైంలోనూ అందరి ముందు తనని అసభ్యంగా తాకేవాడని, జానీ మాస్టర్ భార్య కూడా తనని మతం మార్చుకుని, అతడిని పెళ్లి చేసుకోమని చాలా ఇబ్బంది పెట్టిందని ఫిర్యాదులో పేర్కొంది. ఓసారి వ్యానిటీ వ్యాన్‌లో, నార్సింగిలోనూ తన ఇంటికొచ్చి కూడా లైంగికంగా చాలాసార్లు వేధించాడని సదరు మహిళా కొరియోగ్రాఫర్ పెట్టిన బాధని బయటపెట్టింది. -
జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు.. అనసూయ ఆసక్తికర పోస్ట్
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అతని సహాయకురాలు (21) ఫిర్యాదు చేయడంతో నార్సింగి పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు జానీ మాస్టర్ వ్యవహారంపై స్పందిస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరగాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: లైంగిక వేధింపుల కేసు.. ఆ ఊరిలో దాక్కున్న జానీ?)ఇప్పటికే నటి పూనమ్ కౌర్, సింగర్ చిన్మయితో సహా పలువురు టాలీవుడ్ స్టార్స్ బాధితురాలికి అండగా నిలిచారు. తాజాగా యాంకర్, నటి అనసూయ కూడా ఈ వివాదంపై స్పందించారు. లేడి కొరియోగ్రాఫర్‌కు జరిగిన అన్యాయం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.మహిళలకు ఇలాంటి వేధింపులు ఎదురైతే.. వెంటనే భయటపెట్టాలని, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్నారు.సానుభూతి అవసరం లేదు‘మహిళలకు సానుభూతి అవసరం లేదు. అన్యాయాన్ని పశ్నించే తత్వం ఉండాలి. మీకే కాదు మీకు తెలిసిన వాళ్లకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే వెంటనే బయటపెట్టండి. మీకు అందరూ అండగా ఉంటారు. బాధితురాలితో నేను కూడా కలిసి పని చేశాను. పుష్ప సెట్స్‌లో రెండు మూడు సార్లు ఆ అమ్మాయిని చూశాను. తను చాలా టాలెంటెడ్. ఇలాంటి క్లిష పరిస్థితులు ఆ అమ్మాయి టాలెంట్‌ను ఏమాత్రం తగ్గించలేవు. (చదవండి: లైంగిక వేధింపుల కేసు.. జానీ మాస్టర్‌కు బిగుస్తున్న ఉచ్చు!)కానీ, మనసులో దాచుకొని బాధపడడం వల్ల ఎలాంటి లాభం లేదు. నేను పనిచేసే చోట మహిళలకు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే వెంటనే స్పందిస్తాను. ఈ వ్యవహారంలో కూడా బాధితురాలికి న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. ఇందుకోసం సపోర్టుగా ఉన్న ఫిలిం ఛాంబర్ తో పాటు ఓడబ్ల్యు సభ్యులకు కృతజ్ఞతలు. రాబోయే రోజుల్లో ఇండస్ట్రీలో ఏ మహిళకు ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకూడదని కోరుకుంటున్నాను’అని అనసూయ రాసుకొచ్చింది. పరారీలో జానీ మాస్టర్!జానీ మాస్టర్‌పై కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు..అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం జానీ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫిర్యాదు విషయం తెలియగానే..హైదరబాద్ నుంచి నెల్లూరికి వెళ్లినట్లు సమాచారం. ఈ విషయం నార్సింగి పోలీసులకు తెలియడంతో.. నెల్లూరికి ఓ బృందాన్ని పంపించారట. జానీ మాస్టర్‌కి నోటీసులు అందించి, నేడో, రేపో అరెస్ట్ చేసే అవకాశం ఉందని మీడియా వర్గాలు తెలుపుతున్నాయి. -
జానీ మాస్టర్‌కు పోలీసుల నోటీసులు..!
-
కొరియోగ్రాఫర్ జానీపై బీజేపీ మహిళా మోర్చా ఆగ్రహం
-
కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టు బిగుస్తున్న ఉచ్చు
-
తప్పించుకు తిరుగుతున్న జానీ మాస్టర్.. అరెస్ట్ ఎప్పుడు?
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కాస్త పురోగతి. ఇప్పటికే కేసు వివరాలని సేకరించిన పోలీసులు.. బాధితురాలి స్టేట్మెంట్ని తీసుకుని, ఆమెకు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అయితే రెండు వారాల క్రితమే ఫిల్మ్ ఛాంబర్ దగ్గరికి ఈ కేసు వచ్చింది. కానీ మూడు రోజుల క్రితం బాధిత మహిళ.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘోరం బయటపడింది. అప్పటినుంచి జానీ మాస్టర్ జాడ మాత్రం తెలియట్లేదు.(ఇదీ చదవండి: ఇండస్ట్రీలోని మహిళలకు ఆ ధైర్యం ఇవ్వలేకపోతున్నాం: తమ్మారెడ్డి భరద్వాజ)ఈ కేసు ఏంటి?మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ టీనేజ్ అమ్మాయి 2017లో ఢీ డ్యాన్స్ షోలో పాల్గొంది. ఇదే షోకు జడ్జిగా వచ్చిన జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషా ఆమెకు అవకాశమిస్తానని మాటిచ్చాడు. అందుకు తగ్గట్లే 2019 నుంచి సదరు మహిళ జానీ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తోంది. అయితే తనని లైంగికంగా, మానసికంగా చాలారోజుల నుంచి వేధిస్తున్నాడని.. ఓ షో కోసం ముంబై వెళ్లినప్పుడు హోటల్ రూంలో తనని బలవంతం చేసి లైంగిక వేధింపులకు పాల్పడడ్డాని సదరు యువతి చెప్పింది.అలానే షూటింగ్ టైంలోనూ అందరి ముందు తనని అసభ్యంగా తాకేవాడని, జానీ మాస్టర్ భార్య కూడా తనని మతం మార్చుకుని, అతడిని పెళ్లి చేసుకోమని చాలా ఇబ్బంది పెట్టిందని ఫిర్యాదులో పేర్కొంది. ఓసారి వ్యానిటీ వ్యాన్‌లో, నార్సింగిలోనూ తన ఇంటికొచ్చి కూడా లైంగికంగా చాలాసార్లు వేధించాడని సదరు మహిళా కొరియోగ్రాఫర్ బాధని బయటపెట్టింది.(ఇదీ చదవండి: జానీ మాస్టర్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలి: కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి)ఫిల్మ్ ఛాంబర్ స్పందనఈ ఘటనపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కూడా కాస్త ఘాటుగానే స్పందించింది. మంగళవారం ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ కేసు గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టారు. మైనర్‌గా ఉన్నప్పుడే బాధితురాలు లైంగిక వేధింపులకు గురైందని, ఇప్పటికే కొన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని చెబుతోంది. ఇదంతా చూస్తుంటే జానీ మాస్టర్ చుట్టూ గట్టిగా బిగుస్తోంది.జానీ మాస్టర్ ఎక్కడ?అయితే తనపై పోలీసు కేసు నమోదైన దగ్గర నుంచి జానీ మాస్టర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నార్సింగి పోలీసులు ఇతడి కోసం గాలిస్తున్నారు. నెల్లూరులో ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడి పోలీసులని సంప్రదించారు. జానీ మాస్టర్‌కు నోటీసులు ఇచ్చి, ఒకటి రెండు రోజుల్లో అరెస్ట్ చేయడం గ్యారంటీ!(ఇదీ చదవండి: జానీ మాస్టర్ భార్య కూడా దాడి చేసింది: బాధితురాలు) -
ఎవరికీ తెలియని నిజం.. 1997లో మొదటి పెళ్లి.. 2008లో విడాకులు.. కానీ.. 2004లో
-
పూనమ్ కౌర్ ట్వీట్ పై కొమ్మినేని కామెంట్స్..
-
ఒక్కొక్కరిగా.. తీగ లాగితే డొంక కదిలింది..
-
సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలి: కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
చాలా రంగాల్లో లైగిక వేధింపులు ఎక్కువగా అవుతున్నాయి. కొందరు ధైర్యం చేసి కంప్లైంట్స్ ఇస్తున్నారు. మరికొందరు ఎవరికీ చెప్పలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. మహిళలపై గతంలో జరిగిన, ఇప్పుడు జరుగుతున్న హింసపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రిటైర్డ్ నాయమూర్తి ఆధ్వర్యంలో ఓ కమిటీ నియమించి మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై ఉక్కుపాదం మోపాలని తెలుగు భాషా పరిరక్షణ వేదిక కన్వీనర్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఓ ప్రకటనలో కోరారు.కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ఏం చెప్పారంటే?కేరళలో హేమ కమిటీ రిపోర్ట్ రిలీజైన వెంటనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ లాల్ తన పదవికి రాజీనామా చేశారు. పూనమ్ కౌర్ తనకు అన్యాయం జరిగిందని ట్విటర్లో చెప్పితే ఎలా? లిఖిత పూర్వకంగా తనపై జరిగిన హింసని చెబితేనే కదా? జానీ మాస్టర్‌కి ఇటీవల కేంద్రం ప్రకటించిన ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డ్‌ని ఈ లైంగిక వేధింపుల కేసు విచారణ ముగిసే వరకు ఇవ్వకూడదని కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రికి డిమాండ్ చేస్తున్నాం.షూటింగ్స్ జరిగే ప్రదేశాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేసి ఇలాంటి వేధింపులను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఓ చట్టం తీసుకురావాలి. వానిటీ వెహికల్ తదితర సౌకర్యాల్ని తమిళనాడు లాగా నిర్మాతలు వెంటనే రద్దు చేయలి. ఈ లైంగి వేధింపుల కేసు తేలే వరకు జానీ మాస్టర్‌కు చిత్ర పరిశ్రమలో అవకాశాలు ఇవ్వకూడదని కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి చెప్పుకొచ్చారు. -
ఇండస్ట్రీలోని మహిళలకు ఆ ధైర్యం ఇవ్వలేకపోతున్నాం: తమ్మారెడ్డి భరద్వాజ
‘‘తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ 2018లో సెక్సువల్ హెరాస్మెంట్ రెడ్రెసెల్ ప్యానెల్ (లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్)ను ఆరంభించడం జరిగింది. మా దృష్టికి వచ్చిన ఫిర్యాదులను షరిష్కరించాం. పదిహేను రోజుల క్రితం ఓ కేసు మా దృష్టికి వచ్చింది. వారిద్దరి వ్యక్తిగత స్టేట్మెంట్స్ను తీసుకోవడం జరిగింది. కొన్ని ఆధారాల కోసం ఎదురు చూస్తున్నాం. అలాగే క్రిమినల్ కేసు కూడా నమోదు అయ్యిందన్న విషయం మా దృష్టికి వచ్చింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మా రిపోర్ట్‌ను కూడా సబ్మిట్ చేస్తాం’’ అని సెక్రటరీ, కన్వీనర్, నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ అన్నారు. ఇదిలా ఉంటే... కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ విషయం చర్చనీయాంశమైంది. సినిమా ఇండస్ట్రీలో మహిళల భద్రత గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ వివాదం తేలేవరకూ అతన్ని డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని, అసోసియేషన్ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ఫెడరేషన్‌కు చె΄్పాం. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై ఇంటర్నల్ రిపోర్ట్ వచ్చాక నిర్ణ యిస్తాం. చాంబర్ కార్యాలయంలో ఓ కంప్లైట్ బాక్స్ ఉంది. ఎవరైనా ఫిర్యాదులు చేయవచ్చు. ఫోన్‌కాల్, మెయిల్, పోస్ట్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఇది ఎప్పట్నుంచో ఉంది. అలాగే ఇండస్ట్రీలో ఉమెన్ సపోర్ట్ టీమ్ కూడా ఉంది. ఈ విషయం కొంతమందికి తెలియకపోవచ్చు. ప్రస్తుత వివాదం ముగిసిపోగానే ఈ టీమ్ గురించి అన్ని అసోసియేషన్లకు అవగాహన కల్పిస్తాం’’ అని అన్నారు. లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ చైర్పర్సన్ ఝాన్సీ మాట్లాడుతూ– ‘‘శ్రీరెడ్డి ఇష్యూ తర్వాత ఓ కమిటీని ఫామ్ చేశాం. ఇతర ఇండస్ట్రీస్‌లో జరగుతున్న సెక్సువల్ హెరాస్మెంట్ ఇక్కడ కూడా జరుగుతోంది.ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు కొరియోగ్రాఫర్స్ మధ్య నెలకొన్న వివాదం ఇది. మేం ఇద్దరి స్టేట్మెంట్స్ను రికార్డ్ చేశాం. అయితే ఆమె స్టేట్మెంట్ రికార్డు చేసే సమయంలో తెలిసింది... కేసు చాలా సీరియస్ అని. లీగల్ సపోర్ట్ కూడా ఆ అమ్మాయికి అవసరం అని అర్థమైంది. మా పరిధిలో మేం చేయాల్సినది ఆమెకు చేశాం. బాధితురాలిగా చెప్పబడిన అమ్మాయి మైనర్‌గా ఉన్నప్పట్నుంచే ఇండస్ట్రీలో పని చేస్తోంది. అయితే మైనర్‌గా ఇండస్ట్రీలో ఆమెకు చోటు కల్పించిన విధానం ్రపోటోకాల్ ప్రకారంగానే జరిగిందా? లేదా అనే విషయంపై కూడా ఎంక్వయిరీ జరుగుతోంది. మా ప్రస్తుత గైడ్‌లైన్స్ ప్రకారం 90 రోజుల్లో కేసును పరిష్కరించాలి. కానీ అంతకుముందే ముగించాలని మేం అనుకుంటున్నాం. ఎంక్వయిరీ తర్వాత మా రిపోర్ట్ చెబుతాం. ఎలాంటి చర్యలు తీసుకుంటామో చెబుతాం. ఇండస్ట్రీలోని వారంతా ఈ ఇష్యూపై బయటకు మాట్లడకపోయినా అంతర్గతంగా చర్చిస్తున్నారు. ఆమెకు సపోర్ట్‌గా ఉంటామని ఓ పెద్ద హీరో తన మేనేజర్‌తో చెప్పించారు. దర్శకులు– నిర్మాతలు స్పందిస్తున్నారు. ఇండస్ట్రీలో టాలెంట్‌కు వర్క్ ఉంటుంది. ఒకవేళ ఫేక్ కంప్లైట్స్ వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలని కూడా ప్రత్యేక సెక్షన్ ఉంది. ఇండస్ట్రీలోని మహిళల రక్షణకు సంబంధించి ప్రభుత్వం తరఫు నుంచి సరైన గైడ్‌లైన్స్ లేవు. అలాగే ‘వాయిస్ ఆఫ్ ఉమెన్’ గురించి సమంతగారు సోషల్ మీడియాలో స్పందించారు. కానీ ‘వాయిస్ ఆఫ్ ఉమెన్’ అనేది ఇండస్ట్రీ నుంచి సెపరేట్ కాదు. దీనికి సంబంధించి ప్రభుత్వంతో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. బయటకు రాలేదు అంతే. సరైన సమయంలో పెద్దలు మాట్లాడతారు. అలాగే ఈ కేసుకు సంబంధించి బాధితురాలి ఫేస్‌ను మీడియా బయటపెట్టకూడదని కోరుతున్నాం’’ అని పేర్కొన్నారు.‘‘2013లో ఆసరా అని పెట్టి, కొన్ని కేసులను పరిష్కరించడం జరిగింది. 2018లో సరికొత్తగా ఈ ప్యానెల్ పెట్టాం. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తూనే ఉన్నాం. కానీ ఇండస్ట్రీలో ఉన్న మహిళలకు ధైర్యం ఇవ్వలేకపోతున్నాం. ఫలానా చోటుకు వచ్చి మీ సమస్యలపై ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తామని చెప్పలేకపోతున్నామని నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ తరహా కేసులు లేవని కాదు. జరుగుతున్నవి జరిగినా కానీ, చాలా కేసులు రావడం లేదని నా అభిప్రాయం. వచ్చినవరకు సాల్వ్ చేస్తున్నాం. సినిమాల్లో తనకు ఏదైనా అన్యాయం జరిగితే సపోర్ట్ చేసేందుకు ఇండస్ట్రీ ఉందనే ధైర్యం అమ్మాయిలకు రావాలి. ఆ ధైర్యం రావాలంటే కమిటీ ఉండాలి. వచ్చిన కేసులను మంచిగా సాల్వ్ చేయాలి. ప్రస్తుత కేసును సాల్వ్ చేయడానికి కొంత సమయం ఉంది. అలాగే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి యూనియన్‌కు ఓ కంప్లైట్ కమిటీ ఉండాలని సూచించాం. అలాగే మాకు కూడా డైరెక్ట్‌గా కంప్లైట్ చేయవచ్చు’’ అని ‘లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్’ అంతర్గత సభ్యులు, దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వెల్లడించారు. చిత్ర పరిశ్రమలో మైనర్లు ఎందుకు పని చేయాల్సి వచ్చిందన్న ప్రశ్నకు నిర్మాత వివేక్ కూచిభొట్ల స్పందిస్తూ– ‘‘చిన్నారులు డ్యాన్స్ చేయాల్సి అవసరం వచ్చినప్పుడు వారి తల్లిదండ్రుల అనుమతి తీసుకుంటాం. మేజర్ అయితే సభ్యత్వం ఇస్తాం’’ అని కమిటీ అంతర్గత సభ్యులు, నిర్మాత వివేక్ కూచిబొట్ల అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది, ‘పీఓఎస్‌హెచ్’ (ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్) ఎక్స్పర్ట్ కావ్య మండవ తదితరులు మాట్లాడారు. -
జానీ మాస్టర్‌కి అవకాశాలు ఇవ్వొద్దు : కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వైధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిదే. బాధితురాలు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అనంతరం ఆ కేసును నార్సింగి పోలీసులకు అప్పగించారు. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చెపట్టారు. ప్రస్తుతం జానీ వివాదం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఫిలిం ఛాంబర్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వివాదంపై స్పందించారు. జానీ మాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: త్రివిక్రమ్‌పై ఆరోపణలు.. పూనమ్ షాకింగ్ ట్వీట్)తాజాగా ‘తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి కూడా ఈ వివాదంపై స్పందిస్తూ.. జానీ మాస్టర్‌కి ప్రకటించిన జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డును విచారణ ముగిసేవరకు ఆపాలని కమిటీకి విజ్ఞప్తి చేశారు. ఇలాంటివి జరిగినప్పుడు స్పందించడం మాత్రమే కాకుండా..శాశ్వత పరిష్కారం దిశగా చిత్ర పరిశ్రమ పెద్దలు అడుగులు వేయాలని కోరారు. (చదవండి: జానీ మాస్టర్ వివాదంపై ఫిలిం ఛాంబర్ ఏం చెబుతుందంటే..?)షూటింగ్ జరిగే ప్రదేశాలలో సీసీ టీవీలు ఏర్పాటు చేసి..ఇలాంటి వేధింపు ఉండకుండా చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు లైగింక వేధింపు కేసు తేలేవరకు జానీ మాస్టర్‌కు చిత్ర పరిశ్రమలో అవకాశాలు ఇవ్వకూడదని నిర్మాతలను కోరారు. డాన్స్ మాస్టర్ అసోషియేషన్ అధ్యక్షుడిగా ఉన్న జానీ మాస్టర్ని వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని ఫిలిం ఛాంబర్‌కు విజ్ఞప్తి చేశారు. -
జానీ మాస్టర్ వివాదంపై ఫిలిం ఛాంబర్ ఏం చెబుతుందంటే..?
లైంగిక వేధింపుల ఆరోపణలతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై కేసు నమోదైంది. తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి జానీపై తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. అయితే జానీ వివాదంపై తాజాగా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీడియా సమావేశం నిర్వహించింది. అందులో తమ్మారెడ్డి భరద్వాజ, ఝూన్సీ, ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ పాల్గొన్నారు.జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేగింది. దీంతో ఫిలిం ఛాంబర్ కూడా రియాక్ట్ అయింది. జానీ మాస్టర్ మీద ఆరోపణలు రావడంతో ఈ వివాదం తేలే వరకు అతన్ని డాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఫెడరేషన్‌ను ఇప్పటికే ఆదేశించామని ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ తెలిపారు.చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి యాంకర్,నటి ఝాన్సీ రియాక్ట్ అయ్యారు. 'మన ఇండస్ట్రీలో మహిళా రక్షణ కోసం సరైన గెడ్ లైన్స్ లేవు. నటి శ్రీ రెడ్డి ఇష్యూ తరువాత ఒక కమిటీ ఫామ్ అయింది. జానీ మాస్టర్ ఇష్యూ తెరపైకి వచ్చిన వెంటనే ఆ కమిటీ వారు పరిశీలిస్తున్నారు. ఈ వివాదంలో బాధితురాలు తొలుత తన వర్క్ పరంగా ఇబ్బంది అని ముందుకు వచ్చింది. కానీ, ఆ తర్వాత లైంగిక వేధింపులు కూడా ఉన్నాయని పేర్కొంది. ఆ అమ్మాయి స్టేట్మెంట్తో పాటు జానీ మాటలను కూడా కూడా రికార్డు చేశాం. అయితే, లైంగిక వేధింపులు అనేది వర్క్ ప్లేస్‌లో జరగలేదు. ఆ అమ్మాయి ఇప్పటకే లీగల్‌గా ముందుకు వెళ్తుంది. అయితే, మీడియా వారు బాధితురాలి ఫోటోలను రివీల్ చేయవద్దని కోరుతున్నా. విచారణ సాగుతుంది. 90రోజుల్లో దీనిపై పూర్తి క్లారిటీ వస్తుంది.' అని ఝాన్సీ తెలిపారు.తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. 'మొదట మీడియా వారి నుంచే జానీ మాస్టర్ వివాదం మా వద్దకు వచ్చింది. ఇండస్ట్రీలో ఇబ్బందులు పడే వారి కోసం 2013లో ఆసరా అని పెట్టి.. 2018లో సరికొత్తగా ప్యానల్ పేరుతో మార్చాం. ఇలా పేర్లు అయితే మార్చాం కానీ, ఒక మహిళకు దైర్యం ఇవ్వలేకపోతున్నాం. ఇండస్ట్రీలోని ప్రతి అమ్మాయికి ఆపద వస్తే తమకు సపోర్ట్ ఉందనే బరోసా కల్పించాలి. అందుకు తగ్గ కమిటీ నిర్ణయాలు ఉండాలి. కచ్చితంగా 90 రోజుల్లోనే జానీ మాస్టర్ కేసు పూర్తి అవుతుంది.కానీ, సినిమా ఇండస్ట్రీలో ప్రతి అమ్మాయికి రక్షణ కావాలి. ఛాంబర్ తరపున ప్రతి యూనియన్‌కు ఓ కంప్లైట్ కమిటీ పెట్టుకోవాలని ఈ సందర్భంగా సూచించనున్నాం. డాన్సర్ యూనియన్ వారు కూడా ఈ విషయంలో మాతో పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు.' అని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. -
సరిపోయారు ఇద్దరికీ ఇద్దరు
-
జానీని ‘మాస్టర్’ అని పిలవకండి: హీరోయిన్ పూనమ్ కౌర్
ప్రముఖ కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాష అలియా జానీ మాస్టర్‌పై ఓ యువతి లైంగిక ఆరోపణలు చేయడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్, చెన్నై, ముంబై తదితర నగరాల్లో ఔట్‌డోర్ షూటింగ్లకి వెళ్లినప్పుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అతని సహాయకురాలు(21) పోలీసులకు ఫిర్యాదు చేసింది.అలాగే నార్సింగిలోని తన నివాసానికి వచ్చి పలు మార్లు వేధింపులకు కూడా గురి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో నార్సింగి పోలీసులు జానీ మాస్టర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. (చదవండి: మైనర్‌గా ఉన్నప్పటి నుంచే 'జానీ' వేధించాడు: చిన్మయి)ఈ విషయం బయటకు రాగానే పలువురు టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా జానీ మాస్టర్‌పై ఫైర్ అవుతూ.. బాధితురాలికి అండగా నిలుస్తున్నారు. సింగర్ చిన్మయి స్పందిస్తూ.. యువతి మైనర్‌గా ఉన్నప్పుడే జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. తాజాగా నటి పూనమ్ కౌర్ కూడా జానీ మాస్టర్‌పై సీరియస్ అయింది. ఇకపై అతన్ని మాస్టర్ అనే పిలువొద్దని ఎక్స్ వేదికగా కోరింది. ‘నిందితుడు షేక్ జానీ ని ఇకపై ఎవరు జానీ మాస్టర్ అని పిలవకండి. మాస్టర్ అనే పదానికి విలువ ఇవ్వండి’ అని పూనమ్ ట్వీట్ చేసింది. Accused ‘shaik jani’ should not be called a master anymore ,Have some respect for the word ‘Master’ 🙏— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 16, 2024 -
మైనర్‌గా ఉన్నప్పటి నుంచే 'జానీ' వేధించాడు: చిన్మయి
ప్రముఖ గాయని చిన్మయి తాజాగా టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీపై రియాక్ట్ అయ్యారు. చిత్రపరిశ్రమలో 'మీటూ' ఉద్యమం సమయం నుంచే ఆమె అనేక అంశాలపై లేవనెత్తుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలోని మహిళలు లైంగిక దాడులకు గురైతే వెంటనే తన అభిప్రాయాన్ని తెలుపుతారు. డ్యాన్స్ మాస్టర్ జానీపై లైంగిక ఆరోపణలు చేసిన యువతి పక్షాన సింగర్ చిన్మయి నిలబడ్డారు.ఒక మీడియా కథనాన్ని ట్యాగ్ చేస్తూ చిన్మయి ఇలా చెప్పుకొచ్చారు. 'నివేదికల ప్రకారం ఆ అమ్మాయి మైనర్‌గా ఉన్నప్పటి నుంచే జానీ మాస్టర్ వేధించడం ప్రారంభించాడు. ఈ కేసులో పోరాడేందుకు కావాల్సినంత శక్తి ఆ అమ్మాయికి చేకూరాలని నేను కోరుకుంటున్నాను.' అని ఆమె తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువతిని (అసిస్టెంట్ కొరియోగ్రాఫర్) జానీ మాస్టర్ లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. నార్సింగ్ పోలీస్టేషన్లో కేసు కూడా నమోదు అయిన విషయం తెలిసిందే.చిన్మయి ఒక సింగర్‌గానే కాదు... ఆమె ఒక ఫెమినిస్ట్‌గా కూడా గుర్తింపు పొందారు. గతంలో చిన్మయి కూడా లైగింక వేధింపులకు గరైనట్లు చెప్పిన విషయం తెలిసిందే. తాను కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే సాహిత్య రచయిత వైరముత్తు తన ఫోన్ నంబర్ తీసుకుని పలు ఇబ్బందులకు గురిచేశాడని ఆమె ఆరోపించారు. తాను నంబర్ మార్చినా కూడా ఎదో విధంగా తెలుసుకుని కాల్స్ చేసేవాడని ఆమె చెప్పారు. అలా ఆమె కూడా ఇలాంటి ఘటనలతో ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలోనే ఆమె మహళలకు అండగా నిలుస్తూ ఉంటారు. -
జానీ మంచి కళాకారుడు..!
-
జానీకి 'మాస్టర్' స్ట్రోక్ ఇవ్వనున్న డ్యాన్సర్స్ అసోసియేషన్
లైంగిక వేధింపుల ఆరోపణలతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై కేసు నమోదైంది. దీంతో ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి జానీపై తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. నేడు ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. ప్రస్తుతం కొరియో గ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులుగా జానీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఆయనపై వచ్చిన ఆరోపణలతో ఈ పోస్ట్ ఊస్ట్ కావడం ఖాయమని తెలుస్తుంది.మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువతిని (అసిస్టెంట్ కొరియోగ్రాఫర్) జానీ మాస్టర్ లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. నార్సింగ్ పోలీస్టేషన్లో కేసు కూడా నమోదు అయింది. దీంతో ఈ విషయాన్ని కొరియోగ్రాఫర్ అసోసియేషన్ సీరియస్‌గా తీసుకుంది. ఒకరు చేసిన తప్పువల్ల అసోసియేషన్ మొత్తానికి చెడ్డ వస్తుందని భావించిన యూనియన్ జానీ మాస్టర్‌పై చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. జానీ పదవితో పాటు అసోసియేషన్ నుంచి కూడా సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యూనియన్ బైలాస్ ప్రకారం అధ్యక్ష పదవి నుంచి జానీ మాస్టర్‌ను తొలగించాలని కొరియోగ్రాఫర్లు డిమాండ్ చేస్తున్నారు. సోమవారమే ఈ నిర్ణయం తీసుకోవాలని భావించినప్పటికీ సెక్రటరీ అందుబాటులో లేకపోవడంతో నేడు (మంగళవారం) నిర్ణయం తీసుకుంటారని సమాచారం.అసోసియేషన్ నిబంధనల ప్రకారం జానీ మాస్టర్‌పై చర్యలు తప్పవని తెలుస్తోంది. యూనియన్ సభ్యులు కూడా ఇదే కోరుతున్నారు. అధ్యక్ష పదవి నుంచి తొలగించడమే కాకుండా ఆయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని పలువురి నుంచి డిమాండ్ వస్తుంది.