సాక్షి, హైదరాబాద్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా(జానీ మాస్టర్)కు ఉప్పర్‌పల్లి కోర్టు 14 రోజుల వరకు రిమాండ్ విధించింది. అక్టోబర్ మూడో తేదీ వరకు జానీ మాస్టర్ పోలీసుల రిమాండ్‌లోనే ఉండనున్నారు.
కాగా, స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్‌ఓటీ) పోలీసులు జానీ మాస్టర్‌ను గోవాలో అదుపులోకి తీసుకుని గురువారం హైదరాబాద్‌కు తరలించారు. శుక్రవారం ఉదయం జామీ మాస్టర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో జానీ బాషాకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో, జానీ మాస్టర్‌ను చంచల్‌గూడా జైలుకు తరలిస్తున్నారు పోలీసులు.
తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అతని దగ్గర సహాయక కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన మైనర్ ఈనెల 15న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు జానీ బాషాపై ఐపీసీ 376(2), 506, 323 సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: వర్క్ ప్లేస్‌లో మహిళలకు భద్రత కల్పించాలి: మంత్రి సీతక్క
Comments
Please login to add a commentAdd a comment