jani master case updates
-
జానీ మాస్టర్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత
ఢిల్లీ: ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. లైంగిక వేధింపుల కేసులో అతని బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది.తన అసిస్టెంట్‌పై జానీ లైంగిక దాడికి పాల్పడ్డాడన్నది అతనిపై నమోదైన ప్రధాన అభియోగం. ఈ కేసులో అరెస్టై జైల్లో ఉన్న జానీకి తెలంగాణహైకోర్టు అక్టోబర్ 24వ తేదీన బెయిల్ మంజూరు చేసింది. అయితే..ఆ బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఫిర్యాదుదారు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దీనిని పరిశీలించిన జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ సతీష్‌చంద్ర మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణకు నో చెప్పింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని ఫిర్యాదుదారు లాయర్‌కు చెబుతూ.. పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. -
జానీ మాస్టర్‌కు భారీ షాక్
-
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
మహిళా కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసులో జైలులో ఉన్న జానీ మాస్టర్‌కు ఇటీవలే బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. నేషనల్ అవార్డు అందుకునేందుకు గానూ తనకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అయితే జానీ పోక్సో కేసు నమోదు కావడంతో పలువురు తనకు నేషనల్ అవార్డు రద్దు చేయవలసిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దాంతో జానీ మాస్టర్‌కు ప్రకటించిన నేషనల్ అవార్డును రద్దు చేస్తున్నట్టు కేంద్ర అవార్డు కమిటీ నిర్ణయం తీసుకుంది. 2022 బెస్ట్ కొరియోగ్రఫీకి గాను ఈ నెల 8న ఢిల్లీలో జతీయ అవార్డు అందుకోవలసి ఉంది. అందుకు గాను అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 9 వరకు జానీ మాస్టర్‌కు కోర్టు గురువారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ జానీపై పోక్సో కేసు కారణంతో అవార్డు రద్దు అయింది. దీంతో అతని బెయిల్‌పై అనిశ్చితి నెలకొంది. -
‘నా భర్తను ట్రాప్ చేసింది.. ఇంటికి రాకుండా అడ్డుకునేది’
సాక్షి, హైదరాబాద్: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. తన భర్తపై ఫిర్యాదు చేసిన బాధితురాలపై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు ఆయన భార్య సుమలత ఫిర్యాదు చేసింది. కొరియోగ్రాఫర్‌గా పని చేయడం కోసం నా భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసిందని పేర్కొన్నారు. ఐదేళ్లుగా నరకం అంటే చూపిందని.. తాను ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు తీసుకెళ్లిందంటూ ఫిర్యాదులో తెలిపింది.‘‘నాకు అమ్మ వద్దు.. నాన్న వద్దు.. నువ్వు పెళ్లి చేసుకో అంటూ నా భర్తపై తీవ్ర ఒత్తిడి చేసింది. నా భర్తను ఇంటికి రాకుండా అడ్డుకునేది. కేవలం 2 నుంచి 3 గంటలు మాత్రమే ఇంటికి పంపేది. బాధితురాలు ఇంటికి వెళ్లి జానీ మాస్టర్‌ను నువ్వు ఇష్టపడితే.. ఆయన జీవితం నుంచి నేను వెళ్లిపోతానని చెప్పాను. బాధితురాలు మాత్రం మాస్టర్ నాకు అన్నయ్య లాంటివాడు మీరు నాకు వదిన అంటూ నమ్మించింది. నా భర్తతో కాకుండా చాలా మంది మగవాళ్లతో ఆమెకు అక్రమ సంబంధం ఉంది. ఇవన్నీ తెలుసుకున్న జానీ మాస్టర్ ఆ అమ్మాయిని దూరం పెట్టాడు. దీంతో కక్ష కట్టి తన భర్త లైంగిక దాడి చేశాడంటూ అక్రమ కేసు పెట్టింది’’ అని ఫిర్యాదులో సుమలత పేర్కొంది.‘‘పేరున్న డబ్బున్న మగవారిని టార్గెట్ చేసి ఆమె వేధింపులకు గురిచేస్తుంది. ఆమె తల్లి కూడా ఇబ్బందులకు గురి చేసింది. ఆమె పెట్టిన అక్రమ కేసు ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు, నా పిల్లలకు ఏం జరిగినా తల్లి కూతుళ్లదే బాధ్యత. నాకు నా పిల్లలకు న్యాయం చేయాలని కమిటీని కోరుకుంటున్నాను’’ అని సుమలత తెలిపింది.ఇదీ చదవండి: పెళ్లి చేసుకోమని ఆమె నన్ను వేధించేది: జానీ మాస్టర్ -
దయచేసి ఆ వీడియోని ఇప్పుడు వైరల్ చేయకండి: యాంకర్ రష్మి
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడా చూసినా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే గత వారం నుంచి జానీ మాస్టర్ మ్యాటరే నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా యాంకర్ రష్మి ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. అయితే అది పాత వీడియో. గతంలో రష్మి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూని ప్రస్తుతం జానీ మాస్టర్ వ్యవహారంతో ముడిపెడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అది కాస్త వైరల్ కావడంతో చివరకు రష్మి ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఆ ఇంటర్వ్యూని ఇప్పుడు వాడొద్దని విజ్ఞప్తి చేసింది.‘మైనర్‌పై లైంగిక వేధింపులు, క్యాస్టింగ్ కౌచ్‌కు చాలా వ్యత్యాసం ఉంది. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇద్దరి వ్యక్తుల వ్యక్తిగత సమ్మతికి సంబంధించిన విషయం. నేను ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ(ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను ఉద్దేశించి) చాలా పాతది. 2020 కంటే ముందే నేను ఆ ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇప్పుడు ఆ వీడియోని వైరల్ చేస్తూ జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. దయచేసి ఆ వీడియోని వాడకండి. పని ప్రదేశాలు మహిళలకు సురక్షితంగా ఉండాలి. ఏదైనా విషయంలో ఒక మహిళ నో అని చెబితే ఆమె అభిప్రాయాన్ని గౌరవించాలి’అని రష్మి ట్వీట్ చేసింది.ఆ వీడియోలో ఏముందంటే..రష్మి గతంలో ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్‌కౌచ్ గురించి మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలోనే కాదు అన్ని పరిశ్రమల్లోనూ మహిళలకు వేధింపులు ఎదురవుతున్నాయి. ఇలాంటివి ఎదురైనప్పుడు ‘నో’ చెప్పడం అమ్మాయిలు నేర్చుకోవాలి. నీకు చేయాలని లేకపోతే చేయలేనని చెప్పాలి. కొంతమంది అమ్మాయిలు త్వరగా ఉన్నత శిఖరాలకు వెళ్లాలని అలాంటివాటికి ఓకే చెబుతారేమో. ఎవరూ ఎవరిని బలవంతం చేయరు. దాన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. అత్యాచారానికి పాల్పడితే అది తప్పు’ అని రష్మిక అన్నారు. ఈ వీడియోని ఇప్పుడు షేర్ చేస్తూ.. జానీ మాస్టర్ వివాదంపై రష్మిక ఇలా స్పందించింది అంటూ వైరల్ చేస్తున్నారు. Sexually exploiting a minor is different from cast and couch where two adults might have given consent to an individual choice Pls do not use this interview now and mislead audience This interview was taken way before 2020 Work place shud be comfortable and and when a girl… https://t.co/zexu8Xeohu— rashmi gautam (@rashmigautam27) September 25, 2024 -
పోలీస్ కస్టడీకి జానీ
హైదరాబాద్, సాక్షి: లైంగిక ఆరోపణల కేసులో అరెస్టైన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ చుట్టూ ఉచ్చు మరింతగా బిగుస్తోంది. బుధవారం జానీ కస్టడీకి రంగారెడ్డి కోర్టు పోలీసులకు అనుమతించింది. దీంతో చర్లపల్లి జైల్లో ఉన్న జానీని.. నేటి నుంచి నాలుగు రోజులపాటు కస్టడీకి తీసుకుని పోలీసులు ప్రశ్నించనున్నారు. లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో జానీని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జానీ తన నేరాన్ని అంగీకరించారు. అయితే కస్టడీలో జానీ అఘాయిత్యాలు మరిన్ని వెలుగు చూసే అవకాశం లేకపోలేదు. అంతకు ముందు.. పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగుచూశాయి. ‘‘2019లో జానీతో బాధితురాలికి పరిచయం ఏర్పడింది. దురుద్దేశంతోనే ఆమెను అసిస్టెంట్‌గా చేర్చుకున్నాడు. 2020లో ముంబయిలోని హోటల్లో ఆమెపై లైంగిక దాడి చేశాడు. అప్పుడు బాధితురాలి వయసు 16ఏళ్లు. నాలుగేళ్లలో బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. విషయం బయటకు చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడు. తన పలుకుబడిని ఉపయోగించి బాధితురాలికి సినిమా అవకాశాలు రాకుండా అడ్డుకున్నారు. జానీ మాస్టర్ భార్య కూడా బాధితురాలిని బెదిరించారు’’ అని రిమాండ్ రిపోర్ట్‌లో ఉంది. యువతి ఫిర్యాదు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన జానీని.. నాలుగు రోజుల తర్వాత గోవాలోని ఓ హోటల్లో తెలంగాణ ఓఎస్టీ అదుపులోకి తీసుకుంది. గోవా కోర్టు అనుమతితో హైదరాబాద్‌కు తరలించింది. ఆపై ఉప్పరపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
Jani Master: పక్కా స్కెచ్‌తో.. డోర్ వెనకాల దాక్కొని..!
సాక్షి, హైదరాబాద్/రాజేంద్రనగర్: తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్‌కు న్యాయస్థానం 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. జానీ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న బాధితురాలు (21) తనపై జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఈనెల 15న పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటినుంచి పరారీలో ఉన్న జానీని గురువారం గోవాలోని గ్రాండ్ లియోనీ రిసార్ట్‌లో సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అతడిని ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించారు.ఆస్పత్రిలో వైద్య పరీక్షల తర్వాత నార్సింగి పోలీసులు అతడిని శుక్రవారం మధ్యాహ్నం రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లిలోని కోర్టులో హాజరు పరిచారు. దీంతో జానీ మాస్టర్‌కు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య జానీ మాస్టర్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. నార్సింగి పోలీసులు న్యాయస్థానానికి సమరి్పంచిన రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన అంశాలను పొందుపరిచారు. చిన్నతనం నుంచే డ్యాన్స్‌పై మక్కువ.. బాధితురాలికి చిన్నతనం నుంచే డ్యాన్స్ అంటే మక్కువ ఉండటంతో ఆమె తల్లిదండ్రులు నృత్య శిక్షణ ఇప్పించారు. తర్వాత వివిధ ప్రాంతాలలో స్టేజ్ షోలు ఇస్తుండేది. ఈ క్ర మంలో 2017లో పదో తరగతి చదువుతున్న క్రమంలో బాధితురాలికి ఢీ–11 డ్యాన్స్ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. దీంతో తల్లితో సహా కలసి తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చింది. ఈ షోకు న్యాయనిర్ణేతగా నిందితుడు జానీ మాస్టరే వ్యవహరించా డు. అనంతరం బాధితు రాలు ఢీ–12లోనూ పా ల్గొంది కానీ మధ్యలోనే ఆమెను తొలగించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు జానీ మాస్టర్ బృందంలోని సభ్యురాలు దర్శిని బాధితురాలికి ఫో న్ చేసి మాస్టర్‌కు అసిస్టెంట్‌గా పనిచేస్తావా? అని అడిగింది. దీంతో ఒప్పుకున్న బాధితురాలు 2019 డిసెంబర్ 15న హైదరాబాద్‌కు వచ్చింది. అల వైకుంఠపురంతో కలిసి.. ‘అల వైకుంఠపురం’సినిమాలోని ఓ పాట చిత్రీకరణ సమయంలో తొలిసారిగా జానీ మాస్టర్‌తో బాధితురాలికి పరిచయం ఏర్పడింది. అదే రోజు మాస్టర్ మేనేజర్ ఒకరు బాధితురాలికి ఫోన్ చేసి జానీ మాస్టర్, మరో ఇద్దరు అసిస్టెంట్లు రాహుల్, మోయిన్లతో కలిసి 2020 జనవరి 10న ముంబై వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించాడు. ముంబైలోని ఓ హోటల్లో చెకిన్ అవుతున్న క్రమంలో జానీ తన ఆధార్ కార్డు, ఇతరత్రా డాక్యుమెంట్లను బాధితురాలికి ఇచ్చాడు. అదే రోజు రాత్రి 11–12 గంటల సమయంలో జానీ మాస్టర్ బాధితురాలికి ఫోన్ చేసి ఉదయం తాను ఇచ్చిన ఆధార్, డాక్యుమెంట్లను తీసుకొని గదికి రావాలని ఆదేశించాడు. డోర్ వెనకాల దాక్కొని.. అప్పటికే జానీ మాస్టర్ గది తలుపులు తెరిచి, వెనకాల దాక్కొని ఉన్నాడు. బాధితురాలు గది లోపలికి వెళ్లగానే ఒక్కసారిగా తలుపులు మూసేసి, లాక్ వేసేశాడు. దీంతో భయపడిపోయిన బాధితురాలు తనను వదిలేయాలని ప్రాధేయపడుతూ తలుపులు తెరిచేందుకు ప్రయతి్నంచగా.. జానీ మాస్టర్ ఆమెను అడ్డుకొని, లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయట ఎవరికైనా చెబితే అసిస్టెంట్ జాబ్ నుంచి తీసేయడమే కాకుండా చిత్ర పరిశ్రమలో అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడు. బాధితురాలి నిస్సహాయతను ఆసరా చేసుకున్న జానీ మాస్టర్ షూటింగ్‌ల పేరు చెప్పి వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి హోటల్ గదులు, వ్యానిటీ వ్యాన్లలో అత్యాచారానికి పాల్పడ్డాడు. జానీ మాస్టర్ వేధింపులు, ఆగడాలను తట్టుకోలేకపోయిన బాధితురాలు కొన్ని నెలల పాటు ఇంట్లో ఒంటరిగా ఉండిపోయింది. కానీ, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఏమైనా పని ఉంటే అవకాశం ఇప్పించాలని నిందితుడు జానీ మాస్టర్‌ను సంప్రదించింది. తన లైంగిక వాంఛను తీర్చనన్నందుకు షూటింగ్ సమయంలో అందరి ముందు బాధితురాలిని అవమానపరిచేవాడు. మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలంటూ..మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ బాధితురాలిని బలవంతం పెట్టాడు. ఒక రోజు జానీ మాస్టర్ బాధితురాలికి ఫోన్ చేసి షూటింగ్‌కు రావాలని సూచించాడు. దీంతో తన తల్లి ఇంట్లో లేదని, ఆరోగ్యం బాలేక ఇంట్లో ఉన్నానని తెలిపింది. దీన్ని ఆసరా చేసుకున్న నిందితుడు బాధితురాలి ఇంటికి వెళ్లి బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జానీ తన భార్య సుమలత అలియాస్ ఆయేషాతో కలిసి బాధితురాలికి ఇంటికి వెళ్లి ఆమెను భయభ్రాంతులకు గురి చేశాడు. చిత్ర పరిశ్రమలో జానీకి ఉన్న పరిచయాల కారణంగా బాధితురాలికి ఎక్కడా పని దొరకుండా ఇబ్బందులకు గురి చేశాడు.ఈ క్రమంలో బాధితురాలు ఇంట్లో లేని సమయం చూసి ఓ రోజు ఆమె ఇంటికి వెళ్లి బాధితురాలితో ఉన్న శారీరక సంబంధం గురించి ఆమె తల్లికి వెల్లడించాడు. ఇక, చిట్టచివరికి బాధితురాలు జానీ అసిస్టెంట్ మోయిన్‌కు ఈ విషయాలు తెలిపింది. అతని సూచన మేరకు బాధితురాలు తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ (టీఎఫ్‌టీడీడీఏ) సంఘం అధ్యక్షుడికి ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న జానీ వెంటనే సంఘం డ్రైవర్ రాజేశ్వర్ రెడ్డిని తీసుకొని గోవాకు పరారయ్యాడు. కాగా, కోర్టు వద్ద జానీ మాస్టర్ భార్యను ఈ విషయమై ప్రశ్నించగా అంతా కోర్టులో తేలుతుందని సమాధానం ఇచ్చారు. -
చంచల్గూడా జైలుకు జానీ మాస్టర్
సాక్షి, హైదరాబాద్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా(జానీ మాస్టర్)కు ఉప్పర్‌పల్లి కోర్టు 14 రోజుల వరకు రిమాండ్ విధించింది. అక్టోబర్ మూడో తేదీ వరకు జానీ మాస్టర్ పోలీసుల రిమాండ్‌లోనే ఉండనున్నారు.కాగా, స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) పోలీసులు జానీ మాస్టర్‌ను గోవాలో అదుపులోకి తీసుకుని గురువారం హైదరాబాద్‌కు తరలించారు. శుక్రవారం ఉదయం జామీ మాస్టర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో జానీ బాషాకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో, జానీ మాస్టర్‌ను చంచల్గూడా జైలుకు తరలిస్తున్నారు పోలీసులు.తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అతని దగ్గర సహాయక కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన మైనర్ ఈనెల 15న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు జానీ బాషాపై ఐపీసీ 376(2), 506, 323 సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇది కూడా చదవండి: వర్క్ ప్లేస్‌లో మహిళలకు భద్రత కల్పించాలి: మంత్రి సీతక్క -
రహస్య ప్రదేశంలో జానీ మాస్టర్ విచారణ.. నేడు కోర్టులో హాజరు
-
ఉప్పర్‌పల్లి కోర్టులో జానీ మాస్టర్
Jani Master Case Live Updates..👉 ఉప్పర్‌పల్లి కోర్టులో జానీ మాస్టర్‌ను పోలీసులు హాజరుపరిచారు. 👉 రాజేంద్రనగర్ సీసీఎస్ నుంచి జానీ మాస్టర్‌ను ఉప్పర్‌పల్లి కోర్టుకు తరలించారు పోలీసులు. 👉 కాసేపట్లో కోర్టుకు జానీ మాస్టర్.. రాజేంద్రనగర్ సీసీఎస్ కార్యాలయంలో జానీ మాస్టర్సీసీఎస్ కార్యాలయానికి చేరుకున్న నార్సింగి ఏసీపీ 👉జానీ మాస్టర్‌కు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. పోలీసులు కాసేపట్లో జానీ మాస్టర్‌ను కోర్టులో హాజరుపరుచనున్నారు. 👉లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా(జానీ మాస్టర్) నార్సింగి పోలీసుల అదుపులో ఉన్నాడు. స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) పోలీసులు జానీ మాస్టర్‌ను గోవా నుంచి హైదరాబాద్‌కు తరలించారు. అనంతరం, రహస్య ప్రదేశంలో జానీని విచారిస్తున్నారు.👉గత నాలుగైదు రోజులుగా పరారీలో ఉన్న జానీ మాస్టర్‌ను గోవాలోని ఓ లాడ్జిలో ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచి అనంతరం ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం జానీ మాస్టర్ నగర శివారులోని ఓ ఫాంహౌజ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. రహస్య ప్రదేశంలో ఉంచి అతడిని పోలీసులు విచారిస్తున్నారు. గోవా కోర్టు ఆదేశాల మేరకు.. ఇవాళే జానీ మాస్టర్‌ను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరుచనున్నారు. 👉తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అతని దగ్గర సహాయక కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన మైనర్ ఈనెల 15న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు జానీ బాషాపై ఐపీసీ 376(2), 506, 323 సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇది కూడా చదవండి: నాకే కెమెరా పెడతారా?.. మీడియాపై జానీ భార్య చిందులు -
నాకే కెమెరా పెడతారా?.. జానీ భార్య చిందులు
హైదరాబాద్, సాక్షి: కొరియోగ్రాఫర్ జానీ పోలీసులకు పట్టుబడ్డానన్న వార్తల తర్వాత ఆయన భార్య అయేషా అలియాస్ సుమలత బయటకు వచ్చారు. గురువారం మధ్యాహ్నాం నార్సింగి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆమె మీడియాపై చిందులు తొక్కారు.ఓ ఫేక్ కాల్ రావడంతో తాను పీఎస్‌కు రావాల్సి వచ్చిందని ఆమె మీడియాకు తెలిపారు. అయితే.. భర్త లైంగిక వేధింపుల వ్యవహారంపై స్పందించాలని అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు ఆమెను కోరారు. ఏం సమాధానం ఇవ్వాలో అర్థంకాని అయేషా.. ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. నాకే కెమెరా పెడతారా? అంటూ వాళ్ల మీద ఫైర్ అయ్యారు.మరోవైపు మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడిన కేసులో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన జానీ అలియాస్ షేక్ జానీ బాషాను పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు. గోవా కోర్టు పీటీ వారెంట్‌కు అనుమతి ఇస్తూ.. 24 గం.లో ఉప్పరపల్లి కోర్టులో హాజరుర్చాలని తెలంగాణ ఎస్‌వోటీని ఆదేశించింది. ఇక ఈ కేసులో.. తనపై అయేషా సైతం దాడికి పాల్పడిందని బాధితురాలు ఆరోపించడం గమనార్హం. ఇదీ చదవండి: ఆపరేషన్ జానీ.. సాగిందిలా! -
జానీ కేసుపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: లవ్ జిహాదీకి పాల్పడిన కొరియోగ్రాఫర్ జానీ బాషాను కఠినంగా శిక్షించాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. అలాగే, జానీ బాషా ఇప్పటి వరకు ఎంత మంది అమ్మాయిలను మత మార్పిడి కోసం ఒత్తిడి తెచ్చాడో బయటపెట్టించాలని పోలీసులకు సూచించారు.లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తాజాగా రాజాసింగ్ మాట్లాడుతూ.. జానీ బాషా అరెస్ట్ ఎందుకు ఆలస్యమవుతోంది?. జానీని త్వరగా అరెస్ట్ చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. అతడు ఎంత మంది అమ్మాయిలను మత మార్పిడి కోసం ఒత్తిడి చేశాడో బయటపెట్టించాలి. ఒక దొంగకి, ఒక రౌడీకి, ఒక హంతకుడికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో అదే విధంగా అతడికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలని నేను పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. లవ్ జిహాదీకి పాల్పడిన జానీ బాషాను కఠినంగా శిక్షించాలి. బాలీవుడ్చిత్ర పరిశ్రమకు జానీ బాషా మచ్చ తెచ్చాడు. ఇలాంటి వారి పట్ల చిత్ర పరిశ్రమకు చెందిన ప్యానల్ సీరియస్‌గా వ్యవహరించాలి. ఇండస్ట్రీలో ఇలాంటి వారు మళ్లీ అడుగుపెట్టకుండా ప్యానల్ కఠిన చర్యలు తీసుకోవాలి’ అంటూ వ్యాఖ్యలు చేశారు.జనసేన నేత, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తాట తీయండి - బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్#Janasena #JaniMaster x #RajaSingh #UANow #STopRape pic.twitter.com/dVpZHyaKzN— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) September 19, 2024Video Credit: ఉత్తరాంధ్ర నౌ!ఇదిలా ఉండగా.. కొరియోగ్రాఫర్ జానీ బాషాను హైదరాబాద్ ఎస్వోటీ పోలీసులు కాసేపటి క్రితమే గోవాలో అరెస్ట్ చేశారు. అనంతరం, అతడిని గోవా కోర్టులో హాజరుపరిచారు. పీటీ వారెంట్ కింద.. పోలీసులు జానీని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. రేపు ఉప్పరపల్లి కోర్టులో జానీ బాషాను హాజరుపరుచనున్నారు. ఇక, అంతకుముందు బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీ బాషాపై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: లైంగిక వేధింపుల కేసు.. జానీ మాస్టర్‌కు బిగుస్తున్న ఉచ్చు! -
కొరియోగ్రాఫర్ జానీ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్, జనసేన సస్పెండెడ్ నేత జానీ మాస్టర్(షేక్ జానీ బాషా) ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. గోవాలో జానీని ట్రేస్ చేసిన సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు.. అక్కడే అరెస్ట్ చేశారు. సహా కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న జానీపై.. నార్సింగి పీఎస్‌లో సెప్టెంబర్ 15వ తేదీన కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆపై జానీ ఆచూకీ లేకపోవడంతో.. పరారైనట్లు పోలీసులు ప్రకటించారు. చివరకు.. గోవాలో అరెస్ట్ చేసి అక్కడే కోర్టులో హాజరుపరిచ్చారు. గోవా కోర్టు పీటీ వారెంట్‌కు అనుమతిస్తూ.. 24 గంటల్లోగా ఉప్పరపల్లి కోర్టులో జానీ బాషాను హాజరుపరచాలని ఆదేశించింది. దీంతో జానీని పోలీసులు తరలించే ప్రయత్నాల్లో ఉన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆపై ఆమె మైనర్‌గా ఉన్నప్పటి నుంచే వేధించసాగాడని బాధితురాలు చెప్పడంతో జానీపై పోక్సో చట్టం కింద కేసు జత చేశారు. అయితే కేసు తర్వాత జానీ ఆచూకీ తెలియరాలేదు. భార్యతో సహా అజ్ఞాతంలోకి వెళ్లిపోయి.. తన ఫోన్ స్విచ్ఛాప్ చేసుకున్నాడు. ఇది కూడా చదవండి: లైంగిక వేధింపుల కేసు.. జానీ మాస్టర్‌కు బిగుస్తున్న ఉచ్చు!తొలుత పోలీసులు కొండపూర్లోని నివాసానికి వెళ్లి చూడగా.. తాళం వేసి ఉంది. ఆపై స్వస్థలం నెల్లూరులో ఉండొచ్చని వెళ్లి చూడగా.. అక్కడా లేడు. ఆ తర్వాత లడ్ఢాఖ్‌లో ఉన్నాడన్న సమాచారంతో అక్కడికి వెళ్లి స్థానిక పోలీసులను సంప్రదించారు. మొత్తంగా నాలుగు టీంలతో ఆపరేషన్ జానీ ముమ్మరంగా కొనసాగగా.. చివరకు గోవాలో పట్టుబడ్డాడు. తెలుగుతో పాటు కోలీవుడ్, హిందీలోనూ పలు స్టార్ హీరోలకు జానీ కొరియోగ్రాఫ్ చేశాడు. అంతేకాదు.. పవన్ కల్యాణ్ జనసేనలోనూ మొదటి నుంచి క్రియాశీలకంగా పని చేస్తున్నాడు. అయితే.. లైంగిక వేధింపులు వెలుగులోకి రావడంతో పార్టీ అతన్ని దూరం పెడుతున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది కూడా చదవండి: జానీ మాస్టర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి: బీజేపీ మహిళా మోర్చా -
బయటకొస్తున్న జానీ అరాచకాలు.. భయపడుతున్న కొరియోగ్రాఫర్స్!
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఓ యువతి చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదుతో ఆయన చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఇప్పటికే జానీ మాస్టర్‌పై నార్సింగి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. తాను 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తనపై అత్యాచారం చేశాడంటూ బాధిత యువతి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో అత్యాచారం కేసుతో పాటు పోక్సో కేసు నమోదైంది.తాజాగా కొరియోగ్రాఫర్ జానీకి సంబంధించిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి. జనసేన పార్టీలో కీలక సభ్యుడిగా ఉన్న జానీ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఏపీలో జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో జానీ మరింత రెచ్చిపోయారు. తన తోటి కొరియోగ్రాఫర్లను తీవ్ర వేధింపులకు గురి చేసినట్లు తెలుస్తోంది.(ఇది చదవండి: ముమ్మరంగా ఆపరేషన్ ‘జానీ’)సభ్యత్వం ఇవ్వకుండా వేధింపులు..జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జానీ మాస్టర్ దారుణాలకు అడ్డులేకుండా పోయింది. తెలుగు ఫిల్మ్, టీవీ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తర్వాత తోటి కొరియోగ్రాఫర్స్‌ను వేధింపులకు గురి చేశారు. కార్యవర్గం నిర్ణయాలను సైతం లెక్కచేయకుండా ఏకపక్షంగా వ్యవహారించారు. అసోసియేషన్ ఆడిషన్స్‌లో సెలక్ట్ అయిన వారికి సభ్యత్వం ఇవ్వకుండా వేధించారు. దాదాపు 90 మంది కొరియోగ్రాఫర్స్‌ను సభ్యత్వం ఇవ్వకుండా జానీ మాస్టర్ వేధింపులకు గురిచేశారు. ఇండస్ట్రీలో అతనికి పలుకుబడి ఉండడంతో అరాచకాలపై మాట్లాడేందుకు కొరియోగ్రాఫర్స్ జంకుతున్నారు.గాలిస్తున్న పోలీసులు..యువతి ఫిర్యాదుతో కేసులు నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ప్రస్తుతం అతను జమ్మూకశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పోలీసులు అతని కోసం లడఖ్ బయలుదేరి వెళ్లారు. త్వరలోనే జానీమాస్టర్ అరెస్ట్ అయ్యే అవకాశముంది. -
జానీమాస్టర్‌పై పోక్సో కేసు నమోదు
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడంటూ ఇటీవలే ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో యువ డ్యాన్సర్ ఇచ్చిన ఫిర్యాదుతో అతనిపై పోలీసులు అత్యాచార కేసు నమోదు చేశారు. ప్రస్తుతం జానీ మాస్టర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.(ఇది చదవండి: తప్పించుకు తిరుగుతున్న జానీ మాస్టర్.. అరెస్ట్ ఎప్పుడు?)అయితే తాజాగా ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. జానీమాస్టర్‌పై నార్సింగి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతను జమ్ముకశ్మీర్‌లోని లడఖ్‌లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అతని కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. జానీమాస్టర్ కోసం ప్రత్యేక బృందం లడఖ్ బయలుదేరినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.అసలు కేసు ఏంటంటే?మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ టీనేజ్ అమ్మాయి 2017లో ఢీ డ్యాన్స్ షోలో పాల్గొంది. ఇదే షోకు జడ్జిగా వచ్చిన జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషా ఆమెకు అవకాశమిస్తానని మాటిచ్చాడు. అందుకు తగ్గట్లే 2019 నుంచి సదరు మహిళ జానీ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తోంది. అయితే తనని లైంగికంగా, మానసికంగా చాలారోజుల నుంచి వేధిస్తున్నాడని.. ఓ షో కోసం ముంబై వెళ్లినప్పుడు హోటల్ రూంలో తనని బలవంతం చేసి లైంగిక వేధింపులకు పాల్పడడ్డాని సదరు యువతి చెప్పింది.అలానే షూటింగ్ టైంలోనూ అందరి ముందు తనని అసభ్యంగా తాకేవాడని, జానీ మాస్టర్ భార్య కూడా తనని మతం మార్చుకుని, అతడిని పెళ్లి చేసుకోమని చాలా ఇబ్బంది పెట్టిందని ఫిర్యాదులో పేర్కొంది. ఓసారి వ్యానిటీ వ్యాన్‌లో, నార్సింగిలోనూ తన ఇంటికొచ్చి కూడా లైంగికంగా చాలాసార్లు వేధించాడని సదరు మహిళా కొరియోగ్రాఫర్ పెట్టిన బాధని బయటపెట్టింది. -
జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు.. అనసూయ ఆసక్తికర పోస్ట్
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అతని సహాయకురాలు (21) ఫిర్యాదు చేయడంతో నార్సింగి పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు జానీ మాస్టర్ వ్యవహారంపై స్పందిస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరగాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: లైంగిక వేధింపుల కేసు.. ఆ ఊరిలో దాక్కున్న జానీ?)ఇప్పటికే నటి పూనమ్ కౌర్, సింగర్ చిన్మయితో సహా పలువురు టాలీవుడ్ స్టార్స్ బాధితురాలికి అండగా నిలిచారు. తాజాగా యాంకర్, నటి అనసూయ కూడా ఈ వివాదంపై స్పందించారు. లేడి కొరియోగ్రాఫర్‌కు జరిగిన అన్యాయం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.మహిళలకు ఇలాంటి వేధింపులు ఎదురైతే.. వెంటనే భయటపెట్టాలని, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్నారు.సానుభూతి అవసరం లేదు‘మహిళలకు సానుభూతి అవసరం లేదు. అన్యాయాన్ని పశ్నించే తత్వం ఉండాలి. మీకే కాదు మీకు తెలిసిన వాళ్లకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే వెంటనే బయటపెట్టండి. మీకు అందరూ అండగా ఉంటారు. బాధితురాలితో నేను కూడా కలిసి పని చేశాను. పుష్ప సెట్స్‌లో రెండు మూడు సార్లు ఆ అమ్మాయిని చూశాను. తను చాలా టాలెంటెడ్. ఇలాంటి క్లిష పరిస్థితులు ఆ అమ్మాయి టాలెంట్‌ను ఏమాత్రం తగ్గించలేవు. (చదవండి: లైంగిక వేధింపుల కేసు.. జానీ మాస్టర్‌కు బిగుస్తున్న ఉచ్చు!)కానీ, మనసులో దాచుకొని బాధపడడం వల్ల ఎలాంటి లాభం లేదు. నేను పనిచేసే చోట మహిళలకు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే వెంటనే స్పందిస్తాను. ఈ వ్యవహారంలో కూడా బాధితురాలికి న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. ఇందుకోసం సపోర్టుగా ఉన్న ఫిలిం ఛాంబర్ తో పాటు ఓడబ్ల్యు సభ్యులకు కృతజ్ఞతలు. రాబోయే రోజుల్లో ఇండస్ట్రీలో ఏ మహిళకు ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకూడదని కోరుకుంటున్నాను’అని అనసూయ రాసుకొచ్చింది. పరారీలో జానీ మాస్టర్!జానీ మాస్టర్‌పై కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు..అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం జానీ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫిర్యాదు విషయం తెలియగానే..హైదరబాద్ నుంచి నెల్లూరికి వెళ్లినట్లు సమాచారం. ఈ విషయం నార్సింగి పోలీసులకు తెలియడంతో.. నెల్లూరికి ఓ బృందాన్ని పంపించారట. జానీ మాస్టర్‌కి నోటీసులు అందించి, నేడో, రేపో అరెస్ట్ చేసే అవకాశం ఉందని మీడియా వర్గాలు తెలుపుతున్నాయి. -
తప్పించుకు తిరుగుతున్న జానీ మాస్టర్.. అరెస్ట్ ఎప్పుడు?
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కాస్త పురోగతి. ఇప్పటికే కేసు వివరాలని సేకరించిన పోలీసులు.. బాధితురాలి స్టేట్మెంట్ని తీసుకుని, ఆమెకు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అయితే రెండు వారాల క్రితమే ఫిల్మ్ ఛాంబర్ దగ్గరికి ఈ కేసు వచ్చింది. కానీ మూడు రోజుల క్రితం బాధిత మహిళ.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘోరం బయటపడింది. అప్పటినుంచి జానీ మాస్టర్ జాడ మాత్రం తెలియట్లేదు.(ఇదీ చదవండి: ఇండస్ట్రీలోని మహిళలకు ఆ ధైర్యం ఇవ్వలేకపోతున్నాం: తమ్మారెడ్డి భరద్వాజ)ఈ కేసు ఏంటి?మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ టీనేజ్ అమ్మాయి 2017లో ఢీ డ్యాన్స్ షోలో పాల్గొంది. ఇదే షోకు జడ్జిగా వచ్చిన జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషా ఆమెకు అవకాశమిస్తానని మాటిచ్చాడు. అందుకు తగ్గట్లే 2019 నుంచి సదరు మహిళ జానీ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తోంది. అయితే తనని లైంగికంగా, మానసికంగా చాలారోజుల నుంచి వేధిస్తున్నాడని.. ఓ షో కోసం ముంబై వెళ్లినప్పుడు హోటల్ రూంలో తనని బలవంతం చేసి లైంగిక వేధింపులకు పాల్పడడ్డాని సదరు యువతి చెప్పింది.అలానే షూటింగ్ టైంలోనూ అందరి ముందు తనని అసభ్యంగా తాకేవాడని, జానీ మాస్టర్ భార్య కూడా తనని మతం మార్చుకుని, అతడిని పెళ్లి చేసుకోమని చాలా ఇబ్బంది పెట్టిందని ఫిర్యాదులో పేర్కొంది. ఓసారి వ్యానిటీ వ్యాన్‌లో, నార్సింగిలోనూ తన ఇంటికొచ్చి కూడా లైంగికంగా చాలాసార్లు వేధించాడని సదరు మహిళా కొరియోగ్రాఫర్ బాధని బయటపెట్టింది.(ఇదీ చదవండి: జానీ మాస్టర్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలి: కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి)ఫిల్మ్ ఛాంబర్ స్పందనఈ ఘటనపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కూడా కాస్త ఘాటుగానే స్పందించింది. మంగళవారం ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ కేసు గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టారు. మైనర్‌గా ఉన్నప్పుడే బాధితురాలు లైంగిక వేధింపులకు గురైందని, ఇప్పటికే కొన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని చెబుతోంది. ఇదంతా చూస్తుంటే జానీ మాస్టర్ చుట్టూ గట్టిగా బిగుస్తోంది.జానీ మాస్టర్ ఎక్కడ?అయితే తనపై పోలీసు కేసు నమోదైన దగ్గర నుంచి జానీ మాస్టర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నార్సింగి పోలీసులు ఇతడి కోసం గాలిస్తున్నారు. నెల్లూరులో ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడి పోలీసులని సంప్రదించారు. జానీ మాస్టర్‌కు నోటీసులు ఇచ్చి, ఒకటి రెండు రోజుల్లో అరెస్ట్ చేయడం గ్యారంటీ!(ఇదీ చదవండి: జానీ మాస్టర్ భార్య కూడా దాడి చేసింది: బాధితురాలు) -
జానీ మాస్టర్ వివాదంపై ఫిలిం ఛాంబర్ ఏం చెబుతుందంటే..?
లైంగిక వేధింపుల ఆరోపణలతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై కేసు నమోదైంది. తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి జానీపై తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. అయితే జానీ వివాదంపై తాజాగా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీడియా సమావేశం నిర్వహించింది. అందులో తమ్మారెడ్డి భరద్వాజ, ఝూన్సీ, ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ పాల్గొన్నారు.జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేగింది. దీంతో ఫిలిం ఛాంబర్ కూడా రియాక్ట్ అయింది. జానీ మాస్టర్ మీద ఆరోపణలు రావడంతో ఈ వివాదం తేలే వరకు అతన్ని డాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఫెడరేషన్‌ను ఇప్పటికే ఆదేశించామని ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ తెలిపారు.చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి యాంకర్,నటి ఝాన్సీ రియాక్ట్ అయ్యారు. 'మన ఇండస్ట్రీలో మహిళా రక్షణ కోసం సరైన గెడ్ లైన్స్ లేవు. నటి శ్రీ రెడ్డి ఇష్యూ తరువాత ఒక కమిటీ ఫామ్ అయింది. జానీ మాస్టర్ ఇష్యూ తెరపైకి వచ్చిన వెంటనే ఆ కమిటీ వారు పరిశీలిస్తున్నారు. ఈ వివాదంలో బాధితురాలు తొలుత తన వర్క్ పరంగా ఇబ్బంది అని ముందుకు వచ్చింది. కానీ, ఆ తర్వాత లైంగిక వేధింపులు కూడా ఉన్నాయని పేర్కొంది. ఆ అమ్మాయి స్టేట్మెంట్తో పాటు జానీ మాటలను కూడా కూడా రికార్డు చేశాం. అయితే, లైంగిక వేధింపులు అనేది వర్క్ ప్లేస్‌లో జరగలేదు. ఆ అమ్మాయి ఇప్పటకే లీగల్‌గా ముందుకు వెళ్తుంది. అయితే, మీడియా వారు బాధితురాలి ఫోటోలను రివీల్ చేయవద్దని కోరుతున్నా. విచారణ సాగుతుంది. 90రోజుల్లో దీనిపై పూర్తి క్లారిటీ వస్తుంది.' అని ఝాన్సీ తెలిపారు.తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. 'మొదట మీడియా వారి నుంచే జానీ మాస్టర్ వివాదం మా వద్దకు వచ్చింది. ఇండస్ట్రీలో ఇబ్బందులు పడే వారి కోసం 2013లో ఆసరా అని పెట్టి.. 2018లో సరికొత్తగా ప్యానల్ పేరుతో మార్చాం. ఇలా పేర్లు అయితే మార్చాం కానీ, ఒక మహిళకు దైర్యం ఇవ్వలేకపోతున్నాం. ఇండస్ట్రీలోని ప్రతి అమ్మాయికి ఆపద వస్తే తమకు సపోర్ట్ ఉందనే బరోసా కల్పించాలి. అందుకు తగ్గ కమిటీ నిర్ణయాలు ఉండాలి. కచ్చితంగా 90 రోజుల్లోనే జానీ మాస్టర్ కేసు పూర్తి అవుతుంది.కానీ, సినిమా ఇండస్ట్రీలో ప్రతి అమ్మాయికి రక్షణ కావాలి. ఛాంబర్ తరపున ప్రతి యూనియన్‌కు ఓ కంప్లైట్ కమిటీ పెట్టుకోవాలని ఈ సందర్భంగా సూచించనున్నాం. డాన్సర్ యూనియన్ వారు కూడా ఈ విషయంలో మాతో పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు.' అని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు.