ఉప్పర్‌పల్లి కోర్టులో జానీ మాస్టర్‌ | Jani Master Case And Court Hearing Related Updates | Sakshi
Sakshi News home page

Jani Master: ఉప్పర్‌పల్లి కోర్టులో జానీ మాస్టర్‌ను హాజరుపర్చిన పోలీసులు

Published Fri, Sep 20 2024 7:52 AM | Last Updated on Fri, Sep 20 2024 1:35 PM

 Jani Master Case And Court Hearing Related Updates

Jani Master Case Live Updates..

👉 ఉప్పర్‌పల్లి కోర్టులో జానీ మాస్టర్‌ను పోలీసులు హాజరుపరిచారు. 

👉 రాజేంద్రనగర్‌ సీసీఎస్‌ నుంచి జానీ మాస్టర్‌ను ఉప్పర్‌పల్లి కోర్టుకు తరలించారు పోలీసులు. 

👉 కాసేపట్లో కోర్టుకు జానీ మాస్టర్‌.. 

  • రాజేంద్రనగర్‌ సీసీఎస్‌ కార్యాలయంలో జానీ మాస్టర్‌
  • సీసీఎస్‌ కార్యాలయానికి చేరుకున్న నార్సింగి ఏసీపీ


     

👉జానీ మాస్టర్‌కు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. పోలీసులు కాసేపట్లో జానీ మాస్టర్‌ను కోర్టులో హాజరుపరుచనున్నారు. 

👉లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్‌ షేక్‌ జానీ బాషా(జానీ మాస్టర్‌) నార్సింగి పోలీసుల అదుపులో ఉన్నాడు. స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్‌ఓటీ) పోలీసులు జానీ మాస్టర్‌ను గోవా నుంచి హైదరాబాద్‌కు తరలించారు. అనంతరం, రహస్య ప్రదేశంలో జానీని విచారిస్తున్నారు.

👉గత నాలుగైదు రోజులుగా పరారీలో ఉన్న జానీ మాస్టర్‌ను గోవాలోని ఓ లాడ్జిలో ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచి అనంతరం ట్రాన్సిట్‌ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం జానీ మాస్టర్‌ నగర శివారులోని ఓ ఫాంహౌజ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. రహస్య ప్రదేశంలో ఉంచి అతడిని పోలీసులు విచారిస్తున్నారు. గోవా కోర్టు ఆదేశాల మేరకు.. ఇవాళే జానీ మాస్టర్‌ను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరుచనున్నారు.  

👉తనపై జానీ మాస్టర్‌ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అతని దగ్గర సహాయక కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన మైనర్‌ ఈనెల 15న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు జానీ బాషాపై ఐపీసీ 376(2), 506, 323 సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.  

ఇది కూడా చదవండి: నాకే కెమెరా పెడతారా?.. మీడియాపై జానీ భార్య చిందులు

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement