Narsing police
-
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ హర్ష సాయి
యూట్యూబర్ హర్షసాయి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. తనపై లైంగిక ఆరోపణలు రావడంతో నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో కొద్దిరోజులుగా ఆయన పరారీలో ఉన్నారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక యువతిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమె నగ్నచిత్రాలు సేకరించి ఆమెని బ్లాక్ మెయిల్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.హర్షసాయి హీరోగా ఒక సినిమా తీస్తున్నాడు. ఈ చిత్రం కాపీరైట్స్ విషయంలో విభేదాలు రావడంతో ఆ యువతిని టార్గెట్ చేశాడని తెలుస్తోంది. ప్రేమ పేరుతో వంచించి నగ్న చిత్రాలు తీశాడని ఆమె తెలిపింది. బాధిత యువతి ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు.. హర్షసాయిపై 328, 376 (2) 354 , 376ఎన్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కొండాపూర్‌లోని ప్రాంతీయ ఆస్పత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు. కేసు నమోదు అయినప్పటి నుంచి హర్షసాయి పరారీలో ఉన్నాడు. పోలీసులు ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేసుకున్నాడు. నేడు తన పిటీషన్‌పై న్యాయస్థానంలో విచారణ జరగనుంది. -
పరారీలో హర్షసాయి.. లుక్అవుట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు
తెలుగు యూట్యూబర్ హర్షసాయిపై అత్యాచారం కేసు నమోదైన విషయం తెలిసిందే. తనపై అత్యాచారం చేయడంతో పాటు నగ్నచిత్రాలతో బ్లాక్మెయిల్ చేశాడని కొద్దిరోజుల క్రితం నార్సింగ్ పోలీసులకు సినీ నటి ఫిర్యాదు ఇచ్చింది. దీంతో గత కొద్దిరోజులుగా హర్షసాయి పరారీలో ఉన్నారు. ఇప్పటికే అతని మీద కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.యువతి ఫిర్యాదుతో హర్షసాయిని అరెస్ట్ చేసేందుకు నార్సింగ్ పోలీసులు పలుచోట్ల గాలిస్తున్నారు. అతని ఆచూకీ లభ్యం కాకపోవడంతో తాజాగా లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. హర్షసాయి నటిస్తున్న 'మెగా' సినిమా కాపీ రైట్స్ కోసమే తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న హర్షసాయి కోసం నార్సింగ్ పోలీసులు గాలిస్తున్నారు. అతను దేశం వదిలి వెళ్లిపోతున్నాడంటూ గతంలోనే పోలీసులకు బాధితురాలు తెలిపింది. -
ముగిసిన జానీ మాస్టర్ కస్టడీ.. మళ్లీ జైలుకు తరలింపు
లైంగిక ఆరోపణలు, పోక్సో కేసులో అరెస్టయిన జానీ మాస్టర్ పోలీసు కస్టడీ ముగిసింది. నాలుగు రోజులపాటు కస్టడీకి తీసుకుని ఆయన్ను అనేక ప్రశ్నలతో పోలీసులు విచారణ జరిపారు. ఈనెల 25వ తేదీ నుంచి జానీ మాస్టర్‌ను నార్సింగ్ పోలీసులు విచారించారు. నేటితో కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో ఆయన్ను మళ్లీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. అయితే, జానీ మాస్టర్‌ను మరోసారి విచారించేందుకు పోలీసులు కస్టడీకి కోరలేదు.పోలీసు కస్టడీలో జానీ మాస్టర్‌ను నార్సింగ్ పోలీసులు అనేక ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. బాధితురాలితో తనకు ఉన్న సంబంధం ఏంటి..? ఆమెతో మొదట ఎలా పరిచయం అయింది..? ఆ యువతి ఇచ్చిన ఆధారాలను జానీ మాస్టర్ ముందు ఉంచి విచారణ జరిపినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నాలుగు రోజులపాటు అతడిని విచారించిన నార్సింగి పోలీసులు.. అనంతరం ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు. అక్కడి నుంచి జానీ మాస్టర్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. జానీ మాస్టర్ తనపై లైంగిక దాడి చేశారని అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాను మైనర్‌గా ఉన్నప్పడే ఈ ఘాతుకానికి జానీ పాల్పడినట్లు ఫిర్యాదులో యువతి పేర్కొంది. అక్టోబర్ 3న జానీ మాస్టర్ రిమాండ్ గడువు ముగుస్తుంది. -
దేశం వదిలి వెళ్లిపోతాడు.. పోలీసులతో హర్షసాయిపై బాధితురాలు
తెలుగు యూట్యూబర్ హర్షసాయిపై అత్యాచారం కేసు నమోదైన విషయం తెలిసిందే. తనపై అత్యాచారం చేయడంతో పాటు నగ్నచిత్రాలతో బ్లాక్మెయిల్ చేశాడని నార్సింగ్ పోలీసులకు సినీ నటి ఫిర్యాదు ఇచ్చింది. అయితే, తాజాగా ఆమె మరో విషయంపై హర్షసాయి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతను దేశం వదిలి వెళ్లిపోతున్నాడంటూ తెలిపింది.యువతి ఫిర్యాదుతో పరారీలో ఉన్న హర్షసాయి కోసం పోలీసులు రెండు రోజులుగా వెతుకుతున్నారు. అయితే, ఆయన దేశం వదిలి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆ యువతి పోలీసులకు తాజాగా చెప్పింది. ఆయన ఫోన్ కూడా ఆఫ్‌లో ఉన్నట్లు సమాచారం. కొద్దిరోజుల్లో హర్షసాయి పోలీసుల వద్ద లొంగిపోకుంటే అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. హర్షసాయిపై ఫిర్యాదు చేసినందుకు తనకు బెదిరింపులు వస్తున్నట్లు ఆ యువతి పోలీసులకు తెలిపింది. సోషల్‌మీడియాలో తనపై కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని.. అలాంటి వారిపై కూడా చర్యలు తీసుకోవాలని యువతి ఫిర్యాదులో తెలిపినట్లు సమాచారం.సినిమాల్లో అవకాశాల కోసం ముంబయికి చెందిన ఒక యువతి కొన్నేళ్ల క్రితమే హైదరాబాద్‌కు వచ్చింది. ఈ క్రమంలో ఆమె ఒక రియాల్టీ షోలో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒక ప్రైవేటు పార్టీలో ఆమెకు హర్షసాయి పరిచయం కావడం.. ఆపై వారిద్దరి మధ్య స్నేహం మొదలైంది. అయితే, స్నేహంగా ఉంటూనే తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేసినట్లు ఆ యువతి పేర్కొంది. ఈ క్రమంలో తన వద్ద పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. -
జానీ మాస్టర్‌ను కస్టడీకి కోరిన పోలీసులు
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతన్ని చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే, తాజాగా నార్సింగ్ పోలీసులు రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసిన సమయంలోనే నార్సింగ్ పోలీసులు విచారించారు. రిమాండ్ రిపోర్ట్‌లో పలు విషయాలను పొందుపరిచారు. విచారణలో భాగంగా జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారని తెలుస్తోంది. మరిన్నీ విషయాలు తెలుసుకునేందుకు ఆయన్ను మరోసారి విచారించాలని నార్సింగ్ పోలీసులు భావించారు. ఈమేరకు వారం రోజుల పాటు తమ కస్టడీలో జానీ మాస్టర్‌ను ఉంచాలని రంగారెడ్డి కోర్టులో తాజాగా పిటీషన్ దాఖలు చేశారు. ప్రస్తుతానికి కోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు అయితే రాలేదు. -
ఉప్పర్‌పల్లి కోర్టులో జానీ మాస్టర్
Jani Master Case Live Updates..👉 ఉప్పర్‌పల్లి కోర్టులో జానీ మాస్టర్‌ను పోలీసులు హాజరుపరిచారు. 👉 రాజేంద్రనగర్ సీసీఎస్ నుంచి జానీ మాస్టర్‌ను ఉప్పర్‌పల్లి కోర్టుకు తరలించారు పోలీసులు. 👉 కాసేపట్లో కోర్టుకు జానీ మాస్టర్.. రాజేంద్రనగర్ సీసీఎస్ కార్యాలయంలో జానీ మాస్టర్సీసీఎస్ కార్యాలయానికి చేరుకున్న నార్సింగి ఏసీపీ 👉జానీ మాస్టర్‌కు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. పోలీసులు కాసేపట్లో జానీ మాస్టర్‌ను కోర్టులో హాజరుపరుచనున్నారు. 👉లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా(జానీ మాస్టర్) నార్సింగి పోలీసుల అదుపులో ఉన్నాడు. స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) పోలీసులు జానీ మాస్టర్‌ను గోవా నుంచి హైదరాబాద్‌కు తరలించారు. అనంతరం, రహస్య ప్రదేశంలో జానీని విచారిస్తున్నారు.👉గత నాలుగైదు రోజులుగా పరారీలో ఉన్న జానీ మాస్టర్‌ను గోవాలోని ఓ లాడ్జిలో ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచి అనంతరం ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం జానీ మాస్టర్ నగర శివారులోని ఓ ఫాంహౌజ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. రహస్య ప్రదేశంలో ఉంచి అతడిని పోలీసులు విచారిస్తున్నారు. గోవా కోర్టు ఆదేశాల మేరకు.. ఇవాళే జానీ మాస్టర్‌ను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరుచనున్నారు. 👉తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అతని దగ్గర సహాయక కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన మైనర్ ఈనెల 15న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు జానీ బాషాపై ఐపీసీ 376(2), 506, 323 సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇది కూడా చదవండి: నాకే కెమెరా పెడతారా?.. మీడియాపై జానీ భార్య చిందులు -
రాజ్‌తరుణ్- లావణ్య కేసులో పోలీసుల ఛార్జ్‌షీట్
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్- లావణ్య కేసులో తాజాగా ఛార్జ్‌షీట్ దాఖలు అయింది. రాజ్‌తరుణ్‌పై లావణ్య చేసిన ఆరోపణల్లో నిజం ఉందని పోలీసులు తేల్చేశారు. లావణ్య- రాజ్‌తరుణ్ పదేళ్లుగా ఒకే ఇంట్లో ఉన్నట్లుగా తమ ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. అందుకు సంబంధించి లావణ్య ఇంటి వద్ద సాక్ష్యాలు కూడా సేకరించినట్లు వారు పేర్కొన్నారు. ఈ కేసు విషయంలో లావణ్య చెప్తున్నదాంట్లో వాస్తవాలు ఉన్నాయని పోలీసులు నిర్ధారించారు.ప్రేమ పేరుతో మోసం చేశాడని హీరో రాజ్‌తరుణ్‌పై కోకపేటకు చెందిన లావణ్య అనే యువతి నార్సింగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్, తాను పదేళ్లుగా కలిసి జీవించామని, ఇప్పుడు అతను ముంబైకి చెందిన హీరోయిన్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడంటూ గతంలో ఆమె పిర్యాదులో పేర్కొంది. పిర్యాదులో పేర్కొన్నట్లుగా ఆమె పలు ఆధారాలను కూడా పోలీసులకు సమర్పించింది. ఈ క్రమంలో ఆమె రాజ్ తరుణపై కేసు కూడా పెట్టింది. ఈ కేసులో రాజ్‌తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్న విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ విషయంలో తాజాగా పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేయడంతో ఆయన తీసుకున్న ముందస్తు బెయిల్ కొట్టివేసే ఛాన్స్ ఉంది. -
విచారణకు రాలేనంటూ పోలీసులకు లేఖ రాసిన రాజ్ తరుణ్
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో చిత్రసీమలో ఈ వార్త వైరల్ అయింది. తనను ప్రేమించిన తర్వాత హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ ఎఫైర్ పెట్టుకున్నాడని లావణ్య తెలిపింది. తనకు అబార్షన్ కూడా చేపించాడని ఆమె ఆరోపించింది. ఈ కేసులో రాజ్ తరుణ్‌కి నార్సింగ్ పోలీసులు నోటీసులు పంపించారు. ఈనెల 18 లోపు విచారణకు హాజరు కావాల్సిందేనని ఇందులో పేర్కొన్నారు. అయితే, రాజ్ తరుణ్ పలు కారణాలు చెబుతూ విచారణకు హాజరు కాలేకపోయారు.పోలీసుల విచారణకు రాలేనంటూ రాజ్ తరుణ్ నార్సింగ్ పోలీసులకు తెలిపారు. ఈమేరకు ఆయన ఒక లేఖ రాసి తన లాయర్ ద్వారా నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌కు పంపారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నట్లు ఆయన చెప్పారు. కొద్దిరోజుల్లో తను నటించిన సినిమా విడుదల కానున్నడంతో ఇప్పట్లో విచారణకు రాలేనని లేఖ ద్వారా ఆయన పేర్కొన్నారు. మరో రోజు విచారణకు తప్పకుండా వస్తానని ఆయన తెలిపారు.చట్టానికి లోబడే పోలీసులు ఈ లేఖను ఆమోదించారు. ఈ క్రమంలో మరోసారి రాజ్ తరుణ్‌కు నోటీసులు పంపనున్నారు. రెండోసారి నోటీసులు జారీ చేశాక రాజ్ తరుణ్ స్పందించకపోతే తగు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ అడ్వకేట్‌తో లావణ్య చాటింగ్
టాలీవుడ్లో రాజ్ తరుణ్- లావణ్య వివాదం రోజుకొక మలుపు తీసుకుంటుంది. రాజ్ తరుణ్ తనను నమ్మించి మోసం చేశాడని పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది. దీంతో ఒక్కసారిగా వారి టాపిక్ పెద్ద దుమారం రేగింది. ఇప్పటికే ఇరువురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. పలువురు హీరోయిన్లతో రాజ్ తరుణ్‌కు రిలేషన్ ఉందని లావణ్య ఆరోపించింది. అయినా తనకు రాజ్ తరుణ్ అంటే చాలా ఇష్టమని అతనితో కలిసి జీవించాలని ఉందంటూ ఆమె కోరింది.రాజ్ తరుణ్- లావణ్య వివాదంలో పోలీసుల ద్వారా విచారణ జరుగుతున్న తరుణంలో కీలకమైన ట్విస్ట్ చోటుచేసుకుంది. రాజ్ తరుణ్‌పై ఫిర్యాదు చేసిన లావణ్య తన అడ్వకేట్‌తో వాట్సప్ చాటింగ్ చేసింది. ఈ ప్రపంచం నుంచి వెళ్లిపోతున్నట్లు ఆయనకు మెసేజ్ పెట్టింది. దీంతో సదరు అడ్వకేట్ వెంటనే ఆ విషయాన్ని నార్సింగ్ పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ పోలీస్ హెల్ప్ లైన్ నంబర్‌కు లావణ్య ఫోన్ చేసింది. తాను చనిపోతున్నట్లు వారితో తెలిపింది. తన చావుకు హీరోయిన్ మాల్వీ మల్హౌత్రాతో పాటు రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులే కారణమని లావణ్య తెలిపింది. ప్రస్తుతం ఆమె నంబర్ కూడా పనిచేయడం లేదని తెలుస్తోంది.లావణ్య ఫిర్యాదుతో రాజ్ తరుణ్‌పై నార్సింగి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాజ్ తరుణ్‌ని ఏ1, మాల్వీ మల్హోత్రా ఏ2, ఆమె సోదరుడు మయాంక్ మల్హోత్రా ఏ3గా పోలీసులు చేర్చారు. వీరిపై 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా తెలిస్తోంది. -
హీరో రాజ్‌తరుణ్-లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్!
టాలీవుడ్ హీరో రాజ్‌తరుణ్-లావణ్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో రాజ్‌తరుణ్‌తో పాటు హీరోయిన్ మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్ మల్హోత్రాపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్‌తరుణ్‌ను ఏ1గా, మాల్వీని ఏ2గా, మయాంక్‌ని ఏ3గా చేరుస్తూ నార్సింగి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ 420,493,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినుట్ల పోలీసులు తెలిపారు.లావణ్యకు అబార్షన్ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని కోకపేటకు చెందిన లావణ్య అనే యువతి జులై 5న నార్సింగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే ఆధారాలు చూపించాలని నార్సింగి పోలీసులు ఆమెకు నోటీసులు పంపారు. దీంతో లావణ్య తన దగ్గర ఉన్న ఆధారాలన్ని పోలీసులు అందించింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలను వెల్లడించింది. రాజ్‌తరుణ్‌తో తనకు 2008లో పరిచయం ఏర్పడిందని, 2014లో పెళ్లి కూడా చేసుకున్నామని తెలిపింది. అతను ఆర్థిక సమస్యలతో బాధపడినప్పుడు తన కుటుంబం అదుకుందని, ఇప్పటి వరకు మొత్తంగా రూ. 70 లక్షల వరకు ఇచ్చామని చెప్పింది. అంతేకాదు 2016లో తాను గర్భం దాల్చానని.. రాజ్‌తరుణే అబార్షన్ చేయించాడని ఫిర్యాదులో పేర్కొంది.డ్రగ్స్ కేసులో ఇరికించారురాజ్తరుణ్, మాల్వీ మల్హోత్రా కలిసి తనను డ్రగ్స్ కేసులో ఇరికించారని లావణ్య ఆరోపించింది. ‘జనవరిలో నేను యూఎస్ నుంచి తిరిగి వచ్చాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాపై డ్రగ్స్ కేసు ఉందంటూ తప్పుడు ఆరోపణలతో రిమాండ్ చేశారు. 45 రోజుల పాటు నేను జైలులో ఉన్నాను. రాజ్‌తరుణ్, మాల్వి కలిసే ఇదంతా ప్లాన్ చేశారు. బయటకు వచ్చాక ప్రశ్నిస్తే.. చంపేస్తామని బెదిరించారు’ అని లావణ్య ఆరోపించింది. -
రాజ్ తరుణ్‌తో ఎఫైర్‌పై స్పందించిన మాల్వి మల్హోత్రా
ప్రేమ పేరుతో మోసం చేశాడని హీరో రాజ్‌తరుణ్‌పై కోకాపేటకు చెందిన లావణ్య అనే యువతి నార్సింగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, హీరో రాజ్‌తరుణ్ తనతో సహజీవనం చేస్తూనే మరో పక్క మాల్వి మల్హోత్రాతో ప్రేమాయాణం సాగిస్తూ మోసం చేస్తున్నాడని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఆరోపణలపై హీరోయిన్ మాల్వి మల్హోత్రా స్పందించింది.మాల్వి మల్హోత్రా మాట్లాడుతూ.. 'రాజ్‌తరుణ్‌తో నటించిన ప్రతీ హీరోయిన్ను లావణ్య అనుమానిస్తుంది. ఇప్పటి వరకు ఆమెతో నాకు ఎలాంటి పరిచయం లేదు. నేను తనను బెదిరించలేదు. లావణ్యనే ప్రతిరోజూ నాకు మెసేజ్‌లు, కాల్స్ చేస్తూ టార్చర్ చేస్తోంది. రాజ్ తరుణ్ నా సహ నటుడు మాత్రమే. ఆయనతో నాకు ఎలాంటి సంబంధం లేదు. లావణ్య చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. ఆమె చెబుతున్నవన్నీ అబద్దాలే' అని పేర్కొంది.చదవండి: హీరో రాజ్ తరుణ్- లావణ్య కేసులో ట్విస్ట్!'రాజ్‌తరుణ్‌తో నాకు పెళ్లి అయినట్లు ఆమె చెబుతున్నదాంట్లో నిజం లేదు. ఆమె ఇలాంటి కథలు చెబుతుంది. లావణ్య చేస్తున్న టార్చర్ భరించలేక ఆమె నంబర్‌ను నేను బ్లాక్ చేశాను. ఈ విషయాన్ని రాజ్‌తరుణ్‌తో కూడా చెప్పాను. ఆ సమయంలో ఆమె నా తల్లదండ్రులకు కూడా ఫోన్ కాల్స్ చేసి వార్నింగ్ ఇచ్చింది. నా కుటుంబ సభ్యులు నంబర్స్ రాజ్‌తరుణ్ వద్ద కూడా లేవు. ఆమె ఎలా సంపాధించిందో తెలాల్సి ఉంది. ఆమె కాల్స్ చేసి భూతులు మాట్లాడుతుంది. తనకు ఎలాంటి సిగ్గులేదు. సమస్య వారిద్దరిదీ. కానీ, ఈ గొడవలు నా పేరు ఎందుకు తీస్తుందో తెలియదు. ఆమె టార్చర్ భరించలేకనే నేను ఎనిమి నెలలుగా రాజ్‌తరుణ్‌తో టచ్‌లో లేను. సినిమా విడుదల సమయంలో మాత్రమే ఆయనతో మాట్లాడుదానిని. మా ఇద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉంది. ఇలాంటి రూమర్స్ ఇంతటితో ఆపేస్తే మంచిది. ఇప్పుడు నేను కూడా లావణ్యపై ఫిర్యాదు చేస్తా.' అని మాల్వి మల్హోత్రా తెలిపింది. ప్రస్తుతం ఆమె సైబరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. -
హీరో రాజ్ తరుణ్- లావణ్య కేసులో ట్విస్ట్!
ప్రేమ పేరుతో మోసం చేశాడని హీరో రాజ్‌తరుణ్‌పై కోకపేటకు చెందిన లావణ్య అనే యువతి నార్సింగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్, తాను పదకొండేళ్లుగా కలిసి జీవించామని, ఇప్పుడు అతను ముంబైకి చెందిన హీరోయిన్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడంటూ పిర్యాదులో పేర్కొంది. అయితే ఈ కేసులో నార్సింగి పోలీసులు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. పిర్యాదులో పేర్కొన్న ఆధారాలు సమర్పించాలంటూ తిరిగి లావణ్యకే నోటీసులు అందించారు. శుక్రవారం మధ్యాహ్నం లావణ్య ఫిర్యాదు చేయగా.. సాయంత్రమే పోలీసులు నోటీసులు జారీ చేశారు. లావణ్య ఇచ్చిన నాలుగు పేజీల ఫిర్యాదు ఫార్మాట్లో లేదని,నేరం జరిగితే సమయం, ప్లేస్..ఇలాంటి వివరాలేవి అందులో పేర్కొనలేదని పోలీసులు తెలిపారు. లావణ్య చేసిన ఫిర్యాదుపై ఆధారాలు ఇవ్వమని నోటీసులు ఇచ్చినట్లు నార్సింగి పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు లావణ్య అందుబాటులోకి రానట్లు తెలుస్తోంది.ప్రాణహానీ ఉంది: లావణ్యహీరో రాజ్‌తరుణ్ తనతో సహజీవనం చేస్తూ మాల్వి మల్హోత్రాతో ప్రేమాయాణం సాగిస్తూ మోసం చేస్తున్నాడని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. ఆమె మోజులో పడి తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని తెలిసింది. అంతేకాదు రాజ్‌తరుణ్, మాల్వి కలిసి ఇటీవల గోవా, చెన్నై, పాండిచ్చేరిలకు కలిసి వెళ్లారని, ఇదే విషయాన్ని నిలదీస్తే తనను దూరం పెట్టాడని పేర్కొంది. రాజ్‌తరుణ్‌ని వదిలేస్తే కొంత డబ్బు ఇస్తామని, లేదంటే చంపేస్తామని హీరోయిన్ సోదరుడు బెదిరించాడని తెలిపింది. తనకు ప్రాణహానీ ఉందని, కాపాడాలంటూ ఫిర్యాదులో పేర్కొంది. అయితే అధారాలు సమర్పించాలని పోలీసులు లావణ్యను కోరారు.రిలేషన్లో ఉన్న మాట నిజమే కానీ.. : రాజ్తరుణ్లావణ్య ఫిర్యాదు తర్వాత రాజ్ తరుణ్ మీడియాతో మాట్లాడుతూ..గతంలో ఆమెతో రిలేషన్లో ఉన్న మాట నిజమేనని.. విడిపోయి చాలా కాలం అవుతుందని చెప్పారు. 2014 నుంచి 2017 వరకు లావణ్యతో కలిసి ఒకే ఇంట్లో ఉన్నానని చెప్పారు. తనకు మందు, సిగరేట్‌తో పాటు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని, ఎన్నిసార్లు చెప్పినా మానేకపోవడంతో తాను బయటకు వచ్చానని చెప్పారు. -
టీడీపీ నేత మాగంటి బాబుకు బిగ్ షాక్
సాక్షి, హైదరాబాద్: టీడీపీ నేత మాగంటి బాబుకు మరోసారి షాక్ తగిలింది. పోలీసులపై దాడి కేసులో మాగంటి బాబుకు సైబరాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. 41ఏ సీఆర్పీసీ కింద సైబరాబాద్ పోలీసులు నోటీసులు అందజేశారు. అయితే, సెప్టెంబర్ 16వ తేదీన తన అనుచరులతో కలిసి మాగంటి బాబు హైదరాబాద్‌లోని ఓఆర్ఆర్పై హంగామా చేశారు. అక్కడ విధుల్లో ఉన్న సీఐ, ఎస్ఐతో సహా పోలీసు సిబ్బందితో ఘర్షణకు దిగారు. వారి అంతుచూస్తానంటూ బహిరంగంగానే రెచ్చిపోయారు. దీంతో, పోలీసులకు విధులకు ఆటంకం కలిగించారన్న కారణంగా నార్సింగి పోలీసులు 41A CRPC కింద నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. ఘర్షణ జరిగిన రోజునే పోలీసులు.. మాగంటి బాబుపై కేసు నమోదు చేశారు. ఇక, తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చారు. ఇది కూడా చదవండి: అధికారంలో బీఆర్ఎస్ లేకపోతే జరిగేది అదే: కేటీఆర్ -
దారుణ విషాదం..దర్యాప్తు ముమ్మరం
-
దారుణ విషాదం.. దర్యాప్తు ముమ్మరం
సాక్షి, హైదరాబాద్: ఔటర్‌పై ఐదుగురు మృతి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అసలేం జరిగిందన్న అంశంపై నార్సింగి పోలీసులు దృష్టిసారించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు బుధవారం చందానగర్‌లోని ప్రభాకర్‌రెడ్డి కార్యాలయానికి వెళ్లారు. అతడి ఆత్మహత్యకు సంబంధించి కీలక ఆధారాలు దొరికే అవకాశముందని భావిస్తున్నారు. ప్రభాకర్‌రెడ్డి సెల్‌ఫోన్‌ను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల సెల్ఫోన్ల గురించి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మిగతావారి సెల్ఫోన్లను ప్రభాకర్‌రెడ్డి కావాలనే మాయం చేసినట్టు పోలీసులు గుర్తించారని సమాచారం. ప్రభాకర్‌రెడ్డికి సంబంధించిన ఆర్థిక లావాదేవిల గురించి కుటుంబ సభ్యులు, బంధువులను అడిగి తెలుసుకుంటున్నారు. షేర్ మార్కెట్ వ్యాపారంలో నష్టపోయాడు, ఎంతమంది పేర్లతో షేర్ ఖాతాలు నిర్వహిస్తున్నాడనే వివరాలు ఆరా తీస్తున్నారు. అశోక్‌నగర్‌లోని ప్రభాకర్‌రెడ్డి ఇంటి నుంచి ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ప్రభాకర్‌రెడ్డి కారులో ప్రయాణించిన మార్గాల్లో సీసీ కెమెరాల ఫుటేజీని నార్సింగి పోలీసులు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఉన్న కొల్లూరు సమీపంలో ప్రభాకర్‌రెడ్డి, ఆయన భార్య, కొడుకు, పిన్ని, ఆమె కూతురు విగతజీవులుగా పడివుండటాన్ని మంగళవారం గుర్తించారు. తనతోపాటు ఉన్న నలుగురికి విషమిచ్చి తర్వాత ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. షేర్ల మార్కెట్లో వచ్చిన నష్టాల కారణంగానే ప్రభాకర్‌రెడ్డి ఈ దారుణానికి పాల్పడినట్టు భావిస్తున్నారు. -
‘ఏం జరిగిందో పోలీసులే చెప్పాలి’
-
‘ఏం జరిగిందో పోలీసులే చెప్పాలి’
హైదరాబాద్: నగర శివార్లలోని కొల్లూరు సమీపంలో వెలుగుచూసిన ఐదుగురి మృతి కేసులో దర్యాప్తు చేపట్టామని డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు. మృతులు పటాన్చెరు అమీన్‌పూర్‌కు చెందిన ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులుగా గుర్తించామన్నారు. వీరికి మృతికి కారణాలు ఇంకా తెలియలేదన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు చూడటానికి వెళ్తున్నట్టు చెప్పి కారులో వెళ్లారని వెల్లడించారు. ప్రభాకర్‌రెడ్డి, ఆయన బంధువు రవీందర్‌రెడ్డి, అతడి భార్య లక్ష్మికి డిమాట్ ఖాతాలున్నాయని.. వీటి ద్వారా రూ. కోటి 30 లక్షల విలువైన షేర్లు కొనుగోలు చేసినట్టు తెలిపారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో మంగళవారం ఐదు మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతులు రెండు కుటుంబాలకు చెందినవారిగా గుర్తించారు. వీరు ఆత్మహత్య చేసుకున్నారా, ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తన కొడుకు షేర్ మార్కెట్ వ్యాపారం నిర్వహిస్తున్నాడని, ఇందులో నష్టాలు వచ్చాయని ప్రభాకర్‌రెడ్డి తండ్రి మహిపాల్‌రెడ్డి తెలిపారు. ఆర్థిక లావాదేవిల కారణంగా కొంతకాలంగా బాధల్లో ఉన్నాడని, దసరాకు కూడా తమ ఇంటికి రాలేదని వెల్లడించారు. షేర్ మార్కెట్లో ఎలాంటి నష్టం వచ్చినా అధైర్యపడొద్దని చాలాసార్లు చెప్పినట్టు ప్రభాకర్‌రెడ్డి బంధువు రవీందర్‌రెడ్డి తెలిపారు. ‘నా వ్యాపారాన్ని ప్రభాకర్‌రెడ్డి, నా భార్య లక్ష్మి చూసుకుంటోంది. వ్యాపారంలో నష్టం వచ్చిన సంగతి నాకు తెలియదు. ఎంత నష్టం వచ్చినా ఆత్మహత్య చేసుకునే మనస్తత్వం ఆమెదికాదు. ప్రభాకర్‌రెడ్డి చాలా మంచి వ్యక్తి. ఏం జరిగిందో పోలీసులే చెప్పాలి. మేం ఆర్థికంగా నష్టాల్లో లేము. బాగానే ఉన్నామ’ని రవీందర్‌రెడ్డి చెప్పారు. -
ఓఆర్ఆర్ వద్ద యువతుల మృతదేహాలు
-
షాక్: ఓఆర్ఆర్ వద్ద అయిదు మృతదేహాలు..
సాక్షి, హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు సమీపంలోని ఇంద్రాణినగర్ వద్ద అయిదు గుర్తుతెలియని మృతదేహాలు బయటపడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఓఆర్ఆర్ సమీపంలోని నిర్మానుష్యప్రాంతంలో ఇద్దరు పురుషులు, ఇద్దరు యువతులు(22), ఒక మహిళ(40) మృతదేహాలను గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో భార్యాభర్తలు, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు నిర్దారించారు. మృతులను పటాన్చెరు అమీన్పూర్ కు చెందిన ప్రభాకర్ రెడ్డి కుటుంబంగా గుర్తించారు. మృతులు.. ప్రభాకర్ రెడ్డి, మాధవి, హిందూజా, లక్ష్మీ, వర్షిత్ రెడ్డి. శ్రీశైలం వెళ్తున్నట్లు చెప్పిన వారు.. శవమై కనిపించారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా రెండ్రోజుల క్రితం పటాన్చెరువు పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసుగా నమోదైనట్లు సమాచారం. మూడు రోజుల క్రితం వీరంతా ఎపీ 28 DM 3775 కారులో బయలుదేరారు. వీరెక్కడికి వెళ్లారో తెలియక బంధువులు పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశారు. మూడు రోజులుగా వీరంతా ఎక్కడికి వెళ్లారు అన్నది మిస్టరీగా మారింది. ఆర్థిక కారణాలు వల్లే వారు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. కొల్లూరు సమీపంలో మృతదేహాలు కలకలం -
శారీరక వాంఛ తీర్చలేదని...
- బండరాయితో కొట్టి... కత్తితో గొంతు కోసిన కిరాతకుడు - గండిపేటలో మైనర్ బాలిక హత్య కేసు నిందితుడి అరెస్టు హైదరాబాద్: గండిపేట చెరువు ప్రాంతంలో ఆదివారం జరిగిన మైనర్ బాలిక హత్య కేసును నార్సింగ్ పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. శారీరక వాంఛ తీర్చేందుకు నిరాకరించడంతో బాలికను బండరాయితో కొట్టి... గొంతు కోసి చంపిన చాంద్రాయణగుట్ట కూరగాయల వ్యాపారి అక్బర్(25)ను సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పట్టుకున్నారు. కేసు వివరాలను నార్సింగ్ ఇన్స్పెక్టర్ రాంచందర్‌రావు, రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డితో కలిసి శంషాబాద్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ నార్సింగ్ ఠాణాలో సోమవారం మీడియాకు వెల్లడించారు. డబ్బు కోసం ఎర: బండ్లగూడలో నిందితుడు అక్బర్, మృతురాలి తండ్రి కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. దీంతో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. దుబాయ్‌లో పనిచేస్తున్న బాలిక తండ్రి సోదరులిద్దరూ... డబ్బులను అక్బర్ బ్యాంక్ ఖాతాకు పంపిస్తుండేవారు. ఆ డబ్బును అక్బర్ మృతురాలి తండ్రికి ఇస్తుండేవాడు. ఐదు నెలల కిందట అక్బర్‌కు పెళ్లైంది. కాగా, ఇటీవల బాలిక తండ్రి సెకండ్ హ్యాండ్ కారు ఉంటే చూడమని అక్బర్‌కు చెప్పాడు.ఈ క్రమంలో అతడి వద్ద నుంచి డబ్బు గుంజవచ్చని భావించిన అక్బర్... బాలిక తండ్రి కుటుంబానికి దగ్గరయ్యాడు. 9వ తరగతి చదువుతున్న అతని 14 ఏళ్ల అతని కుమార్తెతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానని నమ్మించి ఇంట్లో నుంచి డబ్బులు తీసుకొస్తే ఎక్కడికైనా వెళ్లిపోదామని బాలికను మభ్యపెట్టాడు. రూ.40వేల నగదు, 2 తులాల బంగారు ఆభరణాలు వెంట తెచ్చుకున్న బాలికను ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో నంబర్ ప్లేట్ లేని పల్సర్ బైక్‌పై ఎక్కించుకొని గండిపేట చెరువువైపు వెళ్లాడు. నార్సింగ్ రోడ్డుకు కొంతదూరంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి శారీరక వాంఛ తీర్చమని బలవంత పెట్టాడు. ఆమె నిరాకరించింది. విషయం ఎవరికన్నా తెలిస్తుందన్న భయంతో అక్కడున్న రాయితో తలపై కొట్టాడు. చున్నీతో చేతులు కట్టేసి బండ రాయితో మోదాదు. రక్తంలో కొట్టుమిట్టాడుతున్న బాలిక... డబ్బులు, నగలు అన్నీ ఇచ్చేస్తానని, తనను ఆసుపత్రికి తీసుకెళ్లమని ఎంత ప్రాథేయపడినా కిరాతకుడు కనికరించలేదు. వెంట ఉన్న కూరగాయల కత్తితో బాలిక గొంతు కోశాడు. చనిపోయిందని నిర్ధారించుకున్నాక... డబ్బు, నగలుతో బైక్‌పై అక్బర్ ఇంటికి వెళ్లిపోయాడు. సీసీ కెమెరాలతో చిక్కాడు నార్సింగ్ గండిపేట ప్రధాన రహదారిలో అమర్చిన సీసీకెమెరాల్లో అక్బర్, మృతురాలు బైక్‌పై వెళ్లిన దృశ్యాలు చిక్కాయి. నిందితుడి ఫొటోను పోలీసు వాట్సప్ గ్రూప్‌ల్లో అందరికీ పంపించి అప్రమత్తం చేశారు. అదే సమయంలో తన కూతురు కనిపించడం లేదని బాలిక తండ్రి ఆదివారం రాత్రి ఫిర్యాదు చేశారు. అతడి సమాచారంతో అక్బర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.40వేల నగదు, రెండు తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. -
ఫర్హానా, అఫ్షాలకు 14 రోజుల రిమాండ్
హైదరాబాద్: మాజీ నక్సలైట్, గ్యాంగ్‌స్టర్ నయీం ఇంటి వంటమనిషి ఫర్హానా, నయీం డ్రైవర్ భార్య అఫ్షాలకు రాజేంద్రనగర్ కోర్టు 14 రోజుల రిమాండ్‌ను విధించింది. నల్లగొండ జిల్లాలో జరిగిన ఓ హత్య కేసులో ఘర్హానా నిందితురాలు. దాంతో ఆమెను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో నార్సింగ్ పోలీసులు నిందితుల కస్టడీ పిటిషిన్ దాఖలు చేశారు. నయీమ్ ఇంట్లో వంటమనిషిగా పనిచేస్తున్న ఫర్హానా, డ్రైవర్ భార్య అఫ్షాలు డెన్ కీపర్లుగా వ్యవహరిస్తున్నట్టు పోలీసులు కోర్టుకు తెలిపారు. నయీం డెన్ నుంచి భారీగా ఆయుధాలు, మందు గుండు సామాగ్రి, నగదు, నగలు స్వాధీనం చేసుకున్నట్టు కోర్టుకు విన్నవించారు. కాగా, నయీం అంత్యక్రియలు నల్లగొండ జిల్లా భువనగిరిలో ఈ రోజు జరుగనున్నట్టు తెలుస్తోంది. -
ఎవరబ్బాయో..!
నాటకీయ పరిణామాల మధ్య వీరబల్లి పోలీసులకు దొరికిన బాలుడు తమ బిడ్డేనంటూ తిరుపతి, హైదరాబాద్ దంపతుల పోటీ కడప ఐసీడీఎస్ అధికారుల సంరక్షణలో చిన్నారి కడప రూరల్ : ఓ బాలుడి ఉదంతం మిస్టరీగా మారింది. వివరాల్లోకి వెళితే.. వైఎస్ఆర్ జిల్లా వీరబల్లికి చెందిన ఈశ్వరయ్య, ప్రభావతి దంపతులకు పిల్లలు లేకపోవడంతో గత ఆదివారం వైద్య పరీక్షల నిమిత్తం తిరుపతికి వెళ్లి, ఓ బాలుడిని వెంట తెచ్చుకున్నారు. ఈ సంఘటన గ్రామంలో చర్చనీయాంశం కావడంతో గురువారం పోలీసులు రంగప్రవేశం చేసి బాలుడిని స్వాధీనం చేసుకుని కడప ఐసీడీఎస్ అధికారులకు అప్పజెప్పారు. ఇదిలా ఉండగా ఆ బాలుడు తమ కుమారుడేనని పేర్కొంటూ హైదరాబాద్‌కు చెందిన వడ్డె వెంకటయ్య, మణెమ్మ దంపతులు శుక్రవారం ఐసీడీఎస్ అధికారులను సంప్రదించారు. తమ కుమారుడైన అరుణ్ గత జనవరి 5వ తేదీన పిల్లలతో బయట ఆడుకుంటుండగా ఎవరో ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. ఈ విషయమై స్థానిక నార్సింగ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు కూడా చేశామన్నారు. అయితే అదే సమయంలో తిరుపతికి చెందిన లక్ష్మి, చందు అలియాస్ బాషా దంపతులు ఆ పిల్లాడు తమ కుమారుడు దీపక్‌గా చెబుతూ అధికారుల వద్దకు వచ్చారు. తన భార్యకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో వైద్యం కోసం ఆదివారం తిరుపతి రుయా ఆస్పత్రికి వెళ్లామన్నారు. బయట ఉన్న వృద్ధుడి వద్ద పిల్లాడిని వదిలి లోపలికి వెళ్లి తిరిగివచ్చేసరికి పిల్లాడు కనిపించ లేదన్నారు. దీనిపై స్పందిస్తూ బాలుడిపై సమగ్రంగా విచారణ చేపడతామని, అవసరమైతే డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగిస్తామని ఐసీడీఎస్ పీడీ రాఘవరావు తెలిపారు.