టాలీవుడ్‌లో రాజ్ తరుణ్- లావణ్య వివాదం రోజుకొక మలుపు తీసుకుంటుంది. రాజ్ తరుణ్ తనను నమ్మించి మోసం చేశాడని పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది. దీంతో ఒక్కసారిగా వారి టాపిక్ పెద్ద దుమారం రేగింది. ఇప్పటికే ఇరువురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. పలువురు హీరోయిన్లతో రాజ్ తరుణ్‌కు రిలేషన్ ఉందని లావణ్య ఆరోపించింది. అయినా తనకు రాజ్ తరుణ్ అంటే చాలా ఇష్టమని అతనితో కలిసి జీవించాలని ఉందంటూ ఆమె కోరింది.
రాజ్ తరుణ్- లావణ్య వివాదంలో పోలీసుల ద్వారా విచారణ జరుగుతున్న తరుణంలో కీలకమైన ట్విస్ట్ చోటుచేసుకుంది. రాజ్ తరుణ్‌పై ఫిర్యాదు చేసిన లావణ్య తన అడ్వకేట్‌తో వాట్సప్ చాటింగ్ చేసింది. ఈ ప్రపంచం నుంచి వెళ్లిపోతున్నట్లు ఆయనకు మెసేజ్ పెట్టింది. దీంతో సదరు అడ్వకేట్ వెంటనే ఆ విషయాన్ని నార్సింగ్ పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ పోలీస్ హెల్ప్ లైన్ నంబర్‌కు లావణ్య ఫోన్ చేసింది. తాను చనిపోతున్నట్లు వారితో తెలిపింది. తన చావుకు హీరోయిన్ మాల్వీ మల్హౌత్రాతో పాటు రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులే కారణమని లావణ్య తెలిపింది. ప్రస్తుతం ఆమె నంబర్ కూడా పనిచేయడం లేదని తెలుస్తోంది.
లావణ్య ఫిర్యాదుతో రాజ్ తరుణ్‌పై నార్సింగి పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రాజ్ తరుణ్‌ని ఏ1, మాల్వీ మల్హోత్రా ఏ2, ఆమె సోదరుడు మయాంక్ మల్హోత్రా ఏ3గా పోలీసులు చేర్చారు. వీరిపై 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా తెలిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment