
సాక్షి, హైదరాబాద్: టీడీపీ నేత మాగంటి బాబుకు మరోసారి షాక్ తగిలింది. పోలీసులపై దాడి కేసులో మాగంటి బాబుకు సైబరాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. 41ఏ సీఆర్‌పీసీ కింద సైబరాబాద్ పోలీసులు నోటీసులు అందజేశారు.
అయితే, సెప్టెంబర్ 16వ తేదీన తన అనుచరులతో కలిసి మాగంటి బాబు హైదరాబాద్‌లోని ఓఆర్‌ఆర్‌పై హంగామా చేశారు. అక్కడ విధుల్లో ఉన్న సీఐ, ఎస్‌ఐతో సహా పోలీసు సిబ్బందితో ఘర్షణకు దిగారు. వారి అంతుచూస్తానంటూ బహిరంగంగానే రెచ్చిపోయారు. దీంతో, పోలీసులకు విధులకు ఆటంకం కలిగించారన్న కారణంగా నార్సింగి పోలీసులు 41A CRPC కింద నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. ఘర్షణ జరిగిన రోజునే పోలీసులు.. మాగంటి బాబుపై కేసు నమోదు చేశారు. ఇక, తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చారు.
ఇది కూడా చదవండి: అధికారంలో బీఆర్‌ఎస్ లేకపోతే జరిగేది అదే: కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment