Maganti Babu
-
టీడీపీ నేత మాగంటి బాబుకు బిగ్ షాక్
సాక్షి, హైదరాబాద్: టీడీపీ నేత మాగంటి బాబుకు మరోసారి షాక్ తగిలింది. పోలీసులపై దాడి కేసులో మాగంటి బాబుకు సైబరాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. 41ఏ సీఆర్పీసీ కింద సైబరాబాద్ పోలీసులు నోటీసులు అందజేశారు. అయితే, సెప్టెంబర్ 16వ తేదీన తన అనుచరులతో కలిసి మాగంటి బాబు హైదరాబాద్‌లోని ఓఆర్ఆర్పై హంగామా చేశారు. అక్కడ విధుల్లో ఉన్న సీఐ, ఎస్ఐతో సహా పోలీసు సిబ్బందితో ఘర్షణకు దిగారు. వారి అంతుచూస్తానంటూ బహిరంగంగానే రెచ్చిపోయారు. దీంతో, పోలీసులకు విధులకు ఆటంకం కలిగించారన్న కారణంగా నార్సింగి పోలీసులు 41A CRPC కింద నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. ఘర్షణ జరిగిన రోజునే పోలీసులు.. మాగంటి బాబుపై కేసు నమోదు చేశారు. ఇక, తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చారు. ఇది కూడా చదవండి: అధికారంలో బీఆర్ఎస్ లేకపోతే జరిగేది అదే: కేటీఆర్ -
కోకాపేట వద్ద టీడీపీ నేత మాగంటిబాబు ఓవరాక్షన్
-
టీడీపీ నేత మాగంటి బాబు పై కేసు నమోదు
హైదరాబాద్ : టీడీపీ నేత మాగంటి బాబు పై కేసు నమోదు. పోలీస్ విధులకు ఆటంకం కలిగించారన్న సెక్షన్ పై కేసులు. కోకాపేట్ ORR నియో పోలీస్ వద్ద పోలీసులపై దౌర్జన్యం. Orrపై వెళ్లకుండా టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబుతో పాటు మరికొంత మందిని అడ్డుకున్న పోలీసులు. పోలీస్‌లను తోసేసి అనుచరులతో నానా హంగామా చేసిన మాజీ ఎంపీ మాగుంటబాబు. ఎస్సై, సిఐలను మీ అంతుచూస్తానని బెదిరింపులు. పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన TDP నేతలు. నార్సింగ్ పిఎస్ లో IPC సెక్షన్ 353 కింద కేసు నమోదు -
టీడీపీ నేత మాగంటి బాబు అనుచరుల ఓవరాక్షన్
గుడివాడ: టీడీపీ నేత మాగంటి బాబు అనుచరులు ఓవరాక్షన్ చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి దిగి హల్చల్ చేశారు. ఓ వైఎస్సార్సీపీ కార్యకర్త బైక్‌కు పెట్టుకున్న జెండాను పీకేసి టీడీపీ మూకలు..కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. వైఎస్సార్సీపీ జెండా కట్టుకుని బైక్‌పై వెళతున్న పార్టీ కార్యకర్తను భయభ్రాంతులకు గురి చేశారు. ఈ క్రమంలో బైక్‌కు కట్టిన జెండాను పీకేశారు. దీన్ని అడ్డుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. శరత్ థియేటర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బందరు సభ అట్టర్ ప్లాప్‌తో డుడివాడలో అల్లర్లకు టీడీపీ ప్లాన్ చేసిందనడానికి ఈ ఘటనే ఉదాహరణగా నిలుస్తోంది. అల్లర్ల ద్వారా ఏదో జరుగుతున్నట్లు ప్రచారానికి తెరలేపింది టీడీపీ. -
రైతుల ముసుగులో టీడీపీ నేతల హల్చల్
గుడివాడ: రైతుల ముసుగులో టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. శనివారం సాయంత్రం అమరావతి రైతుల మహా పాదయాత్ర కృష్ణా జిల్లా గుడివాడకు చేరుకుంది. స్థానిక శరత్ థియేటర్ వద్ద ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయం వద్దకు రాగానే టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. కవ్వింపుగా ఈలలు, కేకలు వేశారు. అదే సమయంలో ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు అక్కడికి చేరుకుని, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని) కటౌట్‌కు చెప్పు చూపించటంతో వైఎస్సార్సీపీ కార్యాలయం లోపల ఉన్న పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు. ఇరువర్గాల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. అంతలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు వారిని విదదీసి.. రోప్ పార్టీతో అడ్డుగా నిలిచాయి. అయినప్పటికీ, పాదయాత్రలో పాల్గొన్న మహిళలు తొడలు కొడుతూ చిందులు వేశారు. వచ్చాం.. వచ్చాం.. గుడివాడకు వచ్చాం.. అంటూ నినాదాలు చేస్తూ చప్పట్లు కొడుతూ.. కేకలు వేస్తూ ముందుకు సాగారు. తాము ఎందుకు యాత్రగా వచ్చామో చెప్పకుండా గుడివాడ ప్రజలను రెచ్చగొట్టేలా మహిళలు గోల చేసిన తీరును చూసి ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. టీడీపీ గుడివాడ ఇన్చార్జి రావి వెంకటేశ్వరరావు వర్గీయులు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జి వర్గీయులు వేర్వేరుగా బల ప్రదర్శన చేస్తూ తమ ప్రాబల్యం చాటుకునేందుకు యత్నించారు. కాగా, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. హౌస్ అరెస్ట్ నుంచి తప్పించుకుని గుడివాడ చేరుకున్నారు. మార్కెట్ యార్డ్ వద్ద పోలీసులు అడ్డుకోగా.. వారి కళ్లుగప్పి ఓ కార్యకర్త బైక్ ఎక్కి పాదయాత్ర ప్రాంతానికి వచ్చారు. ఈ తంతు మొత్తాన్ని ఆయన తన అనుచరుడి ద్వారా వీడియో తీయించుకుని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయించారు. -
గుడివాడలో టీడీపీ నేతల ఓవరాక్షన్.. చెప్పు చూపిస్తూ రెచ్చిపోయిన మాగంటి బాబు
సాక్షి, కృష్ణా జిల్లా: అమరావతి పేరిట చేపట్టిన పాదయాత్రలో టీడీపీ నేతలు ఓవరాక్షన్ చేశారు. గుడివాడలో వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద వాహనం నిలిపి పాటలు పాడే యత్నం చేశారు. పోలీసులు వారించినా వినకుండా టీడీపీ నేతలు దురుసుగా ప్రవర్తించారు. కొడాలి నానికి చెందని శరత్ సినిమా థియేటర్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత మాగంటి బాబు చెప్పు చూపిస్తూ రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టడమే లక్ష్యంగా టీడీపీ నేతల డైరెక్షన్ సాగుతున్న పాదయాత్రలో ఆ పార్టీ నేతలకు అనుకూలంగా నినాదాలు చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. చదవండి: (అచ్చెన్నకు లోకేష్‌తో చెడిందా?.. చినబాబుకు కళా అందుకే దగ్గరవుతున్నారా?) -
టీడీపీ మాజీ ఎంపీ మాగంటి తనయుడు కన్నుమూత
సాక్షి, పశ్చిమగోదావరి: ఏలూరు మాజీ పార్లమెంట్ సభ్యులు, టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ ఆదివారం రాత్రి మృతి చెందారు. కొద్దిరోజులుగా ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం విజయవాడలోని ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి కన్నుమూశారు. కాగా, రాంజీ శరీర అవయవాలను దానం చేయుటకు కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం భౌతికకాయాన్ని సోమవారం ఉదయం ఏలూరులోని నివాసానికి తరలించనున్నారు. -
ఆ రూ.1.92 కోట్లు నావే: మాగంటి బాబు
సాక్షి, అమరావతి బ్యూరో: సార్వత్రిక ఎన్నికల సమయంలో పోలీసులకు పట్టుబడిన రూ.1.92 కోట్లు తనదేనని మాజీ ఎంపీ మాగంటి బాబు క్లెయిమ్ చేసుకున్నారు. అది చేపలు అమ్మగా వచ్చిన ఆదాయమని.. ఆ మొత్తాన్ని రిలీజ్ చేసి తనకు ఇప్పించాలని కోరుతూ విజయవాడ పోలీస్ కమిషనర్‌కు మాగంటి విజ్ఞప్తి చేశారు. వివరాల్లోకి వెళితే.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. ఏప్రిల్ 10వ తేదీన సిమెంట్ లోడు లారీలో తరలిస్తున్న రూ.1,92,90,500 నగదును విజయవాడ పటమట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జగ్గయ్యపేట నుంచి ఏలూరు వెళ్తున్న లారీని కామినేని ఆస్పత్రి సమీపంలో చెక్‌పోస్టు వద్ద తనిఖీ చేశారు. అందులో సిమెంట్ బస్తాల మధ్య రెండు బాక్స్‌లు ఉండటాన్ని గమనించి వాటిని తెరిచి చూడగా.. భారీ నగదు కనిపించింది. ఈ సమయంలో అదే లారీలో ప్రయాణిస్తున్న మాగంటి అనుచరుడు పరారయ్యాడు. డ్రైవర్ కోగంటి సతీష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తనకేమీ తెలియదని.. ఆ డబ్బును ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి కోసం తీసుకెళ్తున్నట్టు తనతోపాటు లారీలో వచి్చన యువకుడు చెప్పాడని డ్రైవర్ వాంగ్మూలం ఇచ్చాడు. ఎలాంటి ఆధారాలు, పత్రాలు లేకుండా తరలిస్తున్న ఆ మొత్తాన్ని అప్పట్లో విజయవాడ నగర పోలీసులు సీజ్ చేసి ఆదాయ పన్ను శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రెండు రోజుల క్రితం నగర పోలీస్ కమిషనర్‌ను కలిసిన మాగంటి బాబు ఆ సొమ్ము మొత్తం తనదేనని, చేపల్ని విక్రయించగా సమకూరిందని తెలిపారు. ఇందుకు సంబంధించిన లావాదేవీ పత్రాలను ఆదాయ పన్ను శాఖ అధికారులకు చూపగా రూ.64 లక్షల పన్ను విధించారని వివరించారు. పన్ను చెల్లించిన దృష్ట్యా సీజ్ చేసిన డబ్బును తనకు ఇప్పించాలని కోరారు. మాగంటి బాబు చెబుతున్నట్టుగా ఆ డబ్బు సక్రమంగా సంపాదించిందే అయితే రూ.64 లక్షలను ఆదాయ పన్ను, అపరాధ రుసుంగా ఎందుకు చెల్లించాల్సి వచి్చందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చేపల విక్రయం ద్వారానే అంత ఆదాయం వచి్చనా.. పన్నులేవీ చెల్లించకుండా రహస్యంగా ఎందుకు తరలించాల్సి వచి్చందనే ప్రశ్నలూ వినిపిస్తున్నాయి. పోలీసులు కనబడగానే మాగంటి అనుచరుడు పరారవటం కూడా అనుమానాలకు తావిస్తోంది. -
ఏలూరు ఎంపీ మాగంటి బాబుకు ఓటమి తప్పదా?
-
బెజవాడలో ‘బొండా’.. అవినీతి కొండ
సాక్షి, విజయవాడ : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ నాయకుల అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించారు. నియోజకవర్గం మొత్తం కనుసైగతో శాసించేవారు. అధికారంలోకి వచ్చింది మొదలు భూకబ్జాలు, దందాలు, దౌర్జన్యాలతో విచ్చలవిడిగా అక్రమాలు చేపట్టారు. వీటిని అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం కూడా ఆయన అవినీతికి పచ్చ జెండా ఊపింది. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా రూ.వందల కోట్లు విలువైన భూమిని దర్జాగా కబ్జా చేశారు. ఏదైనా పని జరగాలన్నా.. కాంట్రాక్టు దక్కాలన్నా ఆయన అనుమతి కావాల్సిందే. వీరికి కప్పం కట్టందే ఏ వ్యవహారం నడవదు. కాంట్రాక్టు పనైనా, ఉద్యోగమైనా ఏదైనా నగదు ముట్టజెప్పితే ఎలాంటి వ్యవహారమైన క్షణాల్లో సెటిల్ చేసేస్తారు. అధికారం అండతో ఐదేళ్లుగా బొండా ఉమామహేశ్వరరావు అక్రమ దందా కొనసాగించి రూ.కోట్లు కొల్లగొట్టారు. అక్రమాలు, అరాచకాలు కండ్రిక కాలనీలో జర్నలిస్టులకు ఇళ్ల పేరుతో ఎమ్మెల్యే అతని అనుచరులు కార్పొరేషన్‌కు చెందిన 1720 గజాల స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేసేందుకు ప్రయత్నిం చారు. స్థానికుల ఆందోళనతో వెనక్కుతగ్గారు. 43వ డివిజన్లోని దుర్గాగ్రహారంలో క్యాన్సర్ బా«ధితురాలు మాదంశెట్టి సాయిశ్రీకి చెందిన అపార్ట్మెంట్ ఫ్లాట్‌ను ఎమ్మెల్యే అనుచరులు కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే ఉమా వెనుక ఉండి తన అనుచరులతో దౌర్జన్యం చేయించినట్లు సమాచారం. బొండా ఉమా ప్రధాన అనుచరుడు, కార్పొరేటర్ నందెపు జగదీష్ పాయకాపురంలో కళ్లం విజయలక్ష్మి, లంకిరెడ్డి సాంబిరెడ్డికి చెందిన సర్వే నెం.62/1, 62/2లో 0.49 సెంట్ల భూమికి సంబంధించి తప్పుడు వీలునామా సృష్టించి, తన పేర, తన కుటుంబ సభ్యుల పేరుతో భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. బాధితులు కోర్టులో కేసు వేయడంతో దిగువ కోర్టులో కార్పొరేటర్ కేసు ఉపసంహరించుకున్నాడు. ఈ కబ్జా వ్యవహారం వెనుక ఉమా హస్తం ఉంది. స్థలం ప్రస్తుతం యజమాని చేతిలో ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్స్ రద్దు కాలేదు. ఈ స్థలం విలువ రూ.10 కోట్లు ఉంటుంది. నందెపు జగదీష్ తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. తెనాలికి చెందిన సుబ్బు అనే రౌడీ షీటర్‌తో బొండా ఉమామహేశ్వరరావు సంబంధాలు కొనసాగించారు. సుబ్బు హైదరాబాద్‌లో తుపాకీ కొనుగోలు చేస్తూ బొండా, మరికొందరు టీడీపీ నాయకుల పేర్లు చెప్పారు. తెలంగాణ పోలీసులు సుబ్బుపై అక్రమ ఆయుధాల కేసు నమోదు చేశారు. ఆ తర్వాత విజయవాడలోని మాచవరంలో రౌడీ షీటర్ సుబ్బు పట్టపగలు దారుణహత్యకు గురయ్యారు. ఈ కేసులో అధికార పార్టీ నేతల పేర్లు బయటకు రాకుండా పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగినట్లు సృష్టించారు. ట్రాన్స్‌పోర్టు కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంపై ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని నాని దాడికి యత్నించారు. అడ్డుగా వచ్చిన బాలసుబ్రహ్మణ్యం గన్‌మెన్‌పై దాడి చేశారు. సత్యనారాయణపురంలోని కల్యాణ మండపాన్ని అధికార పార్టీ నాయకులు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిం చి విఫలమయ్యారు. బ్రాహ్మణ సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళన చేయడంతో వెనక్కుతగ్గారు. న్యూరాజరాజేశ్వరీపేటలోని అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు ఎదురుగా ఉన్న స్వాతంత్ర సమరయోధులకు సంబంధించిన స్థలాన్ని ఎమ్మెల్యే బొండా ఉమా ఆక్రమించేందుకు ప్రయత్నించారు. పాయకాపురంలో రవీంద్ర థియేటర్ పక్కన ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన రూ.కోట్ల విలువైన భూములను తన ప్రధాన అనుచరుడు.. కార్పొరేటర్ జగదీ‹ష్‌తో కలిసి కాజేసేందుకు చూశారు. పాయకాపురం బర్మాకాలనీ ప్రాంతానికి చెందిన దాదాపు మూడు ఎకరాల వరకూ ఉన్న ఆ కాలనీ కామన్ సైట్‌ను తన అనుచరులతో ఆక్రమించి, వాటికి ఇంటి పట్టాలను సైతం పుట్టిం చేందుకు యత్నించారు. స్థానికులు అడ్డం తిరగడంతో తోకముడిచారు. అనుయాయుల తీరు అంతే.. ఇందిరానాయక్ నగర్లో బుడమేరుకు అనుకుని ఉన్న ఓ వ్యక్తి స్థలంలో నిర్మించిన ప్రహరీని దౌర్జన్యంగా కూలగొట్టి ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఇందులోనూ ఎమ్మెల్యే అనుచరుల పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే అనుచరుల్లో ఒకరు గతంలో ఓ ఉపాధ్యాయురాలిని బెదిరించారు. అతను సివిల్ సప్లయ్ కార్యాలయంలోనూ చక్రం తిప్పి అక్రమాలకు పాల్పడ్డాడు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఘంటా కృష్ణమోహన్ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు. ఇతను ఓ వివాహితను లోబరచుకున్నాడు. ఆ రాసలీలల వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం పూర్తిగా ఎమ్మెల్యే అనుచరుల కనుసన్నల్లోనే పనిచేస్తుంటాయి. రికార్డులు తారుమారు చేసి, సదరు భూములను అనుచరుల పేర రిజిస్ట్రేషన్ చేయించిన దాఖలాలు ఉన్నాయి. సింగ్‌నగర్ ప్రాంతంలో వందల కొద్ది అపార్టుమెంట్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇక్కడ ఏ నిర్మాణం చేపట్టాలన్నా కార్పొరేటర్లు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. కమర్షియల్ కాంప్లెక్స్‌లైతే రూ.10 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. వీటిలో ఎమ్మెల్యేకు వాటా వెళుతోంది. జాగా కనిపిస్తే పాగా ఎమ్మెల్యే బొండా, తన అనుయాయులైన కార్పొరేటర్లు అందిన కాడికి దోచుకోవటమే పరమావధిగా పనిచేస్తున్నారు. రామకృష్ణాపురం బుడమేరులో బొండా ఉమా అనుచరులు, టీడీపీ డివిజన్ అధ్యక్షుడు కలిసి వెంచర్ వేసి విక్రయించారు. స్థానిక టీడీపీ నేతలు కూడా బుడమేరులోపలకి ఇళ్లు నిర్మించి విక్రయిస్తున్నారు. ముత్యాలంపాడులో ఇరిగేషన్ స్థలాన్ని టీడీపీ నేత కుమారుడు వ్యాయామశాల పెట్టుకోవడానికి ధారాదత్తం చేశారు. 44వ డివిజన్లో కార్పొరేటర్ రైల్వే, ప్రభుత్వ స్థలాలను సైతం విక్రయించారు. సదరు కార్పొరేటర్ హౌస్‌ఫర్ ఆల్ ఇళ్లను సైతం యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. తాజాగా 46వ డివిజన్ అంబేడ్కర్ కాలనీలో కాల్వగట్టు స్థలాన్ని వ్యాయామశాల కోసం ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. సింగ్‌నగర్‌లో కోట్ల విలువైన భూమి.. మాగంటి బాబు.. ఎమ్మెల్యే బొండా ఉమాకు అత్యంత సన్నిహితుడు. స్వాతంత్య్ర సమరయోధుని భూమిని తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారిలో ఎమ్మెల్యే బొండా ఉమా భార్య సుజాతతో పాటు మాగంటి బాబు కూడా ఉన్నారు. ఎమ్మెల్యే బొండా ఉమాకు అన్ని దందాల్లోనూ మాగంటి బాబే కీలకంగా వ్యవహరిస్తుంటారన్నది బహిరంగ రహస్యమే. తాజాగా విజయవాడ సింగనగర్లోని రూ.30 కోట్లు భూదందాలో కూడా ఆయనే కీలక పాత్రధారి కావడం గమనార్హం. వాస్తవానికి ఆ భూమిని 2005లోనే 21 మంది సామాన్యులు ప్లాట్లు రూపంలో కొనుగోలు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం భూముల ధరలు అమాంతంగా పెరగడంతో ఆ భూమి మార్కెట్ విలువ రూ.30 కోట్లకు చేరుకుంది. దీంతో టీడీపీ నేతల కన్ను ఆ భూమిపై పడింది. ఎమ్మెల్యే బొండా ఉమాకు అత్యంత సన్నిహితుడైన మాగంటి బాబుతోపాటు మరికొందరు ఆ భూమి తమదంటూ కొత్త వాదనను లేవదీశారు. మాగంటి బాబు, మరికొందరు 2015లో ఆ భూమిలోకి ప్రవేశించి ప్లాట్లుగా వేసి ఉన్న హద్దు రాళ్లను తొలగించేశారు. తమ భూమిలో ఇతరులు ప్రవేశించడంపై ఆ 21 మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా తాము ఆ భూమిని 2007లోనే కొనుగోలు చేశామని కొన్ని పత్రాలు చూపించ డంతో వారు హతాశులయ్యారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో సింగ్‌నగర్ పోలీసులు ఆ భూమి ఆక్రమణదారులపై కేసు నమోదు చేయాల్సివచ్చింది. కానీ వారంతా బొండాకు సన్నిహితులు కావడంతో పోలీసులు వారికే కొమ్ముకాస్తుండటం గమనార్హం. అసలు యజమానులు ఎన్నిసార్లు ఆ భూమిలో హద్దురాళ్లు పాతుతున్నా వెంటనే తొలగిస్తున్నారు. ఆ భూమిని చదును చేయాలని భావిస్తుంటే అడ్డుకుంటున్నారు. భూమిలోకి అడుగుపెడితే సహించేది లేదని బెదిరిస్తున్నారు. -
వీడియో దుమారం: టీడీపీ ఎంపీల వివరణ
సాక్షి, ఏలూరు: హామీల సాధన పేరుతో చేస్తున్న డ్రామాలు, దొంగ దీక్షల వ్యవహారం బయటపడటంతో టీడీపీ ఎంపీలు నష్టనివారణ చర్యలకు దిగారు. తమ సంభాషణల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి దుమారం రేగడంతో వివాదాన్ని తగ్గించేందుకు మీడియా ముందుకు వచ్చారు. ఈ వీడియో మార్ఫింగ్ అని నమ్మబలికే ప్రయత్నం చేశారు. తమ మాటలను మార్ఫింగ్ చేసి కొందరు ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు. సరదాగా మాట్లాడిన మాటలను వక్రీకరించి ఈ రకంగా ప్రసారం చేయడం భావ్యం కాదని మండిపడ్డారు. ఇలాంటి వార్తలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇది కచ్చితంగా బీజేపీ పన్నిన కుట్రగా ఎంపీలు పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ది చెందుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు కితాబిచ్చిన విషయం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. రాయలసీమను రతనాల సీమగా చంద్రబాబు మార్చారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలోనూ బీజేపీ సొంతంగా గెలిచే పరిస్థితి లేదని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎంపీలు మురళీమోహన్, మాగంటి బాబు, గల్లా జయదేవ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: బరువు తగ్గాలి.. దీక్షలు చేద్దాం -
బాబు మోసం చేశారు..: టీడీపీ ఎంపీ
-
బాబు మోసం చేశారు.. ఏవిధంగానో మీకు తెలుసు: టీడీపీ ఎంపీ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ‘‘చంద్రబాబునాయుడు గారు మోసం చేశారు. ఏ విధంగా మోసం చేశారో మీకు తెలుసు. ఇటువంటి పరిణామాలు ఎదురవుతాయి కాబట్టి ప్రజలంతా ఒకతాటిపైకి రావాలి’’ ఈ మాటలన్నది ఏ ప్రతిపక్ష పార్టీ నేతో కాదు. తెలుగుదేశం ఎంపీ మాగంటి బాబు. శనివారం ఉదయం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండు సెంటర్లో ప్రత్యేక హోదా కోరుతూ ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంపైనా, ప్రధాని మోదీపైనా, బీజేపీపైనా నాయకులు విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాగంటి బాబు.. చంద్రబాబు మోసం చేస్తున్నారని ఊగిపోయారు. మోదీని విమర్శిస్తున్నాను అనే ఉద్దేశంలో రెచ్చిపోయారు. దీంతో అక్కడున్న నాయకులతో పాటు ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. ఏమైనా మాగంటి బాబు నిజాలే చెప్పారని అక్కడికి వచ్చిన వారు అనుకున్నారు. ఏలూరులో కూడా ఓ ‘పప్పు’ బ్యాచ్ తయారయిందని సెటైర్లు వేసుకోవడం కనిపించింది. -
రాజ్‌ఘాట్ వద్ద టీడీపీ ఎంపీల మౌన దీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ఇచ్చిన హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీడీపీ ఎంపీలు సోమవారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద మౌన దీక్ష చేపట్టారు. ఎంపీలు సుజనా చౌదరి, మాగంటి బాబు, జయదేవ్ తదితరులు మౌనదీక్ష చేపట్టారు. హామీల సాధనకు కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామని, బీజేపీ చేసిన మోసాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. -
ఎంపీ మాగంటి బాబు ఆఫీస్‌లో పేకాట.. ఎస్పీ ఆగ్రహం!
సాక్షి, కృష్ణా: తెలుగుదేశం ప్రభుత్వ జమానాలో మద్యం ఏరులై పారుతుండగా... జూదం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతోంది. సాక్షాత్తూ అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ తన కార్యాలయాన్ని పేకాట క్లబ్‌గా మార్చేసిన ఘటనగా తాజాగా కలకలం రేపుతోంది. ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావుకు చెందిన కృష్ణా జిల్లా కైకలూరు కార్యాలయంలో ఏడాదిన్నరగా పేకాట విచ్చలవిడిగా నడుస్తోంది. 5వేల రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జీగా వసూలు చేసి... కనీసం 5 లక్షల రూపాయలు తెచ్చినవారినే లోనికి అనుమతిస్తూ జూదం నిర్వహిస్తున్నారు. ఇందులో రోజుకు 12 కోట్ల రూపాయల వరకు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎంపీ మగంటి బాబు కార్యాలయంలో పేకాట కొనసాగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఎంపీ మగంటి తీరుపై సర్వత్రా విమర్శలు వెలువడుతున్నాయి. ఈ మేరకు 'సాక్షి' ప్రచురించిన కథనాలపై జిల్లా పోలీసులు స్పందించారు. ఎంపీ మాగంటి బాబు కార్యాలయానికి వెళ్లి విచారణ జరిపారు. నెలల తరబడి పేకాట శిబిరం నడుస్తున్నా.. ఎందుకు పట్టించుకోలేదని స్థానిక పోలీసులపై జిల్లా ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నూజివీడులో టీడీపీ వర్గ విభేదాలు
సాక్షి, నూజివీడు : కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గం పాత రావిచర్లలో బుధవారం ఉద్రిక్తత నెలకొంది. అధికార టీడీపీలోని ఎంపీ మాగంటి బాబు, నియోజకవర్గ ఇన్చార్జి ముద్రబోయిన వెంకటేశ్వరరావు వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. గ్రామకమిటీ అధ్యక్షుడిగా గతంలో ఎంపీ మాగంటి బాబు వర్గీయుడు మువ్వ శ్రీనివాస్ ఎన్నికయ్యాడు. అయితే దానిని వ్యతిరేకిస్తూ ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఇవాళ తన వర్గీయుడు దాసరి పంగిడేశ్వరరావును గ్రామకమిటీ అధ్యక్షుడిగా ప్రకటించారు. కాగా ఈరోజు సాయంత్రం ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం సందర్భంగా పాత రావిచర్లలో ముద్రబోయిన పర్యటన ఉంది. ఈ వివాదం తేల్చిన తరువాతే పర్యటనకు అంగీకరిస్తామంటూ ఎంపీ మాగంటి వర్గీయులు హెచ్చరికలు చేశారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తటంతో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. -
రాజీనామాలు తుస్సేనా?
సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి, ఏలూరు : చింతలపూడి నియోజకవర్గం టీడీపీ ప్రజాప్రతినిధులు చేసిన రాజీనామాల కథ కంచికి చేరినట్టేనా? ఇప్పటి వరకూ ఆ రాజీనామాలు ఆమోదించే విషయంలో పట్టుపట్టకపోవడంతో బ్లాక్మెయిల్ చేసేందుకే రాజీనామాలు చేసినట్లు స్పష్టం అవుతోంది. చింతలపూడి నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం ఎమ్మెల్యే పీతల సుజాత వర్గం, ఎంపీ మాగంటి బాబు తరపున సీనియర్ నేత ముత్తారెడ్డి ఆధ్వర్యంలోని వర్గం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. చింతలపూడి ఏఎంసీ చైర్మన్ పదవి తమ వర్గానికి దక్కించుకోవడం కోసం రోడ్డెక్కిన మాగంటి బాబు వర్గంలోని ఇద్దరు జెడ్పీటీసీలు, 17 మంది ఎంపీటీసీలు ఇటీవల తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వారు రాజీనామాలు చేసిన తర్వాత రెండుసార్లు అమరావతికి వెళ్లి ఇన్చార్జి మంత్రితో భేటీ అయ్యారు. అయితే ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. మరోవైపు పీతల సుజాత వర్గం శనివారం కొమ్ముచిక్కాలలో మంత్రి పితాని సత్యనారాయణను కలిసి చర్చించినట్లు సమాచారం. ఏఎంసీ చైర్మన్‌గా తమకు అనుకూలం అయిన వ్యక్తిని నియమించుకునేందుకు ఎంపీ బాబు వర్గం చేస్తున్న ప్రయత్నాల పట్ల సుజాత వర్గం తీవ్రంగా ఆక్షేపిస్తోంది. ప్రతిచోటా ఎమ్మెల్యే ప్రతిపాదించిన వారికే ఏఎంసీ చైర్మన్ ఇస్తుండగా, చింతలపూడిలో మాత్రం ఎంపీ పెత్తనం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిబంధనలను కాదని ముఖ్యమంత్రి కూడా ఎంపీ వర్గానికి పదవి కట్టబెట్టడానికి సుముఖత చూపడం లేదు. మరోవైపు తమను పట్టించుకోవడం లేదని ఎంపీ వర్గం చెప్పినా అది వాస్తవం కాదనే వాదనను పీతల వర్గం ఇంఛార్జి మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. ఇప్పుడు రాజీనామా అస్త్రం ఉపయోగించిన వారిలో కొందరిపై అవినీతి ఆరోపణలు ఉన్న విషయం, వారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఉద్యానవన శాఖలో మొక్కలు వేయకుండానే కోట్లాది రూపాయలు డ్రా చేసిన విషయం, మరుగుదొడ్ల నిర్మాణ పనులు తమ వర్గానికి ఇప్పించుకుని, కట్టకుండా డబ్బులు డ్రా చేసిన వైనాలను ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్లారు. ఇదే కాకుండా దళిత మహిళ కావడంతో మొదటి నుంచి అమెకు విలువ లేకుండా వ్యవహరిస్తున్నారని, ఒక సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు పదేపదే నియోజకవర్గం విషయంలో జోక్యం చేసుకుంటున్నారన్న వాదనను ముందుకు తీసుకువెళ్లడంతో అధిష్టానం కూడా డైలమాలో పడినట్లు సమాచారం. తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే నామినేటెడ్ పదవుల కోసం తమ పదవులకు రాజీనామా చేసినట్లు డ్రామాలు ఆడటాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతతో రాజీనామా చేసిన వారు ఈ గొడవకు త్వరగా ఫుల్స్టాప్ పెట్టాలని తమ నేతలపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. తమ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారిందని వారు తమ అనుయాయుల వద్ద వాపోతున్నారు. -
మీవన్నీ ఉత్తుత్తి రాజీనామాలే...
పశ్చిమగోదావరి ,చింతలపూడి/జంగారెడ్డిగూడెం : మీవన్నీ ఉత్తుత్తి రాజీనామాలే. బ్లాక్మెయిల్ చేయడం కోసమే రాజీనామా డ్రామాకు తెరలేపారు. మాగంటి బాబు ఎంపీగా గెలిచాక చింతలపూడి నియోజకవర్గానికి చేసిందేమిటి? ఏఎంసీ విషయంలో ఎంపీ పెత్తనమేంటి, ఎంపీటీసీలను ప్రలోభపెట్టి బలవంతంగా రాజీనామాలు చేయించారు.. అంటూ చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత వర్గం ఎదురు దాడికి దిగింది. పీతల సుజాత వైఖరిని వ్యతిరేకిస్తూ సోమవారం ఇద్దరు జెడ్పీటీసీలు, 17 మంది ఎంపీటీసీలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పీతల సుజాత వర్గం తీవ్రంగా స్పందిం చింది. చింతలపూడి, జంగారెడ్డిగూడేలలో ఆ వర్గం నేతలు విలేకరులతో మాట్లాడారు. చింతలపూడి ఎంపీపీ దాసరి రామక్క, పలువురు ఎంపీటీసీలు మాట్లాడుతూ ఎంపీ మాగంటి బాబు వర్గం నియోజకవర్గంపై పెత్తనం కోసం కావాలనే రాజీనామాల డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. కొందరు కావాలని పార్టీ పరువును బజారుకీడుస్తున్నారని ఆరోపించారు. రాజీనామాలతో ఎమ్మెల్యే సుజాతను బ్లాక్మెయిల్ చేస్తున్నారన్నారు. మార్కెట్ కమిటీ నియామకంలో ఎంపీ మాగంటి జోక్యంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ మాగంటి వల్లే ఇక్కడ గ్రూపులు తలెత్తాయన్నారు. సమస్యను పరిష్కరించకపోతే చంద్రబాబును కలిసి ఎంపీ వర్గంపై ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఎంపీటీసీలు ఎం.సుందరమ్మ, కె.వీర్రాజు, వెలగం సత్యవతి, మిండా ప్రకాశం, కృపాబాయమ్మ, కొండపల్లి సరస్వతి, టీడీపీ మండల, పట్టణ అధ్యక్షులు ఎం. శ్రీనివాసరావు, బి.ఆశీర్వాదం, సీనియర్ నాయకులు పొట్టి విశ్వేశ్వరరావు, నాయకులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ కౌన్సి లర్ నంబూరి రామచంద్రరాజు ఇంట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జంగారెడ్డిగూడెం టీడీపీ పట్టణ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు షేక్ ముస్తఫా, చెరుకూరి శ్రీధర్ కౌన్సిలర్లు సీహెచ్ రామలింగేశ్వరరావు, బొబ్బర రాజ్‌పాల్‌కుమార్, తూటికుంట దుర్గారావు, మండల కో–ఆప్షన్ సభ్యులు ఎస్ఎస్ ఇస్మాయేల్ తదితరులు మాట్లాడుతూ కేవలం ఏలూరు ఎంపీ మాగంటి బాబు, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వలనే ఇక్కడ విభేదాలు నెలకొన్నాయని పేర్కొన్నారు. వీరు గిరిజన, దళిత ఎమ్మెల్యేలపై గతంలో కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇంత వరకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఆశించే వ్యక్తి కనీసం ఎమ్మెల్యేను కలవలేదన్నారు. రూరల్ కమిటీ అధ్యక్షులు దాకారపు గోపాలకృష్ణ, మండల పరిషత్ ఉపాధ్యక్షులు ఉమ్మడి రాంబా బు, సొసైటీ అధ్యక్షులు వందనపు హరికృష్ణ, పగ డం దినేష్, తూటికుంట రాము, యాకూబ్, కౌన్సి లర్ చాబత్తుల మరియ, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
టీడీపీలో ముదిరిన సంక్షోభం
చింతలపూడి నియోజకవర్గంలో అధికార పార్టీలో వర్గ విభేదాలు క్లయిమాక్స్‌కు చేరాయి. ఎమ్మెల్యే పీతల సుజాత వైఖరిని నిరసిస్తూ ఇద్దరు జెడ్పీటీసీ సభ్యులు, 17 మంది ఎంపీటీసీ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేయగా, మంగళవారం మరికొంతమంది రాజీనామాలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు ఈ సమస్యను పరిష్కరించకుండా నానుస్తుండటంతో విసిగిపోయిన నేతలు రాజీనామా పర్వానికి తెరలేపారు. అయితే ఈ రాజీనామాలు ఆమోదం పొందే అవకాశం లేకపోవడంతో ఇది మరో డ్రామాగా మిగిలిపోనుందని తెలుస్తోంది. పశ్చిమగోదావరి , సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎమ్మెల్యే పీతల సుజాత, ఏలూరు ఎంపీ మాగంటి బాబు వర్గాల మధ్య చింతలపూడి ఏఎంసీ ఛైర్మన్ నియామకంపై మూడున్నర ఏళ్లుగా జరుగుతున్న వివాదానికి తెరపడకపోవడంతో ఆ పదవి ఖాళీగానే ఉండిపోయింది. ఏఎంసీ ఛైర్మన్ నియామకం విషయంలో రగిలిన విభేదాలు ఇరువర్గాల మధ్య పూడ్చలేని అగాధంగా మారాయి. ఇరువర్గాలు టీడీపీలో ముదిరిన సంక్షోభం ప్రజాసేవను పక్కన పెట్టి రాజకీయ పదవుల కోసం పోటీ పడుతూ రోడ్డెక్కుతున్నారు. గత వారం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పత్తిపాటి పుల్లారావు వచ్చిన సందర్భంలో జెడ్పీ గెస్ట్‌హౌస్‌లో ఎంపీ వర్గం రాజీనామాలు చేస్తామని బెదిరించింది. వారితో మాట్లాడుతున్న మరో మంత్రి పితాని సత్యనారాయణ సహనం కోల్పోయి చేతనైంది చేసుకోండనడంతో వివాదం ముదిరింది. ఇరువర్గాలను కూర్చోబెట్టి రాజీ చేయాలన్న ప్రయత్నానికి పీతల సుజాత వర్గం కలిసి రాలేదు. దీంతో కామవరపుకోట, చింతలపూడి జెడ్పీటీసీలు గంటా సుధీర్‌బాబు, తాళ్లూరి రాధారాణితో పాటు చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట మండలాలకు చెందిన 17 మంది ఎంపీటీసీలు తమ రాజీనామా లేఖలను జెడ్పీ సీఈవోకి సమర్పించారు. తమను పూర్తిగా విస్మరించడం వల్లే తాము రాజీనామాలు చేయాల్సి వచ్చిందని ఎంపీ మాగంటి బాబు వర్గం చెబుతోంది. తమకు కనీస ప్రాధాన్యత దక్కడం లేదని, పనులు కాకుండా ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని వారు ఆరోపించారు. ఇనన్ఛార్జి మంత్రి పత్తిపాటి పుల్లారావు ఇరువర్గాలను కూర్చుని చర్చించుకోమని చెప్పడంతో రాత్రి 11 గంటల వరకూ తాము వేచి చూసినా ఎమ్మెల్యే సుజాత రాకపోవడం వల్లే తాము ఈ నిర్ణయానికి వచ్చామని కామవరపుకోట జెడ్పీటీసీ ఘంటా సుధీర్‌బాబు, చింతలపూడి జెడ్పీటీసీ తాళ్లూరి రాధారాణి మీడియాకి తెలిపారు. ఎన్నికలకు కేవలం 13 రోజుల ముందు నియోజకవర్గానికి వచ్చినా తామంతా దగ్గరుండి కష్టపడి గెలిపించామని, ఎమ్మెల్యే మాత్రం తమను పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. మరోవైపు పీతల సుజాత వర్గం మాత్రం దళిత మహిళ కావడంతో మొదటి నుంచి అమెకు విలువ లేకుండా వ్యవహరిస్తున్నారని, ఒక సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు పదేపదే నియోజకవర్గం విషయంలో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కావాలని పార్టీ పరువును వీధికి లాగుతున్నారని ఆరోపిస్తున్నారు. -
‘పితాని’పై తమ్ముళ్ల ఆగ్రహం
-
మంత్రి ‘పితాని’పై తమ్ముళ్ల ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, ఏలూరు/చింతలపూడి : పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గ టీడీపీలో కొద్ది నెలలుగా రగులుతున్న అసమ్మతి భగ్గుమంది. ఏలూరు జెడ్పీ గెస్ట్‌హౌస్ వేదికగా ఎంపీ మాగంటి బాబు వర్గీయులు మంత్రులను నిలదీశారు. దీంతో సహనం కోల్పోయిన మంత్రి పితాని సత్యనారాయణ.. ‘మీకు చేతనైంది చేసుకోండి’ అని చెప్పడంతో వారిలో ఆగ్రహం రెట్టింపైంది. వివరాల్లోకి వెళ్తే.. చింతలపూడి ఏఎంసీ ఛైర్మన్ వ్యవహారంలో మాజీమంత్రి పీతల సుజాత వర్గానికి, ఎంపీ మాగంటి బాబు వర్గానికి గత మూడేళ్లుగా వివాదం నడుస్తోంది. శుక్రవారం చింతలపూడిలో సమన్వయ కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఇరువర్గాలతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని నిర్ణయించారు. ఇన్చార్జి మంత్రి పత్తిపాటి పుల్లారావు ఈ బాధ్యతను జిల్లా మంత్రి పితాని సత్యనారాయణకు అప్పగించారు. బాబు వర్గీయులు సమస్యను ఇప్పటికిప్పుడు పరిష్కరించకపోతే రాజీనామాలు చేస్తామని హెచ్చరించడంతో పితాని ‘మీ ఇష్టమైంది చేసుకోండి’ అంటూ అసహనం వ్యక్తంచేశారు. దీంతో తెలుగు తమ్ముళ్లు మీరు నిన్నకాక మొన్న పార్టీలోకి వచ్చి మమ్మల్ని రాజీనామా చేసుకోమంటారా అంటూ మంత్రిపై విరుచుకుపడ్డారు. పేకాడుతున్నా మావాళ్లను అరెస్టు చెయ్యొద్దు ఈ సమావేశంలో ఏలూరు ఎంపీ మాగంటి బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ కార్యకర్తలు పేకాట ఆడుతున్నా అడ్డుకోవద్దని పోలీసులకు సూచించారు. ఒకవేళ మీరు కార్యకర్తలను అరెస్టుచేస్తే మళ్లీ మేమే స్టేషన్‌కు రావాల్సి ఉంటుంది.. గుర్తుంచుకోండని చెప్పడంతో మంత్రులు, పోలీసులు అవాక్కయ్యారు. అనంతరం రాజ్యసభ సభ్యురాలు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి మాగంటి బాబు వ్యాఖ్యలను పట్టించుకోవద్దని కార్యకర్తలకు సూచించారు. -
అయిననూ పోయిరావలె అమరావతికి
♦ పీతలపై అమీతుమీకి సిద్ధమవుతున్న అసమ్మతి నేతలు ♦ చింతలపూడి సెగ్మెంట్లో మాగంటి, పీతల మధ్య వర్గ పోరు ♦ ఆదివారం ఇన్చార్జ్ మంత్రి పత్తిపాటి సమక్షంలో పంచాయితీ చింతలపూడి : చింతలపూడి నియోజకవర్గ టీడీపీలో అసమ్మతి నిప్పు రాజుకుంటోంది. వారం రోజుల క్రితం ఏలూరు అతిథి హోటల్లో నాలుగు మండలాల ముఖ్య నేతలతో పాటు నాలుగు మండలాల జెడ్పీటీసీ సభ్యులు, పలువురు ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు సమావేశమై స్థానిక శాసనసభ్యురాలు పీతల సుజాతపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలాగే మరుసటి రోజు జంగారెడ్డిగూడెంలో వీరంతా సమావేశమై తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయానికి రావడంతో జిల్లా ఇన్చార్జ్ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఫోన్ చేసి ఆదివారం అసమ్మతి నాయకులను అమరావతి రమ్మని సూచించడంతో తెలుగు తమ్ముళ్ల పంచాయితీ అమరావతికి చేరింది. అమరావతిలో కూడా సమస్య పరిష్కారం కాకపోతే వచ్చే వారం చింతలపూడిలో జరిగే టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో అసంతృప్తులంతా అమీతుమీకి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఏఎంసీ వేదికగా : నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య అంతర్గత పోరుకు ఏఎంసీ కేంద్ర బిందువుగా మారింది. రాష్ట్రంలో మార్కెట్ కమిటీ పాలకవర్గాలన్నీ భర్తీ అయిపోయినా గత మూడున్నర ఏళ్లుగా చింతలపూడి ఏఎంసీ పాలకవర్గం మాత్రం భర్తీ చేయడం లేదు. ఏఎంసీ ఛైర్మన్ పదవిని తమవర్గానికి చెందిన వ్యక్తికి ఇప్పించుకోవడానికి ఎంపీ మాగంటి బాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. దానికి సుజాత చెక్ పెట్టడంతో ఎంపీ మాగంటి, ఎమ్మెల్యే సుజాత వర్గాల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ఈ నేపధ్యంలోనే సుజాత మంత్రి పదవి పోవడానికి జిల్లాలోని ఒక బలమైన సామాజిక వర్గ నేతల ప్రమేయం ఉందనేది పీతల వర్గం ఆరోపణ. ఆమె మంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి ఎంపీ మాగంటితో పాటు ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సుజాత నియోజకవర్గంలో వేలు పెట్టడమేకాక, అవకాశం చిక్కినప్పుడల్లా చంద్రబాబుకు ఫిర్యాదులు చేయడం వల్లనే మంత్రి పదవికి దూరం అవ్వాల్సి వచ్చిందన్న విషయాన్ని సుజాత వర్గం గుర్తుచేస్తోంది. కలుపుకు పోవడం లేదు : ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి ఎమ్మెల్యే సుజాత పార్టీలో అందర్నీ కలుపుకు పోవడం లేదని కేవలం ఒక వర్గాన్నే ఆమె ప్రోత్సహిస్తున్నారని అసంతృప్త నాయకులు ఆరోపిస్తున్నారు. గత జూలైలో జంగారెడ్డిగూడెంలో టీడీపీ అసమ్మతి నాయకులు బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యేపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చింతలపూడి మండలంలో ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్న టీడీపీ నాయకులు ప్రగడవరం సమీపంలో బహిరంగ సమావేశం ఏర్పాటు చేయగా అధిష్టానం ఆదేశాలతో వెనక్కు తగ్గారు. 2014 ఎన్నికల్లో కష్టపడి పార్టీ అభ్యర్ధిని గెలిపించిన నిజమైన కార్యకర్తలకు పార్టీలో విలువ ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కార్యకర్తల్లో తీవ్ర నిరాశ, నిస్పృహ ఆవహించిందని అంటున్నారు. ఇంత జరుగుతున్నా నియోజకవర్గ పార్టీలో అంతర్గత కుమ్ములాటలపై తెలుగుదేశం అధిష్టానం మాత్రం ఇంత వరకు సీరియస్‌గా స్పందిం చలేదు. అసమ్మతి నాయకులు సమావేశం అయిన ప్రతిసారి పాలపొంగుపై నీళ్లు చల్లినట్లు జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి ఫోన్ చేసి మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం అసమ్మతి నాయకులంతా వెనక్కు తగ్గడం పరిపాటిగా మారింది. పార్టీకి వ్యతిరేకంగా మీటింగులు పెడితే సహించను అంటూ పదేపదే చెప్పే పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నియోజకవర్గంలో ముదిరి పోతున్న వర్గపోరుపై ఎందుకు దృష్టి పెట్టడం లేదోనని తెలుగు తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఇదేం ’పీతలా’టకం
►టార్గెట్ ఎమ్మెల్యే సుజాత ! ►ఎంపీ మాగంటి వర్గం తిరుగుబాటు ►చింతలపూడి టీడీపీలో రోడ్డెక్కిన గ్రూపులు ►మూకుమ్మడి రాజీనామాలకు అల్టిమేటం ఏలూరు : చింతలపూడి నియోజకవర్గం అధికార పార్టీలో అంతర్గత కలహాలు రేగాయి. గ్రూపులు రోడ్డున పడ్డాయి. మూడేళ్లుగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి పీతల సుజాతను టార్గెట్ చేస్తూ వచ్చిన ఎంపీ మాగంటి బాబు వర్గం ఇప్పుడు మంత్రి పదవి పోవడంతో నేరుగా రంగంలోకి దిగిపోయింది. తమ మాట నెగ్గకపోతే నాయకులంతా మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ అల్టిమేటం కూడా ఇచ్చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా జోక్యం చేసుకున్నా.. పరిస్థితిలో మార్పు రాకుండా పోయింది. ఏఎంసీ పాలకవర్గ నియామకమే విభేదాలకు కారణం మూడేళ్లుగా ఏఎంసీ పాలకవర్గం నియామకం చేపట్టక పోవడం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నిరాశను నింపింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సుజాత తన వర్గానికి చెందిన వ్యక్తులకు ఏఎంసీ చైర్మన్ పదవి ఇప్పించుకోవాలని చూస్తున్నారు. అయితే పార్టీలోని ఆమె వ్యతిరేక వర్గం మాత్రం ఎంపీ మాగంటి బాబుతో అధిష్టానంపై ఒత్తిడి తీసుకు వచ్చి తమ వర్గానికే ఈ పదవిని దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. రెండు వర్గాలూ తమ వారికే ఏఎంసీ పాలకవర్గ చైర్మన్‌గిరీ ఇప్పించుకోవాలని పట్టుదలతో ఉండడంతో విభేదాలు రచ్చకెక్కాయి. పదేళ్లు ప్రతిపక్షంలో ఉంటూ 2014 ఎన్నికల్లో కష్టపడి పార్టీ అభ్యర్థిని గెలిపించిన నిజమైన కార్యకర్తలకు పార్టీలో విలువ లేదని ముఖ్య నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నాయకులకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే పీతల సుజాత వర్గం మాత్రం దళిత మహిళ కావడంతో మొదటి నుంచి ఆమెకు విలువ లేకుండా వ్యవహరిస్తున్నారని, ఒక సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు పదేపదే నియోజకవర్గం విషయంలో జోక్యం చేసుకుంటున్నారని ధ్వజమెత్తుతున్నారు. మొదటి నుంచీ కలహాలే చింతలపూడి మార్గెట్ యార్డు చైర్మన్‌గా ఎవరిని నియమించాలనే దానిపై మొదటి నుంచి పీతల సుజాత, మాగంటి బాబు వర్గాల మద్య కలహాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ఏఎంసీలకు చైర్మన్ల నియామకం జరిగిపోయినా.. ఇంతవరకూ చింతలపూడి ఏఎంసీ నియామకం జరగలేదు. ఇటీవల పార్టీ మండల అధ్యక్ష పదవులూ తమ వర్గానికే ఇవ్వాలంటూ ఎంపీ మాగంటి వర్గం పట్టుపడుతూ వచ్చింది. అయితే ఎమ్మెల్యే పీతల సుజాత తన వర్గం వారినే కొనసాగించేందుకు మొగ్గుచూపారు. దీంతో ఎంపీ వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇటీవల సమన్వయ కమిటీ సమావేశం ఎదుట కూడా ఇదే విషయంపై రచ్చ జరిగింది. తర్వాత అమరావతిలోనూ దీనిపై సమావేశం నిర్వహించినా ఇరువర్గాల మధ్య సమన్వయం కుదరలేదు. ఎంపీ వర్గం అల్టిమేటం తాజాగా ఎంపీ వర్గానికి చెందిన నాయకులంతా మూకుమ్మడి రాజీనామాలకు అల్టిమేటం జారీచేశారు. మంగళవారం జంగారెడ్డిగూడెంలో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే పీతల సుజాత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, నియోజకవర్గంలో కమిటీలను పార్టీ నాయకులు, కార్యకర్తల అభీష్టానికి వ్యతిరేకంగా నియమించారని నాయకులు ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు నియోజకవర్గంలో పీతల సుజాత అంటే ఎవరో తెలియదని, అయితే తామంతా కలిసి కట్టుగా పనిచేసి పీతల సుజాతను అత్యధిక మెజార్టీతో గెలిపించామని, అయినా కార్యకర్తల మనోభావాలకు వ్యతిరేకంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గతంలోనూ ఒకసారి నాయకులంతా రహస్య సమావేశం నిర్వహించి పీతల సుజాతకు వ్యతిరేకంగా పలు తీర్మానాలు చేశారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని నిర్ణయించారు. ఇటీవల భీమడోలులో జరిగిన పార్టీ జిల్లా సమన్వయకమిటీ సమావేశం సందర్భంగా, తర్వాత అమరావతిలో జరిగిన సమావేశంలోనూ పీతల సుజాత కమిటీలను పునర్వ్యవస్థీకరిస్తామని హామీ ఇచ్చారని నియోజకవర్గ కన్వీనర్ మండవ లక్ష్మణరావు వెల్లడించారు. అయితే ఇది జరిగి చాలా రోజులు అయినా.. ఇప్పటికీ ఎటువంటి చర్యలూ లేవని, కేవలం పీతల సుజాత వల్ల నియోజకవర్గంలో పార్టీ తుడిచిపెట్టుకుపోయే దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. త్వరలో నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటుచేసి ఒక నిర్ణయానికి రానున్నట్టు ప్రకటించారు. అలాగే నియోజకవర్గ పరిస్థితి గురించి అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు వెల్లడించారు. సమావేశంలో చింతలపూడి నియోజకవర్గ సమన్వయ కర్త మండవ లక్ష్మణరావు, జెడ్పీటీసీ శీలం రామచంద్రరావు, నగరపంచాయతీ వైస్‌చైర్మన్ అట్లూరి రామ్మోహనరావు, కౌన్సిలర్ చింతల వెంకటేశ్వరరావు, అబ్బిన దత్తాత్రేయ, పెనుమర్తి రామ్‌కుమార్, మద్దిపాటి నాగేశ్వరరావు, మందపల్లి లక్ష్మయ్య, తడికమళ్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
మాగంటి బాబు Vs పీతల సుజాత
అమరావతి: ఏపీ సచివాలయంలో చింతలపూడి టీడీపీ నేతలు వాదులాటకు దిగారు. కొద్దిరోజులుగా ఎంపీ మాగంటి బాబు, పీతల సుజాత వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. దీనిపై మాట్లాడేందుకు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పుల్లారావు ఇరువర్గాల వారిని సోమవారం నాలుగో బ్లాక్‌లోని తన ఛాంబర్‌కు పిలిపించారు. మాజీ మంత్రి పీతల సుజాత నేతృత్వంలో ఇరువర్గాల వారిని విబేధాలు వీడి పని చేసుకోవాలని సూచించారు. అనంతరం మంత్రి ఛాంబర్ నుంచి బయటకు రాగానే వారు వాదులాటలు మొదలుపెట్టారు. ఈ పరిణామం చూసిన అక్కడి వారు ముక్కున వేలేసుకున్నారు. -
చంద్రబాబు సమక్షంలోనే బయటపడ్డ విభేదాలు
నూజివీడు : కృష్ణాజిల్లా నూజివీడు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జీ, మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావుకు, లోక్ సభ సభ్యుడు మాగంటి బాబు మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే వారిమధ్య విభేదాలు మళ్లీ బయటపడ్డాయి. నూజివీడులో జరిగిన వనం-మనం కార్యక్రమం సందర్భంగా ముద్రబోయిన వెంకటేశ్వరరావు, మాగంటి బాబు వర్గాల మధ్య శుక్రవారం ఘర్షణ జరిగింది. ముద్రబోయిన వర్గాన్ని స్టేజ్ మీదకు పిలవడంపై మాగంటి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో మాగంటి బాబు అనుచరులు స్టేజ్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ...మాగంటి బాబు వర్గంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ముద్రబోయిన, మాగంటిల మధ్య వైరం ఉంది. పలు సందర్భాల్లో వీరిద్దరూ సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్న విషయం తెలిసిందే. -
మళ్లీ అలిగిన మాగంటి
ఏలూరు : ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చిన చాలా సందర్భాల్లో అధికారులపై అలిగి మాట్లాడకుండా వెళ్లిపోయిన ఏలూరు ఎంపీ మాగంటి బాబు ఈసారి కూడా అలక వహించారు. సీఎం సభాస్థలికి రాకముందే ఎంపీ మాగంటి అక్కడకు చేరుకున్నారు. సభావేదికపైకి వెళ్లిన ఆయన ఎంపీపీలు, జెడ్పీటీసీలను వేదికపైకి రావాల్సిందిగా పిలిచారు. అక్కడే ఉన్న పోలీసు అధికారులు ఇందుకు అభ్యంతరం చెప్పారు. ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం వారిని వేదికపైకి అనుమతించలేమన్నారు. దీంతో మాగంటి బాబు ‘నేను చెబుతున్నాను. పంపించండి’ అని పదేపదే అడిగినా ఫలితం లేకపోయింది. దీంతో ఎంపీ మాగంటి చేతిలోని మైక్ కిందపడేసి విసురుగా వేదిక దిగి వెళ్లిపోయారు. గతంలోనూ ఇలాగే అలిగి వెళ్లినప్పుడు ఎమ్మెల్యేలు ఆయన్ను బతిమాలి తీసుకొచ్చేవారు. ఈసారి అలాంటి పరిస్థితి కనిపించలేదు. సీఎం వేదికపైకి వచ్చిన తర్వాత కూడా మాగంటి బాబు వేదికపైకి రాలేదు. వాస్తవంగా చెప్పాలంటే ఆ తర్వాత ఆయనను ఎవరూ పట్టించుకోలేదు. సభాధ్యక్ష బాధ్యతను పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు తీసుకుని కార్యక్రమాన్ని ముగించారు. సీఎంలో ఎందుకో నిస్తేజం ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాకు వచ్చినప్పుడల్లా ఉత్సాహంగా.. ఉల్లాసంగా కనిపించేవారు. కానీ బుధవారం నాటి పర్యటనలో ఒకింత నిస్తేజంగా కనిపించడం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పెద్దగా జనం లేకున్నా గంటకుపైగా మాట్లాడే చంద్రబాబు మండుటెండలో సైతం భారీగా జనాన్ని సమీకరించినప్పటికీ.. మొక్కుబడిగానే మాట్లాడి ముగించేయడం టీడీపీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. -
చంద్రబాబు మీటింగ్‌లో మైకు విసిరిన మాగంటి
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న సమావేశం రసాభాసగా మారింది. పశ్చిమగోదావరి జిల్లా కుక్కనూరు మండలం ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. చంద్రబాబు పాల్గొన్న సమావేశంలో వేదికపైకి రాకుండా జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను పోలీసులు అడ్డుకోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. తమను స్టేజీపైకి రానివ్వకపోవడాన్ని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు జీర్ణించుకోలేకపోయారు. పోలీసుల తీరును తీవ్రంగా నిరసిస్తూ ఎంపీ మాగంటి బాబు మైక్ విసిరేశారు. -
మాగంటి వర్సెస్ మొడియం
పోలవరం టీడీపీలో వర్గపోరు ఎమ్మెల్యేకు చెక్ పెట్టేందుకు బాబు వ్యూహం మాజీ ఎమ్మెల్యేను పార్టీలోకి తెచ్చేందుకు కసరత్తు నియోజకవర్గంలో మారనున్న సమీకరణాలు పోలవరం : జిల్లాలో పలు నియోజకవర్గాల్లో టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకుల మధ్య వర్గ విభేదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొంతకాలం క్రితం వరకు ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య కుమ్ములాటలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఎమ్మెల్యేలు, పార్టీలోని ప్రధాన నాయకుల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. ఇందుకు ప్రధాన కారణంగా ఇసుక తవ్వకాలు, సెటిల్మెంట్లు కావడం గమనార్హం. కొవ్వూరు నియోజకవర్గంలో నాయకులు, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు రచ్చకెక్కగా తాజాగా పోలవరంలో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరింది. ఎమ్మెల్యేకు చెక్ పెట్టేందుకు ఎంపీ వ్యూహం పోలవరం నియోజకవర్గంలో ఏలూరు ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావుల మధ్య ఆధిపత్య పోరు తీవ్రరూపం దాల్చింది. ఎంపీ, ఎమ్మెల్యే మధ్య గతేడాది ఇసుక ర్యాంపుల అజమాయిషీ విషయంలో ఏర్పడిన విభేదాలు క్రమేణా తీవ్రస్థాయికి చేరాయి. ఇటీవల కొయ్యలగుడెం మండలంలో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మొడియంను ఉద్దేశించి ఎంపీ మాగంటి బాబు తీవ్రవ్యాఖ్యలు చేయటంతో అవి రచ్చకెక్కాయి. ఒక దశలో వీరి పంచాయితీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లింది. ఈ నేపథ్యంలో మొడియంకు చెక్ పట్టేందుకు ఎంపీ బాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే అయిన పూనెం సింగన్నదొరను టీడీపీలో చేర్పించేందుకు రంగం సిద్ధం చేశారు. అధిష్టానం వద్ద పలుకుబడి కలిగిన కొయ్యలగూడెంకు చెందిన ఒక నాయకుడి ద్వారా సింగన్నదొరను పార్టీలో చేర్పించేందుకు సిద్ధం చేసినట్టు సమాచారం. 2019 ఎన్నికల్లో సింగన్నదొరకు లేదా ఆయన కుమారుడికి సీటు ఇస్తామని ఆశ చూపించి పార్టీలోకి రప్పిస్తున్నట్టు సమాచారం. గ్రామాల్లో పర్యటిస్తున్న సింగన్నదొర ఈ నేపథ్యంలో సింగన్నదొర తన కుమారుడితో కలిసి బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో టీడీపీ నాయకులను కలిసి మద్దతు కోరినట్టు సమాచారం. అయితే నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే మొడియం ఆధిపత్యానికి గండికొట్టాలనే లక్ష్యంతో ఎంపీ మాగంటి బాబు ఆయనను రంగంలోకి తెస్తున్నారు. మొదటి నుంచి టీడీపీలోనే ఉన్న సింగన్నదొర పదేళ్ల కిందట చంద్రబాబు వైఖరి నచ్చక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఎన్నికల ముందు వైఎస్సార్ సీపీలో చేరి పార్టీ అభ్యర్థి బాలరాజుకు మద్దతు పలికారు.ఎన్నికల అనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో సింగన్నదొర మళ్లీ టీడీపీలో చేరేందుకు సిద్ధపడడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా చంద్రబాబు వైఖరి నచ్చకే పార్టీని వీడిన ఆయన ఎంపీ బాబు కోసం టీడీపీ తీర్థం తీసుకునేందుకు సిద్ధపడడం ఆ పార్టీ నాయకులే ఆశ్చర్యపోతున్నారు. ఆయన వచ్చిన అనంతరం నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంటుందోనని తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. -
ఏలూరు ఎంపీ గన్‌మన్ ఆత్మహత్య
ఏలూరు(పశ్చిమగోదావరి జిల్లా): ఏలూరు ఎంపీ మాగంటి బాబు గన్‌మాన్ ఎం ఆదామ్(45) సోమవారం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగిన ఆదామ్‌ను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కాసేపటికే మరణించాడు. ఆదామ్ ప్రస్తుతం ఏలూరులోని విద్యానగర్‌లో నివాసం ఉండేవాడు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. -
టీడీపీలో 'వర్ణ వివక్ష'!
దళిత, గిరిజన ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన ఎంపీ మాగంటి మంత్రి పీతల సుజాత, ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌లపై కక్ష చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో మాగంటి పెత్తనంపై టీడీపీ వర్గాల్లో అసహనం పార్టీ అధినేత చంద్రబాబు ఎదుట నేడు పంచాయితీ! ఏలూరు : తెలుగుదేశం పార్టీలో గ్రూపు రాజకీయాలు పరాకాష్టకు చేరుతున్నాయి. జిల్లాలోని దళిత, గిరిజన ఎమ్మెల్యేలు వర్ణ వివక్షకు గురవుతున్నారు. వివక్షను తట్టుకోలేకపోతున్న ఆయా సామాజిక వర్గాల నేతలు ఇటీవల చోటుచోసుకున్న ఘటనలను మంగళవారం జిల్లాకు వస్తున్న పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుకు దృష్టికి తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తోంది. దళిత వర్గానికి చెందిన చింతలపూడి ఎమ్మెల్యే, మంత్రి పీతల సుజాత, ఎస్టీ వర్గానికి చెందిన పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌ను లక్ష్యంగా చేసుకుని ఏలూరు ఎంపీ మాగంటి బాబు కక్షపూరిత రాజకీయాలు నెరపుతున్నారనేది ఆయావర్గాల ప్రధాన ఆరోపణ. ఆ ఇద్దరే ఎందుకు ఎంపీగా మాగంటి బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏలూ రు లోక్‌సభ నియోజకవర్గ పరధిలో ఏలూరు, దెందులూరు, చింతలపూడి, పోలవరం, ఉంగుటూరు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి వ్యవహారాల జోలికి పోని ఎంపీ మాగంటి చీటికీమాటికీ చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో పాలన, పార్టీ వ్యవరాహాల్లో తలదూరుస్తుంటారన్న ఆరోపణ బలంగా ఉంది. మూడురోజుల క్రితం కొయ్యలగూడెం మండలం కన్నాపురంలో నిర్వహించిన జనచైతన్య యాత్రలో ఎంపీ మాగంటి బాబు ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌ను పొగుడుతూ.. ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌ను విమర్శించడం కలకలం రేపుతోంది. గిరిజన ఎమ్మెల్యే కాబట్టే మొడియం శ్రీనివాస్‌ను ఎంపీ చిన్నచూపు చూస్తున్నారని ఎమ్మెల్యే వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొడియంతో కయ్యం ఎక్కడ మొదలైందంటే.. ఎంపీ మాగంటి ఆధిపత్య భావజాలాన్ని పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ మొదట్లో భరించినా క్రమంగా ఎదురు తిరుగుతూ వచ్చారు. దీంతో ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన ఎంపీ మాగంటి ఆ నియోజకవర్గంలో పూర్తిస్థాయి పెత్తనం మొదలుపెట్టారు. సబ్స్టేషన్ల పరిధిలో ట్రాన్స్‌కో షిఫ్ట్ ఆపరేటర్ల నియామకాల్లో ఎమ్మె ల్యే సిఫార్సు చేసిన వారికి ఉద్యోగాలు రాకుండా ఎంపీ అడ్డుపడ్డారన్న వాదనలు ఉన్నాయి. అప్పటినుంచి ఇరువర్గాల మధ్య దూరం పెరిగింది. ఆ తర్వాత ఇసుక ర్యాంపుల నుంచి వచ్చే ఆదాయం వాటాల్లోనూ ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదరలేదని సమాచారం. నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా రూ.కోట్లు విలువైన పనులను ఎమ్మె ల్యే వర్గీయులే చేజిక్కించుకోవడంతో ఎంపీ వర్గీయులకు మింగుడు పడలేదు. మొత్తంగా ఎమ్మెల్యే మొడియం తనను లెక్కచేయడం లేదని అసహనం ప్రదర్శించిన ఎంపీ మాగంటి గత శనివారం కన్నాపురంలో ఎమ్మెల్యేపై బహిరంగంగానే విమర్శలు చేశారు. ఎంపీ చేసిన వ్యాఖలపై గిరిజన సంక్షేమ సంఘాల నాయకులు ఆందోళన చేయడానికి సిద్ధపడ్డారు. అయితే ఎంపీ వ్యవహారాన్ని అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకు వెళదా మని మొడియం వర్గీయులు చెప్పడంతో గిరిజన నేతలు ఆ ప్రతిపాదన విరమించారు. మంత్రి సుజాత ఇలాకాలో.. జిల్లాకు చెందిన మహిళా మంత్రి పీతల సుజాత ప్రాతి నిధ్యం వహిస్తున్న చింతలపూడిలోనూ ఎంపీ గ్రూపు రాజకీయాలు నడుపుతున్నారనే ఆరోపణ బలంగా ఉంది. అన్ని నియోజకవర్గాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ల ఎంపిక పూర్తయి నెలలు కావస్తుండగా, ఇప్పటికీ చింతలపూడిలో మాత్రం పూర్తికాలేదు. కేవలం ఎంపీ మాగం టి అడ్డుపడటంతోనే ఎంపిక ఆగిందనేది నియోజకవర్గంలో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. పీతల సుజాత తన వర్గానికి చెందిన చిన్నంశెట్టి సీతారామయ్యకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టాలని భావించగా, మాగంటి బాబు వర్గీయులు కామవరపుకోటకు చెందిన కోనేరు సుబ్బారావు పేరును తెరపైకి తీసుకువచ్చారు. దీంతో ఈ విషయం ఎటూతేలక పెండింగ్ పడింది. చింతలపూడి నియోజకవర్గంలో ట్రాన్స్‌కో షిఫ్ట్ ఆపరేటర్ల నియామకాల్లోనూ మంత్రి పీతల సిఫార్సు చేసిన వారిలో ఒక్కరికి కూడా ఉద్యోగం రాకుండా ఎంపీ వర్గం అడ్డుపడిందన్న వాదనలున్నాయి. కనీసం మహిళా మంత్రి అనే కనికరం కూడా లేకుండా తమ నేతను మాగంటి చిన్నచూపు చూస్తున్నారని, ఉద్దేశపూర్వకంగా అవమానిస్తున్నారని సుజాత వర్గీయులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొడియం శ్రీనివాస్ వర్గీయులతో కలిసి ఎంపీ మాగంటి వ్యవహారాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలని మంత్రి వర్గీయులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. -
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
-
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని టీడీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. కన్నాపురంలో నిర్వహించిన జనచైతన్య యాత్రలో పాల్గొన్న టీడీపీ ఎంపీ మాగంటి బాబు.. ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్ అవినీతి పాల్పడుతున్నాడనీ, మాఫియా నుండి భూ తగాదాల వరకు సెటిల్మెంట్లు చేస్తున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్ అక్రమాల చిట్టా మొత్తం తన వద్ద ఉందన్న ఆయన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనిని చూసైనా ముడియం శ్రీనివాస్ నేర్చుకోవాలని హితవు పలికారు. నియోజకవర్గంలోని సొంత పార్టీ ఎమ్మెల్యేను అవినీతిపరునిగా చిత్రీకరించడం పట్ల ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీ వ్యాఖ్యలతో జనచైతన్య యాత్ర మధ్యలోనే వెల్లిపోయారు. మాగంటి బాబు వ్యవహారశైలిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడానికి ముడియం శ్రీనివాస్ సమాయత్తం అవువున్నారు. -
ఎంపీలపై విచారణకు ఆదేశం
ఏలూరు : గోదావరి జిల్లాల్లో కోడి పందేల వ్యవహారం చినికి చినికి గాలివానలా మారుతోంది. ఈ విషయంలో ముగ్గురు ఎంపీల తీరుపై విచారణ జరపాల్సిందిగా జిల్లా ఎస్పీని న్యాయ సేవాధికార సంస్థ ఆదేశించింది. మాగంటిబాబు, మురళీమోహన్, గోకరాజు గంగరాజుపై జిల్లాకు చెందిన న్యాయవాది బాబూ గణేష్ న్యాయసేవాధికార సంస్థలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ముగ్గురు ఎంపీలు కోడిపందేల విషయంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆయన తన పిటిషన్ లో పేర్కోన్నారు. దాంతో.. ఈ అంశంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆదేశించారు. -
కోడి పందాలు... నేతల అరెస్ట్... ఎంపీల ధర్నా
-
కోడి పందాలు... నేతల అరెస్ట్... ఎంపీల ధర్నా
ఏలూరు: కోడిపందాలు ఆడుతు పోలీసులకు చిక్కి అరెస్ట్ అయిన టీడీపీ నేతలను వెంటనే విడుదల చేయాలని ఆ పార్టీ ఎంపీలు పోలీసులను డిమాండ్ చేశారు. నేతల అరెస్ట్‌కు నిరసనగా మంగళవారం ఏలూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీలు మాగంటి బాబు, మాగంటి మురళీమోహన్, గోకరాజు గంగరాజుతోపాటు ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బైఠాయించారు. దాంతో జడ్పీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగారు. జిల్లాలోని ద్వారక తిరుమలలో కోడిపందాలు ఆడుతున్న దాదాపు 17 మంది టీడీపీ నేతలను పోలీసులు రెండు రోజుల క్రితం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నూతన సంవత్సరం, సంక్రాంతి పండగ నేపథ్యంలో కోడి పందాలు ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఇప్పటికే హెచ్చరించారు. అదికాక రాష్ట్రంలో కోడి పందేల నిర్వహణకు ఎవరికీ అనుమతి లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. ఒకవేళ ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి కోడి పందేలను నిర్వహించినా, జూదమాడినా తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. దాంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుపా నేతృత్వంలోని ధర్మాసనం కోడి పందేలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని మూసివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నరహరి జగదీష్‌కుమార్ గతవారం హైకోర్టులో దాఖలు చేశారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది ఇచ్చిన వివరణపై సంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని పరిష్కరించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. -
ఓటర్లు చేతులు చాచడం వల్లే.. : ఎంపీ మాగంటి
నూజివీడు : ఎన్నికలప్పుడు ఓటర్లు ఐదొందలకో, వెయ్యి రూపాయలకో చేతులు చాచడం వల్లనే ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా తమ పదవులను అడ్డంపెట్టుకుని చేతులు చాస్తున్నారని ఏలూరు ఎంపీ మాగంటి బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణాజిల్లా నూజివీడు 28వ వార్డులో మంగళవారం నిర్వహించిన జన్మభూమి సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మాగంటి మాట్లాడుతూ.. ఓటర్లు ఇప్పటికైనా మారితేనే వారి జీవితాల్లో మార్పు వస్తుందని, మారకపోతే ఎప్పటికీ మారవని చెప్పారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు శాసనసభ స్థానాలుండగా, ఆరు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులే గెలుపొందారని, నూజివీడులో మాత్రం టీడీపీ అభ్యర్థిని ఓడగొట్టారన్నారు. ఎంపీగా తాను 10 వేల మెజారిటీని కోల్పోయానని, మున్సిపాల్టీలో కూడా పార్టీని ఓడించారని, అదే టీడీపీని గెలిపించినట్లయితే ఎంతో లాభం ఉండేదని వ్యాఖ్యానించారు. ఏపీని ప్రపంచబ్యాంకుకు అడ్డం పెట్టయినా రుణమాఫీ ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ బ్యాంకుకు అడ్డంపెట్టైనా చంద్రబాబు రైతు రుణమాఫీ చేస్తారని ఏలూరు ఎంపీ మాగంటి బాబు అన్నారు. పట్టణంలోని 28వ వార్డులో నిర్వహించిన జన్మభూమి వార్డుసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. టీడీపీ ప్రభుత్వం పింఛన్ నగదును పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపుతోందన్నారు. జన్మభూమా...! రాజకీయసభా ! 28వ వార్డులో నిర్వహించిన వార్డుసభ రాజకీయ సభలా మారింది. వార్డుసభలో ఏలూరు ఎంపీ మాగంటి బాబు పాల్గొనగా, ఆయనతో పాటు టీడీపీ నాయకులు నూతక్కివేణు, కాపా శ్రీనివాసరావు సైతం స్టేజీపైకి ఎక్కారు. దీంతో స్థానికులు ఇది జన్మభూమి కార్యక్రమమా, రాజకీయసభా అని నోరెళ్ల బెట్టారు. ఇదిలా ఉండగా ముసునూరు, చాట్రాయి మండలాల్లోని జన్మభూమి గ్రామసభల్లో పాల్గొన్న టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పట్టణంలో మాత్రం పాల్గొనలేదు. అలాగే ఈ సభల్లో పాల్గొనాల్సిన మంత్రి కామినేని శ్రీనివాస్ పట్టణంలోనే ఉన్నప్పటికీ డుమ్మా కొట్టారు. -
వీధినపడ్డ ‘తెలుగు’ తమ్ముళ్లు
నూజివీడులో ముదురుతున్న రగడ ఎంపీ వ్యాఖ్యలతో ముద్దరబోయిన వర్గం ఆగ్రహం అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయిన ‘దేశం’ నూజివీడు : నియోజకవర్గంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న తెలుగు తమ్ముళ్ల అంతర్గత విభేధాలు ఎంపీ మాగంటి బాబు వ్యాఖ్యలతో బట్టబయలయ్యాయి. టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలైన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు అనుకూల, వ్యతిరేక వర్గాలుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు నిట్టనిలువునా చీలి పోయారు. ముద్దరబోయినను ఇన్చార్జిగా ఎవరు నియమించారని ఆయన వ్యతిరేకవర్గం ప్రశ్నిస్తుండగా, ఓడిపోయిన అభ్యర్థే నియోజకవర్గ ఇన్చార్జిగా ఉండే ఆచారం తెలుగుదేశంపార్టీ పుట్టిన నాటి నుంచి కొనసాగుతోందని అనుకూలవర్గం వాదిస్తోంది. ఇప్పటివరకు చాపకింద నీరులా ఉన్న విభేదాలు, సోమవారం నూజివీడు వచ్చిన ఏలూరు ఎంపీ మాగంటి బాబు వ్యాఖ్యలతో ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూజివీడు నియోజకవర్గానికి ఇన్చార్జిగా ఇప్పటివరకు ఎవరినీ నియమించలేదని స్పష్టం చేయడంతో ముద్దరబోయిన వర్గానికి పుండుమీద కారం చల్లినట్లయింది. టీడీపీకి నూజివీడు అభ్యర్థిగా ముద్దరబోయిన వెంకటేశ్వరరావును చంద్రబాబు ప్రకటించిన నాటి నుంచి నియోజకవర్గంలోని ఒక వర్గం నాయకులు బహిరంగంగానే వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ వర్గం ఎన్నికల్లో టీడీపీకి పనిచేయలేదనే ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది. ముద్దరబోయిన, ఈ వర్గం నాయకులు పలు కార్యక్రమాల్లో కలసి పాల్గొన్నప్పటికీ ముభావంగానే ఉండేవారు. ఎన్నికల్లో ఓటమి పాలైన ముద్దరబోయిన నియోజకవర్గాన్ని వదిలిపెట్టి వెళ్లిపోతాడని ఈ వర్గం భావించింది. అయితే అందుకు విరుద్ధంగా ముద్దరబోయిన ఇక్కడే ఉండి పార్టీ కార్యక్రమాల కోసం తనవంతు పనిచేస్తుండడంతో జీర్ణించుకోలేని నాయకులు ఎలాగైనా పొమ్మనకుండానే పొగబెట్టి ఇక్కడి నుంచి పంపించేయాలనే లక్ష్యంతో ఇటీవల కొద్ది రోజుల నుంచి నియోజకవర్గ ఇన్చార్జిగా చంద్రబాబు ఎవరినీ నియమించలేదనే ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఇదే విషయాన్ని ఎంపీ స్వయంగా ప్రకటించడంతో తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమై నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. దీనిపై పార్టీలోని బీసీ నాయకులు మండిపడుతున్నారు. కావాలనే బీసీ నాయకుడైన ముద్దరబోయినను ఇక్కడి నుంచి ఎలాగైనా పంపించేయాలని పలు కుట్రలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కొంతమంది బీసీ నాయకులు ఇప్పటికే పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదులు పంపినట్లు తెలుస్తోంది. గతంలోనూ అప్పటి ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్యను సైతం ఇలాగే పొమ్మనకుండా పొగబెట్టి పార్టీలో నుంచి బయటకు వెళ్లిపోయే వరకు నిద్రపోలేదని, అదే తరహాలో ఇప్పుడూ చేయాలని చూస్తున్నారని బీసీనాయకులు అంటున్నారు.రాబోయే రోజుల్లో పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనంటున్నారు. -
'మాగంటి బాబును వెంటనే అరెస్ట్ చేయాలి'
-
'మాగంటి బాబును వెంటనే అరెస్ట్ చేయాలి'
హైదరాబాద్: ఖమ్మం జిల్లా అశ్వారావు పేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వరరావుపై దాడి చేసిన ఏలూరు ఎంపీ మాగంటి బాబును వెంటనే అరెస్టు చేయాలని తెలంగాణలోని వైఎస్ఆర్ సీపీ నేత గట్టు రామచంద్రరావు డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో గట్టు రామచంద్రరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ... మాగంటి బాబు ఆయన గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అశ్వరావుపేట నియోజకవర్గ ప్రజలు నీకేమైనా ఓటు వేశారా అని మాగంటి బాబును గట్టు రామచంద్రరావు సూటిగా ప్రశ్నించారు. తమ పార్టీ ఎమ్మెల్యే దాడిపై తెలంగాణ గిరిజన ఎమ్మెల్యేలు, ఆ రాష్ట్రా సీఎం, గవర్నర్‌ను కలవనున్నారని చెప్పారు. రాజకీయ లబ్ది కోసమే టీడీపీ రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోందని గట్టు ఆరోపించారు. అయితే తాటి వెంకటేశ్వరరావుపై దాడిని తెలంగాణ రాష్ట్ర మంత్రి టి.హరీష్ రావు ఖండించారు. శుక్రవారం తాటి వెంకటేశ్వరరావుకు హరీష్ రావు ఫోన్ చేసి పరామర్శించారు. దాడికి గల కారణాలను హరీష్ రావు ఈ సందర్భంగా తాటి వెంకటేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు. -
కుకునూరులో ఉద్రిక్తత
కుకునూరు: ఖమ్మం జిల్లా కుకునూరులో గురువారం ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఆంధ్రప్రదేశ్ లో విలీనమైన కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ సహా ఎంపీ మాగంటి బాబు తొలిసారి పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా కుకునూరులో జరిగిన సమావేశంలో ఎంపీ మాగంటి పాల్గొన్నారు. ఈ సమావేశంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అనుచరుల ఆందోళనకు దిగారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. దానికి ప్రతిగా జై ఆంధ్ర అంటూ మాగంటి అనుచరులు నినాదాలు చేశారు. అక్కడితో ఆగకుండా తాటి వెంకటేశ్వర్లు అనుచరులపై దాడికి యత్నించారు. -
జెండా పండుగకు తమ్ముళ్ల డుమ్మా
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఊహించిందే జరిగింది. టీడీపీ, బీజేపీ నేతల మధ్య పెరుగుతున్న ఎడబాటు పంద్రాగస్టు అధికారిక వేడుకల్లో స్పష్టంగా కనిపించింది. జెండా వందనం బాధ్యతను ప్రభుత్వం బీజేపీకి చెందిన దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు అప్పగించిన నేపథ్యంలో శుక్రవారం ఏలూరులో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమానికి చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు డుమ్మా కొట్టారు. ఈ గైర్హాజరీ యాధృచ్ఛికంగా జరిగిందా.. ఉద్దేశపూర్వకమా అని ఎవరూ బహిరంగంగా చెప్పే పరిస్థితి లేదు.నవ్యాంధ్రలో మొదటిసారి జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కానరాకపోవడం చర్చనీయూంశమైంది. వాస్తవానికి జెండా వందనం బాధ్యత తనకే వస్తుందని చివరి నిమిషం వరకు ఆశించి భంగపడిన గనులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత కర్నూలులో రాష్ట్రస్థారుులో నిర్వహించిన కార్యక్రమానికి వెళ్లిపోయూరు. మిగిలిన ఎమ్మెల్యేలైనా ఈ కార్యక్రమానికి హాజరౌతారని అందరూ భావించారు. కానీ .. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాత్రమే కాసేపు మెుహం చూపించి వెళ్లిపోయారు. మిగి లిన ప్రజాప్రతినిధులెవరూ కానరాలేదు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు కూడా రాకపోవడం చర్చనీయూంశమైంది. తమ పార్టీకి చెందిన మంత్రి కాబట్టి నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు హాజరై చివరివరకు ఉన్నారు. పదేళ్ల కాంగ్రెస్ హయాంలోను, అంతకుముందు తొమ్మిదేళ్ల టీడీపీ హయాంలోను ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. కనీసం 10మంది ఎమ్మెల్యేలైనా జిల్లా కేంద్రం ఏలూరులో జరిగే పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొని ఆ తర్వాత నియోజకవర్గాల్లో జెండా వందనం కార్యక్రమాలకు వెళ్లేవారు. ఈసారి ఇలా జిల్లా కేంద్రంలో నిర్వహించిన అధికారిక కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఎగ్గొట్టడం రాజకీయ విశ్లేషకుల్లో చర్చకు దారితీసింది. తెలుగుదేశం, బీజేపీ మధ్య దూరం పెరుగుతోం దన్న భావనకు ఈ వేడుకలు బీజం పోశాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -
టేకు బ్యాంక్ సేవలు భేష్
ఏలూరు అర్బన్ : ఏలూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ (టేకు బ్యాంక్) జాతీయ బ్యాంకులకు దీటుగా ప్రజలకు అన్ని రకాల సేవలు అందించడం అభినందనీయమని ఏలూరు ఎంపీ మాగంటి బాబు అన్నారు. స్థానిక కోటదిబ్బ వద్ద నున్న మర్చంట్స్ చాంబర్ కల్యాణమండపంలో శనివారం టేకు బ్యాంకు శతదినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఎంపీ బాబు మాట్లాడుతూ సామాన్య ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తేవాలనే ఆశయంతో వందేళ్ల కిందట నాటి పెద్దలు స్థాపించిన సహకార బ్యాంకు దినదిన ప్రవర్థమానంగా పెరుగుతూ ఖాతాదారుల మనసులను దోచుకుందన్నారు. బ్యాంకు ఛైర్మన్ అంబికా ప్రసాద్ మాట్లాడుతూ తమ బ్యాంకు ప్రస్తుతం రూ.45 కోట్ల డిపాజిట్లతో రాష్ట్రంలోని కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో మొదటి వరుసలో నిలుస్తుందన్నారు. బ్యాంకును విస్తరించేందుకు ఏలూరు టూటౌన్ ప్రాంతంలో మరో బ్రాంచి ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ టేకు బ్యాంకు నిర్వహణలో పాలక మండలి చైర్మన్ అంబికా ప్రసాద్, వైస్ చైర్మన్ బి. కరుణకుమార్ల కష్టం ఎంతగానో ఉందన్నారు. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం బ్యాంకింగ్ రంగ పరిస్థితి కత్తిమీద సాముగా మారిందని, ఏ బ్యాంకు ఎప్పుడు మూత పడుతుందో తెలియనిస్థితిలో టేకు బ్యాంకు వందేళ్ల పండుగ చేసుకోవదం ఆనందదాయకమన్నారు. నగర మేయర్ షేక్ మాట్లాడారు. అనంతరం బ్యాంకు యాజమాన్యం ఏపీ కో-అపరేటివ్ అర్బన్ బ్యాంకు అండ్ క్రెడిట్ సొసైటీస్ జనరల్ సెక్రటరీ సీహెచ్ రాఘవేంద్రరావు, ఏపీ స్టేట్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు జి.రామ్మూర్తిలను శాలువాలతో సత్కరించారు. -
‘పశ్చిమ'కు అల్లూరి పేరు !
ఏలూరు : మన జిల్లాకు మన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రతిపాదనలు ఇవ్వనున్నట్టు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత, ఏలూరు ఎంపీ మాగంటి బాబు చెప్పారు. స్థానిక జూట్‌మిల్లు సెంటర్లోని అల్లూరి సీతారామరాజు విగ్ర హం వద్ద శుక్రవారం అల్లూరి జీవిత చరిత్రపై ప్రచురించిన కరపత్రాన్ని మంత్రి, ఎంపీ ఆవిష్కరించారు. జిల్లాకు అల్లూరి పేరు పెట్టాలని కోరుతూ జిల్లాలోని ప్రజాప్రతినిధులంతా సమష్టిగా తీర్మానం చేసి ముఖ్యమంత్రికి నివేదిస్తామని వారు తెలిపారు. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కోసం విప్లవ మార్గన్ని ఎంచుకుని మన్యం ప్రజలను ఏక తాటిపై నడిపిన మహనీయుడు సీతారామరాజు అని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి బుజ్జి, నగర మేయర్ షేక్ నూర్జహాన్, డెప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, కలెక్టర్ సిద్ధార్థజైన్, జేసీ టి.బాబూరావునాయుడు, అసిస్టెంట్ కలెక్టర్ రవి సుభాష్, డీపీవో అల్లూరి నాగరాజువర్మ, సెట్వెల్ సీఈవో పి.సుబ్బారావు, హౌసింగ్ పీడీ జి.సత్యనారాయణ, ఏలూరు ఆర్డీవో శ్రీనివాస్, తహసిల్దార్ జీవీఎస్ సుబ్బారావు, టీడీపీ జిల్లా కార్యాలయ సమన్వయ కార్యదర్శి పాలి ప్రసాద్, పార్టీ నగర శాఖ అధ్యక్షుడు కొల్లేపల్లి రాజు పాల్గొన్నారు -
విద్య, వైద్య హబ్‌గా చిన్నతిరుపతి
సాక్షి, ఏలూరు : విద్య, వైద్య రంగాలలో ద్వారకాతిరుమల (చిన్నతిరుపతిని)ను అభివృద్ధి చేయాలని కేబినెట్లో నిర్ణయించినట్టు రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఏలూరులో ఎంపీ మాగంటి బాబు నివాసంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేవాదాయ భూములు అందుబాటులో ఉన్న చిన్న తిరుమలలో విద్యా, వైద్య సంస్థలు నెలకొల్పేందుకు అవకాశం ఉందన్నారు. ఆ దిశగా చర్యలు చేపట్టాల్సిందిగా జిల్లాకు చెంది న దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావును ముఖ్యమంత్రి చం ద్రబాబునాయుడు ఆదేశించనట్టు చెప్పా రు. పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు చూ పిన ఆదరణను మర్చిపోకూడదని, రాష్ట్ర మంత్రులందరూ తొలి ప్రాధాన్యం ‘పశ్చిమ’కు, తర్వాత అనంతపురం జిల్లాకు ఇవ్వాలని చంద్రబాబు సూచించినట్టు మంత్రి కామినేని తెలిపారు. నగరం బాధితులకు మెరుగైన వైద్యం తూర్పుగోదావరి జిల్లా నగరం ఘటన బాధాకరమని, గ్యాస్ పైప్‌లైన్‌లో పొరపాట్లే ఇందుకు కారణమని మంత్రి అన్నారు. 90 శాతం శరీరం కాలిన వారు బతికే అవకాశం లేదని, అవసరమైన వారికి మెరుగైన వైద్యం అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. తనకు ఏలూరుతో ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు. జిల్లా ఆసుపత్రిని అభివృద్ధి చే సి మెరుగైన సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే గ్యాస్‌లైన్ విస్పోటనం జరిగిందని ఎంపీ మాగంటి బాబు ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఎమ్మెల్యేలు మొడియం శ్రీనివాసరావు, గన్ని వీరాం జనేయులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయశాఖ జేడీ వి.సత్యనారాయణ, ఇన్చార్జి డీఎంహెచ్‌వో శంకర్రావు మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. 8 లైన్ల జాతీయ రహదారి చెన్నై నుంచి కోల్‌కతా వరకు జాతీయ రహదారిని 8 లైన్లుగా విస్తరించనున్నట్టు మంత్రి తెలిపారు. ఎంబీబీఎస్ సీట్ల పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని కోరిందని, దీనిపై త్వరలోనే విధానపరమైన నిర్ణయం వెలువడుతుందన్నారు. పీజీ వైద్య ప్రవేశాలపై 3, 4 తేదీల్లో విధాన రూపకల్పన చేస్తామని తెలిపారు. రాష్ర్టంలో 4 లక్షల హెక్టార్లలో ఆయిల్‌పామ్ తోటలు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటికే 1.15 లక్షల హెక్టార్లలో పం టలు వేశారని పలువురు రైతులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఓ ఈఆర్ నిబంధనల వల్ల నష్టపోతున్నామని, వ్యాట్ ఎత్తివేయాలని, ఎ గుమతి సుంకం విధించాలని రైతులు కోరారు. కేంద్ర మంత్రులతో చర్చించి చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. -
మాగంటికి అమెరికా ఆహ్వానం
ఏలూరు (ఆర్ఆర్ పేట) : అమెరికా రావాల్సిందిగా ఏలూరు ఎంపీ మాగంటి బాబుకు ఆహ్వానం అందింది. అక్టోబర్ 2న అమెరికాలో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆహ్వానించిన విషయం విదితమే, అదే కార్యక్రమానికి రావాల్సిందిగా అమెరికా నుంచి తనకూ ఆహ్వానం అందిందని మాగంటి బాబు బుధవారం తెలిపారు. బెల్టు షాపులు లేకుండా చూడండి మద్యం ఎక్కడబడితే అక్కడ అందుబాటులో లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ మాగంటి బాబు ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ చంద్రశేఖరనాయుడు, సూపరింటెండెంట్ వి.రేణుకను ఆదేశించారు. ఎంపీ బాబును వారిద్దరూ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ధేశించిన దుకాణాల్లో మాత్రమే మద్యం విక్రయూలు జరిగేలా చూడాలని, ఎక్కడైనా బెల్టు షాపులు కనిపిస్తే అందుకు ఆ ప్రాంత ఎక్సైజ్ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
ఉద్యోగ భద్రత కల్పించండి
భీమవరం క్రైం : ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న తమను తొలగించాలనుకోవడం దారుణమని, తమకు ఉద్యోగ భద్రతకల్పించేలా చూడాలని జిల్లాలోని ఆయుష్ ఉద్యోగులు ఏలూరు ఎంపీ మాగంటి బాబును శనివారం కలిసి వినతిపత్రం సమర్పించారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం ప్రారంభించిన నాటి నుంచి గ్రామాల్లో ఆయుర్వేద, హోమియో, యునాని, నేచురోపతి వంటి వైద్య సేవలను అందిస్తూ వస్తున్నామన్నారు. తమకు జీతాలు చెల్లించడం ఆలస్యమవుతున్నా కష్టపడి పనిచేస్తున్నామని వారు ఎంపీకి వివరించారు. అధికారులు తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల జిల్లాలో 81 మంది ఉద్యోగులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు. దీనిపై స్పందించిన మాగంటి బాబు ఆయుష్ కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడారు. ఆయుష్‌ను బలోపేతం చేయాలని, డాక్టర్లను నియమించి కార్యకలాపాలను విస్తరించేలా చూడాలని కమిషనర్‌ను ఎంపీ కోరారు. ఎంపీని కలిసిన వారిలో ఉద్యోగులు బి.రమేష్‌వర్మ, ఎన్.ఆంజనేయులు, వి.హైమావతి, చంద్రశేఖర్, సత్యనారాయణ తదితరులున్నారు. -
కొల్లేరు సమస్యలు పరిష్కరిస్తాం
ఎంపీ మాగంటి కైకలూరు, న్యూస్‌లైన్ : కొల్లేరు ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) అన్నారు. పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయిన తర్వాత గురువారం ఆయన మొదటిసారిగా కైకలూరు వచ్చారు. స్థానిక రైల్యేస్టేషన్ నుంచి భారీ ర్యాలీగా ఆయనను కార్యకర్తలు ఊరేగింపుగా తీసుకొచ్చారు. తర్వాత ఆటపాకలోని ఆయన నివాసంలో కార్యకర్తలను కలుసుకున్నారు. తన విజయానికి సహకరించిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో మోడి, సీమాంధ్రాలో చంద్రబాబు పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తామన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్న కొల్లేరు ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి రానున్న రోజుల్లో ప్రణాళిక రుపొందిస్తామన్నారు. ప్రధానంగా నియోజకవర్గంలోని కైకలూరు, మండవల్లి మండలాల్లో కొల్లేరు ఆపరేషన్ సమయంలో అధనంగా ధ్వంసం చేసిన 7500 ఎకరాల చేపల చెరువుల భూములను తిరిగి పేదలకు పంపిణీ చేసే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లామన్నారు. కొల్లేరు ఆపరేషన్ సమయంలో పనిచేసిన అప్పటి కలెక్టర్ నవీన్‌మిట్టల్‌తో సంప్రదించి పరిష్కార మార్గాలను అన్వేషించే ఆలోచన ఉందన్నారు. అదే విధంగా కొల్లేరు అభయారణ్యాన్ని కాంటూరు 5 నుంచి 3వరకు కుదించే అంశాన్ని కేంద్రానికి విన్నవిస్తామన్నారు. కొల్లేరు ప్రాంతంలో రహదారులు, తాగునీటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. పోలవరం అర్డినెన్స్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నల్లదనం వెలికితీతపై ప్రధాని మోడి సాహసోపేత నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని చెప్పారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఈడ్పుగంటి వెంకట్రామయ్య, చలమలశెట్టి రామానుజయ్య, కైకలూరు, కలిదిండి, ముదినేపల్లి జెడ్పీటీసీలు బొమ్మనబోయిన విజయలక్ష్మీ, నున్న రమాదేవి, రాష్ట్ర పార్టీ ఎస్సీసెల్ కార్యదర్శి మత్తె సూర్యచంద్రరావు, బూపతి నాగకల్యాణి, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు త్రినాథరాజు, విజయబాబు, శ్రీనివాసచౌదరి, విఠల్, పార్టీ నాయకులు కెవిఎన్‌ఎం.నాయుడు, దోనెపూడి రంగారావు, కమతం విశ్వాసం, ఎంఎ.రహీం, బీజేపీ నాయకులు లావేటి వీరశివాజీ, అమృత కమలాకరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఫ్యాన్‌కు ఓటేశాడని వృద్ధుడి హత్య
* వైఎస్సార్ సీపీ దెందులూరు అభ్యర్థిపై దాడి * అచ్చెన్నాయుడి ప్రోత్సాహంతో యువకుడిని కొట్టిన టీడీపీ కార్యకర్తలు సాక్షి నెట్వర్క్: ఎన్నికల సందర్భంగా బుధవారం పలుచోట్ల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారు. పలు చోట్ల దౌర్జన్యాలకు పాల్పడ్డారు. దొంగ ఓట్లు వే యటానికి ప్రయత్నించిన వారిని నిలదీసి నందుకు చితక్కొట్టారు. ఫ్యాన్‌కు ఓటేశానన్న వృద్ధుడి మీద దాడిచేయటంతో అతడు అక్క డికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దాడులు, దౌర్జన్యాలకు తోడు టీడీపీ నేతలు, కార్యకర్తలు పోలింగ్ సమయంలోనూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేయాలని ప్రయత్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం రాయన్నపాలెంలో దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కారుమూరి వెంకటనాగేశ్వరరావుపై టీడీపీ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కారుమూరి గన్‌మన్‌కు తీవ్రగాయాలయ్యాయి. కామవరపుకోట మండలం తడికలపూడిలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై ఏలూరు పార్లమెంటరీ టీడీపీ అభ్యర్థి మాగంటి బాబు దౌర్జన్యానికి పాల్పడ్డారు. గణపవరం మండలం అర్ధవరంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలను పోలీసులు కొట్టారు. పోలీసులు, కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనటంతో కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. పాలకొల్లు మండలం అరట్లకట్టలో టీడీపీ వారు ఓటర్లకు గిఫ్ట్‌కూపన్లు పంపిణీ చేశారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బడేటి బుజ్జి పోలింగ్ బూత్ వద్దే ప్రచారం నిర్వహించారు. పెరవలి మం డలం తీపర్రులో టీడీపీ నాయకులు నకిలీ నోట్లు పంచటంతో ఓటర్లు ఆందోళన చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో సీతానగరం మండలం ఇనగంటివారిపేటలో ఓటేసి వస్తున్న మెర్ల దశయ్య (70)ను టీడీపీ నాయకుడుమొగతడకల వెంకటమోహన్ ‘ఎవరికి ఓటేశావు’ అని అడిగాడు. ‘ఫ్యాన్‌కు వేశా’నని చెప్పడంతోనే వెంకటమోహన్ దుర్భాషలాడుతూ గుండెలపై మోదడంతో దశయ్య కుప్పకూలి మృతి చెందాడు. రామచంద్రాపురం మండలం నరసాపురపేట, కె.గంగవరం మండలం ఉడుమూడి, సుందరపల్లిల్లో దొంగ ఓట్లు వేస్తున్న తమ కార్యకర్తలను అడ్డుకుంటున్నారనే ఆగ్రహంతో టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ నాయకులపై దాడులకు దిగారు. సుందరపల్లికి చెందిన టీవీవీ సత్యనారాయణ, ఉడుమూడికి చెందిన సాదే వెంగళరావు, సాదే భద్రరావులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇదే కారణంతో రామచంద్రపురంలో వైఎస్సార్ సీపీ నాయకుడు కొండేపూడి సురేష్‌పై టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సోదరుడి కుమారుడు తోట బాబు, అతడి అనుచరులు దాడిచేసి తల పగులగొట్టారు. కోటనందూరు మండలం అగ్రహారంలో క్యూలైన్లో నిల్చుంటే ప్రచారం చేస్తున్నాడంటూ వైఎస్సార్ సీపీ కార్యకర్త రమణపై టీడీపీకి చెందిన బర్ల రాజు, యలమంచలి రమణ, మిరియాల మంగ దాడిచేసి గాయపరిచారు. వేట్లపాలెంలో ఓటేసి బయటకొచ్చి ‘ఫ్యాన్’ జోరుగా తిరుగుతోందన్న ఎస్సీ వర్గీయులపై టీడీపీ నాయకులు దాడి చేశారు. ఎస్సీలు ప్రతిదాడికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. జ్యోతులపై దాడికి యత్నం గండేపల్లి మండలం సింగరంపాలెంలో చనిపోయిన, పొరుగూరిలో ఉన్న వారి ఓట్లను కూడా టీడీపీ నాయకులు వేయిస్తుండడం గమనించిన వైఎస్సార్ సీపీ ఏజెంట్ అడ్డుకోవడంతో బలవంతంగా బయటకు పంపించేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జగ్గంపేట అసెంబ్లీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ పోలింగ్ బూత్‌కు చేరుకుని అధికారులను నిలదీశారు. ఇంతలో అక్కడకు వచ్చిన టీడీపీ నేతలు నెహ్రూను దూషిస్తూ దాడి చేయబోయారు. వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదంలో నెహ్రూ అనుచరుడు భూపాలపట్నం ప్రసాద్‌ను కిర్లంపూడి పోలీసులు అక్రమంగా నిర్బంధించారు. కాకినాడలో సిటీ టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రోద్బలంతో ఏటిమొగకు చెందిన మత్స్యకారులు పెద్దసంఖ్యలో తమ ఓట్లు గల్లంతయ్యాయనే నెపంతో పోలింగ్ సిబ్బందిని రెండుగంటల పాటు నిర్బంధించారు. సాంబమూర్తినగర్‌లో వైఎస్సార్ సీపీ నేత, మాజీ కార్పొరేటర్ కొప్పుల విజయకుమారి ఇంట్లోకి కాంగ్రెస్, టీడీపీ నేతలు చొరబడి డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ దౌర్జన్యం చేయటంతో వైఎస్సార్ సీపీ వారు ఆందోళన చేశారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి చంద్రశేఖర రెడ్డి అక్కడికి చేరుకొని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తొండంగి మండలం పెరుమాళ్లపురం పోలింగ్‌బూత్‌లో బూత్ లెవెల్ అధికారి.. ఓటర్ స్లిప్‌లు లేని వారికి పోలింగ్ స్టేషన్లోనే స్లిప్‌లు ఇస్తుండగా వైఎస్సార్సీపీకి అనుకూలంగా పనిచేస్తున్నావంటూ టీడీపీ వారు ఆయనపై దౌర్జన్యానికి దిగారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తిర్లంగిలో మూడు నెలల కింద మరణించిన తన సోదరుడి ఓటు వేసేందుకు వచ్చిన టీడీపీ వర్గీయుడిని నిలదీసిన ఓ యువకుడిపై ఆ పార్టీ కార్యకర్తలు దాడిచేశారు. మరణించిన బంటాల శివ ఓటు వేసేందు కు అతడి తమ్ముడు యివ్వరాజు పోలింగ్ బూత్‌లోకి రాగా బగాది సురేష్ అనే యువకుడు నిలదీశాడు. దీంతో ఆగ్రహించిన తెలుగు తమ్ముళ్లు సురేష్‌పై దాడి చేశారు. సురేష్ అక్కడికి కొద్దిదూరంలో గల బడ్డ బాబూరావు ఇంటికి వెళ్లిపోయాడు. తెలుగు తమ్ముళ్లు సురేష్‌ను బయటకు ఈడ్చుకొచ్చి మళ్లీ కొట్టారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న అచ్చెన్నాయుడు కార్యకర్తలను మరింత ఉసిగొల్పారు. దీంతో వారు.. సురేష్‌ను రక్షించుకునేందుకు వచ్చిన అతడి తల్లిదండ్రులు బగాది మల్లేసు, సుందరమ్మలపైనా దాడిచేశారు. గాయపడిన సురేష్‌ను టెక్కలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
సిల్లీ ‘బాబు’
- ప్రచారంలో మాగంటి తీరుతో బేజారెత్తుతున్న నాయకులు, కార్యకర్తలు - బూతు జోకులు, కుళ్లు - డైలాగులతో కాలక్షేపం - పేరు గొప్ప.. ఊరు దిబ్బ చందం సాక్షి ప్రతినిధి, ఏలూరు : పేరుగొప్ప.. ఊరు దిబ్బ.. అనే సామెత మాగంటి బాబుకు అతికినట్లు సరిపోతుంది. జిల్లాలో రాజకీయంగా ఒక వెలుగు వెలిగిన మాగంటి కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఆ స్థాయి రాజకీయాలను కొనసాగించలేక చతి కిలపడుతున్నారు. ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తున్న మాగంటి ప్రచారంలో ఏమాత్రం ప్రభావం చూపులేకపోతున్నారని తెలుగు తమ్ముళ్లు నెత్తీనోరూ బాదుకుంటున్నారు. సీటు రాకముందు వరకూ హడావుడి చేసిన ఆయన సీటు దక్కించుకున్నాక ప్రత్యర్థులతో పోటీ పడలేకపోతున్నారని టీడీపీ నేతలే చెబుతున్నారు. ప్రచారంలో కూడా బాగా వెనుకబడిన బాబు ఎక్కడకు వెళ్లినా కార్యకర్తల్లో ఉత్సాహం నింపకపోగా బూతు జోకులు, కుళ్లు డైలాగులు వేస్తూ వెగటు పుట్టిస్తున్నారనే ప్రచారం టీడీపీలో బాగా జరుగుతోంది. తండ్రి మాగంటి రవీంద్రనాథ్ చౌదరి, తల్లి మాగంటి వరలక్ష్మి వారసత్వాన్ని అందుకుని వారి రాజకీయ వారసుడిగా ముందుకొచ్చిన బాబుకు మొదట్లో జనంలో కొంత ఆదరణ ఉండేది. అయితే ఆయన తీరుగా హుం దాగా లేకపోవడం, రాజకీయంగా సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో జనంలో పలుచబడుతూ వచ్చారు.నాలుగుసార్లు ఎంపీగా పోటీచేసి కేవలం ఒకసారి మాత్రమే గెలిచారు. దెందులూరు నియోజకవర్గం నుంచి 2004లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి నిర్వహించి కూడా రాజకీయంగా ఫెయిలయ్యారనే వాదన ఉంది. ఈ క్రమంలోనే 2009 ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆయన పనితీరు సరిగా లేదని గ్రహించి మంత్రివర్గం నుంచి తొలగించారు. దీంతో బాబు టీడీపీ పంచన చేరారు. ఆ తర్వాత కూడా ఆయన రాజకీయ వ్యూహాలు తల్లకిందులవుతూనే ఉన్నాయి. ఎన్నికల్లో ప్రభావం శూన్యం ఈ ఎన్నికల్లో అయినా ఆయన కొంత ప్రభావం చూపిస్తారని తెలుగుదేశం పార్టీ క్యాడర్ భావించినా ఆయన మాత్రం తన పాత పంథాలోనే వెళుతున్నారు. దీంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నీరుగారిపోతున్నారు. కీలకమైన ఈ తరుణంలోనూ మాగంటి బాబు కార్యకర్తలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వారితో పనిచేయించుకోవడమే తప్ప వారి యోగక్షేమాలు పట్టించుకోకపోవడంతో అందరిలోనూ ఎన్నికల్లో పనిచేస్తున్నామన్న ఉత్సాహమే లేకుండాపోయిందని కొందరు నేతలు వాపోతున్నారు. జనంలోనూ సీన్ లేదు ఇక జనంలోనూ మాగంటి బాబుపై సరైన అభిప్రాయం లేకుండాపోయింది. సుదీర్ఘకాలం నుంచి రాజకీయాల్లో ఉన్నా ఆయన తమ ప్రాంతానికి ఏమీ చేయలేదని ఆయన సొంత నియోజకవర్గమైన దెందులూరులోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎంపీగా కొద్దిరోజులు పనిచేసినా పార్లమెంటరీ నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయారు. 2004లో దెందులూరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా అధికారంలో ఉండి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయారు. తొలినుంచీ కొల్లేరు ప్రజలు ఆయన్ను ఆదరిస్తున్నా వారి గురించి ఆలోచించిన పాపానపోలేదు. కొల్లేరు ప్రజలు ఇబ్బంది పడింది కూడా ఆయన పదవిలో ఉన్న సమయంలోనే.తన ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నా అప్పట్లో పెదవి విప్పలేదు. చివరకు కొల్లేరు ప్రజలకు మాత్రం ఏమీ ఒరగబెట్టలేకపోయారు.మొత్తంగా అటు ప్రజలకు ఇటు కార్యకర్తలకు ఏమీ చేయలేకపోయిన బాబు ఇప్పుడు మళ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. ప్రతిచోటా కుళ్లు జోకులు వేస్తూ ‘సిల్లీ ఫెలో’ అనిపించుకుంటున్న ఆయన తీరుపై పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో కలసి ప్రచారానికి వెళ్లటం వల్ల తమ వ్యక్తిగత ఇమేజ్ కూడా దెబ్బతింటోందని నాయకులు, కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. -
టీడీపీలోకి కావూరి రావొద్దు: మాగంటి బాబు
-
గుసగుస - కావూరికి దారేదీ?
పరీక్ష రాయించినా ఫలితం ఉండేట్టు కనిపించడం లేదు పాపం కావూరికి. ఆయన తన మద్దతుదారులందరికీ 'నేనే పార్టీలో చేరాలో చెప్పండి' అంటూ ప్రశ్న వేశారు. ఈ మేరకు ఒక కాగితం ముక్క కూడా ఇచ్చారు. వేర్వేరు పార్టీల పేరు ఇచ్చి, మీకు నచ్చిన దానికి ఓటేయండి అన్నారట. అందరూ 'తెలుగుదేశం' అన్నారట! ఇంకేముంది? రిజల్టు వచ్చేసింది అంటూ ఆయన పచ్చ కండువాలు రెడీ చేసుకున్నారట. అప్పటికే ఏలూరు ఎంపీ సీటుకు అనేక ఏళ్లుగా టవల్ వేసేసుకుని కూర్చున్న మాగంటి బాబు మాత్రం 'అసలిది పరీక్షే కాదు. ఈ ఫలితం చెల్లదు. 'శృతి నాది ... రివాల్వరూ నాదే' స్టయిల్లో 'సీటూ నాదే ఓటూ నాదే' అంటున్నారట. కావూరికి ఛాన్సిస్తే ఏలూరు సీటు కొల్లేరయిపోతుందని కూడా హెచ్చరిస్తున్నారట. -
టీడీపీ లో సెగలు
చిచ్చురేపుతున్న కాంగ్రెస్ నేతలు వారికే అగ్రతాంబూలం ఇస్తున్న అధిష్టానం ఘెల్లుమంటున్న తమ్ముళ్లు మాగంటి బాబు, ఇతర నేతల్లో తీవ్ర అసంతృప్తి జిల్లాలో వెలిసిపోరున పసుపు జెండాకు టీడీపీ అధినాయకత్వం కొత్త రంగు అద్దుతోంది. నిన్నటి వరకూ కాంగ్రెస్ పెద్దలతో చెట్టాపట్టాలేసుకుని తిరిగి.. రాష్ర్ట విభజనకు సహకరించిన చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ నేతలను పిలిచి మరీ పచ్చకండువా కప్పుతున్నారు. నియోజకవర్గాలు, పట్టణాల్లో ప్రత్యర్థులుగా ఉన్న నాయకులతో కలసి కాపురం చేయూలంటూ తమ్ముళ్లకు హుకుం జారీ చేస్తున్నారు. అధినేత తీరును పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఓటర్లు ఆదరించకపోరునా.. పదేళ్లుగా అధికారానికి దూరమైనా.. ఏదో ఒక రోజున అవకాశం రాకపోతుందా అన్న దింపుడు కళ్లం ఆశలతో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకులను తన స్వార్థం కోసం అధినేత అధఃపాతాళానికి తొక్కేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో’ అనే సామెతకు తెలుగుదేశం పార్టీ అసలైన అర్థం చెబుతోంది. ఎప్పటినుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారిని పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీ నుం చి వచ్చే నాయకులకు అధిష్టానం పెద్దపీట వేస్తుం డటం తెలుగుదేశం పార్టీలో చిచ్చురేపుతోంది. ప్రజాభిమానం కోల్పోరు.. అన్నిదారులూ మూసుకుపోవడంతో మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే ఈలి నాని టీడీపీలో చేరిపోయారు. కాంగ్రెస్‌లో సూపర్ సీనియర్‌నని చెప్పుకునే కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు, భీమవరం, తణుకు ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, కారుమూరి నాగేశ్వరరావు సైతం గత్యంతరం లేక అదే బాటలో పయనిస్తున్నారు. వీరంతా టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద సీట్లను రిజర్వు చేసుకుని టీడీపీలోకి వస్తుండటం పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు. కిందిస్థాయి కార్యకర్త నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకూ ప్రతి ఒక్కరూ అధినేత తీరుపై విరుచుకుపడుతున్నారు. బహిరంగంగా మాట్లాడకపోయినా అంతర్గతంగా చంద్రబాబు వ్యవహార శైలిని తప్పు పడుతున్నారు. మాగంటి బాబు ఆగ్రహం కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ సీటు కోసం ప్రయత్నాలు చేస్తుండటం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి మాగంటి బాబు కు మింగుడు పడటం లేదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కీలకంగా పనిచేసిన తనను కాదని కావూరికి సీటు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. పార్టీని నేరుగా తిట్టలేక కావూరిపై విరుచుకుపడ్డారు. ఆయనవల్లే రాష్ట్రం విడిపోయిందని, కావూరి జెడ్పీటీసీగా కూడా గెలవలేరని బాబు విమర్శించారు. ఆయన టీడీపీలోకి వస్తే సీమాంధ్రలో పార్టీకి నష్టం తప్పదని కుండబద్దలు కొట్టారు. మాగంటి నేరుగా కావూరిపై విమర్శలు చేయడానికి కారణాలు లేకపోలేదు. కొద్దిరోజుల క్రితం ఏలూరులో నిర్వహించిన సమావేశంలో మాగంటి గెలిచే అవకాశం ఉంటే టీడీపీ నాయకులు తనను ఎందుకు రమ్మని కోరతారని కావూరి అనటం మాగంటి వర్గీయులకు కోపం తెప్పించింది. దీంతో వారంతా కావూరిపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. కావూరిని పార్టీలోకి రాకుండా ఎలాగైనా అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కావూరి టీడీపీలో చేరేందుకు ఉన్నత స్థాయిలో లాబీ నడుపుతున్నారు. ఘెల్లుమంటున్న గూడెం టీడీపీ తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే ఈలి నాని టీడీపీలో చేరడాన్ని అక్కడి టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. కొట్టుకు తాడేపల్లిగూడెం సీటిస్తే తాము పనిచేసేది లేదని అక్కడి నేతలు, కార్యకర్తలు హెచ్చరికలు చేస్తున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ముళ్లపూడి బాపిరాజు ఈ విషయంపై అధినేత వద్దే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయినా చంద్రబాబు పట్టించుకోకుండా వారిద్దరినీ పార్టీలోకి ఆహ్వానించడంతో స్థాని క నాయకత్వం డోలాయమానంలో పడింది. మొదటి నుంచీ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారిని కాదని కొత్త వారికి సీటిస్తే సహాయ నిరాకరణ చేయాలనే యోచనలో అక్కడి కీలక నేతలున్నారు. భీష్మిస్తున్న భీమవరం నేతలు భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు టీడీపీలో చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మొన్నటివరకూ తమను ఇబ్బందులు పెట్టిన వారి కోసం ఇప్పుడు ఎలా పనిచేస్తామని కార్యకర్తలు అడుగుతున్న ప్రశ్నలకు నేతల వద్ద సమాధానం లేకుండాపోయింది. కొత్తవారితో సర్దుకుపోవాలని చంద్రబాబు చెబుతున్న మాటలు వారి చెవికెక్కడంలేదు. దీంతో టీడీపీలో గందరగోళం నెలకొంది. ఇప్పటివరకూ పార్టీని నడిపించిన వారి కోసం పనిచేయాలా, కొత్తగా వచ్చిన బయట నేతల కోసం పనిచేయాలో తెలియక కార్యకర్తలు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలు మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ప్రభావం చూపనున్నారు. -
'కావూరికి ద్వారాలు తెరిచి లేవు'
ఏలూరు : కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు తెలుగుదేశం పార్టీలో రావటాన్ని ఆపార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కావూరికి టీడీపీ ద్వారాలు తెరిచి లేవని టీడీపీ నేత, మాజీమంత్రి మాగంటి బాబు వ్యాఖ్యానించారు. ఒకవేళ కావూరిని టీడీపీలోకి వస్తే పశ్చిమ గోదావరి జిల్లాలోని 13 నియోజకవర్గాల్లోనూ ఫలితాలు తారుమారు అవుతాయని ఆయన హెచ్చరించారు. జరగబోయే ఎన్నికల్లో రెండు లక్షల మెజార్టీతో తన గెలుపు ఖాయమని మాగంటి బాబు ధీమా వ్యక్తం చేశారు. కాగా మొదట్లో సమైక్యాంధ్ర నినాదం అందుకుని.. కేంద్ర కేబినెట్లో స్థానం లభించిన అనంతరం సమైక్యవాదులను ‘వెధవలు.. దద్దమ్మలు’ అంటూ తిట్టిపోసిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు రాజకీయ భవిష్యత్ కోసం కొత్త పాచిక వేశారు. తెలుగుదేశం పార్టీలో చేరాలనే యోచనలో ఉన్న ఆయన మూడు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యూరు. తన మనసులోని మాటను నాయకులతో బయటపెట్టించారు. ఇదే సందర్భంలో ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మాగం టి బాబు గెలిచే అవకాశం ఉంటే తాను టీడీపీలోకి వెళ్లాల్సిన పనిలేదని కావూరి పేర్కొన్నారు. పరోక్షంగా మాగంటి బాబుకు గెలిచే అవకాశం లేదని, తనకు అభ్యర్థిత్వం ఇస్తే గెలుస్తాననే విధంగా టీడీపీ నాయకులకు సంకేతాలు పంపించారు. ‘నేనేం చేస్తే బాగుంటుంది. మీరేం అనుకుంటున్నారు’ అని రాసిన ప్రశ్నాపత్రాలను సభకు హాజరైన వారి చేతిలో పెట్టారు. ఆ ప్రశ్నలకు కాంగ్రెస్‌లోనే కొనసాగాలి, టీడీపీకి వెళ్లాలి, వైఎస్సార్ సీపీకి వెళ్లాలి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలి అనే జవాబులు ఇచ్చి వాటి ఎదురుగా ఉన్న గడిలో టిక్ చేయూలని సూచించారు. చివరకు ఎక్కువ మంది టీడీపీలో చేరాలనే రాసినట్టు సమాచారం. -
ఎమ్మెల్యే జయమంగళపై తెలుగు తమ్ముళ్ల వీరంగం
ముదినేపల్లి, న్యూస్‌లైన్ : పార్టీ కార్యకర్తల అభీష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణపై తెలుగు తమ్ముళ్లు తిరగబడ్డారు. ఎమ్మెల్యే, కార్యకర్తల మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగి టీడీపీలోని వర ్గవిభేదాలు మరోసారి బజారున పడ్డాయి. పార్టీ అధిష్టానం సైతం విస్మయం చెందే ఇలాంటి సంఘటన ముదినేపల్లిలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే మండలంలోని శ్రీహరిపురం సర్పంచ్ బడుగు జయమ్మ కుమారుడు భాస్కరరావు కాంగ్రెస్ పార్టీ స్థానిక ప్రముఖుడు. గుడ్లవల్లేరు మండలం వేమవరం కొండాలమ్మ గుడి వద్ద ఆదివారం ఆయన విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాగంటి బాబు, రాష్ట్ర కార్యదర్శి ఈడ్పుగంటి వెంకటరామయ్యలను, స్థానిక నేతలను ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని టీడీపీ మండల అధ్యక్షుడు కె.విఠల్, జిల్లా తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి చలసాని జగన్మోహనరావు, తెలుగు యువత మండల అధ్యక్షుడు పరసా విశ్వేశ్వరరావు, పార్టీ నాయకులు అడుసుమిల్లి రాము తీవ్రంగా వ్యతిరేకించారు. కార్యక్రమానికి హాజరుకావ ద్దంటూ ఎమ్మెల్యేను, ఇతర నాయకులను కోరారు. అయినప్పటికీ వీరి మాటలు పెడచెవిన పెట్టి ఎమ్మెల్యే వెంకటరమణ, రాష్ట్ర కార్యదర్శి ఈడ్పుగంటి వెంకటరామయ్యలు నాయకులతో కలిసి విందుకు తరలివెళ్లారు. దీంతో ఆగ్రహించిన తెలుగు యువత మండల అధ్యక్షుడు పరసా విశ్వేశ్వరరావు కైకలూరులోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలోని తన ఫొటోని చింపివేశారు. ఎమ్మెల్యేను నిలదీసిన వైనం... ఫొటో చించేసిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జయమంగళ విందు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం స్థానిక పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో విందులో ఎందుకు పాల్గొన్నావంటూ ఎమ్మెల్యేను విఠల్, రాము, విశ్వేశ్వరరావు, చలసాని జగన్మోహనరావులు ప్రశ్నించి ఎమ్మెల్యే వర్గీయులను తీవ్ర పదజాలంతో దూషించారు. తాము వద్దన్న కాంగ్రెస్ కార్యకర్త ఆహ్వానాన్ని ఎందుకు మన్నించారని ప్రశ్నించారు. రాష్ట్ర కార్యదర్శి వెంకటరామయ్య మాటలు విని మండలంలోని పార్టీని నాశనం చేస్తున్నారని పేర్కొన్నారు. తాము వాస్తవాలను చెపుతున్నప్పటికీ వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా ఈడ్పుగంటి నాయకత్వంలో పనిచేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే, కార్యకర్తల మధ్య మాటామాటా పెరిగి తోపులాటకు దారి తీసింది. ఒకరిపై ఒకరు చెయ్యి చేసుకునేందుకు సైతం ప్రయత్నించగా ఇరువర్గాల నాయకులు వారింపజేశారు. sదీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే క్రమశిక్షణలేని కార్యకర్తలు పార్టీలో ఉన్నా లేకున్నా ఒక్కటేనని, బయటకు వెళ్లిపోవాలని అన్నారు. ఈ తతంగం నడుస్తుండగానే ఇరు వర్గాల నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయంలో నానా హంగామా చేశారు. ప్రధాన రహదారిలో వచ్చి పోయే ప్రజలు ఈ తంతు చూసేందుకు పార్టీ కార్యాలయం ముందు గూమిగూడి తెలుగు తమ్ముళ్ల ఆగ్రహావేశాలను ముక్కున వేలేసుకుని తిలకించారు. తాగి పార్టీ పరువు తీస్తున్న ఎమ్మెల్యే... ఈ ఘటనపై టీడీపీలోని ఒక వర్గం నాయకులు తీవ్రంగా స్పందించారు. పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు. తరచూ ఎమ్మెల్యే మద్యం మత్తులో ఉంటూ కార్యకర్తలను తూలనాడుతూ పార్టీ పరువును గంగలో కలుపుతున్నారని టీడీపీ మండల అధ్యక్షుడు కె.విఠల్, తెలుగుయువత అధ్యక్షుడు పరసా విశ్వేశ్వరరావు విమర్శించారు. ఇందుకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈడ్పుగంటి వెంకటరామయ్య మద్దతు పలుకుతూ ఎమ్మెల్యే పతనానికి పరోక్షంగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యేను అల్లరి పాలు చేస్తే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధిష్టానం టిక్కెట్ ఇవ్వదని, ప్రత్యామ్నాయంగా తానే పోటీ చేయవచ్చనే దురుద్దేశంతో ఎమ్మెల్యేను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే కూడా తనకు టిక్కెట్ రాదనే ఉద్దేశంతో పార్టీని మండలంలో భూస్థాపితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే తాను చేసిన తప్పును సరిదిద్దుకుని నడవడిక మార్చుకోకుంటే రాజకీయంగా పతనం తప్పదని హెచ్చరించారు. -
టిడిపి నేతలు మాగంటి బాబు, అంబికా కృష్ణ అరెస్ట్
ఏలూరు: ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు టీడీపీ నేతలు మాగంటి బాబు, అంబికా కృష్ణ, బడేటి బుజ్జిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా వారు పేరయ్యకోడేరులో సభ నిర్వహించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో వీరిని పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టనున్నట్లు సమాచారం. ఈసీ అనుమతి లేకుండా వారు ఎన్నికల సభ నిర్వహించినట్లు పోలీసులు చెప్పారు. -
పందెంకోళ్లు కత్తులు దూశాయ్!
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లా సరిహద్దుల్లో కోడిపందేలు రెండు రోజులుగా జోరుగా సాగుతున్నాయి. హనుమాన్‌జంక్షన్ సమీపంలో.. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం తాళ్లమూడి వద్ద, కృత్తివెన్ను పల్లెపాలెం సమీపంలోని లోసరి వద్ద భారీఎత్తున పందేలు వేశారు. లోసరిలో నిర్వహించిన కోడిపందేల శిబిరాన్ని 16 మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు రెండు రోజులపాటు సందర్శించారు. జిల్లాలో కోడిపందేలు, పేకాట జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు పోలీసులు చేసిన హెచ్చరికలు అభాసుపాలయ్యాయి. జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని పోలీసులు ప్రకటించినా..ఈ అవరోధాలన్నింటినీ దాటి పందెంరాయుళ్లు తమ పంతం నెగ్గించుకున్నారు. మొవ్వ మండలం కోసూరు, పామర్రు మండలం జమిగొల్వేపల్లిలో కోతముక్క జోరుగా సాగింది. ఒకవైపు పోలీసులు దాడి చేస్తున్నా.. మరో వైపు పందెగాళ్లు సెల్ఫోన్ల ద్వారా సమాచారం పంపుతూ ఎక్కడికక్కడే పందేలు నిర్వహించారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలో కోడిపందేలకు అనుమతులు లేకపోవడంతో ఆ ప్రాంతంవారంతా జిల్లాలోని పలుచోట్లకు తరలివెళ్లి పండగను సరదాతీర్చుకున్నారు. రెండు రోజులుగా జిల్లాలో కోడిపందేలు, పేకాటల రూపంలో రూ. 50 కోట్లకు పైగానే చేతులు మారినట్లు సమాచారం. పందేలు జరిగిన తీరిదీ.. కైకలూరు మండలం భుజబలపట్నం, కలిదిండి మండలం పులపర్రు, చింతలపాడులో శిబిరాలు ఏర్పాటుచేసి పెద్దఎత్తున కోడిపందేలు నిర్వహించారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, మాజీ మంత్రి మాగంటి బాబు స్వయంగా పోటీలను ప్రారంభించారు. ఇక్కడ రెండు రోజుల పాటు యథేచ్ఛగా పందేలు జరిగాయి. గుడివాడ పట్టణం, మండలం సరిహద్దుల్లో రెండు ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు పోటాపోటీగా రెండు శిబిరాలు ఏర్పాటు చేసి కోడిపందేలు నిర్వహించారు. నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి, ఆగిరిపల్లి, ముసునూరు, నూజివీడు ప్రాంతాల్లో కోడిపందేలకు అడ్డు, అదుపు లేకుండాపోయింది. మైలవరంలోని దేవుడు చెరువు, సూరిబాబుపేట, పోరాటనగర్, కనిమెర్లతండా, పుట్లూరు తదితర ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా సాగాయి. అవనిగడ్డ నియోజకవర్గంలోని ఘంటసాల మండలం శ్రీకాకుళం, పాపవినాశనం గ్రామాల సరిహద్దులో కరకట్ట పక్కనే పెద్ద ఎత్తున కోడిపందేల శిబిరం నిర్వహించారు. శ్రీకాకుళం రేవు వద్ద పందెంరాయుళ్ల రాకతో తిరునాళ్లను తలిపించింది. పామర్రు నియోజకవర్గంలోని మొవ్వ మండలం పెడసనగల్లు గ్రామంలో ఏర్పాటు చేసిన కోడిపందేల శిబిరాన్ని మంత్రి పార్థసారథి రెండు రోజులూ వచ్చి సందర్శించారు. బల్లిపర్రు, పామర్రు, కురుమద్దాలి, పెరిసేపల్లి, యలకుర్రు తదితర ప్రాంతాల్లో జోరుగా పేకాట, కోడిపందేలు సాగాయి. పెడన నియోజకవర్గంలోని బంటుమిల్లి మండలం పెందుర్రులో భారీగా కోడిపందేల బరిని ఏర్పాటు చేశారు. ఇక్కడ పగలు సమయంలో కోడిపందేలు, రాత్రి సమయంలో కోతముక్క జోరుగా సాగాయి. నాగేశ్వరరావుపేట, అర్తమూరు, చెరుకుమిల్లి తదితర ప్రాంతాల్లో కోడిపందేలు ఇష్టారాజ్యంగా సాగాయి. కృత్తివెన్ను మండలం పల్లెపాలెం సమీపంలో పశ్చిమగోదావరి జిల్లాలోని లోసరి వంతెనకు సమీపంలో పంటపొలాల్లో పెద్దఎత్తున పందేలు నిర్వహించారు. ఈ శిబిరాన్ని 16 మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు సందర్శించటం గమనార్హం. గూడూరు మండలంలోని పిండివానిపాలెం, గూడూరు, పెడన మండలం తోటమూల, కట్లపల్లి, ఉప్పలకలవగుంట తదితర ప్రాంతాల్లో భారీ ఎత్తున కోడిపందేలు నిర్వహించారు. బందరు మండలంలోని పోలాటితిప్ప, కోన, చిన్నాపురం, కానూరు తదితర ప్రాంతాల్లో పేకాట, కోడిపందేలు జోరుగా సాగాయి. -
ఎలాగయ్యూ బాబూ!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఏలూరు ఎంపీ సీటు కేటాయింపు వ్యవహారం తెలుగుదేశం పార్టీలో రెండు ముఖ్య కుటుం బాల మధ్య దూరాన్ని పెంచుతోంది. ఈ స్థానం నుంచి మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాగంటి బాబు పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అదే సీటుపై కన్నేసిన ముళ్లపూడి కుటుంబీకులు తమ వర్గీయుడిని రంగంలోకి దింపేందుకు పావులు కదుపుతుండటం ఆసక్తికరంగా మారింది. కేంద్ర మాజీ మంత్రి బోళ్ల బుల్లిరామయ్య మనుమడు రాజీవ్ ఈ సీటు కోసం తెరవెనుక గట్టి ప్రయత్నాలు చేస్తుండటం మాగంటి వర్గీయులకు మింగుడు పడటం లేదు. తనకు దక్కుతుందనుకున్న సీటు కోసం చివరి దశలో ముళ్లపూడి కుటుంబం పోటీకి రావడంతో ఆయన నొచ్చుకుంటున్నారని సమాచారం. ఈ వ్యవహారం తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మాగంటి బాబుకు తొలినాళ్లలో చంద్రబాబు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన విషయం తెలిసిందే. 2009 ఎన్నికల్లో ఏలూరు లోక్‌సభా స్థానం నుంచి మాగంటిని పోటీకి దింపగా ఓటమి పాలయ్యూరు. అయినా పార్టీని అంటిపెట్టుకుని ఉంటూ.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు. నియోజ కవర్గంలో పార్టీని చాలావరకూ ఆయనే నడిపిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఆయనకే ఏలూరు ఎంపీ సీటు దక్కుతుందని అందరూ భావిస్తున్నారు. ఆయన కూడా కొద్దిరోజుల నుంచి టీడీపీ తరఫున తానే మళ్లీ ఏలూరు నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే పార్లమెం టరీ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో తిరుగుతున్నారు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉన్నా పోటీ చేసేందుకు మళ్లీ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ముళ్లపూడి కుటుంబం ఒత్తిడి ఇదే సీటుపై కేంద్ర మాజీ మంత్రి బోళ్ల బులిరామయ్య మనుమడు రాజీవ్ కన్నేసి దానికోసం ప్రయత్నాలు చేస్తుం డటం పార్టీలో చర్చకు దారితీసింది. ముళ్లపూడి కుటుంబం తరఫున ఆయనకు సీటివ్వాలని కూడా కొందరు కోరుతుండటం చర్చనీయాంశమైంది. బోళ్ల రాజీవ్ తాను సైతం తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తానని కొద్దిరోజుల క్రితం స్పష్టం చేశారు. ఇప్పుడు ఏలూరు ఎంపీ సీటు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచా రం జరుగుతోంది. నిజానికి 25 ఏళ్లపాటు ఏలూరు సీటును తెలుగుదేశం పార్టీ ముళ్లపూడి-బోళ్ల కుటుంబానికే కేటాయిస్తూ వస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి 2004 ఎన్నికల వరకూ బోళ్ల బులిరామయ్య ఇక్కడ నుంచి ఆ పార్టీ తరఫున పోటీ చేస్తూ వచ్చారు. నియోజకవర్గాల పునర్విభజనలో బుల్లిరామయ్య సొంత ప్రాంతమైన తణుకు అసెంబ్లీ సెగ్మెంట్ నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోకి వెళ్లింది. దీంతో ఆయన పోటీకి దిగే అవకాశం లేకుండాపోయింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన మాగంటి బాబుకు ఆ సీటును కేటాయిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ ఏలూరు ఎంపీ సీటును తమకే ఇవ్వాలని బోళ్ల కుటుంబం కోరుతుం డటం చర్చనీయాంశమైంది. అయితే ఆ కుటుంబానికి బాగా పట్టున్న తణుకు సెగ్మెంట్ నరసాపురం పార్లమెంటరీ స్థానం పరిధిలోకి వెళ్లిన నేపథ్యంలో ఆ కుటుంబానికి ఏలూరు సీటు ఎలా ఇస్తారనే వాదన వినిపిస్తోంది. ఇవేమీ పట్టిం చుకోకుండా రాజీవ్ తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. దీంతో మాగంటి వర్గీయులు కారాలు మిరియాలు నూరుతున్నారు. డబ్బుంటే సరిపోదంటూ బోళ్ల వర్గీయులపై పెద్దఎత్తున విమర్శలు కురిపిస్తున్నారు.