చంద్రబాబు మీటింగ్లో మైకు విసిరిన మాగంటి
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న సమావేశం రసాభాసగా మారింది. పశ్చిమగోదావరి జిల్లా కుక్కనూరు మండలం ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు.
చంద్రబాబు పాల్గొన్న సమావేశంలో వేదికపైకి రాకుండా జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను పోలీసులు అడ్డుకోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. తమను స్టేజీపైకి రానివ్వకపోవడాన్ని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు జీర్ణించుకోలేకపోయారు. పోలీసుల తీరును తీవ్రంగా నిరసిస్తూ ఎంపీ మాగంటి బాబు మైక్ విసిరేశారు.