mike
-
అమెరికా విదేశాంగ మంత్రిగా రూబియో
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిౖన డొనాల్డ్ ట్రంప్ కీలక పదవులకు ఎంపికలను వేగిరం చేశారు. విదేశాంగ మంత్రిగా ఫ్లోరిడా సెనేటర్ మార్కో రూబియో(53)ను, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) పదవికి కాంగ్రెస్ సభ్యుడు మైక్ వాల్జ్ (50)లను ఎంపిక చేశారు. రూబియో, వాల్జ్‌ల ఎంపికను ట్రంప్ రెండో హయాంలో భారత్– అమెరికాల మధ్య సన్నిహిత సంబంధాలకు కొనసాగింపుగా భావిస్తు న్నారు. భారత్‌కు మిత్రుడిగా పేరున్న రూబియో, భారత్– అమెరికా సంబంధాలను మెరుగుపర్చడంలో కీలకంగా ఉంటున్నారు.ట్రంప్‌కు నమ్మినబంటుగా పేరున్న వాల్జ్ భారత్‌కు పాత మిత్రుడే. భారతీయ అమెరికన్ల పక్షాన మాట్లాడే వాల్జ్, ఇండియా కంగ్రెషనల్ కాకస్‌కు సహాధ్యక్షుడిగా ఉండటం గమనార్హం. వీరిద్దరితోపాటు యునైటెడ్ స్టేట్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్టివ్ ఏజెన్సీ(ఈపీఏ) హెడ్‌గా కాంగ్రెస్ మాజీ సభ్యుడు లీ జెల్డిన్ పేరును ట్రంప్ ప్రకటించారు. అయితే తాజా ఎంపికలపై ట్రంప్ యంత్రాంగం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.ఇండియా కాకస్ హెడ్‌కు ఎన్ఎస్ఏ బాధ్యతలుభారత్ కాకస్ కో–చైర్‌గా ఉన్న వాల్జ్ ఎన్ఎస్ఏ హోదాలో ట్రంప్ విధానాలకు అనుగుణంగా కఠిన విధానాలను తీసుకొస్తారని భావిస్తు న్నారు. ఈ నియామకానికి సెనేట్ ఆమోదం అవసరం లేదు. అమెరికా ఆర్మీలో కల్నల్‌గా అఫ్గానిస్తాన్, పశ్చిమాసియా, ఆఫ్రికాల్లో పనిచేశారు. వీరోచితంగా పోరాడినందుకు ప్రతిష్టాత్మక గ్రీన్ బెరెట్ గౌరవం పొందారు. వాల్జ్ 2019 నుంచి అమెరికా కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నారు.ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ చైర్మన్‌గా 2021లో అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణపై అధ్యక్షుడు జో బైడెన్‌ను నిలదీసి వార్తల్లో కెక్కారు. ప్రాంతీయ సుస్థిరత సాధనకు చైనాపై కఠిన వైఖరి, భారత్ వంటి ప్రజాస్వామిక దేశాలతో బలమైన పొత్తులు అవసరమన్నది ఈయన వాదన. 2023లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా క్యాపిటల్ హిల్ వద్ద ప్రసంగాన్ని ఏర్పాటు చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. ఏమిటీ ఇండియా కాకస్..?అమెరికా కాంగ్రెస్‌లో భాగమైన ఇండియా కాకస్ భారత్ అనుకూల విధానాల రూప కల్పనలో చురుగ్గా వ్యవహరిస్తుంది. భారత్–అమెరికా ఆర్థిక వ్యవస్థ, భద్రతలను ప్రభావితం చేస్తుంది. 2004లో అప్పటి సెనేటర్లు, విదేశాంగమంత్రి హిల్లరీ క్లింటన్, జాన్ కార్నిన్‌లు నెలకొల్పారు. ప్రస్తుతం 40 మంది సభ్యులున్న ఈ కమిటీ సెనేట్‌లో అతిపెద్ద కాకస్‌గా గుర్తింపు పొందింది. -
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్.. స్పీకర్ మైక్ జాన్సన్ ప్రకటన
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖాయమైపోయింది. దీంతో ఆయన రెండోసారిఅ అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కేందుకు సిద్ధమయ్యారు. అమెరికన్ ఓటర్లు.. రిపబ్లికన్ పార్టీ వైపే మొగ్గు చూపారు. దీంతో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌కు నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలో అమెరికా నూతన అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారని యూఎస్ హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించి.. డొనాల్డ్ ట్రంప్, రన్నింగ్‌మేట్( ఉపాధ్యక్షుడు) జేడీ వాన్స్‌కి అభినందనలు తెలిపారు.‘‘ మేం అమెరికాను రక్షించాం. రిపబ్లిక్ పార్టీ ఘన విజయంతో..యూఎస్ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడిగా సెనేటర్ జేడీ వాన్స్ వైట్ హౌస్‌కు వెళ్తున్నారు. వారితో కలిసి అమెరికన్ ప్రజల కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని అన్నారు.We have saved America. 🇺🇸The American people have spoken, and President Trump and Senator JD Vance are going to the White House. We are ready to get to work for the American people.— Speaker Mike Johnson (@SpeakerJohnson) November 6, 2024చదవండి: రెండోసారి అధ్యక్ష పీఠంపై డొనాల్డ్ ట్రంప్ : ఇష్టమైన డ్రింక్ ఇదే, క్యాన్ల కొద్దీ! -
‘హాల్ ఆఫ్ ఫేమ్’లో షరపోవా, బ్రయాన్ బ్రదర్స్
న్యూపోర్ట్: అంతర్జాతీయ టెన్నిస్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో రష్యా స్టార్ మరియా షరపోవా... మేటి డబుల్స్ జోడీ బ్రయాన్ బ్రదర్స్ బాబ్, మైక్‌లకు చోటు లభించింది. బ్యాలెట్ సెలెక్షన్స్ ఓటింగ్ ద్వారా ఈ ముగ్గురిని ఎంపిక చేశారు. ఐదు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించిన షరపోవా 2020లో టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పింది. షరపోవా ఆ్రస్టేలియన్ ఓపెన్ (2008), వింబుల్డన్ (2004), యూఎస్ ఓపెన్ (2006) గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను ఒక్కోసారి నెగ్గగా... ఫ్రెంచ్ ఓపెన్‌ను (2012, 2014) రెండుసార్లు సొంతం చేసుకొని ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత సాధించింది. కవల సోదరులైన బాబ్, మైక్ బ్రయాన్లు అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో 438 వారాలు నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచారు. అంతేకాకుండా 16 గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్‌ను దక్కించుకున్నారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం నెగ్గడంతోపాటు 2007లో అమెరికా జట్టు డేవిస్ కప్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించారు. -
ఖలీస్థానీ వేర్పాటువాది అమృత్‌పాల్‌కి ‘మైక్’ గుర్తు కేటాయింపు
జైలులో ఉన్న ఖలీస్థానీ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ పార్లమెంట్ స్థానం నుంచి అమృత్ పాల్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఆయనకు కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్‌కు ‘మైక్’ గుర్తును కేటాయించింది. పోలింగ్ గుర్తులు కేటాయించిన మొత్తం 169 స్వతంత్ర అభ్యర్థుల్లో అమృత్ పాల్ సింగ్ ఒకరు. ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థకు చీఫ్ అయిన అమృత్ పాల్.. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టై.. ప్రస్తుతం అసోంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్నారు. అదే విధంగా ఫరీద్కోట్( రిజర్వు) స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సరబ్జిత్ సింగ్ ఖాస్లాకు ‘చెరుకు రైతు’ గుర్తును ఈసీ కేటాయించింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీని హత్య చేసిన నిందితుల్లో ఒకరైన బియాంత్ సింగ్ కుమారుడే సరబ్జిత్ సింగ్. ఇక.. పంజాబ్‌లోని 13 స్థానాలకు చివరి ఏడో విడతలో జూన్ 1న పోలింగ్ జరగనుంది. -
నేటితో ప్రచారం సమాప్తం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. పంపకాలకు తెరలేవనుంది. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల ప్రచారం మూగబోనుంది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని 13 నియోజకవర్గాల పరిధిలో నేటి సాయంత్రం 4 గంటలతోనే ప్రచార కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుంది. నేటి సాయంత్రం తర్వాత ఇక రాజకీయ నేతలు, స్టార్ క్యాంపైనర్లు ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలపై మీడియాతో మాట్లాడరాదని, ప్రెస్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించరాదని ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రలోభాలపై దృష్టి పోలింగ్‌కు రెండు రోజులే మిగిలి ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రలోభాల పంపిణీపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. ఓ వైపు పోల్ మెనేజ్మెంట్కు ఏర్పాట్లు చేసుకుంటూ మరోవైపు ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు, మద్యం పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఒక్కో ఓటరుకు రూ.2వేల నుంచి రూ.3వేలు చొప్పున పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు చర్చ జరుగుతోంది. గ్రామీణ నియోజకవర్గాల్లో ఇప్పటికే డబ్బులు, మద్యం పంపిణీ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. పోలింగ్‌కు ముందు రోజు రాత్రి నాటికే ఓటర్లకు డబ్బులు, మద్యం చేరవేసేందుకు ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం. ఇక పోలింగ్‌కు ముందు రోజు రాత్రి మద్యం నిల్వలను బయటకి తీసి ఓటర్లకు పంపిణీ చేయనున్నారని చర్చ జరుగుతోంది. డబ్బులు, మద్యం పంపిణీని ఎన్నికల యంత్రాంగం ఎంత మేరకు నియంత్రించ గలుగుతుందో చూడాలి. -
కమెడియన్ మృతి.. అతనికి గుండెపోటు కాదు!
'బ్రేకింగ్ బ్యాడ్' సిరీస్‌లో కీలక పాత్రలో నటించిన హాస్యనటుడు మైక్ బటాయే జూన్ 1న మరణించిన సంగతి తెలిసిందే. అతను మొదట గుండెపోటుతో చనిపోయాడని కుటుంబసభ్యులు వెల్లడించారు. కానీ తాజాగా వైద్యాధికారులు ఇచ్చిన నివేదికలో అతను ఉరి వేసుకోవడం వల్ల మరణించాడని వెల్లడైంది. గతంలో కూడా ఆయన కుటుంబంలో ఎవరికీ కూడా గుండె జబ్బులు ఉన్నట్లు ఎలాంటి చరిత్ర లేదని తెలిసింది. కాగా.. జూన్ 1న మిచిగాన్‌లోని ఆయన ఇంట్లో విగతజీవిగా కనిపించారు. నటుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకున్న హాలీవుడ్ ప్రముఖులు షాక్‌కు గురవుతున్నారు. (ఇది చదవండి: స్మగ్లింగ్ వివాదంపై స్పందించిన 'జబర్దస్త్' హరి) మైక్ బటాయే కెరీర్ మైక్ బటాయే సూపర్‌హిట్ సిరీస్ బ్రేకింగ్ బ్యాడ్లో మూడు ఎపిసోడ్లలో డెన్నిస్ మార్కోవ్స్కీగా కనిపించాడు. అంతేకాకుండా 'ఇట్స్ ఆల్వేస్ సన్నీ ఇన్ ఫిలడెల్ఫియా,' 'స్లీపర్ సెల్,' 'ది బెర్నీ మాక్ షో,' 'బాయ్ మీట్స్ వరల్డ్,' 'ఎవ్రీబడీ లవ్స్ రేమండ్' వంటి షోలలో కూడా నటించాడు. వీటితో మైక్ బటాయే న్యూయార్క్ గోతం, లాస్ ఏంజిల్స్ లాఫ్ ఫ్యాక్టరీ, కామెడీ స్టోర్, ది ఇంప్రూవ్, ఐస్‌హౌస్ వంటి ప్రముఖ కామెడీ క్లబ్‌లలో కూడా ప్రదర్శన ఇచ్చాడు. (ఇది చదవండి: 'సీతారామం' బ్యూటీకి బంపరాఫర్.. ఈసారి ఏకంగా!) -
ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా ..
దుబ్బాకరూరల్ : ‘ఇందుమూలంగా గ్రామ ప్రజలకు తెలియజేయునది ఏమనగా...’ అని దండోరా ద్వారా పంచాయతీలో జరిగే కార్యక్రమాలను తెలియజేసేవారు. అయితే, ఇప్పుడా దండోరా మూగపోనుంది. దుబ్బాక మండలం పోతారెడ్డిపేట, తాళ్లపల్లి గ్రామాలు కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. గ్రామస్తులకు పంచాయతీ తరపున ఏదైనా సమాచారం చేరవేయాలంటే మైక్సెట్లను వినియోగిస్తున్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరికీ వినిపించేందుకు ప్రతి వీధి, వాడలో మైక్సెలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర సమాచారం తెలిజేసేందుకు వీటిని ఉపయోగిస్తున్నారు. ఒక్క రోజు ముందుగానే గ్రామస్తులకు విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు. ఇలా ప్రచారం చేసేందుకు విలేజ్ హెల్పర్‌ను నియమించారు. పోతారెడ్డిపేటలో.. గ్రామస్తులకు సమచారాన్ని తెలియజేసేందుకు 30 మైక్‌సౌండ్‌లు ఏర్పాటుచేశారు. గ్రామంలో ఉన్న 10 వార్డుల్లో వీటిని అమర్చారు. ప్రచారం చేయడానికి ప్రత్యేకించి విలేజ్ హెల్పర్‌ను నియమించారు. గ్రామంలో మొత్తం జనాభా 3500 ఉండగా.. ఓటర్లు 2100, ఇళ్లు 1000, కుటుంబాలు దాదాపు 1,600 ఉన్నాయి. తాళ్లపల్లిలో.. గ్రామంలో మొత్తం 8 వార్డులు ఉన్నాయి. జనాభా 1000, ఇళ్లు దాదాపు 150, కుటుంబాలు 200 ఉండగా మైక్‌సౌండ్‌లు 15 ఏర్పాటుచేశారు. మా ఊరిలోనూ.. ఊరి ప్రజలకు ఏదైనా సమాచారం తెలియజేయాలంటే ప్రతిసారి దం డోర వేసేవాళ్లం. రెండు నెలల నుంచి ప్రతి వీధి, వాడకు 30 వరకు మైక్‌సౌండ్‌లు ఏర్పాటు చేశాం. ఇందుకోసం ప్రత్యేకించి విలేజ్ హెల్పర్‌ని నియమించాం. – చింతల జ్యోతి, మాజీ సర్పంచ్, పోతారెడ్డిపేట అందరికీ తెలుస్తోంది మా ఊరిలో 12 మైక్‌సౌండ్‌లు ఏర్పాటు చేశాం. ఏదైనా సమాచారం తెలియాలంటే మైక్‌తో చెప్పడం వలన అందరికీ వెంటనే తెలుస్తుంది. డప్పుతో దండోరా వేయిస్తే కొంత మందికి తెలిసేది కాదు. మైక్‌తో ప్రచారం సులువుగా మారింది. – శ్రీనివాస్‌గౌడ్, ఎంపీటీసీ సభ్యుడు, తాళ్లపల్లి ఒక్క రోజు ముందుగా.. మా గ్రామంలో ఏదైనా సమాచారం ఉంటే నేనే మైక్ ద్వారా ప్రచారం చేసి చెబుతా. ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర సమస్యలు ఏవైనా మైక్ ద్వారానే ప్రచారం చేస్తా. ఒక్క రోజు ముందుగానే ఉదయం, సాయంత్రం ప్రచారం చేస్తా. – కాసి సుధాకర్, విలేజ్ హెల్పర్, పోతారెడ్డిపేట మైక్‌తో స్పష్టంగా.. ప్రతి వీధిలో మైక్‌లు బిగించిండ్రు. మైక్ ద్వారా సమాచారం చెప్పడం వల్ల మా ఇంటి దాకా వినబడుతంది. మా ఇంటి దగ్గర కూడా మైక్ సౌండ్ బిగించిండ్రు. గ్రామంలో ఎక్కడ ఉన్నా మైక్ ద్వారా చెబుతుండటంతో స్పష్టంగా వినబడుతుంది. – ఉప్పరి రాములు, గ్రామస్తుడు -
తల తెగిపడిపోయినా..!
‘‘నా తల తెగిపడినా సరే..’’ అంటూ అప్పుడప్పుడూ భీష్మ శపథం చేస్తుంటారు కొందరు పెద్దమనుషులు. అదో సరదా! కానీ, ఓ అమెరికా కోడి మాత్రం ఈ శపథాన్ని కాస్తంత సీరియస్‌గానే తీసుకున్నట్టు ఉంది. తలే తెగిపడిపోయినా సరే ప్రాణాలు నిలబెట్టుకుంది. అది కూడా ఏదో కాళ్లీడ్చుకుంటూ కాదు. నిటారుగా నిలబడుతూనే, ఠీవిగా నడుస్తూనే! 1945 నాటి సంగతి.. కొలరాడోలోని ఫ్రూటా నివాసి, రైతు లాయిడ్ ఓల్సెన్ మార్కెట్‌కు వెళ్లాడు. ఎన్నో రోజులుగా అతడి భార్య కోడికూర కావాలని పోరు పెడుతుండటమే అందుకు కారణం. రాత్రి భోజనానికి చక్కగా పనికొచ్చేలా ఓ ఐదున్నర మాసాల వయసు కోడిని ఎంచుకున్నాడు. దానికి ఓ పేరు కూడా ఉందండోయ్. అదే 'మైక్' ఈ కోడిని చంకలో బెట్టుకుని ఇంటికి చేరుకున్న ఆయన.. తన కత్తిని పదును పెట్టాడు. రాత్రి వంటకు సిద్ధమయ్యే ముందు ఆ కత్తితో కోడి తలపై ఒక్క వేటు వేశాడు. అంతే.. పీక ఎగిరి అల్లంత దూరాన పడింది. ఇక కూర వండుకు తినడమే తరువాయి అనుకున్నాడు లాయిడ్. కానీ, చిత్రంగా కోడి చావలేదు. పైగా ఏమీ జరగలేదన్నట్టుగా రెండు కాళ్లపై నిటారు నిల్చుంది. దీంతో ఆశ్చర్యపోవడం లాయిడ్ దంపతుల వంతైంది. ఇంత జరిగాక కూడా దాన్ని కోసుకుతింటే బాగోదనిపించి, ఆయన పెంచుకోవడం మొదలుపెట్టాడు. దానికి ఐ డ్రాపర్ సహాయంతో నీళ్లు, ఆహారం అందించేవాడు. అలా దాదాపు 18 నెలలపాటు ఆరోగ్యంగా జీవించింది మైక్. చివరకు ఓ రోజు లాయిడ్ ఆహారం తినిపిస్తుండగా మైక్ ఆహార నాళం పూర్తిగా మూసుకుపోయింది. అలా ఊపిరాడక పైలోకాలకు వెళ్లిపోయింది మైక్..!! -
చంద్రబాబు మీటింగ్‌లో మైకు విసిరిన మాగంటి
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న సమావేశం రసాభాసగా మారింది. పశ్చిమగోదావరి జిల్లా కుక్కనూరు మండలం ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. చంద్రబాబు పాల్గొన్న సమావేశంలో వేదికపైకి రాకుండా జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను పోలీసులు అడ్డుకోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. తమను స్టేజీపైకి రానివ్వకపోవడాన్ని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు జీర్ణించుకోలేకపోయారు. పోలీసుల తీరును తీవ్రంగా నిరసిస్తూ ఎంపీ మాగంటి బాబు మైక్ విసిరేశారు. -
అరివీర భయంకర మైకాసురుడు
తిక్క లెక్క మైకు కనిపించగానే మైకం ముంచుకొచ్చినట్లు గంటల తరబడి ఉపన్యాసాలు దంచేవాళ్లను మైకాసురులని పిలుచుకుంటాం. ఇలాంటి శాల్తీలు ఎక్కువగా సాహితీ సభల్లో, రాజకీయ సభల్లో తారసపడుతూ జనాల సహనానికి పరీక్ష పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్లందరినీ తలదన్నే అరివీర భయంకర మహా మైకాసురుడు ఈ ఫొటోలో కనిపిస్తున్న పెద్దమనిషి. ఈ ముంబైవాలా పేరు అజయ్ శేష్. వృత్తిరీత్యా వైద్యుడు, ప్రవృత్తిరీత్యా మైకాసురుడు. మైకు పట్టుకుని మరీ రికార్డు బద్దలు కొట్టాలని డిసైడైపోయిన ఈ పెద్దమనిషి గత ఏడాది మే 27న ముంబైలోని ఒక హోటల్లో కార్యక్రమం ఏర్పాటు చేశాడు. జనాలు వచ్చి కూర్చున్నాక మే 27 మధ్యాహ్నం 3.44 గంటలకు మైకు పుచ్చుకుని ఉపన్యాసం మొదలుపెట్టాడు. నిరంతరాయంగా తన వాగ్ధాటిని మే 30 వేకువ జామున 4.13 గంటల వరకు కొనసాగించి గిన్నెస్ రికార్డు బద్దలు కొట్టాడు. -
హమ్మయ్య! 'మైక్' భలే బతికిపోయింది!
అనగనగా ఓ వ్యక్తికి ముసలి గాడిద ఉంటుంది. అది బావిలో పడుతుంది. గాడిద ముసలిదవ్వడం, నీళ్లులేని ఆ బావితో ప్రయోజనం లేకపోవడంతో.. ఆ గాడిదతో సహా బావిని పూడ్చేయాలని అతను భావిస్తాడు. కానీ ఆ గాడిద తెలివిగా అతను పోసిన మట్టినంతా దులుపుకొని బావి పూడ్చేసే సరికి పైకి వచ్చేస్తుంది. ఇది మనకు తెలిసిన కథ. ఇలాంటిదే ఐర్లాండ్‌లో జరిగింది. అయితే అక్కడ గాడిద బావిలో కాకుండా వరద నీళ్లలో చిక్కుకుపోయింది. గాడిదే కదా మనకెందుకొచ్చిన ఖర్మ అనుకొని వాళ్లు వదిలేయలేదు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య సాహసోపేతంగా బోటులో ప్రయాణించి ఆ గాడిదను కాపాడారు. ఎంతోసేపు వరదనీళ్లలో బిక్కుబిక్కుమంటూ గడిపిన గాడిద ఎట్టకేలకు ఒడ్డుకు చేరడంతో ఆనందంగా ఒండ్ర పెట్టింది. తనను కాపాడిన రెస్క్యూ సిబ్బందిని చూసి ఓ నవ్వు కూడా విసిరింది. ఈ ఘటన సోమవారం ఐర్లాండ్‌లోని కెర్రీ ప్రాంతంలో జరిగింది. తన గాడిద వరదనీటిలో చిక్కుపోయింది కాపాడమంటూ దాని యాజమాని 'యానిమల్ హెవెన్ యానిమల్ రెస్క్యూ' సంస్థను ఆశ్రయించాడు. వాతావరణ పరిస్థితులు బాగాలేకున్నా.. ఆ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది సాహసోపేతంగా వరదనీటిలో బోటువేసుకొని వెళ్లి మరీ దానిని కాపాడారు. ప్రాణాపాయం నుంచి బయటపడిన ఈ గాడిదకు 'మైక్' పేరు పెట్టారు. మైక్ ఇప్పుడు యాజమాని కొట్టంలో విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్నది. Posted by Animal Heaven Animal Rescue on Sunday, December 6, 2015 -
పదే పదే మైక్ కట్ చేశారు...
-
పదే పదే మైక్ కట్ చేశారు...
హైదరాబాద్ : అసెంబ్లీ సాక్షిగా మరోసారి ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేసింది అధికార పక్షం. సంతాప తీర్మానాల విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించింది. సోమవారం ఉదయం తొమ్మిదిన్నరకు సభ ప్రారంభమైన వెంటనే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కూడా మాట్లాడారు. ఆ తర్వాత గోదావరి పుష్కర మృతులపై అసెంబ్లీ తీర్మానం చేసింది. దీనిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు మాట్లాడే అవకాశమే కల్పించలేదు. ఆయన మాట్లాడుతుంటే పదే పదే మైక్ కట్ చేశారు. మధ్యలో శానససభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, మంత్రి అచ్నెన్నాయుడు, టీడీపీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అడ్డు తగిలారు. విపక్షంపై ఎదురుదాడే లక్ష్యంగా అధికార పార్టీ తీరు సాగింది. వైఎస్ జగన్ మాట్లాడుతుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతొ వైఎస్ జగన్ మాట్లాడకుండానే... గోదావరి పుష్కర మృతులకు అసెంబ్లీ సంతాప తీర్మానం చేసింది. అటు ప్రత్యేక హోదా కోసం చనిపోయిన వారిపై పెట్టిన తీర్మానాన్ని ప్రతిపక్ష నేత మాట్లాడకుండానే సభ ఆమోదించింది. ప్రత్యేక హోదా మృతులపై చేసిన తీర్మానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కరే మాట్లాడారు. అంతేకాకుండా ప్రతిపక్షం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుందని చంద్రబాబు హెచ్చరికలు చేశారు. మీరిలాగే మాట్లాడితే... మేం ఏం చేయాలో...అది చేస్తాం అంటూ అసహనం వ్యక్తం చేశారు. -
వాళ్ళకే మైకులు వస్తాయి..మాకు రావు
-
మైకే నా ప్రాణం
కథ చూడ్డానికి చాలా చిత్రంగా కనిపించవచ్చు. కానీ... కబడ్డీ కూతకు వెళ్లే ముందర బరికి మొక్కినట్టుగానే మెట్లకు మొక్కి మరీ వేదిక మీదికెక్కాడు మా రాంబాబు. మేక మెడకు మోకున్నట్లుగా, కార్పొరేట్ సంస్థలో పనిచేసేవారి మెడల్లో ఐడీకార్డులాగా వాడి మెడలోనూ ఓ తాడుంది. ఆ తాడుకు వేలాడుతూ మైకుంది. వెనక వేదిక బ్యాక్‌డ్రాప్‌గా ఓ ఫ్లెక్సీ. ఆ ఫ్లెక్సీ ముందర తన విశ్వరూపవిన్యాస ప్రదర్శన చేస్తున్న అపర అవతారమూర్తిలా మా రాంబాబు. ‘సభానిర్వహణ’ అనేది గుణాల గురించి రాసినంత ఈజీ కాదు. అదో కళ. అన్ని కళల కంటే క్లిష్టమైన, ఉన్నతమైన కళ. ఆ కళ ఎలా అబ్బిందో మా రాంబాబుకు అబ్బింది. ముందు ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా ఒక రోజంతా గుక్క తిప్పుకోకుండా మాట్లాడగల మొనగాడు. పుట్టుకతోనే కొన్ని ప్రత్యేకతలు వస్తాయన్న వాదాన్ని నేను నమ్మను గాని, అనుకరణ, కృషి ద్వారా ఉద్దండులైన చాలామంది ఉపన్యాసకుల్లో లేని ప్రత్యేకత ఏదో రాంబాబులో ఉంది. ‘కళ కళ కోసం కాదు ప్రజల కోసం’ అనే సిద్ధాంతం మీద మా రాంబాబుకు అపార నమ్మకం. తన ఉపన్యాస కళను ప్రజలకు పంచడం కోసం ‘పరదా’అనే సాంస్కృతిక సంస్థను స్థాపించాడు. ‘పరదా’ కోసం తన జీవితాన్నే ధారపోశాడు. గత రెండు దశాబ్దాలుగా ‘పరదా’ను విజయవంతంగా నడుపుతున్నాడు. ‘పరదా’ నిర్వహించే కార్యక్రమాలకి జనం తండోపతండాలుగా వస్తారు. వచ్చినవారికి పరదా వెనుక తలా ఒక బిర్యానీ పొట్లం ఇస్తారు అన్నంత ఇదిగా వస్తారు. జనాన్ని కడుపుబ్బ నవ్వించడమే ‘పర దా’కు సరదా. ప్రతి సంవత్సరం ఓ ఘటికుణ్ని దొరకబుచ్చుకొని ‘పర్సన్ ఆఫ్ ద పరదా’ అనే అవార్డు ఇచ్చి ఘనంగా సత్కరిస్తుంది. ఈనాడు అలాంటి ఓ బ్రహ్మాండమైన సభకు మనం వెళుతున్నాం. విశాలమైన ఆడిటోరియం జనాలతో నిండిపోయింది. మైకబ్బాయి చివరిసారిగా మైకును సరిచేసుకున్నాడు. అసలు మైకు లేకున్నా సభ చివర మూలన కూచున్న ముసలమ్మకు కూడా వినపడేంత ఘాటుగా ఉంటుంది రాంబాబు మాట. సభ అంటే మైకే కాబట్టి మైకును పెట్టక తప్పలేదు. సభాసదులందరూ వచ్చిన తరువాత ‘పరదా’ కార్యదర్శి వేదిక మీదకొచ్చి ‘పరదా’ సంస్థకి రెండు జీవితకాలాల అధ్యక్షుడు, ఈనాటి సభాధ్యక్షుడు, అనితర సాధ్యుడు, డు, డు, డు, డూ... లాంటివి అనేకం చెప్పి, రాంబాబును వేదిక మీదికి ఆహ్వానించి సభను నిర్వహించాలని వేదిక దిగిపోయాడు. రాంబాబు తన వెంట తెచ్చుకున్న కార్డులెస్ మైకును స్టేజీమీద మెల్లగా... గుడ్డును బల్లమీద పెట్టినంత జాగ్రత్తగా పెట్టాడు. తన ఎడమ జేబులో ఉన్న బొట్టు డబ్బా తీసి మైకుకు కుంకుమ బొట్టు పెట్టాడు. ప్యాంటు కుడి జేబులో నుండి అగరుబత్తులు తీసి వెలిగించాడు. ‘పరదా’ సభ్యుడు పరుగెత్తుకుంటూ తెచ్చిన కొబ్బరికాయను కొట్టి, నీళ్లు తలమీద చల్లుకొని, తనను తాను దీవించుకున్నాడు. స్టేజీమీద సాష్టాంగపడి మైకుకు మొక్కి, లేచి నిలబడి మైకును తీసి కళ్లకు అద్దుకొని, ఉఫ్ ఉఫ్ అని ఊదాడు. చాలా గంభీరంగా ఉపన్యాసం మొదలుపెట్టాడు. సభాసదులందరికీ ధన్యవాదాలు అన్నాడు. దీనికంతటికీ కారణం మీరే అని ధ్వనించేలాగా. ముందుగా రంగయ్యగారిని వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాం, వారిని బొకేతో ఆహ్వానించవలసిందిగా రమణయ్యను కోరుతున్నాను అనగానే ఈలలు, చప్పట్లు మారుమోగిపోయాయి. బొకే తీసుకున్న రంగయ్య నవ్వుతూ ఫొటోకు ఫోజు ఇచ్చి, రాంబాబుతో కరచాలనం చేశాడు. జనం వైపు తిరిగి పాప్ సింగర్లాగ రెండు చేతులూ ఎత్తి కుడికీ ఎడమకీ బాగా వంగి వంగి ఐదారుసార్లు చేతులు వూపి తన సీటులో ఆసీనుడయ్యాడు. తరువాత సాయికుమార్, రమణమూర్తి, బ్రహ్మానందు, వేలుమాధవ్, సుశీల్, కోవై సరిత కూడా తమకు ఇచ్చిన బొకేను తీసుకొని, ఫొటోకు ఫోజు ఇచ్చి, తమ తమ సీట్లలో ఆసీనులు అయ్యారు. రాంబాబు కొనసాగించాడు. ఈ కార్యక్రమ విశిష్టత ఏంటో మీకు తెలుసు. ‘తాటిచెట్టును మోకు లేకుండా ఎక్కి పక్కనే ఉన్న ఈతచెట్టు మీద నుండి దిగడం’ అనే సాహసోపేతమైన త్యాగ చర్యను చేసిన రంగయ్యకు ఈ సంవత్సరం ‘పర్సన్ ఆఫ్ ది పరదా’ అవార్డుతో గౌరవించడం చంద్రునికో కాదు, కాదు, దుప్పటికో నూలు పోగు లాంటిది. ‘తాడును ఎక్కి ఈదును దిగడం’ అనే చర్యను సాధించడానికి వారు పడిన తపన, ఆవేదన, కష్టం, నష్టం వర్ణనాతీతం. ‘‘గతంలో ఎవరైనా తాటిచెట్టు ఎక్కితే తాటిచెట్టు మీది నుంచే దిగారు. ఈతచెట్టు మీదుగా దిగడం అనే దుస్సాహసానికి ఎవరూ ఒడిగట్టలేదు. అలాంటి త్యాగమూర్తి, ఆదర్శమూర్తిని సన్మానించుకోవడం మనందరి అదృష్టం. మన గడ్డమీద ఉన్న గట్టోణ్ణి మనం గట్టిగానే సన్మానించుకుందాం. మీరు గట్టిగా చప్పట్లు కొట్టండి’’ అని రంగయ్యను సింహాసనం మీద కూర్చుండబెట్టి గజమాల వేసి, శాలువా కప్పి, వేదిక మీదున్న ఆహ్వానితులు ఫొటోలో సరిగా పడేలాగా సర్దుకొని, గ్రూపు ఫొటో దిగారు. మేం సన్మానించకపోతే రంగయ్యకు దిక్కూ దివాణం లేదు అన్న ఫీలింగు వేదిక మీదున్న అందరి మొహాల్లో ప్రతిఫలించింది. బ్రేకింగ్ న్యూస్ కోసం విలేకరులు ఆ ఫొటో తీసుకొని తమ పత్రికలకు, చానళ్లకు పంపారు. రాంబాబు నాలుగు అడుగుల పొడవున్న ఫొటోని తీసుకొని సభాసదులకు చూపిస్తూ, ‘‘ఈ సన్మాన పత్రాన్ని నేను స్వయంగా రాశాను. అక్షరాలను గుదిగుచ్చి రాసిన ఈ సన్మాన పత్రం నేను చదివితేనే మీకు అర్థం అవుతుంది. సమయాభావం వల్ల, ఈ సన్మాన పత్రం అంతా చదవలేను. కాని, కొన్ని ముఖ్య ఘట్టాలను మాత్రం మీ ముందుంచే ప్రయత్నం చేస్తానని’’ అబద్ధం చెప్పి, ఆ సన్మాన పత్రం ఆసాంతం చదవడమే గాక, ప్రతి లైను కవితాత్మకంగా రెండు రెండుసార్లు చదివి, రంగయ్యగారి మీదున్న అపార గౌరవాన్ని మరోమారు చాటుకున్నాడు. సన్మానం తరువాత వేదిక మీద ముఖ్యులంతా వెనక్కి వెళ్లి, తమ సీట్లలో సర్దుకొని కూర్చున్నారు. తమ వంతు వచ్చినప్పుడు రంగయ్య గురించి లయాత్మకంగా మాట్లాడటం కోసం తయారుచేసుకున్న ఉపన్యాసాన్ని నెమరువేసుకుంటున్నారు. పక్కన ఉన్నవాళ్లతో గుసగుసగా మాట్లాడి రంగయ్య గురించి కొత్త సమాచారం సేకరించి తమ ఉపన్యాస పాఠంలో జోడిస్తున్నారు. చీకట్లో ఒంటరిగా ఉన్నప్పుడు దయ్యం గుర్తొస్తే కలిగే ఫీలింగు వాళ్ల ముఖాల్లో ప్రతిఫలిస్తోంది. సభాధ్యక్షులు రాంబాబు వేదిక మధ్యకు వచ్చి ఐ.డి. కార్డులాగా మెడలో వేలాడుతున్న మైకు అందుకొని, ‘‘రంగయ్యగారి గొప్పతనం ఏమిటో ఈపాటికే మీకు తెలిసి ఉంటుంది’’. ఈనాటి ముఖ్య అతిథి, సాయికుమార్‌గారు రంగయ్య గురించి, పనిలో పనిగా నా గురించి ఏం మాట్లాడతారో మీకు తెలుసా? తెలీదు. నాకు తెలుసు. ‘ఏమాత్రం జంకూ బొంకూ లేకుండా తాటిచెట్టును ఎక్కి, ఈతచెట్టు మీదుగా దిగే సాహసానికి ఒడిగట్టిన రంగయ్యకు భారత ప్రభుత్వం శౌర్య పథకాన్ని ప్రదానం చేయాల’ని గట్టిగా డిమాండు చేస్తాడు. ఎన్నో రంగాల్లో రికార్డు సృష్టించిన మొనగాళ్లు ఉండగా, తాటిచెట్టు రంగాన్నే ఎంచుకున్నాడంటే, రాంబాబుకు కల్లు అంటే ఇష్టమని, కార్మిక పక్షపాతి అని అర్థం అవుతుంది’ అని అంటాడు. ఇక నటుడు, దర్శకుడు, రచయిత, విప్లవకారుడు రమణమూర్తిగారి అభిప్రాయం ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘‘రంగయ్యగారు ఒక కీర్తి కిరీటం. ఈ జిల్లా మణిదీపం. ప్రభుత్వం ‘తాటి అకాడమీని స్థాపించి, దానికి రంగయ్యగారిని చైర్మన్ చేయాల’ని డిమాండ్ చేయదలుచుకున్నారు. ఇక బ్రహ్మానందుగారు రంగయ్య గురించి చెప్పే ఒక్కటే మాట ఏంటంటే, ‘రంగయ్యగారు విదూషకత్వానికి వారసుడని, సినిమాల్లోకొస్తే నా స్థానం ఊడుతుంద’ని అంటాడు. యస్... అందులో ఎలాంటి అనుమానం, అతిశయోక్తి లేవు అని నేను చెప్పదలుచుకున్నాను. ఇక వేలుమాధవ్గారు రంగయ్యగారి పట్ల చాలా ఉత్కృష్టమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ‘రంగయ్యగారు ఒక గంధర్వుడని, ఒక జ్ఞాని’ అని వారు గాఢంగా నమ్ముతున్నారు అని వేలుమాధవ్ వైపు చూడగా, వేలుమాధవ్ అవునన్నట్లుగా చిరునవ్వుతో తల ఊపాడు. ఇక సుశీల్ అభిప్రాయం ప్రకారం ‘‘రంగయ్యగారు రాజకీయాల్లోకి వస్తే మాత్రం, ముఖ్యమంత్రి కావడం ఖాయం’’ అనేది వారి అభిప్రాయం. ఇక ప్రముఖ సంఘ సేవిక కోవై సరిత అభిప్రాయం ప్రకారం, ‘‘బిడ్డడు ఎంతో కష్టపడ్డాడని, ఏమైనా డేక్కుపోయిన గాయాలుంటే ప్రభుత్వ ఖర్చులతో రంగయ్యగారికి చికిత్స చేయించాల’ని డిమాండ్ చేయాలనుకుంటుంది. అంతే కదా మరి. ఆవిడ తల్లి మనసుతో ఆలోచించింది. నేను బహుముఖ ప్రజ్ఞాశాలిని అని మీకు తెలుసు. అసలు వక్తలు వారే స్వయంగా మాట్లాడినా ఇంత అర్థవంతంగా చెప్పలేరు అని నాకు తెలుసు, మీకూ తెలుసు. వేదిక మీదున్న గొప్ప వ్యక్తుల మీద ఉన్న గౌరవం కొద్దీ వారి అభిప్రాయాన్ని నేనే చెప్పినందున, ఇక వారు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఏమీ లేదు. ఇప్పుడు సన్మాన గ్రహీత రంగయ్యగారి అభిప్రాయం ప్రకారం, ‘ఎంతో శ్రమ, ఖర్చును భరించి ఈ సమావేశం ఏర్పాటు చేసి, వారిని సన్మానించడం వారు జీవితంలో మర్చిపోలేరు. ఈ మట్టికి రుణపడి ఉంటారు, నేను ఏం చెబితే అది రంగయ్యగారు చేస్తారు. తన కృతజ్ఞత తెలియజేస్తూ, కన్నీటి పర్యంతం అవుతారు. అంతే. ఈ సభ ఇంతటితో ముగిసింది’ అన్నాడు రాంబాబు. వెంటనే ‘‘ఆ... ఆ... ఆ...గు రాంబాబూ...’’ అని ఆవేశంగా అరుస్తూ వేలుమాధవ్ లేచి, సభాసదులనుద్దేశించి, ‘‘ఏం... మేం చేతగానివాళ్లమా? రంగయ్య గురించి వారం రోజులుగా ఇంటర్నెట్లో సమాచారం సేకరించి, ఇంట్లో అద్దం ముందు ఉపన్యాసం ప్రాక్టీసు చేసి వస్తే, మీరు మాకిచ్చే మర్యాద ఇదా అధ్యక్షా. వచ్చే ఏడాది మీటింగుకి మా మైకులు మేమే తెచ్చుకొని వీరంగం ఆడిస్తాం’’ అని మీసాలు మెలేసి, ‘‘ఆ... న...’’ అని చేయి ముందుకు చాపాడు. మిగతా అతిథులు కూడా మీసాలు ఉన్నా లేకున్నా మెలేసి, ‘‘ఆ... న...’’ అని చేతులు ముందుకు చాపి, ప్రమాణం చేయగానే కరెంటు పోయింది. సభా ప్రాంగణం అంతా చీకటిమయం అయింది. కొంత విరామం తరువాత కళ్లు మిరుమిట్లు గొలిపే వెలుగు వచ్చింది. భగవద్గీతలో కృష్ణుడి అవతారంతో మన రాంబాబు వేదిక మీద ప్రత్యక్షమయ్యాడు. కుడిచేతితో చక్రాన్ని సరసరా తిప్పుతూ, ఎడమ చేతితో మైకు అందుకొని, ఉఫ్ ఉఫ్ అని ఊదాడు. జనం అంతా హాహాకారాలు చేస్తూ, ఎక్కడివారు అక్కడ సాష్టాంగపడి, ‘రాంబాబూ... నీకు దండంరా బాబూ’ అన్నారు. పరదా జారింది. సభ ముగిసింది. -
నోరారా తిట్టుకున్నారు...
ఈ ఎన్నికల స్పెషల్ మోడీని ఏమైనా అంటే కేసీఆర్ తాట తీస్తా.... పవన్‌కల్యాణ్ వాడెవడు? నేను చిటికేస్తే వేయి తుకడలైతడు... కేసీఆర్ కేసీఆర్ ద్రోహి, నమ్మించి మోసం చేయడం అలవాటు... సోనియా రాక్షసుడు, మోసకారి, అబద్ధాలకోరు, సైకిల్‌తో తొక్కేస్తా... చంద్రబాబు దొంగ పాస్‌పోర్టులు, మనుషుల అక్రమ రవాణా... పొన్నాల తెలంగాణలో మైకులు మూగబోయాయి. కానీ ఈసారి పార్టీల ప్రచార సరళిని పరిశీలిస్తే.. వివిధ పార్టీల నాయకుల నడుమ మునుపెన్నడూ లేని రీతిలో వ్యక్తిగత వివుర్శల దాడి జోరుగా జరిగింది. కాలంతోపాటు రాజకీయ ప్రచారాల్లో ప్రమాణాల పతనం కనిపిస్తున్నా.. గడువు సవుయుం దగ్గరపడేకొద్దీ ఎన్నికల వేడి పెరుగుతూ తిట్ల పురాణానికి తెరలేచింది. వ్యక్తిగత వివుర్శలు, ప్రతి వివుర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, బెదిరింపులు, ఎదురుదాడి యథేచ్ఛగా సాగిన తీరు మాత్రం అందరినీ విస్తుపోయేలా చేసింది. ఎన్నికలనగానే పార్టీలు, నాయకుల మధ్య వాగ్వివాదాలు, ఆరోపణలు పరిపాటే. కానీ పార్టీల సిద్ధాంతాలు, ప్రజా సమస్యలు, గత ప్రభుత్వాల పనితీరు, కొత్త హామీల గురించి ఉద్రిక్త వాతావరణం ఉందా అనే స్థారుులో వేడెక్కించే విమర్శలు కూడా సాధారణమే. కానీ, ఈసారి తెలంగాణ ప్రచారంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నడుమ నెలకొన్న పోటాపోటీ వాతావరణం, ఎంత ప్రయత్నించినా తన ఉనికి ప్రదర్శించలేకపోతున్న టీడీపీ ఉడుకుమోత్తనం, బీజేపీ కోసం పరిణతి లేని పవన్‌కల్యాణ్ రంగప్రవేశం కారణంగా ఈ పార్టీల నడు మ విమర్శలు కొన్ని ‘లక్ష్మణరేఖలు’ దాటేశారుు. వాస్తవానికి ముప్పేట దాడికీ, అన్ని వైపుల నుం చీ ఈ నిందారోపణలకు గురై న నాయకుడు కేసీఆర్ కాగా, వాచాలతను తీవ్ర స్థాయిలో ప్రదర్శించి, పరిస్థితిని మరింత దిగజార్చింది మాత్రం పవన్‌కల్యాణేనని చెప్పవచ్చు. పోటీ పెరిగే కొద్దీ వూటల సవురం పోటీ ఏకపక్షంగా లేదు. విలీనమనే మాట వదిలేసి ఒంటరిపోరుకు సిద్ధపడిన వెంటనే కేసీఆర్ కాంగ్రెస్ నాయకులకు లక్ష్యంగా మారారు. సుడిగాలిలా ఆయన తెలంగాణ అంతటా విసృ్తతంగా పర్యటిస్తూ ప్రచారంలో ముందుండేసరికి, కాంగ్రెస్ ఎంపీలు, మాజీ మంత్రులు సైతం విజయం కోసం చెమటోచ్చాల్సిన దుస్థితి నెలకొంది. దాంతో ఇక ఆ పార్టీ నేతలు కేసీఆర్‌పై వ్యక్తిగత విమర్శల దాడి మొదలెట్టారు. కేసీఆర్ కూడా మాటకుమాట అన్నట్లుగా ఎదురుదాడి ఆరంభించారు. ఇటు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, అటు కేసీఆర్ రోజూ తమ విమర్శల తీవ్రతను పెంచుతూ వెళ్లారు. క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్ మరింత బలపడుతున్న తీరు గమనించిన కాంగ్రెస్ నాయకులు చివరకు సోనియా, రాహుల్ ద్వారా కేసీఆర్‌పై వాగ్బాణాలు సంధించేలా చేరుుంచడంలో సఫలీకృతవుయ్యూరు. ఢిల్లీ నుంచి గల్లీ నాయకుల దాకా కేసీఆర్ లక్ష్యంగా మారా రు. మరోవైపు ఎంత ప్రయత్నించినా ప్రజల నుంచి వీసమెత్తు ఆదరణ కనిపించని టీడీపీ అధినేత చంద్రబాబునాయుుడు కూడా కే సీఆర్‌ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఈ ధోరణితో ఆయనలో పెరిగిపోతున్న నిరాశాని సృహల్ని బయుటపెట్టేశారు. ఎప్పుడైతే పవన్‌కల్యాణ్ రంగప్రవేశం చేశారో అప్పుడే ఈ విమర్శల పర్వం పక్కదోవ పట్టి పరిస్థితి మరింత దిగజారింది. పవన్ దుందుడుకు ధోరణి నాయకుల నడుమ విపరీత ధోరణిలో సాగే తిట్లు, వ్యక్తిగత నిందారోపణలను ప్రజలు ఎప్పుడూ స్వాగతించరు. గత ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున ప్రచారం చేసిన పవన్‌కల్యాణ్ ‘పంచెలూడదీసి కొడతా’ వంటి తీవ్ర పదజాలాన్ని వాడిన తీరు ఆ పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించింది. రాజకీయ పార్టీల చరిత్రలో తొలిసారిగా అన్నట్లు... బీజేపీ, టీడీపీలకు ప్రచారం చేయడం కోసమే సొంతంగా పార్టీ పెట్టిన పవన్‌కల్యాణ్ ఈసారి కూడా తన పరిణతిలేమిని, సంస్కార రాహిత్యాన్ని బయటపెట్టేశారు. కేసీఆర్ తాటతీస్తా అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ఈ మాటల ధోరణి పట్ల ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకత గమనించి చివరకు టీడీపీ, బీజేపీ శ్రేణులు సైతం తలలుపట్టుకుంటున్నాయి. ప్రచారంలో సోవువారం సా యుంత్రం వుుగియుడంతో ఓటర్లు ఒక్కసారిగా హమ్మయ్య అంటూ తేలికగా ఊపిరి పీల్చుకున్నారు. పార్టీలు, నాయకులను విమర్శించడంలో వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు కొందరు ప్రశంసనీయమైన సంయమనం పాటించారు. ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారం చేసిన వైఎస్ జగన్, షర్మిల ఈవిషయంలో హుందాగా వ్యవహరించారు. చంద్రబాబు రాజకీయపరమైన సంస్కారాన్ని, మర్యాదలను తుంగలోతొక్కి ఏకవచనంలో జగన్‌పై ఇష్టారాజ్యంగా నిందారోపణలు చేస్తున్నా సరే... జగన్ ఒక్కసారైనా చంద్రబాబును తన ప్రసంగాల్లో కనీసం ఏకవచనంలో కూడా సంబోధించకపోవడం గవునార్హం. -
విజయమ్మకు మైక్ ఇచ్చేందుకు స్పీకర్ నిరాకరణ
-
విజయమ్మకు మైక్ ఇచ్చేందుకు స్పీకర్ నిరాకరణ
హైదరాబాద్ : శాసనసభలో వైఎస్ విజయమ్మకు మైక్ ఇచ్చేందుకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ నిరాకరిస్తున్నారు. సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షనేతగా విజయమ్మ మాట్లాడేందుకు స్పీకర్ అనుమతినివ్వడంలేదు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతున్నారు. వైఎస్ఆర్సీపీ గతంలో ఇచ్చిన సమైక్య తీర్మానం నోటీసు, బుధవారం విజయమ్మ రాసిన లేఖపై సభలో ప్రకటన మాత్రమే చేయగలనని.. వాటిని అనుమతించలేనని.. స్పీకర్ స్పష్టం చేశారు. విభజన బిల్లుపై సభలో ఓటింగ్ ఉంటుందో లేదోకూడా ఇప్పుడే చెప్పలేనని.. తనతో భేటీ అయిన వైఎస్ఆర్ సీపీ సభ్యులతో స్పీకర్ తెలిపారు. బిల్లుపై క్లాజులవారీగా లేదా మొత్తం బిల్లుపైన ఓటింగ్ ఉంటుందో లేదో కూడా ఇప్పుడు చెప్పలేనని స్పీకర్ అన్నారు.