
విజయమ్మకు మైక్ ఇచ్చేందుకు స్పీకర్ నిరాకరణ
శాసనసభలో వైఎస్ విజయమ్మకు మైక్ ఇచ్చేందుకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ నిరాకరిస్తున్నారు.
హైదరాబాద్ : శాసనసభలో వైఎస్ విజయమ్మకు మైక్ ఇచ్చేందుకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ నిరాకరిస్తున్నారు. సభలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షనేతగా విజయమ్మ మాట్లాడేందుకు స్పీకర్ అనుమతినివ్వడంలేదు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతున్నారు.
వైఎస్‌ఆర్‌సీపీ గతంలో ఇచ్చిన సమైక్య తీర్మానం నోటీసు, బుధవారం విజయమ్మ రాసిన లేఖపై సభలో ప్రకటన మాత్రమే చేయగలనని.. వాటిని అనుమతించలేనని.. స్పీకర్ స్పష్టం చేశారు. విభజన బిల్లుపై సభలో ఓటింగ్ ఉంటుందో లేదోకూడా ఇప్పుడే చెప్పలేనని.. తనతో భేటీ అయిన వైఎస్ఆర్ సీపీ సభ్యులతో స్పీకర్ తెలిపారు. బిల్లుపై క్లాజులవారీగా లేదా మొత్తం బిల్లుపైన ఓటింగ్ ఉంటుందో లేదో కూడా ఇప్పుడు చెప్పలేనని స్పీకర్ అన్నారు.