Nadendla manohar
-
కూటమి సర్కార్‌కు ఊపిరి సలపనివ్వని వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలిలో బడ్జెట్‌పై వాడీవేడి చర్చ జరిగింది. పలు అంశాలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించగా.. మంత్రులు దాటవేత ధోరణి ప్రదర్శించారు. కనీసం జవాబు ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. తాము ఎందుకు సమాధానం చెప్పాలనే విధంగా ప్రవర్తించడం గమనార్హం.ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు నాలుగో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, సాయి కల్పలత పలు అంశాలపై ప్రశ్నలు అడిగారు. దీపం పథకంపై ఎమ్మెల్సీలు ప్రశ్నించగా.. లబ్ధిదారుల సంఖ్య చెప్పకుండా సమాధానం దాటవేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. దీంతో, మంత్రిపై ఎమ్మెల్సీలు మండిపడ్డారు. దీపం పథకం అంటే ఈ ఏడాది 2 సిలిండర్లకు ఎగనామం పెట్టడమా?. దీపం పథకం లబ్ధిదారులు ఎంత మందో ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదు?. తొమ్మిది నెలలకు ఒకే సిలిండర్ ఇస్తారా?. కోటి 54 లక్షల మందికి ఎందుకు దీపం పథకం అమలు చేయడం లేదు. లబ్ధిదారుల సంఖ్య చెప్పాల్సిందేనని పట్టుబట్టారు.ఇదే సమయంలో మండలిలో డ్వాక్రా మహిళల సున్నా వడ్డీ రుణాలపై కూడా ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, సాయి కల్పలత ప్రశ్నలు వేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీలు మాట్లాడుతూ.. సున్నా వడ్డీ పథకాన్ని డ్వాక్రా మహిళలకు అమలు చేస్తున్నారా లేదా?. గతంలో చంద్రబాబు 2016లో సున్నా వడ్డీని నిలిపేశారు. గత ప్రభుత్వం అమలు చేసిన సున్నా వడ్డీని అమలు చేయాలి. డ్వాక్రా మహిళలకు 10 లక్షల సున్నా వడ్డీ రుణాలు ఇస్తామన్నారు. ప్రభుత్వం ఈ పథకాన్ని ఎప్పుడు నుండి ప్రారంభిస్తుంది? అని అడిగారు. దీనికి కూడా కూటమి మంత్రులు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.ఇక, అంతకుముందు రాష్ట్రంలో బెల్టు షాపుల విషయమై మండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మాధవరావు, రమేష్ యాదవ్, దువ్వాడ శ్రీనివాస్ ప్రశ్నించారు. ఎమ్మెల్సీలు మాట్లాడుతూ..‘రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్టు షాపులు నడుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్ రూమ్‌లు పెడుతున్నారు. మద్యం అమ్మకాలపై నియంత్రణ లేకుండా ఎక్కడంటే అక్కడ షాపులు పెడుతున్నారు. చర్యలు ఎందుకు లేవు? అని ప్రశ్నలు సంధించారు. దీనికి కూడా కూటమి నేతలు స్పందించలేదు. -
2018లో పోస్టు పెడితే ఇప్పుడు అరెస్టా?
తెనాలి: సోషల్ మీడియాలో పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌లను 2018లో విమర్శిస్తూ పెట్టిన పోస్టును షేరింగ్ చేసిన కారణంతో వల్లభాపురానికి చెందిన రైతు ఆళ్ల జగదీష్‌రెడ్డిని సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేయటం దారుణమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. దాంతోపాటు తెనాలి పోలీసులు మరో కేసును నమోదు చేయడం తగదని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌కు తెలియకుండా ఇదంతా జరుగుతుందా అని ప్రశ్నించారు. జగదీష్‌రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని, కేసులపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కొల్లిపర మండల మండలం వల్లభాపురం గ్రామానికి చెందిన ఆళ్ల జగదీష్‌రెడ్డిని విజయవాడ సైబర్‌క్రైం పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. పోలీసులు విడుదల చేయటంతో ఇంటికొచ్చిన జగదీష్‌రెడ్డిని మంగళవారం మాజీ ఎమ్మెల్యే శివకుమార్ పరామర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడే మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సోషల్‌మీడియా కార్యకర్తలపై కేసులతో భయభ్రాంతుల్ని చేయటాన్ని పెద్ద ఎత్తున ఇలా చేస్తున్నారని గుర్తుచేశారు. ఆ క్రమంలోనే జగదీష్‌రెడ్డిని తెల్లవారుజామున ఇంటికొచ్చి మరీ తీసుకెళ్లినట్టు చెప్పారు. ఎవరు తీసుకెళ్లిందీ తెలీక, ఆ కుటుంబంతోపాటు గ్రామస్తులంతా ఆందోళన చెందారని తెలిపారు. తీరా చూస్తే సైబర్‌క్రైం పోలీసులని తెలిసిందన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు... ఈ రోజు అధికారం వచ్చిందనే గర్వంతో తమ పార్టీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తున్నారని అన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా నియోజకవర్గంలో ఏనాడూ ఇలాంటి చర్యలకు పాల్పడలేదన్నారు. ‘మీరు చూపిస్తున్న కొత్తమార్గాన్ని భవిష్యత్‌లో మేమూ అనుసరిస్తాం’ అంటూ కూటమి నేతలను శివకుమార్ హెచ్చరించారు. వైఎస్సార్ సీపీని, క్యాడర్‌ను బెదిరించే ధోరణులను మానుకోవాలని, నాదెండ్ల మనోహర్ ఇప్పటికై నా దీనిపై ఆలోచన చేయాలని కోరారు. పార్టీ కొల్లిపర మండల కన్వీనర్ అవుతు పోతిరెడ్డి మాట్లాడుతూ.. జగదీష్‌రెడ్డిని ఎవరో తీసుకెళ్లారని తెలిసిన దగ్గర్నుంచి మాజీ ఎమ్మెల్యే శివకుమార్ మనోధైర్యం కల్పిస్తూ వచ్చారని చెప్పారు. పార్టీ క్యాడర్‌కు ఏ చిన్న ఆపద వచ్చినా పార్టీ యంత్రాంగం, లీగల్‌సెల్ సహకరిస్తుందని పేర్కొంటూ ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. ధైర్యంగా ఉంటూ రాబోయే ఎన్నికల్లో కూటమికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. -
జనసేన ఎమ్మెల్యే ఎక్కడ?
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఎమ్మెల్యే ఎక్కడ? అని మంత్రి నాదేండ్ల జనసేనులను ఆరా తీశారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో జనసేన పార్టీకి చెందిన ఏకై క ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. అదే జనసేన పార్టీలో నంబర్ 2గా ఉన్న పౌరసరఫరాల మంత్రి, పీఏసీ చైర్మెన్ నాదేండ్ల మనోహర్ రెండు రోజుల పాటు తిరుపతి జిల్లాలో పర్యటించారు. తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మంత్రి పర్యటనకు డుమ్మా కొట్టారు. సూపర్ సిక్స్ పథకాల్లోని దీపం–2 పథకం కార్యక్రమాన్ని శనివారం జిల్లా కేంద్రమైన తిరుపతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పౌరసరఫరాల శాఖా మంత్రి నాదేండ్ల మనోహర్ హాజరయ్యారు. ప్రభుత్వ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే హాజరు కావాల్సిఉంది. అయినా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరు కాలేదు. అలాగే మంత్రి ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలోనూ స్థానిక ఎమ్మెల్యే లేరు. మంత్రి తిరుగు ప్రయాణంలో రేణిగుంట విమానాశ్రయంలో నాదేండ్ల మనోహర్ జనసేన జిల్లా నాయకులతో సమావేశం అయ్యారు. జిల్లా నాయకులంతా హాజరైనా ఒక్కగానొక్క జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరు కాకపోవడంతో మంత్రి నాదేండ్ల మనోహర్ ఆరా తీశారు. -
మంత్రి నాదెండ్ల టూర్.. కూటమిలో భగ్గుమన్న విభేదాలు
సాక్షి,ఏలూరుజిల్లా: మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరు జిల్లా పర్యటన సందర్భంగా కూటమి పార్టీల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఉంగుటూరు మండలం చేబ్రోలు రైతు సేవ కేంద్రం వద్ద టీడీపీ, జనసేన నాయకుల మధ్య తోపులాట జరిగింది. చేబ్రోలులో మినుము విత్తనాలను మంత్రి చేతుల మీదుగా అందించడానికి పలువురు రైతులను అధికారులు గుర్తించారు.అయితే ఈ రైతులందరూ టీడీపీ వారేనని జనసేన శ్రేణులు ఆ రైతులందరూ టీడీపీ వారేనని జనసేన శ్రేణులు ఆందోళనకు దిగారు. దీంతో టీడీపీ,జనసేన నాయకుల మధ్య వాగ్వాదం,తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తం కాకుండా ఇరువర్గాలను పోలీసులు సముదాయించారు. ఇదీ చదవండి: బాబు ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు -
ఇంటింటికీ రేషన్ మూర్ఖపు నిర్ణయం
సాక్షి, అమరావతి: ఇంటింటికీ రేషన్ పంపిణీ మూర్ఖపు నిర్ణయమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రేషన్ పంపిణీ చేసే మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల (ఎండీయూ) వల్ల పౌర సరఫరాల సంస్థకు తీవ్ర నష్టం కలుగుతోందన్నారు. ఆయన గురువారం విజయవాడలోని పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పౌర సరఫరాల సంస్థకు రూ.1,500 కోట్లు నష్టం కలిగేలా 9,260 ఎండీయూ వాహనాలు కొన్నారని, ప్రతి నెలా ఒక్కో వాహనానికి రూ.27 వేలు వెచ్చిస్తున్నామని, ఇంతకన్నా అన్యాయం ఉండదని చెప్పారు. 2027 వరకు వీటితో కాంట్రాక్టు కుదుర్చుకొని కార్పొరేషన్‌కు నష్టం కలిగించేలా మూర్ఖమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. రేషన్ డోర్ డెలివరీపై త్వరలో స్టేక్ హోల్డర్లతో విస్తృతంగా చర్చించి, నివేదిక రూపొందిస్తామని, కేబినెట్లోనూ చర్చిస్తామని చెప్పారు. పౌర సరఫరాల సంస్థను రూ.36,300 కోట్ల అప్పుల పాలు చేశారన్నారు. రూ. 2 వేల కోట్ల బకాయిలు బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఇటీవలే చెల్లించామన్నారు. బియ్యం స్థానంలో నగదు పంపిణీపై విలేకరులు ప్రశ్నించగా.. ప్రభుత్వంలో అనేక ఆలోచనలు ఉన్నాయని, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ సూచనలతో ఉమ్మడి ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో బియ్యం అక్రమ రవాణా జరిగిందని, కాకినాడ పోర్టును అడ్డాగా మార్చుకొని ఓ మాజీ ఎమ్మెల్యే కుటుంబం భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. -
ఏపీలో రేషన్ డోర్ డెలివరీ బంద్!
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ సరుకుల డోర్ డెలివరీకి మంగళం పాడాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తాజాగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆ దిశగా స్పష్టమైన వ్యాఖ్యలతో సంకేతాలిచ్చారు.రేషన్ డోర్ డెలివరీ కోసం కొన్న వాహనాల వల్ల కార్పొరేషన్‌పై రూ.1,500 కోట్ల భారం పడింది. అన్ని వర్గాలతో చర్చించి ఒక నివేదిక సిద్ధం చేస్తాం. కేబినెట్లో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటాం.కాగా, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆంధ్రప్రదేశ్ ప్రజా పంపిణీ వ్యవస్థలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. జనవరి 21, 2021 పౌరసరఫరాల శాఖ పరిధిలో రేషన్ డోర్ డెలివరీ వాహనాలను విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారాయన. -
సుదీర్ఘకాలం తర్వాత తెనాలికి మంత్రి పదవి
తెనాలి: ఆంధ్రాప్యారిస్ తెనాలికి సుదీర్ఘకాలం తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం లభించింది. కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా గెలిచిన నాదెండ్ల మనోహర్ రాష్ట్ర మంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. రాజకీయ చైతన్యానికి నిలయమైన తెనాలి నుంచి ఎందరో రాజకీయ ఉద్దంఢులు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా సమర్థత నిరూపించుకున్నారు. తెనాలి నియోజకవర్గం నుంచి మంత్రి పదవులను చేపట్టినవారు కొందరే. నియోజకవర్గంలో 1952 నుంచి ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరగ్గా, కేవలం నలుగురు మాత్రమే మంత్రి పదవులను చేపట్టారు. అందులో ముగ్గురు మంత్రులుగా బాధ్యతలు నిర్వహించగా, మరొకరు అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో అప్పటి తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ హోదాలో ఉన్న విషయం తెలిసిందే. 2004, 2009 ఎన్నికల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినపుడు నాదెండ్ల మనోహర్ ఆ రెండు ఎన్నికల్లోనూ తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినపుడు నాదెండ్ల మనోహర్‌కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ లైబ్రరీ కమిటీ చైర్మన్ పదవి వరించింది. తర్వాత క్యాబినెట్ హోదాతో అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ పదవిని చేపట్టారు. నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ పదవిని నిర్వర్తించారు. అనంతర రాజకీయ పరిణామాలతో వైఎస్సార్ సీపీ ఆవిర్భవించింది. 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున, 2019లో జనసేన అభ్యరి్ధగా తెనాలి నుంచి పోటీచేసిన నాదెండ్ల మనోహర్, ఆ రెండు ఎన్నికల్లో ఓటమి చెందారు. 2024 వచ్చేసరికి రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. జనసేన పీఏసీ చైర్మన్‌గా జనసేన, టీడీపీల మధ్య పొత్తులో మనోహర్ కీలకపాత్ర పోషించినట్లు చెబుతారు. బీజేపీతో కూడా పొత్తు కుదరటంతో జనసేన, టీడీపీ, బీజేపీలు కూటమిగా 2024 ఎన్నికల్లో పోటీచేసి, అధికారాన్ని చేపట్టాయి. జనసేనలో నెంబర్ టూ అయిన తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్‌కు సహజంగానే మంత్రి పదవి లభిస్తుందని అందరూ ఊహించారు. ఆ ప్రకారంగానే గన్నవరం ఐటీ పార్కులో బుధవారం అట్టహాసంగా జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారోత్సవంలో మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. మనోహర్‌కు కీలక మంత్రిత్వ శాఖ లభిస్తుందనేది కూడా వాస్తవమే. 2009–14 మధ్య అసెంబ్లీ స్పీకర్‌గా చేసిన నాదెండ్ల మనోహర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి స్పీకర్‌గా గుర్తింపును పొందిన విషయం తెలిసిందే. 2014లో రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ల తర్వాత విభజిత ఆంధ్రపదేశ్‌కు తెనాలి నుంచి తొలిగా మంత్రి పదవిని చేపట్టిన ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ కావటం మరో విశేషం! 1952 ఎన్నికల్నుంచి తెనాలిలో మూడుసార్లు పోటీచేసి గెలిచిన ఆలపాటి వెంకట్రామయ్య రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. తర్వాత ఆయన కుమార్తె దొడ్డపనేని ఇందిర కూడా మూడు పర్యాయాలు తెనాలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. తర్వాత 1983, 1985 ఎన్నికల్లో తెనాలి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అన్నాబత్తుని సత్యనారాయణ ఎన్టీ రామారావు మంత్రివర్గంలో మంత్రిగా చేశారు. 1989లో తెనాలి నుంచి నాదెండ్ల భాస్కరరావు పోటీచేసి విజయం సాధించినా, డాక్టర్ చెన్నారెడ్డి క్యాబినెట్లో స్థానం దక్కలేదు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చింది. 2009లోనూ మళ్లీ విజయాన్ని నమోదు చేసింది. ఆ రెండుసార్లు తెనాలి నుంచి కాంగ్రెస్ తరçపున ఎమ్మెల్యేగా గెలిచిన నాదెండ్ల మనోహర్ అసెంబ్లీ స్పీకర్‌గా చేశారు. మళ్లీ ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్‌కు మంత్రిగా నియమితులయ్యారు. -
డిప్యూటీ సీఎంగా పవన్‌కళ్యాణ్..!
సాక్షి, అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రివర్గంలో చేరడం దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే ప్రధాన ప్రతిపక్షంగా సభలో అడుగు పెడతామని చెప్పడంతో పలు ఊహాగానాలు సాగాయి. అయితే తాజాగా పవన్ ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించుకున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. చంద్రబాబు, పవన్ మధ్య జరిగిన చర్చలో దీనిపై ఒక అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. పవన్ ఉప ముఖ్యమంత్రి హోదాలో పంచాయతీరాజ్ – గ్రామీణాభివృద్ధి శాఖలను నిర్వహిస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తనతోపాటు జనసేన నుంచి గెలిచిన మరో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వాలని పవన్ కోరగా చంద్రబాబు అందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇందులో ఒకటి నాదెండ్ల మనోహర్‌కి దక్కడం ఖాయమని చెబుతున్నారు. మిగిలిన పదవులకు కందుల దుర్గేష్, పంతం నానాజీ, అరణి శ్రీనివాసులు, వంశీకృష్ణ యాదవ్ పేర్లు వినిపిస్తున్నాయి.ఉమ్మడి జిల్లాల వారీగా పదవులు చంద్రబాబు ఉమ్మడి జిల్లాల వారీగానే మంత్రి పదవులు ఇస్తారని చెబుతున్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్సీలను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. నారా లోకేష్ మంత్రివర్గంలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మంత్రి పదవుల కోసం టీడీపీలో తీవ్ర పోటీ నెలకొంది. శ్రీకాకుళం జిల్లా నుంచి అచ్చెన్నాయుడు, గౌతు శిరీష, కూన రవికుమార్, కొండ్రు మురళి రేసులో ఉన్నారు. అయితే శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కినందున అచ్చెన్నాయుడికి ఇవ్వటంపై సందిగ్దం నెలకొంది. విజయనగరం జిల్లా నుంచి కళా వెంకట్రావు, సంధ్యారాణి పేర్లు వినిపిస్తున్నాయి. విశాఖ జిల్లా నుంచి అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, వంగలపూడి అనిత, పల్లా శ్రీనివాస్ పోటీ పడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి జిల్లా నుంచి జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి రేసులో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నిమ్మల రామానాయుడు, రఘురామకృష్ణరాజు, పితాని సత్యనారాయణ పేర్లు వినిపిస్తున్నాయి. కృష్ణా జిల్లా నుంచి బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, కొల్లు రవీంద్ర పేర్లను పరిశీలిస్తున్నారు. గుంటూరు జిల్లా నుంచి ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనందబాబు, అనగాని సత్యప్రసాద్, కన్నా లక్ష్మీనారాయణల్లో ఒకరిద్దరికి అవకాశం లభించనుంది. ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్, దామచర్ల జనార్దన్, బాల వీరాంజనేయస్వామి పోటీలో ఉన్నారు. నెల్లూరు జిల్లా నుంచి పి.నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆశావహుల జాబితాలో ఉన్నారు. చిత్తూరు జిల్లా నుంచి అమర్నాథ్రెడ్డి, కిశోర్ కుమార్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. అనంతపురం జిల్లా రేసులో పయ్యావుల కేశవ్, కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత ఉన్నారు. కడప జిల్లా నుంచి రెడ్డప్పగారి మాధవిరెడ్డి, పుట్టా సుధాకర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, జయనాగేశ్వర్రెడ్డిలో ఒకరిద్దరికి చోటు దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది.నేడు టీడీపీ శాసన సభాపక్ష సమావేశంటీడీపీ శాసనసభాపక్ష సమావేశం మంగళవారం జరగనుంది. సమావేశంలో చంద్రబాబును తమ నేతగా ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. దీనికి టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. -
పవన్ కళ్యాణ్ పై మాకినీడి శేషు కుమారి ఫైర్
-
పవన్ అప్పగింతలు–కుప్పిగంతులు
పవన్ కల్యాణ్ పార్టీ వ్యవ హారం కానీ, ఆయన వ్యవహార శైలి కానీ పరిశీలిస్తే బహుశా ఇలాంటి పార్టీ భారతదేశంలోనే ఎక్కడా మనకు కనిపించదేమో అని పిస్తుంది. విచిత్రం ఏమిటంటే, ఈ మధ్యకాలంలో పార్టీని పదేళ్లు నడిపాను అంటూ తరచు మాట్లాడుతున్నారు. పార్టీ పెట్టి పదేళ్లు అయి ఉండొచ్చు కానీ పట్టుమని చెప్పుకోదగిన స్థాయిలో పది కార్యక్రమాలైనా ఉన్నాయా అంటే చెప్ప డానికి ఆ పార్టీ కార్యకర్తలే తడబడతారు. ఎందుకంటే పదేళ్లు పూర్తిగా నడిపింది పార్ట్ టైం పాలిటిక్స్. పార్ట్ టైం ఉద్యోగాల గురించి విన్నాంగానీ పార్ట్ టైం రాజకీయాలను పరిచ యం చేసింది మాత్రం పవన్ అనే చెప్పాలి. పోనీ ఆ పార్ట్ టైం కార్య కలాపాలైనా ఆయన నిర్వహించారా అంటే అదీ లేదు. తను జస్ట్ గెస్ట్ ఫాకల్టీ మాత్రమే! సినిమాల్లో ఒక మాస్ హీరోలా ఎలా నటి స్తారో... అదే సంస్కృతి (ప్రక్రియ)ని రాజకీయల్లో కూడా చొప్పించి తన ఘనత చాటుకున్నారు. సినిమాలో హీరో చేసే ఫైట్లు, ఫీట్లూ అన్నీ డూప్. పాడే పాటలూ ఆయన పాడరు. కానీ ప్రేక్షకులకు హీరోనే ఇవన్నీ చేస్తాడని అనిపిస్తుంది. ఇదే ఫార్ములా రాజకీయాలకి అప్లై చేశారు పవన్ కల్యాణ్. పార్టీని ప్రారంభించి దాని నిర్వహణ బాధ్యత నాదెండ్ల మనోహర్‌కి అప్పజెప్పారు. ప్రెస్ మీట్లో ఏదైనా మాట్లాడాలన్నా, విలేకరులు అడిగిన ప్రశ్న లకు జవాబు చెప్పాలన్నా నాదెండ్ల మనోహర్ ఇన్పుట్స్ ఇస్తే తప్ప జవాబు చెప్పలేని పరిస్థితి. ఉపన్యాసాలు ఇవ్వాలంటే ఎవరో రాసిచ్చిన ఉప న్యాసాలకు హావభావాలు జోడించడం మాత్రమే పవన్ చేసే పని. ఫైనల్‌గా సినిమాను డిస్ట్రిబ్యూటర్‌కు అమ్మే సినట్టు పార్టీని చంద్రబాబు చేతిలో పెట్టేశారు. పార్టీ కార్యకర్తల చేతుల్లో తెలుగుదేశం జెండాలు పెట్టారు. చెప్పులేసుకుని తిరిగే వాళ్ళను చట్ట సభలకు పంపిస్తానని చెప్పి వాళ్ళ చేతుల్లో చివరగా చిప్ప పెట్టి కోటీశ్వరులకు టిక్కెట్లు ఇచ్చేసు కున్నారు. పైగా తన పార్టీలో ఎవరెవరు నించో వాలి అనే నిర్ణయాధికారాన్ని కూడా చంద్రబాబుకే అప్ప జెప్పే శారు. అచ్చంగా డిస్ట్రిబ్యూటర్ ఏ ఏ థియేటర్స్‌కు సినిమా రిలీజ్ చేయాలో నిర్ణయించినట్టు! సాక్షాత్తు తను పిఠాపురంలో పోటీ చేసే చోట పట్టుమని నాలుగు రోజులు తిరిగే ఓపిక కూడా లేక ఆ బాధ్యతనూ వర్మ చేతిలో పెట్టేశారు. వాలంటీర్లను నోటికొచ్చినట్టు తిట్టి, అవ్వ తాతల్ని మండుటెండలో అష్ట కష్టాలు పెడుతూ తను మాత్రం గంట కూడా ఎండలో తిరగలేక స్పెషల్ ఫ్లైట్‌లో హైదరాబాద్ చెక్కేస్తున్నారు. ఈ విచిత్ర విన్యా సాలు, విపరీత పోకడలకు జన సైనికులే తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీర మహిళ లైతే ఒక అడుగు ముందుకు వేసి, ‘‘మాటలు కోటలు దాటిస్తున్నాడు. మానాభిమానాల్ని మాత్రం ‘కోట’లో దాచి పెడు తున్నాడు’’ అంటూ నర్మగర్భంగా టీవీ చర్చల్లోనే వ్యాఖ్యా నించటం గమనార్హం! పి. విజయబాబు వ్యాసకర్త పూర్వ సంపాదకులు -
పార్టీలో అందరి డబ్బు వాడుకున్న పంతం నానాజీకి సీటు ఇచ్చారు.
-
జనసేనకు కాకినాడ మాజీ మేయర్ పోలసపల్లి సరోజ రాజీనామా
-
టీడీపీలో ట్విస్ట్: అభ్యర్థులకు షాకిచ్చిన చంద్రబాబు
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు.. పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు షాకిచ్చారు. రానున్న 25 రోజుల్లో వారి పని తీరుపై సర్వేలు జరిపి అంచనా వేస్తానని బాబు చెప్పుకొచ్చారు. సర్వేల్లో అనుకూల ఫలితాలు రాకపోతే పార్టీ ఆఫీసు నుంచి ఫోన్లు వస్తాయని.. పరోక్షంగా అభ్యర్థి మార్పు కూడా ఉండొచ్చని సంకేతాలిచ్చారు. కాగా, టీడీపీ అభ్యర్థులకు నేడు విజయవాడలో వర్క్ షాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు, నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి పాతూరి నాగభూషణం హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో సీటు రాని వారంతా కేవలం త్యాగం చేశారు అంతే. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తులు పెట్టుకున్నాం. ఏకైక అభిప్రాయంతో జనసేన ముందుకు వచ్చింది. పద్ధతి ప్రకారం రాజకీయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పొత్తుకు పవన్ ముందుకు వచ్చారు. జనసేన కార్యకర్తలు కూడా ఒక పద్ధతి ప్రకారం పని చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి పొత్తులో భాగంగా టీడీపీలో 31 మందికి సీట్లు ఇవ్వలేకపోయాం. సీట్లు రానివారు కష్టపడలేదని కాదు.. రాష్ట్రం కోసం త్యాగం చేస్తున్నారు. మూడు పార్టీల పొత్తు తర్వాత చాలా జాగ్రత్తగా అభ్యర్థుల ఎంపిక చేశాం. రాజకీయాల్లో అభ్యర్థుల ఎంపిక అనేది చాలా కీలకం. అభ్యర్థుల ఎంపికలో తప్పు చేస్తే కొన్ని సీట్లు పోయే ప్రమాదం ఉంది. సమర్ధులైన వ్యక్తులను ఎంపిక చేయకపోతే ప్రజల ఆమోదం ఉండదు. డబ్బు సంపాదన ఒక్కటే కాదు సమాజానికి ఉపయోగపడాలన్న ఆలోచన వస్తున్నందుకు ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో డబ్బుతో కాకుండా సేవాభావంతోనే ముందుకొచ్చే పరిస్థితి తీసుకురావాలి. ఇవాళ కొంతమందికి సీట్లు ఇవ్వకపోవచ్చు.. వాళ్లు చేసిన త్యాగం ఎప్పటకీ ఉంటుంది. నమ్మిన సిద్ధాంతం కోసం వాళ్లు కష్టపడి పని చేశారని అన్నారు. ఇదే సమయంలో టీడీపీ అభ్యర్థులకు షాకిచ్చారు. టిక్కెట్ దక్కిందని సంబురపడకండి. రానున్న 25 రోజుల్లో మీ పనితీరుపై మళ్లీ అంచనాలు వేస్తాను. సర్వేల్లో అనుకూలంగా రాకపోతే పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తాయని వార్నింగ్ ఇచ్చారు. ఇక, చంద్రబాబు వ్యాఖ్యలతో అభ్యర్ధుల్లో కలవరం చోటుచేసుకుంది. మరోవైపు, జనసేన నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. జనసేన కార్యకర్తలతో మీరే సమన్వయం చేసుకోవాలి. ఇబ్బందులు వస్తే అప్పుడు ఇరు పార్టీల అధినాయకత్వంతో చర్చిస్తాం అని అన్నారు. దీంతో, నాందెడ్ల వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. -
వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు మధ్యలో నాకేంది ఇది
-
నాదెండ్ల మనోహర్‌పై నీళ్ల బాటిల్‌తో దాడి
తెనాలి(గుంటూరు జిల్లా): పొత్తు పెట్టుకున్నప్పటికీ తెనాలిలో టీడీపీ–జనసేన నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న తీవ్ర విభేదాలు గురువారం బట్టబయలయ్యాయి. జనసేన సీనియర్ నేత, తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌పై టీడీపీ వర్గీయులు నీళ్ల బాటిల్‌తో దాడి చేశారు. ఈ బాటిల్ ఆయన తలకు తగిలింది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, జనసేన అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గురువారం సాయంత్రం తెనాలిలో జనచైతన్య పాదయాత్ర ప్రారంభించారు. బోసు రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర వీనస్ టాకీస్ దగ్గరకు చేరుకుంది. అక్కడ టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజా) వచ్చి కలిశారు. ఆ వెంటనే రాజాకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పోటీగా జనసేన కార్యకర్తలు నాదెండ్ల మనోహర్ జిందాబాద్.. అంటూ నినాదాలు ప్రారంభించారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. ఈ తోపులాటలో టీడీపీ మహిళా కార్యకర్త ఒకరు ఇరుక్కుపోయారు. ఈ సమయంలో∙ఎవరో నీళ్ల బాటిల్‌ను నాదెండ్ల మనోహర్‌పైకి బలంగా విసిరారు. ఆయన తప్పుకోవాలని ప్రయత్నించినప్పటికీ తలకు తగిలింది. ఈ ఘటనతో అందరూ కంగుతిన్నారు. ఆలపాటి రాజా వర్గమే అక్కసుతో ఈ దాడికి పాల్పడిందని జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆలపాటి రాజా టీడీపీ నుంచి తెనాలి టికెట్ ఆశించారని, ఆయనకు కాకుండా పొత్తుల్లో భాగంగా జనసేన నేత నాదెండ్ల మనోహర్‌కు ఇవ్వడంవల్లే ఈ దాడి చేశారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలతో పాదయాత్రకు వచ్చిన అనేక మంది యాత్ర పూర్తికాకుండానే వెళ్లిపోయారు. -
పవన్ బొమ్మ పెట్టినా కాపుల ఓట్లు రావు
సాక్షి, అమరావతి: మంగళగిరి టీడీపీ కార్యాలయం మీద పవన్ బొమ్మ పెట్టినా, పత్రికల్లో ప్రకటనలు (యాడ్స్)లో పవన్ ఫొటో వాడినా టీడీపీకి కాపు ఓట్లు రావని చంద్రబాబుకు కాపు ఐక్య వేదిక కరాఖండిగా చెప్పింది. జనసేనకు జనబలం, ధనబలం లేదని పవన్‌తో ఎంత బలంగా చెప్పించినా నమ్మేందుకు జనం అంత అమాయకులు కాదని ఎద్దేవా చేసింది. నాదెండ్ల మనోహర్‌ను అడ్డుపెట్టుకుని ప్రజారాజ్యం మాదిరిగా జనసేనను నిరీ్వర్యం చేసి దెబ్బతీస్తారనే అనుమానం బలపడుతోందని తెలిపింది. ఈ మేరకు చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖను కాపు ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ రావి శ్రీనివాస్, కన్వీనర్లు పెద్దిరెడ్డి మహేష్, బోడపాటి పెదబాబు గురువారం మీడియాకు విడుదల చేశారు. ఆ లేఖ సారాంశమిదీ.. ‘కాపు సామాజికవర్గానికి చంద్రబాబుకు ఉన్నంత చాణక్య తెలివితేటలు లేకపోవచ్చు గానీ, చైతన్యం మెండుగా ఉంది. చంద్రబాబు తీరుతో టీడీపీ, జనసేన కూటమి విజయావకాశాలను చేజేతులారా పాడుచేసుకున్నారు. జనసేన అండ లేకుండా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోరాటం చేయలేదు. కేవలం 24 ఎమ్మెల్యే, మూడు ఎంపీ సీట్లు ఇచ్చి పవన్‌తో యుద్ధం చేయించి కాపు సామాజికవర్గాన్ని అడ్డు పెట్టుకుని ఈ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం ఫలించదు. 2014లోనే జనసేనకు కనీసం 24 సీట్లు ఇచ్చినా పవన్‌కు ప్యాకేజీ స్టార్ అనే అప్రతిష్ట వచ్చేది కాదు. ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు అనే మాటలను బాబు ఇప్పటివరకు ఖండించలేదు. 2014లో చతికిలపడిపోయిన టీడీపీని జనసేన, బీజేపీ నిలబెట్టాయి. బాబు సహజగుణానికి తగ్గట్టుగానే 2019 ఎన్నికల్లో బీజేపీ, జనసేనను వదిలేసి ఫలితాన్ని చవిచూశారు. ఇప్పుడు చంద్రబాబు డైరెక్షన్లో మాట్లాడుతున్న పవన్ రెండు చోట్లా తనను ఓడించారని పదే పదే ప్రజలను నిందించడం సరికాదు. పవన్ ఓటమిలో టీడీపీ పాత్ర, వ్యక్తిగత వైఫల్యం ఏమిటో ప్రజలకు తెలుసు.’ 2019లో మీ స్నేహాన్ని ఎవరు చెడగొట్టారు? ‘బుధవారంనాటి జెండా సభలో పవన్ మాట్లాడుతూ స్నేహమంటే చివరి వరకు అని స్వయంగా ప్రకటించారు. మరి 2019లో మీ ఇరువురి స్నేహాన్ని ఎవరు చెడగొట్టారు చంద్రబాబూ? ఆ రోజు మీ డైరెక్షన్ మేరకే విడిగా పోటీ చేశారా? పవన్ ఓటమిలో మీ పాత్ర లేదా? ఆనాడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలని మీరు చేసిన ప్రయత్నం ఫలించిందా? ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు. నాలుగున్నరేళ్లపాటు ఎన్డీఏ ప్రభుత్వంలో అధికారాన్ని పంచుకుని, సడెన్‌గా యూటర్న్ తీసుకుని ప్రజాధనంతో కేంద్రంపై ఉద్యమాలు చేయించారు. ప్రధాని మోదీని తిట్టారు, తిట్టించారు. ఇపుడు బీజేపీతో పొత్తు కోసం పరితపిస్తున్నారు. రాజమండ్రి జైలుకు వచ్చి పవన్ మీకు మద్దతు ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏమిటనేది ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు వాడుకుని పవన్‌ను మడత పెట్టేస్తే.. ఆయన అభిమానులు, కాపులు కలిసి మిమ్మల్ని మడత పెట్టేస్తారని గమనించండి.’ త్యాగాలు ఇతరులే చేయాలా? మీరు చేయరా? ‘24 ఎమ్మెల్యే సీట్ల కోసం యుద్ధం చేయాల్సిన అవసరం మాకేంటి? 151 సీట్ల కోసం టీడీపీ వాళ్లే యుద్ధం చేసుకుంటార్లే అనే పరిస్థితి ఇప్పటికే వచ్చేసింది. పవన్‌ను లోక్‌సభకు పోటీ చేయించి ఢిల్లీ పంపేస్తారని, బాబుకు ఇబ్బంది లేకుండా చేసుకుంటారంటూ ప్రజల్లో చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను కలవడానికి పవన్ ఇష్టపడినప్పటికీ ఆయన్ని అడ్డుకున్నది చంద్రబాబే అని ప్రజల్లో బలమైన అభిప్రాయం ఉంది. నాదెండ్ల మనోహర్‌ను అడ్డుపెట్టుకుని ప్రజారాజ్యం మాదిరిగా జనసేనను నిర్విర్యం చేసి దెబ్బతీస్తారనే అనుమానం బలపడుతోంది. ఇలా నమ్మించి మోసం చేయడాన్ని కాపులు ఏమాత్రం జీర్ణించుకోరన్న నగ్న సత్యాన్ని గత అనుభవాల దృష్ట్యా మీరు గ్రహించాల్సి ఉంది. త్యాగాలు చేయాలని తమరు ఇతరులకు చెప్పడమేనా? మీరు త్యాగాలు చేయరా? పవన్‌ను మోసం చేయడం ద్వారా మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారనే నగ్న సత్యాన్ని గ్రహించాలి’ అని ఆ లేఖలో కాపు ఐక్య వేదిక నేతలు చంద్రబాబుకు స్పష్టం చేశారు. -
నాదెండ్లకు చుక్కలు చూపించి.. దాడికి యత్నం!
సాక్షి, పశ్చిమగోదావరి: జనసేనలో సీట్ల పంచాయితీ ‘ముష్టి’ యుద్ధానికి దారి తీస్తోంది. తాజాగా పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌కు జనసేన శ్రేణులు చుక్కలు చూపించాయి. ఆయన బస చేసిన చోట నిరసనకు దిగాయి. అక్కడితో ఆగకుండా బూతులు తిడుతూ నాదెండ్లపై దాడికి సైతం యత్నించాయి. తాడేపల్లిగూడెంలో ఈ నెల 28న జరగబోయే జనసేన టీడీపీ ఉమ్మడి బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్ల పరిశీలనకు సోమవారం నాదెండ్ల మనోహర్ వెళ్లారు. పెంటపాడు మండలం అలంపురంలోని జయా గార్డెన్స్‌లో రాత్రి బస చేశారాయన. సమాచారం అందుకున్న వెంటనే జనసేన ఇన్‌ఛార్జి విడివాడ రామచంద్రరావు, తన అనుచరులు, కొంతమంది కార్యకర్తలతో గెస్ట్‌హౌజ్ దగ్గర నిరసనకు దిగారు. రామచంద్రరావుకు అనుకూలంగా ఆయన అనుచరులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో తాడేపల్లిగూడెం డీఎస్పీ భారీగా పోలీసులతో అక్కడ మోహరించగా.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు బొలిశెట్టి శ్రీనివాస్, కందుల దుర్గేష్‌లు ఎంత సముదాయించిన రామచంద్రరావు మాట వినలేదు. ‘టికెట్ ఇవ్వకపోతే ప్రాణం తీసుకుంటా’ అంటూ బెదిరించారు. ఈ క్రమంలో బొలిశెట్టి వర్సెస్ విడివాడ వర్గాలుగా విడిపోయి జనసేన శ్రేణులు బాహాబాహీకి యత్నించాయి. బోలిశెట్టి సత్యనారాయణపై కొందరు కార్యకర్తలు భౌతిక దాడికి దిగారు. మనోహర్ బస చేసిన చోటే రచ్చ రచ్చ చేశారు. అదే సమయంలో కొందరు కార్యకర్తలు మనోహర్‌ను బూతులు తిడుతూ కనిపించారు. వారాహి యాత్రలో స్వయంగా పవన్ కల్యాణ్ ప్రకటించడంతో తణుకు సీటు జనసేనదేనని.. రామచంద్రరావు పోటీ చేయడం ఖాయమని అంతా అనుకున్నారు. అంతేకాదు.. పొత్తులో భాగంగా చాలా కాలం దాకా ఇరుపార్టీల ఉమ్మడి అభ్యర్థిగా విడివాడ రామచంద్రరావు పేరు బలంగా వినిపించింది. సీన్ కట్ చేస్తే.. ఉమ్మడి జాబితాలో రామచంద్రరావుకు ఘోర అవమానం జరిగింది. టికెట్ టీడీపీకి చెందిన అరిమిల్లి రాధాకృష్ణకు వెళ్లింది. దీంతో రామచంద్రరావు వర్గీయులు రగిలిపోతున్నారు. -
ఆలపాటి ఔట్.. అధికారికంగా చెప్పేసిన లోకేష్
తెనాలి: తెనాలి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీకి ప్రయత్నాలు చేస్తున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆశల అడియాసలయ్యాయి. ఆయనకు పార్టీ టికెట్ లేదని సాక్షాత్తూ నారా లోకేశ్ మంగళ వారం తేల్చి చెప్పేశారు. 2024 ఎన్నికలకు జనసేన, టీడీపీ పొత్తుల నేపథ్యంలో తెనాలి నుంచి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ రంగం సిద్ధం చేసుకుంటున్న విషయం తెలిసిందే. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీచేస్తారని, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ రెండు నెలల క్రితమే మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో తెనాలి జనసేన నేతలకు స్పష్టంచేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ పార్టీ వర్గాలను మభ్యపెడుతూ తానూ పోటీలో ఉన్నట్టుగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు ఆలపాటి. పైగా ప్రజా చైతన్యయాత్ర పేరుతో నియోజకవర్గంలో పాదయాత్ర కూడా చేపట్టారు. వార్డులవారీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. నాదెండ్ల మనోహర్‌తో పోలిస్తే పార్టీ సర్వేలో తనకే ఎక్కువ స్కోరు ఉన్నట్టుగా కార్యకర్తలు, నాయకులకు చెప్పారు. చివరి నిముషంలో తనకే టికెట్ వస్తుందని నమ్మబలుకుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళవారం దీనిపై స్పష్టత ఇచ్చినట్టు తెలిసింది. గుంటూరు ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తే చెయ్... లేదంటే నీదారి నువ్వు చూసుకొమ్మని లోకేశ్ చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. బుర్రిపాలెంకు చెందిన ప్రవాస భారతీయుడు పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పటికే గుంటూరు ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసేందుకు సన్నాహాల్లో ఉన్నారు. దీనితో ఆలపాటికి ఏం చేయాలో పాలుపోవటం లేదంటున్నారు. -
సై అంటే సై.. టీడీపీ, జనసేనల పొత్తు కుంపట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నా టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల సిగపట్లు ఏమాత్రం తగ్గడంలేదు. ఎవరికి వారు సై అంటే సై అంటూ కత్తులు నూరుతున్నారు. రెండు పార్టీల అధినేతలు పొత్తు కుదుర్చుకున్నా కింది స్థాయిలో నేతలు, కేడర్ మనసులు మాత్రం కలవడంలేదు. మున్ముందు కూడా కలిసి పనిచేసేందుకు కేడర్ సంసిద్ధంగాలేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో రాష్ట్రంలో చాలాచోట్ల రెండు పార్టీల నేతల మధ్య పొత్తు అస్సలు పొసగడంలేదు. పైగా.. కలిసి పనిచేస్తున్నట్లు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు ఎప్పుడో ప్రకటించినా ఇప్పటివరకు ఒక్కడుగు కూడా వారిరువురూ ఆ దిశగా ముందుకు వేయలేదు. సీట్ల సర్దుబాటు నుంచి ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి సభల వరకు అన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయి. కలిసి పనిచేయడానికి ఇద్దరు నేతలు ఆరాటపడుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఇరు పార్టీల నేతలు కత్తులు దూసుకుంటున్నారు. అలాగే, సీట్ల సర్దుబాటుపై కొన్నినెలలుగా చర్చలు జరగడమే తప్ప ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం వెల్లడించకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు.. తమకు 50కి పైగా సీట్లు కేటాయించాలని జనసేన కోరుతుండగా, 15 సీట్లు ఇవ్వడానికి కూడా బాబు సిద్ధంగాలేరు. ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామని రెండునెలల క్రితం ప్రకటించినా ఇంతవరకూ ఆ ఊసేలేదు. అంతేకాక.. ఇద్దరు అధినేతలు కలిసి ఉమ్మడిగా సభలు నిర్వహిస్తారని ప్రకటించినా అదీ జరగలేదు. బాబు ‘రా కదలిరా’ సభలకు పవన్ వెళ్తారని ప్రచారం చేసినా ఆయన వెళ్లలేదు. సీట్ల సర్దుబాటు కుదరకపోవడంవల్లే ఏ నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నారు. జిల్లాలో నువ్వా నేనా? ఇదిలా ఉంటే.. నియోజకవర్గాల్లో మాత్రం రెండు పార్టీల నేతలు సీటు తమదంటే తమదంటూ పోటీపడుతూ గొడవలకు దిగడంతో జిల్లాల్లో పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా మారింది. పలు నియోజకవర్గాల్లో ఆ రెండు పార్టీల నేతలు బలప్రదర్శనకు దిగుతూ నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు. ఉదా.. అనకాపల్లి ఎంపీ సీటు కోసం టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి తనయుడు విజయ్ ప్రయత్నిస్తుండగా దాన్ని జనసేనకు కేటాయిస్తారనే ప్రచారంతో వాతావరణం వేడెక్కింది. తన కొడుక్కి ఎంపీ సీటు నిరాకరిస్తుండడంతో అయ్యన్న కస్సుమంటూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రాజమండ్రి రూరల్‌లో రాజుకున్న విభేదాలు.. ఇక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ సీటు టీడీపీ, జనసేన నేతల మధ్య విభేదాలు రాజేసింది. అక్కడి నుంచి మళ్లీ తానే పోటీచేస్తానని సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెబుతుండగా సీటు తనదేనని జనసేన నేత కందుల దుర్గేష్ తొడకొడుతున్నారు. ఇలా రెండు పార్టీల నేతలు ఇప్పటికే బహిరంగంగా గొడవలు పడే పరిస్థితి నెలకొంది. తాజాగా.. బుచ్చయ్య చౌదరి స్థానికంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో తన సీటును ఆపడానికి దుర్గేష్ ఎవరని ప్రశ్నించారు. దీనిపై దుర్గేష్ వర్గం మండిపడుతూ ప్రతి విమర్శలు చేసింది. ఇలా.. నిత్యం రెండు పార్టీల నేతలు సీటు కోసం రెచ్చగొట్టే ప్రకటనలు చేసుకుంటూనే ఉన్నారు. పిఠాపురంలో పోటాపోటీ.. ► కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన ఇన్‌ఛార్జి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ మధ్య విభేదాలు ముదిరి పాకానపడ్డాయి. ఇటీవల జరిగిన రెండు పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఈ సీటు తనదేనని చెబుతూ ఒకసారి ఓడిపోయిన వారికి సీటు ఎలా ఇస్తారని వర్మను ఉద్దేశించి మాట్లాడారు. దీనికి ప్రతిగా పార్టీ అధినేతలే ఓడిపోయిన పరిస్థితి ఉందంటూ పవన్ విషయాన్ని వర్మ గుర్తుచేశారు. దీంతో గొడవ జరిగి ఇరు వర్గాలు కుర్చీలు విసురుకునే పరిస్థితి ఏర్పడింది. ► అలాగే, కాకినాడ రూరల్ సీటును జనసేన నేత పంతం నానాజీకి ఇస్తారనే ప్రచారంతో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కారాలు నూరుతున్నారు. సీటు తనకు ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ► అమలాపురం నియోజకవర్గంలో ఇరు పార్టీల నేతలు సీటు తమదంటే తమదని ప్రచారం చేసుకుంటున్నారు. ► రాజోలు సీటును పవన్ తమదేనని ప్రకటించినా అక్కడి టీడీపీ నేతలు మాత్రం ఇంకా ఆశలు పెట్టుకుని హడావుడి చేస్తున్నారు. ► ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరిలో పోలవరం సీటు జనసేనకు ఇస్తున్నారనే ప్రచారంతో అక్కడి టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. ► నర్సాపురం సీటు జనసేనకు ఇస్తే ఊరుకునేది లేదని స్థానిక టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. ► అలాగే, కృష్ణా జిల్లాలోనూ రెండు, మూడు నియోజకవర్గాల్లో రెండు పార్టీల మధ్య గందరగోళ వాతావరణం నెలకొంది. విజయవాడ పశ్చిమ నుంచి తాను పోటీచేస్తున్నట్లు జనసేన నేత పోతిన మహేష్ హడావుడి చేస్తుండగా టీడీపీ నేతలు జలీల్‌ఖాన్, బుద్ధా వెంకన్నలు అతనికి అంత సీన్లేదని ఎద్దేవా చేస్తున్నారు. తెనాలిపై మనోహర్, రాజా పట్టు.. ఇక తెనాలి సీటు కోసం జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా పోటీపడుతుండడం రసవత్తరంగా మారింది. సీటు తనదేనని మనోహర్ ఇప్పటికే పలుమార్లు స్పష్టంచేయగా, రాజా మాత్రం ఇంకా నిర్ణయం జరగలేదని చెబుతూ తానే పోటీచేస్తానని చెబుతున్నారు. రాజాకు సీటు ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే రీతిలో రాజా అనుచరులు తొడలు కొడుతున్నారు. ► కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సీటు తమదేనని జనసేన నేతలు ప్రకటించుకోవడంతో అక్కడి టీడీపీ నేత భూమా అఖిలప్రియ మండిపడుతున్నారు. ► అనంతపురం అర్బన్ సీటు కోసం రెండు పార్టీల నేతలు బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నారు. ► ధర్మవరం సీటుపైనా రెండు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం సీటుపైనా సిగపట్లు.. ఇలా మొత్తంగా రెండు పార్టీలు పొత్తు కుదుర్చుకున్నా కింది స్థాయిలో నేతలు, కేడర్ మనసులు మాత్రం కలవలేదు. మున్ముందు కూడా కలిసి పనిచేసేందుకు కేడర్ సంసిద్ధంగాలేని పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు.. సీఎం అభ్యర్థిత్వంపై సోషల్ మీడియాలో రెండు పార్టీలు కత్తులు నూరుకుంటున్నాయి. చంద్రబాబు సీఎం అభ్యర్థిత్వాన్ని పవన్‌కళ్యాణ్ బలపరుస్తున్నా ఆ పార్టీ నేతలు, కేడర్ మాత్రం అంగీకరించడంలేదు. పైగా పవనే సీఎం అభ్యర్థని ప్రచారం చేస్తున్నాయి. దీనిపై టీడీపీ నేతలు మండిపడుతూ జనసేనకు అంత సీన్లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. -
నువ్వొక పనికిమాలిన వాడివి..నాదెండ్ల పై వెల్లంపల్లి ఫైర్
-
పొత్తుల పాలిటిక్స్: జనసేనకు షాకులిస్తున్న టీడీపీ నేతలు!
తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తుల కత్తులు వేళ్లాడుతున్నాయి. అధినేతలిద్దరూ పొత్తులు కుదర్చుకుంటారు. కానీ, నియోజకవర్గాల్లో నేతలు సీట్ల కోసం కొట్టుకుంటారు. ప్యాకేజీ స్టార్ పార్టీని అన్ని చోట్లా సైకిల్ పార్టీ నేతలు చితక్కొడుతున్నారు. జనసేన పార్టీలో నెంబర్ టూ నేతకే దిక్కులేకుండా పోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పొత్తులు పేరుకేనా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. టీడీపీ, జనసేన పార్టీల మధ్య దిగువ స్థాయిలో ఏం జరుగుతోంది?.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల కోసం చేతులు కలిపారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు జైలుకెళ్లగానే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలిసి వచ్చే ఎన్నికల్లో ముందుకెళ్తామని ప్రకటించారు. అప్పటినుంచి తరచూ చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలుస్తున్నారు. అటు పవన్‌ను కూడా చంద్రబాబు కలుస్తున్నారు. ఇక ఇద్దరూ కలిసి సీట్లు పంచుకుని ముందుకెళ్లడమే తరువాయి అనుకుంటున్న నేపధ్యంలో గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన, టీడీపీల మధ్య జరుగుతున్న వార్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రెండు పార్టీల మధ్య రచ్చ రచ్చ అవుతోంది. తాను తెనాలి నుంచి పోటీ చేస్తానని మూడు నెలల ముందే జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అంతేకాదు తెనాలిలో జనసేన పార్టీ ఎన్నికల కార్యాలయాన్నికూడా ఆయన ప్రారంభించారు. తెనాలి వచ్చినప్పుడల్లా అక్కడి నుంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే, జనసేన నేత నాదెండ్ల కార్యక్రమాల గురించి పట్టించుకోని తెనాలి టీడీపీ నేతలు తమ పని తాము చేసుకుపోతున్నారు. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ జనసేన నేత నాదెండ్ల మనోహర్ కన్నా స్పీడ్ పెంచారు. ఇక్కడనుంచి జనసేన పోటీ చేస్తుంది కదా.. మనకు సీటు లేదని కొన్నిరోజులపాటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆలోచించారు. ఆ తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లను కలిశారు. వారిద్దరితో భేటీ తర్వాత ఆలపాటికి ఏం క్లారిటీ వచ్చిందో బయటకు రాలేదుకానీ.. అప్పటినుంచి తెనాలిలో దూకుడు పెంచారు. టీడీపీ కార్యకర్తలకు మన పని మనదే.. జనసేన పని జనసేనదే.. వారికి మనకు సంబంధం లేదు. ఇక్కడనుంచి టీడీపీ అభ్యర్ది ఎన్నికల బరిలో ఉంటారు. ఆ అభ్యర్థిని కూడా నేనే అని పార్టీ నాయకులకు తేల్చిచెప్పేశారట. ఆలపాటి రాజా వ్యవహారం గురించి తెలుసుకున్న నాదెండ్ల మనోహర్ పొత్తులో భాగంగా జనసేన పోటీ చేస్తుంది కదా.. పవన్ కళ్యాణ్ కూడా తెనాలి సీటు నాదే అని చెప్పారు. ఇప్పుడు టీడీపీ అడ్డం తిరగడమేంటి అంటూ షాక్‌కు గురయ్యారట. అయినా.. సరే మేం కూడా మా పని చేసుకుంటాం.. పొత్తులో భాగంగా తెనాలి సీటు జనసేనకే వస్తుంది. తెలుగుదేశం ఇక్కడ పోటీ చెయ్యదని తన క్యాడర్‌కు చెబుతున్నారట. రెండు పార్టీల నేతల ప్రకటనలతో ఎవరు పోటీ చేస్తారో అర్దంకాని పరిస్థితి కొనసాగుతోంది. ఇదే సమయంలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రజా పాదయాత్ర పేరుతో నియోజకవర్గాన్ని చుట్టేద్దామని బయల్దేరారు. ఇది చూసి నాదెండ్ల మనోహర్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారట. ఒక వైపు సీటు మాదే అంటుంటే.. రాజా పాదయాత్ర ఎలా చేస్తారంటూ మండిపడుతున్నారు. పొత్తులో భాగంగా పై స్థాయిలో నిర్ణయం జరిగినపుడు టీడీపీ మనకు సపోర్ట్ చెయ్యాలి కదా అని సన్నిహితుల వద్ద వాపోయారట. రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో ముందుకెళ్దామని అనుకున్నాం.. మేనిఫెస్టోపై రెండు పార్టీల నేతల మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ సమయంలో టీడీపీ తొండాట ఆడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. టీడీపీ నేత ఆలపాటి రాజా తీరుపై అమీ తుమీ తేల్చుకునేందుకు పవన్ వద్ద పంచాయితీ పెట్టాలని నాదెండ్ల మనోహర్ నిర్ణయించుకున్నట్లు తెనాలిలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆలపాటి రాజా మాత్రం పొత్తు ఉన్నా.. లేకపోయినా తెనాలిలో పోటీ చేసేదీ నేనే అంటూ ముందుకుసాగుతున్నారు. తెనాలిలో టీడీపీ, జనసేనల మధ్య జరుగుతున్న సీట్ ఫైట్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. -
అభిమానులపై ‘పంజా’!
సాక్షి, అమరావతి: పదేళ్ల కిందట పెట్టిన పార్టీ. కానీ... ఇప్పటిక్కూడా వేదిక ఎక్కి మాట్లాడే నాయకుడు ఒక్కడే!!. మరీ ముఖ్యమైన సందర్భాల్లో అయితే అటుపక్క సోదరుడు... ఇటుపక్క తన వ్యవహారాలన్నీ చక్కబెట్టే ఓ కార్యదర్శి స్థాయి నాయకుడు. ఏ జిల్లాకెళ్లినా అంతా అభిమానులే తప్ప వాళ్లలో ఒక్కరూ నాయకులుండరు. అసలు జనసేన రాజకీయ పార్టీయేనా? అలాగైతే పదేళ్లుగా ఎక్కడా ఒక్క బలమైన నాయకుడూ ఎందుకు తయారు కాలేదంటారు? ఎందుకంటే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశమే అది. తనకు అధికారం అక్కర్లేదని పదేపదే ఆవేశాన్ని అభినయిస్తూ చెప్పే పవన్ కళ్యాణ్ మాటల్ని సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఎందుకంటే 2014 ఎన్నికల్లో ఆయన చంద్రబాబుకు బేషరతుగా మద్దతు ప్రకటించారు. చంద్రబాబు గెలిచారు. కానీ 2019 వచ్చేసరికి బాబు ప్రభుత్వంపై వ్యతిరేకత బాగా పెరిగిపోవటంతో... ఆ వ్యతిరేక ఓట్లన్నీ వైఎస్సార్ సీపీకి గంపగుత్తగా పడకుండా చీల్చాలని చంద్రబాబు ఆదేశించటంతో... కొత్త పాత్ర పోషిస్తూ బాబు స్నేహితుడి నుంచి బాబు ప్రతినాయకుడి పాత్రలోకి మారిపోయారు. లేని ఆవేశాన్ని తెచ్చుకుని, చంద్రబాబును చెడామడా తిట్టేస్తూ... ఆగ్రహంతో ఊగిపోయారు. రక్తి కట్టించాననుకున్నారు. కానీ సినిమా ఫ్లాపయింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి అఖండమైన మెజారిటీతో గెలిచారు. మరి ఇప్పుడూ అదే చంద్రబాబు కదా? అప్పటికీ ఇప్పటికీ ఆయనలో ఏం మారింది? ఏం మారిందంటే చంద్రబాబు పాత్ర మారింది. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చారు. మళ్లీ ఎన్నికలొస్తున్నాయి. ఒంటరిగా అయితే జగన్‌ను ఎదుర్కోలేనన్నది చంద్రబాబు ఉద్దేశం. పవన్ కళ్యాణ్ తనతో ఉంటే ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓట్లన్నీ గంపగుత్తగా వచ్చేస్తాయనే ఆశ. కాబట్టి పొత్తు పెట్టుకోవటం ద్వారా వాటన్నిటినీ తనకు బదిలీ చేయాలని పవన్‌కు ఆదేశించారు. మళ్లీ పవన్ వేషం మారింది. కాకపోతే రెండుసార్లు ఈయన్ను నమ్మి మోసపోయిన ఆ సామాజికవర్గం మళ్లీ నమ్ముతుందా? అది కూడా తమను పదేపదే మోసం చేసిన చంద్రబాబుకు అనుకూలంగా ఓట్లేయమంటే వేసేస్తారా? అందుకే పవన్ రకరకాల అభినయాలకు దిగుతున్నారు. ‘నేను ఎవరినీ ముఖ్యమంత్రిని చేయడానికి లేను’. ‘సీఎం పదవి చేపట్టేందుకు సిద్ధం’ సీఎం పదవి ఇస్తే ఎవరైనా వద్దంటారా?’ ‘జనసేన గెలిచే సీట్లను బట్టి ముఖ్యమంత్రి ఎవరన్నది ఎన్నికల తరవాత తేలుతుంది’. ‘మనకు తగిన బలం లేనప్పుడు ఒక మెట్టు దిగటంలో తప్పులేదు’ అనే పంచ్ డైలాగ్‌లు విసిరివిసిరి.. ఇప్పుడు దార్లోకి వచ్చారు. తెలుగుదేశంతో పొత్తును వ్యతిరేకించేవారు తనకు అక్కర్లేదని, పొత్తుకు కట్టుబడ్డవారే తనతో ఉండాలని, తెలుగుదేశం కోసం జనసేన కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పనిచేయాల్సి ఉంటుందని కుండబద్దలుగొట్టేశారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లకే కోట్లకు కోట్లు ఖర్చుచేసిన సినిమా రిలీజయ్యాక డిజాస్టరని తెలిస్తే ఎలా ఉంటుందో అంతకన్నా దారుణంగా తయారయింది జనసేన అభిమానుల పరిస్థితి. బాంబు పేల్చిన ‘తమ్ముడు’ లోకేశ్ సీఎం ఎవరన్నదీ అసెంబ్లీ ఎన్నికల తరవాత టీడీపీ– జనసేన చర్చించి నిర్ణయాలు తీసుకుంటాయని పవన్ కళ్యాణ్ చెబుతుంటే... అసలే గందరగోళంలో ఉన్న జనసేన అభిమానులపై చంద్రబాబు తనయుడు లోకేశ్ ఓ పిడుగు వేశాడు. ఇన్నాళ్లు పవన్ చెబుతున్న మాట పచ్చి అబద్ధమని తేల్చేశారు. ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ... ‘‘పొత్తులో చంద్రబాబే సీఎం అభ్యర్థి. దీన్లో రెండో ఆలోచనే లేదు’’ అని తెగేసి చెప్పారు. అంతేకాదు. 150 సీట్లలో తమ అభ్యర్థులు ఖరారైపోయారని మరో బాంబు పేల్చారు. ఈ ఇంటర్వ్యూ చూసి జనసేన అభిమానులు హతాశులయ్యారు. ఇన్నాళ్లూ తమ ‘బ్రో’ చెప్పినవన్నీ అబద్ధాలేనా అంటూ చర్చించుకుంటున్నారు. లోకేశ్ వ్యాఖ్యలపై జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా అనుమానాస్పదంగానే మాట్లాడారు. శుక్రవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో 15 మందితో కలిసి నాదెండ్ల విలేకరులతో మాట్లాడారు. లోకేశ్ వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా.. ‘నా దృష్టిలో లేదు, తెలియదు’ అని తప్పించుకున్నారు. నిబంధనల ప్రకారం ఎన్నికల తర్వాతే ఎమ్మెల్యేలు సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తారని చెప్పారు. నిజానికి పొత్తుపై టీడీపీతో ఏ చర్చ జరిగినా, జనసేన తరుఫున పవన్ పక్కన నాదెండ్ల మనోహర్ మాత్రమే ఉంటారు. సీఎం అభ్యర్థిత్వంపై రెండు పార్టీల మధ్య నిర్ణయం జరగకుండా ఉంటే లోకేశ్ వ్యాఖ్యలను ఆయన ఖండించే వారు. కానీ, సీఎం అభ్యర్థి చంద్రబాబు అని పవన్ కూడా చాలాసార్లు చెప్పారని లోకేశ్ స్పష్టంగా చెప్పారు. దీన్ని మనోహర్ ఖండించలేదు. మనోహర్ ఇలా మాట్లాడటంతో... పవన్ ఉద్దేశపూర్వకంగానే సీఎం అభ్యర్థిత్వంపై అబద్ధాలు చెబుతూ మోసం చేస్తున్నారని జనసేన నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. 2014లో జనసేన పార్టీ ఏర్పాటు నుంచీ పవన్ రాజకీయ కార్యక్రమాలన్నీ చంద్రబాబు ప్రయోజనాల చుట్టూనే తిరుగుతున్నాయనే వాదనకు మరింత బలాన్నిచ్చేలా పవన్ తీరు ఉన్నట్టు వారు పేర్కొంటున్నారు. ఈ సారి కూడా చంద్రబాబు కోసమే తమ నాయకుడు పనిచేస్తున్నారని, చంద్రబాబు సీఎం అభ్యర్థిగా అంతర్గతంగా అంగీకరించి ఉంటారని, అయినా నిండా 20 సీట్లు కూడా ఇవ్వలేమని లోకేశ్ చెబుతుండగా ఇక సీఎం వంటి పదాలను పలకడం వృథా అని వారు వ్యాఖ్యానిస్తున్నారు. పొత్తులో సీఎం అభ్యర్థిపై లోకేశ్ ఏమన్నారంటే.. విలేకరి ప్రశ్న: ఓట్లను పంచుకుంటున్నారు. సీట్లను పంచుకుంటున్నారు. సీఎం పదవిని కూడా జనసేనతో పంచుకుంటారా? లోకేశ్: చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. దేర్ ఈజ్ నో సెంకడ్ థాట్ (రెండో మాటే లేదు). పవన్ కళ్యాణ్ కూడా అనేక సార్లు చెప్పారు. సమర్ధవంతమైన నాయకత్వం కావాలి. అనుభవం ఉన్న నాయకుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరమని చాలా స్పష్టంగా చెప్పారు. దేర్ ఈజ్ నో యాంబిగ్యుటీ (ఈ విషయంలో ఎలాంటి సందేహాలు లేవు) లోకేశ్ వ్యాఖ్యలపై విలేకరుల సమావేశంలో నాదెండ్ల మనోహర్ స్పందన.. విలేకరి ప్రశ్న: టీడీపీ – జనసేన పొత్తులో చంద్రబాబే ముఖ్యమంత్రి అభ్యర్థి అని లోకేశ్ ఓ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు. పవన్ ఇన్నాళ్లుగా ఎన్నికల తర్వాతే సీఎం అభ్యర్థి ఎవరన్నది చర్చించి నిర్ణయం ఉంటుందంటున్నారు కదా? నాదెండ్ల : నేను పర్టిక్యులర్‌గా వినలేదు. మీరు అనేది నిజమే అయితే, పొత్తులో భాగంగా పరస్పరం గౌరవించుకోవాలి. కొన్ని ఆలోచనలు సరైన సమయానికి ఇరు పార్టీల నాయకులు కూర్చోని, ఇరు పార్టీల ఎమ్మెల్యేలు కూర్చొని ఆ సందర్భంగా వారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. నా దృష్టిలో అయితే, (దీనిపై నిర్ణయం జరిగినట్టు) లేదు. -
పవన్ అజ్ఞాత వాసి.. నాదెండ్ల మనోహర్ అజ్ఞానవాసి: మంత్రి గుడివాడ
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పరిపాలనా రాజధానిగా ఉండటం చంద్రబాబుకు ఇష్టం లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాఖలో అనేక అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. టీడీపీ, జనసేన విశాఖపై దుష్ప్రచారం చేస్తున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించడమే టీడీపీ, జనసేన పని. నాదెండ్ల మనోహర్ అన్నీ అవాస్తవాలు మాట్లాడుతున్నారు. పవన్ అజ్ఞాత వాసి.. నాదెండ్ల మనోహర్ అజ్ఞానవాసి. ప్రజలను తప్పుదోవ పట్టించేలా నాదెండ్ల వ్యాఖ్యలు ఉన్నాయి. కొన్ని కంపెనీలకే భూములు కేటాయిస్తున్నామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు’’ అంటూ మంత్రి అమర్నాథ్ మండిపడ్డారు. ఇదీ చదవండి: రూ.25 లక్షల వరకూ ఆరోగ్యశ్రీ: సీఎం జగన్ -
పిచ్చి కూతలకు ఇచ్చిపడేసిన మంత్రి గుడివాడ
-
‘చంద్రబాబు పెద్ద కట్టప్ప.. నాదెండ్ల మనోహర్ చిన్న కట్టప్ప’
సాక్షి, విశాఖపట్నం: ఏపీ ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను నాదెండ్ల భాస్కర్ చదువుతున్నారు. చంద్రబాబు పెద్ద కట్టప్ప అయితే, నాదెండ్ల భాస్కర్ చిన్న కట్టప్ప అని సెటైరికల్ కామెంట్స్ చేశారు. కాగా, గుడివాడ అమర్నాథ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘పవన్‌తో పాటు, నాదెండ్ల మనోహర్ కూడా ప్రజలను తప్పు దోవపట్టిస్తున్నారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నపోటు పొడిస్తే.. పవన్ కల్యాణ్‌కు మనోహర్ వెన్నుపోటు పొడుస్తున్నారు. చంద్రబాబు పెద్ద కట్టప్ప అయితే.. మనోహర్ చిన్న కట్టప్ప. టీడీపీ పాలనలో జీఎస్డీసీ 22వ స్థానంలో ఉంది. నేడు జీఎస్డీపీ ఒకటో స్థానంలో ఉంది. జీఎస్డీపీ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. తలసరి ఆదాయం టీడీపీ హయాంలో 174వ స్థానంలో ఉండగా.. నేడు తొమ్మిదో స్థానంలో ఉంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక పరిశ్రమల ద్వారా లక్ష 30 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. MSME ద్వారా 13 లక్షల మందికి ఉపాధి కల్పించాం. టీడీపీ పాలనలో వ్యవసాయం రంగంలో 27 స్థానంలో ఉన్నాము. నేడు ఆరో స్థానంలో రాష్ట్రం ఉంది. పారిశ్రామిక అభివృద్ధిలో టీడీపీ హయాంలో 22వ స్థానంలో ఉంటే నేడు మూడో స్థానంలో ఉంది. గుజరాత్ తరువాత మన రాష్ట్రంలో పెట్టుబడులు అధికంగా వచ్చాయి. ఈజ్ ఆఫ్ డుయింగ్‌లో గత మూడేళ్ల నుంచి రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఎంఎస్ఎంఈకి పెద్ద పీట వేశారు. గత ప్రభుత్వం కన్నా ఎంఎస్ఎంఈ రంగంలో 650 శాతం అభివృద్ధి సాధించింది. మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగులో 20 వేల కోట్ల పెట్టుబడులకు సీఎం జగన్ క్లియరెన్స్ ఇచ్చారు. ఉన్న ఆరు పోర్టులకు అదనంగా మరో నాలుగు పోర్టులు నిర్మిస్తున్నారు. 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నాం. పోర్ట్ ఆధారిత పరిశ్రమలు తీసుకువస్తున్నాము. మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు మన రాష్ట్రంలో ఉన్నాయి. బల్క్ డ్రగ్ పార్క్‌ను నిర్మిస్తున్నాం’ అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ప్రజలతోనే మా పొత్తు: సీఎం జగన్