సాక్షి, హైదరాబాద్ : మలివిడత సమావేశాలను సాఫీగా నడిపే అంశ ంపై మండలి చైర్మన్ డాక్టర్ ఎ.చ క్రపాణి, స్పీకర్ మనోహర్ మల్లగుల్లాలు పడుతున్నారు. విభజన బిల్లుపై చర్చకు అధికార, విపక్షాల నుంచి సహకారం ఏ మేరకు ఉంటుందన్న సంశయుం వారిలో నెలకొంది. రాష్ట్రపతి ప్రణబ్‌వుుఖర్జీ విధించిన జనవరి 23 గడువు లోగా చర్చను వుుగించాల్సి ఉంది. కానీ ఇరుప్రాంతాల సభ్యులు, పార్టీలు వేర్వేరు వాదాలు వినిపిస్తుండడంతో సభ నిర్వహణపై చక్రపాణితో మనోహర్ చర్చించారు. అసెంబ్లీ తొలి విడత సమావేశాల్లో బిల్లుపై చర్చ ప్రారంభమైందని సభా వ్యవహారాల వుంత్రిగా శ్రీధర్‌బాబు, సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ వుల్లుభట్టి విక్రవూర్క ప్రకటించడం.. సీఎం కిరణ్‌తో సహా సీత్రులు, ఇతర నేతలు అభ్యంతర పెట్టడం తెలిసిందే. విధివిధానాలను ఖరారు చేశాకే చర్చను ప్రారంభించాలని, ఉత్తరప్రదేశ్, బీహార్ అసెంబ్లీల్లోఅనుసరించిన విధానాల పుస్తకాలను పంపుతానని సభాపతులిద్దరికీ కిరణ్ సూచించారు. వునోహర్ కూడా ఇటీవల లక్నో, పాట్నా వెళ్లి అక్కడి విభజన చర్చల తీరును అధ్యయునం చేసి వచ్చారు. పార్లమెంటు అధికారులతోనూ సవూవేశవుయ్యూరు. ఇందుకు సంబంధించిన నోట్‌లను సభల్లో సభ్యులకు అందించాలని ఆయున భావిస్తున్నారు. బీఏసీలో ఒక విధానాన్ని రూపొందించాకే చర్చను ప్రారంభిస్తానని స్పీకర్ గతంలో ప్రకటించడం తెలిసిందే. శుక్రవారం నుంచి సభలో సభ్యుల స్పందనను బట్టి బీఏసీని పెట్టాలని ఆయున భావిస్తున్నట్లు తెలుస్తోంది. శుక్ర, శనివారాల్లో సభ సజావుగా జరగని పక్షంలో సోవువారం బీఏసీ నిర్వహించి బిల్లుపై చర్చను ప్రారంభించవచ్చని తెలుస్తోంది. వులివిడత సవూవేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమై 10వ తేదీవరకు సాగి, ఐదు రోజుల సంక్రాంతి సెలవుల అనంతరం 16 నుంచి 23వ తేదీ దాకా కొనసాగుతారుు. అసెంబ్లీ అధికారులు ప్రశ్నోత్తరాలతో సహా సాధారణ అజెండాను వూత్రమే రూపొందించారు. బిల్లుపై చర్చ కొనసాగింపు అంశాన్నీ అందులోనే చేర్చారుు. ఈ చర్చకు పార్టీలు ఏ మేరకు అంగీకరిస్తారుు, చర్చ సాగుతుందా లేదా అన్నది సభలోనే తేలనుంది.
సభ నిర్వహణపై మల్లగుల్లాలు
Published Fri, Jan 3 2014 1:10 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement