రైతాంగాన్ని విస్మరించిన ప్రభుత్వం | The government ignored farmers | Sakshi
Sakshi News home page

రైతాంగాన్ని విస్మరించిన ప్రభుత్వం

Mar 24 2017 3:40 PM | Updated on Oct 1 2018 2:44 PM

రైతాంగాన్ని విస్మరించిన ప్రభుత్వం - Sakshi

రైతాంగాన్ని విస్మరించిన ప్రభుత్వం

ప్రభుత్వం రైతాంగాన్ని విస్మరించిందని పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ స్పీకర్‌ నాదేండ్ల మనోహర్‌ ఆరోపించారు.

కర్నూలు(ఓల్డ్‌సిటీ): ప్రభుత్వం రైతాంగాన్ని విస్మరించిందని పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ స్పీకర్‌ నాదేండ్ల మనోహర్‌ ఆరోపించారు. గురువారం స్థానిక కళావెంకట్రావ్‌ భవనం, జిల్లా కాంగ్రెస్‌ కమిటీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ ప్రజలు కరువుతో ఇబ్బంది పడుతున్నా.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. జిల్లాలోని 36 మండలాల కరువు ప్రాంతాలుగా ప్రకటించి నేటికీ స్పష్టమైన కార్యాచరణ చేపట్టలేదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టే పనులే తప్ప శాశ్వత అభివృద్ధి చేయడం లేదని విమర్శించారు. ఓర్వకల్లు వద్ద ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 638 ఎకరాలు భూమి సేకరించి..ఎకరాకు రూ. 8 లక్షలు పరిహారం ఇవ్వాలని కలెక్టర్‌ ప్రతిపాదిస్తే, ప్రభుత్వం రూ. లక్ష ఇస్తామని చెప్పడం దారుణమన్నారు. ఈనెల 25న అనంతపురంలో రైతుల కోసం సత్యాగ్రహం చేయనున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పి.లక్ష్మిరెడ్డి,  మైనారిటీ కాంగ్రెస్‌ రాష్ట్ర చైర్మన్‌ అహ్మద్‌ అలీఖాన్, నగర అధ్యక్షుడు సర్దార్‌ బుచ్చిబాబు, జెడ్పీ మాజీ చైర్మన్‌ ఆకెపోగు వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి తిప్పన్న, ఉపాధ్యక్షులు వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement