సీమ రైతుపై ప్రభుత్వ నిర్లక్ష్యం
Published Fri, Feb 17 2017 12:11 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
– రాయలసీమ సాగునీటి సాధన సమితి నేత అరుణ్
కర్నూలు(అర్బన్) : రాయలసీమ రైతాంగం అవసరాలు తీర్చడంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని రాయలసీమ సాగునీటి సాధన సమితి నేత అరుణ్ గురువారం ఒక ప్రకటనలో ఆరోపించారు. కేసీ కెనాల్ ఆయకట్టుదారులు తమకు కేటాయించిన నికర జలాలు 39.9 టీఎంసీలను పూర్తిగా వినియోగించుకోవడం లేదని తెలిపారు. గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం ప్రభుత్వం చేపట్టకపోవడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. రూ.600 కోట్ల ఖర్చుతో నిర్మితమయ్యే సిద్ధేశ్వరం అలుగు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వీడడం లేదన్నారు. జీవో నం.69కి పాలకులు తూట్లు పొడస్తున్నారని విమర్శించారు.
Advertisement
Advertisement