కలెక్టర్ తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు
కలెక్టర్ తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు
Published Mon, Jan 2 2017 11:55 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
–టీడీపీ కోడుమూరు ఇన్‌చార్జి విష్ణువర్దన్‌రెడ్డి
గూడూరు: జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయ్‌మోహన్ తీరుతో ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చెడ్డ పేరు వస్తోందని టీడీపీ కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి డి.విష్ణువర్దన్‌రెడ్డ ఆరోపించారు. గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి గూడూరు రైతులకు నీరు అందించి ఎండుతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ రెవెన్యూ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. రైతులతో కలిసి కార్యాలయాన్ని ముట్టడించి రెవెన్యూ సిబ్బంది విధులకు ఆటంకం కల్పించారు. సిబ్బందిని బయటకు పంపి కార్యాలయం తలుపులను వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఎల్లెల్సీ కోడుమూరు సబ్ డివిజన్ కింద గూడూరు 9 ఎల్, 11 ఎల్ కాల్వలకు చివరి తడి నీటిని గాజులదిన్నె ప్రాజెక్టు నీటిని విడుదల చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు ద్వారా కలెక్టర్‌కు ఆదేశాలు ఇప్పించామన్నారు. నీటి అవసరం ఉందోలేదేనని ఇరిగేషన్ అధికారుల ద్వారా కలెక్టర్ నివేదిక కూడా తెప్పించుకున్నారన్నారు., నివేదికలో నీటి విడుదల అవసరమేనని ఇరిగేషన్ అధికారులు కూడా కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారని ఆయన చెప్పారు. అయితే కలెక్టర్ ఇన్‌చార్జి మంత్రి ఆదేశాలను, ఇరిగేషన్ అధికారుల నివేదికను సైతం తొక్కి పెట్టి నీటి విడుదలలో జాప్యం చేస్తున్నాడని విష్ణు ధ్వజమెత్తారు. గాజులదిన్నె ప్రాజెక్టులో అవసరమైన మేర నీరు నిల్వ ఉన్నప్పటికీ చివరి ఆయకట్టుకు నీటిని ఎందుకు విడుదల చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
అంతుకు ముందు కొంత మంది రైతులు పురుగు మందు డబ్బాలను చేత పట్టుకుని నీటిని విడుదల చేసి ఆదుకోకుంటే ఆత్మహత్యలు చేసుకుంటామని కార్యాలయం ముందు ౖబైఠాయించి తహసీల్దార్ శివశంకర్‌నాయక్‌తో వాదనకు దిగారు. ఇదిలా ఉండగా.. కలెక్టర్ సీసీ విష్ణుతో ఫోనులో మాట్లాడడంతో ఆందోâళ¶న విరమించారు. ధర్నాలో ఎంపీపీ ఈశ్వరమ్మ, గూడూరు, సి.బెళగల్ జెడ్పీటీసీ సభ్యులు బీకే నాగజ్యోతి, చంద్రశేఖర్, మున్సిపల్ చైర్‌పర్సన్ ఇందిరాసుభాషిణి తదితరులు పాల్గొన్నారు.
Advertisement