విశాఖ భాగస్వామ్య సదస్సు బోగస్ | Visakhapatnam Partnership Conference was Bogus | Sakshi
Sakshi News home page

విశాఖ భాగస్వామ్య సదస్సు బోగస్

Published Tue, Oct 18 2016 1:50 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

విశాఖ భాగస్వామ్య సదస్సు బోగస్ - Sakshi

విశాఖ భాగస్వామ్య సదస్సు బోగస్

మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ విమర్శ

 సాక్షి, అమరావతి: ప్రభుత్వం విశాఖపట్నంలో ఈ ఏడాది జనవరిలో ఎంతో అట్టహాసంగా కోట్లు ఖర్చుపెట్టి నిర్వహించిన భాగస్వామ్య సదస్సు బోగస్ అని మాజీ స్పీకర్, పీసీసీ ఉపాధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. సమ్మిట్‌లో జరిగిన 361 ఎంఓయూల ద్వారా రూ. 4,76,878 కోట్లు పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ప్రకటించిందని, అయితే పది నెలలు దాటినా ఒక్క పరిశ్రమ కూడా రాలేదని పేర్కొన్నారు.

రాష్ట్రానికి 10 లక్షల ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పగా.. ఒక్క ఉద్యోగం కూడా రాలేదనే విషయం సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా బహిర్గతమైందన్నారు. ఆంధ్రరత్న భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీసీసీ ఆర్టీఐ చైర్మన్ లక్ష్మినారాయణ, విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు, అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీతో కలిసి ఆయన మాట్లాడారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement