సాక్షి,హైదరాబాద్: గత ఏడాది వరకు 5వేల900 కోట్ల రూపాయల మిగులు ఆదాయం ఉన్న తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులకుప్పగా మారుస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇదీ కాంగ్రెస్ చేస్తున్న "మార్పు" అని బుధవారం(ఆగస్టు14) ఎక్స్(ట్విటర్)లో చేసిన పోస్టులో ఎద్దేవా చేశారు.
‘గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అప్పులను పెంచేస్తోందని గతంలో కాంగ్రెస్ పార్టీవారు అపోహలు, అర్ధ సత్యాలను ప్రచారం చేశారు. ఇప్పుడు వారు మాత్రం అప్పుల విషయంలో అన్ని రకాల రికార్డులను బద్దలు కొడుతున్నారు. కేవలం ఎనిమిది నెలల్లోనే రూ. 50 వేల కోట్ల రుణాల మార్కును అధిగమించారు. ఇది కూడా ఒక్క కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టు నిర్మించకుండానే.
ఈ అద్భుతమైన రన్ రేటుతో, రాబోయే కొన్నేళ్లలో అదనంగా మరో రూ. 4-5 లక్షల కోట్ల అప్పులు చేస్తారని నేను భావిస్తున్నా. ప్రజలను విజయవంతంగా మోసం చేయడంలో కాంగ్రెస్ నేతలు బాగా పనిచేశారు’అని కేటీఆర్ చురకంటించారు.
Comments
Please login to add a commentAdd a comment