
సాకక్షి,హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ పేరిట మహేష్ కుమార్ గౌడ్ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయనకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు.
హామీలు అమలు చేయడం చేతకాని కాంగ్రెస్ సర్కారు తన చేతికానీతాన్ని కప్పిపుచ్చేందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి రాద్ధాంతం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా తమపై, తమ పార్టీ నేతలపై ఇంతటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. మహేష్ కుమార్ గౌడ్ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.