పోటాపోటీ నినాదాలతో హోరెత్తిన అసెంబ్లీ
హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. ఈ ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే వాయిదా పడ్డాయి. గందరగోళ పరిస్థితులు తలెత్తడంతో గంట పాటు సభను స్పీకర్ వాయిదా వేశారు. సీమాంధ్ర, తెలంగాణ ఎమ్మెల్యేల పోటాపోటీ నినాదాలతో సభ దద్దరిల్లింది. స్పీకర్ పోడియం వద్ద ఇరు ప్రాంతాల ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు.
తెలంగాణ ముసాయిదా బిల్లును వెంటనే సభలో ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రాంత సభ్యులు డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. సీమాంధ్ర సభ్యులు సమైక్యాంధ్రకు మద్దతుగా గళం విప్పారు. సమైక్య తీర్మానం ప్రవేశపెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో సభలో గందరగోళం తలెత్తింది. చేసేదిలే్క స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను గంటపాటు వాయిదా వేశారు. కాగా, విపక్షాల వాయిదా తీర్మానాలన్నింటిని స్పీకర్ తిరస్కరించారు.