సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి సర్కార్ పని తీరుపై మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పంట కొనుగోలు విషయంలో రైతులను మోసం చేస్తూ.. వారిని ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ప్రతి గింజా ప్రభుత్వమే కొంటుందన్న పౌర సరఫరా శాఖా మంత్రి ఏమైపోయారని ప్రశ్నించారు.
ధాన్యం కొనుగోళ్ళ పనితీరుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఈ క్రమంలో అంబటి ట్విట్టర్ వేదికగా..‘నేను సందర్శించి తెలుసుకున్న సత్యం!. కొల్లిపర మండలంలో వరి సాగు విస్తీర్ణం 13,500 ఎకరాలు. ధాన్యం దిగుబడి 31వేల మెట్రిక్ టన్నులు. ప్రభుత్వం కొన్న ధాన్యం 1500 మెట్రిక్ టన్నులు. ప్రతీ గింజా ప్రభుత్వమే కొంటుందన్న పౌర సరఫరా శాఖా మంత్రి గారి నియోజకవర్గంలోనిదే ఈ కొల్లిపర!’ అంటూ కామెంట్స్ చేశారు.
నేను సందర్శించి తెలుసుకున్న సత్యం!
కొల్లిపర మండలం:
వరి సాగు విస్తీర్ణం: 13,500 Acres
ధాన్యం దిగుబడి :31000 MT
ప్రభుత్వం కొన్న ధాన్యం : 1500 MT
ప్రతి గింజా ప్రభుత్వమే కొంటుందన్న
పౌర సరఫరా శాఖా మంత్రి గారి నియోజకవర్గంలోనిదే ఈ కొల్లిపర !@ncbn @mnadendla— Ambati Rambabu (@AmbatiRambabu) December 10, 2024
Comments
Please login to add a commentAdd a comment