paddy purchase centers
-
నాదెండ్ల.. కొల్లిపర ఎక్కడో తెలుసా?: అంబటి రాంబాబు
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి సర్కార్ పని తీరుపై మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పంట కొనుగోలు విషయంలో రైతులను మోసం చేస్తూ.. వారిని ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ప్రతి గింజా ప్రభుత్వమే కొంటుందన్న పౌర సరఫరా శాఖా మంత్రి ఏమైపోయారని ప్రశ్నించారు.ధాన్యం కొనుగోళ్ళ పనితీరుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఈ క్రమంలో అంబటి ట్విట్టర్ వేదికగా..‘నేను సందర్శించి తెలుసుకున్న సత్యం!. కొల్లిపర మండలంలో వరి సాగు విస్తీర్ణం 13,500 ఎకరాలు. ధాన్యం దిగుబడి 31వేల మెట్రిక్ టన్నులు. ప్రభుత్వం కొన్న ధాన్యం 1500 మెట్రిక్ టన్నులు. ప్రతీ గింజా ప్రభుత్వమే కొంటుందన్న పౌర సరఫరా శాఖా మంత్రి గారి నియోజకవర్గంలోనిదే ఈ కొల్లిపర!’ అంటూ కామెంట్స్ చేశారు.నేను సందర్శించి తెలుసుకున్న సత్యం!కొల్లిపర మండలం: వరి సాగు విస్తీర్ణం: 13,500 Acresధాన్యం దిగుబడి :31000 MTప్రభుత్వం కొన్న ధాన్యం : 1500 MTప్రతి గింజా ప్రభుత్వమే కొంటుందన్న పౌర సరఫరా శాఖా మంత్రి గారి నియోజకవర్గంలోనిదే ఈ కొల్లిపర !@ncbn @mnadendla— Ambati Rambabu (@AmbatiRambabu) December 10, 2024 -
‘కూటమి అలసత్వం.. నాడు బుడమేరు.. నేడు రైతులు’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో తుపాను ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిసినా కూటమి ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేయలేదని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్. అప్పులు తెచ్చుకుని రైతులు సాగు చేసుకుంటున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని ఘాటు విమర్శలు చేశారు. చివరికి టీడీపీ కార్యకర్తలు కూడా ఈ ప్రభుత్వం వైఖరితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చెప్పారు.మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘రైతుల గురించి ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతులు ధాన్యం రాశుల వద్ద గగ్గోలు పెడుతున్నారు. బుడమేరుకు వరదలు వస్తాయని తెలిసినా విజయవాడని ముంచేసినట్టుగానే ఇప్పుడు కూడా వ్యవహరిస్తున్నారు. తుపాను వస్తుందని తెలిసినా రైతులను అప్రమత్తం చేయలేదు. రైతుసేవా కేంద్రాల వద్దకు వెళ్తే మిల్లర్ల దగ్గరకు వెళ్లమని ఉచిత సలహాలు ఇస్తున్నారు.విజయవాడ నుండి మచిలీపట్నం వరకు ఎక్కడ చూసినా రోడ్డు పక్కన ధాన్యం రాసులే కనిపిస్తున్నాయి. అప్పులు తెచ్చుకుని రైతులు సాగు చేసుకుంటున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదు. రైతులను ఈ ప్రభుత్వం వెంటిలేటర్ల మీదకు నెట్టేసింది. పౌరసరఫరాల శాఖ మంత్రి మాటలు కోటలు దాటుతున్నాయేగానీ చేతల్లో ఏమీ కనపడటం లేదు. కనీసం టార్బలిన్ పట్టాలు, గోనె సంచులు కూడా ఇవ్వటం లేదు. మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రైతు క్షేమంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ప్రభుత్వం గుర్తించాలిరాష్ట్రంలో ఒక్క బస్తా ఐనా మద్దతు ధరతో రైతుల నుండి కొనుగోలు చేశారా?. మాతో వస్తే రైతుల గోడు మంత్రులకు చూపిస్తాం. చివరికి టీడీపీ కార్యకర్తలు కూడా ఈ ప్రభుత్వం వైఖరితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేల కోట్ల రూపాయలు స్కామ్ చేయటానికి ప్రభుత్వ పెద్దలు రెడీగా ఉన్నారు. గ్రామాల్లో తేమ శాతం 15% ఉంటే మిల్లర్ల దగ్గరకు వెళ్తే 20% ఉన్నట్టు చూపిస్తున్నారు. మధ్యవర్తులు, దళారుల ద్వారా వేల కోట్ల రూపాయలు రైతుల నుండి దోచుకుంటున్నారుఒక్కో బస్తా మీద రూ.425ల చొప్పున ఈ మాఫియా కొట్టేస్తోంది. వైఎస్ జగన్ హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేడు. మద్యం, ఇసుక మీద ఉన్న ప్రేమ.. రైతుల మీద ప్రభుత్వానికి లేదు. రైతు సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. హాయ్ అని మెసేజ్ పెడితే ధాన్యం మొత్తం కొనిపిస్తానని మంత్రి నాదెండ్ల మనోహర్ మాటలు చెప్తున్నారు. ఎంతమంది మెసేజ్‌లు పెట్టినా ఆ మంత్రికి చలనం లేదు. మెసేజ్ కాదు ఇకమీదట గిల్లితేనైనా రైతుల అవస్థలు గుర్తొస్తాయేమో? అంటూ చురకలంటించారు. -
బోనస్‌ను బోగస్ చేసిన కాంగ్రెస్ సర్కార్: హరీష్ రావు
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతులకు సాయం చేయలేని ప్రభుత్వం ఉన్నా లేకున్నా ఒక్కటేనని ఘాటు విమర్శలు చేశారు. అలాగే, ఈరోజు పత్తి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మాజీ మంత్రి హరీష్ రావు గురువారం ఉదయం ఖమ్మంలోని పత్తి మార్కెట్‌ను సందర్శించారు. ఈ క్రమంలో రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, హరీష్ మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్లో ఒకటి ఖమ్మం పత్తి మార్కెట్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతుల పరిస్థితి దారుణంగా మారింది. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. పత్తికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి, ఆ బోనస్‌ను బోగస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం మద్దతు ధర వచ్చే పరిస్థితి కూడా లేదు.మార్కెట్ సెక్రటరీ ఇచ్చిన లెక్కల ప్రకారం రూ.6,500 మద్దతు ధర దాటడం లేదు. అకాల వర్షాలతో పంట దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, కనీసం మద్దతు ధరకు కూడా పండించలేని పరిస్థితి ఉంది. రూ.500 బోనస్ దేవుడే ఎరుగు, కానీ మద్దతు ధరకు వెయ్యి రూపాయలు రైతు నష్టపోతున్నారు. రైతులకు సాయం చేయడానికి ఎందుకు ఈ ప్రభుత్వానికి ఇబ్బంది?. రైతులను ఆదుకోలేదు, వ్యవసాయ కూలీలను ఆదుకోలేదు, ఏ ఒక్క వర్గాన్నీ ఆదుకోలేదు. పత్తి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. పత్తి మద్దతు ధర రూ.7,500 ఉండాల్సి ఉండగా, కేవలం రూ.6,500 మాత్రమే రైతులకు అందిస్తున్నారు. ఇవి మార్కెట్ యార్డ్ సెక్రటరీ ఇచ్చిన లెక్కలే. ఖమ్మం పత్తి మార్కెట్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయండి.శంకర్ రమాదేవి అనే రైతులు ఎనిమిది ఎకరాల్లో పత్తి పండిస్తే, కనీసం ఐదు క్వింటాళ్ల పంట కూడా రాలేదని, వచ్చిన దానికి కూడా మద్దతు ధర ఇవ్వడం లేదు. రాష్ట్రంలో ఎక్కడ కూడా పత్తి రైతులకు మద్దతు ధర రావడం లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2021లో రూ.11,000కు పత్తి కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు సగానికి సగం పత్తి ధర పడిపోయింది? ఇది దళారుల దోపిడీ వల్లే. రూ.7,520 మద్దతు ధరను పత్తి రైతులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైతులకు కనీసం రూ.500 బోనస్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. దళారులు రూ.6,500కు పత్తి కొనుగోలు చేసి, సీసీఐ కేంద్రాలకు రూ.7,500కు అమ్ముతున్నారు.మిర్చి రైతులను కూడా ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసింది. గత సంవత్సరం రూ.23,000 మద్దతు ధర వస్తే, ఈసారి రూ.13,000 కూడా రావడం లేదు. మాయమాటలు చెప్పి రైతులను నట్టేట ముంచడం మంచిది కాదు. రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశారు. రూ.15,000 రైతు భరోసాను ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. రూ.15,000 కౌలు రైతులకు ఇస్తామని ఇవ్వలేదు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా, ప్రజా సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో లేరు.ఒకరిపై ఒకరు పైచేయి కోసం పాకులాటమే తప్ప, ప్రజా సమస్యల కోసం పనిచేయడం లేదు. నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల సన్న వడ్లు ఖమ్మం జిల్లాలో పండితే, ఇప్పటివరకు 19 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఒక రైతుకైనా వడ్లకు బోనస్ వచ్చిందా?. సకాలంలో మిల్లులు అనుసంధానం చేయకపోవడం, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, గన్నీ బ్యాగులు ఇవ్వకపోవడం వల్ల ధాన్యం దళారుల పాలైంది. సీసీఐ కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం పెట్టామని చెబుతున్నా, వాస్తవానికి సీసీఐ కేంద్రాలు కనబడటం లేదు.ముఖ్యమంత్రి పత్తి కొనుగోలుపై సమీక్ష చేయడం లేదు. మద్యం అమ్మకాలపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.. కానీ పత్తి, వరి కొనుగోళ్లపై సమీక్ష ఎందుకు చేయడం లేదు. మద్దతు ధరకు ధాన్యం కొనకపోతే, ఎవరికీ మెమోలు జారీ చేయడం లేదు. తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా చేయాలని ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారేమో?. ఈరోజు పత్తి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా అన్ని రకాల పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది అంటూ కామెంట్స్ చేశారు. -
రైతులకు సంచులిచ్చే తెలివి లేదా?.. కాంగ్రెస్‌పై హరీష్ రావు ఫైర్
సాక్షి, సిద్దిపేట: రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రైతులను నట్టేట ముంచారు. రాష్ట్రంలో రైతుల వడ్లు కొనే దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, రైతులకు బోనస్ ఇవ్వరు.. రైతుబంధు ఇవ్వరు అని ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలకు పని తక్కువ.. కోతలు ఎక్కువ. రైతులకు సంచులు పంపే తెలివి లేదా?. హైదరాబాద్‌లో కూర్చోవడం కాదు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. సీఎం రేవంత్ ఒక్కసారైనా ధాన్యం కొనుగోళ్లపై రివ్యూ చేశారా?. రైతులను నట్టేట ముంచిన వ్యక్తి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో రైతులకు రైతుబంధు లేదు.. వడ్లకు బోనస్ లేదు. తెలంగాణలో వడ్లు కొనే దిక్కు లేదు. ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోవాలి. 30 శాతం వడ్లు దళారులు కొన్నారు. ఎలక్షన్ కన్నా ముందు రైతు ఓట్లు అన్ని నాకే కావాలన్నారు. నెల రోజులైనా సంచులు ఇవ్వలేదు. చాలా జిల్లాలో రైతులు ధర్నాలు చేస్తున్నారు.రుణ మాఫీకి 31 రకాల కోతలు పెట్టిన వ్యక్తి రేవంత్. లక్షా 50వేల కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తారు కానీ.. రైతులకు బోనస్ ఇవ్వరు. అకాల వర్షాల కారణంగా చాలా చోట్ల వడ్లు తడిసిపోయాయి. తడిచిన వడ్లు మీరు కొనరు. కలెకర్లు అక్కడికి రారు.. మీ మంత్రులు అటువైపు కూడా చూడరు. దీనిపై ముఖ్యమంత్రి వెంటనే రివ్యూ చేయాలి. రైస్ మిల్లరతో చర్చలు చేయాలి. రైతులకు ఇబ్బంది రాకుండా చూడాలని డిమాండ్ చేశారు. -
సన్న వడ్లకు 500 బోనస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. సన్నవడ్లకు ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే, సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని వ్యవసాయ అధికారులను సీఎం ఆదేశించారు.సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్.. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేయాలి. అవసరమైన చోట కొత్త ఐకేపీ సెంటర్లు కూడా పెట్టాలి. సన్నవడ్ల కొనుగోలుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలి. ఐకేపీ సెంటర్లకి సీరియల్ నెంబర్లు ఇవ్వాలి. సన్నవడ్లపై ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలి. ధాన్యం కోసం గోనె సంచులు అందుబాటులో ఉండాలి. ధాన్యం కొనుగోలులో వ్యవసాయ అధికారులు భాగం కావాలి. కొనుగోలు చేసిన ధ్యానం వెంటనే తరలించేందుకు ఏర్పాట్లు చేయాలి. ఐకేపీ సెంటర్లలో ధాన్యం తడవకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. కలెక్టర్లు ప్రతీరోజూ రెండు గంటల పాటు ధాన్యం కొనుగోలుపైన సమీక్ష జరపాలి. ధాన్యం కొనుగోళ్లపైన కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలి. సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందే. ధాన్యంలో తాలు, తరుగు, తేమ పేరుతో రైతులను మోసం చేసేవారిని సహించవద్దు. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలి. రాష్ట్రంలో వంద శాతం రైతులు సన్నబియ్యం పండించేలా చొరవ చూపించాలి. వాతావరణ శాఖ నుంచి వచ్చే సూచనల ప్రకారం ఐకేపీ సెంటర్లలో కొనుగోళ్లు ఏర్పాట్లు చేయాలి అంటూ అధికారులను ఆదేశించారు.ఇది కూడా చదవండి: కేటీఆర్‌పై మరోసారి కొండా సురేఖ సంచలన ఆరోపణలు -
కాంగ్రెస్‌కు రుణమాఫీ చేసే తెలివిలేదు: కేటీఆర్
సాక్షి, తెలంగాణభవన్: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లలో రూ.1000కోట్ల కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇందులో ఢిల్లీ పెద్దల హస్తం కూడా ఉందని వ్యాఖ్యలు చేశారు.కాగా, కేటీఆర్ ఆదివారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సన్నబియ్యం కొనుగోలు విషయంలో కుంభకోణం జరిగింది. ప్రభుత్వంలో ఉండే మంత్రులు, ముఖ్యమంత్రి దీనిపై మాట్లాడటం లేదు. బీఆర్ఎస్ అంటే స్కీములు, కాంగ్రెస్ అంటేనే స్కాములు. గల్లీలో దోచుకో, ఢిల్లీలో పంచుకో అన్నట్టుగా రాష్ట్ర కాంగ్రెస్ తీరు ఉంది. రైతులు పడిగాపులు కాస్తున్న, ధాన్యం కొనుగోలు చేయాలని అడుగుతున్నా ప్రభుత్వం కొనుగోలు చేయటం లేదు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతుంది కాంగ్రెస్. ధాన్యం కుంభకోణంలో సుమారు రూ.1000కోట్ల కుంభకోణం జరిగిందని నేను ఆరోపిస్తున్నాను. ఇవన్నీ ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు ముడుపులుగా వెళ్ళాయి.అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే పెద్ద ఎత్తున కుంభకోణంతో దోపిడీ చేశారు. ధాన్యం కుంభకోణం జెడ్ స్పీడ్‌తో జరిగింది. ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలి. ఇందులో వందల కోట్ల రూపాయలు ముడుపులు అందాయా లేదా ఎంక్వైరీ వేయాలి. పాడిలో మొదటి స్కాం, పాఠశాలల్లో సన్నబియ్యం విషయంలో రెండో స్కామ్. రెండిట్లో దాదాపు రూ.1100 కోట్లు స్కాం జరిగింది.నాలుగు సంస్థలకే టెండర్లు..బహిరంగ మార్కెట్లలో సన్నబియ్యం ధర 42 నుండి 45 వరకు ఉంది. దానిని పక్కకు పెట్టీ 56.90 పైసలతో కొంటున్నారు. కేవలం నాలుగు సంస్థలకు మాత్రమే టెండర్లు ఎందుకు?. సివిల్ సప్లై, ఎఫ్‌సీఐ ఉన్నప్పటికీ వాటిని ఎందుకు పట్టించుకోరు?. కాంట్రాక్టు సంస్థలతో కాంగ్రెస్ నాయకులు మిలాఖత్ అయ్యారు. బహిరంగ మార్కెట్లలో తక్కువ ధరకు సన్నబియ్యం వస్తుంటే ఇంత ధరలు ఎందుకు ఖరారు చేశారు. తెలంగాణలో బ్రూ ట్యాక్స్ నడుస్తోంది. మేము అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. ప్రభుత్వానికి రూ.2లక్షలు రుణమాఫీ చేసే తెలివి లేదు. బీజేపీపై అనుమానాలు..ధాన్యం కొనుగోలు, కాంట్రాక్టు, ఎంఎస్పీ అంత నిర్వహించేది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ బీజేపీ నాయకుడు గొంతు చించుకుంటున్నా కేంద్రంలో ఉన్న FCI నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మనీలాండరింగ్ విషయంలో FCI వెంటనే ఈడీకి ఫిర్యాదు చేయాలి. మీ బీజేపీ ఎంఎల్ఏ చెప్తున్న దాన్ని పరిగణలోకి తీసుకొని వెంటనే ఈడీ విచారణ చేయాలి. FCI స్పందించకపోతే బీజేపీపైన కూడా అనుమానం వ్యక్తం చేయాల్సి వస్తుంది. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మా ప్రభుత్వం అనేక కుంభకోణాలు అంటూ ఆరోపణలు చేశాడు. ఇప్పుడెందుకు రేవంత్ రెడ్డి స్పందించటం లేదు. దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేపించాలి. లేదంటే మేమే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. విచారణ సంస్థలను కూడా కలుస్తాం అని వ్యాఖ్యలు చేశారు. -
‘కాంగ్రెస్ పాలనలో కన్నీటి దృశ్యాలివి’.. కేటీఆర్ వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ రాష్ట్రంలో కరెంట్ కోతలు చూస్తున్నాం. తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కులేని దుస్థితిని చూస్తున్నాం అంటూ వ్యాఖ్యలు చేశారు.కాగా, కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలు..!6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతం..!!పదేళ్లు కనిపించని కరెంట్ కోతలను చూస్తున్నంవిద్యుత్తు సబ్ స్టేషన్ల ముట్టడిలను చూస్తున్నంకాలిన మోటర్లు, పేలిన ట్రాన్స్ఫార్మర్లు చూస్తున్నంఇన్నాళ్లకు ఇన్వర్టర్లు-జనరేటర్ల మోతలు చూస్తున్నంసాగునీరు లేక ఎండిన పంట పొలాలను చూస్తున్నంట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలో ట్యాంకర్లు చూస్తున్నంచుక్కనీరు లేక బోసిపోయిన చెరువులను చూస్తున్నంపాత అప్పు కట్టాలని రైతులకు నోటీసులు చూస్తున్నంరైతుబంధు కోసం నెలలపాటు పడిగాపులు చూస్తున్నంతడిసిన ధాన్యాన్ని కొనే దిక్కు లేని దుస్థితి చూస్తున్నాంపదేళ్ల తరువాత అన్నదాతల ఆత్మహత్యలు చూస్తున్నంచివరికి ఇవాళ జోగిపేటలో.. విత్తనాల కోసం రైతుల మొక్కులు..క్యూలైన్ లో పాసుబుక్కులు చూసినం..!కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదు..!అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు..!ఈ వైఫల్యాల కాంగ్రెస్ పాలనలో..ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో..!జై కిసాన్జై తెలంగాణఅంటూ కామెంట్స్ చేశారు. 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు..!6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతం..!!పదేళ్లు కనిపించని కరెంట్ కోతలను చూస్తున్నంవిద్యుత్తు సబ్ స్టేషన్ల ముట్టడిలను చూస్తున్నంకాలిన మోటర్లు, పేలిన ట్రాన్స్ఫార్మర్లు చూస్తున్నంఇన్నాళ్లకు ఇన్వర్టర్లు-జనరేటర్ల మోతలు చూస్తున్నంసాగునీరు లేక ఎండిన… pic.twitter.com/cqNnFuzvk4— KTR (@KTRBRS) May 22, 2024 -
తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం
-
Andhra Pradesh: దళారులకు తావేలేదు
గత ప్రభుత్వంతో పోలిస్తే ధాన్యం సేకరణలో మనం రైతులకు ఎంతో మేలు చేస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా మనమే చెల్లించాం. గతంలో ఏటా ధాన్యం సేకరణకు సుమారు రూ.8 వేల కోట్లు వెచ్చిస్తే, మన ప్రభుత్వంలో ఏకంగా రూ.15 వేల కోట్లు ఇస్తున్నాం. 2016–17లో 55 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తే, 2020–21లో మనం దాదాపు 85 లక్షల టన్నులు సేకరించాం. చంద్రబాబు ఐదేళ్ల హయాంలో 2.65 కోట్ల టన్నుల ధాన్యం సేకరిస్తే, ఈ మూడున్నరేళ్లలోనే మనం 2.87 కోట్ల టన్నులు కొనుగోలు చేయడం సంతోషంగా ఉంది. ప్రతి గ్రామంలో సాయిల్ టెస్టింగ్ అయ్యాక కచ్చితంగా మ్యాపింగ్ చేయాలి. తద్వారా ఎరువులు, రసాయనాల వినియోగం అవసరాల మేరకే జరుగుతుంది. దీంతో రైతులకు పెట్టుబడి ఆదాతో పాటు కాలుష్యం కూడా తగ్గుతుంది. రబీలో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు ఆర్బీకేల్లో అందుబాటులో ఉండేలా ముందస్తుగా సమకూర్చుకోవాలి. ఫిబ్రవరి 20 నుంచి ఈ క్రాప్ నమోదు ప్రారంభిస్తే.. మార్చి మొదటి వారంలోగా తుది జాబితా వెల్లడించేలా పని చేయాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఇదివరకెన్నడూ లేని విధంగా ఎటువంటి వివక్ష, అవినీతి, దళారుల బెడద లేకుండా రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, వారికి దక్కాల్సిన మద్దతు ధరను ప్రతిపైసాతో సహా అనుకున్న సమయానికే చెల్లిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఇంతకు ముందు రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన సందర్భమే లేదన్నారు. ఇప్పుడు అలాంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచామని చెప్పారు. పది శాతం రంగు మారిన ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేయాలని, ఇంకా ఎక్కువ శాతం రంగు మారి ఉంటే మిల్లర్లతో మాట్లాడి కొనుగోలు చేసేలా చూడాలన్నారు. ఇప్పుడు హమాలి, రవాణా, గోనె సంచుల ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తూ రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించిందని తెలిపారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అనుబంధ రంగాలు, పౌర సరఫరాల శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ–క్రాప్ డేటా ఆధారంగా మాత్రమే ధాన్యం కొనుగోలు చేయాలని.. మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే ఖరీఫ్‌లో మిగిలిన సేకరణనూ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పుడున్న ప్రక్రియను మరింత బలోపేతం చేయాలన్నారు. ఆర్బీకేల్లో ధాన్యం సేకరించగానే రైతుల పని ముగుస్తుందని, ఆ తర్వాత అంతా ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. ఏమైనా సమస్యలు, మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయం ఉంటే ఫిర్యాదు చేయడానికి వీలుగా ఒక నంబర్‌ను ఏర్పాటు చేయాలని, రైతులు ఫిర్యాదు చేయగానే వెంటనే అధికారులు స్పందించాలని ఆదేశించారు. ఈ వివరాలు అన్నింటినీ రైతులకు ఇచ్చే రశీదులో ముద్రించాలని చెప్పారు. ఇలా అన్ని విధాలా రైతులకు మంచి చేయడంలోనే సంతోషం ఉంటుందన్నారు. ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉత్తరాంధ్రలోనూ డ్రోన్ పైలెట్ శిక్షణ కేంద్రం రైతులకు 50 శాతం సబ్సిడీతో వ్యక్తిగత వ్యవసాయ యంత్ర పరికరాలను అందించడంపై దృష్టి సారించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఆర్బీకేల స్థాయిలో కిసాన్ డ్రోన్లకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాల (సీహెచ్‌సీ)ను లక్ష్యం మేరకు నిర్ణీత వ్యవధిలోగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీలో మాదిరిగానే ఉత్తరాంధ్రలోనూ డ్రోన్ పైలెట్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లను సైతం అందించాలని చెప్పారు. మాండస్ తుపానుతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు సిద్ధం కావాలన్నారు. రాష్ట్రంలో ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్ అమలుకు కార్యాచరణ రూపొందించాలని, ఏటా ఏప్రిల్‌లో మట్టి నమూనా పరీక్షలు నిర్వహించి రైతులకు టెస్టు రిపోర్టులు ఇవ్వాలని ఆదేశించారు. ఆ ఫలితాల ఆధారంగా భూమిలో ఎటువంటి పంటలు వేయాలో రైతులకు మార్గనిర్దేశం చేయాలని, ఆ పంటకు అవసరమైన పోషకాలపై అవగాహన కల్పించాలని సూచించారు. నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేస్తున్న ల్యాబ్‌లలో మట్టి నమూనా పరీక్షలు వేగంగా చేసేలా చర్యలు చేపట్టాలని, భవిష్యత్తులో ప్రతి ఆర్బీకేలోనూ పరీక్షలు చేసేలా పరికరాలను సమకూర్చుకోవాలన్నారు. ఇందు కోసం సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. కేంద్రం పీఎం కిసాన్ పథకం కింద నిధులు విడుదల చేసే సమయంలోనే రాష్ట్రంలో మనం రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తొలి విడత 500 డ్రోన్లు.. రైతులకు ఈ ఏడాది మార్చి, మే, జూన్ నెలల్లో డ్రోన్లను అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. 2 వేల డ్రోన్ల పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో భాగంగా తొలి విడతగా 500 డ్రోన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గత డిసెంబర్ నుంచే డ్రోన్ల వినియోగంపై శిక్షణ ప్రారంభించామని, ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా శిక్షణ కార్యక్రమాల్లో మరింత వేగం పెంచాలని సీఎం ఆదేశించారు. పెరిగిన ఆహార ధాన్యాల ఉత్పత్తి ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. 2014–19 మధ్య ఆహార ధాన్యాల సగటు ఉత్పత్తి 153.95 లక్షల టన్నులు ఉంటే.. 2019–20 నుంచి 2022–23 ఖరీఫ్ వరకు 166.09 లక్షల టన్నులు నమోదైందన్నారు. 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో ప్రజలకు వాటి వినియోగంపై అవగాహన కల్పిస్తున్నామని, రేషన్‌లో కోరుకున్న వారికి చిరు ధాన్యాలు అందించడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ధాన్యం సేకరణ కొనసాగింపు ఖరీఫ్ ధాన్యం సేకరణలో ఇప్పటి వరకు 89 శాతం మంది రైతులకు మద్దతు ధరను వారి ఖాతాల్లో జమ చేసినట్టు అధికారులు సీఎంకు చెప్పారు. సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని 21 రోజుల కంటే ముందుగానే చాలా వరకు రైతులకు చెల్లింపులు చేశామన్నారు. ఇప్పటి వరకు రూ.5,373 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించామని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో పంటల సీజన్లను దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి రెండో వారం వరకూ సేకరణ కొనసాగిస్తామన్నారు. స్థానిక వీఏఓ నుంచి డీఆర్ఓ నుంచి సర్టిఫై చేసిన తర్వాతే సేకరణ ముగిస్తామని తెలిపారు.తొలిసారిగా మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ధాన్యం సేకరణ జరిగిందని, రైతులకు సంపూర్ణ మద్దతు ధరను అందించగలిగామన్నారు. ఈ సమీక్షలో వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ సలహాదారు ఐ.తిరుపాల్‌రెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ వై.మధుసూదన్‌రెడ్డి, మార్కెటింగ్, సహకారం ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, పౌర సరఫరాల సంస్థ ఎండీ వీరపాండియన్, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ ఎం.విజయ సునీత, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్ హరికిరణ్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ జి.శేఖర్ బాబు, ఏపీ మార్క్‌ఫెడ్ ఎండీ రాహుల్ పాండే, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ వీసీ డాక్టర్ ఎ.విష్టువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అవాస్తవాలే పరమావధిగా ఈనాడు!
సాక్షి, విజయవాడ: అవాస్తవాలు, అసత్య ప్రచారాలు, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అక్కసు.. ఇవే ఈరోజుల్లో ఈనాడుకు పతాక శీర్షికలుగా మారాయి. తాజాగా ‘ధాన్యం కొనుగోలు నిలిపివేత!’ అనే శీర్షికతో తప్పుడు కథనం ప్రచురించింది. దీంతో ఈ కథనం ఆధారంగా ఏపీ రైతులు ఆందోళనకు గురి కావొద్దని అధికారులు వాస్తవాలను తెలియజేశారు. అవేంటంటే.. ‘‘పౌరసరఫరాల సంస్థ తమ లక్ష్యం పూర్తయిదని తేల్చేసింది. రైతుల వద్ద ఇంకా నిల్వలు ఉన్నాయి. ఎదురుచూపులు తప్పట్లేదు. బ్యాంకు గ్యారంటీలు లేక కొనడానికి నిరాకరిస్తున్న మిల్లర్లు, రంగు మారిన ధాన్యం సేకరణకూ మొండి చెయ్యి’’ అంటూ పూర్తిగా అంటూ అవాస్తవాలనే ప్రచురించింది ఈనాడు. అయితే.. ధాన్యం సేకరణకు సంబంధించిన ఏపీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ వెల్లడించిన వాస్తవాలను ఒకసారి పరిశీలిస్తే.. ధాన్యం కొనుగోలు నిలిపివేత పూర్తిగా అవాస్తవం. కొనుగోలు ఏ జిల్లాలోనూ బ్రేకులు పడలేదని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ తెలియజేసింది. ప్రతిజిల్లా లోని రైతు భరోసా కేంద్రము పరిధిలో.. రైతుల వద్ద ధాన్యము నిల్వ లేదని నిర్దారించుకొన్న తర్వాతనే ధాన్యం సేకరణ ప్రక్రియ ముగించడం జరుగుతుంది. సదరు రైతు భరోసా కేంద్రము వద్ద.. అధికారుల తనిఖీ చేసి రెవిన్యూ, సివిల్ సప్లై, అగ్రికల్చర్ అధికారుల ద్వారా ఆమోద పత్రం పొందిన తర్వాత మాత్రమే సంబంధిత రైతు భరోసా కేంద్రము వద్ద ధాన్యము సేకరణ ప్రక్రియ మూసి వేస్తారు. అంతేకాదు సేకరణ ప్రక్రియ మూసేసే వారం రోజులు ముందు నుంచే గ్రామంలో చాటింపు వేస్తారు. లక్ష్యమంటూ ఏదీ లేదు ఏపీలో పౌరసరఫరాల సంస్థ ధాన్యం సేకరణలో ఎలాంటి లక్ష్యాన్ని పెట్టుకోదు. కేవలం తాత్కాలిక అంచనా మాత్రమే ఉంటుంది. వరి పండించే ప్రతి ఒక్క రైతుకు మద్దతు ధర కల్పించటం, ఏ ఒక్క రైతుకూ మద్దతు ధర కంటే తక్కువ ధరకంటే తక్కువకు అమ్ముకునే పరిస్థితి లేకుండా చూడటం ప్రభుత్వ ఉద్దేశాలు. అలాంటప్పుడు టార్గెట్ అనే టాపికే ఉండదు. ఇంకా నిల్వలు.. ఎదురుచూపులంటూ.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ.. రైతుల వద్ద ఉన్న ధాన్యము నిల్వల తనిఖీ చేసిన తర్వాతే.. సదరు ధాన్యము నిల్వలను భరోసా కేంద్రము ద్వారా కొనుగోలు చేస్తుంది. కానీ, నిల్వలు ఉన్నాయంటూ, రైతులు ఎదురుచూపులంటూ అవాస్తవాలను హైలెట్ చేస్తోంది. అది అవాస్తవం బ్యాంకు గ్యారంటీలు లేక.. కొనడానికి నిరాకరిస్తున్న మిల్లర్లు అని ఈనాడు కథనంలో పేర్కొన్న విషయం పూర్తిగా వాస్తవ విరుద్ధం. ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఎన్టీఆర్ జిల్లాలకు బ్యాంకు గారంటీల యొక్క రేషియోను పెంచింది ఏపీ పౌర సరఫరాల శాఖ. తద్వారా ధాన్యము సేకరణ ప్రక్రియకు సంబంధించి సంబంధిత జిల్లాలకు కేటాయింపు కూడా పెంచారు. ధాన్యము సేకరణ: తేది18-01-2023 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వారు 4,77,098 రైతుల వద్ద నుంచి.. రూ.5,373.82 కోట్ల విలువ గల 26,32,372 మెట్రిక్ టన్నుల ధాన్యమును కొనుగోలు చేసింది. అందుకు గాను రూ.4768.79 కోట్ల (89%)ను 4,65,967 రైతుల ఖాతాలో జమ చేయటం జరిగింది. గోనె సంచుల చార్జీలు, హమాలీ ఛార్జీలు, రవాణా చార్జీలు తాలుకు రూ.65.01 కోట్లరూపాయలను చెల్లించవలసి ఉండగా రూ. 26.28 కోట్ల రూపాయలను (40%) రైతుల ఖతాలో జమ చేయటం జరిగింది. కాబట్టి, ఈనాడు పత్రికలో వచ్చిన వార్త పూర్తిగా అసత్యం. రైతులందరికి విజ్క్షప్తి ఏంటంటే.. దళారులను, మధ్య వర్తులను నమ్మి మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం అమ్మి మోసపోవద్దు. ధాన్యము సేకరణలో ఎటువంటి సమస్య వచ్చిన సత్వరమే పరిష్కరించేలా ప్రతి మండలంలో అధికారులను నియమించారు. ఒక వేళ రైతులకు సమస్య వస్తే సదరు సమస్య పరిష్కారం కోసం సంబంధిత మండల అధికారి దృష్టికి తీసుకువెళ్లాలి అని ఏపీ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లిమిటెడ్ వైఎస్ చైర్మన్ & ఎండీ వీరపాండియన్(ఐఏఎస్) ద్వారా ఒక ప్రకటన విడుదల అయ్యింది. -
Kishan Reddy: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో రైస్ మిల్లుల్లో అవకతవకలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘‘ రాష్ట్రంలో కొన్ని రైస్ మిల్లులో ఉండాల్సిన ధాన్యం లేదు. కొన్ని రైస్ మిల్లులలో అవకతవకలు జరిగాయి. ఎఫ్‌సీఐ అధికారులు 40 రైస్ మిల్లులో తనిఖీలు చేశారు. 4,53,890 లక్షల సంచుల ధాన్యం తక్కువగా ఉంది.. అవి ఎక్కడికి పోయాయే చెప్పాలి. వాటిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. రైస్ మిల్లుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకున్నది కాబట్టి మిస్సైన ధాన్యంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అలెర్ట్ చేశాము. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రైస్ మిల్లులపై తనిఖీలు చేయాలని రాష్ట్ర ప్రభత్వానికి లేఖ రాశాము. అక్రమాలకు పాల్పడిన రైసు మిల్లులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. ఈ నెల 13న రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్యదర్శి కేంద్రానికి లేఖ రాశారు. తెలంగాణలో ఉన్న బియ్యాన్ని కొనాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనాలకు కేంద్రం వెంటనే ఆమోదం తెలిపింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంతవరకు రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. కేసీఆర్ ప్రభుత్వం కావాలనే ఘర్షణ వాతావరణం సృష్టించింది. అన్ని రాష్ట్రాలకూ ఒకే న్యాయం ఉంటుంది. అగ్రిమెంట్ ప్రకారమే ధాన్యం కోనుగోలు చేశాము. బాయిల్ రైస్ కోనుగోలు చేయబోమని అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశాము. టీఆర్ఎస్ నేతలు ఉద్దేశ పూర్వకంగా ప్రధాని మోదీని తిట్టడం, దేశం నుంచి తరిమి కొడతామని పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. ఢిల్లీలో, రాష్ట్రంలో, గ్రామాల్లో ఆందోళనలు నిర్వహించారు. బీజేపీని బంగాళాఖాతంలో కలుపుతామని కామెంట్స్ చేశారు. ఇది కరెక్ట్ కాదు. క్వింటాల్ ధాన్యానికి కేంద్రం రూ.1,960 ధర నిర్ణయించింది. రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల జీవితాలలో రాష్ట్ర ప్రభుత్వం అడుకుంటున్నది. 2020-21 యాసంగి, రబీ ధాన్యాన్ని ఒప్పందం ప్రకారం ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకూ ఇవ్వలేదు. దానిపై ఐదు సార్లు కేంద్రం లేఖ రాసినా తెలంగాణ సర్కార్ నుంచి స్పందన లేదు. ఈ ఏడాది 40 లక్షల మెట్రిక్ టన్నుల రా రైస్ ఇస్తామని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. అందుకోసం 15 కోట్ల గోనె సంచులు అవసరం.. కానీ, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కేవలం కోటి గోనె సంచులు మాత్రమే ఉన్నాయి. వాటితో ధాన్యాన్ని ఎలా కొనుగోలు చేస్తారు..? తండ్రి కొడుకులు తట్టలో తీసుకువస్తారా..?. హుజురాబాద్ ఎన్నికల ఓటమి భరించలేక.. బాధ్యత మరచి కక్షతో కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. తెలంగాణను రావణ కాష్టంగా మార్చారు. రాజకీయాలు చేయాలనుకుంటే వేరే అంశాలు ఉన్నాయి. తండ్రి, కొడుకులు రైతులపై రాజకీయాలు ఆపాలని’’ అన్నారు. -
కేంద్రం, ఎఫ్‌సీఐ నిర్ణయాన్ని మార్చుకోవాలి
సాక్షి, సిద్దిపేట: దొడ్డురకం ధాన్యాన్ని కొనుగోలు చేయని పక్షంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సోమవారం సిద్దిపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కృషి వల్లే రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, దిగుబడి పెరిగిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాలో 6 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు ఉండగా.. తెలంగాణ ఏర్పడ్డాక 35 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములను నిర్మించామన్నారు. ఎంత పంట వచ్చినా కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం అందడం లేదన్నారు. యాసంగిలో పారా బాయిల్డ్ రైస్ కొనాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ మూడు సార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని ప్రతిపక్ష నాయకులు ఊరికే నోరు పారేసుకోవడం సరికాదని, కేంద్రాన్ని ఒప్పించి బాయిల్డ్ రైస్ కూడా కొనుగోలు చేసేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సీపీ జోయల్ డేవిస్ తదితరులు పాల్గొన్నారు. -
కుప్ప నూర్చే క్రమంలో.. ఆగిన రైతన్న ఊపిరి!
సాక్షి, కామారెడ్డి: జిల్లాలోని బీబీపేట్ మండలం యాడారంలో విషాదం చోటుచేసుకుంది. చేతికందిన పంట అకాల వర్షంలో తడిసిపోవడంతో ఓ అన్నదాత ఊపిరి ఆగింది. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద చాకలి దేవరాజు (45) అనే రైతు బుధవారం ఉదయం హఠాన్మరణం చెందాడు. అకాల వర్షం నుంచి తన ధాన్యాన్ని కాపాడుకోవాలనే తాపత్రాయంలో ధాన్యాన్ని కుప్ప చేస్తుండగా ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచాడు. (చదవండి: 3 లక్షల జన్‌ధన్ ఖాతాల నుంచి డబ్బులు వెనక్కి) తాజా ఘటనతో కామారెడ్డి జిల్లాలో ధాన్యం రైతుల మృతి రెండుకు చేరింది. ఇప్పటికే లింగంపేట మండలం పోల్కంపేట ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద తడిసిన ధాన్యం ఆరబెట్టే క్రమంలో భూమయ్య అనే రైతు గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇప్పటికైనా ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. రెండు వారాలుగా అకాల వర్షాలు, ఈదురు గాలులు ధాన్యం రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యేంతవరకు రైతులకు సమస్యలు తప్పేలా లేవు. (చదవండి: మన సంస్కృతి.. ప్రపంచ దేశాలకు దిక్సూచి) -
16 మండలాల్లో కొనుగోలు కేంద్రాలు
మద్దతు ధర అమలు కమిటీ సభ్యుల వెల్లడి కొడవలూరు : అత్యధికంగా ధాన్యం పండే 16 మండలాల్లో రెండురోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయనున్నట్లు మద్దతు ధర అమలు కమిటీ సభ్యులు వెల్లడించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం వారు ధాన్యం దళారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడతూ మేలురకం ధాన్యం క్వింటా రూ.1,450లు, సాధారణ రకం క్వింటా రూ.1410కు తగ్గకుండా కొనుగోలుచేయాలన్నారు. కనీస మద్దతు ధర అమలు జరిగేలా చూసేందుకు ప్రత్యేక కమిటీని నియమించడం జరిగిందని, ఈ కమిటీ జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేస్తుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన వారి వద్ద రైతు సంతకంతో కూడిన ఓచర్ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఆ ఓచర్లో కనీస మద్దతు ధర కంటే తగ్గించి కొన్నట్లు ఉంటే కేసులు తప్పవని హెచ్చరించారు. రైతులు కూడా ధాన్యంలో 17 శాతం తేమ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో బృంద సభ్యులు ఏజీపీఓ రవి, సీఎస్ డీటీలు కృష్ణప్రసాద్, ప్రమీల, తహసీల్దార్ రామకృష్ణ పాల్గొన్నారు.