‘కాంగ్రెస్‌ పాలనలో కన్నీటి దృశ్యాలివి’.. కేటీఆర్‌ వ్యాఖ్యలు | Ex Minister KTR Slams Telangana Congress Govt, Tweet Goes Viral | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్‌ పాలనలో కన్నీటి దృశ్యాలివి’.. కేటీఆర్‌ వ్యాఖ్యలు

Published Wed, May 22 2024 8:04 AM | Last Updated on Wed, May 22 2024 10:29 AM

Ex Minister KTR Slams Telangana Congress Govt

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పాలనలో మళ్లీ రాష్ట్రంలో కరెంట్‌ కోతలు చూస్తున్నాం. తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కులేని దుస్థితిని చూస్తున్నాం అంటూ వ్యాఖ్యలు చేశారు.

కాగా, కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా..
‘ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలు..!
6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతం..!!
పదేళ్లు కనిపించని కరెంట్ కోతలను చూస్తున్నం
విద్యుత్తు సబ్ స్టేషన్ల ముట్టడిలను చూస్తున్నం
కాలిన మోటర్లు, పేలిన ట్రాన్స్ఫార్మర్లు చూస్తున్నం
ఇన్నాళ్లకు ఇన్వర్టర్లు-జనరేటర్ల మోతలు చూస్తున్నం
సాగునీరు లేక ఎండిన పంట పొలాలను చూస్తున్నం
ట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలో ట్యాంకర్లు చూస్తున్నం
చుక్కనీరు లేక బోసిపోయిన చెరువులను చూస్తున్నం
పాత అప్పు కట్టాలని రైతులకు నోటీసులు చూస్తున్నం
రైతుబంధు కోసం నెలలపాటు పడిగాపులు చూస్తున్నం
తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కు లేని దుస్థితి చూస్తున్నాం
పదేళ్ల తరువాత అన్నదాతల ఆత్మహత్యలు చూస్తున్నం

చివరికి ఇవాళ  జోగిపేటలో.. 
విత్తనాల కోసం రైతుల మొక్కులు..
క్యూలైన్ లో పాసుబుక్కులు చూసినం..!

కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదు..!
అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు..!

ఈ వైఫల్యాల కాంగ్రెస్ పాలనలో..
ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో..!

జై కిసాన్
జై తెలంగాణ
అంటూ కామెంట్స్‌ చేశారు. 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement