
సాక్షి, ప్రకాశం: ఏపీలో మరోసారి భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ప్రకాశం జిల్లాలో ఆదివారం ఉదయం భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలో ఆదివారం ఉదయం 10:40 గంటల సమయంలో స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సింగన్నపాలెం, మారెళ్లలోనూ భూమి కంపించింది. దీంతో, భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇక, శనివారం కూడా ముండ్లమూరు, తాళ్లురులో భూ ప్రకంపనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. శనివారం రిక్టార్ స్కేల్‌పై 3.1 తీవ్రతతో భూమి కంపించినట్టు అధికారులు తెలిపారు.
కాగా, గత మూడేళ్ల కాలంలో ఇక్కడ వరుసగా భూ ప్రకంపనలు వస్తున్నాయి. దీంతో, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
