హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా కేటీఆర్ టార్గెట్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘాటు విమర్శలు చేశారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉందనే భ్రమలో కేటీఆర్ ఉన్నారని ఎద్దేవా చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీని ఏదో చేస్తానని మాట్లాడుతున్నాడని అన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కలెక్టర్లు, ఎమ్మెల్యేలను పాఠశాలలు తనిఖీ చేయాలని ఆదేశించాం. ఫుడ్ పాయిజన్ ఘటనలు బాధాకరమే. ఐఏఎస్ అధికారులపై కేటీఆర్ తీరు సరైంది కాదు. జిల్లా కలెక్టర్ ను అసభ్య పదజాలంతో తిట్టడం ఏంటి?. కేటీఆర్ ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలి. తామే అధికారంలో ఉన్నామనే భ్రమలో కేటీఆర్ ఉన్నారు. భ్రమల్లో నుంచి కేటీఆర్ బయటకు రావాలి.
రాజకీయ కుట్రలను జార్ఖండ్ ప్రజలు ఎదురించారు. అన్ని కుట్రలపై జార్ఖండ్ ప్రజలు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఏమీ చేయలేరు. కాంగ్రెస్ పార్టీని ఏదో చేస్తానని కేటీఆర్ మాట్లాడుతున్నాడు. పార్టీలో సమిష్టి నిర్ణయాలతో ప్రభుత్వం నడుస్తోంది. కాంగ్రెస్ ఆలోచనా విధానంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు.. పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి డైలీ సీరియల్ అనేది అలవాటు. డ్రగ్స్ కేసు , మియాపూర్ భూముల కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుల లాంటివి బీఆర్ఎస్ ప్రభుత్వంలో నెలల తరబడి నడిపారు అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment