అట్టావా: వచ్చే ఏడాది ఎన్నికలు జరుగబోతున్న వేళ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు ఎదురుదెబ్బ తగిలింది. ట్రూడోకు ఖలిస్థానీ మద్దతుదారు, నేషనల్ డెమొక్రటిక్ పార్టీ (ఎన్‌డీపీ) షాక్ ఇచ్చింది. ట్రూడో లిబరల్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ఎన్‌డీపీ నేత జగ్మీత్‌సింగ్ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు.
తాజాగా ఎన్‌డీపీ నేత జగ్మీత్‌సింగ్ ట్విట్టర్ వేదికగా ఒక లేఖను పోస్టు చేశారు. ఈ సందర్బంగా ఆయన..‘జస్టిన్ ట్రూడో ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించడంలో విఫలమయ్యారు. ప్రజల కోసం కాకుండా, శక్తిమంతుల కోసం ట్రూడో పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎన్‌డీపీ సిద్ధంగా ఉంది. కెనడియన్లకు తమ కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకొనే అవకాశం కల్పిస్తాం. హౌస్ ఆఫ్ కామన్స్ తదుపరి సమావేశంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతాం అని చెప్పుకొచ్చారు. దీంతో, కెనడా రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
మరోవైపు.. కెనడా ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రిలాండ్ ఇటీవల తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కేబినెట్‌లో అత్యంత శక్తిమంతురాలిగా గుర్తింపు పొందిన ఆమె, ప్రధాని ట్రూడో ప్రజాదరణ కోల్పోతున్నారని ఆరోపించారు. అయితే, ఆమె నిర్వహిస్తున్న ఆర్థికశాఖను మారుస్తున్నట్లు ట్రూడో చెప్పిన నేపథ్యంలో క్రిస్టియా తన పదవికి రాజీనామా చేయడమే సరైన మార్గమని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా..కెనడాలో వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ప్రధాని ట్రూడోకు ఖలిస్థానీల మద్దతుపై ఉత్కంఠ నెలకొంది. ఇక, ఒకవేళ ఈ అవిశ్వాస తీర్మానానికి అన్ని పార్టీల మద్దతు లభిస్తే కెనాడలో తొమ్మిదేళ్ల ట్రూడో పాలన ముగిసిపోతుంది.
Justin Trudeau failed in the biggest job a Prime Minister has: to work for people, not the powerful.
The NDP will vote to bring this government down, and give Canadians a chance to vote for a government who will work for them. pic.twitter.com/uqklF6RrUX— Jagmeet Singh (@theJagmeetSingh) December 20, 2024
Comments
Please login to add a commentAdd a comment