
టొరంటో: కెనడాపై అమెరికా ప్రభుత్వం టారిఫ్‌లు విధించడాన్ని మూర్ఖత్వంగా ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో అభివర్ణించారు. కెనడాపై వాణిజ్య యుద్ధానికి తెరలేపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను బుజ్జగిస్తున్నారని వ్యాఖ్యానించారు. ట్రంప్ తాజాగా విధించిన 25 శాతం టారిఫ్‌లకు ప్రతీకారంగా అమెరికా వస్తువులపై 100 బిలియన్ డాలర్ల మేర టారిఫ్‌లు విధిస్తామని స్పష్టం చేశారు.
‘అమెరికా తన అత్యంత ఆత్మీయ, మిత్ర దేశంపై వాణిజ్య యుద్ధాన్ని మొదలుపెట్టింది. అదే సమ యంలో, రష్యాకు అనుకూలంగా మా ట్లాడుతోంది. ఒక అబద్ధాలకోరు, దుర్మా ర్గపు నియంత అయిన పుతిన్‌ను బుజ్జగించే పనులు చేస్తోంది’అని ట్రూడో నిప్పులు చెరిగారు. ‘అమెరికాకు 51వ రాష్ట్రంగా కెనడాను ఎన్నటి కీ కానివ్వం. డొనాల్డ్ అనే అమెరికన్‌కు నేరుగా ఈ విషయం స్పష్టం చేస్తున్నాను’అంటూ నేరుగా ట్రంప్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment