సాక్షి, నిజామాబాద్: పదవులు శాశ్వతం కాదు అనేది రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్. సీఎం రేవంత్ సద్ధాం హుస్సేన్‌లాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అలాగే.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు చెప్పేవన్నీ అబద్దాలే అంటూ కామెంట్స్ చేశారు.
కేఏ పాల్ నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నేనే కనుక అల్లు అర్జున్ అయితే బాధితల కుటుంబానికి రూ.300కోట్లు ఇచ్చే వాడిని. అల్లు అర్జున్ బాధిత కుటుంబానికి రూ.25కోట్లు ఇవ్వమనడం తప్పా?. సీఎం రేవంత్ ఒక సద్దాం హుస్సేన్‌లా వ్యవహరిస్తున్నారు. 422 బిల్డింగ్స్‌ను అక్రమంగా కూల్చివేశారు. కానీ, సొంత తమ్ముడి భవనాన్ని మాత్రం కూల్చివేయలేదు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నవి పచ్చి అబద్ధాలు. రెండు ప్రభుత్వాల హాయంలో సర్పంచ్‌లు అప్పుల పాలయ్యారు.
మీకేమో లక్షల కోట్లు, సర్పంచ్‌లకు మాత్రం లక్షల అప్పులా?. నిజంగా సర్పంచ్‌లకు బుద్ధి ఉందా?. ఇంకా కేసీఆర్, రేవంత్ రెడ్డిలను ఎందుకు నమ్ముతున్నారు. ప్రజల సంక్షేమం కోసం వచ్చిన వ్యక్తిని నేను. పదవులు శాశ్వతం కాదు.. ఇది రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి. అందరం కలిసి పనిచేద్దాం.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. వచ్చే సోమవారం డిసెంబర్ 30న నిజామాబాద్‌లో సర్పంచ్‌లతో ప్రత్యేక సదస్సు నిర్వహిస్తాను. 100 రోజుల్లో జీవితాలను మార్చేస్తాను. మే 10వ తేదీలోపు 100 గ్రామాలను అభివృద్ధి చేసి చూపిస్తాను. మరో రెండేళ్లలో జమిలి ఎన్నికలు ఖాయం. కులాన్ని అమ్ముకొని ఆర్. కృష్ణయ్య, మందకృష్ణ మాదిగ బ్రతుకుతున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment