KA Paul
-
తిరుమలలో తొక్కిసలాటపై బాబు,పవన్ KA పాల్ సవాల్..
-
బాబు ఎక్కడుంటే అక్కడ మరణాలే!: కేఏ పాల్
సాక్షి, న్యూఢిల్లీ: తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులను చేస్తూ అధికార యంత్రాంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసింది చూశాం. అయితే ఈ పరిణామంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) స్పందించారు. బహుశా చంద్రబాబు తాను ఏపీకి సీఎం అనే విషయాన్ని మరిచిపోయి అలా ప్రవర్తించి ఉంటారేమో అని ఎద్దేవా చేశారు.తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయారు. ఆ టైంలో ప్రధాని, పవన్‌లతో చంద్రబాబు పొలిటికల్ ర్యాలీతో బిజీగా ఉన్నారు. ఇది నిర్లక్ష్యం వల్ల జరిగిన ఘటన. కాబట్టి చంద్రబాబే బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఘటనకు బాధ్యులను చేస్తూ ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ, తానే సీఎం అనే విషయాన్ని ఆయన మరిచిపోతున్నారు.చంద్రబాబు(Chandrababu) సీఎంగా ఉన్నప్పుడు.. 2019లో పుష్కరాల సమయంలో 20 మందికి పైగా చనిపోయారు.. మరెందరో గాయపడ్డారు. కందుకూర్లో పొలిటికల్ ర్యాలీ నిర్వహిస్తే అక్కడా చనిపోయారు. గుంటూరులో ర్యాలీ నిర్వహిస్తే ముగ్గురు చనిపోయారు. తారకరత్న కూడా చంద్రబాబు ర్యాలీలో చనిపోయారు. చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వల్లే ఇప్పుడు తిరుపతి(Tirupati)లో ఆరుగురు చనిపోయారు.సమస్యలను పక్కన పెట్టారు ప్రజలకు ఇచ్చిన హామీలను పట్టించుకోలేదు. చంద్రబాబు ఎక్కడ ఉంటే అక్కడ మరణాలు తప్పవు. అందుకే చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేయాలి అని పాల్ డిమాండ్ చేశారు. -
KA Paul: రేవతి కుటుంబానికి 300 కోట్లు ఇస్తా
-
రేవంత్.. పదవులు శాశ్వతం కాదు: కేఏ పాల్
సాక్షి, నిజామాబాద్: పదవులు శాశ్వతం కాదు అనేది రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్. సీఎం రేవంత్ సద్ధాం హుస్సేన్‌లాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అలాగే.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చెప్పేవన్నీ అబద్దాలే అంటూ కామెంట్స్ చేశారు.కేఏ పాల్ నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నేనే కనుక అల్లు అర్జున్ అయితే బాధితల కుటుంబానికి రూ.300కోట్లు ఇచ్చే వాడిని. అల్లు అర్జున్ బాధిత కుటుంబానికి రూ.25కోట్లు ఇవ్వమనడం తప్పా?. సీఎం రేవంత్ ఒక సద్దాం హుస్సేన్‌లా వ్యవహరిస్తున్నారు. 422 బిల్డింగ్స్‌ను అక్రమంగా కూల్చివేశారు. కానీ, సొంత తమ్ముడి భవనాన్ని మాత్రం కూల్చివేయలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చెబుతున్నవి పచ్చి అబద్ధాలు. రెండు ప్రభుత్వాల హాయంలో సర్పంచ్‌లు అప్పుల పాలయ్యారు.మీకేమో లక్షల కోట్లు, సర్పంచ్‌లకు మాత్రం లక్షల అప్పులా?. నిజంగా సర్పంచ్‌లకు బుద్ధి ఉందా?. ఇంకా కేసీఆర్, రేవంత్ రెడ్డిలను ఎందుకు నమ్ముతున్నారు. ప్రజల సంక్షేమం కోసం వచ్చిన వ్యక్తిని నేను. పదవులు శాశ్వతం కాదు.. ఇది రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి. అందరం కలిసి పనిచేద్దాం.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. వచ్చే సోమవారం డిసెంబర్ 30న నిజామాబాద్‌లో సర్పంచ్‌లతో ప్రత్యేక సదస్సు నిర్వహిస్తాను. 100 రోజుల్లో జీవితాలను మార్చేస్తాను. మే 10వ తేదీలోపు 100 గ్రామాలను అభివృద్ధి చేసి చూపిస్తాను. మరో రెండేళ్లలో జమిలి ఎన్నికలు ఖాయం. కులాన్ని అమ్ముకొని ఆర్. కృష్ణయ్య, మందకృష్ణ మాదిగ బ్రతుకుతున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
రాజ్యాంగం ప్రకారమే ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: న్యాయస్థానాలు రాజ్యాంగం, చట్టప్రకారం మాత్రమే ఉత్తర్వులు ఇవ్వగలవని హైకోర్టు స్పష్టం చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా ఉత్త ర్వులు ఇవ్వలేమని చెప్పింది. ఈ మేరకు దాఖలైన మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేసింది. ఒక పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన శాసనసభ్యులు వెంటనే మరో పార్టీలోకి ఫిరాయి స్తున్నారని.. ఇలాంటి వారి శాస నసభ సభ్యత్వాన్ని రద్దు చేసేలా ఎన్నికల కమిషన్‌కు ఆదే శాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా, రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు హాజరుకాకుండా ఆదేశాలి వ్వాలని పాల్ మధ్యంతర అప్లికేషన్ (ఐఏ) దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీని వాస్‌రావు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మె ల్యేలు కాంగ్రెస్‌లో చేరారని, వారు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా నిషేధం విధించాలని కేఏ పాల్ కోరారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మహిపాల్ రెడ్డి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. స్పీకర్ అధికారాల్లో జోక్యం కోరుతూ వేసిన ఈ పిటిషన్ చెల్లదని, మధ్యంతర ఉత్తర్వులు కోరలేరని అన్నారు. పలువురి అనర్హత పిటిషన్లు స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేసింది. -
కూటమిపై KA పాల్ ఫైర్
-
ట్రంప్‌ను నేనే గెలిపించాను అంటున్న పాల్
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత..హైకోర్టులో పాల్ వాదనలు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు శుక్రవారం(అక్టోబర్ 25) మరోసారి విచారించింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కేఏ పాల్ హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో పాల్ పార్టీఇన్పర్సన్(స్వయంగా)గా కేఏ పాల్ వాదనలు వినిపించారు. ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు నవంబర్ 4కు వాయిదా వేసింది.కాగా, తమ ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై బీఆర్ఎస్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి తుది ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: మాజీ ఈఎన్సీకి కాళేశ్వరం కమిషన్ కీలక ఆదేశాలు -
పరిహారమిచ్చాకే కూలుస్తున్నారా?
సాక్షి, హైదరాబాద్: ‘మూసీ నదీ గర్భం (రివర్ బెడ్)లో నిర్మాణం చేపట్టారంటూ మార్కింగ్ చేసిన ఇళ్లను పరిహారమిచ్చాకే కూలుస్తున్నారా? నోటీ సులు జారీ సహా చట్టప్రకారం అనుసరించాల్సిన ప్రక్రియను పాటిస్తున్నారా?’ అని రాష్ట్ర ప్రభుత్వా న్ని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇమ్రాన్‌ఖాన్ సమాధానమిచ్చారు. పరిహారంపై నిర్వాసితులతో మాట్లాడి, వారు సమ్మతించిన తర్వాతే ఇళ్ల కూల్చివేత చేపడుతున్నామని కోర్టుకు వివరించారు. ఏఏజీ చెప్పిన అంశాలను నమోదు చేసుకుంటున్నట్టు పేర్కొన్న ధర్మాసనం.. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఆలోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు హైడ్రాను ఆదేశించింది.కేఏ పాల్ పిటిషన్ మేరకు..‘‘మూసీకి సంబంధించి సరైన సర్వే నిర్వహించి, ఆక్రమణలను గుర్తించే వరకు భవనాలను కూల్చివేయకుండా హైడ్రాను ఆదేశించాలని.. బాధితులకు నోటీసులు ఇచ్చి, ఇళ్లు ఖాళీ చేయడానికి లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి నెల రోజుల సమయం ఇవ్వాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావుల ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది.పారదర్శకంగా చర్యలు: ఏఏజీవిచారణ సందర్భంగా ఏఏజీ ఎక్కడ అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వ న్యాయ వాదులు హాజరుకాకుంటే ఎలాగని, పిటిషనర్ల వాదనలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని పేర్కొంది. దీనితో ఏఏజీ విచారణకు హాజరై వాదనలు వినిపించారు. ‘‘చట్టప్రకారం చర్యలు తీసుకుంటూనే ప్రభుత్వం ముందుకెళ్తోంది. నోటీసు లిచ్చి సమయం ఇచ్చిన తర్వాతే కూల్చివేతలు చేప డుతున్నాం. ప్రజలందరి విషయంలో ఒకేలా వ్యవ హరిస్తున్నాం. తారతమ్యాలు లేవు. పారదర్శకంగా, నిష్పక్ష పాతంగా చర్యలు చేపడుతున్నాం’’ అని వివరించారు. చెరువులు, కుంటల పరిరక్షణ కోసం కోర్టు ఆదేశాల మేరకు హైడ్రా ఏర్పాటైందని.. రివర్ బెడ్లోని ఇళ్లకు మార్కింగ్ మాత్రమే చేసిందని, ఇంకా కూల్చివేతలు చేపట్టలేదని తెలిపారు. హైడ్రాకు చట్టబద్ధత ఇస్తూ ఇటీవల ప్రభుత్వం ఆర్డినెన్స్ కూడా జారీ చేసిందని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఏఏజీ వాదనలను రికార్డు చేశామని, ఈ పిటిషన్లో మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది. బాధితుల్లో ఎక్కువ మంది పేదలే..: పాల్విచారణ సందర్భంగా పార్టీ ఇన్ పర్సన్‌గా కేఏ పాల్ తానే వాదనలు వినిపించారు. ‘‘ఆక్రమణదారులు, బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రిజిస్ట్రేషన్, విద్యుత్, నిర్మాణ, నల్లా అనుమతులు ఇచ్చిన అధికారులు అందరూ ఆనందంగానే ఉన్నారు. అనుమతులు ఉన్నాయి కదా అని కొనుగోలు చేసిన పేద, మధ్యతరగతి వారే రోడ్డున పడుతున్నారు. ‘హైడ్రా’ బాధితుల్లో ఎక్కువ మంది వారే. 462 నిర్మాణాలను, భవనాలను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చారు. ఎన్ కన్వెన్షన్‌ను ఒక్కరోజులో కూల్చిన అధికారులు.. దాదాపు 250 మంది పెద్దలకు మాత్రం నోటీసులు జారీ చేసి వదిలేశారు. పేద, మధ్యతరగతికి సమయం ఇవ్వకుండా ప్రతాపం చూపిస్తున్నారు. కూల్చడానికి నేను వ్యతిరేకం కాదు.. కానీ, చట్టాన్ని పాటించాలి. న్యాయవాదులను పెట్టుకోలేని స్థితిలో చాలా మంది ఉన్నారు. లక్షల మంది హైడ్రా తమ ఇంటి మీదకు ఎప్పుడో వస్తుందో అని భయంతో బతుకుతున్నారు. అలాంటి వారి కోసమే పిల్ వేశాను. ఇళ్లు కూల్చే వారికి ముందే పరిహారం ఇవ్వాలి. నోటీసులిచ్చి ఖాళీ చేసే సమయం ఇవ్వాలి. తెలంగాణ మరో ఉత్తరప్రదేశ్‌లా మారకముందే చర్యలు తీసుకోవాలి. ఇళ్ల కూల్చివేతపై సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలి’’ అని పాల్ వాదనలు వినిపించారు. -
‘హైడ్రా’పై కేఏ పాల్ వాదనలు.. హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్: హైడ్రాపై కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం(అక్టోబర్ 23) హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో బెంచ్ ముందు పాల్ తానే స్వయంగా వాదనలు వినిపించారు. పాల్ వాదనలు విన్న కోర్టు హైడ్రాకు కీలక ఆదేశాలు జారీ చేసింది. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టవద్దని హైడ్రాను ఆదేశించింది.నిర్వాసితులు ప్రత్యామ్నాయం చూసుకునేంతవరకు బాధితులకు సమయం ఇవ్వాలని సూచించింది. మూసీ బాధితులకు ఇల్లు కట్టించిన తర్వాతే కూల్చివేతలు చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది. బాధితులకు ఇల్లు కేటాయించిన తర్వాతే కూల్చివేస్తున్నామని అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రాను హైకోర్టు ఆదేశించింది. -
నన్ను చంపాలని చూస్తున్నారు.. భద్రత పెంచండి
సాక్షి, న్యూఢిల్లీ: తనను కొందరు చంపాలని చూస్తున్నారని, భద్రత పెంచాలంటూ ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా లకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీ, సహా మోదీ కూడా తనకు శత్రువులే అని పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘నన్ను చంపితే స్వర్గానికి పోతా..మీరు (చంపాలనుకున్నవారు) చస్తే నరకానికి పోతారు’అంటూ వ్యాఖ్యానించారు. పలు విషయాలపై తాను కేసులు వేస్తూ పోరాడుతున్నానని, ఎన్నో కేసుల్లో స్టే లు తీసుకువస్తున్నానని తెలిపారు. చంద్రబాబు, పవన్ సహా.. బీజేపీ,ఆర్ఎస్ఎస్, తీవ్రవాదుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయని తెలిపారు. పాలన చేతకాకపోతే సీఎం పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని కేఏపాల్ డిమాండ్ చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వేలాది మంది గ్రూప్–1 అభ్యర్థులపై పోలీ సులు దాడులు చేయడం అమానుషమన్నారు. -
‘నన్ను చంపితే స్వర్గానికి పోతా.. మీరు చస్తే నరకానికి పోతారు’
సాక్షి, ఢిల్లీ: కొందరు తనను చంపాలని చూస్తున్నారని.. అందుకే ప్రధాని మోదీ, అమిత్‌లకు సెక్యూరిటీ కోసం లేఖ రాశానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఢిల్లీలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను చంపితే స్వర్గానికి పోతా.. మీరు చస్తే నరకానికి పోతారు’’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘నేను అందరి కోసం పనిచేస్తున్నా.. పని చేస్తూనే ఉంటాను. కేసులు వేస్తున్నా.. కోర్టుల్లో పోరాడుతున్నా.. ఎన్నో కేసుల్లో స్టేలు తీసుకొస్తున్నా. కేసులు వెనక్కి తీసుకోవాలని బెదిరింపులు వస్తున్నాయి. మోదీ, చంద్రబాబు, పవన్, కాంగ్రెస్‌లు నాకు శత్రువులు. వేలాది మంది గ్రూప్-1 అభ్యర్థులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. అభ్యర్థులపై పోలీసు దాడులు బాధాకరం. వారిని గాయపరచడం సరైందా?’’ అంటూ కేఏ పాల్ ప్రశ్నించారు.ఇదీ చదవండి: అశోక్‌నగర్‌లో మరోసారి ఉద్రిక్తత..‘‘పరిపాలన చేత కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. వేలమందినీ ఎందుకు కొడుతున్నారు? ఇల్లీగల్ అర్డర్‌ను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పోలీసులు పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మారాలి. రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగేలా చేస్తున్నారు’’ అని కేఏ పాల్ నిలదీశారు. -
పవన్ కల్యాణ్‌పై కేఏ పాల్ ఫిర్యాదు
పంజగుట్ట (హైదరాబాద్): తిరుపతి లడ్డూ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 100 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ కేఏ పాల్ సోమవారం పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పాల్ మాట్లాడుతూ లక్ష లడ్డూలు కల్తీ చేసి అయోధ్యకు పంపించారని అబద్ధపు మాటలు మాట్లాడారని, లడ్డూపై విచారణ జరిగిందే జూన్‌లో కాగా, అయోధ్య ప్రారంభోత్సవం జనవరిలో జరిగిందని కల్తీ ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. 14 సెక్షన్ల కింద ఫిర్యాదు చేశానని,ఆర్టికల్ 8 ప్రకారం ఆయన్ను వెంటనే ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని, లేదా ఆయనే స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పవన్‌కల్యాణ్‌కు ఎవరు స్క్రిప్ట్ ఇస్తే.. అది సినిమాలో మాదిరి చదువుతున్నాడని, గతంలోనే చెప్పినా వినిపించుకోలేదన్నారు. ఏపీ స్పీకర్, గవర్నర్, దేశ ప్రధాని, కేంద్ర హోంమంత్రి, ఛీప్ జస్టిస్, సీబీఐ అతనిపై విచారణ చేయాలని, వెంటనే పవన్‌కల్యాణ్ ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు -
స్టీల్ ప్లాంట్ ని చంద్రబాబు, పవన్ ఏ విధంగా అమ్మేస్తున్నారు.. కేఏ పాల్ సంచలన విషయాలు
-
స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లో శాసనసభ స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇతర ప్రతివాదులు కూడా స్పందించాలని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకాకుండా, జీతభత్యాలు నిలుపుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని తిరస్కరించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఒక పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన శాసనసభ్యులు వెంటనే మరో పార్టీలోకి ఫిరాయిస్తున్నారని.. ఇలాంటి వారి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసేలా ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరడం ద్వారా ఆయా నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని కూడా వమ్ము చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరి.. ఆ తర్వాత ఆ పార్టీ తరఫున ఏకంగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో ఇలాంటి వారంతా ఐదేళ్ల పాటు యథేచ్ఛగా తమ అధికారాలను అనుభవిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఇలాంటి వారిపై వెంటనే అనర్హత వేటు వేసేలా ఆదేశాలు జారీ చేయాలి..’ అని విజ్ఞప్తి చేశారు. అయితే ఇదే అంశంపై అప్పటికే సింగిల్ జడ్జి వద్ద పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉండటంతో రిజిస్ట్రీ అభ్యంతరం తెలుపుతూ పిల్‌కు నంబర్ కేటాయించలేదు. కానీ గత విచారణ సందర్భంగా సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు కాపీని అందజేయడంతో నంబర్ కేటాయించాలని సీజే ధర్మాసనం రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం ఈ పిల్‌పై సోమవారం విచారణ చేపట్టింది. సింగిల్ జడ్జి ఏమన్నారు.. సింగిల్ జడ్జి వద్ద దాఖలైన పిటిషన్లలో ఈ నెల 9న తీర్పు వెలువడిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల ఫిరాయింపుపై దాఖలైన అనర్హత పిటిషన్ల స్టేటస్ చెప్పేందుకు నాలుగు వారాల గడువిస్తున్నామని.. ఆలోగా వివరాలు అందజేయకుంటే తామే ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని స్పీకర్ కార్యదర్శికి జడ్జి తేల్చిచెప్పారు. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, వివేకానంద, మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను స్పీకర్ ముందుంచాలని, విచారణ షెడ్యూల్ రూపొందించాలని స్పష్టం చేశారు. దీని వివరాలను రిజి్రస్టార్ (జ్యుడిషియల్)కు అందజేయాలని చెబుతూ కీలక తీర్పు వెలువరించారు. ఈ తీర్పు వెలువడి ఇప్పటికి రెండు వారాల సమయం గడిచింది. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులివ్వలేం.. పార్టీ ఇన్ పర్సన్ కేఏ పాల్ స్వయంగా వాదనలు వినిపిస్తూ.. ‘పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై శాసనసభ స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ఒక్కోసారి సంవత్సరం నుంచి ఐదేళ్ల వరకు పడుతోంది. ప్రతివాదులైన 10 మంది (దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, సంజయ్‌కుమార్, గూడెం మహిపాల్‌రెడ్డి, అరికెపూడి గాం«దీ) ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకాకుండా ఆదేశాలు ఇవ్వాలి. అలాగే జీతభత్యాలు కూడా నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి..’ అని విజ్ఞప్తి చేశారు. అయితే పిటిషనర్ మధ్యంతర ఉత్తర్వుల విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. అలా ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. స్పీకర్, శాసనసభ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల కమిషన్‌తో పాటు 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. -
కేఏ పాల్ పిటిషన్.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా 10 మంది ఎమ్మెల్యేలను కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.కాగా తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కేఏ పాల్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా పిటిషన్లో కీలక విషయాలను వెల్లడించారు. పార్టీ మారడం రాజ్యాంగ విరుద్దం. రాజీనామా చేయకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేలు అధికారాలు అనుభవిస్తున్నారు. పార్టీ ఫిరాయించడం అంటే రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘించడమేనని పిటిషన్లో పేర్కొన్నారు.ఇదిలా ఉండగా.. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంపై బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏప్రిల్‌లో ఒక పిటిషన్, జూలైలో ఇంకో పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఆగస్టు 10 తీర్పు రిజర్వు చేశాం. ఇప్పటివరకు అనర్హత పిటిషన్లపై ఏం నిర్ణయం తీసుకున్నారో తెలియదు. ఈ నేపథ్యంలో రిట్ పిటిషన్లలో ఉపశమనం పొందేందుకు పిటిషనర్లు అర్హులని ఈ కోర్టు అభిప్రాయపడుతోంది. స్పీకర్ కార్యాలయానికి రాజ్యాంగ హోదా, గౌరవం ఉంది.అనర్హత పిటిషన్లను వెంటనే రాష్ట్ర శాసనసభ స్పీకర్ ముందు ఉంచాలని స్పీకర్ కార్యదర్శిని ఆదేశిస్తున్నాం. ఇరుపక్షాల వాదనలు, డాక్యుమెంట్లు, వ్యక్తిగత వాదనలకు సంబంధించి నాలుగు వారాల్లోగా షెడ్యూల్ నిర్ణయించాలి. నాలుగు వారాల్లో ఏం తేల్చకపోతే సుమోటోగా విచారణ చేపడతాం. తగిన ఆదేశాలను మేమే ఇస్తాం అని కోర్టు వ్యాఖ్యలు చేసింది. ఇది కూడా చదవండి: తెలంగాణ ఎమ్మెల్యేలూ.. జర జాగ్రత్త! -
ఎంతకు అమ్ముడుపోయావ్..
-
ఈ టైంలో చంద్రబాబు కనిపిస్తే.. రెచ్చిపోయిన కేఏ పాల్
-
వరద బాధితులకు అండగా కేఏ పాల్..
-
చంద్రబాబు నీకు చేతకాకపోతే చెప్పు కోటి లక్షలు తీసుకొస్తా...
-
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్
-
నారా లోకేష్, శ్రీ భారత్ పై కేఏ పాల్ వ్యాఖ్యలు
-
బాబు, పవన్ పై కేఏ పాల్ సెటైర్లు
-
బైడెన్ కి సలహా నేనే ఇచ్చా..
-
సూపర్ సిక్స్ చూస్తే భయమేస్తుంది.. చంద్రబాబుపై కేఏ పాల్ అదిరిపోయే సెటైర్లు