సాక్షి, విశాఖపట్నం: అవినీతిలో పుట్టిపెరిగిన చంద్రబాబు.. చివరికి దేవుడిని కూడా తనకు శత్రువుని చేసుకున్నారంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యానించారు. సోమవారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుకు హైకోర్టులో బెయిల్ రాకపోవడం ఊహించిందేనని అన్నారు.
తెలుగు దేశం పార్టీ పని అయిపోయింది. అవినీతి చంద్రబాబు ఇప్పటికైనా తన తప్పుల్ని ఒప్పుకోవాలి. టీడీపీ వాళ్లు ప్రజా శాంతి పార్టీలో చేరితే మంచిది. ఆయనకు హైకోర్టులో ఇవాళ బెయిల్ రాదని నేను ముందే ఊహించా. లోకేష్ ఢిల్లీలో ఎంత తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. చివరికి.. తన పాపాలతో దేవుడ్నిని కూడా చంద్రబాబు శత్రువుని చేసుకున్నారు. చంద్రబాబు ఆణిముత్యం కాదు.. పాపం ముత్యం, అవినీతి ముత్యం. ఆరు లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారనే విమర్శలు చంద్రబాబు మీద ఉన్నాయి.
గత ఎన్నికల్లో పవన్‌తో కలిసి పోటీ చేసిన పార్టీలన్నీ దారుణంగా ఓడిపోయాయి. వాటికి ఐదు శాతం ఓట్లు కూడా రాలేదు. పవన్‌కు బీజేపీ నేతలు, ప్రధాని మోదీ.. ఎవరూ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు. చంద్రబాబుకు పవన్ అమ్ముడుపోయారు. పవన్ అవినీతిపై సీబీఐ విచారణకు నేను డిమాండ్ చేస్తే.. తాను ఎన్డీయేలో ఉన్నానని పవన్ అంటున్నాడు అని పాల్ మండిపడ్డారు.
త్వరలోనే తెలంగాణలో ప్రజా శాంతి పార్టీ అభ్యర్ధులను ప్రకటిస్తాను.. త్వరలోనే ప్రజల వద్దకు యాత్ర చేస్తాను. తెలంగాణలో 119 స్థానాల్లో ప్రజా శాంతి పార్టీ అభ్యర్ధులు పోటీ చేస్తారు..
Comments
Please login to add a commentAdd a comment