సాక్షి,అమరావతి : ప్రజా రాజ్యమే జనసేనగా ఆవిర్భవించిందన్న చిరంజీవి పూటకో స్టేట్మెంట్ ఇస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏపాల్ ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో వరుస రాజకీయ పరిణామలపై ఆయన మీడియాతో మాట్లాడారు.
‘మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. 70 ఏళ్ల వయస్సున్న చిరంజీవి మతి తప్పిందా. కొత్త వేషమా. ప్రజా రాజ్యమే జనసేనగా ఆవిర్భవించిందన్న చిరంజీవి పూటకో స్టేట్మెంట్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ డ్రామాలో చంద్రబాబు మోసపోయారు. పవన్‌ను నమ్మి కుమారుడికే అన్యాయం చేస్తున్నారు చంద్రబాబు. వాళ్ళకి ఓటు బ్యాంక్ లేదన్న వాస్తవం మీకు తెలియదా. న్యాయ వ్యవస్థల్ని వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారో ఆధారాలు సరైన టైంలో బయటపెడతా.
చిరంజీవి, పవన్ కళ్యాణ్ డ్రామాని సీరియస్‌గా తీసుకోకండి. వాళ్ళ పదవుల విషయంలో డీల్ కుదరక ఈ డ్రామాలు. సనాతన ధర్మం టూర్ చేసే ముందు మీ భార్య కన్నీళ్లు పెడుతుంది గుర్తు చేసుకో. పవన్ మిమ్మల్ని వదిలేయక ముందే.. చంద్రబాబు తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. హామీలు అమలు చేయకుండా చంద్రబాబు చేతులెత్తేస్తాడని, రేవంత్ రెడ్డి మోసాల గురించి నాకు ఎప్పుడో తెలుసు. ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోలేదు..నేను సుప్రీం కోర్టులో కేసు వేస్తున్నా. దమ్ముంటే ఈవీఎం ఎన్నికలు కాకుండా బ్యాలెట్ ఎలెక్షన్స్ పెట్టండి’అని కేఏపాల్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment