మోదీ టూర్‌లో లోకేష్‌కు ప్రాధాన్యం
ప్రధాని మోదీ విశాఖ పర్యటన పూర్తయింది. గతంలో వైఎస్ జగన్ హయాంలో ఒప్పందాలు కుదుర్చుకున్న పలు సంస్థలు మళ్లీ అదే ఒప్పందాలు ఇప్పుడే కుదర్చుకున్నట్లు ఫోటోలు దిగాయి.. అదంతా బాబు గొప్పతనం అన్నట్లుగా మీడియాలో ప్రచారం కూడా జరిగింది. ఇక పత్రికల్లో భారీ ప్రకటనలు.. రాష్ట్ర స్వరూపం మారిపోతున్నట్లు పెద్ద పెద్ద హోర్డింగులు.. ఇవన్నీ చంద్రబాబు హయాంలో సహజమే అయితే ప్రధాని మీటింగ్ వలన రాష్ట్రానికి. విశాఖ నగరానికి పెద్దగా ప్రయోజనం ఏమీ లేకున్నా లోకేష్ కు మాత్రం ప్రత్యేక హోదా దక్కింది.
మోదీ పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన పెద్దపెద్ద పత్రికా ప్రకటనలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు ఆ ప్రకటనల్లో పెట్టారు అంటే అర్థం ఉంది కానీ కేబినెట్లో అందరిలా మంత్రి పదవి తప్పితే ప్రత్యేకమైన ఏ గుర్తింపు లేని లోకేష్ ఫోటోలు ఎందుకు పెట్టినట్లు.. సీఎం, డిప్యూటీ సీఎం సహా లోకేష్‌ను ప్రధానితో వేదిక మీద ఎందుకు కూర్చోబెట్టినట్లు. ఆయనకు చంద్రబాబు కొడుకుగా కాకుండా ప్రత్యేక గుర్తింపు ఏముంది.?
ఇప్పటికే అన్నిశాఖల్లోనూ విపరీతంగా జోక్యం చేసుకుంటూ పెత్తనం సాగిస్తున్న లోకేష్ ఇప్పుడు అనధికార సీఎంగా.. సూపర్ పవర్‌గా ఎదిగారని అధికారులే అంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ పెద్ద ఫైల్ కదలాలన్నా.. ఎవరికీ ఏ పోస్టింగ్ ఇవ్వాలన్నా లోకేష్‌ను కలవాలి అనేది ఒక అనధికారిక జీఓ మాదిరి నడుస్తోంది. ఇక ఇప్పుడు ఆయన్ను డిప్యూటీ సీఎం హోదాలో అధికారికంగా నియమించడమే తరువాయి అని అంటున్నారు.
ప్రస్తుతానికి అధికారికంగా అయితే చంద్రబాబు తరువాత పవన్‌కు మాత్రమే ఉప ముఖ్యమంత్రిగా ప్రాధాన్యం దక్కుతోంది. ఇక త్వరలో లోకేష్‌కు కూడా డిప్యూటీ స్థాయికి ఎలివేషన్ ఇచ్చారంటే ఇక పవన్ ప్రాధాన్యం తగ్గినట్లే.. ఇక డిప్యూటీ హోదాలో లోకేష్ మరింతగా రెచ్చిపోయి శాఖలన్నింటినీ కెలికేస్తాడు. పాపం ఇటు పవన్ తన పంచాయతీ రాజ్.. గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన పనులే అర్థం కాక తికమకపడిపోతున్నారు. రానున్న రోజుల్లో పవన్ ప్రాధాన్యం తగ్గించి లోకేష్‌ను ముందుకు తెచ్చేందుకు ఈ మోదీ పర్యటన బాగా ఉపయోగించుకున్నారని అర్థం అవుతోంది.
-సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment