
ఏపీ శాసన మండలి సమావేశాలు.. అప్‌డేట్స్..
శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ సభ్యుల ప్రశ్నలు..
- వాలంటీర్ల తొలగింపుపై మండలిలో తీవ్ర చర్చ
- వలంటీర్లు ఎవ్వరూ లేరు, రెన్యూవల్ చెయ్యలేదని చెప్పిన మంత్రి బాల వీరంజనేయ స్వామి
- వాలంటీర్ల తొలగింపుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ఆగ్రహం
- ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కామెంట్స్..
- వాలంటీర్ల వేతనాన్ని 10వేలకి పెంచుతామని హామీ ఇచ్చారు
- ఈ ప్రభుత్వం 2,56,000 మంది వాలంటీర్లను తొలగించింది
- వలంటీర్ వ్యవస్థనే లేదని చెప్తున్నారు
- 2024 సెప్టెంబర్‌లో వరదలు వచ్చినప్పుడు ఎలా డ్యూటీ చేయించారు
- నవంబర్ 2024 వరకు వాళ్లకి ఐడీలు ఎలా కొనసాగించారు
- వాలంటీర్లకు 10 వేలు చేస్తామని మోసం చేశారు.
ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కామెంట్స్
- 2023 ఆగస్టు నుండి వలంటీర్లు వ్యవస్థ లేదని దారుణంగా మాట్లాడుతున్నారు
- వ్యవస్థ లేకపోతే 2024లో మేనిఫెస్టోలో ఎలా పెట్టారు?.
- 2024 ఏప్రిల్ లో ఎన్నికల్లో ఊరూరా తిరిగి వాలంటీర్ల జీతాలు పెంచుతామని ఎలా హామీ ఇచ్చారు
- జీతం పెంచగానే చించినాడా పుతారేకులు ఇవ్వండి అని మంత్రి ప్రచారం చేశారు
- 2,60,000 వేల మందిని తొలగించడం అన్యాయం
- వాళ్ళు ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు
ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కామెంట్స్..
- వలంటీర్లు లేకపోతే ఎందుకు విపత్తు శాఖ ఆదేశాలు ఇచ్చింది
- లేని వారిని ఎలా వరదల్లో వినియోగించారు?.
ఫీజు రియింబర్స్‌మెంట్‌పై వైఎస్సార్‌సీపీ సభ్యుల నిలదీత..
- రూ.3,169 కోట్లు ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నట్టు వెల్లడించిన మంత్రి బాల వీరంజనేయ స్వామి
- ఫీజు ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టడంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం
- ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నలు.
- 4200 కోట్ల బకాయిలు ఉన్నాయి.
- 2000 కోట్ల వసతి దీవెన బకాయిలు ఉన్నాయి.
- పీజీ విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్ ఇస్తామన్నారు
- ఇప్పటి వరకూ ఇవ్వలేదు.
- వసతి దీవెన మొదలు పెట్టిందే వైఎస్ జగన్.
ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కామెంట్స్..
- వైఎస్ జగన్ గతంలో తల్లుల ఖాతాల్లో ఫీజులు వేశారు
- కాలేజీ యాజమాన్యాలను ప్రశ్నించే హక్కు తల్లిదండ్రులకు కల్పించారు
- గతంలో చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన 1778 కోట్ల బకాయిలను వైఎస్ జగన్ చెల్లించారు
- ఇప్పుడు ప్రభుత్వం బకాయిలను చెల్లించకపోవడం అన్యాయం
- విద్యార్థుల భవిష్యత్ కోసం మానవతా దృక్పథంతో ప్రభుత్వం చెల్లించాలి
- మొత్తం ఫీజు రియింబర్స్‌మెంట్ చేస్తారా?
- హాజరు సీలింగ్ ఏమైనా పెడతారా?.
ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి కామెంట్స్..
- వైఎస్సార్ పేద పిల్లల కోసం ఫీజు రియింబర్స్‌మెంట్ తెచ్చారు
- ఉన్నత చదువులు పేద పిల్లలకు అందించారు
- ఇప్పుడు ఫీజులు బకాయిలు పెట్టేసారు
- విద్యార్థుల చదువులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి
Comments
Please login to add a commentAdd a comment