బాబు నుంచి పవన్‌కు రూ.1,500 కోట్లు ముట్టాయి | KA Paul Comments On Janasena Pawan Kalyan And Chandrababu Naidu- Sakshi
Sakshi News home page

బాబు నుంచి పవన్‌కు రూ.1,500 కోట్లు ముట్టాయి

Published Mon, Sep 18 2023 6:50 AM | Last Updated on Tue, Sep 19 2023 1:30 PM

KA Paul Comments On Pawan Kalyan and Chandrababu  - Sakshi

సీతమ్మధార (విశాఖ ఉత్తర): చంద్రబాబు నుంచి రూ.1,500 కోట్లు పవన్‌కు ముట్టా­యని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డా.కేఏ పాల్‌ ఆరోపించారు.  ఆదివారం విశాఖలోని ఆశీల­మెట్ట­లోని కేఏ పాల్‌ ఫంక్షన్‌ హాలులో మీడి­యాతో ఆయన మాట్లాడారు. చంద్ర­బాబుకు పవన్‌ కల్యాణ్‌ కుక్కలాగా అమ్ముడు పోయా­డని వ్యాఖ్యానించారు. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ ప్యాకేజీ స్టార్లు అని, అందువల్లే పవన్‌ వెంట కాపులు లేరన్నారు.

వారిద్దరూ కాపులను అమ్ముకోవడానికే ప్రజారాజ్యం, జన­సేన పార్టీలు పెట్టారని చిరంజీవి, పవన్‌­లను ఉద్దేశించి అన్నారు. 2019లో జనసేనలో లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్‌ ఇద్దరే చేరా­రని, ఎన్నికలు అయిపోయిన వెంటనే వారూ బయటకు వచ్చారని గుర్తు చేశారు. పార్టీ జాతీయ వైస్‌.ప్రెసిడెంట్‌ డాక్టర్‌.కుమార్, మమత రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement