సాక్షి, తూర్పుగోదావరి: చిరంజీవి తాను కూడా జనసేనలో చేరుతానని లీక్స్ ఇస్తున్నాడని, బీజేపీలో జనసేన విలీనం చేయడానికి సిద్ధమయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. నటుడు చిరంజీవి, ఆయన సోదరుడు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తీరుపై కేఏ పాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
‘‘2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడే చెప్పాను. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు.. పార్టీని ఎప్పటికైనా కాంగ్రెస్‌లో కలిపేస్తారని. చెప్పినట్లుగానే.. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ఐదు వేల కోట్లు తీసుకున్నాడు. ఆయన మాత్రం ప్రజారాజ్యం పార్టీలో టిక్కెట్లు కోసం 1,500 కోట్లు కలెక్ట్ చేశారు. భార్యల బంగారం అమ్ముకొని అప్పట్లో కాపులు ప్రజారాజ్యం పార్టీలో టికెట్లు కొనుక్కున్నార’’ని పాల్ వ్యాఖ్యానించారు.
ఆ భయంతోనే బీజేపీలోకి..
కేవలం ఈడీ, ఐటీ రైడ్లకు భయపడే చాలామంది బీజేపీకి సరెండర్ అవుతున్నారు. సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్లు కూడా అందుకే బీజేపీలో కలిసిపోయారు. చిరంజీవి తనవద్ద ఉన్న వేల కోట్ల రూపాయలు, తనకిచ్చిన ప్యాకేజ్ డబ్బులు విషయంలో పవన్ కల్యాణ్ ఐటీ రైడ్‌లు జరుగుతాయని భయపడుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీకి దగ్గరవుతున్నారు. రాష్ట్రానికి ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చని మోదీని, ఎన్డీయేని పవన్ కల్యాణ్ గెలిపించమని కోరడం ఎంతవరకు కరెక్ట్.
అసలు మోదీని గెలిపించాలంటున్న పవన్ కల్యాణ్, చిరంజీవికి బుద్ధి, సిగ్గు ఏమాత్రమైనా ఉందా?. బుద్ధున్న వాళ్ళు ఎవరైనా సరే జనసేనలో ఉంటారా?. బడుగు, బలహీన వర్గాలను మోసం చేస్తున్న మోదీని సమర్థిస్తున్న చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల ను ఆదరించొద్దు. జనసేనలో బిహైండ్ ది స్క్రీన్ చిరంజీవి ఉన్నారు. ఆయన ఎంతో మంచోడిలా నటిస్తారు. కానీ, లోపల అంతా కుతంత్రమే.. మాయే. చిరంజీవి పవన్ కల్యాణ్‌ను నమ్మొద్దు. పవన్ చేసేది వారాహి యాత్ర కాదు.. బీజేపీ యాత్ర.
వాళ్లకు పడ్డ ఓట్లు చూడండి
చిరంజీవి, పవన్ కల్యాణ్, అరవింద్, నాగబాబులకు నా ఛాలెంజ్. రాజమండ్రిలో పవన్ కల్యాణ్‌గానీ, చిరంజీవిగానీ పోటీ చేయమనండి. నేనూ పోటీ చేస్తాను. ఎవరు గెలుస్తారో చూద్దాం. వారికి డిపాజిట్లు కూడా రావు. ఎందుకంటే.. చిరంజీవికి 18 శాతం ఓట్లు వస్తే, పవన్ కల్యాణ్ 6% మాత్రమే ఓట్లు వచ్చాయి. అది చాలదా వాళ్ల ఆదరణ ఏంటో చెప్పడానికి.
ఎద్దు పిల్లి కాలు తొక్కితే.. పిల్లి ఎలుక వైపు చూసిందట.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తీరు అలా ఉంది. పోలవరం ప్రాజెక్టుకు డొనేషన్ ఇప్పిస్తానంటే చంద్రబాబు బిజినెస్ చేశారు. మోదీ, కేసీఆర్, చంద్రబాబు చేసిన కబ్జా భూములు లాగేసుకుని ప్రజలకు దానం చేస్తాను. ఎవర్ని వదిలిపెట్టేది లేదు. ప్రాణం ఉన్నంతవరకు మోదీని, ఆయన బీ - పార్టీలను వదలను.
Comments
Please login to add a commentAdd a comment