
సీతమ్మధార(విశాఖ ఉత్తర): జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ రూ.1,500 కోట్లకు చంద్రబాబుకు అమ్ముడుపోయాడని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పారు. అమరావతిలో బినామీల పేర్లతో టీడీపీ నాయకులు భూములు కొనుగోలు చేశారని ఆయన తెలిపారు.
విశాఖ ఆశీలమెట్టలోని కేఏ పాల్ ఫంక్షన్ హాలులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ ఒక రోజు ఎన్డీఏలో ఉన్నానంటాడని, మరొక రోజు లేనని చెబుతాడని, రేపు ఏమంటారో చూడాలన్నారు. చంద్రబాబు స్టీల్ ప్లాంట్ కోసం ఏనాడు పోరాటం చేయలేదని, ఆయన అదానీకి అమ్ముడుపోయాడని ఆరోపించారు. చంద్రబాబు అమరావతి కడతానని కట్టలేదని, పోలవరం పూర్తి చేయలేదని, ప్రత్యేక హోదా సాధించలేదని పేర్కొన్నారు.
ఏ తప్పు చేయకపోతే లోకేశ్ ఎందుకు ఢిల్లీలో దాక్కున్నారని ప్రశ్నించారు. లోకేశ్ ఢిల్లీలో బీజేపీ పెద్దల కాళ్లవేళ్లా పడినా అపాయింట్‌మెంట్ దొరకలేదని అన్నారు.
చదవండి: బ్రెయిన్ డెడ్ పార్టీకి సానుభూతి వైద్యం
Comments
Please login to add a commentAdd a comment