Praja Shanti Party
-
ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబూమోహన్
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. కేఏపాల్ సమక్షంలో సోమవారం ప్రజాశాంతి పార్టీ కండువా కప్పుకున్నారు బాబూమోహన్. కాగా ఇటీవలే బాబూ మోహన్ బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. భవిష్యత్తులో వరంగల్ జిల్లా ఎంపీగా పోటీ చేస్తానని ఆ సయంలోనే బాబూ మోహన్ వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా బాబూ మోహన్ పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరకు ఆయనకు అందోల్ నుంచి బీజేపీ టికెట్ ఇచ్చింది. అయితే ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన దామోదర రాజనరసింహ గెలపొందారు. బాబూ మోహన్ మూడో స్థానానికే పరిమితమయ్యారు. చదవండి: నా జీవితం దేశానికి అంకితం: ప్రధాని మోదీ -
పవన్ కల్యాణ్‌కు ఓపెన్ ఆఫర్!
సాక్షి, విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజా శాంతి పార్టీ తరఫున పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేస్తామని.. అందుకు ఎంత డబ్బు ఖర్చు అయినా తానే భరిస్తానని ఆఫర్ ఇచ్చారు . సోమవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అభ్యర్థుల్ని ప్రకటించే టైంలో వేదిక మీద చంద్రబాబు పక్కనే ఉన్న పవన్‌లో బాధ కనిపించిందన్నారు. మరి చంద్రబాబు ఎన్ని కోట్లు ఇచ్చారో పవన్ ఎందుకు చెప్పలేకపోతున్నారోనని పాల్ ప్రశ్నించారు. ‘నీకు(పవన్‌ను ఉద్దేశించి..) ఓటు బ్యాంకు లేదు. డబ్బు తెచ్చే సత్తా లేదు. ప్రజలు ఛీ అంటుఉన్నారు. కానీ, ప్రజా శాంతి తరపున నీకు నేను 24 కాదు.. గతంలో చెప్పినట్లు 48 కాదు.. ఇప్పుడు మూడు రెట్లు అంటే 72 సీట్లు ఇస్తా. నిన్ను గెలిపిస్తా. నేను గెలిచి పార్లమెంట్‌కు వెళ్తా.. నిన్ను ఇక్కడ ముఖ్యమంత్రిని చేస్తా’’ అని పాల్ పవన్‌కు హామీ ఇచ్చారు. అలాగే.. టీడీపీ జనసేనలు రాష్ట్రాన్ని దోచుకోవడానికి సంసిద్ధం అంటున్నాయని.. ఆ రెండు పార్టీలను నమ్మొద్దని ఏపీ ప్రజలకు కే ఏ పాల్ విజ్క్షప్తి చేశారు. వంగవీటి రంగాను చంపిన రక్తపు చేతుల్లోంచి(బాబును ఉద్దేశిస్తూ..) బయటకు రా అంటూ పవన్‌ను పాల్ కోరారు. -
సీఎం రేవంత్ రెడ్డి పర్ఫెక్ట్ లీడర్: కేఏ పాల్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి పర్ఫెక్ట్ లీడర్ అని ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే సీఎం రేవంత్ రెడ్డి తాను విదేశీ పర్యటనలకు వెళ్ళాలనుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించనున్నామని వెల్లడించారు. ఈ మేరకు అసెంబ్లీ ఆవరణలో కేఏ పాల్ మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు అసెంబ్లీకి వచ్చినట్లు తెలిపారు. అదానీ, అంబానీకి 25 లక్షల కోట్ల రూపాయిలు మాఫీ చేశారని కేఏ పాల్ ఆరోపించారు. గత 10 ఏండ్లలో 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని విమర్శించారు. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆర్ధిక బడ్జెట్ ను చక్కదిద్దాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రేవంత్ రెడ్డి మంచి చేస్తున్నాడని అన్నారు. ఇదీ చదవండి: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం -
రూ.1,500 కోట్లకు అమ్ముడుపోయిన పవన్: కేఏ పాల్
సీతమ్మధార(విశాఖ ఉత్తర): జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ రూ.1,500 కోట్లకు చంద్రబాబుకు అమ్ముడుపోయాడని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పారు. అమరావతిలో బినామీల పేర్లతో టీడీపీ నాయకులు భూములు కొనుగోలు చేశారని ఆయన తెలిపారు. విశాఖ ఆశీలమెట్టలోని కేఏ పాల్ ఫంక్షన్ హాలులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ ఒక రోజు ఎన్డీఏలో ఉన్నానంటాడని, మరొక రోజు లేనని చెబుతాడని, రేపు ఏమంటారో చూడాలన్నారు. చంద్రబాబు స్టీల్ ప్లాంట్ కోసం ఏనాడు పోరాటం చేయలేదని, ఆయన అదానీకి అమ్ముడుపోయాడని ఆరోపించారు. చంద్రబాబు అమరావతి కడతానని కట్టలేదని, పోలవరం పూర్తి చేయలేదని, ప్రత్యేక హోదా సాధించలేదని పేర్కొన్నారు. ఏ తప్పు చేయకపోతే లోకేశ్ ఎందుకు ఢిల్లీలో దాక్కున్నారని ప్రశ్నించారు. లోకేశ్ ఢిల్లీలో బీజేపీ పెద్దల కాళ్లవేళ్లా పడినా అపాయింట్మెంట్ దొరకలేదని అన్నారు. చదవండి: బ్రెయిన్ డెడ్ పార్టీకి సానుభూతి వైద్యం -
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది: కేఏ పాల్
సాక్షి, నిజామాబాద్: దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని.. తెలంగాణలో వివక్ష పాలన నడుస్తోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. బుధవారం నిజామాబాద్‌లో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన దేశ, తెలంగాణ రాజకీయాలపై మాట్లాడారు.ఈ క్రమంలో ఏపీ విపక్ష నేత చంద్రబాబు నాయుడుపైనా ఆయన నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు ఒక అవినీతి చక్రవర్తి. చంద్రబాబు కచ్చితంగా అవినీతికి పాల్పడ్డారు. ఆయన అరెస్ట్ సరైనదే. చంద్రబాబు, ఎన్టీఆర్కే కాదు నాలాంటి గురువుకు ద్రోహం చేశారు అని పాల్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాజకీయ పార్టీలపై ఫైర్ బీజేపీ, బీఅర్ఎస్ ఒక్కటే. కల్వకుంట్ల కవిత అరెస్ట్ కాకపోవడమే అందుకు నిదర్శనం. మునుగోడులో బీఆర్ఎస్ వందల కోట్లు పెట్టి గెలిచింది. నాపై పోటీకి అందరూ భయపడుతున్నారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోంది. తెలంగాణలో రూ. 6 లక్షల కోట్ల అప్పు అయ్యింది. కేసీఆర్ సర్కారు ది జీతాలు ఇవ్వలేని పరిస్థితి అని మండిపడ్డారాయన. ఇక.. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించే క్రమంలో.. ‘‘దేశంలో కాంగ్రెస్ ఎక్కడుంది. కాంగ్రెస్ ఢిల్లీలో లేదు, గల్లిలో లేదు. కాంగ్రెస్ కి డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. దేశాన్ని సర్వనాశనం చేసింది.. అవినీతికి ఆజ్యం పోసింది కాంగ్రెస్ పార్టీ. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగింది. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మహిళ రిజర్వేషన్ బిల్లు కేవలం ఎన్నికల స్టంట్’’ అని కేఏ పాల్ తేల్చేశారు. -
‘పవన్.. సినిమా డైలాగులు, డ్యాన్సులకు ఓట్లు రావు’
కర్నూలు (టౌన్): ‘పవన్.. సినిమా డైలాగులు చెప్పి, డ్యాన్సులు చేస్తే ఓట్లు రాలవు. రాష్ట్రంలో 3 శాతం ఓట్లులేని జనసేనకు 30 శాతం ఓటు బ్యాంకు ఉన్నట్లు కొన్ని మీడియా చానళ్లు వక్రీకరిస్తున్నాయి. ప్యాకేజీ స్టార్.. ప్యాకేజీకి అమ్ముడుపోవద్దు..’ అని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కె.ఎ.పాల్ అన్నారు. ఆయన సోమవారం కర్నూలులో విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో నాటి, నేటి ప్రభుత్వాలు విఫలమయ్యాయని చెప్పారు. తన రాజకీయంపై పవన్‌కళ్యాణ్‌కే క్లారిటీ లేదన్నారు. -
నా డబ్బుతో తెలంగాణ అభివృద్ధి చేస్తా: కేఏ పాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీఆర్ఎస్ సర్కార్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ KA Paul మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి ద్వారా తమ ఛారిటీ భూములు లాక్కున్నారని, అవినీతిని నిలదీస్తున్నందునే తనను కలవడానికి సీఎం కేసీఆర్ భయపడుతున్నారని అంటున్నారాయన. సదాశివపేట పోలీసులపై మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో గురువారం ఆయన ఫిర్యాదు చేసి.. అక్కడి సీఐ, ఎస్సైలపై చర్యలు తీసుకోవాలని కోరారాయన. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ఎవరూ ప్రశ్నించకుండా ఉండడానికే.. కేసీఆర్, కేటీఆర్‌లు మానవ హక్కులు కమిషన్ ఏర్పాటు చేయడం లేదు. ధరణి తీసుకువచ్చి మా ఛారిటీ భూములను లాక్కున్నాడు. కేసీఆర్‌ను కలవడానికి వెళితే నన్ను అడ్డుకున్నారు. అవినీతి మీద నేను ప్రశ్నిస్తున్న అని భయపడి నన్ను కేసీఆర్ కలవలేదు అని అన్నారాయన. ఇక బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఒకటేనన్న ఆయన.. కేసీఆర్ మిత్రుడు కిషన్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడమే అందుకు నిదర్శమని చెప్పారు. అధికార బీఆర్ఎస్ తనను ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తోందని.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని చెప్పారాయన. ‘‘నేను అధికారంలోకి రాగానే అందరికీ డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తాను. నా డబ్బు అంతా అమెరికాలో ఉండిపోయింది. ఆ డబ్బు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తా’ అని చెప్పారాయన. గత 6 నెలలుగా మానవ హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఖాళీగా ఉందన్న కేఏపాల్.. వారం రోజుల్లో వాటికి చైర్మన్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో.. రిటైర్డ్ జస్టిస్ చంద్ర కుమార్‌ను మానవ హక్కుల కమిషన్ గా తాను రికమండ్ చేస్తానని చెబుతూ.. లైవ్‌లోనే ఆయనకు ఫోన్ చేసి మరీ ‘మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా ఉంటారా?’ అని అడిగారు. ప్రపంచ శాంతి మహాసభలకు ఆహ్వానించేందుకు ప్రగతి భవన్‌కు వెళ్లిన కేఏ పాల్‌ను.. అపాయింట్మెంట్ లేదని చెబుతూ సెక్యూరిటీ గేట్ బయటే అడ్డుకుని వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. ఆ టైంలోనూ ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇదీ చదవండి: బీజేపీ బలం సెన్సెక్స్ కాదు -
ప్రజాశాంతి పార్టీ నుంచి గద్దర్ బహిష్కరణ
సాక్షి, హైదరాబాద్: కేఏ పాల్ పొలిటికల్ పార్టీ ప్రజాశాంతి నుంచి ప్రజా గాయకుడు గద్దర్ బహిష్కరణకు గురయ్యారు. ఈ మేరకు ప్రజాశాంతి పార్టీ బుధవారం అధికారికంగా ప్రకటన చేసింది. ఇదిలా ఉండగా.. తెలంగాణలో ప్రజా గాయకుడు గద్దర్ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్త పార్టీ ‘గద్దర్ ప్రజా పార్టీ’ పేరును గద్దర్ అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో గద్దర్ ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర ఎన్నికల కార్యాయాలనికి గద్దర్ చేరుకున్నారు. రాజకీయ పార్టీ ‘గద్దర్ ప్రజా పార్టీ’ రిజిస్ట్రేషన్ కోసం ఎన్నికల అధికారులను కలిశారు గద్దర్. కాగా, నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కానుంది. ఈ సందర్భంగా గద్దర్ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌పై పోటీచేస్తానని అన్నారు. బంగారు తెలంగాణ కాలేదు.. పుచ్చిపోయిన తెలంగాణ చేశారు. కేసీఆర్ విధానాలు తప్పు అంటూ సీరియస్ అయ్యారు. ఇది కూడా చదవండి: ఆడియో లీక్: కేటీఆర్ సార్ మీటింగ్‌కు వస్తారా.. లేకుంటే ఫైన్ కడతారా? -
‘కేజ్రీవాల్‌కు కేసీఆర్ రూ.1,000 కోట్లు ఇచ్చారు’
సాక్షి, విశాఖపట్నం: తెలంగాణ రాష్ట్రాన్ని, అక్కడ ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల్ని కాపాడలేని కేసీఆర్ విశాఖ ఉక్కుని కాపాడతాననడం హాస్యాస్పదమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ఎద్దేవా చేశారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో కలిసి పాల్ బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. దళితుల పట్ల కేసీఆర్‌కు కనీస ప్రేమ లేదని, అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినంత మాత్రాన ఆయన్ని ఎవరూ నమ్మరని పాల్ అన్నారు. ప్రధాని కావాలన్న కాంక్షతో దోచుకున్న సొమ్ముని కేసీఆర్ పంచుతున్నారన్నారు. కేసీఆర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు రూ.1,000 కోట్లు, తోట చంద్రశేఖర్‌కు రూ.100 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. కేసీఆర్‌ని ప్రధానిని చేస్తే విభజన సమయంలో ఏపీలో దోచుకున్న రూ.లక్షల కోట్లు పంచేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని, ప్లాంట్‌ని అమ్ముతామంటే.. వారు అడిగిన దానికి ఐదింతలు అమెరికా ఫండ్ తెచ్చి మరీ కొంటామనీ, అది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మాలని అన్నారు. టెస్లా అధినేత ఎలెన్‌మస్క్ కూడా స్టీల్‌ప్లాంట్‌కు విరాళాలిచ్చేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ 99 శాతం జరిగిపోయిందని, కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నాటకాలాడుతోందని అన్నారు. 14 సంవత్సరాలు సీఎంగా ఉండి ఉద్యోగాలివ్వని చంద్రబాబు ఇప్పుడు మళ్లీ బాబు వస్తే జాబు అని చెబుతున్న మాటల్ని ఎవరూ విశ్వసించి ఓటు వేయరన్నారు. కొడుకుని సీఎం చేసేందుకు ఎన్నారైల వద్ద రూ.50 కోట్లు చొప్పున చంద్రబాబు దండుకుంటున్నారని పాల్ ఆరోపించారు. వైఎస్ జగన్ సీఎం కాక ముందు దోచుకున్నారని కేసులు పెట్టిన సీబీఐ.. సీఎంగా ఉండగా రూ.లక్షల కోట్లు దోచుకున్న చంద్రబాబుని ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా రోడ్‌మ్యాప్ కోసం బీజేపీ చుట్టూ తిరగడాన్ని పవన్ ఆపేసి జనసేన పార్టీని ప్రజాశాంతిలో విలీనం చేయాలని చెప్పారు. చదవండి: మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ప్రస్తుతం విశాఖ ఉక్కులో 300 మెట్రిక్ టన్నుల స్టీల్ డిమాండ్ ఉందన్నారు. ఇంకా 8 వేల మంది నిర్వాసితులకు న్యాయం జరగాల్సి ఉందని చెప్పారు. వాటన్నింటినీ పరిష్కరించకుండా కేంద్రం తొండాట ఆడుతోందని విమర్శించారు. స్టీల్‌ప్లాంట్ ప్రభుత్వ రంగ కంపెనీగానే ఉండాలని, విశాఖ ఉక్కుని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరితో కలిసి పోరాటం చేస్తానని చెప్పారు. -
కోర్టులో కేఏ పాల్ హల్చల్..
విశాఖ లీగల్: జిల్లా కోర్టు ప్రాంగణంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హల్చల్ చేశారు. విశాఖలోని 4వ అదనపు జిల్లా కోర్టుకు ఒక కేసులో ప్రతివాదిగా వచ్చిన ఆయన న్యాయమూర్తితో స్వయంగా మాట్లాడేందుకు ప్రయత్నంచారు. అందుకు న్యాయమూర్తి సున్నితంగా తిరస్కరించారు. వ్యక్తిగత న్యాయవాదితో రావాలని న్యాయమూర్తి పాల్‌కు సూచించారు. కేఏ పాల్‌కు సంబంధించిన కేసును న్యాయమూర్తి విచారించి, వాయిదా వేశారు. అనంతరం కేఏ పాల్ కోర్టు బయట విలేకర్లతో మాట్లాడారు. దేశం అవినీతిమయంగా మారిందన్నారు. 2007 నుంచి తన కేసు నడుస్తున్నా వాయిదాలు తప్ప పురోగతి లేదన్నారు. కేసును కొట్టివేయాలని ఉన్నత న్యాయస్థానాలు 2014లో చెప్పినా స్పందన లేదన్నారు. గత 16 ఏళ్ల నుంచి 700 సార్లు కేసును వాయిదా వేస్తూ వస్తున్నారన్నారు. కేసు తీర్పు రాకపోవడంతో తాను వితంతువులకు, అనాథలకు సేవ చేయలేక పోతున్నానన్నారు. అవినీతికి మద్దతు పలుకుతున్న న్యాయవాదులు తీరు మార్చుకోవాలన్నారు. ఈవీఎంలు మార్చి టీఆర్ఎస్, బీజేపీలు రాజకీయం చేస్తున్నాయని తెలిపారు. ప్రజాపాలన కావాలంటే ప్రజాశాంతి పాలన రావాలన్నారు. -
సీరియస్ ఎన్నికలో నవ్వుల ‘పాల్’
నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు ఆనంద్ కిలారి పాల్ (కేఏ పాల్) ప్రచారంలో ఓటర్లను భలే అలరించారు. రోజుకో రీతిలో తనదైన శైలిలో ప్రచారం చేశారు. పాల్ ప్రచారానికి ఓటర్లు మునుగోడు ఓటర్లు సైతం బాగా ఆకర్షితులయ్యారు. ఆయన కనిపిస్తే చాలు జనంలో జోష్ వచ్చింది. కానీ, ఓట్లలో మాత్రం పాల్‌ను ఆదరించలేదు. ఆయనకు కేవలం 805 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఏ రౌండ్లోనూ కనీసం రెండంకెలు కూడా దాటలేదు. కౌంటింగ్ సెంటర్ వద్ద సైతం పాల్ సందడి చేశారు. (క్లిక్ చేయండి: మునుగోడు బరిలో కేఏ పాల్.. ఎన్ని ఓట్లు వచ్చాయంటే..) ప్రజాస్వామ్యం ఖూనీ అయింది: కేఏ పాల్ నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఆయన మాట్లాడుతూ... ఈవీఎంల పనితీరుపై నమ్మకం లేదన్నారు. ఉప ఎన్నికలో తన ఉంగరం గుర్తుకు 1.10లక్షల ఓట్లు పడినట్లు ప్రజలు చెప్పారని, సగం కౌంటింగ్ పూర్తయ్యాక తనకు 600 ఓట్లు కూడా రాలేదని వాపోయారు. ఇదంతా టీఆర్ఎస్, బీజేపీల కుట్ర అని ఆరోపించారు. ఫలితాలు చూస్తుంటే టీఆర్ఎస్ కుట్ర ఎంటో అర్థమవుతోందని, అధికారులంతా టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పాల్ ఆరోపించారు. -
మునుగోడు బరిలో కేఏ పాల్.. ఎన్ని ఓట్లు వచ్చాయంటే..
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ సూపర్ విక్టరీని అందుకుంది. దాదాపు 10వేల ఓట్లకుపైగా ఆధిక్యంతో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. ఘన విజయం సాధించారు. బీజేపీ రెండో స్థానంలో, కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయి మూడో స్థానంలో నిలిచాయి. ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు సత్తా చాటారు. ఇక, మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేసిన పాల్‌కు 805 ఓట్లు వచ్చాయి. అయితే, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తొలి రౌండ్ నుంచి రెండు డిజిట్ల సంఖ్యకే పరిమితమైన పాల్.. పదమూడో రౌండ్లో అత్యధికంగా 86 ఓట్లు సాధించారు. ఇక, అత్యల్పంగా 15వ రౌండ్(ఆఖరి రౌండ్)లో 11 ఓట్లు సాధించడం విశేషం. మరోవైపు.. ఎన్నికల ఫలితాల వెలువడిన అనంతరం కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, ఎన్నికల సంఘంపై నిప్పులు చెరిగారు. అంతా ఫ్రాడ్ అంటూ కామెంట్స్ చేశారు. కేసీఆర్ అవినీతిపై బీజేపీ ఎందుకు సీబీఐ విచారణ జరిపించడంలేదని మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. మునుగోడు ఉప ఎన్నికల్లో కారు గుర్తును పోలిన సింబల్స్ అభ్యర్థులకు దాదాపు 6వేలకు పైగా ఓట్లు పడ్డాయి. ఇక, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు నచ్చని పక్షంలో ఓటర్లు నోటాకు ఓటు వేసే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నికల్లో నోటాకు 482 మంది ఓటు వేశారు. ఇది కూడా చదవండి: ‘కోమటిరెడ్డి బ్రదర్స్‌కు అంత సీన్ లేదు’ -
రోజుకో గెటప్.. తగ్గేదేలే.. రైతు వేషంలో కేఏ పాల్..
నల్గొండ: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు సమయం దగ్గర పడటంతో ఎన్నికల ప్రచారాన్ని ప్రధాన రాజకీయ పార్టీలు హోరెత్తిస్తున్నారు. ఎవరికి వారు వ్యూహాత్మక ఎత్తుగడలతో మునుగోడులో జెండా ఎగురవేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో మునుగోడు ఉప ఎన్నికల్లో ఏ మాత్రం తగ్గకుండా కేఏ పాల్ రచ్చ రచ్చ చేస్తున్నారు.మునుగోడులో గెలిచేది నేనే అంటూ కే ఏ పాల్ హల్చల్ చేస్తున్నారు. రైతు వేష ధారణలో కేఏ పాల్ ఎన్నికల ప్రచారం తాజాగా మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో డాన్స్ చేస్తూ, స్టెప్పులేసిన కె ఏ పాల్, రోజుకో రకమైన గెటప్‌లతో చిత్రవిచిత్రంగా ప్రచారం చేస్తూ కాబోయే సీఎం తానేనంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న చెప్పులు కుడుతూ కనిపించిన కేఏ పాల్, తాజాగా రైతు వేషధారణలో ప్రత్యక్షమయ్యారు. తలకు కండువా కట్టుకుని చేతిలో కర్ర పట్టుకొని, రైతులతో కలిసి కాసేపు ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. -
గద్దర్‌ను బెదిరించారు.. చిత్ర, విచిత్రాలెన్నో జరుగుతున్నాయి
చండూరు : మునుగోడులో తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఆయన శుక్రవారం చండూరులోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ అందజేశారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికలో నాటి నుంచి చిత్ర, విచిత్రాలెన్నో చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలలో గద్దర్ ప్రజా శాంతి పార్టీ తరుఫున పోటీ చేయకుండా కొంతమంది బెదిరించారని ఆయన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఆనాటి నుంచి నేటి వరకు అనేక విధాలుగా వెనుకబడి పోయిందన్నారు. తాను ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృషి పెట్టనున్నట్లు ప్రకటించారు. మునుగోడులో ప్రజాస్వామ్యం ఖూనీ హూజూరాబాద్ తర్వాత మళ్లీ మునుగోడులో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు అగ్రకుల పార్టీలు సిద్ధమయ్యాయని, ఓట్లను అత్యధిక రేటుకు కొనేందుకు ముందుకువస్తున్నాయని డీఎస్పీ (దళితశక్తి ప్రోగ్రాం) పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహరాజ్ మండిపడ్డారు. శుక్రవారం చండూరులో డీఎస్పీ అభ్యర్థి వేల్పుల గాలయ్య నామినేషన్ తరువాత నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. వేల కోట్ల సంపద ఉన్న అగ్రకుల అభ్యర్థులకు దీటుగా అట్టడుగు నిరుపేద అయిన వ్యక్తి గాలయ్యను బరిలో నిలుపుతున్నట్లు చెప్పారు. ఓట్లను అమ్మడం కొనడం పెద్ద నేరమని, గ్రామాల్లో మద్యం, డబ్బులు పంచుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలు రెడ్డి వర్గానికి టికెట్ ఇవ్వడం దుర్మార్గమన్నారు. మునుగోడులో ఉన్న రెండు లక్షల పది వేల ఓట్లున్న బీఎస్పీ, ఎస్సీ, ఎస్టీల పరిస్థితి ఏమిటని ఆయన అన్నారు. ఎన్నికల కమిషన్ అభ్యర్థుల ఖర్చును కేవలం రూ.40 లక్షల వరకు మాత్రమే పరిమితి విధిస్తే ఈపాటికే కోట్ల రూపాయలు ఖర్చు చేసిన నాయకుల పై చర్యలు ఏవని ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో డీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గా ప్రసాద్, హరీష్ గౌడ్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. (క్లిక్: మునుగోడు ఓటర్ల లెక్క తేలింది.. ఎంతంటే!) -
మునుగోడు బరిలో గద్దర్.. ఆ పార్టీ నుంచే పోటీ!
సాక్షి, హైదరాబాద్: ప్రజాగాయకుడు గద్దర్ ప్రజాశాంతి పార్టీ అభ్యర్ధిగా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక బరిలో దిగనున్నారు. గద్దర్‌ను ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానించామని, ఆహ్వానాన్ని మన్నించి తమ పార్టీలోకి వచ్చారని, ఆయనను మునుగోడు అభ్యర్థిగా ఖరారు చేశామని ఆ పార్ట అధినేత కేఏ పాల్ ప్రకటించారు. బుధవారం ఇక్కడ అమీర్‌పేట అపరాజిత కాలనీలోని ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో మీడియాతో కేఏ పాల్ మాట్లాడారు. ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్న తనతో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతోనే ఆయన ప్రజాశాంతి పార్టీ తరఫున ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారన్నారు. నోటు తీసుకుని ఓటు వేయడం రాజ్యాంగం ప్రకారం నేరమని, ఇదే విషయాన్ని ప్రజలందరి దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. నోటు తీసుకోకుండా నచ్చిన అభ్యర్థికి ఓటు వేయండనే నినాదంతో ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదం, మద్దతు కోసం వెంటనే ప్రచారం ప్రారంభిస్తామని తెలిపారు. ఉన్నత విలువలు కలిగి తెలంగాణ సమాజం కోసం తన జీవితాన్ని ధారపోస్తున్న గద్దర్ తమ పార్టీలోకి రావడం ఆనందంగా ఉందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో గద్దర్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఈ నెల 2న జరగాల్సిన ప్రపంచశాంతి సభకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తూ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను కేఏ పాల్ విరమించారు. ఆయనకు గద్దర్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. చదవండి: (KCR BRS Party: 'బీఆర్ఎస్ అభ్యర్థులతో పోటీ చేయించబోం') -
2న జింఖానా మైదానంలో ప్రపంచ శాంతి సభ
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ జింఖానా మైదానంలో అక్టోబర్ 2వ తేదీన ప్రపంచ శాంతి సభను నిర్వహించనున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్ వెల్లడించారు. 2న సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు సభ జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు. సికింద్రాబాద్‌లోని హరిహరకళా భవన్లో శాంతి సభ పోస్టర్‌ను ప్రజా గాయకుడు గద్దర్, ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ... శాంతి సభలకు 25 పార్టీల్లో 19 పార్టీలు మద్దతు ప్రకటించి రానున్నారని ఆయన వెల్లడించారు. ఆర్థిక అసమానతలను రూపు మాపేందుకు, ప్రపంచ శాంతి కోసం ఈ సభలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఈ సభలకు ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నామని... ఆయన వస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని రాకపోతే ప్రజలు, దేవుడి తీర్పుకు అంగీకరించాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. మునుగోడు ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ పోటీలో ఉందని ప్రజా గాయకులు గద్దర్‌తో పాటు మరికొంత మంది పేర్లు పరిశీలిస్తున్నామని చెప్పారు. సెప్టెంబర్ 25న తన పుట్టిన రోజు సందర్భంగా 59 మంది మునుగోడు నియోజకవర్గ నిరుద్యోగులకు, అక్టోబర్ 2వ తేదీన సభకు వచ్చిన నిరుద్యోగుల్లో లాటరీ ద్వారా అమెరికాలో ఉద్యోగాల కోసం పాస్ పోర్టుతో పాటు వీసాను కూడా అందిస్తామని చెప్పారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ... ప్రజలందరూ సమానంగా, సమాన హక్కులు పొందడం అనేది ప్రజాస్వామ్య దేశం లక్ష్యమన్నారు. ప్రజాస్వామ్యం బతికి ఉండాలంటే లౌకికవాదాన్ని పదికాలాలపాటు సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తాము ఈ శాంతి సభలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ క్రిష్టియన్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రవికుమార్, కన్వీనర్ జీ శ్యాం అబ్రహాం, వివిధ ప్రాంతాలకు చెందిన పాస్టర్లు, సంఘ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, బిషప్‌లు పాల్గొన్నారు. (క్లిక్ చేయండి: ఉప ఎన్నిక కోసమే ‘గిరిజన బంధు’) -
ప్రజా శాంతి పార్టీ రద్దు కాలేదు: కేఏ పాల్
సాక్షి, హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ రద్దయిందని కొంత మంది ప్రచారం చేస్తున్నారని తమ పార్టీ రద్దు కాలేదని ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఖండించారు. గురువారం సికింద్రాబాద్‌లోని హరిహరకళాభవన్‌లో నగరంలోని వివిధ చర్చిలకు చెందిన కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తదితరులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీకి కేవలం ఈసీ నోటీసులు మాత్రమే ఇచ్చిందని దానికి త్వరలోనే సమాధానం పంపిస్తామని ఆయన స్పష్టం చేశారు. అక్టోబర్ 2వ తేదీన శాంతి సమ్మిట్‌ను నగరంలో నిర్వహిస్తున్నామని కేసీఆర్ ఒక్క లేఖ ఇస్తే రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయలు తెప్పిస్తానని ఆయన అన్నారు. కేసీఆర్ ఫాం హౌస్‌లో 9 లక్షల కోట్ల డబ్బు, బంగారం దాచి ఉంచారని అందుకే అందులోకి ఎవరినీ పంపించరన్నారు. వేల పాటలు రాసి పాడిన గద్దర్‌కు భారతరత్న ఇవ్వాలన్నారు. గద్దర్ మాట్లాడుతూ మనుషులను ప్రేమించే మనిషే దైవమని అలాంటి వ్యక్తి యేసు క్రీస్తు అని అన్నారు. కార్యక్రమంలో ఆయా సంఘాల ప్రతినిధులు రవికుమార్, శ్యామ్, దయానంద్ తదితరులు పాల్గొన్నారు.