సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి పర్ఫెక్ట్ లీడర్ అని ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే సీఎం రేవంత్ రెడ్డి తాను విదేశీ పర్యటనలకు వెళ్ళాలనుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించనున్నామని వెల్లడించారు. ఈ మేరకు అసెంబ్లీ ఆవరణలో కేఏ పాల్ మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు అసెంబ్లీకి వచ్చినట్లు తెలిపారు.
అదానీ, అంబానీకి 25 లక్షల కోట్ల రూపాయిలు మాఫీ చేశారని కేఏ పాల్ ఆరోపించారు. గత 10 ఏండ్లలో 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని విమర్శించారు. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆర్ధిక బడ్జెట్ ను చక్కదిద్దాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రేవంత్ రెడ్డి మంచి చేస్తున్నాడని అన్నారు.
ఇదీ చదవండి: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment