
సాక్షి, విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజా శాంతి పార్టీ తరఫున పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేస్తామని.. అందుకు ఎంత డబ్బు ఖర్చు అయినా తానే భరిస్తానని ఆఫర్ ఇచ్చారు . సోమవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..
అభ్యర్థుల్ని ప్రకటించే టైంలో వేదిక మీద చంద్రబాబు పక్కనే ఉన్న పవన్‌లో బాధ కనిపించిందన్నారు. మరి చంద్రబాబు ఎన్ని కోట్లు ఇచ్చారో పవన్ ఎందుకు చెప్పలేకపోతున్నారోనని పాల్ ప్రశ్నించారు. ‘నీకు(పవన్‌ను ఉద్దేశించి..) ఓటు బ్యాంకు లేదు. డబ్బు తెచ్చే సత్తా లేదు. ప్రజలు ఛీ అంటుఉన్నారు. కానీ, ప్రజా శాంతి తరపున నీకు నేను 24 కాదు.. గతంలో చెప్పినట్లు 48 కాదు.. ఇప్పుడు మూడు రెట్లు అంటే 72 సీట్లు ఇస్తా. నిన్ను గెలిపిస్తా. నేను గెలిచి పార్లమెంట్‌కు వెళ్తా.. నిన్ను ఇక్కడ ముఖ్యమంత్రిని చేస్తా’’ అని పాల్ పవన్‌కు హామీ ఇచ్చారు.
అలాగే.. టీడీపీ జనసేనలు రాష్ట్రాన్ని దోచుకోవడానికి సంసిద్ధం అంటున్నాయని.. ఆ రెండు పార్టీలను నమ్మొద్దని ఏపీ ప్రజలకు కే ఏ పాల్ విజ‍్క్షప్తి చేశారు. వంగవీటి రంగాను చంపిన రక్తపు చేతుల్లోంచి(బాబును ఉద్దేశిస్తూ..) బయటకు రా అంటూ పవన్‌ను పాల్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment