
సాక్షి, హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ రద్దయిందని కొంత మంది ప్రచారం చేస్తున్నారని తమ పార్టీ రద్దు కాలేదని ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఖండించారు. గురువారం సికింద్రాబాద్‌లోని హరిహరకళాభవన్‌లో నగరంలోని వివిధ చర్చిలకు చెందిన కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తదితరులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీకి కేవలం ఈసీ నోటీసులు మాత్రమే ఇచ్చిందని దానికి త్వరలోనే సమాధానం పంపిస్తామని ఆయన స్పష్టం చేశారు.
అక్టోబర్ 2వ తేదీన శాంతి సమ్మిట్‌ను నగరంలో నిర్వహిస్తున్నామని కేసీఆర్ ఒక్క లేఖ ఇస్తే రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయలు తెప్పిస్తానని ఆయన అన్నారు. కేసీఆర్ ఫాం హౌస్‌లో 9 లక్షల కోట్ల డబ్బు, బంగారం దాచి ఉంచారని అందుకే అందులోకి ఎవరినీ పంపించరన్నారు.
వేల పాటలు రాసి పాడిన గద్దర్‌కు భారతరత్న ఇవ్వాలన్నారు. గద్దర్ మాట్లాడుతూ మనుషులను ప్రేమించే మనిషే దైవమని అలాంటి వ్యక్తి యేసు క్రీస్తు అని అన్నారు. కార్యక్రమంలో ఆయా సంఘాల ప్రతినిధులు రవికుమార్, శ్యామ్, దయానంద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment