peace
-
గాజా ఒప్పందం వేళ ట్విస్ట్!.. నెతన్యాహూ కీలక వ్యాఖ్యలు
గాజా శాంతి ఒప్పందం వేళ.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కీలక వ్యాఖ్యలు చేశారు. సరైన ఫ్రేమ్‌వర్క్ లేకుండా ఒప్పందం ముందుకు సాగదని.. అవసరమైతే మళ్లీ యుద్ధానికి దిగుతామని సంచలన వ్యాఖ్యలు అన్నారాయన. కాల్పుల విరమణ ఒప్పందం తొలి దశ ఇవాళ్టి నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అంతకంటే కొన్ని గంటల ముందు.. నెతన్యాహూ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.‘‘సరైన ఫ్రేమ్ వర్క్ లేకుండా ఒప్పందంలో ముందుకు వెళ్లలేం. తమ దగ్గర ఉన్న బంధీల జాబితాను హమాస్ విడుదల చేయాలి. వాళ్లలో ఎవరెవరిని ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారో స్పష్టత ఇవ్వాలి. అప్పుడే మేం ఒప్పందం ప్రకారం ముందుకు వెళ్తాం. ఇందులో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా.. మేం సహించబోం. తదుపరి పరిణామాలకు హమాసే బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు(Benjamin Netanyahu) తెలియజేశారు. హమాస్‌పై పూర్తిస్థాయి విజయం సాధిస్తేనే గాజా యుద్ధాన్ని(Gaza War) విరమిస్తామని.. అప్పటి వరకు పోరు ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గతంలో అనేక సందర్భాల్లో బహిరంగంగా ప్రకటిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు.. తాజాగా బంధీల జాబితా ఇవ్వాలంటూ ఆయన మెలిక పెట్టారు. దీంతో ఇవాళ్టి నుంచి ఒప్పందం అమలు అవుతుందా? అనే అనుమానాలు నెలకొంటున్నాయి.స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం నుంచి హమాస్, ఇజ్రాయెల్ మధ్య ఆరు వారాలపాటు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావాల్సి ఉంది. ఇజ్రాయెల్ కారాగారాల్లో మగ్గిపోతున్న పాలస్తీనియన్లు, పాలస్తీనా రాజకీయ పార్టీల నేతలను ఈ 42 రోజుల్లోపు ఇజ్రాయెల్ అధికారులు విడిచిపెట్టనున్నారు. మరోవైపు 2023 అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ శివారు గ్రామాలపై దాడిచేసి కిడ్నాప్ చేసి బందీలుగా ఎత్తుకెళ్లిన వారిలో కొందరిని హమాస్ విడిచి పెట్టాల్సి ఉంది. హమాస్ చెరలోని 460 రోజులకు పైగా బందీలుగా ఉన్నారన్నమాట!.హమాస్ చెరలో ఉన్న 98 బంధీల్లో.. 33 మందిని విడిచి పెట్టడంప్రతిగా.. తమ జైళ్లలో మగ్గుతున్న 2000 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ విడిచిపెట్టడంపదిహేను నెలలుగా రక్తమోడుతున్న గాజాలో బాంబుల మోత.. క్షిపణుల విధ్వంసం.. తుపాకుల అలజడి ఈ శాంతి ఒప్పందంతో ఆగనుంది. దోహా వేదికగా.. అమెరికా, ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్హమాస్ మధ్య గత బుధవారం కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో గాజా ఊపిరి పీల్చుకుంది. వాస్తవానికి ఇజ్రాయెల్ ప్రధాని ఎన్నడూ కాల్పుల విరమణ ఒప్పందానికి అంతగా ఆసక్తి చూపలేదు. యుద్ధం కొనసాగించడానికి మొగ్గు చూపుతూ.. ఏదో కారణంతో చర్చల ప్రక్రియను పక్కదోవ పట్టించే ప్రయత్నాలే చేస్తూ వచ్చారు. అయితే.. గతేడాది మే నెలలో బైడెన్ ప్రభుత్వం కాల్పుల విరమణకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు చేసింది. వాటికి హమాస్ సానుకూలంగా స్పందించింది. దీంతో అప్పుడే గాజాలో శాంతి నెలకొంటుందని అంతా భావించారు. కానీ, నెతన్యాహు మాత్రం ఆ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా గాజా నుంచి ఇజ్రాయెల్ దళాలను పూర్తిగా ఉపసంహరించడానికి అంగీకరించలేదు. కానీ, ఇప్పుడు కుదిరిన ఒప్పందంలోనూ రెండో దశలో గాజా నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ నిబంధన ఉంది. అందుకే ఒప్పందంలో తొలి దశ అమలైనా, రెండో దశకు ఇజ్రాయెల్ అంగీకారం తెలుపుతుందా? లేదా? అన్నది కీలకం కానుంది.ఇదీ చదవండి: కెనడా ప్రధాని రేసులో చంద్ర ఆర్య -
హమాస్-ఇజ్రాయెల్ ఒప్పందం, ఆ ఘనత ఎవరికంటే..
ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందం ఓ కొలిక్కి రావడంపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంధీలను విడిచిపెట్టడంతో(Gaza hostage release) పాటు కాల్పుల విమరణ ఒప్పందానికి సిద్ధపడడంతో ఇరువర్గాలను ట్రంప్ మెచ్చుకున్నారు. అయితే.. మరో ఐదు రోజుల్లో ఆయన వైట్‌హౌజ్‌లో అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసింది. ఈలోపే గాజా యుద్ధం ముగింపు దిశగా అడుగు పడడాన్ని ఆయన తన విజయంగా అభివర్ణించుకుంటున్నారు.‘‘కిందటి ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మేం చారిత్రక విజయం సాధించాం. ఆ ఫలితమే ఈ కాల్పుల విరమణ ఒప్పందం అని తన ట్రూత్ సోషల్‌లో ఓ పోస్ట్ ఉంచారు. నిబద్ధతతో కూడిన తన పరిపాలన.. శాంతి, సామరస్యంతో ప్రపంచానికి శక్తివంతమైన సంకేతాలను పంపిందని విశ్వసిస్తున్నట్లు చెబుతున్నారాయన. ఇజ్రాయెల్ సహా మా మిత్రపక్షాలతో మేం(అమెరికా) సత్సంబంధాలు కొనసాగిస్తాం. అలాగే.. గాజాను మళ్లీ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మార్చబోం అని ఆయన రాసుకొచ్చారు.తాజాగా హమాస్‌కు ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టకముందే హమాస్ ఉగ్రవాద సంస్థ (Hamas-led militants) చెరలో ఉన్న బందీలను విడిచిపెట్టాలని స్పష్టం చేశారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టేసరికి బందీలు తిరిగి రాకపోతే పశ్చిమాసియాలో ఆకస్మిక దాడులు జరుగుతాయని హెచ్చరించారు.కాగా, హమాస్‌కు ట్రంప్ ఇలా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం ఇదేమీ మొదటిసారి కాదు. గతేడాది డిసెంబర్లో కూడా తీవ్రంగా హెచ్చరించారు.పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు చల్లార్చేందుకు అమెరికా సహా పలు దేశాలు నిర్విర్వామంగా కృషి చేస్తూ వస్తున్నాయి. గాజా శాంతి స్థాపనకు మధ్యవర్తిత్వం వహించిన ఈజిప్ట్, ఖతార్‌ల పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయితే ఆ టైంలో(కిందటి ఏడాది మే చివర్లో) ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొత్త ఒప్పంద ప్రతిపాదనను తీసుకొచ్చారు. బందీల విడుదలతోపాటు కాల్పుల విరమణకు అందులో పిలుపునిచ్చారు. ఖతార్ ద్వారా హమాస్‌కు సైతం ఆ ఒప్పందం చేరవేశారు. ఇక గత కొన్ని వారాలుగా ఎడతెగక సాగిన చర్చలు, దఫదఫాలుగా బందీల విడుదలకు హమాస్ అంగీకరించడం, తమ కారాగారాల్లో మగ్గుతున్న వందలమంది పాలస్తీనియన్లను విడిచిపెట్టేందుకు ఇజ్రాయెల్ తలూపడం వంటి పరిణామాలు ఒప్పందం కుదిరేందుకు దోహదం చేశాయి.బైడెన్ ప్రతిపాదించిన ఒప్పందం ఇదే..మొదటి దశఇది ఆరు వారాలు కొనసాగుతుంది. ఇందులో ఇజ్రాయెల్-హామాస్ బలగాలు పూర్తిస్థాయిలో కాల్పుల విరమణను పాటించాలి. గాజాలోని జనాలు ఉండే ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ బలగాలు వెనుదిరగాలి. వందల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయాలి. ప్రతిగా మహిళలు, వృద్ధులు సహా పలువురు బందీలను హమాస్ అప్పగించాలి.రెండో దశసైనికులు సహా సజీవ ఇజ్రాయెలీ బందీలందరినీ హమాస్ విడిచిపెట్టాలి. గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా వెనక్కి వచ్చేయాలి.మూడో దశగాజాలో పునర్నిర్మాణ పనులు భారీస్థాయిలో ప్రారంభమవుతాయి. బందీలుగా ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోయినవారి అవశేషాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించాలి.అయితే.. బైడెన్ ప్రతిపాదించిన ఒప్పంద సూత్రాలకే ఇరు వర్గాలు అంగీకరించాయా? లేదంటే అందులో ఏమైనా మార్పులు జరిగాయా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. మధ్యవర్తులు చెబుతున్న సమాచారం ప్రకారం.. తొలి దశలో యుద్ధం నిలిపివేతపై చర్చలను ప్రారంభించడంతో పాటు, ఆరు వారాల పాటు కాల్పుల విరమణ పాటించాలి. హమాస్ చెరలో బందీలుగా ఉన్న సుమారు 100 మందిలో 33 మందిని ఈ సమయంలో విడిచిపెట్టాలి’’ అని ఉన్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. ప్రపంచమంతా ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న గాజా కాల్పుల విరమణ ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. ఖతార్ రాజధాని దోహా ఇందుకు వేదికైంది. 15 నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ బుధవారం ఇజ్రాయెల్-హమాస్‌లు ఓ అంగీకారానికి వచ్చినట్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ప్రతినిధులు ధృవీకరించారు. ఈ ఒప్పందంపై గురువారం ప్రకటన చేసేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సన్నద్ధమవుతున్నారు.ఖతార్ పాత్ర ప్రత్యేకం.. కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా, ఖతార్, ఈజిప్టులు మధ్యవర్తిత్వం వహించాయి. ఈక్రమంలో రెండుసార్లు కాల్పుల విరమణపై చర్చలు జరగ్గా అవి ఫలించలేదు. అయితే గాజాలో శాంతి స్థాపన కోసం ఖతార్ చేసిన మధ్యవర్తిత్వ ప్రయత్నాలు మొదటి నుంచి ఆసక్తికరంగా సాగాయి. 2012 నుంచి దోహాలో హమాస్ తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. దీంతో పశ్చిమాసియా ఉద్రిక్తతలను చల్లార్చే ప్రయత్నాల్లో ఖతార్ కీలకంగా వ్యవహరిస్తుందని తొలి నుంచి చర్చ నడుస్తోంది. అందుకు తగ్గట్లే ఖతార్ ఈ చర్చల్లో ముందుకు వెళ్లింది కూడా. అయితే ఒకానొక దశలో అమెరికా ప్రతిపాదించిన ఒప్పందంపై హమాస్ వెనక్కి తగ్గింది. దీంతో మధ్యవర్తిత్వం వహించే ప్రయత్నాలను ఖతార్ నిలిపివేసిందన్న కథనాలు చక్కర్లు కొట్టాయి. అయితే ఖతార్ వాటిని ఖండించింది. అదే సమయంలో దోహాలో హమాస్ కార్యకలాపాలను బహిష్కరించాలని అమెరికా ఇచ్చిన పిలుపును కూడా ఖతార్ పక్కన పెట్టి మరీ చర్చలకు ముందుకు తీసుకెళ్లి పురోగతి సాధించింది ఖతార్. గాజా బాధ్యత ఎవరిది?తాజా ఒప్పందంపై పలు అనుమానాలు నెలకొన్నాయి. ఈ ఒప్పందం ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధానికి శాశ్వత ముగింపు పలుకుతుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇజ్రాయెల్ బలగాలు గాజా నుంచి పూర్తిగా వెనక్కుమళ్లుతాయా?.. లేకుంటే పాక్షికంగానే జరుగుతుందా?. భవిష్యత్తులో కాల్పుల విరమణ ఉల్లంఘన జరగకుండా ఉంటుందా? అన్నింటికి మించి.. యుద్ధంతో నాశనమైన గాజా ప్రాంతాన్ని ఎవరు పాలిస్తారు? దాని పునర్నిర్మాణానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు అనే ప్రశ్నలపై స్పష్టత రావాల్సి ఉంది.ఒకవైపు కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించినట్లు హమాస్ తెలిపింది. అయితే ఒప్పందం తుది ముసాయిదాపై ఇంకా కసరత్తు జరుగుతోందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం పేర్కొంది. మరోవైపు తాజా ఒడంబడికకు నెతన్యాహు క్యాబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. కొద్ది రోజుల్లోనే ఈ లాంఛనం పూర్తికావచ్చని భావిస్తున్నారు. ఒప్పందం ఆదివారం నుంచి అమలులోకి వస్తుందని మధ్యవర్తిత్వం వహించిన ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్‌థానీ ప్రకటించారు.అక్టోబరు 7, 2023న సరిహద్దులు దాటి ఇజ్రాయెల్‌లో ప్రవేశించి 1200 మంది ఆ దేశ పౌరులను హతమార్చి, 250 మందిని బందీలుగా చేసుకోవడం ద్వారా హమాస్ మధ్య ఆసియాలో యుద్ధానికి బీజం వేసింది. హమాస్‌కు మద్దతుగా హెజ్బొల్లా, హూతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడులకు దిగాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. 46 వేల మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందారు.తాజా పరిణామం గాజాలో నిరాశ్రయులైన వేలమంది తిరిగి కోలుకోవడానికి, ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున మానవతా సహాయం అందడానికి ఉపకరించనుంది. -
Russia Ukraine War: నాటోలో చేర్చుకోండి.. యుద్ధం ఆపేస్తాం
కీవ్: ఉక్రెయిన్–రష్యా యుద్ధం రెండున్నరేళ్లుగా కొనసాగుతోంది. ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ అంతుబట్టడం లేదు. ఇరుదేశాల సైనికులు నీరసించిపోతున్నారు. శత్రుదేశంలో ఇక పోరాడలేమంటూ ఉక్రెయిన్, రష్యా జవాన్లు తేల్చిచెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధానికి ముగింపు పలకాలని రెండు దేశాలూ యోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఉక్రెయిన్ భూభాగంలోకి చొచ్చుకొచ్చిన రష్యా సైన్యం అక్కడే తిష్టవేసింది. తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ భూభాగాలు రష్యా నియంత్రణలోకి వెళ్లిపోయాయి. ఉక్రెయిన్‌లో ఐదింట ఒక వంతు భూభాగాన్ని రష్యా ఆక్రమించింది. సాంకేతికంగా, చట్టపరంగా ఇది ఉక్రెయిన్ పరిధిలోనిదే. అయినప్పటికీ ప్రస్తుతం దానిపై ఉక్రెయిన్ ప్రభుత్వానికి పట్టులేదు. మరోవైపు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో) కూటమిలో చేరికపట్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఉత్సాహం చూపిస్తున్నారు. కనీసం ఇప్పుడు తమ నియంత్రణలో ఉన్న భూభాగాన్ని అయినా నాటోలో చేర్చుకుంటే యుద్ధంతో అత్యంత కీలక దశను ముగించే అవకాశం ఉందని చెప్పారు. ఇదంతా చాలా వేగంగా జరగాలని అభిప్రాయపడ్డారు. తాజాగా స్కైన్యూస్ సంస్థకు జెలెన్స్కీ ఇంటర్వ్యూ ఇచ్చారు. తమ అ«దీనంలో ఉన్న ప్రాంతానికి పూర్తి భద్రత కల్పిస్తామంటూ హామీ ఇవ్వాలని నాటోను కోరారు. అలాగైతే కాల్పుల విరమణకు అంగీకరిస్తామని తెలిపారు. ఆ తర్వాత అంతర్జాతీయ సరిహద్దుల పరిధిలో ఉన్న మొత్తం భూభాగాన్ని.. రష్యా ఆక్రమించిన ప్రాంతాలతో సహా నాటోలో చేర్చుకోవాలని చెప్పారు. దాంతో రష్యా ఆక్రమించిన భూమిని దౌత్య మార్గాల్లో మళ్లీ తాము స్వా«దీనం చేసుకొనే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం కల్పిస్తే రష్యాతో యుద్ధాన్ని ఆపేయడానికి సిద్ధంగా ఉన్నామని జెలెన్స్కీ స్పష్టంచేశారు. కానీ, సభ్యత్వం విషయంలో నాటో దేశాల నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని వెల్లడించారు. మరోవైపు ఉక్రెయిన్ను ఇప్పటికిప్పుడు తమ కూటమిలో చేర్చుకోవడానికి నాటోలోని కొన్ని దేశాలు ఇష్టపడడం లేదని సమాచారం.ఇది కూడా చదవండి: మహా కుంభమేళాకు ఐఆర్సీటీసీ ప్రత్యేక ఏర్పాట్లు.. టిక్కెట్ల బుకింగ్ షురూ -
ఉమ్మడి భద్రత కోసం పనిచేయాలి: జిన్‌పింగ్
కజన్: గ్లోబల్ సౌత్ దేశాలు కలిసికట్టుగా ఆధునికత దిశగా ముందుకు సాగుతుండడం ప్రపంచ చరిత్రలో, మానవ నాగరికతలో అపూర్వమైన ఘట్టమని చైనా అధినేత జిన్‌పింగ్ ప్రశంసించారు. శాంతి, ఉమ్మడి భద్రత కోసం బ్రిక్స్ ప్లస్ దేశాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన బ్రిక్స్ ఔట్రీచ్ సదస్సులో ప్రసంగించారు. బ్రిక్స్‌ప్లస్ దేశాల శాంతి ప్రపంచ శాంతితో ముడిపడి ఉందన్నారు. ఉమ్మడి ప్రగతి కోసం ఆయా దేశాలన్నీ స్వయంగా చోదక శక్తిగా మారాలని సూచించారు. దేశాల మధ్య సమాచార మారి్పడి, సంప్రదింపులు మరింత పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రపంచ పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ గ్లోబల్ సౌత్‌ను ఎప్పటికీ తమ గుండెల్లో నిలుపుకుంటామని జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. తమ మూలాలను మర్చిపోవడం లేదన్నారు. ముగిసిన బ్రిక్స్ సదస్సు రష్యాలో మూడు రోజులపాటు జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు గురువారం ముగిసింది. బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా సభ్యదేశాలు కాగా, కొత్తగా ఇరాన్, ఈజిప్టు, ఇథియోపియా, యూఏఈ, సౌదీ అరేబియా సభ్యదేశాలుగా చేరాయి. కూటమిలో సభ్యత్వం కోసం తుర్కియే, అజర్బైజాన్, మలేసియా దరఖాస్తు చేసుకున్నాయి. మరికొన్ని దేశాలు సైతం బ్రిక్స్‌లో చేరడానికి ఆసక్తి ప్రదర్శించాయి. ముగింపు సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రసంగించారు. రష్యాను ఒంటరిని చేసేందుకు అమెరికా సాగించిన ప్రయత్నాలు ఫలించలేదని చెప్పారు. ప్రపంచంలో బ్రిక్స్ పాత్రను పశి్చమ దేశాలకు ప్రత్యామ్నాయంగా అభివరి్ణంచారు. -
హెజ్బొల్లాను అంతమే మా లక్ష్యం: నెతన్యాహు
లెబనాన్ సరిహద్దుల్లో పని చేస్తున్న ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ సిబ్బందిని టార్గెట్‌గా ఇజ్రయెల్ సైన్యం దాడులు చేస్తుందని వస్తున్న ఆరోపణలను ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. ఆ ఆరోపణలన్నీ అసత్యాలని స్పష్టం చేశారు. ప్రధాని నెతన్యాహు మీడియతో మాట్లాడుతూ.. లెబనాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతల మధ్య నెలకొన్న క్రమంలో ఐక్యరాజ్యసమితి శాంతిపరిక్షణ సైనికుల సిబ్బందిని ఆ ప్రాంతంలో తాత్కాలికంగా విధులు ఉపసంహరించుకోవాలని మరోసారి కోరారు.‘‘హెజ్బొల్లా లక్ష్యాలపై దాడి చేస్తున్న సమయంలో లెబనాన్‌లోని ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షణ(UNIFIL) సిబ్బందికి హాని కలిగించకుండా ఉండేందుకు ఇజ్రాయెల్ సైన్యం కృషి చేస్తోంది. అయితే ఉద్రిక్తతలు కొనసాగుతున్న లెబనాన్ సరిహద్దు ప్రాంతాన్ని తాత్కాలికంగా విడిచిపెట్టాలని యూఎన్‌ఎఫ్‌ఐఎల్‌ను ఇజ్రాయెల్ పదేపదే కోరుతోంది. హెజ్బొల్లా టెర్రరిస్టులను నిర్మూలించేందుకు లెబనాన్‌లోకి దాడులో ప్రారంభించిన రోజున ఈ విషయాన్ని యూఎన్‌ఎఫ్‌ఐఎల్ సభ్యులకు తాను విజ్ఞప్తి చేశాను... మా పోరాటం యూఎన్‌ఎఫ్‌ఐఎల్, లెబనాన్ ప్రజలతో కాదు. ఇజ్రాయెల్‌పై దాడి చేయడానికి లెబనాన్ భూభాగాన్ని ఉపయోగించుకునే.. ఇరాన్ అనుబంధ హెజ్బొల్లా గ్రూప్‌తో మా సైన్యం పోరాటం చేస్తుంది. మా హమాస్ మారణకాండ జరిగిన తర్వాత నుంచి దాడులు చేస్తూనే ఉంది. అయితే లెబనాన్‌లో హెజ్బొల్లా గ్రూప్‌ను అంతం చేయటమె ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ లక్ష్యం’’ అని అన్నారు.చదవండి: కెనడా ప్రధాని ట్రూడో నోట మళ్లీ పాత పాటే.. -
ప్రకృతిని కాపాడుకుందాం, ఈ పనులు అస్సలు చేయకండి!
పర్యాటకులు ప్రతి ఒక్కరూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తారు. అది అభిరుచి. అలాగే ప్రకృతిని ప్రేమించాలి. అది బాధ్యత. ఎకో టూరిజమ్‌లో ఏం చేయాలి, ఏం చేయకూడదనే నియమావళి స్పష్టంగా ఉంది. ప్రతీ సంవత్సరం సెప్టెంబరు 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటారు. జాతీయ పర్యాటక దినోత్సవాన్ని 1970లో ఎంపికచేశారు. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం గురించి అవగాహన పెంచడం దీని లక్ష్యం. పర్యాటకం ప్రాధాన్యత, సామాజిక, సాంస్కృతిక , ఆర్థిక అభివృద్ధికి ఎలా దోహదపడుతుందో అవగాహన కల్పించడం, పర్యావరణానికి హాని కలిగించే ప్లాలాస్టిక్ బాటిళ్లు, ఒకసారి వాడి పారేసే పాలిథిన్ కవర్లను తీసుకెళ్లరాదు.పిల్లలు, డయాబెటిస్ పేషెంట్లు, పెద్దవాళ్లతో వెళ్లేటప్పుడు బ్రెడ్, బిస్కట్, చాక్లెట్ల వంటివి దగ్గర ఉంచుకోవడం తప్పనిసరి. అలాంటప్పుడు తమతో తీసుకువెళ్లిన నాన్ డీ గ్రేడబుల్ వస్తువులను పర్యాటక ప్రదేశంలో పడవేయకుండా అక్కడ ఏర్పాటు చేసిన మున్సిపాలిటటీ డస్ట్బిన్లలో వేయాలి. పవిత్రస్థలాలు, సాంస్కృతిక ప్రదేశాలు, స్మారకాలు, ఆలయాలు ప్రార్థనామందిరాలు ఇతర ధార్మిక ప్రదేశాలలో స్థానిక విశ్వాసాలకు అనుగుణంగా వ్యవహరించాలి.నేచర్ ప్లేస్‌లకు వెళ్లినప్పుడు శబ్దకాలుష్యాన్ని నివారించాలి. రేడియో, టేప్‌రికార్డర్, డీజే, మైక్‌లు పెద్ద సౌండ్‌తో పెట్టకూడదు. మలమూత్ర విసర్జన కోసం గుడారాల వంటి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకునేటప్పుడు వాటర్బాడీలకు కనీసం వంద అడుగుల దూరాన్ని ΄ాటించాలి. అలాగే విసర్జన తర్వాత మట్టి లేదా ఇసుకతో కప్పేయాలి.పర్యాటక ప్రదేశాల్లో ఫొటోలు తీసుకునేటప్పుడు ఇతరులకు ఇబ్బంది కలిగించరాదు. వారితో కలిసి ఫొటో తీసుకోవాలనుకుంటే వారి అనుమతితో మాత్రమే తీసుకోవాలి. వారికి తెలియకుండా వారిని ఫ్రేమ్‌లోకి తీసుకునే ప్రయత్నం చేయరాదు.చెట్ల ఆకులు, కొమ్మలు, గింజలు, కాయలు, పూలను కోయరాదు. ఇది నేరం కూడా. నియమాన్ని ఉల్లంఘిస్తే శిక్ష తప్పదు. ముఖ్యంగా హిమాలయాల వంటి సున్నితమైన ప్రదేశాల్లో జీవవైవిధ్యత సంరక్షణ కోసం నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. నది, కాలువ, సరస్సు, తటాకాల్లో సబ్బులతో స్నానం చేయడం, దుస్తులు ఉతకడం నిషిద్ధం.నిప్పు రవ్వలు ఎగిరిపడితే అడవులు కాలిపోతాయి. కాబట్టి అడవులలో వంట కోసం కట్టెలతో మంట వేయరాదు. అలాగే సిగరెట్ పీకలను కూడా నేలమీద వేయకూడదు.అడవుల్లో ఆల్కహాల్, డ్రగ్స్ సేవనం, మత్తు కలిగించేవన్నీ నిషేధం. స్థానికులకు చాక్లెట్లు, స్వీట్స్, ఆహారపదార్థాల ఆశ చూపించి వారిని ప్రభావితం చేసే ప్రయత్నం చేయరాదు. అలాగే ఆయా ప్రదేశాల్లో నెలకొన్న సంప్రదాయ విశ్వాసాలను గౌరవించాలి. వారి అలవాట్లను హేళన చేయరాదు. -
హసీనాపై కఠిన వైఖరి వద్దు: అమెరికాను కోరిన భారత్ !
వాషింగ్టన్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను పదవి నుంచి దించడం వెనుక అమెరికా కుట్ర ఉందన్న ప్రచారం నేపథ్యంలో అమెరికా మీడియా కథనాలు చర్చనీయాంశమవుతున్నాయి. హసీనాను ఒత్తిడికి గురిచేయొద్దని గతంలో భారత్ అధికారులు అమెరికాను కోరినట్లు వాషింగ్టన్ పోస్టు పత్రిక ఓ కథనం ప్రచురించింది. బంగ్లాదేశ్‌లో ప్రతిపక్షాలు బలపడితే ఆ దేశం ఇస్లామిక్ అతివాద శక్తుల కేంద్రంగా మారుతుందని, ఇది భారత్ జాతీయ భద్రతకు సవాళ్లను విసురుతుందని అమెరికాకు భారత్ తెలిపినట్లు కథనంలో రాసుకొచ్చారు. హసీనాపై కఠిన వైఖరి వద్దని అమెరికాను భారత విదేశాంగవర్గాలు కోరినట్లు కథనం సారాంశం. 2024 ఎన్నికలకు ముందు బంగ్లాదేశ్‌లో పలువురిని జైళ్లలో వేయడంపై అమెరికా దౌత్యవేత్తలు విమర్శించారు. అమెరికా ప్రభుత్వం కూడా బంగ్లాదేశ్‌కు చెందిన కొందరు పోలీసులపై అప్పట్లో ఆంక్షలు విధించింది. ఈ విభాగం నేరుగా హసీనా కింద పనిచేస్తుందనే ఆరోపణలున్నాయి. దేశంలో హింస చెలరేగడంతో షేక్‌హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వచ్చి ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. హసీనా దేశం విడిచిన బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్నట్లు వార్తలు వస్తుండటం గమనార్హం. -
India vs China: టగ్ ఆఫ్ వార్‌లో భారత బలగాల గెలుపు
ఖార్టూమ్: చైనా బలగాలపై భారత్ సైనికులు పైచేయి సాధించారు. ఇది యుద్ధంలో కాదు..! ఐక్యరాజ్యసమితి పీస్ కీపింగ్ మిషన్‌లో భాగంగా సుడాన్లో నిర్వహించిన ‘టగ్ ఆఫ్ వార్’ పోటీలో చైనాను భారత బలగాలు ఓడించాయి. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.#WATCH | Indian troops won a Tug of War that took place between them and Chinese troops during deployment in Sudan, Africa under a UN Peacekeeping mission: Army officials (Viral video confirmed by Indian Army officials) pic.twitter.com/EpnGKURPa3— ANI (@ANI) May 28, 2024 టాగ్ ఆఫ్ వార్ పోటీలో భారత్, చైనా బలగాలు పోటీ పడ్డాయి. ఈ పోటీలో భారత్ బలగాలు టీం వర్క్, అద్భుతమైన పట్టుదలతో కూడిన సామర్థాన్ని ప్రదర్శించి చైనా బలగాలను ఓడించారు. స్నేహ పూర్వకంగా జరిగిన ఈ పోటీ.. అక్కడ ఉన్న మిగతా సైనికుల్లో ఉత్సాహాన్ని నింపింది.యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ ద సూడాన్(UNMIS) ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిబంధనలతో 24 మార్చి, 2005 ఏర్పాటైంది. ఈ క్రమంలోనే సూడాన్ ప్రభుత్వం, సూడాన్ పీపుల్స్ లిబరేషన్ మూవ్మెంట్ మధ్య 9 జనవరి, 2005లో శాంతి ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి సూడాన్ శాంతి ఒప్పందానికి సంబంధించి పలు కార్యక్రమాలు చేపడుతోంది. మానవతా సాయం, మానవ హక్కుల పరిరక్షణ, ఆఫ్రికా యూనియన్ మిషన్‌కు మద్దతు పలకటం వంటి కార్యక్రమాలను చేపడుతోంది. అందులో భాగంగా నిర్వహించినదే భారత్-చైనా మధ్య నిర్వహించిన టగ్ ఆఫ్ వార్ స్నేహపూర్వక పోటీ అని అధికారులు తెలిపారు. -
ఆస్కార్ రెడ్ కార్పెట్: ఆ స్టార్ల రెడ్ పిన్ కథేమిటి?
ఆస్కార్ 2024 సంరంభం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రపంచ సినిమా రంగంలో నోబెల్ అవార్డులుగాభావించే ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో హాలీవుడ్ తారలు రెడ్ కార్పెట్‌పై ప్రత్యేకంగా కనిపించారు. 96వ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో పలువురు సెలబ్రిటీలు స్టార్లు అంతా రెడ్ పిన్లు ధరించడం విశేషంగా నిలిచింది. వీరి ఫోటోలు వైరల్ గా మారాయి. భీకర బాంబుల దాడులతో దద్దరిల్లిన గాజాలో తక్షణ, శాశ్వత కాల్పుల విరమణ కోసం పిలుపునిస్తూ వారంతా రెడ్ పిన్‌లను ధరించారు. అలాగే కాల్పుల విరమణకు పిలుపు నివ్వమని అమెరికా అధ్యక్షుడు బిడెన్‌ను కోరుతూ ఒక బహిరంగ లేఖపై సంతకం చేశారు. ఇజ్రాయెల్, గాజాలో హింసను అరికట్టడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ యుద్ధంలో వేలాదిమంది, ముఖ్యంగా చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. గాజాలో శాంతిని కోరుతూ ఈ నిర్ణయం తీసుకున్నామని 'పూర్ థింగ్స్' నటుడు రమీ యూసఫ్ తెలిపారు. ప్రతి ఒక్కరి భద్రతకో పిలుపునిస్తున్నామనీ, పాలస్తీనా ప్రజలకు శాశ్వత న్యాయం , శాంతి కలిగేలా చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నామన్నారు. అరచేతిలో ఒక నల్ల రంగు గుండెతో డిజైన్ చేసిన ఈ రెడ్ పిన్నులను ఆర్టిస్ట్4సీజ్ఫైర్ అనే సంస్థ తయారు చేసింది. -
కౌగిలింత ఎందుకు? పసివాళ్లను హగ్ చేసుకుంటే ఏమొస్తుంది?
ప్రేమికులకు వాలెంటైన్ వీక్‌లోని ప్రతి రోజు చాలా ప్రత్యేకమైనదే. ఫిబ్రవరి 12ను వాలెంటైన్ వీక్‌లో ‘హగ్ డే’గా జరుపుకుంటారు. ఈ రోజున ప్రేమికులు మాత్రమే కాదు.. ఆప్యాయతను అందుకునేవారంతా తమకు ఇష్టమైనవారిని కౌగిలించుకోవాలని, తమ మనసులోని భావాలను వారితో పంచుకోవాలని చెబుతుంటారు. ఇంతకీ కౌగిలింతతో వచ్చే లాభాలేమితో ఇప్పడు తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో ఒక వైపు పని భారం, మరోవైపు కుటుంబ బాధ్యతలు, దీనికితోడు ఎన్నో సమస్యలు.. వీటన్నింటి మధ్య మనిషి ఒత్తిడితో సతమతమవుతున్నాడు. అలాంటి సమయంలో కౌగిలింత (హగ్) అనేది ఒక అద్భుత వరమని, అది ప్రశాంతతకు దోహదపడుతుందని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఒత్తిడి మాయం కావలించుకోవడమనేది ఒక మంచి ఫీలింగ్‌ని కలిగిస్తుంది. మనం బాధలో ఉన్నప్పుడు సన్నిహితులను కావలించుకుంటే మనసుకు ఓదార్పు లభిస్తుంది. అంతేకాదు ఆరోగ్యం మెరుగు పడుతుంది. అందుకే మీరు పార్ట్నర్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కు మీ ఆప్యాయమైన కౌగిలింత అందించి, వారి ఒత్తిడిని దూరం చేయడంతోపాటు మీలోని ఒత్తిడిని కూడా తొలగించుకునే ప్రయత్నం చేయాలని అంటున్నారు మానసిక వైద్య నిపుణులు. బరువు తగ్గడంలోనూ.. బరువు పెరగడానికి గల కారణాల్లో ఒత్తిడి కూడా ఒకటి. టెన్షన్, పని ఒత్తిడి రోజూ అందరికీ ఉంటుంది. ఇటువంటి సమయాల్లో కొందరు ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుంటారు. అలాంటి వారికి ఆత్మీయుల కౌగిలింత వారిలోని ఒత్తిడిని మటుమాయం చేస్తుంది. తద్వారా వచ్చే రిలాక్సేషన్ బరువు తగ్గడానికీ దోహదపడుతుంది. 10 సెకన్ల కౌగిలింత అనేక సమస్యలకు ఉపశమనంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రక్తపోటుకు వైద్యం మనకు ఆప్యాయతను అందించేవారిని 20 సెకన్ల పాటు హగ్ చేసుకుంటే మనలోని ఒత్తిడి తగ్గి, రక్తపోటు కూడా నియంత్రణలోకి వస్తుందట. అందుకే బీపీ కంట్రోల్లో ఉండాలనుకుంటే ఆత్మీయులను కౌగిలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పసివాళ్లను హగ్ చేసుకుంటే.. అప్పుడే పుట్టిన బిడ్డను తల్లి తన దగ్గరికి తీసుకుని హత్తుకుంటుంది. దీంతో ఆ తల్లి అప్పటి వరకూ పడిన నొప్పులన్నింటినీ మరచిపోతుంది. అలాగే తల్లి కౌగిలింత పిల్లలకు సురక్షితంగా ఉన్నామనే భరోసానిస్తుంది. అది వారు ఆరోగ్యంగా పెరిగేందుకు దోహద పడుతుంది. ఇదేవిధంగా పసివాళ్లను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటే ఎవరికైనా సరే మనసుకు స్వాంతన లభిస్తుందని మానసిక వైద్య నిపుణులు చెబుతుంటారు. -
Bharat Jodo Nyay Yatra: అన్యాయాన్ని ప్రశ్నించేందుకే...
థౌబాల్/ఇంఫాల్: జాతుల ఘర్షణలతో అట్టుడికిపోతున్న కల్లోల మణిపూర్ రాష్ట్రానికి శాంతి, సామరస్యం తిరిగి తీసుకొస్తామని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. మణిపూర్‌లోని థౌబాల్ నుంచి ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు ఆదివారం ఆయన శ్రీకారం చుట్టారు. తొలుత ఖోంగ్జామ్ యుద్ధ స్మారకం వద్ద నివాళులర్పించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. ఘర్షణలతో రాష్ట్రంలో లక్షలాది మంది అమాయకులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కన్నీళ్లు తుడిచేందుకు, చేయూతనిచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికీ రాకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ దృష్టిలో మణిపూర్ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం కాకపోవచ్చని ఆక్షేపించారు. ‘‘మీ బాధను వారి బాధగా భావించడం లేదు. కానీ మీ దుఃఖాన్ని, మీకు తగిలిన గాయాలు, మీరెదుర్కొంటున్న విచారాన్ని మేం అర్థం చేసుకున్నాం’’ అని చెప్పారు. బాధితులు ఆప్యాయతను కోరుకుంటున్నారని రాహుల్ అన్నారు. ప్రజల ‘మన్ కీ బాత్’ వింటాం దేశంలో అన్యాయ కాలం కొనసాగుతున్నందు వల్లే న్యాయ యాత్ర చేపట్టాల్సి వచ్చిందని రాహుల్ పేర్కొన్నారు. ప్రజలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్యాయాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజలను ఏకం చేయాలన్నదే ఈ యాత్ర ఉద్దేశమని వివరించారు. సమానత్వం, సౌభ్రాతృత్వం, సామరస్యంతో కూడిన ‘న్యూ విజన్ ఆఫ్ ఇండియా’ను సాధించడం ధ్యేయమని స్పష్టం చేశారు. ‘‘ఈ యాత్రలో ప్రజల ‘మన్ కీ బాత్’ వింటాం. ప్రజలను నేరుగా కలుసుకొని, వారి సమస్యలు అడిగి తెలుసుకుంటాం’’ అని వెల్లడించారు. బీజేపీ క్షుద్ర రాజకీయాల వల్ల మణిపూర్‌లో శాంతి, సామరస్యం కనుమరుగు అయ్యాయని రాహుల్ ద్వజమెత్తారు. సమాజంలో విద్వేషం, హింస, అరాచకత్వానికి స్థానం ఉండకూడదని చెప్పారు. దేశ సంపద కొందరి జేబుల్లోకి వెళ్తోందని రాహుల్ ఆరోపించారు. ఒకరిద్దరు వ్యాపారవేత్తలు మొత్తం ఆర్థిక వ్యవస్థపై గుత్తాధిపత్యం సాధిస్తున్నారని మండిపడ్డారు. అన్ని వ్యాపారాల్లోకి వారు ప్రవేశిస్తున్నారని, ఫలితంగా చిన్న, మధ్య తరహా వ్యాపారాలు మూతపడుతున్నాయని పేర్కొన్నారు. నిరుద్యోగం, ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని గుర్తుచేశారు. దేశ జనాభాలో అధిక భాగం ఉన్న కింది కులాలు, దళితులు, గిరిజనులకు రాజకీయ వ్యవస్థలో, ప్రభుత్వ పాలనా వ్యవస్థలో భాగస్వామ్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాలన్నింటినీ యాత్రలో లేవనెత్తుతామని తెలిపారు. రాహుల్ యాత్రలో బీఎస్పీ బహిష్కృత ఎంపీ డానిష్ అలీ ఇటీవల బీఎస్పీ నుంచి బహిష్కరణకు గురైన లోక్‌సభ సభ్యుడు డానిష్ అలీ రాహుల్‌తో పాటు యాత్రలో పాల్గొన్నారు. ఆయన కాంగ్రెస్‌లో చేరతారని తెలుస్తోంది. రాహుల్ యాత్రపై మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో ఘర్షణలింకా ఆగలేదు. ఇలాంటప్పుడు యాత్ర పేరుతో పరిస్థితిని దిగజార్చడానికి వచ్చారా?’’ అంటూ మండిపడ్డారు. -
దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు!
నూతన సంవత్సరం-2024 సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు అందరికీ శ్రేయస్సు, శాంతి, మంచి ఆరోగ్యం సమకూరాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. మైక్రో-బ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’(గతంలో ట్విట్టర్)లో ‘ప్రతి ఒక్కరికీ 2024 అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం అందరికీ శ్రేయస్సు, శాంతి, మెరుగైన ఆరోగ్యం సమకూరాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 అందరికీ సంతోషాన్ని, శాంతిని, శ్రేయస్సును అందించాలని కోరుకుంటున్నాను. సమ్మిళిత, స్థిరమైన, అభివృద్ధికి దోహదపడే కొత్త నిబద్ధతతో నూతన సంవత్సరాన్ని స్వాగతిద్దాం’ అని ఆమె ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ ఇలా రాశారు ‘ప్రతి భారతీయునికి 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం అందరికీ శాంతి, శ్రేయస్సు, ఆనందాన్ని అందించాలని కోరుకుంటున్నాను. భారతదేశ పురోగతి, శ్రేయస్సుకు దోహదపడే దృఢ నిబద్ధతతో నూతన సంవత్సరాన్ని ప్రారంభిద్దాం’ అని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దేశప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘2024 నూతన సంవత్సరం సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు' అని రాశారు. భారతదేశంతో పాటు ప్రపంచమంతా 2024కు ఘనంగా స్వాగతం పలికింది. ఇది కూడా చదవండి: 2024.. దునియాలో ఏం జరగనుంది? "Wishing everyone a splendid 2024": PM Modi extends New Year wishes to people Read @ANI Story | https://t.co/mlu0Wa1zb2#PMModi #NewYear #NewYears2024 pic.twitter.com/k4j6q3NyPn — ANI Digital (@ani_digital) January 1, 2024 -
Israel Hamas war: నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
జెరూసలెం: ఉగ్రవాద సంస్థ హమాస్ పూర్తిగా నాశనమైన తర్వాతే గాజాలో శాంతి సాధ్యమవుతుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తేల్చిచెప్పారు. తాజాగా క్రిస్మస్ రోజు గాజాలో పర్యటించిన నెతన్యాహు తర్వాత ఇజ్రాయెల్ తిరిగి వచ్చి తన పార్టీ(లికుడ్) మీటింగ్‌లో మాట్లాడారు. రాబోయే రోజుల్లో హమాస్‌ను నాశనం చేయడమే లక్ష్యంగా దాడులు మరింత తీవ్రం చేస్తామని నెతన్యాహు తెలిపారు.క్రిస్మస్ రోజు గాజాలో శరణార్థుల క్యాంపు మీద ఇజ్రాయెల్ జరిపిన దాడులపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్‌వో) రిపోర్టు చేసిన తర్వాత నెతన్యాహు ప్రకటన వెల్లడవడం గమనార్హం. ‘హమాస్ పూర్తిగా నాశనమవ్వాలి. గాజా డీ మిలిటరైజ్ కావాలి. పాలస్తీనా సొసైట్ రాడికల్ ఫ్రీగా మారాలి. గాజాలో శాంతి నెలకొల్పడానికి ఈ మూడు లక్ష్యాలు పూర్తవ్వాలి. అప్పుడే గాజాలో శాంతిపై పాలస్తీనాతో శాంతి ఒప్పందం చేసుకుంటాం’ అని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇదీచదవండి..అమెరికా ఎన్నికలు.. ట్రంప్ క్యాంపెయిన్‌లో ఆమె కీ రోల్ ! -
కేంద్రంతో మణిపూర్ తిరుగుబాటు సంస్థ శాంతి ఒప్పందం
ఇంఫాల్: మణిపూర్ శాంతి ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మణిపూర్‌లో తిరుగుబాటు గ్రూపు యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యుఎన్ఎల్ఎఫ్) కేంద్ర ప్రభుత్వంతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ ఒప్పందంతో ఈశాన్య భారతంలో శాంతి నెలకొల్పే ప్రయత్నంలో కీలక పురోగతి జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. మే3న మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు జరిగిన తర్వాత ఓ నిషేధిత సంస్థ ప్రభుత్వంతో శాంతి చర్చలు జరపడం ఇదే తొలిసారి. The peace agreement signed today with the UNLF by the Government of India and the Government of Manipur marks the end of a six-decade-long armed movement. It is a landmark achievement in realising PM @narendramodi Ji's vision of all-inclusive development and providing a better… pic.twitter.com/P2TUyfNqq1 — Amit Shah (@AmitShah) November 29, 2023 శాంతి ఒప్పందాన్ని ప్రకటించిన అమిత్ షా.. "మణిపూర్‌లోని పురాతన సాయుధ సంస్థ యూఎన్ఎల్ఎఫ్ హింసను త్యజించి జన స్రవంతిలో చేరడానికి అంగీకరించింది. వారిని ప్రజాస్వామ్యంలోకి స్వాగతిస్తున్నాం. శాంతి, అభివృద్ధి ప్రయాణంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అని ట్వీట్టర్ వేదికగా తెలిపారు. కాల్పుల ఒప్పందంలో భాగంగా సాయుధులు ఆయుధాలను అప్పగిస్తున్న వీడియోను షేర్ చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఎనిమిది మైతీ తీవ్రవాద సంస్థలపై ఉన్న నిషేధాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నవంబర్ 13న పొడిగించింది. వాటిని చట్టవిరుద్ధమైన సంఘాలుగా ప్రకటించింది. ఈ నిషేధిత సంస్థల్లో యూఎన్ఎల్ఎఫ్ కూడా ఉంది. యూఎన్ఎల్ఎఫ్ సంస్థ శాంతి ఒప్పందం గురించి సీఎం బీరేన్ సింగ్ నవంబర్ 26నే ప్రకటించారు. ఇదీ చదవండి: 41 మంది కార్మికులతో ప్రధాని మోదీ సంభాషణ -
స్వాతంత్య్రానంతరం కశ్మీర్ శక్తిపీఠంలో నవరాత్రులు
కశ్మీర్‌ను భూతల స్వర్గం అంటారు. ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ఎవరైనా ఇట్టే ఆకర్షితులవుతారు. అయితే ఇక్కడ వేళ్లూనుకున్న వేర్పాటువాదం దశాబ్దాలుగా లోయను కట్టుబాట్లకు గురిచేసింది. అయితే భారత సైనికుల త్యాగం, ధైర్యసాహసాల కారణంగా ఇప్పుడు లోయలో ప్రశాంతత నెలకొంది. ఈ నేపధ్యంలో ఇప్పుడు తొలిసారిగా శారదా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. పీఓకే నుండి కేవలం 500 మీటర్ల దూరంలోని కుప్వారా పరిధిలోని టిట్వాల్ గ్రామంలో శారదామాత ఆలయం ఉంది. మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఈ ఆలయంలో నవరాత్రి పూజలు ఎప్పుడూ నిర్వహించలేదు. అయితే ప్రస్తుతం ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఆలయం శతాబ్దాల క్రితం నాటిదని చెబుతారు. ఈ ఆలయం దేశంలోని 18 మహా శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణిస్తారు. ప్రస్తుతం కశ్మీర్లో టూరిజం వేగంగా అభివృద్ధి చెందుతున్నది. దీంతో రానున్న రోజ్లులో కుప్వారాలోని ఈ దేవాలయానికి మరింత ఆదరణ దక్కనున్నదని స్థానికులు అంటున్నారు. కశ్మీర్ ఒకప్పుడు దేశానికి ఆధ్యాత్మికత రాజధాని. ప్రపంచం నలుమూలల నుండి ఆధ్యాత్మిక అభిరుచిగలవారు ఇక్కడ సమావేశం అయ్యేవారు. అందుకే ఇక్కడ ఎన్నో గొప్ప దేవాలయాలు నిర్మితమయ్యాయని చెబుతారు. మనం ఇప్పుడు చెప్పుకుంటున్న శారదామాత దేవాలయం మొదటి శతాబ్దంలో కుషాణుల సామ్రాజ్య కాలంలో నిర్మితమయ్యింది. ఇప్పటికీ ఇక్కడ అనేక దేవాలయాలు శిథిలావస్థలో కనిపిస్తాయి. అయితే ప్రస్తుతం భారత ప్రభుత్వం ఈ దేవాలయాలను పునరుద్ధరించే పనిలో పడింది. ఇది కూడా చదవండి: యూదుల పవిత్ర గ్రంథం ‘తొరా’లో ఏముంది? బైబిల్‌తో సంబంధం ఏమిటి? -
కల్లోలాలు మంచివి కావు
న్యూఢిల్లీ: ఘర్షణలు, కల్లోలాలు ఏ పక్షానికీ మంచి చేయబోవని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యలకు విచి్ఛన్న ప్రపంచం పరిష్కారాలు చూపజాలదన్నారు. ఇది శాంతి, సౌభ్రాతృత్వాలు నెలకొనాల్సిన సమయమని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరు నానాటికీ తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శుక్రవారం ఇక్కడ మొదలైన జీ20 పార్లమెంటరీ స్పీకర్ల 9వ సదస్సు ప్రారంభ సెషన్‌ను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘‘ప్రపంచంలో పలు చోట్ల ప్రస్తుతం ఏం జరుగుతోందో మనందరికీ తెలుసు. కలసికట్టుగా ముందుకు సాగాల్సిన సమయమిది’’ అని పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్, హమాస్ పోరుకు తక్షణం తెరపడాల్సిన అవసరం చాలా ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పరస్పర విశ్వాసంతో మానవ విలువలకు పెద్ద పీట వేయడమే ఇందుకు మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదమే మార్గం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఉగ్రవాద భూతంపై అంతర్జాతీయ సమాజం ఉక్కుపాదం మోపడమే ఏకైక మార్గమని మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘భారత్ దశాబ్దాలుగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోంది. మా దేశంలో వేలాదిగా అమాయకులను బలి తీసుకుంది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సరే మానవత్వానికి మాయని మచ్చ‘ అని పునరుద్ఘాటించారు. ఇంత జరిగినా ఉగ్రవాదాన్ని నిర్వచించే అంశం మీద కూడా ఇప్పటికీ అంతర్జాతీయ సమాజం ఏకాభిప్రాయానికి రాలేకపోవడం శోచనీయమన్నారు. మహిళా భాగస్వామ్యానికి ప్రోత్సాహం భారత్‌లో ప్రతి రంగంలోనూ మహిళల భాగస్వామ్యానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం కల్పిస్తున్నట్టు మోదీ తెలిపారు. స్థానిక స్వపరిపాలన సంస్థల్లో సగం మేరకు వాళ్లే ఉన్నట్టు పార్లమెంటుల స్పీకర్లకు వివరించారు. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కలి్పస్తూ ఇటీవలే పార్లమెంటులో చట్టం కూడా చేసినట్టు చెప్పారు. ‘నేడు భారత్ ప్రతి రంగంలోనూ మహిళల భాగస్వామ్యంతో కళకళలాడుతోంది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో మహిళల చురుకైన పాత్ర దేశ ప్రగతికి చాలా కీలకం‘ అని అన్నారు. భారత్‌లో 28 భాషల్లో ఏకంగా 900కు పైగా టీవీ చానళ్లు, దాదాపు 200 భాషల్లో 33 వేలకు పైగా వార్తా పత్రికలు ఉన్నాయని వారికి వివరించారు. ప్రపంచమంతటా దేశాల నాయకత్వ స్థానంలో మహిళలు ఎక్కువగా ఉంటే బహుశా ఇన్ని యుద్ధాలు జరిగేవి కాదని ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ప్రెసిడెంట్ దుతర్తే పచెకో అభిప్రాయపడ్డారు. -
ఓం శాంతిః శాంతిః శాంతిః
మీరు ఎన్నిక్రతువులు చేయండి, ఎన్ని పూజలు చేయండి, యజ్ఞాలు చేయండి... చివరకు మీరు కోరుకునేది ఏది... కేవలం ప్రశాంతత. నేను రాజభవనంలో ఉన్నా, నేనెంత అందగాడినయినా, ఎంత విద్వాంసుడినయినా, ఎంత ఐశ్వర్యం ఉన్నా... మనసు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు, తీవ్ర అశాంతితో ఉన్నప్పుడు ఇవేవీ మీకు శాంతినివ్వలేవు. ఒక పచ్చటి చెట్టు, రంగురంగుల పూలతో, కాయలతో, పళ్ళతో ఉన్నప్పటికీ తొర్రలో అగ్నిహోత్రం ఉన్నప్పుడు అది లోపల.. లోపల ఎంత దహించుకు పోతుంటుందో... మనసులో అశాంతి ఉన్న వ్యక్తికూడా అలాగే బాధపడుతూ ఉంటాడు. అందుకే శాంతి కావాలి. మన సంప్రదాయం మనకు ఒక శాంతి మంత్రాన్నే ఇచ్చింది...ఓం శాంతిః శాంతిః శాంతిః ఇది కేవలం ప్రాణులు మాత్రమే కాదు, అంతరిక్షం శాంతి పొందాలి, పృథివి శాంతి పొందాలి, వాయువు శాంతిపొందాలి. జలం శాంతి పొందాలి. ఏదీ కూడా వ్యగ్రతను పొందకూడదు. భూమికి అచల అని పేరు. అంటే కదలనిది..అని. భూమికి కోపం వచ్చి తన కట్టుతప్పి కదిలిందనుకోండి.. ఎంత ప్రాణ నష్టం? ఎంత ఆస్తి నష్టం ? అందుకే భూమి ప్రశాంతంగా ఉండాలి. వాయుః శాంతిః వాయువు తన కట్టుతప్పి తీవ్రతను చూపిందనుకోండి.. ప్రభంజనం అంటాం. అన్నీ నేలకొరుగుతాయి. అదే వాయువు తాను ఉండాల్సిన కట్టుబాటులో ఉంటే... వాయుః ప్రాణః, సుఖం వాయుః. అప్పుడు ప్రాణమూ వాయువే, సుఖమూ వాయువే. చల్లగాలి చక్కగా వీస్తుందనుకోండి. సుఖంగా అనిపిస్తుంది. ఏ ఇబ్బందీ లేకుండా ఊపిరిని ఒకే వేగంతో తీసి, ఒకే వేగంతో విడిచిపెడుతూ ఉన్నప్పుడు.. అంతకన్నా ఆయుర్దాయం మరేముంది! వాయువు ఎంతకాలం శరీరంలో తిరుగుతూ ఉంటుందో అంతకాలమే సంధిబంధాలు.. కాళ్ళు, చేతులు, మణికట్టు అన్నీ వంగుతాయి. అది ప్రసరించనప్పుడు శరీరం ఒక కర్రయిపోతుంది. అందుచేత వాయువు అత్యంత ప్రధానమైనది. దాని చేత ప్రాణులన్నీ చలనశీలంగా ఉంటాయి. వడిబాయక తిరితే ప్రాణబంధుడా !.. అంటారు అన్నమాచార్యులవారు. ఒకే వేగంతో ఊపిరిని శరీరం లోపలికి, బయటికి పంపుతున్నాడే..ఆయనే వేంకటేశ్వరుడు. ఇక అంతకన్నా నాకు దగ్గరగా ఎవరున్నార్రా!!! అని అడిగాడు. వడిబాయక తిరిగే ప్రాణబంధుడా.. అని పిలిచాడు ఆయన వేంకటేశ్వరుడిని. అదే.. వాయుఃప్రాణః సుఖం వాయుః. ఊపిరిని తీసి విడిచి పెడుతున్న శరీరం ఆచంద్రార్కం.. శాశ్వతంగా ఉండదు. పడిపోతుంది. ఇప్పుడు వాయువుకున్న గొప్పదనం ఏమిటంటే.. అదే వాక్కుగా మారుతుంది. ఆ వాయువు చేత ప్రాణాలను నిలబెట్టుకున్నవాడు వాటిని సార్ధక్యం చేసుకున్నప్పుడు శరీరం పడిపోయినా ఆ వ్యక్తి.. కాలంలో శతాబ్దాలు నిలబడిపోతాడు.. ఎలా! అది వాక్కుగా మారినందువల్ల...! బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
సౌదీలో ‘ఇండియా జేమ్స్ బాండ్’ ఏం చేస్తున్నారు?
భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రస్తుతం సౌదీ అరేబియా పర్యటనలో బిజీగా ఉన్నారు. తొలుత ఆయన జెడ్డాలో ప్రారంభమైన ఉక్రెయిన్ శాంతి సదస్సులో పాల్గొన్నారు. రష్యా హాజరు కాకుండానే ఈ రెండు రోజుల సుదీర్ఘ సదస్సు ప్రారంభమైంది. అమెరికా, చైనా సహా దాదాపు 40 దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ‘చర్చల ద్వారా వివాదాల పరిష్కారం’ దోవల్ ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరుకావడాన్ని చూస్తే.. భారత్ ఈ శాంతి ప్రయత్నాల్లో తన పాత్రను నొక్కి చెబుతోందన్న బలమైన సంకేతాన్ని పంపుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో జరిగిన సమావేశాల్లో శాంతి, చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ గతంలోనే సూచించారు. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా ఐక్యరాజ్యసమితిలో రష్యాకు వ్యతిరేకంగా భారత్ కూడా తన గళాన్ని వినిపించింది. అయితే భారత్ నిరసన ఉక్రెయిన్‌పై రష్యా దాడికి సంబంధించినది కాదు. ఇది బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్‌కు సంబంధించినది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్‌ను కొనసాగించడంలో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ చేస్తున్న ప్రయత్నాలకు భారతదేశం మద్దతు ఇస్తుందని అన్నారు. గల్ఫ్ దేశాలతో రైలు నెట్వర్క్ అనుసంధానం చైనాకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యూహాన్ని రూపొందించే ప్రక్రియలో అజిత్ దోవల్ సౌదీ అరేబియా పర్యటన ఒక భాగం. గల్ఫ్ దేశాల్లో పెరుగుతున్న చైనా ప్రభావాన్ని నివారించేందుకు భారత్, అమెరికాలు ప్రయత్నిస్తున్నాయి. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ కూడా తరచూ సౌదీ అరేబియాను సందర్శిస్తున్నారు. గల్ఫ్ దేశాలపై చైనా ఆధిపత్యాన్ని తరిమికొట్టి, అమెరికా హవాను తిరిగి స్థాపించడమే ఈ సందర్శనల ప్రధాన లక్ష్యం. ఇందు కోసం సౌదీ అరేబియా- ఇజ్రాయెల్ మధ్య స్నేహం నెలకొల్పడంలో అమెరికా తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. అమెరికా ప్రయత్నాల్లో భాగస్వామ్యం అమెరికా చేస్తున్న ఈ ప్రయత్నంలో భారత్ కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. గల్ఫ్ దేశాలను రైలు నెట్‌వర్క్‌తో అనుసంధానించడం ద్వారా తన వ్యూహాత్మక ఉనికిని బలోపేతం చేసుకునేందుకు భారతదేశం ప్రయత్నిస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో రైలు మార్గం ఏర్పాటుపై భారత్ చర్చలు ప్రారంభించింది. అదే సమయంలో ఈ రైలు మార్గంలో సౌదీ అరేబియాను చేర్చాలనే దిశగా ఆలోచిస్తున్నారు. సౌదీ అరేబియా వరకు రైలు నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తామని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపధ్యంలో భారత రైలు నెట్‌వర్క్‌లో సౌదీ అరేబియాను చేర్చాలని అజిత్ దోవల్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ కుమార్ దోవల్‌ను ‘జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా’ అని అభివర్ణిస్తుంటారు. ఇది కూడా చదవండి: గొప్పగా ప్రారంభమై.. అంతలోనే కనుమరుగై.. పాకిస్తాన్ హిందూ పార్టీ పతనం వెనుక.. -
అందం.. అంటే!!!
ప్రపంచ ప్రఖ్యాత ఆంగ్లకవి జాన్ కీట్స్ ఒక మాటన్నారు...‘‘ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫరెవర్’’– అని. ఒక అందమైన వస్తువు ఎప్పటికీ సంతోషకారకమే. అందమైన వస్తువు అంటే ... నాకు ఏది అందంగా కనపడుతుందో, మీకు అది అందంగా కనపడకపోవచ్చు. నాకు అందంగా కనిపించింది దేశకాలాలతో సంబంధం లేకుండా అది నాకు శాంతి కారణమయి ఉంటుంది. అసలు లోకంలో ఏ పనిచేసినా దేనికోసం చేస్తాం? శాంతి కోసమే. ఏది శాంతిని ఇవ్వగలదో అదే అందం. ఏది మనసుకు అశాంతి ఇవ్వడం ప్రారంభించిందో అది అందవిహీనం. భగవద్గీతలో గీతాచార్యుడు ఒకమాటంటాడు – ‘‘తత్తదేవా గచ్ఛత్వమ్ మమ తేజోంశ సంభవమ్’’.. అని. అటువంటి గొప్ప అందం ఎక్కడయినా ఉంటే .. అది భగవంతుని తేజస్సు అవుతుంది. నేను ఒకప్పడు నైమిశారణ్యానికి వెళ్ళాను. అక్కడ గోమతీ నదీతీరంలో ఒక పెద్ద వటవృక్షాన్ని చూసాను. ఎంత పెద్దదంటే.. దాని కొమ్మలు, ఆకులు, ఊడలు తగలకుండా దాని చుట్టూ తిరగడానికి 15–20 నిమిషాలు పడుతుంది. ఎన్ని కొమ్మలు, ఎన్ని ఊడలు, పైన పక్షులు, పక్షి గూళ్ళు.. అలా చూస్తుండి పోయాను. ఇప్పటికి పదేళ్ళు పైగానే అయిపోయి ఉంటుంది. అయినా ఇప్పటికీ అది జ్ఞాపకానికి వస్తే.. దాని సౌందర్యం, దాని పరిమాణం వెంటనే మనసులో మెదిలి అప్పటివరకు నాలో ఉన్న ఉద్వేగం కానీ ఇతరత్రా చికాకులు, విసుగు, అశాంతి అన్నీ మటుమాయమై పోతాయి. ఒకసారి ఒక కోనేరులో సహస్రదళ కమలాన్ని చూసాను. వెయ్యిరేకుల పద్మం. అక్కడున్నవాళ్ళు దాన్ని కోసి తెస్తే ... నా రెండు చేతులా నిండుగా అది తాజాగా కనిపించడమే కాదు... దగ్గరనుంచి చూస్తే.. ఎన్ని రెక్కల దొంతర్లు, ఎన్నెన్ని రంగులు, ఎంత చక్కటి అమరిక, మధ్యలో ఉన్న దుద్దు, ముఖానికి దగ్గరగా తీసుకుంటే ఎంత చల్లదనం.. అలా దానిని ఆస్వాదిస్తూ ఉండిపోయాను. కొంతసమయం తరువాత అది వాడిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది... కానీ నా జ్ఞాపకాల్లో అది వాడలేదు, నశించలేదు, నా స్మృతిపథంలో దానికి బురద లేదు, మొగ్గలేదు, వందలాది రేకులతో, చిత్రవిచిత్ర వర్ణాలతో నా చేతిలో బాగా విప్పారి, నాకు చల్లదనాన్నిచ్చి... అలా నా మనసులో ముద్రితమైన ఆ పూవు మాత్రం నా చివరి శ్వాసవరకు, నేనెప్పుడు గుర్తుకు తెచ్చుకున్నా మొదటిసారి చూసినప్పుడు ఎంత అనుభూతి చెందానో, అంతే అనుభూతిని పొందుతూనే ఉంటాను. అలా గుర్తుకొచ్చినప్పుడు ఆ అందం నాకు సంతోషాన్నిస్తుంది, శాంతినిస్తుంది. అంటే దానికి దేశకాలాలతో సంబంధం లేదు. ‘బీజస్వాంతరివాంకురోజగదివం ప్రాంగే నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాలకకలగా వైచిత్రచితైకృతం’ అంటారు శంకరులు. అలా అది ఎప్పటికీ నాలోనే ఉండిపోతుంది. ఒకవేళ మళ్ళీ వెళ్ళినా అక్కడ అది ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ మొదటిసారి చూసి అనుభూతి చెందిన అందం నా స్వంతం. అదెప్పటికీ నాతోనే ఉండి... నాకు సంతోషాన్ని, శాంతిని, ఉపశమనాన్ని కలిగిస్తూనే ఉంటుంది. అంటే ఏది నీకు శాంతికారకమో, సంతోషకారకమో అదే నిజమైన అందం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
శాంతి స్థాపనలో భారత్ ముఖ్యపాత్ర?
ఉక్రెయిన్–రష్యా యుద్ధం కారణంగా చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. శాశ్వత కాల్పుల విరమణను, స్థిరమైన శాంతిని సాధించడానికి దీర్ఘకాలిక అంకితభావం, పట్టుదలతో పాటు అంతర్జాతీయ ఒత్తిడి అవసరం. ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణ ప్రభావిత ప్రాంతాలలో శాంతి భద్రతలను నిర్వహించడంలో భారత్ ముఖ్యమైన పాత్రను పోషించింది. పుతిన్‌తో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తోనూ భారత్ నాయకత్వం సన్నిహితంగా ఉండటంతో శాంతిని నెలకొల్పేందుకు భారత ప్రధాని మధ్యవర్తిత్వం వహించవచ్చని కొన్ని దేశాలు అభిప్రాయపడుతున్నాయి. సమస్యను పరిష్కరించడంలో అగ్రదేశాలు విఫలమవుతున్న నేపథ్యంలో భారత్ గురుతర బాధ్యత పోషించాల్సి ఉంది. మెజారిటీ దేశాల ఆర్థిక వ్యవస్థలను అధమ స్థాయికి చేర్చిన 15 నెలల రష్యా–ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతోంది. ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా ఇంధనం, ఆహార మార్కెట్లకు భారీ షాక్ ఇచ్చింది. సరఫరాను తగ్గించి, నిత్యావసరాల ధరలను మునుపెన్నడూ లేని స్థాయికి పెంచింది. ఇతర ఆర్థిక ప్రాంతా లతో పోలిస్తే, ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర రేపే ఆర్థిక పరిణామా లకు యూరో ప్రాంతానికి ప్రత్యేకించి హాని కలుగుతుంది. అణ్వాయుధాలను ఆశ్రయించవచ్చని రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ పదేపదే హెచ్చరించినప్పటికీ, అణుయుద్ధం జరిగే అవకాశాలు పెద్దగా లేవు. తనను బెదిరించినట్లయితే రష్యా ‘ప్రాదేశిక సమగ్రతను’ రక్షించడానికి ‘అందుబాటులో ఉన్న అన్ని ఆయుధ వ్యవస్థలను’ ఉపయోగిస్తానని పుతిన్ 2022 సెప్టెంబరు 21న తేల్చిచెప్పారు. భారత్ స్పందనేమిటి? భారతదేశం సాంప్రదాయకంగా అంతర్జాతీయ సంఘర్షణలలో అలీన విధానాన్ని, తటస్థ విధానాన్ని అనుసరిస్తోంది. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంఘర్షణపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తూ, సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పిలుపు నిచ్చింది. పుతిన్‌తో పాటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సన్నిహితంగా ఉండటంతో శాంతి నెల కొల్పేందుకు ప్రధాని మోదీ మధ్యవర్తిత్వం వహించవచ్చని కొన్ని దేశాలు అభిప్రాయపడుతున్నాయి. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని భారత్ నిల కడగా సమర్థిస్తోంది. అయితే ఉక్రెయిన్‌లో ‘సమగ్రమైన, న్యాయమైన, శాశ్వత శాంతి’ ఆవశ్యకతను నొక్కిచెప్పే తీర్మానంపై ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ఓటింగుకు మాత్రం భారత్ దూరంగా ఉండి పోయింది. 2015లో, క్రిమియాను రష్యా విలీనం చేసుకోవడాన్ని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి సాధారణ సభ చేసిన తీర్మానానికి... ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదనే విధానాన్ని పేర్కొంటూ భారతదేశం దూరంగా ఉంది. అయితే దౌత్య మార్గాల ద్వారా వివా దానికి శాంతియుత పరిష్కారం కోసం భారతదేశం పిలుపునిచ్చింది. అలాగే మిన్స్క్ ఒప్పందం అమలు జరగాలని సూచించింది. భారత్ వైఖరిని ఉక్రెయిన్‌తో సహా కొన్ని దేశాలు విమర్శించాయి, రష్యా చర్యలపై న్యూఢిల్లీ మరింత బలమైన వైఖరిని తీసుకోవాలని ఉక్రెయిన్ వాదించింది. అంతర్జాతీయ శాంతి పరిరక్షక ప్రయత్నాలలో, ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి మిషన్లలో పాల్గొనడం ద్వారా భారత దేశం నిర్మాణాత్మక పాత్ర పోషిస్తూ వస్తోంది. ఐరాస శాంతి పరిరక్షక కార్యకలాపాలకు దళాలను స్థిరంగా అందించిన సుదీర్ఘ చరిత్ర భార త్‌కు ఉంది. పైగా ప్రపంచవ్యాప్తంగా సంఘర్షణ ప్రభావిత ప్రాంతాలలో శాంతి భద్రతలను నిర్వహించడంలో భారత్ ముఖ్య పాత్రను పోషించింది. విశ్వసనీయ దేశం దేశాల సఖ్యత విషయంలో భారతదేశం విశ్వసనీయతను పొందు తోంది. ఇండో–పసిఫిక్ ఫోరమ్ దేశాలు భారత టీకా దౌత్యం, అవస రమైన సమయంలో మానవతా సహాయం తర్వాత భారతదేశంతో సహకారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఆసక్తిని వ్యక్తం చేశాయి. ఆస్ట్రేలి యాతో ద్వైపాక్షిక సంబంధాలు కూడా గణనీయమైన పురోగతిని చూపుతున్నాయి. ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బ నీస్ మధ్య సమావేశాలు పరస్పర విశ్వాసంతో గౌరవంతో జరిగాయి. సంబంధాలను మెరుగుపరిచేందుకు తీవ్రంగా కృషి చేసిన తర్వాత, ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీల కోసం భారత్‌కు లిథియం సరఫరా చేసేందుకు ఆస్ట్రేలియా సిద్ధంగా ఉండటంతో ఇరుపక్షాల సంబంధాలు కొత్త పుంతలు తొక్కాయి. హిరోషిమాలో ఇటీవల జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ జెలెన్స్కీ రష్యాతో యుద్ధాన్ని ముగించే శాంతి ప్రణాళికను ప్రధాని మోదీకి అందించారు. దానికి భారతదేశం ఆమోదం కోరారు. ఉక్రెయిన్‌లో పర్యటించాల్సిందిగా మోదీని ఆహ్వానించారు కూడా. అధికారిక సోర్సుల ప్రకారం, అనేక దేశాలు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశమైన భారత్ వైపు చూస్తున్నాయని భావించినందున, తన శాంతి ప్రతిపాదనకు మద్దతు కోరడం మినహా జెలెన్స్కీ భారతదేశంపై ఎటువంటి డిమాండ్ మోపలేదు. ఈ ప్రతి పాదనను మోదీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. శాంతి స్థాపన చర్యలు ఉక్రెయిన్ యుద్ధంలో కాల్పుల విరమణను అమలు చేయడం అనేది బహుళ పార్టీలతో, భౌగోళిక రాజకీయ పరిగణనలతో కూడిన సంక్లిష్ట సమస్య. కాల్పుల విరమణ కోసం తీసుకోవాల్సిన కొన్ని చర్యలు: ఉక్రెయిన్, రష్యా, తూర్పు ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద సమూహాలతో సహా వివాదాస్పద పక్షాల మధ్య చర్చలను సులభ తరం చేయడానికిగానూ దౌత్య ప్రయత్నాలను ప్రోత్సహించడం; సంభాషణను, శాంతి చర్చలను సులభతరం చేయడానికి ఐక్యరాజ్య సమితి లేదా ఐరోపాలో భద్రత, సహకార సంస్థ (ఓఎస్‌సీఈ) వంటి అంతర్జాతీయ మధ్యవర్తులు లేదా సంస్థలను నిమగ్నం చేయడం; విరుద్ధమైన పార్టీలు శత్రుత్వాలను విరమించుకోవడానికి తగిన దౌత్య పరమైన ఒత్తిడి తీసుకురావాలని యూఎస్, యూరోపియన్ యూని యన్, పొరుగుదేశాల వంటి అంతర్జాతీయ పాత్రధారులను కోరడం; కాల్పుల విరమణకు అనుగుణంగా ఆర్థిక ఆంక్షలు విధించడం; దౌత్య పరంగా ఒంటరయ్యేట్టు చూడటం; ఇంకా ఇతర రాజకీయ చర్యలను ఉపయోగించవచ్చు. ప్రమేయం ఉన్న పక్షాల మధ్య సంభాషణ, నమ్మ కాన్ని పెంపొందించడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేలా పరస్పర విశ్వాసాన్ని పాదుగొలిపే చర్యలు తప్పనిసరి. ఇందులో ఖైదీల మార్పిడి, భారీ ఆయుధాల ఉపసంహరణ, నిర్దిష్ట స్థానికప్రాంతాల్లో కాల్పుల విరమణల అమలు వంటివి ఉంటాయి. అంతేకాకుండా, సంఘర్షణలో చిక్కుకున్న పౌరులకు వైద్య సామగ్రి, ఆహారం, ఆశ్రయంతో సహా ప్రభావిత ప్రాంతాల్లో మాన వతా సహాయానికి, తోడ్పాటుకు అనియంత్రిత ప్రాప్యతను ఏర్పరచా ల్సిన అవసరం ఉంది. జనాల బాధలను తగ్గించడానికి, సద్భావనను పెంపొందించడానికి రెండు వైపులా మానవతా సాయాన్ని అందించాలి. దీనితో పాటు కాల్పుల విరమణ అమలును పర్యవేక్షించడానికి, ధృవీకరించడానికి సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఇందులో అంతర్జాతీయ పరిశీలకులు, శాంతి పరిరక్షక దళాలకు ప్రమేయం ఉండాలి. ఈ సంస్థలు కాల్పుల విరమణ ఉల్లంఘనలను నివేదించడంలో సహాయపడతాయి. అలాగే అంగీకరించిన నిబంధ నలకు అనుగుణంగా ఉండేలా చూడటం ద్వారా పార్టీల మధ్య విశ్వా సాన్ని పెంపొందించవచ్చు. రాజకీయ, ఆర్థిక, జాతిపరమైన మనోవేద నలతో సహా సంఘర్షణ మూల కారణాలను పరిష్కరించడానికి రాజ కీయ సంభాషణలను, సయోధ్యను ప్రోత్సహించాలి. సంఘర్షణ– ప్రభావిత ప్రాంతాల ప్రతినిధులతో సహా మొత్తం వాటాదారులను నిమగ్నం చేయడం అనేది, అంతర్లీన సమస్యలను పరిష్కరించడంలో, స్థిరమైన శాంతి ఒప్పందం కోసం పని చేయడంలో సహాయపడుతుంది. ఈ పరిమాణంలో ఉన్న సంఘర్షణను పరిష్కరించడానికి అన్ని పార్టీల నిబద్ధత, సహకారం అవసరం. శాశ్వత కాల్పుల విరమణను, సుస్థిరమైన శాంతిని సాధించడానికి దీర్ఘకాలిక అంకితభావం, పట్టుదల, అంతర్జాతీయ ఒత్తిడి అవసరం. వ్యాసకర్త అంతర్జాతీయ వాణిజ్య విశ్లేషకులు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఇది ప్రపంచానికే పెద్ద సమస్య: ప్రధాని మోదీ
హిరోషిమా: ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధం.. కేవలం ఆ దేశ సమస్య కాదని, ఇది యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జీ7 సదస్సు కోసం హిరోషిమా(జపాన్) వెళ్లిన ప్రధాని మోదీ.. అక్కడే ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీని కలిశారు. ‘‘ఉక్రెయిన్‌లో యుద్ధం మొత్తం ప్రపంచానికి పెద్ద సమస్య. ప్రపంచాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేసింది. దీనిని నేను ఓ రాజకీయ లేదంటే ఆర్థిక సమస్యగా పరిగణించను. నా దృష్టిలో ఇది మానవత్వం, మానవ విలువలకు సంబంధించిన సమస్య. యుద్ధ బాధలేంటో మా అందరికంటే మీకే బాగా తెలుసు. గత సంవత్సరం మా పిల్లలు(భారతీయ విద్యార్థులను ఉద్దేశించి..) ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చి అక్కడి పరిస్థితులను వివరించినప్పుడు.. మీ పౌరుల ఆవేదనను నేను బాగా అర్థం చేసుకోగలిగాను. ఈ పరిస్థితిని పరిష్కరించడానికి భారతదేశం, వ్యక్తిగతంగా నేనూ.. మా సామర్థ్యం మేరకు కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను అని ప్రధాని మోదీ, జెలన్స్కీకి హామీ ఇచ్చారు. #WATCH | Japan: Prime Minister Narendra Modi meets Ukrainian President Volodymyr Zelensky in Hiroshima, for the first time since the Russia-Ukraine conflict, says, "Ukraine war is a big issue in the world. I don't consider it to be just an issue of economy, politics, for me, it… pic.twitter.com/SYCGWwhZcb — ANI (@ANI) May 20, 2023 జీ 7 శిఖరాగ్ర సదస్సు కోసం.. జపాన్ ప్రత్యేక ఆహ్వానం మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీలు హిరోషిమా నగరానికి వెళ్లారు. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఈ ఇరువురు నేతలు వర్చువల్‌గా, ఫోన్లో సంభాషించుకున్నారు. అయితే నేరుగా భేటీ కావడం ఇదే తొలిసారి. దౌత్యం, చర్చల ద్వారానే యుద్ధం ఆగుతుందని, శాంతి నెలకొంటుందని ప్రధాని మోదీ మరోసారి జెలెన్స్కీ వద్ద ఉద్ఘాటించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో భారత్ ఎలాంటి పాత్ర అయినా పోషించేందుకు సిద్దంగా ఉంటుందని ప్రధాని మోదీ గతంలోనే ప్రకటించారు. -
యుద్ధం ఇక చాలు: చైనా
ఉక్రెయిన్ యుద్ధ విరమణకు శుక్రవారం చైనా పిలుపునిచ్చింది. ఈ ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై నేటికి(ఫిబ్రవరి 24) ఏడాది పూర్తైన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఈ యుద్ధం విరమించేలా 12 పాయింట్ల సమగ్ర నివేదిక ఇచ్చింది చైనా. యుద్ధం ప్రపంచాన్ని చీకట్లోకి నెట్టేసిందని.. వేల మంది మరణించారని, మిలియన్ల మంది ఇతర ప్రాంతాలకు తరలిపోయారని చైనా సదరు నివేదిక ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేసింది. పనిలో పనిగా.. అగ్రరాజ్యంపైనా చైనా ఆగ్రహం వెల్లగక్కింది. యుద్ధం తీవ్రత పెరిగేందుకు అమెరికా, దాని మిత్ర దేశాలు కూడా కారణమయ్యాయని నివేదికలో చైనా విమర్శలు గుప్పించింది. అయితే తాము మాత్రం ఈ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చకుండా అడ్డుకునే యత్నం చేస్తున్నట్లు చైనా తెలిపింది. చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారమని నొక్కి చెప్పింది చైనా. అంతేగాదు ఆ 12 పాయింట్ పొజిషన్ పేపర్లో(సమగ్ర నివేదికలో)..‘‘అణ్వాయుధాలను ఉపయోగించకూడదు, అలాగే అణుయుద్ధాలను చేయకూడదు, బెదిరింపులకు పాల్పడకూడదు. చివరిగా . ఏ దేశమైనా ఎట్టి పరిస్థితుల్లోనూ రసాయన, జీవ ఆయుధాల పరిశోధన, అభివృద్ధి, వినియోగాన్ని వ్యతిరేకించాలి’’ అని చైనా తన నివేదికలో పేర్కొంది. ఇదిలా ఉంటే.. చైనా నివేదికపై ఉక్రెయిన్హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు చైనాలోని ఉక్రెయిన్ రాయబారి ఇదొక శుభపరిణామంటూ పేర్కొన్నారు. అలాగే.. రష్యాపై చైనా ఒత్తిడి తెస్తుందని ఆశిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. (చదవండి: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: కీలక ఓటింగ్‌కు భారత్, చైనా దూరం) -
యుద్ధం తర్వాత గుణపాఠం నేర్చుకున్నాం: పాక్ ప్రధాని కీలక వ్యాఖ్యలు
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్‌తో మూడు యుద్ధాలు చేసి గుణపాఠం నేర్చుకున్నామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో తాము తమ పొరుగుదేశం భారత్‌తో శాంతిని కోరుకుంటున్నాం అన్నారు. కాశ్మీర్ వంటి అంశాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీతో నిజాయితీతో కూడిన చర్చలు జరగాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు దుబాయ్‌కి చెందిన అల్ అరేబియా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ ప్రధాని షరీఫ్ మాట్లాడుతూ.."భారత ప్రధాని మోదీకి నా సందేశం ఏంటంటే?.. మన మధ్య చిచ్చు రేపుతున్న బర్నింగ్ పాయింట్లను పరిష్కరించడానికి టేబుల్‌పై కూర్చోని చిత్తశుద్ధితో చర్చలు జరుపుదాం. శాంతియుతంగా జీవిద్దాం. పరస్పరం కలిహించుకోవడంతో సమయం, వనరులు వృధా చేస్తున్నాం" అని అన్నారు. తాము భారత్‌లో చేసిన మూడు యుద్ధాల కారణంగా పాక్ ప్రజలకు తీరని కష్టాలను మిగిల్చాయి. వారంతా తీవ్ర పేదరికం, నిరుద్యోగాన్ని ఎదుర్కొవాల్సి వచ్చింది. అదీగాక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టిమిట్టాడుతున్న పాక్ తమకు సాయం చేయమంటూ ప్రపంచ దేశాలను వేడుకుంటున్న సంగతి తెలిసిందే. అక్కడ ప్రజలు ఆర్థిక సంక్షోభం, ఇంధన కొరత కారణంగా గోధుమపిండి కోసం ఘోరంగా ఆర్రుల చాజుతున్నారు. మరోవైపు అక్కడి ప్రజలు తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) ఉగ్రవాద దాడులను తీవ్రంగా ఎదుర్కొంటోన్నారు. గతేడాది చివర్లోనే దేశ భద్రతా దళాలతో కాల్పులు విరమించింది. ఈ పరిస్థితుల దృష్ట్యా పాక్ ప్రధాని షెహబాజ్ పోరుగు దేశంతో ముక్కుసూటిగా నిజాయితీగా వ్యహిరిస్తాం అని పిలుపునిచ్చారు. ఇరుదేశాల్లోనూ నైపుణ్యవంతులైన వైద్యులు, ఇంజనీర్లు, కార్మికులు ఉన్నారని, ఆ వనరులను ఉపయోగించుకుని శాంతి నెలకొల్పాలని కోరుకుంటున్నానని చెప్పారు. అలాగే మందుగుండు సామాగ్రి కోసం వనరులను దుర్వినియోగం చేయాలనుకోవటం లేదని తెలిపారు. ఈ క్రమంలో కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ..పాకిస్తాన్ శాంతిని కోరుకుంటుందని, కాశ్మీర్లో జరుగుతున్న వాటిని ఆపాలని అన్నారు. ఈ మేరకు తీవ్ర సంక్షోభంతో సతమతమవుతున్న పాక్ భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధమంటూ నేరుగా సంకేతాలిస్తోంది. (చదవండి: వద్దన్నా! పట్టుబట్టి డ్యూటీకి వెళ్లింది..ఓ నాన్న ఆవేదన) -
పుతిన్ ఇక చాలు.. మారణహోమం ఆపెయ్
రోమ్: ఉక్రెయిన్‌లో మారణహోమాన్ని ఆపాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను వేడుకున్నారు పోప్ ఫ్రాన్సిస్. యుద్ధం మొదలైన ఆరు నెలల తర్వాత తొలిసారి ఈమేరకు విజ్ఞప్తి చేశారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో వేలాది మందిని ఉద్దేశించి పోప్ మాట్లాడారు. యుద్ధం తీవ్రరూపం దాల్చి అణుబాంబులతో దాడులు చేసుకునే పరిస్థితి వచ్చేటట్టు ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని నెలలుగా ఉక్రెయిన్‌లో జరుగుతున్న రక్తపాతం తనను వెంటాడుతోందని అన్నారు. యుద్దం వల్ల సొంత ప్రజల ప్రేమను కూడా పుతిన్ కోల్పోతున్నారని పేర్కొన్నారు. యుద్ధం ఆపేందుకు రష్యా శాంతి ప్రతిపాదనలు చేస్తే దయచేసి అంగీకరించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెల్‌న్‌స్కీని కూడా కోరారు పోప్. రష్యాతో శాంతి చర్చలకు సుముఖంగా ఉండాలని సూచించారు. రెండు దేశాల యుద్ధం కారణంగా ప్రపంచదేశాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఉక్రెయిన్ ప్రాంతాలను పుతిన్ రష్యాలో విలీనం చేయడం సరికాదని పోప్ అభిప్రాయపడ్డారు. ఇది అంతర్జాతీయ నిబంధనలకు విరుద్దమన్నారు. చదవండి: నేలపై నుంచి కాల్పులు.. విమానంలోకి దూసుకెళ్లిన బుల్లెట్ -
మంచి మాట: పలకరింపు ఎంత మధురం!
తీయని పలకరింపు మదిలో చక్కని భావనను రేపుతుంది. ఒక చల్లని అనుభూతినిస్తుంది. ఓ హాయిని చేకూరుస్తుంది. పలరింపు పెద్ద ఓదార్పు. కొన్ని సందర్భాలలో అద్భుతమైన ఊరటను, కొండంత బలాన్నిస్తుంది . ‘తోడుగా నీకు నేనున్నాను‘ అనే ఆత్మీయత, ఆప్యాయతలతో నిండిన పలకరింవు గొప్ప భరోసా నిస్తుంది. మన దుఃఖాన్ని, నిర్వేదాన్ని, నిరాశను, నిçస్పృహను అమడ దూరంలో పెట్టే ఔషధమై మనసుకు సాంత్వననిస్తుంది. బీటలుబారిన భూమికి ఎంతో హర్షాన్నిస్తుంది వర్షం. అదే విధంగా, చక్కని పలకరింపు శోకంతో ఛిద్రమైన మనోక్షేత్రాన్ని ఏకం చేసే ప్రేమజల్లు అవుతుంది. కొందరికి పలకరింపంటే మాటల మూట అనే భావన ఉంది. పలకరింపు అంటే అద్భుతమైన పదవిన్యాసము కాదు. భాషా సొబగులు చూపటం, భాషా సౌందర్యాన్ని ఒలికించటమూ అంతకన్నా కాదు. సమాసాల హోరు, జోరు కానే కాదు. పలకరింపు ఒక లాలిత్యం... ప్రేమ ధ్వనించాలి. స్నేహం తొంగి చూడాలి. పెదవుల చివర నుంచి కాక మనసులోంచి రావాలి. అపుడే అది ఎదుటివారి మనసును తాకి ఆహ్లాదాన్నిచ్చే మలయమారుతమవుతుంది. చక్కని పులకరింపై మనసుకు ఓ ప్రశాంతతనిచ్చి మన పలకరింపును స్వీకరించిన వారి ముఖాన చిరునవ్వును వెల్లి విరిసేటట్టు చేస్తుంది. కొందరు నోరు విప్పి పలుకరించటానికి ముందే వారి ముఖం మీద చిరునవ్వు పుడుతుంది. ఆ తరువాతే మాటలు. అటువంటి వారి మాటకు మృదు మధురంగానే ఉంటాయి. శ్రీరాముడు స్మిత పూర్వ భాషి అన్నారు. చిరునవ్వుతో తానే ముందు అందరిని పలకరిస్తాడు. పదాల అర్థం వాటి పర్యవసానం, వాటి పయనం, వాటి ప్రభావాల గురించి మన అంచనా శక్తి మనకు తెలియాలి. మన పలకరింపు ఎదుటివారికి చేరేది మాటల రూపంలోనే కదా. అది మన గొంతు నుండి పెదవులను దాటి స్వరరూపంలో బయటకు వస్తుంది. స్వరం స్థాయి, మాటల ఊనిక చాలా అవసరం. మనం ఎన్నుకున్న మాటల అర్థాన్ని, ఉద్దేశాన్ని ఎదుటివారికి తెలియజెప్పేది మాటల రూపంలో వ్యక్తమయ్యేది పలకరింపే. అందుకనే ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఒకరకంగా ఇది అతి సులువు గా కనిపించే అత్యంత క్లిష్టమైన విషయం. ‘బావున్నారా‘ అనేది మనమందరం చేసే అతి సాధారణ పలకరింపు. ఈ నాలుగు అక్షరాలు మన గొంతులో పలికే మన స్వర స్థాయిని బట్టి మన మనోభావాన్ని తెలియచేస్తుంది. అందుకే మాటలు అవే అయినా వాటిని పలికే తీరులో ఎంతో తేడా ఉంటుంది. మన భావాన్ని తెలియచెప్పే మాటల ధ్వని, దాని అర్థం మనం స్వరం లో పలికేటట్టు మాట్లాడగలగాలి. అదే చక్కని పలకరింపుకు చిరునామా అవుతుంది. మనల్ని చక్కని సంభాషణ పరులుగా చేసేది. పలకరింపు అంటే భాష మీద పట్టు, సాధికారత కానే కాదు. పలకరింపుకు మన విజ్ఞత, వివేచన ఉండాలి.. అపుడే అది చేయదగ్గ పనిని చేస్తుంది. తల్లిదండ్రులు తమ జీవితమంతా పిల్లలకే ధారపోస్తారు. అహరహం వారి బంగారు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. వయసు మీరిన తరువాత పలకరింపుకోసం తపించిపోతారు. ఈరోజు విషయాన్ని పిల్లలు అర్థం చేసుకోవాలి. స్వదేశంలో ఉన్నా, విదేశంలో ఉన్నా తమ తల్లిదండ్రులను పలకరించాలి. ఆ పలకరింపు, గడపబోయే సమయం కొన్ని క్షణాలైనా చాలు. అది వృద్ధులకు ఎంతో ధైర్యాన్ని, భరోసాను ఇస్తుంది. అన్నిటికీ మించి వర్ణించలేని సంతృప్తిని, అంతులేని ఆనందాన్ని ఇస్తుంది. మనం పలకరించినా, లేకపోయినా ప్రకృతి మనల్ని పలకరిస్తూనే ఉంటుంది. ప్రకృతిపరమైన ఈ పలకరింపులు ఆలకించగలగాలి లేదా అలవాటు చేసుకోవాలి. అపుడు ఎంతో ఆనందాన్ని పొందగలం. ఆ దృష్టి ఆనంద హేతువు. ఉదయానే కొక్కోరోకో అనే ధ్వని, ఉదయపు వ్యాహ్యాళి వేళ తమ ఆవాసమైన వృక్షాన్ని వీడి పక్షులు తమ ఆహారన్వేషణ కు ఆకాశానికెగిరే వేళ చేసే టప టప మనే ధ్వని ప్రకృతి పలకరింపు. పండిన నారింజ రంగులో ఉన్న భానోదయం, భాస్కరుని నులివెచ్చని కిరణాలు నిశ్శబ్ద పలకరింపులే కదా! గాలి ఈలలు, చిరుగాలి సవ్వడి, నీటి గలగలలు, నిన్నటి మొగ్గ నేడు తన రేకానయనాలను విప్పార్చుకుంటూ పరిమళాలతో మనల్ని మన ఆత్మీయులు పలుకరించిన అనుభూతి కలగదా! పలకరింపు మాటల్లోనే ఉండనక్కర లేదు. అది ఒక చూపు, స్పర్శ, చిరునవ్వు, దృశ్యం, పుస్తకం.. ఇలా ఏవైనా కావచ్చు. ఇలా ఏదోరకమైన పలకరింపును మనం చేయగలగాలి. అది పొందిన వారు, కోరుకునే వారికి తీయని అనుభూతినిస్తుంది. వారి మనసు ఆనంద సంద్రమవుతుంది. కొందరు ఎంత ఉన్నతపదవుల్లోకి వెళ్లినా తమ హితులను, స్నేహితులను, బంధువులను విస్మరించరు. పలకరించే ఏ సందర్భాన్ని వదలుకోరు. వారి హోదాకు, అంతస్థుకి చెందినవారిని ఎంత ఆప్యాయంగా, ఆత్మీయంగా పలుకరిస్తారో పేదలైనా, ధనికులైనా, చదువుకున్న వారైనా, చదువుకోనివారైనా ఒకేరకమైన ప్రవర్తన. ఒకేరకంగా పలకరిస్తారు. అది ఎంతో గొప్ప లక్షణం. ఇది చాలామందిలో ఉండదు. అటువంటి వారు వేళ్ళమీద లెక్కపెట్టే సంఖ్యలోనే ఉంటారు. అందుకే వారిది అపురూప వ్యక్తిత్వమవుతుంది. అదే మనకు ఆదర్శం కావాలి. ఆర్థిక బాధల్లో ఉన్న వారందరికీ మనం సహాయం చేయడం సాధ్యం కాకపోవచ్చు. అయితే, కష్టాల కడలిలో ఉన్న మన చుట్టాలను, స్నేహితులను, ఇరుగు పొరుగుని ఓదార్పుగా పలకరించవచ్చు. అది వారికి హార్దికంగా ఎంతో శక్తినిస్తుంది. పెడతోవలో వెళ్ళే వారి ఆలోచనలకు ఒక క్రమ మార్గం ఏర్పరుస్తుంది. ఇటువంటి సందర్భాలలోనే మన సంభాషణ చాతుర్యం తెలిసేది. మన మాటల ఎన్నిక, కూర్పు, పొందికలలో ఎంతో జాగ్రత్త అవసరం. ఇవన్నీ మన పలకరింపు పెదవులను దాటటానికి ముందు మనసులో జరిగే ప్రక్రియ. ఇది పూర్వభాగమైతే, మన భావనలు పలకరింపై ఎదుటివారిని చేరటం ఉత్తరభాగం. సరిగ్గా, ఇక్కడే మాటలకున్న అర్థాన్ని మనమెంత లోతుగా గ్రహించగలిగామో తెలిసేది. – లలితా వాసంతి -
ఐరాసలో పాక్ ‘శాంతి’ మాటలు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్
వాషింగ్టన్: ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ(యూఎన్జీఏ) 77వ సమావేశాల వేదికగా భారత్‌ను తప్పుపట్టాలని చూసిన పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు దీటుగా బదులిచ్చింది ఢిల్లీ. పొరుగుదేశాలతో శాంతిని కోరుకునేవారే అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషించరని స్పష్టం చేసింది. 1993 నాటి ముంబయి బాంబు పేలుళ్లను ప్రస్తావిస్తూ.. శాంతి కోరుకునేవారెవరూ అలాంటి హింసాత్మక దాడులకు కుట్రలు చేసిన వారికి ఆశ్రయం ఇవ్వరని మండిపడింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేస్తూ భారత్ 2019లో తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో శాంతి ప్రక్రియకు విఘాతం ఏర్పడిందన్నారు. భారత్ సహా అన్ని పొరుగు దేశాలతోనూ తాము శాంతిని కాంక్షిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత బృందం తొలి సెక్రెటరీ మిజిటో వినిటో పాక్‌పై నిప్పులు చెరిగారు. ‘భారత్‌పై తప్పుడు ఆరోపణలు చేసేందుకు పాకిస్థాన్ ప్రధాని ఈ వేదికను ఎంచుకోవడం విచారకరం. తమ సొంత దేశంలో జరిగిన అకృత్యాలు బయటపడకుండా ఉండేందుకు, భారత్‌కు వ్యతిరేకంగా పాక్ చేస్తోన్న చర్యలను సమర్థించుకునేందుకే ఆయన ఇలా మాట్లాడారు. పొరుగుదేశాలతో శాంతిని కోరుకుంటున్నామని చెబుతున్నారు. అలాంటి వారు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వరు. ముంబయిలో ఉగ్ర పేలుళ్లకు పాల్పడిన టెర్రరిస్టులకు ఆశ్రయం ఇవ్వరు. శాంతిని కాంక్షించేవారు.. అన్యాయంగా, అక్రమంగా పొరుగుదేశాల భూభాగాలను లాక్కోవాలని చూడరు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు వినిటో. పాకిస్థాన్‌తో ఉగ్రవాద రహిత వాతావరణంలో సాధారణ పొరుగు సంబంధాలను కొనసాగించాలని భారత్ కాంక్షిస్తోందని పేర్కొన్నారు వినిటో. జమ్మూకశ్మీర్ ఇప్పటికీ.. ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగామేనని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌లోని హిందూ, సిక్కు, క్రిస్టియన్ కుటుంబాల్లోని బాలికలకు బలవంతపు పెళ్లిళ్ల అంశాన్ని సూచిస్తూ.. మైనారిటీల హక్కులను కాలరాస్తున్న దేశం, అంతర్జాతీయ వేదికపై మైనారిటీల గురించి మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. శాంతి, భద్రత, పురోగతినే భారత్ కోరుకుంటోందని, అది సీమాంతర ఉగ్రవాదం సమసిపోయినప్పుడే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ప్రధాని మోదీ హత్యకు పీఎఫ్ఐ కుట్ర!.. వెలుగులోకి సంచలన విషయాలు -
2న జింఖానా మైదానంలో ప్రపంచ శాంతి సభ
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ జింఖానా మైదానంలో అక్టోబర్ 2వ తేదీన ప్రపంచ శాంతి సభను నిర్వహించనున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్ వెల్లడించారు. 2న సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు సభ జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు. సికింద్రాబాద్‌లోని హరిహరకళా భవన్లో శాంతి సభ పోస్టర్‌ను ప్రజా గాయకుడు గద్దర్, ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ... శాంతి సభలకు 25 పార్టీల్లో 19 పార్టీలు మద్దతు ప్రకటించి రానున్నారని ఆయన వెల్లడించారు. ఆర్థిక అసమానతలను రూపు మాపేందుకు, ప్రపంచ శాంతి కోసం ఈ సభలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఈ సభలకు ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నామని... ఆయన వస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని రాకపోతే ప్రజలు, దేవుడి తీర్పుకు అంగీకరించాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. మునుగోడు ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ పోటీలో ఉందని ప్రజా గాయకులు గద్దర్‌తో పాటు మరికొంత మంది పేర్లు పరిశీలిస్తున్నామని చెప్పారు. సెప్టెంబర్ 25న తన పుట్టిన రోజు సందర్భంగా 59 మంది మునుగోడు నియోజకవర్గ నిరుద్యోగులకు, అక్టోబర్ 2వ తేదీన సభకు వచ్చిన నిరుద్యోగుల్లో లాటరీ ద్వారా అమెరికాలో ఉద్యోగాల కోసం పాస్ పోర్టుతో పాటు వీసాను కూడా అందిస్తామని చెప్పారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ... ప్రజలందరూ సమానంగా, సమాన హక్కులు పొందడం అనేది ప్రజాస్వామ్య దేశం లక్ష్యమన్నారు. ప్రజాస్వామ్యం బతికి ఉండాలంటే లౌకికవాదాన్ని పదికాలాలపాటు సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తాము ఈ శాంతి సభలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ క్రిష్టియన్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రవికుమార్, కన్వీనర్ జీ శ్యాం అబ్రహాం, వివిధ ప్రాంతాలకు చెందిన పాస్టర్లు, సంఘ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, బిషప్‌లు పాల్గొన్నారు. (క్లిక్ చేయండి: ఉప ఎన్నిక కోసమే ‘గిరిజన బంధు’) -
ప్రజా శాంతి పార్టీ రద్దు కాలేదు: కేఏ పాల్
సాక్షి, హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ రద్దయిందని కొంత మంది ప్రచారం చేస్తున్నారని తమ పార్టీ రద్దు కాలేదని ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఖండించారు. గురువారం సికింద్రాబాద్‌లోని హరిహరకళాభవన్‌లో నగరంలోని వివిధ చర్చిలకు చెందిన కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తదితరులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీకి కేవలం ఈసీ నోటీసులు మాత్రమే ఇచ్చిందని దానికి త్వరలోనే సమాధానం పంపిస్తామని ఆయన స్పష్టం చేశారు. అక్టోబర్ 2వ తేదీన శాంతి సమ్మిట్‌ను నగరంలో నిర్వహిస్తున్నామని కేసీఆర్ ఒక్క లేఖ ఇస్తే రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయలు తెప్పిస్తానని ఆయన అన్నారు. కేసీఆర్ ఫాం హౌస్‌లో 9 లక్షల కోట్ల డబ్బు, బంగారం దాచి ఉంచారని అందుకే అందులోకి ఎవరినీ పంపించరన్నారు. వేల పాటలు రాసి పాడిన గద్దర్‌కు భారతరత్న ఇవ్వాలన్నారు. గద్దర్ మాట్లాడుతూ మనుషులను ప్రేమించే మనిషే దైవమని అలాంటి వ్యక్తి యేసు క్రీస్తు అని అన్నారు. కార్యక్రమంలో ఆయా సంఘాల ప్రతినిధులు రవికుమార్, శ్యామ్, దయానంద్ తదితరులు పాల్గొన్నారు. -
బుచా ఘటనపై స్పందించిన భారత్... స్వతంత్ర దర్యాప్తుకు మద్దతు
India has chosen side of peace: ఉక్రెయిన్ పై రష్యా ప్రస్తుతం భయంకరంగా విరుచుకుపడటమే కాకుండా యుద్ధ నేరాలకు పాల్పడుతోంది. అంతేకాకుండా బుచా నగరాన్ని శ్మశానంగా మార్చేసింది. ఈ నేపథ్యంతో భారత్ కూడా త్రీవ స్థాయిలో స్పందించింది. ఈ మేరకు బుధవారం లోక్‌సభలో ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చ సందర్భంగా ఉక్రెయిన్‌లోని బుచా నగరంలో జరిగిన హత్యలను భారత్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. దీనిపై స్వతంత్ర దర్యాప్తు కోసం మద్దతు ఇస్తున్నాం అని చెప్పారు. ఉక్రెయిన్, రష్యా మధ్య చర్చలను భారత్ ప్రోత్సహిస్తుందని, శత్రుత్వాలను తక్షణమే నిలిపివేయాలని ఉద్ఘాటించారు. ఇది ఒక రకంగా రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్కి ఇచ్చిన సందేశం. అంతేకాదు సాధారణ పౌరులు ఎలాంటి సమస్యలకు గురికాకుండా చూడటానికి భారత్ ప్రాధాన్యతనిస్తుందని భారత విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. అనేక దేశాలు భారత్‌తో నిమగ్నమై ఉన్నాయని, ఒకే అభిప్రాయాన్ని పంచుకున్నమని అన్నారు. ఈ విధంగా కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని జై శంకర్ పేర్కొన్నారు. అంతేగాదు యూఎన్భద్రతా మండలి సమావేశంలో కూడా ఈ విషయమై భారత్ ఖండించడమే కాకుండా స్వతంత్ర దర్యాప్తు కోసం పిలుపునిచ్చింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితిలో భారత్ శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి మాట్లాడుతూ... “యుద్ధంలో భద్రతా పరిస్థితి క్షీణించింది, అలాగే మానవతా విలువలు కూడా క్షీణించాయి. ఇటీవల బుచాలో పౌర హత్యలకు సంబంధించిన నివేదికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మేము ఈ హత్యలను నిస్సందేహంగా ఖండిస్తున్నాము. స్వతంత్ర దర్యాప్తు పిలుపుకు మద్దతు ఇస్తున్నాము. అని అన్నారు. ( చదవండి: రష్యా ‘బుచా’ నరమేధం!.. భారత్ స్పందన ఇది) -
ప్రపంచ శాంతికి ఉమ్మడి సహకారం
బీజింగ్: ఉక్రెయిన్–రష్యా యుద్ధం మనం కోరుకోని సంక్షోభం అని చైనా అధినేత షీ జిన్‌పింగ్ అన్నారు. ప్రపంచమంతటా శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, ఇందుకోసం ఉమ్మడిగా సహకారం అందిద్దామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సూచించారు. ఇరువురు నేతలు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం, ప్రస్తుత పరిణామాలపై చర్చించారు. ప్రపంచ శాంతి, అభివృద్ధికి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని జిన్‌పింగ్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో శాంతి సామరస్యం, స్థిరత్వం కనిపించడం లేదని అన్నారు. దేశాలు ఏవైనా సరే యుద్ధ రంగంలో కలుసుకొనే పరిస్థితి రాకూడదని పేర్కొన్నారు. -
యుద్ధమూ... శాంతి
యుద్ధం ఎక్కడ జరిగినా, ఎప్పుడు జరిగినా, ఎందుకు జరిగినా మానవాళికి తీరని నష్టం తప్పదు. ఇందుకు ఎన్నో అనుభవాలు ఇప్పటికే ఉన్నాయి. గడచిన యుద్ధాలు చేసిన గాయాల మచ్చలింకా మిగిలే ఉన్నాయి. అయినా ఇప్పటికీ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ‘యుద్ధం ఎప్పుడు వచ్చినా, తొలుత మరణించేది సత్యమే’ అన్నాడు అమెరికన్ రాజనీతిజ్ఞుడు హైరమ్ వారెన్ జాన్సన్. చరిత్రలో యుద్ధాలతో గడిచిన కాలమే ఎక్కువ. యావత్ ప్రపంచం అంతటా శాంతి పరిఢవిల్లిన కాలం చాలా తక్కువ. లోకంలో ఎందుకు శాంతికి కరవు ఏర్పడుతోందంటే, ‘పగవృద్ధి బొందించు భ్రష్టులే కాని/యడగించు నేర్పరు లవనిలో లేరు’ అని ‘పలనాటి వీరచరిత్ర’లో కవిసార్వభౌముడు శ్రీనాథుడు ఏనాడో కుండబద్దలు కొట్టాడు. అంతేకాదు, ‘బోరు మంచిదికాదు భూమినెక్కడను/ పాడౌను దేశంబు పగమించెనేని’ అని హితవు పలికాడు. యుద్ధోన్మాదం తలకెక్కిన నియంతలకు, మిథ్యాపౌరుషాలతో పిచ్చిపట్టిన పాలకులకు ఇలాంటి హితోక్తులు రుచించవు. వాళ్ల ఆధిపత్యమే వాళ్లకు ముఖ్యం. వాళ్ల చండశాసనాలు చలామణీ కావడమే వాళ్లకు ముఖ్యం. ప్రపంచంలో ఏదో ఒక దేశం సహేతుకంగానో, నిర్హేతుకంగానో మరో దేశం మీదకు దండెత్తుతుంది. దండయాత్రకు గురైన దేశం అనివార్యంగా ఆత్మరక్షణ కోసం యుద్ధంలోకి దిగుతుంది. అలా మొదలైన యుద్ధం ఎన్నాళ్లు సాగుతుందో, ఎన్నేళ్లు సాగుతుందో ఎవరూ అంచనా వేయలేరు. యుద్ధం ముగిశాక చూసుకుంటే రెండు దేశాల్లోనూ సామాన్య పౌరులకు మిగిలేది అంతులేని విషాదమే! ఉక్రెయిన్‌పై రష్యా ప్రస్తుతం యుద్ధం కొనసాగిస్తున్న నేపథ్యంలో మూడో ప్రపంచయుద్ధం ముంచుకొచ్చే ప్రమాదం లేకపోలేదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అంతపనే గనుక జరిగితే, అప్పుడు జరగబోయే అనర్థాలను ఎవరూ అంచనా వేయలేరు.‘మూడో ప్రపంచయుద్ధంలో ఏ ఆయుధాలతో పోరు జరుగుతుందో నాకు తెలీదుగాని, నాలుగో ప్రపంచయుద్ధంలో మాత్రం కర్రలు, రాళ్లతోనే పోరు జరుగుతుంది’ అన్నాడు ఐన్‌స్టీన్. ఒకవేళ మూడో ప్రపంచయుద్ధమే గనుక జరిగితే, ఆ యుద్ధంలో జరిగేది నాగరికతా వినాశనమేనని ఆయన అంచనా. నాగరికత నశించాక మనుషులకు కొట్టుకోవడానికి మిగిలేవి కర్రలు, రాళ్లే! ఆధిపత్య వాదులు, నిరంకుశ నియంతలు తప్ప సామాన్యులెవరూ యుద్ధాలను కోరుకోరు. యుద్ధాల్లో పాల్గొనే సాధారణ సైనికులు సైతం స్వభావసిద్ధంగా శాంతికాముకులుగానే ఉంటారు. విధి నిర్వహణ కోసం తప్ప ఉత్తపుణ్యానికే వారెవరితోనూ కయ్యానికి కాలుదువ్వరు. ‘వయసు మళ్లిన వాళ్లు యుద్ధాలను ప్రకటిస్తారు. అయితే, యుద్ధాల్లో పాల్గొని ప్రాణాలు పోగొట్టుకునేది యువకులే’ అన్నాడు అమెరికన్ రాజనీతిజ్ఞుడు హెర్బర్ట్ హూవర్. నాగరికతలు మొదలైన నాటి నుంచి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. క్రీస్తుకు పూర్వం శతాబ్దాల కిందటి నుంచే కళా సాహిత్యాలలో యుద్ధం ప్రభావం కనిపిస్తుంది. యుద్ధం వల్ల అనర్థాలు తప్ప ఒరిగేదేమీ ఉండదని ఎందరో కవులు, రచయితలు, తత్త్వవేత్తలు చెబుతూనే వస్తున్నారు. మొదటి ప్రపంచయుద్ధానికి చాలాకాలం ముందే రష్యన్ రచయిత లియో టాల్‌స్టాయ్ ‘వార్ అండ్ పీస్’ నవల రాశాడు. యుద్ధాలకు ఉవ్విళ్లూరే పాలకుల ధోరణిని ఎత్తిపొడుస్తూ, ‘రాజులు చరిత్రకు బానిసలు’ అని ఆయన తేల్చాడు. యుద్ధాల్లో మంచి యుద్ధాలు, చెడ్డ యుద్ధాలు అంటూ ఏవీ ఉండవు. ఎలాంటి యుద్ధమైనా– అది ఒక సామూహిక మానవ హననకాండ. ‘ఎంత అవసరమైనా సరే, ఎంత సమర్థనీయమైనా సరే యుద్ధం నేరం కాదనుకోవడం తగదు’ అని అమెరికన్ రచయిత ఎర్నెస్ట్ హెమింగ్వే అన్నట్లు ఎలాంటి యుద్ధమైనా, అది మానవాళి పట్ల నేరమే! ఈ భూమ్మీద యుద్ధం జరగని చోటంటూ ఏదీ లేదు. ‘రణరంగం కానిచోటు భూ/ స్థలమంతా వెదకిన దొరకదు/ గతమంతా తడిసె రక్తమున/ కాకుంటే కన్నీళులతో’ అన్నాడు శ్రీశ్రీ. ప్రత్యక్ష యుద్ధాలు, ప్రచ్ఛన్న యుద్ధాలు, అంతర్యుద్ధాలు– ఇలా రకరకాల యుద్ధాలు ఎక్కడో ఒకచోట ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉన్నాయి. యుద్ధంలో గెలిచిన పక్షమే సరైనదని నిర్ణయించలేం. యుద్ధం ముగిసీ ముగియడంతోనే శాంతి వెల్లివిరుస్తుందనుకోవడం భ్రమ! యుద్ధం ముగిశాక మనుషుల మధ్య సామరస్యాన్ని కాపాడుకోగలిగినప్పుడే శాంతి స్థాపనకు ఆస్కారం ఏర్పడుతుంది. ‘యుద్ధంలో గెలుపు సాధించడంతోనే సరిపోదు. శాంతిని నెలకొల్పి, దానిని కాపాడుకోవడం ముఖ్యం’ అన్నాడు గ్రీకు తత్త్వవేత్త అరిస్టాటిల్. ఇప్పటికే జరిగిన రెండు ప్రపంచయుద్ధాలు మానవాళికి అనేక గుణపాఠాలు నేర్పాయి. రెండో ప్రపంచయుద్ధం ముగిశాక ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. శాంతిని ఉల్లంఘించే దేశాలపై చర్యలు తీసుకునేందుకు అంతర్జాతీయ కోర్టు ఏర్పడింది. శాంతి స్థాపన కోసం అంతర్జాతీయ చట్టాలు అమల్లోకి వచ్చాయి. ప్రపంచశాంతి కోసం ఇంతటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా యుద్ధాలు జరగడం ఆగట్లేదు. ‘రెండు యుద్ధాల నడుమ విరామ కాలమే శాంతి’ అన్నాడు బ్రిటిష్ ఆర్థికవేత్త రాల్ఫ్ హాట్రే. అయితే, యుద్ధాలు సమసిపోయిన తర్వాత కూడా చాలాచోట్ల ఉద్రిక్తతలు కొనసాగే పరిస్థితులు ఉన్నప్పుడు వర్తమాన ప్రపంచంలో శాంతి అనేది ఒక ఎండమావి! బలిసిన దేశాలు ఒకవైపు శాంతి ప్రవచనాలు చెబుతూనే, మరోవైపు అణ్వాయుధ సంపదను పోగేసుకుంటూ, ఆయుధ వ్యాపారాలు సాగిస్తున్న నేపథ్యంలో ప్రపంచశాంతి ఎంతమేరకు సాధ్యమవుతుందో చరిత్రే చెప్పాలి మరి! -
మానవతా శిఖరం మహాత్ముడు
నేడు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఘర్షణ వాతావర ణమే. కులాలు, మతాలు, జాతి వైరాలతో హింస తాండవిస్తోంది. గాంధీజీ భావాలను, సాధించిన విజయాల్ని తలచుకుంటే మానవజాతి భవితపై కమ్ముతున్న కారు చీకట్ల మధ్య జాతిపిత ఒక కాంతికిరణం అనిపిస్తుంది. గాంధీజీ పరిపూర్ణ వ్యక్తి. సత్యాన్వేషణలో తన జీవితాన్ని ప్రయోగశాలగా మలుచుకున్న గొప్ప శక్తి. స్వార్థం, అర్థంలేని వస్తు వ్యామోహం... ఇలా ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్య లకు తన ఆత్మకథలో పరిష్కారాలు చూపారు. విద్యార్హతలు, హోదా మనిషిని గౌరవించడానికి కొలమానాలు కావంటారు. ఎదుటి మనిషిని ఆత్మ రూపంగా, సత్య రూపంగా చూడమంటారు. ఆ ఆధ్యాత్మిక, నైతిక దృష్టికోణాన్ని అలవర్చుకోగలి గితే మానవ సంబంధాలతో ముడిపడిన తొంభై శాతం సమస్యలు పరిష్కారమైనట్లేనని గాంధీ మార్గం సూచిస్తుంది. ఎంత చదివినా, ఎంత సంపాదించినా ఆధు నిక జీవితం సమస్యాత్మకమే అవుతోంది. ఏదో అసంతృప్తి, ఆవేదన కనిపిస్తున్నాయి. వాస్తవానికి గాంధీ సైతం ఒక దశలో అలాంటి ఆలోచనల్లో పడిన వారే. అప్పుడే సత్యశోధన అంకురించింది. తాను వెళుతున్న మార్గం ఎంత తప్పో గ్రహించారు. రెండు గదుల ఇంటి నుండి ఒక గదికి మారారు. హోటల్ భోజనం నుండి స్వయంపాకంలోకి వచ్చారు. సరళ జీవితం సమయాన్ని ఆదా చేసింది. అప్పుడే తన జీవితం సత్యమైనదన్న గ్రహింపు కలిగి ఆత్మ సంతృప్తి కలిగిందంటారు గాంధీ. ఆయన దృష్టిలో సత్యం అంటే మాటకు సంబం ధించింది మాత్రమే కాదు; అది ఆలోచన, ఆచరణ లతో ముడిపడింది కూడా. గాంధీ మార్గంలో మరో అడుగు పశ్చాత్తాపం. నీటితో బురదను కడుక్కున్నట్లు పశ్చాత్తాపంతో పాపాల్నీ, లోపాల్నీ శుభ్రపరచుకోవచ్చు అని నిరూపించారు. అపరాధం చేశానని భావించిన ప్రతిసారీ ఉత్తరాల రూపంలో క్షమాపణ కోరేవారు. అలాగే ఉపవాసాన్ని ఒక బలమైన ప్రాయశ్చిత్త మార్గంగా భావించారు. గాంధీ మార్గంలో మరో మజిలీ అహింస. సత్యం అనే గమ్యాన్ని చేరుకోవ డానికి అహింసే ప్రధాన మార్గం అని భావించారు మహాత్ముడు. సమస్యలు, సంక్షోభాలు ఎన్ని వచ్చినా ఆ మార్గాన్ని వీడలేదు. సత్యసంధత వల్ల క్రోధం, స్వార్థం, ద్వేషం సమసిపోతాయి. రాగ ద్వేషాలు ఉన్న వ్యక్తి ఎంత మంచివాడైనా శుద్ధ సత్యాన్ని దర్శించలేడని చెబుతారు. స్వాతంత్య్ర సమరం అహింసా మార్గంలో జరిగింది కాబట్టే శత్రువులుగా ఉండాల్సిన బ్రిటిష్‌వారు సైతం గాంధీజీని మహనీయుడిగా భావించారు. గాంధీజీ అన్ని మతాలకు సమాన స్థానం ఇచ్చారు. కేవలం మత పాండిత్యం వ్యర్థం అన్నారు. ప్రార్థన అంటే కోరికలు కోరడం కాదు. అది భగవంతుడిపై ఆత్మకు ఉండే గాఢమైన అను రక్తి. తన సమస్తం దైవానిదేనని భావించి, ఆ భావం మీదే మనస్సు కేంద్రీకరించడం. దైవానికీ, మానవ రూపంలో కనిపించే మాధవుడికీ సేవ చేయడానికి తన జీవి తాన్ని అంకితం చేసిన దివ్య శక్తిమయుడు. విద్యా విధానం, అంట రాని తనం, హరిజనో ద్ధరణ, ఖద్దరు విని యోగం, ఉపవాస దీక్ష... ఇలా ప్రతి అంశంపైనా గాంధీజీకి స్పష్టమైన అభిప్రాయాలు ఉండేవి. స్వతంత్ర భారతంలో ప్రజాప్రతినిధులు ఎలా ఉండాలన్న అంశం పైనా ప్రత్యేక అభిప్రాయాలు ఉండేవి. గాంధీజీ అంతర్జాతీయవాది. ప్రపంచ శ్రేయంలోనే దేశ శ్రేయం ఉందని భావించారు. గాంధీజీ సూచించిన విశ్వ మానవతా వాదనను ఆచరిస్తే – సరిహద్దు గొడవలు, జాతి వైషమ్యాలు, మతకలహాలు కనుమరుగవుతాయి. జగమంతా శాంతిమయం అవుతుంది. (నేడు గాంధీ జయంతి) డా. అశోక్ పరికిపండ్ల వ్యాసకర్త గాంధీ రీసెర్చ్ ఫౌండేషన్ తెలంగాణ కన్వీనర్ ‘ 99893 10141 -
అంతర్జాతీయ శాంతి దినోత్సవం 2021: ఎక్కడ శాంతి? ఎన్నాళ్లకు విముక్తి?
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ దేశాల్లోని ప్రజలంతా శాంతియుత జీవనం గడపాలనే ఉద్దేశంతో ఏటా సెప్టెంబర్ 21న అంతర్జాతీయ శాంతి దినోత్సవం నిర్వహిస్తున్నాం. దీనికి సంబంధించి యునైటెడ్ నేషన్స్ 1981వ సంవత్సరంలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. అంతర్జాతీయంగా ఘర్షణలు తొలగిపోయి శాంతియుత సమాజం నిర్మాణమే లక్ష్యంగా శాంతి దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ మూడో మంగళవారం అంతర్జాతీయ శాంతి దినోత్సవం జరపాలని 1981లో ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ సమావేశంలో నిర్ణయించినా ఆ తరువాత 2001లో సెప్టెంబర్ 21 తేదీన నిర్వహించాలని ఐరాస నిర్ణయించింది. ఆ ఏడాది అంతర్జాతీయంగా అహింస, కాల్పుల విరమణ దినోత్సవంగా నిర్వహించింది. అది మొదలు ప్రతీ ఏడాది ఏదో ఒక థీమ్‌తో అంతర్జాతీయ శాంతి దినోత్సవం జరుపుకోవడం అనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో 2021 అంతర్జాతీయ శాంతి దినోత్సవం థీమ్: సమాన, సుస్థిరమైన ప్రపంచం కోసం వేగంగా కోలుకోవడం (Recovering Better for an Equitable and Sustainable World) ప్రస్తుతం, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో అహింస నెలకొంది. ముఖ్యంగా అఫ్గానిస్తాన్‌లో ఇటీవలి సంక్షోభంతో అక్కడి ప్రజలు, ముఖ్యంగా మహిళలు అనేక రకాల హింసను అనుభవిస్తున్నారు. ఈ దీర్ఘకాలిక హింస, అనిశ్చితి కారణంగా పౌరుల్లో తీవ్ర నిరాశ, నిస్పృహలు అలముకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ శాంతి స్థాపన అనేది కలగా మారుతోంది. హింసాత్మక, వినాశకర సంఘర్షణలను నివారించడమే కాకుండా దాన్ని పరిష్కరించడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి. మరోవైపు కరోనా మహమ్మారి ప్రపంచ పరిస్థితులను తల్లకిందులు చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది థీమ్‌ను వేగంగా కోలుకోవడం అనే అంశాన్ని ప్రధానంగా తీసుకోవడం గమనార్హం. కరోనా మహమ్మారి అంతమైపోవాలని ప్రతిన బూనుదాం. పూర్తి ఆరోగ్యమైన ప్రపంచాన్ని కలగందాం. అలాగే మనుషులందరూ మానవత్వమున్న పౌరులుగా మారాలని, మానవ విలువలకు పెద్ద పీట వేస్తూ, పొరుగువాడిని ప్రేమిస్తూ జీవించాలని కోరుకుందాం. శాంతియుత ప్రపంచాన్ని కోరుకుందాం. ‘శాంతి చిరునవ్వుతో మొదలవుతుంది’- మదర్ థెరిస్సా ‘‘న్యాయస్థానాల కంటే ఉన్నత న్యాయస్థానం మనస్సాక్షి. ఇది అన్ని ఇతర కోర్టులకంటే చాలా ఉన్నతమైంది" - మహాత్మా గాంధీ ఈ సంవత్సరం ప్రపంచ శాంతి సగటు స్థాయి 0.07 శాతం క్షీణించింది. గత పదమూడు సంవత్సరాలలో వరుసగా ఇది తొమ్మిదవ క్షీణత. ఈ విషయంలో 87 దేశాలు మెరుగుపడుతుంటే 73 దేశాలు రికార్డ్ స్థాయిలో క్షీణిస్తున్నాయి. ♦ ఐస్‌ల్యాండ్ ప్రపంచంలో అత్యంత ప్రశాంతమైన దేశం. ఈ విషయంలో 2008 నుండి తన ప్రత్యేకతను నిలుపుకుంటోంది. ♦ యూరప్ ప్రపంచంలో అత్యంత ప్రశాంతమైన ప్రాంతంగా ఉంది. ♦ న్యూజిలాండ్, డెన్మార్క్, పోర్చుగల్, స్లోవేనియా 3, 4, 5 స్థానాల్లో ఉన్నాయి. ♦ అఫ్గానిస్తాన్ వరుసగా నాలుగో సంవత్సరం ప్రపంచంలోనే అతిపెద్దఅశాంతి దేశంగా నిలుస్తోంది. ♦ ప్రపంచం అత్యంత శాంతియుతంలో దేశాల ర్యాంకులో భారత్ 135 స్థానంలో ఉంది. ♦ దక్షిణ ఆసియాలో అత్యంత ప్రశాంతమైన దేశం భూటాన్. -
సరస్సు మీద ఎగురుతున్న శాంతి కపోతాలు
తూర్పు లద్దాఖ్ ప్రాంతం లోని పాంగాంగ్ సరస్సు దగ్గర భారత్, చైనా తమ సైన్యాన్ని ఉపసంహరించుకొనే ప్రక్రియ ప్రారంభించడం శుభసూచకం. ఇందుకు కారణమైన ఇరు దేశాల ప్రభుత్వాధినేతలను, దౌత్యవేత్తలను, మిలిటరీ అధి కారులను ప్రత్యేకంగా అభినం దించాలి. గడచిన తొమ్మిది నెలల్లో, తొమ్మిది రౌండ్ల సుదీర్ఘ చర్చల అనంతరం తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో యథాస్థితికి (2020 ఏప్రిల్‌కు పూర్వం స్థితి) తిరిగి రావాలని నిర్ణయించుకొన్నట్లు పార్లమెంటు ఉభయ సభల్లో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించే ఈ ఒప్పందం శాంతి, సుస్థిరతలకు ఆశాజనకంగా ఉంటుందని చైనా విదే శాంగ నిపుణుడు వూ కియాన్ వ్యాఖ్యానించారు. ఆగస్టు 29–30 తేదీల్లో భారత సైనికులు కైలాశ్ పర్వత శ్రేణుల వరకూ చొచ్చుకొని పోవటంతో ఇంచు మించు యుద్ధపరిస్థితులకు దారితీసినట్లు కనబడినా ఈ పరిణామం చైనాను చర్చలకు ఉసిగొల్పిందని విశ్లేష కులు భావిస్తున్నారు. మీరు ముందు అంటే, కాదు మీరే ముందు అంటూ, ఉపసంహరణ ప్రక్రియను జాప్యం చేయటం కన్నా ఉభయులు ఒకేసారి ఇరువైపుల నుంచి సైన్యాన్ని, యుద్ధసామగ్రిని వెనక్కి రప్పించుకోవటా నికి ఒప్పందం కుదుర్చుకోవటం ఇరుదేశాల దౌత్య నీతికి నిదర్శనం. మొదటగా చైనా యుద్ధ ట్యాంకులు పాంగాంగ్ సరస్సు ఉత్తర భాగం నుంచి వెనక్కి పయన మవటాన్ని గమనించిన వెంటనే భారత యుద్ధ ట్యాంకులు కూడా వెనక్కి మరలాయి. వాస్తవాధీనరేఖను గౌరవించటం, దానిపై ఇరు పక్షాలు లోగడ చేసుకొన్న ఒప్పందాలకు కట్టుబడి ఉండటం ప్రధాన ఆశయమని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మొత్తం ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన 48 గంటల్లోపే ఇరు పక్షాల కమాండర్ స్థాయి అధి కారులు మరలా సమావేశమై మిగతా వివాదాస్పద కేంద్రాల పరిష్కార మార్గాల గురించి చర్చిస్తారని ఆయన చెప్పారు. గోగ్రా, హాట్‌స్ప్రింగ్స్, డేప్సాంగ్, గల్వాన్ ప్రాంతాలు ఈ చర్చల ఎజెండాలో ఉంటాయి. ఫింగర్ 8, ఫింగర్ 4లకు ఇకపై ఇరువైపుల నుంచీ పెట్రోలింగ్ ఉండదు. ఇరు పక్షాల మధ్య కొన్ని మౌలిక ఒప్పందాలు కుదిరిన తర్వాతనే తిరిగి పెట్రోలింగ్ ప్రారంభమవుతుంది. లోగడ భారత్ ఫింగర్ 8 వరకు, చైనా పాంగాంగ్ సరస్సు ఉత్తరం వైపునకూ ప్రవేశిం చాయి. ఇరుదేశాలు ఇదివరలో ఉన్న శాశ్వత కట్టడా లవైపు (భారత్–ధన్సింహ్ థాపా పోస్టు, చైనా– ఫింగర్ 8కు తూర్పువైపునున్న సిరిజాప్ పోస్టు) వెళ్లి పోయి, ఇటీవల కాలంలో నిర్మించిన నూతన క్యాంపులు, కట్టడాలు తొలగించుకొంటాయి. మనదేశ సరిహద్దు ప్రాంతాన్ని చైనా వశపర్చు కోలేదనీ, 1962 యుద్ధంలోనే 43 వేల చదరపు కిలో మీటర్లు చైనా అధీనంలోకి వెళ్లిందని రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. వాస్తవాధీన రేఖ వాస్తవానికి ఫింగర్ 8 వరకే ఉందని, ఫింగర్ 4 వరకూ లేదని అన్నారు. సరి హద్దు సమస్యలు ఒకేసారి పరిష్కారం కాకపోవచ్చు. ఒకరిపై ఒకరు విశ్వాసాన్ని కోల్పోయి యుద్ధ సన్నా హాలు చేయడం కంటే, అంచెలవారీగా శాంతి సన్నా హాలు చేయడమే ఉత్తమం. ఇరు దేశాల కోట్లాది డాలర్ల ప్రజాధనాన్ని ఇకపై తగ్గించుకోవచ్చు. కారాకోరవ్ు పర్వతశ్రేణుల దగ్గర ప్రారంభమయ్యే ఈ పాంగాంగ్ సరస్సు అనగానే గుర్తొచ్చేది ఆమీర్‌ఖాన్ ‘త్రీ ఈడియట్స్’ చిత్రం. రంగులు మారే ఈ సరిహద్దు సరస్సు రమ్యంగా ఉంటుంది. తూర్పు లద్దాఖ్‌లో ప్రారంభమై, అక్సాయ్‌చిన్ గుండా టిబెట్ వరకూ బూమరాంగ్ ఆకారంలో వ్యాపించి ఉంటుంది. 135 కిలోమీటర్ల పొడవున్న ఈ ఉప్పునీటి సరస్సు ఒక ప్రాంతంలో 5 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. సముద్ర మట్టానికి 4,225 మీటర్ల ఎత్తులో ఉండి, ప్రపంచంలో ఎత్తయిన ప్రాంతంలో ఉన్న రెండవ అతిపెద్ద సరస్సుగా ప్రఖ్యాతి గాంచింది. చలికాలంలో ఐస్‌గడ్డగా మారుతుంది. అప్పుడు పోలో, ఐస్హాకీ దీనిపై ఆడతారు. 40 శాతం సరస్సు మనదేశంలో ఉండగా, మిగిలిన 60 శాతం చైనాలో ఉంటుంది. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే యాత్రికులతో నిత్యం కళకళలాడుతూ ఆకర్షణగా నిలవగలదు. బుడ్డిగ జమిందార్ వ్యాసకర్త, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం మొబైల్ : 98494 91969 -
ఆటకు సై
ఒలింపిక్స్‌కు దగ్గూ జ్వరం. ఐపీఎల్‌కు ఒళ్లునొప్పులు. అండర్–17 మహిళల కప్‌కు గొంతునొప్పి. కోట్ల మంది క్రీడాభిమానులకు ఐసొలేషన్. ‘మీ ఆటలు సాగవు..’ అంటోంది కరోనా. ‘నీ ఆటల్నే కట్టిపెట్టు’ అంటున్నారు క్రీడాకారిణులు. ఓడించేందుకు అటువైపు ఎత్తుగడలు. గెలిచి తీరేందుకు ఇటువైపు సర్వశక్తులు. వైరస్‌పై యుద్ధానికి బరి ఉండకపోవచ్చు. స్పోర్ట్స్ ఉమెన్ ఇచ్చే విరాళాల పోరాట స్ఫూర్తికి తిరుగుంటుందా! ఈషాసింగ్ ముప్పై వేలు గన్‌లో బులెట్ మాత్రమే ఉంటుంది. ఆ బులెట్ వెళ్లి టార్గెట్‌కు తగిలేలా గురి చూసి ట్రిగ్గర్ నొక్కడం మాత్రం షూటర్ చేతిలో ఉంటుంది. ఈషా సింగ్ షూటర్. వయసు పదిహేను. పి.ఎం. రిలీఫ్ ఫండ్‌కి 30 వేల విరాళం ఇచ్చింది. ‘నా సేవింగ్స్ నుంచి ఇస్తున్నాను’ అని ట్వీట్ చేసింది. కరోనా సంహారానికి విరాళం ఇవ్వడం ద్వారా తన గన్ ట్రిగ్గర్ నొక్కిన అతి చిన్న వయసు క్రీడాకారిణి ఈషా.. హైదరాబాద్‌లోని బోల్టన్ స్కూల్ విద్యార్థిని. వయసెంత అని కాదు, దాచుకున్న మొత్తం ఇచ్చేయడం భారీ విరాళం కాదంటారా?! హిమాదాస్.. నెల జీతం హిమాదాస్ (20) స్ప్రింటర్. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన 49 మంది ‘టాప్ స్పోర్ట్స్పర్సన్స్’లో హిమ ఒకరు. కరోనాను పరుగెత్తించేందుకు ఆమె కూడా తను ఇవ్వగలినంత ఇచ్చారు. తన ఒక నెల జీతాన్ని అస్సాం ప్రభుత్వానికి ఇచ్చారు. గౌహతిలోని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్లో హెచ్.ఆర్.ఆఫీసర్‌గా ఉన్నారు హిమ. సింధు ఐదు ప్లస్ ఐదు తెలుగు రాష్ట్రాల క్రీడాజ్యోతి పి.వి.సింధు (20) ఏపీ, తెలంగాణ సీఎంల రిలీఫ్ ఫండ్‌కు పది లక్షల రూపాయలు ఇచ్చారు. 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన ఈ బాడ్మింటన్ చాంపియన్.. కరోనాపై పోరులోనూ చాంపియనేనని తన విరాళం ద్వారా నిరూపించుకున్నారు. ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడటంతో ఆమె అభిమానులు నిరుత్సాహపడినప్పటికీ ఆమె మాత్రం... ‘‘ముందు జీవితం. తర్వాతే ఈవెంట్స్’’ అన్నారు. మిథాలీ పది లక్షలు రైట్ హ్యాండ్ బాట్స్ఉమన్, వన్డే ఇంటర్నేషనల్ టీమ్ కెప్టెన్ మిథాలీరాజ్ (37) కరోనాకు ముక్కు పగిలే షాటే ఇచ్చారు. ప్రధాని ఫండ్‌కి 5 లక్షలు, తెలంగాణ సీఎం ఫండ్‌కి 5 లక్షలు. ‘కొద్దిగా మాత్రమే ఇవ్వగలుగుతున్నాను’ అని ట్వీట్ కూడా చేశారు మిథాలి. పదిలో, ఐదులో లేదు విలువ. ‘ఇవ్వడం’లో ఉంది. భారత మహిళా క్రికెట్ జట్టులోని ఈ సీనియర్ హ్యాండ్.. ఆటలో తనకెదురైన సమస్యల్ని గుండె నిబ్బరంతో డీల్ చేశారు. కరోనాను తరిమికొట్టేందుకు ప్రభుత్వాలకైనా, ప్రజలకైనా కావలసింది అలాంటి నిబ్బరమే. దీప్తి శర్మ లక్షన్నర బ్యాటింగ్‌లో లెఫ్ట్ హ్యాండ్, బౌలింగ్‌లో రైట్–ఆర్మ్ ఆఫ్ బ్రేక్ ప్రావీణ్యాలు గల టీ20 వరల్డ్ కప్ టీమ్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ (22) కరోనాకు లెఫ్ట్ అండ్ రైట్ వాయించడానికి తన వైపు నుంచి వెస్ట్‌బెంగాల్ స్టేట్ ఎమర్జెన్సీ ఫండ్‌కి 50 వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు. అది కాకుండా, పి.ఎం. రిలీఫ్ ఫండ్‌కి, యు.పి. రిలీఫ్ ఫండ్‌కి కలిపి లక్ష రూపాయలు ఇచ్చారు. దీప్తి ఆగ్రాలో పుట్టారు. తండ్రి రైల్వేస్‌లో చేశారు. అలా ఆమెకు యు.పి.తోనూ, పశ్చిమ బెంగాల్తోనూ అనుబంధం ఉంది. ప్రియాంక పది వేలు ప్రస్తుతం బెంగాల్ జట్టుకు యు–19 కోచ్‌గా ఉన్న భారత జట్టు మాజీ క్రికెట్ ప్లేయర్ ప్రియాంక రాయ్ (32) బెంగాల్ కరోనా రిలీఫ్ ఫండ్‌కి పది వేల రూపాయలు ఇచ్చారు. బ్యాటింగ్‌లో రైట్ హ్యాండ్, బౌలింగ్‌లో లెగ్ బ్రేక్, కోచింగ్‌లో.. ‘హెడ్స్ అండ్ షోల్డర్స్, నీస్ అండ్ టోస్’లా ఉండే ప్రియాంక.. విరాళం మాత్రమే ఇచ్చి ఊరుకోలేదు. లాక్డౌన్లో ప్రజలెవ్వరూ ఇళ్లలోంచి రాకుండా మోటివేట్ కూడా చేస్తున్నారు. పూనమ్ రెండు లక్షలు ఇటీవలి ఉమెన్ టి20 వరల్డ్ కప్‌లో దుమ్ము రేపిన స్పిన్నర్ పూనమ్ యాదవ్ (28) కరోనా కొమ్ములు వంచడం కోసం పి.ఎం.–కేర్స్ ఫండ్‌కి, యు.పి. సీఎం ఫండ్‌కి కలిపి 2 లక్షల రూపాయలను ఇచ్చారు. కెరీర్ ఆరంభంలో ఎదురైన తట్టుకోలేని పరిస్థితులకు నిరుత్సాపడి క్రికెట్‌ను వదిలేసినప్పుడు తండ్రే ఆమెలో ఫైటింగ్ స్పిరిట్ నింపి, మళ్లీ క్రికెట్లోకి పంపించారు. ఆర్మీ ఆఫీసర్ ఆయన. పూనం జీవితంలోంచి ఇప్పుడు మనం తీసుకోవలసింది ఇదే. కరోనాపై ఆర్మీ స్పిరిట్‌తో పోరాడాలని. మేరీ కోమ్ కోటీ లక్ష కరోనాకు ఇవ్వవలసిన పంచ్‌నే ఇచ్చారు బాక్సర్ మేరీ కోమ్ (37). రాజ్యసభ సభ్యురాలు కూడా అయిన కోమ్ ఎంపీ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ నుంచి కోటి రూపాయలను కరోనాపై పోరుకు విడుదల చేశారు. రాజ్యసభ సభ్యురాలిగా తన ఒక నెల జీతాన్ని పి.ఎం. నేషనల్ రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చేశారు. రీచా.. మనూ.. అపూర్వీ ఉమెన్ టి20 వరల్డ్ కప్‌లో భారత జట్టు ఆల్ రౌండర్ పదహారేళ్ల రీచా ఘోష్ లక్ష, ఎయిర్ గన్ షూటింగ్ ఒలింపియన్ మనూ భాకర్ (18) లక్ష, షూటర్ అపూర్వీ చండేలా (27) 5 లక్షలు.. విరాళంగా అందించారు. టెన్నిస్ తార సానియా మీర్జా (33) ప్రతిరోజూ దినసరి కార్మికులకు ఆహార దినుసులు పంపిణీ చేస్తున్నారు. ఎవరు ఎంత ఇచ్చారని కాదు. క్రీడారంగంలోనైనా, మరే రంగంలోనైనా విరాళంగా మహిళలు ఇచ్చే ప్రతి రూపాయి కూడా అమూల్యమైనదే. క్రీడల్లో ఆ విరాళం మరింత విలువైనది. ఈవెంట్లలో పురుషులకు వచ్చినంత రెమ్యునరేషన్ మహిళలకు రాదు. అయినా వారు తాము ఇవ్వగలిగినంత ఇస్తున్నారంటే.. ఇచ్చే ఆ మనసును చూడాలి. ఏప్రిల్ 6 సరిగ్గా ఈరోజునే నూట ఇరవై నాలుగేళ్ల క్రితం 1896 ఏప్రిల్‌లో గ్రీసు రాజధాని ఏథెన్స్లోని పనాథినైకో స్టేడియంలో తొలి ఒలింపిక్ క్రీడల ప్రారంభ వేడుకలు జరిగాయి. ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 15 వరకు జరిగిన ఆ ఒలింపిక్స్‌లో 14 దేశాలు పోటీపడ్డాయి. 241 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వారిలో మహిళలు లేరు. ఆ తర్వాతి (1900) ఒలింపిక్స్ నుంచి మహిళల ప్రవేశం మొదలైంది. తొలి ఒలింపిక్స్ మొదలైన ఏప్రిల్ 6ను 2014 నుంచి ఐక్యరాజ్య సమితి ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్’గా గుర్తిస్తోంది. -
సామరస్యం మిగిలే ఉంది!
‘గతంలో నేనెప్పుడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదు. ఇరుగూపొరుగూ ప్రశాంతంగా జీవించేవాళ్లం. నా హిందూ కస్టమర్లంతా నా క్షేమ సమాచారం కోసం విచారిస్తున్నారు’ జాఫ్రాబాద్ రోడ్డులో ఉన్న తన షాప్‌ని ఇప్పటికీ తెరవడానికి సాహసించని సయ్యద్ సుహెయిల్ ‘గత మూడు రోజులుగా నేను ఇల్లు విడిచి బయటకు వెళ్లలేదు. అయితే నేను క్షేమంగానే ఉన్నాను. మరి నువ్వు..’ ఆరుపదుల అల్లాహ్‌ను కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న తన హిందూ మిత్రుడి క్షేమ సమాచారం కోసం చేసిన ఫోన్ సంభాషణ ఇది. నిజానికి ఇంకెప్పుడైనా అయితే ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక, అనుకూల ఆందోళనల కారణంగా హింస చెలరేగిన ప్రాంతంలో హిందువులెవరో, ముస్లింలెవరో కనిపెట్టడం చాలా కష్టం. హిందువుల ఇంట్లో పెళ్లికి ముస్లిం వంట చేసి, వడ్డిస్తాడు. ముస్లిం ఇంట్లో శవపేటికను హిందువు భుజానమోస్తాడు. పెళ్లీ, పేరంటం, చావు, పుట్టుక ప్రతి సందర్భాన్నీ పంచుకుని పరవశించే చోట ముస్లిం ఎవరో, హిందువెవరో ఎవరికి కావాలి?. సూర్యోదయం వేళ హిందువుల పూజకు పూలు తెచ్చి వాకిట్లోకందించే ముస్లింకి అదే జీవనోపాధి. రంజాన్ వేళ ముస్లిం సోదరుడి ఆకలి తీర్చేందుకు మసీదు బయట బారులుతీరి ఫలాలన్నీ అమ్మితేనే హిందువు నోట్లోకి నాలుగువేళ్లూ వెళ్లేది. అయినా ఎవరి ఆరాధ్యదైవాలూ, ఎవరి ప్రార్థనాలయాలూ వారివే. అంతమాత్రాన ఇల్లు తగలబడుతోంటే అది హిందువుది కదాని ముస్లింలు ఊరుకోలేదే.. ప్రాణాలకు తెగించి ఓ వృద్ధురాలిని కాపాడారు. ఓ ముస్లింని ఎక్కడ చంపేస్తారోనని భార్యాభర్తలిద్దరికీ హిందువుల బట్టలు తొడిగి రాత్రంతా వారిని కడుపులో పెట్టుకొని కాపాడి తెల్లవారి ఒడ్డుదాటించిన కుటుంబం నిజంగా ఈ దేశ సమైక్యతకు ప్రత్యక్ష సాక్ష్యం. హింస జాడలు.. నీడలు దాదాపు 40 మందికి పైగా ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయిన అమానవీయ దృశ్యాలతో ఈశాన్య ఢిల్లీ తల్లడిల్లిపోయింది. ఎప్పుడూ జనంతో కళకళలాడే దుకాణాలకు మూతపడిన షట్టర్లు.. నిత్య సందడి నింపుకున్న గోడల నిండా నిన్నటి హింస తాలూకూ నెత్తుటి జాడలు.. రక్తసిక్తమైన రహదారులు.. అదంతా పౌరసత్వ సవరణ చట్టం అనుకూల – వ్యతిరేక ఆందోళనల పేరుతో చెలరేగిన హింసారాత్రులు మిగిల్చిన దృశ్యం. మతాతీత సహజీవనానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిన వీధులన్నిటా కమ్ముకున్న శ్మశాన నిశ్శబ్దం. అయినా అక్కడింకా అందరూ చెప్పుకునే మానవీయత బతికే ఉంది. రాజకీయాలకూ, సిద్ధాంత రాద్ధాంతాలకూ సంబంధంలేని సామాన్యులెందరో ఒకరినొకరు ఒడిజేర్చుకుంటున్నారు. ఒకరి ప్రాణాలను ఒకరు కాపాడుకుంటూనే ఉన్నారు. ఒకరికొకరు.. ఘటన జరగడానికి కొద్దిగంటల ముందు వందలాది మంది ముస్లిం మహిళలు జాఫ్రాబాద్ మెట్రో స్టేషన్ కింద కూర్చుని ఉన్నారు. వారంతా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. మౌజ్‌పూర్ మహిళలు సైతం ఈ ఆందోళనకారులకు వ్యతిరేకంగా అక్కడే నిరసనకు దిగారు. ఆ సాయంత్రం సీఏఏ ఆందోళన స్థలాన్ని ఢిల్లీ పోలీసులు ఖాళీ చేయించారు. ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రాబాద్, మౌజ్‌పూర్, భజన్‌పుర, చాంద్ బాగ్ సహా ఇతర పరిసర ప్రాంతాల్లోని ప్రజలు జరిగిన ఘటనలతో భయకంపితులయ్యారు. ముస్లింలు అధికంగా ఉన్న జాఫ్రాబాద్ నుంచి అత్యధిక మంది హిందువులు జీవించే మౌజ్‌పూర్‌ను కలిపే ఒక కిలోమీటరు రహదారి పొడవునా మనుసును మెలిపెట్టే చేదు జ్ఞాపకాల్లోంచి ఇప్పుడిప్పుడే జనం బయటపడుతున్నారు. అక్కడ శిథిలమైన మతసామరస్యాన్ని పునర్నిర్మించుకునేందుకు కొంత సమయం పట్టవచ్చు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీలో పరిస్థితులను అదుపులోకి తేవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. -
భారత్ సహా 75 దేశాల్లో అలజడి
సాక్షి, న్యూఢిల్లీ: 2020 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి గుర్తించిన ప్రపంచంలోని 195 దేశాల్లో 40 శాతం దేశాల్లో, అంటే 75 దేశాల్లో అలజడి, అశాంతి పరిస్థితులు నెలకొంటాయని, అందులో భారత దేశం కూడా ఉంటుందని ‘వెరిక్స్ మ్యాపిల్‌క్రాఫ్ట్’ అనే సామాజిక, ఆర్థిక, రాజకీయ డేటా విశ్లేషణ సంస్థ అంచనా వేసింది. గతేడాది, అంటే 2019లో హాంగ్ కాంగ్, చిలీ, నైజీరియా, సుడాన్, హైతీ, లెబనాన్ తదితర 47 దేశాల్లో అలజడి, అశాంతి పరిస్థితులు నెలకొనగా 2020 సంవత్సరానికి ఆ పరిస్థితులు 75 దేశాలకు విస్తరిస్తాయని అంచనా వేసి, ఈ మేరకు వెరిక్స్ మ్యాపిల్‌క్రాఫ్ట్ సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. గతేడాది ఎక్కువ అశాంతి పరిస్థితులు నెలకొన్న హాంగ్ కాంగ్, చిలీ దేశాల్లో ఈ ఏడాది కూడా అశాంతి పరిస్థితులు కొనసాగుతాయని, మరో రెండేళ్ల వరకు ఆ దేశాల్లో పరిస్థితి మెరుగు పడే అవకాశం లేదని ఆ నివేదిక పేర్కొంది. ఆ తర్వాత వెనిజులా, ఇరాన్, లిబియా, గినియా, నైజీరియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, పాలస్తీనా, ఇతియోపియా, బొలీవియా దేశాల్లో అశాంతి పరిస్థితులు నెలకొంటాయని అంచనా వేసింది. ముఖ్యంగా ప్రజలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు జరపడం వల్లనే అశాంతి పరిస్థితులు ఏర్పడతాయని, ఆయా దేశాల ప్రభుత్వాలు మానవ హక్కులను కాలరాయడమే ప్రజా పోరాటాలకు దారితీస్తుందని నివేదిక అభిప్రాయపడింది. ముఖ్యంగా నైజీరియా, లెబనాన్, బొలీవియా దేశాల్లో తీవ్ర ప్రజాందోళనలకు అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత 2020 సంవత్సరంలో భారత్ సహా ఇతియోపియా, పాకిస్థాన్, జింబాబ్వే దేశాల్లో అశాంతి పరిస్థితులు పెల్లుబికే అవకాశం ఎక్కువగా ఉందని వెరిక్స్ సంస్థ అంచనా వేసింది. భారత దేశం విషయంలో ఈ అంచనాలు ఇప్పటికే నిజం అవుతున్నట్లు నేడు పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరసత్వ పట్టికకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రజాందోళనలు చూస్తుంటే అర్థం అవుతోంది. అశాంతికి కారణాలను గుర్తించి ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాలు దిద్దుబాటు చర్యలు తీసుకున్నప్పటికీ ప్రశాంత పరిస్థితిలు త్వరలో ఏర్పడే అవకాశాలు లేవు. సమస్యలను పరిష్కరించడానికి కొన్నేళ్లు పట్టే అవకాశం ఉంది. 2019లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదకర పరిస్థితులున్న దేశం ‘యెమన్’ అని వెరిక్స్ సంస్థ గుర్తించగా అది దాదాపు నిజమేనని రుజువైంది. ఇంకా అక్కడ పరిస్థితులు మెరగుపడలేదనడానికి ఆదివారం యెమన్‌లో జరిగిన ద్రోన్ దాడిలో 80 మంది సైనికులు మరణించడం గమనార్హం. ఆందోళనలకు ఆస్కారం ఉన్న 125 దేశాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితలను క్షుణ్నంగా అధ్యయనం చేసిన ఈ సంస్థ 75 దేశాల్లో ఏదోస్థాయిలో ప్రజాందోళనలు చెలరేగుతాయని అంచనా వేసింది. రష్యా, సౌదీ అరేబియా, చైనా, టర్కీ, థాయ్‌లాండ్, బ్రెజిల్ దేశాల్లో సైన్యం ఎదురుదాడుల వల్ల ఆందోళన చేసే ప్రజలకు ప్రమాదం ఉందని అంచనా వేసింది. చాలా దేశాల్లో ప్రజాందోళనల వల్ల ప్రభుత్వాలు బలహీనపడే అవకాశం ఉండగా, ప్రపంచంలో ఆందోళనకారులకు అత్యంత ప్రమాదకరమైన దేశం ‘ఉత్తర కొరియా’ అని వెరిక్స్ సంస్థ హెచ్చరించింది. చదవండి: భారత్‌పై ప్రతీకారం తీర్చుకోలేం -
పర్యాటక రంగంతో శాంతికి ఊతం
హైదరాబాద్ : పర్యాటక రంగానికి ప్రపంచ శాంతికి ఎనలేని సంబంధం ఉందని గ్లోబల్ అంబాసిడర్స్ ఫర్ పీస్ థ్రూ టూరిజం (జీఏపీటీ) ఛైర్మన్ తాజ్ముల్ హుసేన్ అన్నారు. పర్యాటక రంగం ద్వారా శాంతి విరాజిల్లుతుందని, ప్రతి పర్యాటకుడు శాంతి దూతేనని ఆయన అభివర్ణించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌లో జరిగిన పర్యాటక రంగం ద్వారా ప్రపంచ శాంతి అనే కార్యక్రమంలో ఆయన ఈ మేరకు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జీఏపీటీ పోస్టర్‌ను వక్తలు విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో దక్షిణ కొరియా కాన్సులేట్ జనరల్ సురేష్ చుక్కపల్లి, స్కాల్ ఇంటర్నేషనల్‌కు చెందిన విజయ్ మోహన్‌రాజ్, అద్నాన్ అల్టే తదితరులు పాల్గొన్నారు. -
ట్రంప్ ప్రమాదకర విన్యాసాలు
అమల్లో ఉన్న విధానాలన్నిటినీ బేఖాతరు చేసి అఫ్ఘానిస్తాన్‌లో శాంతి కోసం తన దూతల ద్వారా గత ఎనిమిది నెలలుగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాలిబన్లతో సాగిస్తున్న రహస్య మంతనాలు భగ్నమయ్యాయి. మరికొన్ని రోజుల్లో అమెరికాలోని క్యాంప్‌డేవిడ్‌లో ఒప్పందంపై సంతకాలు కాబోతుండగా, ఈ చర్చల్ని నిలిపేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. చర్చలు నిజంగా ఆగి నట్టేనా లేక ఈ ప్రకటన ట్రంప్ వ్యూహంలో భాగమా అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. ఎందుకంటే ఇవి ఆగిపోవడానికి కారణం తాలిబన్లు హింసను కొనసాగించడమేనని ట్రంప్ చెబుతున్నారు. నిజానికి ఎప్పుడూ హింస ఆగింది లేదు. ‘యాక్షన్ ఆన్ ఆర్మ్డ్ వయెలెన్స్’ సంస్థ వెబ్ సైట్ ప్రకారం కేవలం మొన్న జూలై నెలలోనే వేయిమంది హింసాత్మక దాడుల్లో మరణించారు. 2017 తర్వాత ఇంత భారీ సంఖ్యలో మరణాలు ఉండటం ఇదే మొదటిసారి. ఈ ఏడాది తొలి ఆర్నెల్లలో వివిధ ఘటనల్లో 4,000మంది పౌరులు బలయ్యారు. అంతక్రితంతో పోలిస్తే తాలిబన్ల హింస చర్చల ప్రక్రియ మొదలయ్యాక 27 శాతం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా ట్రంప్‌కు ఆగ్రహం తెప్పించిన ఘటన ఈ నెల 5న జరిగింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ‘గ్రీన్ జోన్’ ప్రాంతంలోని అమెరికా దౌత్య కార్యాలయం సమీపంలో ఒక దుండగుడు బాంబులున్న కారు నడుపుకుంటూ వచ్చి తనను తాను పేల్చుకున్నాడు. ఇందులో పదిమంది అఫ్ఘాన్ పౌరులతోపాటు అమెరికా సైనికులిద్దరు మరణించారు. ఈనెల 28న జరగబోయే అఫ్ఘాన్ అధ్యక్ష ఎన్నికలు రద్దు చేయాలని, శాంతి ఒప్పందానికి ముందు ఇవి ఎలా జరుగుతాయని తాలి బన్లు మొదటినుంచీ ప్రశ్నిస్తున్నారు. ఆ ఎన్నికలను ఆపడానికే ఈ విచ్చలవిడి హింసాకాండ. ఈ చర్చల ప్రక్రియంతా ఎలా సాగిందో చూస్తే ఇది ఎందుకు విఫలమైందో అర్ధమవుతుంది. అఫ్ఘానిస్తాన్‌లో పద్దెనిమిదేళ్లుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికి తమ సైన్యాన్ని అక్కడి నుంచి ఉపసంహరించుకోవాలని ట్రంప్ తహతహలాడుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారసభల్లో పలుమార్లు ఈ సంగతి ప్రకటించారు. వచ్చే ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నికల నాటికి ఆ వాగ్దానాన్ని నెరవేర్చినట్టు అమెరికా ప్రజలకు కనబడాలని ట్రంప్ ఆత్రంగా ఉన్నారు. కానీ అఫ్ఘాన్ నుంచి అర్ధంతరంగా ఉపసంహరించుకున్నట్టు కనబడితే పరువు పోతుందని భావించి ఈ చర్చల నాటకాన్ని మొదలుపెట్టారు. అఫ్ఘానిస్తాన్ పౌరులకు మాత్రమే కాదు... ఈ ప్రాంత దేశాల భద్రతకు పెను ముప్పు కలిగిస్తున్న ఉగ్రవాద ముఠాను దారికి తీసుకొస్తామంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ అఫ్ఘాన్‌ను పరిపాలిస్తున్న ప్రభుత్వానికిగానీ, అక్కడి పౌరులకుగానీ భాగస్వామ్యం లేకుండా...వారికి ఏం జరుగుతున్నదో కూడా తెలియకుండా సాగిన ఈ ప్రక్రియ అంతిమంగా మేలుకన్నా కీడే చేస్తుంది. అక్కడ ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామంటూ ప్రక టించి 2001లో ఆ దేశంలో అడుగుపెట్టిన అమెరికా ఎన్నో నష్టాలు చవిచూసింది. ఈ యుద్ధంలో దాదాపు 4,000మంది అమెరికా సైనికులు, దాని నేతృత్వంలోని సంకీర్ణ దళాల సైనికులు మరణిం చారు. అమెరికా 13,200 కోట్ల డాలర్లు ఖర్చుచేసింది. కానీ వీసమెత్తు ఫలితం లేకపోగా దేశంలో సగభాగం పూర్తిగా తాలిబన్ల అధీనంలో ఉంది. వారు ఆ ప్రాంతాలకు మాత్రమే పరిమితంకాక అప్పుడప్పుడు రాజధాని కాబూల్‌లోని ‘గ్రీన్‌జోన్’లోకి సైతం చొరబడుతున్నారు. ఈ చర్చల ప్రక్రియ మొదలయ్యాక తాలిబన్లు మరింత పేట్రేగారు. అలాగైతేనే తాము చర్చల్లో పైచేయి సాధించగలమని వారి విశ్వాసం. ట్రంప్ మాత్రం వారిలో పరివర్తన సాధ్యమేనని నమ్మారు. అందరినీ నమ్మమన్నారు. చర్చల సరళి ఏమిటో, ఏయే అంశాలు ప్రస్తావనకొస్తున్నాయో అఫ్ఘాని స్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీకి ఎప్పుడూ చెప్పలేదు. ఈ చర్చల ద్వారా ట్రంప్ ఆశించింది వేరు. తాలిబన్లు ఆశించింది వేరు. ఏదో మేరకు ఒప్పందం కుదిరిందని ప్రకటిస్తే అక్కడి నుంచి ‘గౌరవ ప్రదం’గా నిష్క్రమించవచ్చునని ట్రంప్ భావించారు. తాలిబన్లకు కూడా అలాంటి ‘గౌరవమే’ కావాలి. తాము ఏమాత్రం తగ్గకపోయినా అమెరికా దిగొచ్చిందని ప్రపంచానికి చాటాలి. దాన్ని సాధ్యమైనంత త్వరగా దేశం నుంచి సాగనంపితే యధావిధిగా ఇష్టానుసారం ‘తమదైన’ పాలన కొనసాగించవచ్చునని వారి కోరిక. చర్చల్లో అమెరికా తరఫున మంతనాలు సాగిస్తున్న జల్మాయ్ ఖలీ ల్జాద్ పాక్ సైనిక దళాల చీఫ్ జావేద్ బజ్వా, పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ల ప్రాపకంతో రంగంలోకి దిగాడు. చర్చలు బ్రహ్మాండంగా సాగుతున్నాయని, తాలిబన్లతో ఒప్పందానికి చేరువ అవుతున్నా మని చెప్పడమే తప్ప, ఈ చర్చలకు ప్రాతిపదికేమిటో, ఏయే అంశాల్లో విభేదాలున్నాయో, వేటిపై అంగీకారం కుదిరిందో ఏనాడూ ఆయన చెప్పలేదు. అఫ్ఘాన్‌లో తాలిబన్ల రాజ్యం వస్తే మళ్లీ తమ పంట పండినట్టేనని పాకిస్తాన్ ఉవ్విళ్లూరుతోంది. తాలిబన్ల హవా నడుస్తున్నప్పుడు కశ్మీర్లో వారిని ప్రయోగించి పాక్ ఎంతటి మారణహోమాన్ని సృష్టించిందో మరిచిపోలేం. దాన్ని పునరా వృతం చేయొచ్చునని అది కలలు కంటున్నది. ఒక సాయుధ బృందాన్ని చర్చలకు ఒప్పించడానికి రహస్య మంతనాలు అవసరం కావొచ్చు. కానీ అసలు చర్చలే గోప్యంగా జరగడంలో అర్ధముందా? ఆ దేశాధ్యక్షుడికి తెలియకుండా, అక్కడి మహిళా ప్రతినిధులు కోరుకుంటున్న దేమిటో తెలుసుకో కుండా ఇవి సాగించడం వల్ల ఏం ప్రయోజనం? ఆ దేశ పునర్నిర్మాణ ప్రక్రియలో పాలుపంచుకుం టున్న మన దేశంతో కూడా ట్రంప్ మాట్లాడలేదు. అఫ్ఘాన్‌ను అర్థంతరంగా వదిలి వెళ్తే ఇన్నాళ్లూ సాధించిందంతా కుప్పకూలుతుందని మన దేశం వాదిస్తోంది. తాలిబన్ల పుట్టుకకూ, వారి ఎదుగు దలకూ కారణమై, అనంతరకాలంలో వారిని అణిచివేసే పేరిట ఆ దేశాన్ని వల్లకాడు చేసిన అమె రికా... ఇప్పుడు ఏదో వంకన అక్కడినుంచి నిష్క్రమించడానికి బాధ్యతారహితంగా వేస్తున్న అడు గులు ఆ దేశ పౌరుల్ని మరింత అధోగతికి నెడతాయి. ఇలాంటి చేష్టలకు అమెరికా స్వస్తి పలకాలి. -
శాంతి దూతగా పంపండి : మొఘలాయి వారసుడు
హైదరాబాద్: మొఘల్ సామ్రాజ్యానికి చివరి చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వారసుడిగా ప్రకటించుకున్న ప్రిన్స్ యాకుబ్ హబీబుద్దీన్ టుసీ శనివారం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ను కలిశారు. ఈ సందర్భంగా తనను జమ్మూకశ్మీర్‌కు ‘శాంతి దూత’గా నియమించాలని రాష్ట్రపతిని ఓ లేఖ సమర్పించారు. ‘జమ్ము కశ్మీర్ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య శాంతిని నెలకొల్పడానికి పనిచేస్తాను. మొఘలాయి వంశ వారసత్వానికి ఉన్న ప్రజాదారణతో ప్రత్యక్షంగా అక్కడి ప్రజలతో మమేకవుతాను. దేశద్రోహ సమూహాలతో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో నేను కశ్మీర్‌ను సందర్శించాలి. ఒక భారతీయుడిగా, మొగల్ వంశ వారసుడిగా నాపై ఆ బాధ్యతలు ఉన్నాయి. జమ్మూ, లఢఖ్‌లో నివసిస్తున్న మా వంశస్తులకు శాంతి, సౌఖ్యాలను పెంచడానికి నన్ను శాంతి దూతగా పంపాలి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ను మొఘలాయి రాజులు శక్తిమంతమైందిగా నిలిపారు. నన్ను కశ్మీర్‌కు శాంతి దూతగా పంపిస్తే గౌరవ సూచకంగా ఉంటుంది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు కశ్మీర్లో స్వార్థమయమడంతో వల్లే ప్రజలు తప్పుదారి పట్టారు. కానీ, ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వ సహకారంతో కశ్మీర్లో శాంతి స్థాపనకు కీలక పాత్ర పోషిస్తాను’అని లేఖలో పేర్కొన్నారు. ఇక ఈ మొఘలాయి వారసుడి లేఖపట్ల రాష్ట్రపతి ఎలా స్పందిస్తారో చూడాలి. -
భారత్ కూడా భాగస్వామే
న్యూఢిల్లీ: కొరియా ద్వీపకల్పంలో శాంతి కోసం జరిగిన ప్రయత్నాల్లో భారత్ కూడా ఓ భాగస్వామి అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మంగళవారం దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌తో మోదీ ఢిల్లీలో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. రక్షణ, భద్రత, కృత్రిమ మేధస్సు, వాణిజ్యం, ప్రాంతీయ శాంతి తదితర అంశాల్లో పరస్పర సహకారం అందించుకోవాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ సందర్భంగా 10 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సీఈపీఏ) నవీకరణ ప్రక్రియపై సంప్రదింపులను ప్రారంభించాలని ఓ ఒప్పందంపై సంతకం చేశాయి. అనంతరం మూన్, మోదీ సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. సమావేశం సందర్భంగా ఉ.కొరియాతో పాక్‌కు గల అణు వ్యాప్తి లింకేజీల గురించి మూన్ వద్ద మోదీ ప్రస్తావించారు. ద్వైపాక్షిక సహకారం, సముద్ర వివాదాలకు సంబంధించి ఓ విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. రక్షణ, వ్యూహాత్మక రంగాల్లో సహకారాన్ని పెంచాలని, సైనిక మార్పిడి, శిక్షణ, అనుభవ భాగస్వామ్యాన్ని∙పెంపొం దించుకోవాలని చెప్పారు. అణు సరఫరా గ్రూప్‌లో భారత సభ్యత్వానికి ద.కొరియా మద్దతు తెలిపింది. -
కశ్మీర్ సమస్యకు పరిష్కారం మహిళలయితే!
సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్లో శనివారం జరిగిన కాల్పుల్లో ఓ బాలికతోపాటు మరో ఇద్దరు అమాయకులు మరణించారు. ఇది కశ్మీర్‌కు కొత్త కాదు. కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న రక్తపాతమే. కశ్మీర్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం వందల కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నా ఫలితం లేకుండా పోవడం. కశ్మీర్ ప్రజల ప్రాణాలకు భరోసా లేకుండా పోవడం సాధారణ విషయమే. ఈ సంక్షోభంలో పాత్రదారులు నలుగురు లేదా నాలుగు శక్తులు. ఒకటి భారత రాజకీయ నాయకత్వం, రెండూ భారత సైన్యం, మూడు పాక్– దేశీయ టెర్రరిస్టులు. నాలుగు కశ్మీర్ ప్రజలు. భారత రాజకీయ నాయకత్వం దేశీయ, అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్‌ను ఏకాకిని చేయడానికి లేదా టెర్రరిస్టులకు ఎలాంటి మద్దతు ఇవ్వకుండా నిలువరించేందుకు తెర ముందు నుంచి కాకుండా తెర వెనక నుంచి కూడా కొన్ని దశాబ్దాలుగా కృషి చేస్తోంది. ఇక భారత సైన్యం స్థానిక టెర్రరిస్టులను ఎప్పటికప్పుడు అణచివేయడంతోపాటు అప్పుడప్పుడు పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి సర్జికల్ స్ట్రైక్స్ కూడా చేస్తోంది. ఎంత మంది టెర్రరిస్టులు హతమైనా మళ్లీ పుట్టుకొస్తూనే ఉన్నారు. ఇటు సైన్యం, అటు టెర్రరిస్టుల మధ్య నలిగి పోతున్నది అక్కడి ప్రజలే. ఎన్ని కాల్పుల విరమణ ఒప్పందాలు చేసుకున్నా అవి కనుమూసి తెరిచే లోగా కాలగర్భంలో కలిసిపోవచ్చు. కేంద్రంలో ఉన్న రాజకీయ నాయకత్వాన్ని బట్టి కశ్మీర్లో కొద్ది ఎక్కువ కాలం, కొద్ది తక్కువ కాలం ప్రశాంత పరిస్థితులు ఉంటాయి. ఆ తర్వాత మళ్లీ రక్తపాతం మామూలే. ఈ సైకిల్ ఇలా తిరగాల్సిందేనా! కశ్మీరు సమస్యకు శాశ్వత పరిష్కారం లేకపోయినా శాశ్వత శాంతికి సంధినొసిగే ఆస్కారాలే లేవా? కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం అనే నినాదాన్ని భారత్ వదులుకోనంతకాలం కశ్మీర్‌కు శాశ్వత పరిష్కారం లేదన్న విషయం విజ్ఞులెవరికైనా తెల్సిందే. వాస్తవానికి ఒకప్పటి కశ్మీర్ రాజ్యంలో 40 శాతం భూభాగం భారత్ ఆధీనంలో, మరో 40 శాతం భూభాగం పాకిస్థాన్ ఆధీనంలో ఉండగా, మిగతా 20 శాతం భూభాగం చైనా ఆధీనంలో ఉంది. మన ఆధీనంలో ఉన్న భూభాగాన్ని మనం కశ్మీర్ అని, పాక్ ఆధీనంలో ఉన్న భూభాగాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్ అని మనం వ్యవహరిస్తున్నాం. అలాగే మనది అంటున్న కశ్మీర్‌ను పాకిస్తాన్ వారు ‘భారత ఆక్రమిత కశ్మీర్’ అని వ్యవహరిస్తున్నారు. చైనా ఆధీనంలో ఉన్న 20 శాతం కశ్మీర్ భూభాగాన్ని ‘అక్సాయ్ చిన్’ అని చైనా వ్యవహరిస్తోంది. చైనా తెలివిగా కశ్మీర్ విషయంలో తన జోలికి రాకుండా పాకిస్థాన్‌కు మద్దతుగా పావులు కదుపుతూ వస్తోంది. మరోపక్క అదే పాకిస్థాన్‌తో కలిసి అద్భుతమైన ఆర్థిక కారిడార్‌ను ఏర్పాటు చేసుకుంటోంది. అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని అంతగా పట్టించుకోని మనం ఎప్పుడూ పాకిస్థాన్‌తోనే గొడవ పడతాం. అది మరో మతానికి సంబంధించిన దేశం కావడమే కావొచ్చు. కశ్మీర్ దక్కడం వల్ల అటు పాకిస్థాన్‌కుగానీ, చైనాకుగానీ ఒరిగేదేమీ లేదు. మనకొచ్చే ప్రయోజనాన్ని పక్కన పెడితే కశ్మీర్ పేరిట మనం దేశ సంపదనే తగలేస్తున్నామని ఆర్థిక వేత్తలే తేల్చి చెప్పారు. కశ్మీర్ పేరిట భారత్ ఇప్పటి వరకు ఖర్చు చేసిన మొత్తంలో సగంలో సగం మొత్తాన్ని పాకిస్థాన్‌కు భరణంగా ఇస్తే వాళ్లే మనకు కశ్మీరును పల్లెంలో పెట్టి ఇచ్చే వారన్న వ్యాఖ్యానాలు కొత్త కాదు. ఇప్పుడు ఆ దేశ పరిస్థితే మారిపోయింది. బలహీనమైన రాజకీయ నాయకత్వమే కావచ్చు. అక్కడ టెర్రరిస్టు ముఠాలు విచ్చల విడిగా పెరిగి పోయాయి. పాకిస్థాన్ చెబితే వినే దశలో అసలే లేవు. అందుకని ఆ ముఠాలను ఉద్దేశపూర్వకంగానే కశ్మీర్ లక్ష్యం కోసం పాకిస్థాన్ పంపిస్తోంది. ఇక చైనా ఆర్థిక కారిడార్ పేరుతో అగ్నేయ పాకిస్థాన్ అంతట విస్తరించింది. బలుచిస్థాన్లో చిన్న తిరుగుబాటును భారత్ ప్రోత్సహించినా వెంటనే అణచివేసే పరిస్థితికి చైనా చేరుకుంది. భారత్‌లోని ఏ ప్రాంతాన్నైనా లక్ష్యంగా చేసుకొని దాడి చేయగల సామర్థ్యాన్నీ సాధించింది. కశ్మీర్ కారణంగా ఎంతో ఆర్థికంగా దెబ్బతిన్న భారత్ ఆర్థిక వ్యవస్థలో చైనాకు అందనంత దూరంలోనే ఆగిపోతోంది. ఇక్కడే కొత్తగా ఆలోచించాలి! మరి కశ్మీర్‌కు పరిష్కారం ఏమిటీ? ఇక్కడే కొత్తగా ఆలోచించాలి. ‘భిన్న ఫలితాలను ఆశిస్తూ చేసిందే చేస్తూ చేసిందే చేస్తూ పోయేవాడు పిచ్చివాడే’ అవుతాడు అని ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ ఎప్పుడో చెప్పారు. ఇంటా బయట చర్చలు, ఒప్పందాలు ఇప్పటి వరకు పెద్దగా ఫలితాలివ్వలేదు. శత్రువు, శత్రువు మధ్య ఉండే ఉమ్మడి విషయాన్ని కనుగొనాలి. సైన్యం, మిలిటెంట్ల పోరులో ఎవరు మరణించిన బాధ పడుతున్నది ఎక్కువగా మహిళలే. కశ్మీర్ మిలిటెంట్ కమాండర్ బుర్హాన్ వనీ జాఫర్ హతమైనప్పుడు కడుపుకోతకు గురైనది ఆయన తల్లే. ఓ ఆదర్శమూర్తిగా స్థానికంగా ఆమెకు ఎంతో పేరుంది. ఆమెకున్న పేరు కారణంగానే ఆయన అంత్యక్రియల్లో కొన్ని లక్షల మంది కశ్మీర్ ప్రజలు పాల్గొన్నారు. జూన్ 15వ తేదీన భారత సైనికుడు ఔరంగా జేబ్‌ను మిలిటెంట్లు కిడ్నాప్ చేసి హత్య చేస్తే ఆయన తల్లి కూడా అంతే బాధ పడింది. ఆ తల్లికి కూడా స్థానికంగా మంచి పేరుంది. ఇక్కడ ఇద్దరు తల్లులు అనుభవించిన బాధ ఒకలాంటిదే. ఇలాంటి తల్లులను కలుపుకుపోయి శాంతి చర్చలు జరిపితే. మగవాళ్లు జరిపే శాంతి చర్చలు 30 శాతం ఫలించే అవకాశం ఉంటే మహిళలు జరిపే శాంతి చర్చలు 65 శాతం ఉంటాయని పలు అంతర్జాతీయ శాంతి ఒప్పందాలే తెలియజేస్తున్నాయి. పైగా మహిళలు కుదుర్చుకునే శాంతి ఒప్పందాలు 15 ఏళ్లకు పైగా నిలబడే అవకాశాలు 34 శాతం ఉన్నాయట. అపార రక్తపాతంతో వచ్చే విజయాలు మహిళలకు సాధారణంగా రుచించవని, వారు అన్ని అంశాలను పిల్లల భవిష్యత్తు కోణం నుంచే చూస్తారుకనుక వారి మధ్య చర్చలు ఎక్కువగా ఫలిస్తాయని సామాజిక విశ్లేషకులు ఇదివరకే తేల్చారు. కశ్మీర్‌లోని ఇరువర్గాల బాధిత మహిళలను, మహిళా సంఘాలను, సామాజిక మహిళా కార్యకర్తలను శాంతి చర్చల ప్రక్రియలోకి తీసుకరావడం వల్ల ఆశించిన ఫలితం రావచ్చు! -
హింసతో పరిష్కారం దొరకదు
న్యూఢిల్లీ: క్రూరత్వం, హింస ద్వారా ఏ సమస్యకూ పరిష్కారం లభించదని.. జలియన్ వాలాబాగ్ దారుణమే దీనికి ఉదాహరణ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎప్పటికీ అహింస, శాంతి ద్వారానే విజయం సాధించవచ్చన్నారు. జలియన్ వాలాబాగ్ దుర్ఘటన ఇచ్చిన ఈ సందేశాన్ని ఎవరూ మరిచిపోవద్దన్నారు. మాసాంతపు రేడియా కార్యక్రమం మన్‌కీ బాత్‌లో మాట్లాడుతూ.. ‘హింస, క్రూరత్వం ద్వారా ఏ సమస్యనూ పరిష్కరించలేం. శాంతి, అహింస, త్యాగం, బలిదానాలదే తుది విజయం’ అని మోదీ పేర్కొన్నారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాట చరిత్ర చాలా సుదీర్ఘమైనదని.. ఇందులో లెక్కించలేనన్ని త్యాగాలు, బలిదానాలున్నాయని గుర్తుచేశారు. ‘2019లో జలియన్ వాలాబాగ్ ఘటనకు వందేళ్లు పూర్తవుతాయి. 1919, ఏప్రిల్ 13 నాటి ఆ చీకటి రోజును ఎవరు మరిచిపోగలరు. ఈ ఘటన యావత్ మానవజాతినే క్షోభకు గురిచేసింది. అధికార పరిధిని అపహాస్యం చేస్తూ.. క్రూరత్వానికి ఉన్న అన్ని పరిమితులు దాటి అమాయకులు, నిరాయుధులైన ప్రజలపై పాశవికంగా కాల్పులు జరిపి చంపారు. వందేళ్ల నాటి ఈ ఘటన మనకు ఎన్నో నేర్పింది’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. నానక్, కబీర్ దాస్‌ల స్ఫూర్తితో.. వచ్చే ఏడాది గురు నానక్ 550వ జయంతి (ప్రకాశ్ పర్వ్) జరుపుకోబోతున్నామని మోదీ తెలిపారు. ‘భారతీయులంతా ఈ ఉత్సవాల్లో భాగస్వాములు కావాలని కోరుతున్నాను. ప్రకాశ్ పర్వ్‌ను ప్రేరణా పర్వ్ (స్ఫూర్తిదాయకంగా) మార్చుకునేందుకు మీరు సలహాలు, సూచనలు చేయండి. ఈ కార్యక్రమాన్ని మనమంతా కలిసి గొప్పగా జరుపుకుందాం’ అని ప్రధాని అన్నారు. గురు నానక్, కబీర్ దాస్‌ల బోధనలను గుర్తుచేస్తూ.. కుల వివక్ష తొలగిపోవాలని, మానవత్వం వికసించాలని పేర్కొన్నారు. దేశ సమగ్రత కోసం పాటుపడిన జన్‌సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ 52 ఏళ్లకే దేశం కోసం బలిదానమయ్యారన్నారు. తొలి వాణిజ్యం, పరిశ్రమల మంత్రిగా దేశం కోసం ముఖర్జీ చేసిన పనులను, ఆయన ఆలోచనలను మోదీ పేర్కొన్నారు. జీఎస్టీ అమల్లో రాష్ట్రాలు భేష్ భారతదేశంలో సహకార సమాఖ్య విధానానికి జీఎస్టీ అమలుతీరే మంచి నిదర్శనమని ప్రధాని తెలిపారు. ఇన్స్పెక్టర్ రాజ్‌కు చరమగీతం పాడి వ్యవస్థ ‘నిజాయితీ పండుగ’ జరుపుకుంటోందన్నారు. ‘సరికొత్త పన్ను వ్యవస్థకు ఏడాది పూర్తవుతోంది. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అన్ని రాష్ట్రాలు ఏకగ్రీవంగా దీని అమలుకు ముందుకొచ్చాయి. భిన్న పార్టీలు, భిన్న అవసరాలున్న రాష్ట్రాలు కానీ అవన్నీ పక్కనపెట్టి అందరికీ న్యాయం జరగాలని నిర్ణయించాయి. ఒకే దేశం–ఒకే పన్ను అనే ఈ వ్యవస్థ విజయవంతంగా అమలు కావడంలో రాష్ట్రాల పాత్ర అభినందనీయం’ అని మోదీ పేర్కొన్నారు. రషీద్ ఖాన్‌కు మోదీ ప్రశంసలు అఫ్గానిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్, భారత వైమానిక దళ స్కై డైవర్లపై మోదీ ప్రశంసలు కురిపించారు. ‘ఐపీఎల్లో అఫ్గాన్ బౌలర్ రషీద్ ఖాన్ మంచి ప్రదర్శన కనబరిచారు. రషీద్‌ను ప్రశంసిస్తూ అఫ్గాన్ అధ్యక్షుడు ఘనీ చేసిన ట్వీట్ నాకింకా గుర్తుంది. ఇటీవల భారత్–అఫ్గాన్ మధ్య టెస్టు మ్యాచ్ అనంతరం.. ట్రోపీని అందుకునేందుకు అఫ్గాన్ జట్టును భారత్ ఆహ్వానించడం ఓ మంచి వాతావరణాన్ని సూచిస్తోంది’ అని ప్రధాని పేర్కొన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా జరిగిన వివిధ కార్యక్రమాలనూ మోదీ గుర్తుచేశారు. ‘15వేల అడుగుల ఎత్తులో గాల్లో.. భారత వైమానిక దళ స్కై డైవర్లు చేసిన యోగా ప్రదర్శన అద్భుతం’ అని ప్రశంసించారు. -
శాంతి, సామరస్యాలు దేశ సైద్ధాంతిక మూలాలు: మోదీ
జైపూర్: శాంతి, సామరస్యం, ఏకతా భారతదేశ సైద్ధాంతిక మూలాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సోమవారం ఆయన అజ్మీర్‌లోని సూఫీ మతగురువు హజ్రత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గాకు చాదర్‌ను సమర్పించారు. ప్రధాని తరఫున కేంద్ర మైనా రిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ దర్గాను సందర్శించి, చాదర్ ను సమర్పించారు. 806వ వార్షిక ఉర్సు సందర్భంగా దేశ, విదేశాల్లో ఉన్న ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ అనుచరులకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘శాంతి, సామ రస్యం, ఏకతా భారతదేశ సైద్ధాంతిక మూలాలు. సూఫీయిజం కూడా భారతీయ తత్వమే. భారతదేశంలో గొప్ప ఆధ్యాత్మిక సంప్రదాయాలకు చిహ్నంగా సూఫీ తత్వ వేత్త ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ నిలుస్తారు’ అని మోదీ ఆ సందేశంలో పేర్కొన్నారు. -
'శాంతితోనే అభివృద్ధి సాధ్యం'
బోండిలా: అభివృద్ధికి శాంతియే మూల మని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతా రామన్ నొక్కి చెప్పారు. శాంతికి ప్రాధా న్యత ఇస్తేనే అభివృద్ధికి పునాది ఏర్పడు తుందని ఆమె పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని దక్షిణ కామెంగ్ జిల్లా బోండిలా లో బుద్ధ మహోత్సవాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజుతో కలసి ఆమె శనివారం ప్రారం భించారు. అనంతరం నిర్మలా సీతా రామన్ మాట్లాడుతూ.. అభివృద్ధి సాధిం చాలంటే శాంతికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ‘అరుణాచల్ ప్రదేశ్, దాని సరిహద్దుల్లో ఎలాంటి అవసరం ఏర్పడినా కేంద్రం వెంటనే స్పందిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ ప్రజ లకు మేం (కేంద్రం) అండగా ఉన్నాం. దేశ సరిహద్దులను కాపాడటంలో ఈ రాష్ట్ర ప్రజలే నిజమైన కాపలాదారులు. ఇక్కడి ప్రజలు ప్రకృతితో మమేకమై జీవించడం గొప్పగా ఉంది. మొదట నేను భారత దేశ పౌరురాలిని. ఆ తర్వాతే కేంద్ర మంత్రిని’ అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దక్షిణ కామెంగ్ జిల్లా అభివృద్ధికి సహకరి స్తామని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. -
ఈ చరిత్ర ఏ సిరాతో!
♦ జీవన కాలమ్ మహానుభావులు– తమ జీవితంలో ఎల్లలు లేని ప్రాముఖ్యాన్ని సాధించిన మహానుభావులు– జీవితంలో నష్టపోయే విలువైన ఆస్తి పేరు ప్రశాంతత. ఇది వారు తమ తమ ‘జీనియస్’కి చెల్లించే మూల్యం. నేను దినపత్రికలో పనిచేసే రోజుల్లో ‘ఊమెన్’ అనే కార్టూనిస్టు విరివిగా కార్టూన్లు వేసేవాడు. వాటి విమర్శ వాడిగా, వేడిగా ఉండేది. తరుచు ఈ విమర్శకు గురయ్యే నాయకులు– ఆ రోజుల్లో స్వతంత్ర పార్టీ స్థాపకులు చక్రవర్తి రాజగోపాలాచారిగారు. ఓసారి ఎవరో పాత్రికేయుడు రాజాజీని అడిగాడు, ‘ఊమెన్ కార్టూన్ల గురించి మీ అభిప్రాయమేమి’టని. ఇది ఓ పెద్ద నాయకుడి మీద కావాలని కాలు దువ్వడం. రాజాజీ గొప్ప మేధావి. చమత్కారం ఆయన సొత్తు. ఆ ప్రశ్నకు సమాధానంగా , ‘నేను అడ్డమయిన వారి మీదా నా అభిప్రాయం చెప్పను. చెప్తే వారు పాపులర్ అవుతారు’ అన్నారు. ఇప్పుడు మరో అరుదయిన కథ. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు, సాపేక్ష సిద్ధాంతానికి ఆద్యుడు అల్బర్ట్ ఐన్‌స్టీన్ 1922లో జపాన్ వెళ్లారు, ఉపన్యాసాలు ఇవ్వడానికి. అంతకు కొద్దికాలం ముందే భౌతికశాస్త్రానికి ఆయనకి నోబెల్ బహుమతిని ప్రకటించారు. అప్పట్లో ఆయన పరపతి ప్రపంచమంతా మార్మోగుతోంది. టోక్యోలో ఆయన ఉన్న ఇంపీరియల్ హోటల్‌కి ఒక సందేశాన్ని ఆయనకు అందజేయడానికి ఒక వార్తాహరుడు వచ్చాడు. అప్పటి సంప్రదాయం ప్రకారం ఈ వార్తాహరుడు చిన్న పారితోషికాన్ని పుచ్చుకోవడానికి తిరస్కరించాడు. లేక చిన్న పారితోషికానికి ఐన్‌స్టీన్ దగ్గర చిల్ల రలేదో! ఆయన్ని ఉత్త చేతుల్తో పంపడం ఐన్‌స్టీన్‌కి ఇష్టం లేదు. అప్పుడు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు, నోబెల్ బహుమతి గ్రహీత ఏం చేయాలి? హోటల్ కాగితం మీద ఓ సందేశం రాసి ఇచ్చారు. టోక్యో ఇంపీరియల్ హోటల్ కాగితం మీద ఆయన రాసిన సందేశం, ‘విజయాన్ని వేటాడే గందరగోళం కన్నా, సరళమయిన జీవితం ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది’ అని. అనుకోకుండా, అసంకల్పితంగా చేసిన కొన్ని పనులు కళాఖండాలయిపోతాయి. చరిత్రలుగా నిలుస్తాయి. ఇప్పుడీ కాగితం విలువ కొన్ని లక్షల డాలర్లు. 95 సంవత్సరాల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ సందేశం ఉన్న కాగితాన్ని వేలం వేయనున్నారు. ఐన్‌స్టీన్ యూదులు. జెరూసలేం హిబ్రూ విశ్వవిద్యాలయంలో ఆయన జ్ఞాపికలు చాలా ఉన్నాయి. ఎన్నో శాస్త్రానికి సంబంధించిన విలువైన దస్త్రాల మధ్య – అప్పట్లో ప్రపంచ ప్రఖ్యాతిని ఆర్జించిన ఒక మహానుభావుడి వ్యక్తిగత ‘ఆలోచన’లకు అద్దం పట్టే ఈ సందేశం చాలా విలువైనది. ఇలాగే మరో విలువైన చరిత్రను సృష్టించే చిత్రం కథ. ప్రముఖ చిత్రకారులు, ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి కుమారుడు బుజ్జాయిగారు 1946లో ఎలియట్స్ రోడ్డులో శాస్త్రిగారి అభిమాని తిరుపతిగారితో నడుస్తున్నారట. రోడ్డు మీద కారులో వెళ్తున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తిరుపతిగారిని చూసి కారు ఆపారట. తిరుపతిగారు రాధాకృష్ణన్ గారి శిష్యుల్లో ఒకరు. ఇద్దర్నీ కారెక్కించుకుని ఇంటికి తీసుకెళ్లారు. తిరుపతిగారు బుజ్జాయిని పరిచయం చేసి, ‘‘మీరలా కూర్చుంటే ఈయన మీ పెన్సిల్ స్కెచ్ వేస్తారు’’ అన్నారట. బుజ్జాయి వేశారు. ఆ బొమ్మ మీద ‘రాధాకృష్ణయ్య’ అని సంతకం చేశారు. దేశానికి ఆయన ‘రాధాకృష్ణన్’ గానే తెలుసు. బహుశా అదొక్కటే తెలుగు ‘రాధాకృష్ణయ్య’ గారికి అభిజ్ఞగా మిగిలిన అరుదైన బొమ్మ. విచిత్రం ఏమిటంటే తరువాతి కాలంలో ఆయన దేశ ఉపా«ధ్యక్షులయ్యారు. మరో17 సంవత్సరాల తర్వాత బుజ్జాయిగారికి కొడుకు పుట్టాడు. మరో యాభై సంవత్సరాల తర్వాత రాధాకృష్ణన్ గారి మనుమరాలు ఆయన కోడలయింది. మరో ప్రపంచ ప్రఖ్యాత మహా నటుడు చార్లీ చాప్లిన్ అమెరికాలో అఖండమయిన కీర్తిని ఆర్జించాక స్వదేశానికి వచ్చాడు. అతను ఊహించనంత కీర్తి అతనికి దక్కిందని తెలి యదు. వందలాది మంది అతను వస్తున్న రైలు దగ్గర హాహాకారాలు చేస్తూ ఎదురు చూస్తున్నారు. చాప్లిన్ అంటాడు, ‘బయట లక్షలాది మంది అభిమానులు. కానీ రైలు పెట్టెలో నేను నిస్సహాయమైన ఒంటరిని’ అని. మహానుభావులు– తమ జీవితంలో ఎల్లలు లేని ప్రాముఖ్యాన్ని సాధించిన మహానుభావులు– జీవి తంలో నష్టపోయే విలువైన ఆస్తి పేరు ప్రశాంతత. ఇది వారు తమ తమ ‘జీనియస్’కి చెల్లించే మూల్యం. వారితో పోలిస్తే నాది చిన్న జీవితం– ఇటు బళ్లారి, అటు బరంపురం దాటని పాపులారిటీ. నా పాపులారిటీ రెక్కలు విచ్చుకుంటున్న తొలిరోజుల్లో చిలకలూరిపేటలో షూటింగ్ చేసి తెల్లవారితే పూడిపల్లిలో (పోలవరానికి లాంచిలో 30 నిమిషాల ప్రయాణం) ‘త్రిశూలం’ ముహూర్తానికి చేరాలి. రైలు తప్పిపోయింది. ఏం చెయ్యాలో తెలీక– నిస్సహా యంగా– సాహసించి– బస్సు ఎక్కాను. రాజమండ్రిలో దిగి ఉదయం మిత్రుడు శ్రీపాద పట్టాభి ఇంటికి చేరాను. ‘ఎలా వెళ్లారయ్యా?’’ అనడిగారు మిత్రులు రావు గోపాలరావు. ‘‘రిక్షాలో’’ అన్నాను. ఆయన నవ్వి, ‘‘మీ జీవితంలో ఇదే ఆఖరి ప్రయాణమయ్యా. ఇంక రిక్షా ఎక్కే అదృష్టం లేదు’’ అన్నారు. చరిత్ర రచన ఆనాటికి తెలియదు. కాలం వాటి విలువల్ని నిర్ణయిస్తుంది. - గొల్లపూడి మారుతీరావు -
అణ్వస్త్ర వ్యతిరేక ప్రచారానికి నోబెల్
స్టాక్‌హోమ్ : అణ్వాయుధ వ్యతిరేక ప్రచారానికి 2017 నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. మానవ మనుగడకు పెను సవాలుగా తయారైన అణ్వాయుధ వ్యాప్తిని అరికట్టాలని, దేశాలు తమ దగ్గరున్న అణునిల్వలను నిర్మూలించాలని ప్రపంచ వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తోన్న ‘అంతర్జాతీయ అణ్వాయుధ వ్యతిరేక ఉద్యమం(International Campaign to Abolish Nuclear Weapons-ICAN)కు ఈ ఏడాది నోబెల్ శాంతి దక్కినట్లు నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. 2007లో ప్రారంభమైన అణ్వస్త్ర వ్యతిరేక ప్రచార ఉద్యమం (ICAN).. గడిచిన దశాబ్ధ కాలంగా 101 దేశాల్లో అణ్వస్త్రవ్యతిరేక ఉద్యమాలను నిర్వహిస్తోంది. ఐకెన్‌కు అనుబంధంగా ప్రపంవ్యాప్తంగా 468 సంస్థలు పనిచేస్తున్నాయి. వ్యక్తులకు కాకుండా ఒక ఉద్యమ సంస్థకు నోబెల్ శాంతి పురస్కారం దక్కడం ఈ దశాబ్ధిలో ఇది నాలుగోసారి కావడం గమనార్హం. -
మత సామరస్యాన్ని చాటుదాం
– 2న గణేష్ నిమజ్జనం, బక్రీదు వేడుకలు – హిందూ–ముస్లింలు శాంతియుతంగా మెలగాలి – ఐక్యతా స్ఫూర్తితో జిల్లా కీర్తిని ఇనుమడింపజేయాలి – శాంతి ర్యాలీలో జిల్లా కలెక్టర్, ఎస్పీ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): సెస్టెంబర్ 2న వినాయక నిమజ్జనం, బక్రీదు వేడుకలను శాంతియుతంగా నిర్వహించి మత సామరస్యాన్ని చాటాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ గోపీనాథ్‌జట్టి సూచించారు. íహిందూ–ముస్లింలు ఐక్యతా స్ఫూర్తితో కర్నూలు జిల్లా కీర్తిని ఇనుమడింపజేయాలన్నారు. బుధవారం జమ్మిచెట్టు నుంచి తెలుగు తల్లి విగ్రహం వరకు హిందూ–ముస్లింలు భాయి భాయి నినాదాలతో శాంతి ర్యాలీ నిర్వహించారు. జమ్మిచెట్టు వద్ద అన్ని వర్గాల ప్రజలతో సమావేశమై న జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ గోపీనాథ్‌జెట్టీ శాంతి హితోపదేశం చేసి శాంతి కపోతాలు, బెలూన్లను ఎగుర వేశారు. అనంతరం ర్యాలీ చిత్తారి వీధి జంక్షన్, కర్నూలు వన్ టౌన్ పోలీసు స్టేషన్ మీదుగా పూలబజార్, గడియారం ఆసుపత్రి, పెద్దమార్కెట్, అంబేడ్కర్ సర్కిల్, కొండారెడ్డి బురుజు, తెలుగు తల్లి విగ్రహం వరకు సాగింది. ర్యాలీలో పాల్గొన్న హిందూ–ముస్లింలు సోదరులుగా మెలుగుతామని ప్లకార్డులు ప్రదర్శించారు. శాంతి ర్యాలీలో అడిషనల్ ఎస్పీలు షేక్ షాక్షావలి, ఐ.వెంకటేష్, డీఎస్పీ రమణామూర్తి, సీఐలు ములకన్న, నాగరాజుయాదవ్, డేగల ప్రభాకర్, కృష్ణయ్య, బి.శ్రీనివాసరావు, మహేశ్వరరెడ్డి, ఆర్ఐలు రంగముని, రామకృష్ణ, ముస్లిం మత పెద్దలు, గణేష్ కేంద్ర మహోత్సవ కమిటీసభ్యులు పాల్గొన్నారు. నిమజ్జనానికి సుంకేసుల నీరు వస్తుంది సెప్టెంబర్ 2న కర్నూలులో నిర్వహించే గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్.సత్యనారాయణ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. 2వ తేదీ ఉదయంలోపు కర్నూలుకు చేరే విధంగా సుంకేసుల జలాశయం నుంచి నీటిని విడుదల చేయాలని నీటిపారుదల శాఖ ఎస్ఈని ఆదేశించారు. నీటి కొరత ఉన్నందున కేసీలో నీరు ముందుకు వెళ్లకుండా ఇసుక బస్తాలు, అడ్డుగోడలు ఏర్పాట్లు చేయాలన్నారు. నిమజ్జనం సందర్భంగా ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు, లైటింగ్ సదుపాయం, నగరంలో పారిశుద్ధ్య పనులు, తాగు నీరు, వైద్య శిబిరాలు, విగ్రహాల నిమజ్జనానికి క్రేన్లు ఏర్పాటు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ ఎస్ఈ చంద్రశేఖర్‌రావు, నగరపాలక సంస్థ కమిషనర్ హరినాథరెడ్డి, డీఎస్పీ రమణమూర్తి, ఆర్అండ్బీ ఈఈ జయరామిరెడ్డి, గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ప్రతినిధులు కిష్టన్న, బాలసుబ్రమణ్యం, సందడి సుధాకర్, కాళంగి నరసింహవర్మ తదితరులు పాల్గొన్నారు. -
దైవకార్యాలతో గ్రామాల్లో సుఖ శాంతులు
అమరాపురం: గ్రామాల్లో దైవ కార్యాలు చేయడం ద్వారా సుఖ శాంతులు వెల్లి విరుస్తాయని కర్ణాటక రాష్ట్రం సిద్దరబెట్ట మఠాధీశులు వీరభద్ర శివాచార్య స్వామీజీ అన్నారు. గురువారం మండలంలోని చిట్నడుకు గ్రామంలో ఈశ్వర దేవాలయంలో ప్రత్యేకంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు తమ ఇంటి నుంచి గంగాజలం తీసుకుని స్వామివారికి కుంభాలతో స్వాగతం పలికారు. అనంతరం గ్రామ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. భక్తితోనే ముక్తి మార్గం పొందవచ్చని స్వామీజీ తెలిపారు. -
శాంతికాముకులు జాతి వ్యతిరేకం కాదు
- భారత్–పాక్ మధ్య శాంతి నెలకొనాలి - ‘పీస్ నౌ అండ్ ఫరెవర్’లో వక్తల పిలుపు - ఇరుదేశాల్లో శాంతిని కోరుతూ మొదలైన కార్యక్రమం సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్‌తో సత్సంబంధాలు, ప్రజల మధ్య శాంతిని కాంక్షించడాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో జాతి వ్యతిరేక చర్యగా చూస్తున్నారని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. శాంతికాముకులు జాతి వ్యతిరేకులు కాదని స్పష్టంచేశారు. భారత్–పాక్ మధ్య శాంతిని కోరుతూ శనివారం ఇరుదేశాల్లోని పలు పట్టణాల్లో ‘పీస్ నౌ అండ్ ఫరెవర్’ పేరిట ప్రచారోద్యమానికి శ్రీకారం చుట్టినట్టు పీస్ నౌ క్యాంపెయిన్ కన్వీనర్, కోవా స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మజర్ హుస్సేన్ తెలిపారు. జూలై ఒకటి నుంచి ఆగస్టు 15 వరకు కొనసాగే ఈ కార్యక్రమాన్ని కోవా సంస్థ హైదరాబాద్‌లోని నారాయణగూడ వైఎంసీఏ లో ప్రారంభించింది. రెండు దేశాల్లోని శాంతి కాముకులందరూ ఇందులో పాలుపంచుకుం టున్నట్టు మజర్ వివరించారు. ఈ కార్యక్రమా న్ని భారత నేవీ మాజీ చీఫ్, మెగసెసె అవార్డు గ్రహీత అడ్మిరల్ రాందాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్సంబంధాలు పెంపొందించుకోవడంలో ఇరు దేశాల ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయ న్నారు. అందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. పేద దేశాలైన భారత్, పాకిస్తాన్‌లు రక్షణ వ్యయంపై చేసే ఖర్చును తమ తమ దేశాల్లో పేదరికాన్ని నిర్మూలిం చేందుకు, అక్షరాస్యతను పెంచేందు కు, ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు ఖర్చు చేస్తే ఎంతో అభివృద్ధి సాధ్యమయ్యేదని డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ అన్నారు. నేడు ప్రజలు యుద్ధాన్ని కోరుకోవడం లేదని, పాలకులు వారి అభిప్రాయాలను ప్రజలపై రుద్దకూడదని హితవు పలికారు. ఇరుదేశాల మధ్య సంబం ధాలు మెరుగవుతు న్నాయన్న సమయంలో యుద్ధోన్మాద ప్రకట నలు వెలువడుతుండడం ఆందోళన కలిగించే విషయం అని అన్నారు. మాజీ ఎంపీ, సీపీఐ నాయకులు అజీజ్ పాషా మాట్లాడుతూ.. ప్రజల కనీస అవసరాలను తీర్చినప్పుడే ఇరుదే శాల్లో శాంతి సాధ్యమవు తుందన్నారు. ప్రజలంతా యుద్ధాన్ని వ్యతిరే కించాలని, శాంతిని కోరుకోవాలని అన్నారు. సహజంగా పాక్–భారత్ ప్రజల మధ్య ఉన్న సోదర భావాన్ని శాంతి, ప్రేమతత్వాన్ని మర్చి పోయిన పాలకులు.. ప్రస్తుత పరిస్థితులను యుద్ధం దిశగా తీసుకెళ్తున్నారని విమర్శించా రు. పీస్ నౌ అండ్ ఫరెవర్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌తో పాటు విజయవాడ, ఢిల్లీ, బెంగళూరు, అహ్మ దాబాద్, భోపాల్, భువనే శ్వర్, గువాహటి, జైపూర్, రాంచీ, సిమ్లా, కోల్‌కతా, జమ్మూ తదితరచోట్ల ప్రారంభించా రు. పాక్‌లో కరాచీ, లాహోర్, హైదరాబాద్ తదితర నగరాల్లో ప్రారంభించారు. -
సస్పెన్షన్ రద్దు!
♦ ఏడుగురు డీఎంకే ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తివేత ♦ ధన్యవాదాలు తెలిపిన స్టాలిన్ ♦ అధికార, ప్రతిపక్షాలు చెట్టాపట్టాల్ ♦ వాకౌట్ లేకుండానే ముగిసిన సమావేశం సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రతిపక్షం ఆగ్రహం, అధికార పక్షం నిగ్రహం లేదా వాగ్యుద్ధాలు వాకౌట్లో సాగుతున్న అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నాడు మాత్రం ప్రశాంతంగా ముగిశాయి. డీఎంకే ఎమ్మెల్యేల సస్పెన్షన్ రద్దు, ప్ర«ధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం, వివిధ అంశాలపై చర్చలతో శుక్రవారం నాటి అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగి ముచ్చట గొలిపాయి. శుక్రవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తరువాత స్పీకర్ ధనపాల్ మాట్లాడుతూ అసెంబ్లీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు తన ప్రకటనను వెలిబుచ్చుతారని అన్నారు. ఆ తరువాత సంఘం అధ్యక్షుడు, ఉప సభాపతి పొల్లాచ్చి జయరామన్ మాట్లాడుతూ, డీఎంకే సభ్యులు ఎస్ అంబేద్కుమార్ (వందవాశి), కేఎస్. మస్తాన్(సెంజి),కేఎస్.రవిచంద్రన్(ఎగ్మూరు), సురేష్ రాజన్ (నాగర్‌కోవిల్), కె.కార్తికేయన్ (రిషివందయం), పి. మురగన్ (వేప్పనగల్లి) కేకే. సెల్వం (ఆయిరమ్ విళక్కు)ల క్రమశిక్షణ ఉల్లంఘన నివేదికను కమిటి తరఫున అసెంబ్లీకి సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నివేదికను ఈ రోజే చర్చకు పెట్టాలని అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత, మంత్రి సెంగోట్టయ్యన్ తీర్మానాన్ని ప్రతిపాదించగానే అసెంబ్లీ అభీష్టానికి వదిలేయగా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమయంలో స్పీకర్ ధనపాల్ మాట్లాడుతూ ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన సదరు ఏడుగురు డీఎంకే ఎమ్మెల్యేలు సభా హక్కులను ఉల్లంఘించారని, అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరగకుండా అడ్డుకున్నారని తెలిపారు. వీరిపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలని అన్నాడీఎంకే ఎమ్మెల్యే వెట్రివేల్ తనకు సమర్పించిన ఉత్తరం ఆధారంగా ఆరునెలలపాటు సస్పెండ్ చేసినట్లు తెలిపారు. సస్పెండ్ కారణంగా ఈ ఆరునెలల కాలంలో ఎమ్మెల్యేల వేతనం, ఇతర ఆదాయాలు పొందలేరని క్రమశిక్షణ సంఘం ఆరోజు ప్రకటించిందని అన్నారు. అయితే సదరు ఏడుగురు ఎమ్మెల్యేలు తనవద్దకు వచ్చి పశ్చాత్తాపపడ్డారని, ఇకపై అలా నడుచుకోమని విన్నవించుకున్నారని స్పీకర్ తెలిపారు. వారిని శిక్షించాలని అసెంబ్లీ కోరినా మన్నించి సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేస్తున్నానని ప్రకటించారు. ఆసియా ఖండంలోనే తమిళనాడు ఆరోగ్యకరమైన రాష్ట్రంగా విరజిల్లాలని ఆశిస్తున్నట్లు స్పీకర్ పేర్కొనారు. ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ స్పీకర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తమిళనాడు ఎయిమ్స్ వైద్యశాల ఏ జిల్లాలో స్థాపిస్తారని స్టాలిన్ అడిగిన ప్రశ్నకు వైద్యశాఖా మంత్రి విజయభాస్కర్ బదులిస్తూ, అన్ని జిల్లా ఎమ్మెల్యేలు తమ ప్రాంతంలో నెలకొల్పాలని కోరుతున్నారు, అయితే ఈ విషయమై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున గతనెల 24వ తేదీన ఉత్తరం రాశామని చెప్పారు. ఏదేమైనా రాష్ట్రానికి ఎయిమ్స్ వైద్యశాలను సాధించి తీరుతామని హామీ ఇచ్చారు. స్టాలిన్‌తో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల భేటీ: రాజీవ్‌గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న పేరరివాళన్‌ను పెరోల్‌పై విడుదల చేసే అంశంలో మద్దతు కోరుతూ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు స్టాలిన్‌తో భేటీ అయ్యారు. ప్రజాప్రతినిధులను కలిసేందుకు పేరరివాళన్ తల్లి అర్బుతామ్మాళ్ శుకవారం సచివాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పెరోల్‌పై కలిసి చర్చించుకోవడం మరో విశేషం. -
ఐఐటీ–జేఈఈ మెయిన్ రాత పరీక్ష ప్రశాంతం
15,835 మంది విద్యార్థులు హాజరు తిరుపతి ఎడ్యుకేషన్ : దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఎన్‌ఐటీయూ, ఇతర కేంద్ర ఆర్థిక సహకారంతో నడుస్తున్న జాతీయ స్థాయి ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (ఐఐటీ–జేఈఈ) మెయిన్స్ పరీక్ష ఆదివారం తిరుపతిలో ప్రశాం తంగా జరిగింది. తిరుపతిలో 27 పరీక్షా కేంద్రాల్లో జేఈఈ ప్రవేశ పరీక్షను నిర్వహించారు. తిరుపతి కేంద్రంగా రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు శ్రీపొట్టిశ్రీ రాములు నెల్లూరు జిల్లాకు సంబంధించిన విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. -
జాతీయ సమైక్యత అందరి బాధ్యత
- ముస్లిం స్వాతంత్య్ర సమర యోధుల సంఘం జిల్లా అధ్యక్షుడు మహ్మద్ ఇలియాస్ - 26న జాతీయ సర్వమత సమ్మేళనం కర్నూలు సీక్యాంప్: కుల,మత, వర్గాలతో సంబంధం లేకుండా దేశ ప్రజలందరూ శాంతియుతంగా జీవించాలని, అందకు సహకరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ముస్లిం స్వాతంత్య్ర సమర యోధుల సంఘం జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఇలియాస్ అన్నారు. ఈ నెల 26న కర్నూలు చౌక్‌బజార్‌లో నిర్వహిస్తున్న జాతీయ సర్వమత సమ్మేళనం కార్యక్రమ పోస్టర్‌ను శనివారం కృష్ణానగర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇలియాస్ మాట్లాడుతూ దేశ ప్రజల్లో అనైక్యత వల్లా అశాంతి పెరిగిపోతోందన్నారు. ఈ అశాంతిని తగ్గించడమే లక్ష్యంగా తగ్గించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న జాతీయ సర్వమత సమ్మేళనానికి మంత్రాలయం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు, పాస్టర్ ప్రభుదాస్, హజ్రత్ మౌలానా సయ్యద్ అష్‌హద్ రహీది మదని ముఖ్యాతిథులుగా హాజరై ప్రసంగిస్తారన్నారు. డీఐజీ రమణకుమార్, జిల్లా ఎస్పీ ఆకెరవికృష్ణ కూడా హాజరవుతారని తెలిపారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సంఘం సెక్రటరీ మౌలానా అబ్దుల్ ఖదీర్, ట్రెజరర్ మహ్మద్ గౌస్, సభ్యులు జిలాన్‌బాషా, అబ్దుల్‌వాజీద్, మౌలానా శుకర్రం తదితరులు పాల్గొన్నారు. -
శాంతిని కోరుకోవాలి
► సినీ దర్శకుడు కె.విశ్వనాథ్ ►హన్మకొండలో శాంతిదూత అవార్డుల ప్రదానం హన్మకొండ కల్చరల్ : మనమంతా శాంతిని కోరుకోవాలని, శాంతియుతంగా ప్రవర్తిస్తేనే శాంతి అన్వయిస్తుందని ప్రముఖ సినీదర్శకుడు కళాతపస్వీ డాక్టర్ కె. విశ్వనా«థ్ అన్నారు. వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి హన్మకొండలో ప్రపంచ శాంతి పండుగ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. కె.విశ్వనా«థ్‌కు, ప్రముఖ చరిత్రకారుడు కెప్టెన్ లింగాల పాండురంగారెడ్డి, సహృదయ అనాథ వృద్ధుల శరణాలయం వ్యవస్థాపకురాలు యాకూబీలకు శాంతిదూత అవార్డులు ప్రదానం చేశారు.వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విశ్వనా«థ్ మాట్లాడుతూ తాను సినీదర్శకుడినే గానీ శాంతి కోసం చేసిందేమీ లేదని, తనకు అవార్డు ఇచ్చిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. కెప్టెన్ లింగాల పాండురంగారెడ్డి మాట్లాడుతూ తాను పుట్టిపెరిగిన వరంగల్ జిల్లాలో తనకు సన్మానం జరగడం సంతోషంగా ఉందని అన్నారు. విశ్వవిద్యాలయాల్లో మేధావులు తమ పరిశోధనల ద్వారా నిజాలను వెలికితీయాలని కోరుకుంటున్నానని అన్నారు. జైహింద్ నినాదం మొదట ఉచ్ఛరించింది, త్రివర్ణ పతాకాన్ని రూపొందించింది. అండమాన్ జైలు నిర్మించిన తరువాత మొదటి ఖైదీగా వెళ్లిందీ హైదరాబాద్‌కు చెందిన ముస్లిమ్‌లేనని, మొదటి ఇండోపాక్ యుద్ధంలో, 1965లో జరిగిన యుద్ధంలో నూ పరమవీర్‌చక్ర అవార్డులు అందుకున్నది ముస్లిం సైనికులేనని అన్నారు. అలాగే తెలంగాణలో ముల్కిరూల్స్ వచ్చింది నార్త్ ఇండియన్స్ కోసమని, ఇలాంటి ఎన్నో నిజాలను చరిత్రకారులు వెలుగులోకి తీయాలని అన్నారు. తాను శాంతికోసం పాటుపడతానని అన్నారు. యాకుబ్బీ మాట్లాడుతూ తాను వృద్ధులకు చేస్తున్న సేవ చిన్నది అనుకున్నానని, ఈ అవార్డు తీసుకున్న సందర్భంగా తాను చేస్తున్న పని విలువ తెలిసిందని, ఇకపై 200 మంది వృద్ధులకైనా సేవచేయాలన్న అలోచన కలిగిందని అన్నారు. అంపశయ్య నవీన్ మాట్లాడుతూ మానవత్వానికి గుర్తుగా శాంతి పండుగను జరుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో శాంతబయోటెక్ హైదరాబాద్ వ్యవస్థాపకుడు డాక్టర్ కె.ఐ.వరప్రసాద్‌రెడ్డి, వరంగల్ నగర పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు, పీస్ సొసైటీ కార్యదర్శి, సామాజిక వేత్త అనీస్ సిద్ధిఖీ, ప్రముఖ కవయిత్రి నెల్లుట్ల రమాదేవి, పీస్ సొసైటి వ్యవస్థాపకుడు మహ్మద్ సిరాజుద్దీన్, సహృదయ అనాథాశ్రమం నిర్వహకులు మహ్మద్ మహబూబ్‌ఆలి (చోటు), కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ళ రామశాస్త్రి, లయన్ జిల్లా పురుషోత్తం, ప్రముఖ కవి పొట్లపల్లి శ్రీనివాస్‌రావు, ఆచార్య భద్రునాయక్, ఆచార్య విజయ్‌బాబు, డా. సురేష్‌లాల్, నిమ్మ శ్రీనివాస్, శనిగారపు రాజమోహన్, డా. శ్రీదేవి, డా. కృష్ణారావు, సయ్యద్ సర్ఫరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య ప్రముఖుడు గట్టు మహేష్‌బాబు అవార్డుగ్రహితలచే శాంతిప్రతిజ్ఞ చేయించారు. -
‘ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించండి’
అనంతపురం అర్బన్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 21న నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఎన్నికలను సజావుగా జరిపేందుకు సహకరించాలని రాజకీయ పార్టీలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం సూచించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరగకూడదన్నారు. ఆదివారం కలెక్టరేట్లోని తన చాంబర్లో రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల 21న విడుదలవుతుందని 28 వరకు నామినేషన్లను స్వీకరిస్తామన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తామన్నారు. ఓటర్ల ముసాయిదా జాబితాను జడ్పీ, మండల, మునిసిపల్ కార్యాలయాల్లో ప్రదర్శించామన్నారు. అభ్యంతరాలు ఉంటే ఈ నెల 24వ తేదీలోగా రిటర్నింగ్ అధికారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలన్నారు. వాటిపై జడ్పీ సీఈఓ, మునిసిపల్ కమిషనర్ ద్వారా విచారణ చేయిస్తామన్నారు. 26న తుది జాబితా ప్రచురిస్తామన్నారు. నామినేషన్ల పరిశీలన మార్చి 1న నిర్వహిస్తామని, ఉపంసహరణకు 3వ తేదీ ఆఖరన్నారు. ఎన్నికలు మార్చి 17వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయన్నారు. ఓట్ల లెక్కింపు 20న ఉంటుందన్నారు. ఎన్నికల కోడ్ పూర్తిస్థాయిలో అమలు కావాలన్నారు. -
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిద్దాం
– రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో కలెక్టర్ – ఎన్నికల నియమావళిని పాటించాలి – ఓటర్లను ప్రలోభాలకు గురిచేయొద్దు కర్నూలు(అగ్రికల్చర్): శాసనమండలి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహిద్దామని, ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సీహెచ్ విజయమోహన్ కోరారు. బుధవారం కలెక్టర్ తన చాంబరులో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాజకీయ పార్టీల నేతల ప్రవర్తన, సభలు, ఊరేగింపులు, వాహనాల వినియోగం తదితర వాటిని కలెక్టర్ వివరించారు. జాతి, కుల, మత ప్రాంతీయ పరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించరాదని, ఇతర పార్టీలను విమర్శించేటపుడు వాటి గత చరిత్ర, ఇంతకు ముందు పనితీరును మాత్రమే దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. ప్రజా జీవితంతో సంబంధం లేని, వ్యక్తిగత దూషణలు చేయరాదని వివరించారు. రాజకీయ ప్రకటనల ద్వారా కుల, మతపరమైన అభ్యర్థనలు చేయరాదని, మసీదులు, చర్చిలు, దేవాలయాలు, ఇతర ప్రార్థన , పవిత్ర స్థలాల్లో ప్రచారం చేయరాదని వివరించారు. ఓటర్లను ప్రలోభ పెట్టడం, బెదిరించడం, ఒకరి స్థానంలో మరొకరిని ఓటరుగా వినియోగించడం, పోలింగ్ స్టేషన్‌కు 100 మీటర్ల పరిధిలో ప్రచారం నిర్వహించడం చేయరాదని తెలిపారు. సభల నిర్వహణ సమాచారం ఇవ్వాలి సభల నిర్వహణపై స్థానిక పోలీసులకు ముందుగా సమాచారం అందించాలని, తద్వారా పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాపిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటారని కలెక్టర్ స్పష్టం చేశారు. కొత్త పథకాలు ప్రకటించరాదని, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టరాదని తెలిపారు. రహదారుల నిర్మాణం, తాగునీటి వసతులపై హామీలు ఇవ్వరాదన్నారు. ప్రతి మండలానికి ఒక జిల్లా స్థాయి అధికారితో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్టు టీంలు వేస్తున్నామని, ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా నియమించనున్నట్లు చెప్పారు. ఎన్నికల నియమావళి అమలును పరిశీలించేందుకు ఒక సాధారణ పరిశీలకుడు, ఒక వ్యయ పరిశీలకుడు జిల్లాకు రానున్నట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ ఓటర్లకు నగదు, మద్యం, బహమతులు పంపిణీ చేయడం నేరమన్నారు. అధికార పార్టీ నేతలు ఓట్ల కోసం కొత్త పింఛన్ల, రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ ప్రతినిధి తోట వెంకటకృష్ణారెడ్డి అధికారుల దృష్టికి తెచ్చారు. పట్టభద్రుల్లో బోగస్ ఓటర్లు ఎక్కువగా ఉన్నారని, వీటిని తొలగించాలని సీపీఎం నేత గౌస్‌దేశాయ్, సీపీఐ నగర కార్యదర్శి రసూల్ కోరారు. కర్నూలు ఓటర్లకు పాణ్యంలో పోలింగ్ కేంద్రాన్ని కేటాయించడం దారుణమని పేర్కొన్నారు. తగిన ఆధారాలతో రాతపూర్వకంగా ఇస్తే విచారించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. పింఛన్లు, ప్రజా పంపిణీ, ఉపాధి హామీ పనులు యథావిధిగా జరుగుతాయని వివరించారు. డీఆర్ఓ గంగాధర్‌గౌడు, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్, బిజేపి ప్రతినిధి నరసింహవర్మ, సామాజ్‌వాదీ పార్టీ ప్రతినిధి దండుశేషు యాదవ్ పాల్గొన్నారు. -
క్రైస్తవులపై దాడులు అరికట్టాలి
క్రైస్తవ సంఘాల డిమాండ్ కలెక్టర్ వద్ద ధర్నా, శాంతి ర్యాలీ కాకినాడ సిటీ : క్రైస్తవులపై రోజురోజుకు పెరుగుతున్న దాడులపై వివిధ క్రైస్తవ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. క్రైస్తవులపై దాడుల్ని తక్షణం అరికట్టాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఫ్లకార్డులతో దాడులపై నిరసన తెలిపారు. నాయకులు మాట్లాడుతూ అధికమవుతున్న మతోన్మాద ధోరణుల వల్ల ప్రపంచ వ్యాప్తంగా దేశానికి చెడ్డ పేరువస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళన అనంతరం కలెక్టరేట్ నుంచి ఇంద్రపాలెం వంతెన వరకూ ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు అద్దంకి రంజిత్ ఓఫీర్, క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ డైరెక్టర్ మూర్తిరాజు, రక్షణ టీవీ సీఎండీ జక్కుల బెన్హర్, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ నాయకులు కాశి బాలయ్య, రాజ భూషణం, జార్జి ముల్లర్, కిరణ్‌పాల్ పాల్గొన్నారు క్రైస్తవుల శాంతి ర్యాలీ క్రైస్తవులపై దాడులను ఖండిస్తూ ఆలిండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నగరంలో సోమవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. భానుగుడి సెంటర్ నుంచి మెయిన్‌రోడ్డు, బాలాజీ చెరువు సెంటర్, జిల్లా పరిషత్ సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకూ ర్యాలీ జరిపారు. కౌన్సిల్ నాయకుడు బి.రాజేంద్రబాబు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన వాక్ స్వేచ్ఛను సైతం దిక్కరిస్తూ మతోన్మాదంతో క్రైస్తవులపై దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన చెందారు. చర్చిలను ధ్వంసం చేయడమే కాకుండా అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మత ఛాందస వాదులను చట్టపరంగా శిక్షించాలని, క్రైస్తవులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. -
ప్రపంచ శాంతి కోసం ర్యాలీ
కర్నూలు (న్యూసిటీ) : ప్రపంచ శాంతిని కోరుతూ కర్నూలు నగరంలో క్రైస్తవులు భారీ ర్యాలీ నిర్వహించారు. లూర్ధుమాత పండుగను పురస్కరించుకొని ఆదివారం మేరిమాత తేరును.. చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఉన్న సెయింట్ థెరిస్సా చర్చి నుంచి రాజ్‌విహార్, కలెక్టరేట్, సీ.క్యాంపు మీదుగా నంద్యాల చెక్‌పోస్ట్ దగ్గర ఉన్న సెయింట్ లూర్ధుస్ కథిడ్రల్ వరకు ఊరేగించారు. ఈ సందర్భంగా చర్చి ఫాదర్ కోల విజయరాజు మాట్లాడుతూ.. ఫ్రాన్స్ దేశంలోని లూర్ధునగరంలో మేరిమాత ప్రత్యక్షమై ప్రపంచశాంతి కోసం దేవున్ని ప్రార్థించాలని బెర్నెదెత్తె అనే బాలికకు తెలిపిందన్నారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నగరంలో ప్రపంచంలో శాంతి వర్ధిల్లాలని ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. లూర్ధుమాత ఉత్సవాల్లో చివరి రోజైన ఫిబ్రవరి 11న జరిగే వేడుకలకు నగర ప్రజలందరూహాజరై ప్రపంచశాంతికోసం ప్రార్థించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జి.లూర్ధయ్య బృందం ఆలపించిన పాటలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో మరియదళ సభ్యులు, యూత్, క్యాథలిక్ అసోసియేషన్ సభ్యులు, ఫాదర్లు, సిస్టర్లు పాల్గొన్నారు. -
ప్రతి కుటుంబంలో శాంతి వికసించాలి
– బిషప్ పూల ఆంథోని – లూర్ధుమాత కథిడ్రల్ ఆలయంలో సెమీ క్రిస్మస్ కర్నూలు సీక్యాంప్: క్రిస్మస్ పండుగ ప్రతీ కుటుంబంలో శాంతి వికసించాలని కర్నూలు, అనంతపురం డయాసిస్ బిషప్ పూల ఆంథోని ఆకాంక్షించారు. మంగళవారం నగరంలోని లూర్ధుమాత కథిడ్రల్ ఆలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పూల ఆంథోని మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఇతరుల పట్ల ప్రేమ, దయ, జాలి కలిగిఉండాలన్నారు. కార్యక్రమంలో లూర్థు మాత ఆలయ సిస్టర్స్, ఫాదర్స్ పాల్గొన్నారు. -
ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత
కర్నూలు న్యూసిటీ: ఆధ్యాత్మికతతో మానిసక ప్రశాంతత లభిస్తుందని ప్రముఖ ఆ«ధ్యాత్మివేత్త శ్రీ త్రిదండి అష్టాక్షరి సంపత్కుమార రామాను జీయరు స్వామి అన్నారు. ఆదివారం కర్నూలులోని జిల్లా గోరక్షణ మహాసంఘం (గోరక్షణశాల)లో ధనుర్మాస వ్రత మహాత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ... వారంలో ఒక్కరోజైనా దేవాలయాలకు వెళ్లి దేవున్ని దర్శించుకోవాలన్నారు. తమ సంపాదనలో కొంత పేదలకు దానం చేయాలన్నారు. గోరక్షణశాల మాజీ ధర్మకర్త మండలి సభ్యుడు శ్రీకాంత్ నాయుడు, గోరక్షణశాల సిబ్బంది రమణ, ఆర్యవైశ్య సంఘం జిల్లా నాయకుడు నాగేశ్వరరావు, భక్తులు పాల్గొన్నారు. -
ఐక్య శాంతి సమితి
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, ప్రపంచంలో శాంతి సామరస్యాల కోసం 1945 అక్టోబర్ 24న ఆవిర్భవించిన ఐక్యరాజ్య సమితి రేపు 71వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. యుద్ధం ఏ కారణం వల్ల జరిగినా అది మానవాళి వినాశనానికే దారితీస్తుంది. యుద్ధం ఎలా ప్రారంభం అయినా దానికి మూలం... జాతి, మత ఆధిక్య ఘర్షణల్లోనే కనిపిస్తుంది. అందుకే సమితి నిరంతరం అభివృద్ధి గురించే మాట్లాడుతుంది. ‘‘మనుషులంతా ఒక్కటే అనుకున్నప్పుడు, దేశాలన్నీ ఒకటిగా ఉన్నప్పుడు మానవాళి సుఖశాంతులతో వర్థిల్లుతుంది’’ అని... వచ్చే జనవరి 1న సమితి కొత్త ప్రధాన కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఆంటోనియో గటెరస్ అంటున్నారు. సమితి ఎప్పుడూ మతాలను ప్రస్తావించదు. శాంతిని మాత్రమే ప్రవచిస్తుంది. మతాలు ఎన్నున్నా అవన్నీ మానవ కల్పితాలు తప్ప, దేవుని సంకల్పాలు కావు. అందుకే... ‘మతములన్ని మాసిపోవును, జ్ఞానమొక్కటే నిలిచిపోవును’ అని స్వామి వివేకానంద అన్నారు. ఆయన అంతరార్థం జ్ఞానమే దైవమని. ఈ తరానికి అవసరమైన జ్ఞానం... శాంతి జ్ఞానం. పురాణాలు దైవాన్ని ‘అద్వైతం’అని సంబోధించాయి. అంటే రెండో మాట, రెండో రూపం లేనిది అని. ‘ఏకైకం’ అన్నమాట. పవిత్ర ఖురాన్ ‘అల్లాహ్’ అంటే అత్యుత్తమమైన దేవుడు అని వివరిస్తోంది. పవిత్ర బైబిలు గంథంలో మోషే ప్రవక్త తనకు దర్శనం ఇచ్చిన మహాశక్తిమంతుడైన దేవుడిని తమరి నామధేయం ఏమిటో బయలు పరచమని ప్రాధేయపడతాడు. అందుకు బదులుగా యావే (డజిఠీజి); ‘యెహోవా’ అన్న గొప్ప శబ్దం వినిపిస్తుంది. హెబ్రీ భాషలో దానర్థం ‘సదా ఉన్నవాడు, ఉండేవాడు’. దైవశక్తి లేదా జ్ఞానశక్తి లేదా శాంతిశక్తి యుగయుగాల వరకు జీవించే ఉంటుంది. మానవుల్లా, ఇతర జీవచరాల్లా కొంతకాలం ఉండి గతించేది కాదు. మతాలకు అతీతంగా ఆ దివ్యమైన శక్తిని ఆరాధించాలి. అప్పుడే మానవజీవితం సార్థకమౌతుంది. శాంతిమయం అవుతుంది. బైబిల్లోనే ఒక వాక్యం ఉంది. ‘సృష్టికర్త అయిన దేవుడిని నీ పూర్ణ హృదయంతో ఆరాధించు. నిన్ను వలెనే నీ పొరుగువారిని ప్రేమించు’ అని! సాటి మనిషిని ప్రేమించడం అంటే దైవాన్ని ఆరాధించడమే. పురాతన హిందూ శాస్త్రాలు ‘మానవ సేవే, మాధవ సేవ’ అని చాటుతున్నాయి. ఈ సూక్తిని పాటించినప్పుడు భూతలం స్వర్గమయం అవుతుంది. శాంతిధామం అవుతుంది. - యస్. విజయ భాస్కర్ -
శాంతికి చిహ్నం ఇస్లాం
గోనెగండ్ల: ఇస్లాం మతం శాంతికి చిహ్నమని ముస్లిం మత పెద్ద మౌలానా జాకీర్ అహమ్మద్ రషాది పేర్కొన్నారు. గోనెగండ్ల సమీపంలో రెండురోజులపాటు నిర్వహించే జిల్లా స్థాయి ఇస్తెమా శనివారం ప్రారంభమైంది. రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుండి కూడా వేలాది మంది ముస్లింలు తరలివచ్చారు. మతపెద్దలు ఇస్తెమాను దువాతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైవం సష్టించినవన్నీ మానవళికి ఉపయోగపడేవే అన్నారు. ఇస్తెమాలో మత పెద్దలు మౌలానా యాషిన్సాబ్, మౌలానా సలీం సాబ్, మౌలానా సత్తార్‌సాబ్, మౌలానా జుబేర్ సాబ్‌లు ప్రసంగించారు. -
ఊపిరి పీల్చుకున్న పోలీసులు
కర్నూలు: ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గణేశ్ నిమజ్జనం వేడుకలు ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ముస్లింల పవిత్ర పండుగ బక్రీద్, అలాగే గణేష్ నిమజ్జనం ఒకే రోజు రావడంతో పోలీసు శాఖ ఉత్కంఠకు లోనైంది. ఎస్పీ ఆకే రవికష్ణ ప్రత్యేక దష్టి సారించి పక్కా ప్రణాళికతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు శ్రమించారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరంలో పర్యటిస్తూ క్షేత్రస్థాయి అధికారులకు తగు సూచనలు, సలహాలు ఇస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చర్యలు తీసుకున్నారు. గత ఏడాది కూడా ఈ రెండు పండుగలు ఒకే రోజు వచ్చాయి. ఆ అనుభవంతో ఈ ఏడాది కూడా ఎలాంటి అపశ్రుతులు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. సివిల్ పోలీసులతో పాటు ఏపీఎస్పీ ఆర్మ్డ్ రిజర్వు విభాగం పోలీసు సేవలను బందోబస్తు విధులను వినియోగించుకున్నారు. మతసామరస్యాన్ని చాటుతూ హిందు ముస్లింలు కలసిమెలసి పండుగలను ఘనంగా జరుపుకున్నారని, ఇదే స్పూర్తిని నిరంతరం చాటాలని ఎస్పీ ఆకే రవికష్ణ ఆకాంక్షించారు. రెండు పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడానికి సహకరించిన అన్ని వర్గాల ప్రజలు, మత పెద్దలు, యువకులు, విద్యార్థులు, రాజకీయ పక్షాలు, మీడియా ప్రతినిధులకు ఎస్పీ ప్రత్యేకంగా కతజ్ఞతలు తెలిపారు. కాగా.. మద్యం, బాణసంచా విక్రయాలు, రంగులు చల్లడంపై పోలీసు శాఖ నిషేధం ప్రకటించినప్పటికీ అమలు కాలేదు. నగరంలో య«థేచ్ఛగా మద్యం విక్రయాలు జరిగాయి. బార్లు, మద్యం దుకాణాలను ఎకై ్సజ్ అధికారులు సీజ్ చేసినప్పటికీ ముందురోజే స్టాకును పక్కకు తరలించి విక్రయాలు జరిపి సొమ్ము చేసుకున్నారు. చిన్నమార్కెట్ దగ్గర స్వల్ప ఘర్షణ గణేశ్ విగ్రహాల ఊరేగింపులో పాతబస్తీలోని చిన్నమార్కెట్ దగ్గర స్వల్ప ఘర్షణ చోటు చేసుకున్నట్లు సమాచారం. హోటల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సముద్రాల హనుమంతరావు కుమారుడు సముద్రాల శ్రీధర్‌పై గుర్తు తెలియని యువకులు దాడి చేసినట్లు సమాచారం. దాడిలో గాయాలకు గురైన శ్రీధర్ స్థానిక గౌరీగోపాల్ ఆసుపత్రిలో వైద్యచికిత్సలు పొందారు. ఈ మేరకు గౌరీగోపాల్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి మెడికల్ లీగల్ కేస్ సమాచారం చేరింది. అయితే ఈ విషయంపై ఒకటో పట్టణ సీఐ కష్ణయ్యను వివరణ కోరగా అలాంటి సమాచారం తమ దష్టికి రాలేదని, గణే‹శ్ విగ్రహాల ఊరేగింపులో కూడా ఎలాంటి చిన్నపాటి ఘర్షణ జరగలేదని తెలిపారు. -
తలవంచి ధరను జయించిన తల్లి ఆమె!
మార్చి 1, 1980న వరంగల్‌లోని కాకతీయ యూనివర్శిటీ మూడవ స్నాతకోత్సవానికి నోబెల్ ప్రపంచ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరీసాను ఆహ్వానించారు. అయితే ఆమెను ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని విద్యార్థులలో ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకించి నిరసనలు చేపట్టింది. అంతటి మహోన్నత వ్యక్తి వరంగల్‌లాంటి పట్టణానికి రావడమే మహాభాగ్యమని, ఆమెను అడ్డుకొని అవమానించవద్దని యూనివర్శిటీ జిల్లా, పోలీసు అధికారులు, ప్రముఖులు వారికి నచ్చజెప్పేందుకు అనేక దఫాలుగా జరిపిన చర్చలు విఫలం కావడంతో యూనివర్శిటీలో ఆమె కారు ప్రయాణించే రోడ్డుకు కొంత దూరంలో ఒక గీత గీసి అది దాటకుండా నిరసన వ్యక్తం చేసుకొమ్మని పోలీసులు విద్యార్థుల నాదేశించారు. వారి నిరసన ప్రజల దృష్టిని పెద్దగా ఆకర్షించకున్నా యూనివర్శిటీ కేంపస్‌లో మాత్రం ఉద్రిక్తత నెలకొంది. అప్పుడు ఎం.ఎ. ఎకనమిక్స్ రెండో సంవత్సరంలో ఉన్న నాలాంటి అభిమానులకు ఒక వైపు ఆనందం, మరోవైపు మదర్ భంగపడ్తారేమోనన్న భయం! మార్చి1 న రాష్ట్ర గవర్నర్ పి.సి.అబ్రాహాముతో సహా మదర్ వచ్చారు. యాభైమందికి పైగా విద్యార్థులు ‘మదర్ థెరిస్సా గో బ్యాక్’ లాంటివి రాసిన ప్లకార్డులు, రకరకాల నినాదాలతో వారికి నిర్దేశిత స్థలంలో నిలబడ్డారు. అంతలోనే ఆమె కారు వారున్న స్థలాన్ని సమీపించింది. ఆమె వారిని చూడదులే అనుకున్న పోలీసుల అంచనాలు తారుమారయ్యాయి. మదర్ వారిని చూడనే చూశారు. అంతే! మరుక్షణం డ్రైవర్‌తో కారు ఆపించారు. ఏం జరుగుతున్నదో అర్థం చేసుకునేలోగానే మదర్ మెరుపు వేగంతో కారు దిగడం, విద్యార్థుల ముందుకు వెళ్లిపోయి రెండు చేతులూ జోడించి నిలబడటం జరిగిపోయాయి. పోలీసులు ఆమెకు భద్రతా వలయంగా ఏర్పడబోగా ఆమె వారిని సున్నితంగా వారించి దూరంగా నిలబెట్టారు. ఇది నిరసనకారులు కూడా ఊహించని పరిణామం. అక్కడున్న వీఐపీలందరి మొహాల్లో ఆందోళన... మదర్‌పై దాడి జరుగుతుందేమోనన్న భయం, కాని ఆమెలోని నిశ్చలత్వాన్ని అడుక్డుకునే సాహసం చేయలేదెవరూ. ఐదడుగుల పొడవు కూడా లేని మదర్‌లోని ప్రశాంతత, నిర్మలత్వం, నిర్భయత్వం, విధేయత, సాత్వికత ఆందోళనకారులనే కాదు, అక్కడున్న వారెవరికీ మాట పెగలకుండా చేశాయి. ‘నా వల్ల ఏదైనా తప్పు జరిగితే నన్ను క్షమించండి’ అంటూ చేతులు జోడించి అంటున్న ఆమె మాటల్లోని యధార్థత అంతా తలదించుకునేలా చేసింది. నినాదాలు ఆగిపోయాయి, ప్లకార్డులు నేలకూలాయి. నిశ్శబ్దం అలుముకుంది. ‘ఇది మీ ఉత్సవం. నేను మీ అతిథిని. మీరు లేకుండా అదెలా జరుగుతుంది? మనమంతా కలిసి వెళ్దాం పదండి’ అంటూ విద్యార్థుల్లో ఇద్దరిని తన రెండుచేతులతో పట్టుకొని పోలీసులు దారి చూపగా వారితోబాటు ఉత్సవ ప్రాంగణానికి గబగబా నడవడం ఆరంభించారు మదర్. అంతే! నిరసనకారులతో సహా అంతా మదర్‌ను వెంబడించారు. అధికారులు అన్ని రోజులుగా సాధించలేకపోయిన శాంతిని మదర్ ఒక్క నిమిషంలో తన సాత్వికత్వంతో సాధించారు. ఎంతో గందరగోళం మధ్య జరుగుతుందనుకున్న స్నాతకోత్సవం ఆనాడు ఎంతో ప్రశాంతంగా, అర్థవంతంగా జరిగింది. కేవలం పదినిమాషాలే సాగిన తన ప్రసంగంలో మదర్ దేవుని ప్రేమను అత్యద్భుతంగా ప్రకటించారు. చేతలతో దేవుని ప్రేమను అంత అద్భుతంగా చాటే వ్యక్తికి ప్రవచనాలు, ప్రసంగాల అవసరం ఏముంటుంది? సాత్వికులు ధన్యులు. వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారన్న యేసుక్రీస్తు ప్రవచనంలోని శక్తి, వాస్తవికత ఆరోజు నాలాంటి వారెందరికో అర్థమైంది. ఆమెకు మొన్ననే సెంయిట్ హుడ్ ఇచ్చారు. సెయింట్ అంటే అక్కడెక్కడో, మరోలోకంలో ఉండి పూజలందుకుంటున్న భావన. కాని మదర్ అంటే మన పక్కనే ఉండి ప్రేమతో కన్నీళ్లు తుడుస్తున్న ఆదరణ!! అందుకే ఇప్పుడూ ఎప్పుడూ ఆమె అమ్మే!! - రెవ.డా. టి.ఎ.ప్రభుకిరణ్ -
శాంతియుత నిరసనలపై ప్రభుత్వ ఉక్కుపాదం
– కలెక్టరేట్ నుంచి గాంధీ విగ్రహం వరకు నిషేధాజ్ఞలు విధింపు – ఊరేగింపులు, ధర్నాలు, నిరసన ప్రదర్శలు నిర్వహించరాదని హెచ్చరికలు – ఆదేశాలిచ్చిన కలెక్టర్ విజయమోహన్ కర్నూలు(అగ్రికల్చర్): ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చిన బంద్‌ను విచ్చిన్నం చేయడానికి ప్రభుత్వం కుట్రపన్నింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తీసుకురావడంలో విఫలం కావడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ శనివారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు కాంగ్రెస్, వామపక్షాలు, ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి చేపడుతున్న బంద్‌ను విచ్చిన్నం చేసే దిశగా ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ కలెక్టర్ కార్యాలయం నుంచి ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వరకు నిషేధాజ్ఞలు విధించారు. ఈ ప్రాంతంలో ఎలాంటి నిరసన ప్రదర్శలు, ధర్నాలు, ఊరేగింపుల వంటివి నిర్వహించరాదని ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం వరకు మూడు చోట్ల ఫ్లెక్సీ, బ్యానర్లను ఏర్పాటు చేశారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతియుతంగా జరిపే ఆందోళలను అణచివేసే విధంగా నిషేధాజ్ఞలు విధించడాన్ని ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. -
సైకిళ్లపై పోలీసుల శాంతి ర్యాలీ
కర్నూలు: వినాయక చవితి, బక్రీద్ పండుగలను పురస్కరించుకొని ఎస్పీ ఆకె రవికృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు కర్నూలు నగరంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. పాతబస్తీలోని జమ్మిచెట్టు నుంచి కేసీ కెనాల్ దగ్గర ఉన్న వినాయక ఘాట్ వరకు సైకిల్ ర్యాలీ సాగింది. హిందూ, ముస్లీం మత పెద్దలతో కలిసి జమ్మిచెట్టుదగ్గర శాంతి కపోతాలు ఎగురవేసి, ఎస్పీ ఆకె రవికృష్ణ సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. జమ్మిచెట్టు, కింగ్‌మార్కెట్ మీదుగా వినాయక ఘాట్ వరకు ర్యాలీ సాగింది. గణేష్ కమిటీ సభ్యులతో కలిసి వినాయక నిమజ్జన ఘాట్‌ను ఎస్పీ పరిశీలించారు. ఓఎస్డీ రవిప్రకాష్, డీఎస్పీలు రమణమూర్తి, బాబు ప్రసాద్, రామచంద్ర, వినోద్‌కుమార్, ఉసేన్‌పీరా, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు కపిలేశ్వరయ్య, సీఐలు కృష్ణయ్య, ములకన్న, మధుసూదన్‌రావు, నాగరాజు రావు, నాగరాజు యాదవ్ పాల్గొన్నారు. ర్యాలీలో భాగంగా వివిధ కాలనీలోని మత పెద్దలతో ఎస్పీ మాట్లాడారు. వినాయక చవితి, బక్రీద్ పండుగలను ప్రశాంతంగా, శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. -
ప్రపంచ శాంతి కోసం కృషి చేయడం అభినందనీయం
నల్లగొండ టౌన్ : ప్రపంచశాంతి కోసం 40 రోజుల ఉపవాస ప్రార్థనలు చేయడం అభినందనీయమని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో గల సెంటనరీ సెల్ప్ సపోర్టింగ్ తెలుగు బాప్టిస్టు చర్చి 125 సంవత్సరాల చరిత్రపై దివంగత తలకొప్పుల సామ్యూల్, మార్తామ్మల జ్ఞాపకార్థం నిర్మించిన స్థూపాన్ని బుధవారం నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, తుంగతుర్తి, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, భాస్కర్‌రావు, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి దుబ్బాక నర్సింహారెడ్డిలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఘోరీ గోమ్స్, మైనార్టీ కార్పొరేషన్ ఈడీ ఎండీ.సలీం, డాక్టర్ కె.మోజస్, టీఎస్ కిష్టఫర్, యేసురాజు, అబ్సోలం, డి.కృపానందం, ఆనంద్, ప్రసాద్, మాణిక్యం, చిత్తరంజన్‌దాస్, టీఎస్ విలియమ్స్, కొంపల్లి మత్య్సగిరి, ఆశయ్య, టి.ఎలిసా, జీవన్, సర్వోదయమణి, పద్మ, కమలమ్మ, ఫ్రాన్సిస్, డేవిడ్‌రాజు, శరత్ తదితరులు పాల్గొన్నారు. -
శాంతి, సామరస్యాల కోసం ప్రార్థించాలి
ఏలూరు (ఆర్ఆర్ పేట) : సమాజంలో శాంతి, సామరస్యాలు నెలకొల్పడానికి అల్లాహ్‌ను ప్రార్థించాలని నగరానికి చెందిన అంజుమన్ ముహాఫిజుల్ ఇస్లాం సంస్థ సభ్యులు సూచించారు. మంగళవారం స్థానిక ఆ సంస్థ కార్యాలయంలో నగరం నుంచి హజ్ యాత్రకు వెళుతున్న ముస్లింలను సత్కరించారు. మక్కాకు వెళ్లి అక్కడి ఆచార, సంప్రదాయాల ప్రకారం నడుచుకుని నగరం సుభిక్షంగా ఉండేలా అల్లాహ్‌ను వేడుకోవాలని ముహాఫిజల్ కోరారు. హజ్ యాత్రలో అనుసరించాల్సిన విధానాలను మతపెద్దలు వివరించారు. ఏలూరు నగరం, పరిసర ప్రాంతాల నుంచి ఈ ఏడాది పది మంది హజ్ యాత్రకు వెళుతున్నారు. అంజుమన్ ముహాఫిజుల్ ఇస్లాం సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ఎం అక్బర్, ఎండీ సాధిక్, ఉపాధ్యక్షుడు ఎండీ ఇస్మాయిల్, జాయింట్ సెక్రటరీలు అబ్దుల్ రహమాన్ ఖురేషీ, ఎండీ బహబూబ్ పాషా, కోశాధికారి ఎండీ సులేమాన్, సంస్థ సభ్యులు పాల్గొన్నారు. -
యోగాలో ఏకాగ్రత అవసరం
ఆరిలోవ: యోగా చేస్తున్నవారిలో తప్పనిసరిగా ఏకాగ్రత అవసరమని ఏయూ సైకాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ ఎం.వి.ఆర్ రాజు తెలిపారు. ఆరిలోవ పారతం చినగదిలి నార్త్ షిరిడి సాయిబాబాల ఆలయంలో 14 రోజుల పాటు జరుగుతున్న ఉచిత యోగా శిక్షణ శిబిరంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ఇక్కడ శిక్షణ పొందుతున్నవారిని ఉద్దేశించి మాట్లాడారు. యోగా శరీరానికి అవసరమన్నారు. దానివల్ల ఆరోగ్యం కుదుటపడుతుందన్నారు. ప్రతి ఒక్కరిలోను పోజిటివ్ ఆలోచన ఉండాలన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించండి
– పోలీస్ ఆంక్షలను పాటించండి – అపరిచితులకు గదులు కేటాయించవద్దు – డయల్ 100 లేదా పోలీసులకు సమాచారం ఇవ్వండి – జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ శ్రీశైలం- శ్రీశైల మహాక్షేత్రంలో కష్ణా పుష్కరాల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ రవికష్ణ సూచించారు. శనివారం ఆయన క్షేత్ర పురవీధుల్లో సైకిల్ తిరుగుతూ పరిశీలించారు. కష్ణా పుష్కరాల బందోబస్తుకు వచ్చే పోలీసులకు వసతి సౌకర్యం కల్పించేందుకు ఏర్పాటు చేసిన బ్యారక్స్, కళాశాల, పాఠశాల వసతి గహాలను పరిశీలించారు. సత్రాలు, లాడ్జీల నిర్వాహకులు తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. రెడ్ల సత్రంలో సీసీ కెమెరాల పనితీరును ఆయన పరిశీలించారు. సత్రాల గదుల కేటాయింపులో పూర్తి సమాచారంతో పాటు గుర్తింపు కార్డులను సేకరించాల్సిందిగా ఆదేశించారు. అలాగే ఎక్కువ మొత్తం చెల్లించడానికి ఇష్టపడిన అపరిచిత వ్యక్తులకు ఎట్టి పరిస్థితులలో గదులను ఇవ్వవద్దని కోరారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనల జరగకుండా పోలీసు నిఘాతో పాటు సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణకు పోలీస్ యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే భద్రతా చర్యల్లో భాగంగా ఔటర్ రింగ్‌రోడ్డును పరిశీలించారు. ఆయన వెంట ఓఎస్డీలు రవిప్రకాష్, సత్య ఏసుబాబు, డీఎస్పీలు సుప్రజ, రమేష్‌బాబు, ఈశ్వర్‌రెడ్డి, బాబా ఫకద్ధిన్, సీఐలు చక్రవర్తి, గంటా సుబ్బారావు తదితరులు ఉన్నారు. డయల్ 100 పుస్తకం ఆవిష్కరణ శ్రీశైలంలోని మేకల బండ ప్రాథమిక పాఠశాలలో జిల్లా ఎస్పీ ఆకే రవికష్ణ డయల్ 100 పుస్తకాలను ఆవిష్కరించారు. దీనికి ముందుగా ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఇంటి సమీపంలోనూ, మీకు తెలిసిన ప్రాంతాలలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు, లేదా బ్యాగులు కనిపిస్తే డయల్ 100కు సమాచారం అందించాలన్నారు. ఓ వైపు పుష్కరభద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తూ మరో వైపు శ్రీశైలం పీఎస్ నుంచే జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ కేంద్రాలకు సెట్ ద్వారా మానిటరింగ్ చేస్తూ వివరాలను సేకరించారు. పుష్కర వి«ధుల్లో పాల్గొనడానికి సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. -
12 నుంచి హనుమాన్ మహాయజ్ఞం
విజయవాడ(చిట్టినగర్) : విశ్వశాంతి కోసం పుష్కరాల సమయంలో ఈ నెల 12 నుంచి 23వ తేదీ వరకు పాలప్రాజెక్టు సమీపంలోని హనుమత్ దీక్షా పీఠంలో శ్రీ హనుమాన్ మహాయజ్ఞం నిర్వహించనున్నట్లు పీఠాధిపతి దుర్గాప్రసాద్ స్వామిజీ తెలిపారు. పీఠం ఆవరణలో శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన యజ్ఞం వివరాలు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. పుష్కరాలు జరిగే 12 రోజులు పీఠంలో స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు, అఖండనామ సంకీర్తనలు, అన్నప్రసాద వితరణ నిర్వహిస్తామని తెలిపారు. పీఠం కన్వీనర్ రాంపిళ్ల జయప్రకాష్ మాట్లాడుతూ పుష్కరయాత్రికులు హనుమత్ దీక్షా పీఠానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్న అన్న ప్రసాదాలను స్వీకరించాలని కోరారు. పారిశ్రామికవేత్త గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ విశ్వశాంతి కోసం జరుగుతున్న మహా యజ్ఞంలో భక్తులందరూ పాల్గొన్నారు. పవనానందస్వామి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. -
ఇస్లాం మతం శాంతిని ప్రబోధిస్తుంది
శాంతి ర్యాలీలో మతపెద్దలు అనంతపురం న్యూటౌన్ : ఇస్లాం మతం ఎప్పటికీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదని, శాంతిని మాత్రమే ప్రబోధిస్తుందని పలువురు మత పెద్దలు అన్నారు. ఆదివారం పలు ముస్లిం సంఘాల వారు ఉగ్రవాదాని కి వ్యతిరేకంగా నగరంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఉదయం స్థా నిక ఈద్గా మసీదు నుంచి మౌలానా ఆజాద్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక సప్తగిరి సర్కిల్లో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా హఫీజ్ గౌసుపీర్, హఫీజ్ ముఫ్తి మహ్మద్ రజా, హఫీజ్ మహిరుద్దీన్, నిస్సార్ అహ్మద్, మసూద్ సాబ్ తదితరులు ఖురాన్ బోధలను వినిపిం చారు. మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రషీద్ అహ్మద్, వైఎస్సార్సీపీ నాయకులు కొర్రపాడు హుస్సేన్‌పీరా, కాంగ్రెస్ నాయకుడు దాదాగాంధీ, సీపీఎం ఇంతియాజ్, టీడీపీ నేత తాజుద్దీన్ పాల్గొన్నారు. -
శాంతిని కోరేదే ఇస్లాం
* ఐఎస్ఐస్ ఓ సైతాన్ * ఏఐఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఓవైసీ సాక్షి, సిటీబ్యూరో: ఇస్లాం ఎప్పుడూ శాంతినే కోరుకుం టుందని, రక్తపాతం విధ్వంసాలు ఇస్లాం అభిమతం కాదని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా శుక్రవారం మక్కా మసీదులో జరిగిన యౌముల్ ఖురాన్ సభలో ఆయన మాట్లాడారు. ఐఎస్ఐఎస్ ఓ సైతాన్, గుండాల దళమని, వారు మసీదులపై దాడులు చేసి ఎందరో ముస్లింలను హతమార్చారన్నారు. వారికి ఇస్లాంకు సంబంధం లేదన్నారు. భారత దేశంలోని ముస్లింలు ఐఎస్ఐఎస్కు ఎప్పుడూ సహకరించరని, తాను ఐఎస్ఐఎస్ తీవ్రవాదాన్ని తుదముట్టించాలని ఎప్పటినుంచో కోరుతున్నానన్నారు. ముస్లింలు దేశాన్ని ప్రేమిస్తారు తప్ప వదిలి పోరని, ఉగ్రవాదం వైపు వెళ్తున్నవారు ముస్లింలు కాదన్నారు. దేశం కోసం తన తల త్యాగం చేసేందుకైనా సిద్దమేననని, దేశంలోని గంగా జమునా తహజిబ్ కంటే ఏదీ గొప్పది కాదన్నారు. నిరాపరాధులైతే.... ఐఎస్ఎస్తో సంబంధాలున్నాయని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న యువకులు నిరాపరాధులని తేలితే సమాధానం ఏముంటుందని ఎన్ఐఏను అసదుద్దీన్ ప్రశ్నించారు. గతంలో మక్కామసీదు. మలేగావ్ సంఘటనల్లో కూడా అమాయకులను అరెస్ట్ చే శారని. ఇటీవల పాతబస్తీ ఘటనపై నిజానిజాలు న్యాయస్థానంలో రుజువవుతాయన్నారు. తాను ఎన్ఐఏ రిమాండ్ రిపోర్టు చూశానని.. అల్లర్లు సృష్టించాలనే అభియోగం లేదని, మీడియా సృష్టిగా పేర్కొన్నారు. గతంలో బహదూర్‌పురా, సైదాబాద్ పోలీస్స్టేషన్ల పరిధిలో జరిగిన ఇలాంటి సంఘటనల్లో సంఘ్ పరివార్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసిందేనన్నారు. గతంలో మక్కా మసీదు, లుంబీని పార్కు, గోకుల్ చాట్లతో పాటు మాలెగావ్, ముం బాయి మారణకాండలో ఆర్ఎస్ఎస్ హస్తమున్న విషయం స్పష్టమైందన్నారు. ప్రస్తుతం అరెస్టయిన పాతబస్తీ యువకుల న్యాయ పోరాటానికి తాము సహకరిస్తామని, ముస్లిం లపై జరుగుతున్న దౌర్జన్యాలను వ్యతిరేకిస్తూ హక్కుల కోసం పోరాడుతామన్నారు. ముస్లింల పరిరక్షణకు పోరాడుతున్న తమపై సంఘ్ పరివార్, ఆర్ఎస్ఎస్ తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నాయన్నారు. ముస్లింలపై ఉగ్రవాద ముద్రవేయవద్దని సూచించారు. తెలంగాణ హైకోర్టు ఏర్పాటు చేయాలి తెలంగాణ హైకోర్టును తక్షణమే ఏర్పాటుచేయాలని అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం ఇక్కడి హైకోర్టు ఉమ్మడి రాష్ట్రాల కోసం పని చేస్తుందని.. ప్రస్తుతం తెలంగాణ న్యాయవాదుల కోరిక మేరకు హైకోర్టు విభజన జరగాల్సిందేనన్నారు. న్యాయ వాదుల పోరాటానికి ఆయన మద్దతు ప్రకటించారు. -
అమెరికా సైన్యానికి అతడు టార్గెట్!
వాషింగ్టన్: తాలిబాన్ నూతన చీఫ్‌గా పగ్గాలు చేపట్టిన ముల్లా హైబతుల్లా అకుంద్జాదాకు శాంతి చర్చలలో పాల్గొనడానికి అవకాశం ఉందని అమెరికా తెలిపింది. ఇటీవల పాకిస్తాన్లో అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో మృతి చెందిన ముల్లా మన్సూర్ స్థానంలో హైబతుల్లా అకుంద్‌జాదా తాలిబాన్ కొత్త చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. శాంతి చర్చలలో పాల్గొనడానికి కల్పించినటువంటి అవకాశాన్ని హైబతుల్లా అకుంద్‌జాదా వినియోగించుకుంటాడని భావిస్తున్నట్లు అమెరికా విదేశాంగ డిప్యూటీ స్పోక్ పర్సన్ మార్క్ టోనర్ గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు. హైబతుల్లా ఇప్పటి వరకు ఎలాంటి ఉగ్రవాద జాబితాలో లేడని.. అయితే శాంతి చర్చలలో పాల్గొనకుండా తాలిబాన్ ల హింసాత్మక పంథాను కొనసాగిస్తే మాత్రం ఆఫ్గనిస్తాన్‌లోని అమెరికా సైన్యానికి అతడు టార్గెట్ అవుతాడని ఈ సందర్భంగా టోనర్ వెల్లడించారు. పరస్పరం చర్చల ద్వారా సమస్యకు ఒక పరిష్కారం కనుగొనే అవకాశాన్ని అతనికి కల్పిస్తున్నామని, ఈ అవకాశాన్ని హైబతుల్లా వినియోగించుకోవాలని టోనర్ సూచించాడు. ఆఫ్గన్ ప్రభుత్వం గతంలో తాలిబాన్లను శాంతి చర్చలకు పిలిచినా.. వారు మాత్రం ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. -
నేను కోరే శాంతి ఈ మామూలు శాంతి కాదు
మే 19న చలం జయంతి నేను జీవితమంతా ఆశించింది శాంతి. కాని నా తల ఎప్పుడూ ఆలోచనలతో, సమస్యలతో బాధపడుతో వుండేది. రాత్రి పడుకున్నా, తెల్లారి లేచినా, ‘‘ఏమిటి యిదంతా?’’ అనేటటువంటి ఒక పెద్ద సమస్య పట్టుకునేది. కాని ఎన్నడూ శాంతిని నిలుపుకోలేదు. ఆనాడు నేను అనుకున్న శాంతి కావాలంటే ఏ జోలికిపోక నా డబ్బుని నేను దాచుకుని, నా తిండిని నేను తిని, ఇంకొకరి సంగతి పట్టించుకోక నిద్రపోవడం; అట్లా వుండాలనే ఆలోచనే రాలేదు నా తల్లోకి. శాంతిని భగ్నం చేసేటటువంటి పనులన్నీ చేసేవాణ్ని. నేను సమస్యలు గనక పెట్టుకోకపోతే, నా జీవితంలో నేను ఏ మాత్రమూ అశాంతి పడవలసిన పనిలేదు. నాలో పుట్టిన ఉద్రేకాల్నించి శాంతి నాకు కావాలి. అన్ని సమస్యలూ, స్త్రీల సమస్య, మృగాల సమస్య, బిడ్డల సమస్య, లోకం సమస్య యివన్నీ గూడా నా శాంతిని నాశనం చేశాయి. సుఖపడవలసినవాళ్ళు జీవితంలో యివేమీ పెట్టుకోరు. అసలు జీవితంలో వాళ్ళు యివి తీసుకోరు. తమ ఆలోచనలలో గాని, జీవితంలో గాని తీసుకోరు. ఎవరన్న వొస్తే ఓ అట్టానా! అని పంపించేస్తారుగాని, తమ లోపలికి తీసుకుని ఏమిటి బాధ అని వాళ్ళని ప్రశ్నించరు. ఆ విధంగా ఎవరిదో ఒకరి బాధ నా జీవితమంతా వ్యాపించి వుండేది. అబ్బ ఇంక పెట్టుకోలేననుకునేవాణ్ని, కాని ఇంకా వొచ్చేవి. మరి శాంతిని ఈ విధంగా కోరుతూ ఎందుకు ఎప్పడూ అశాంతి నిచ్చేవాటిలోకి పోవాలి? ఎందుకంటే- యిప్పుడు తెలుస్తోందన్నమాట. అశాంతి నిచ్చేవి నా జీవితంలోకి రాకపోతే నేను వుత్త మొద్దులాగుండేవాణ్ని. బడికి వెళ్ళడం, ఇంటికి రావడం, భోజనం చెయ్యడం, కూచోడం, ఏదో పుస్తకాలు చదవడం, ఇంతకంటే నాకు పనేమిటి? అదంతా శాంతి, ఇప్పుడు ఆలోచిస్తే తెలుస్తోంది నేను కోరే శాంతి ఈ మామూలు శాంతి కాదు. (చలం ఆత్మకథ ‘చలం’ లోంచి...) దిక్కులేని స్థితిలో చలం సమాధి రెండేళ్ల క్రిందట యానాం ప్రాంతానికి చెందిన తొలితరం కథకుడు వి.వి.సుబ్బరాజు, తమిళనాడులోని తిరువణ్ణామలైలో దిక్కూమొక్కూ లేకుండా పడివున్న రచయిత చలం సమాధి గురించి తెలియజేశాడు. ఈనెల 7వ తేదీన నేను తిరువణ్ణామలై వెళ్లాను. ఎంతో కష్టపడి చలం సమాధి ఉన్న చోటు కనుక్కోగలిగాను. రమణాశ్రమానికి కొంత దూరంలో రోడ్డువార చెత్తాచెదారం మధ్య ఒక సమాధి కనిపించింది. అక్కడ ఒక చెట్టుకింద కూర్చున్న యాచకులనూ, కొబ్బరి బొండాలు అమ్మేవాళ్లనూ ఆ సమాధి ఎవరిదని అడిగితే వెనకాల ఉన్న ఆఫీసులో కనుక్కోమన్నారు. అక్కడ ‘శాంతిమలై హేండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్’ (విలేజ్ వుమన్ హేండీక్రాఫ్ట్స్) పేరుతో ఉన్న ఆఫీసులో ఉద్యోగినులను అడిగాము (నాతో ఉన్న మా అబ్బాయి చక్రవర్తికి తమిళం తెలుసు). అది ఎవరో జలం అనే తెలుగు రైటర్ సమాధి అనీ, అప్పుడప్పుడు ఎక్కడి నుంచో ఒక ముసలాయన వచ్చి దానిని శుభ్రం చేసి పెడుతుంటాడనీ చెప్పారు. అంతకంటె వివరాలు చెప్పలేకపోయారు. అతిదారుణమైన విషయం ఏమిటంటే, ఆ సమాధి మీద చనిపోయిన వ్యక్తి పేరుగానీ, ఇతర వివరాలుగానీ ఏమీలేవు. సమాధి చుట్టూ ఉన్న అతిచిన్న ప్రహరీని చేర్చి కొంతమంది చిరువ్యాపారుల తోపుడుబళ్లు ఉన్నాయి. రోడ్డు విస్తరణలాంటిదేమైనా జరిగితే సమాధి మొత్తం లేచిపోయే ప్రమాదం కూడా ఉంది. తన రచనలతో ఆంధ్రదేశంలో పెను సంచలనం సృష్టించిన మహారచయిత చలం సమాధి 'unwept, unsung, unhonoured' అన్నట్టుగా ఉండటం చూసి ఎంతో బాధ కలిగింది. - అదృష్టదీపక్ 9440528155 -
పరమ శాంతి
జ్యోతిర్మయం ఈ సృష్టిలో ప్రతిమనిషి శాంతిని పొందేందుకు భౌతికంగా లేక ఆధ్యాత్మికంగా ప్రయత్నిస్తుంటాడు. భౌతికంగా పొందేందుకు వినోదం, విహారం వంటి మార్గాలను ఆశ్రయించేవారు. అల్పకాలికంగా శాం తిని పొందొచ్చేమో కానీ, ఆ తరువాత మళ్ళీ అదే నిరాశ, దుఃఖం కల్గుతుంది. ఇంకొక వైపు భౌతిక సాధనాలతో శాంతి లభించట్లేదని పరమాత్మ చింతన చేస్తున్నప్పటికీ భక్తిలో కూడా మనస్సు ఏకాగ్రత, స్థిరమైన శాంతి అనుభవం కావు. కారణం పరమాత్మ చింతనకు మాల, మంత్రం, మూర్తి వంటి స్థూల ఆధారాలు తీసుకొంటున్నాం. ఓం నమః శివాయః అంటూ మంత్రం జపిస్తూ మాల తిప్పుతూ, ప్రదక్షిణలు చేస్తున్నా మనస్సు ‘ధ్యాస’ లెక్క మీద ఉందే కానీ, ఈశ్వరునితో లేదు. శాంతి అనేది ఇటువంటి బాహ్య సాధన’లతో లభించేది కాదు. మనస్సు సూక్ష్మమైనది. కాబట్టి మనస్సును పరమాత్మపై ఏకాగ్రం చేసేందుకు సూక్ష్మమైన సాధన కావాలి. మనస్సు ఒక అభౌతిక శక్తి. అది ప్రతి ఒక్కరి భృకుటి మధ్యలో కేంద్రీకృతమై ఉన్న చైతన్య శక్తి ఆత్మలో అంతర్భాగమే కానీ పాంచభౌతిక దేహంలో భాగం కాదు. సంకల్ప శక్తినే మనస్సు అంటారు. నిర్మాణం, విధ్వంసం అన్నింటికీ మూలం- సంకల్పం, చిత్తం. అన్ని సమస్యలకు కారణం, నివారణ కూడా మనస్సే. ఇటువంటి అపూర్వమైన సంకల్ప శక్తిని ఆత్మ జ్ఞానం, పరమాత్మ చింతన ద్వారా సరియైన మార్గంలో పెట్టి సాధన చేసినప్పుడు మనస్సులో పాజిటివ్ శక్తి ఉత్పన్నమై మనోబలం పెరిగి నెగటివ్ ఆలోచనలు, భావోద్వేగాలపై అదుపు లభిస్తుంది. ఆంతరంగికంగా మనస్సు’ చింతనను పరివర్తన చేసుకోకుండా.. సంకల్పాలను అణచటంలేక శూన్యం చేసుకోవటం వల్ల, బలవంతంగా బాహ్యంగా విషయా లను నిగ్రహించుకున్నప్పటికీ ఇంద్రియ విషయాల పట్ల ఆసక్తిని వీడనంత వరకు మనస్సు కళ్లెం లేని గుర్రం లాగా పరిగెడుతూనే ఉంటుంది. ప్రాపంచిక విషయాల చింతన వల్ల ఆసక్తి, ఆసక్తి వల్ల వాటిని పొం దాలన్న కోరిక, కోరిక తీరనప్పుడు క్రోధం, క్రోధం వల్ల వ్యామోహం, వ్యామోహం వల్ల ఈశ్వర స్మృతి ఛిన్నాభిన్నమై, సద్బుద్ధి నశించి మనోదౌర్బల్యం ఆవ రించి మనిషి తన స్థితి నుంచే పతనమై అశాంతి పాలవుతాడు. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞాన చింతన అనే కళ్లెంతో మనస్సును వశంలో ఉంచుకొన్న మానవుడే పరమ పిత పరమాత్మ, శాంతి దాత అయిన జ్యోతిర్బిందు స్వరూప శివ పరమాత్మతో మనస్సు సంబంధాన్నిజోడించగల్గి, రాగ ద్వేష రహితుడై పరమ శాంతిని పొందగల్గుతాడు. శాంతి కావాల్సింది మనస్సుకే కానీ తనువుకు కాదు. అందుకే తనువు చాలించిన తర్వాత కూడా ఆత్మ శాంతి కోసం భగవంతుడిని ప్రార్థిస్తారు. శాంతి అనేది భౌతిక సంపదలతో లభించేది కాదు, ఆధ్యాత్మిక జ్ఞాన సంపద ద్వారానే సముపార్జించ గల్గినది. ..బ్రహ్మకుమారి వాణి -
బాన్‌కీ మూన్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం
ది హాగ్యు: యూఎన్ సెక్రటరీ జనరల్ బాన్‌కీ మూన్‌కు డచ్ అత్యున్నత రాయల్ పురస్కారం 'ది ఆర్డర్ ఆఫ్ ది నెదర్లాండ్స్ లయన్' లభించింది. మంగళవారం నెదర్లాండ్స్‌లోని ది హాగ్యు పట్టణంలో మూన్ ఈ పురస్కారాన్ని డచ్ విదేశాంగ శాఖ మంత్రి బెర్ట్ కోఏండర్స్ చేతుల మీదుగా అందుకున్నారు. సభలో మూన్ గురించి మాట్లాడిన బెర్ట్.. ప్రపంచ శాంతిభద్రతలు, న్యాయం, అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా పనిచేశావని ప్రకృతి విపత్తుల బాధితులకు గొంతుక అయ్యారని మూన్‌ను ఉద్దేశించి అన్నారు. ప్రపంచ శాంతితో పాటు దేశాల మధ్య సఖ్యతను నెలకొల్పడం, మానవ హక్కుల కోసం పోరాటం కింద డచ్ ప్రభుత్వం మూన్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది.1815లో ప్రారంభమైన ఈ పురస్కార ప్రధానం ప్రపంచంలోని అన్ని రంగాల్లో నిపుణులకు డచ్ ప్రభుత్వం అందజేస్తోంది. గతంలో యూఎన్ జనరల్‌గా పనిచేసిన కొఫ్పి అన్నన్ కూడా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. -
శాంతి తీరానికి సిరియా?
ఆగ్నేయాసియాను అతలాకుతలం చేస్తున్న సిరియా యుద్ధం ఎట్టకేలకు శాంతి తీరాన్ని చేరనున్నదనిపించే సంకేతాలు కనిపిస్తున్నాయి. సోమవారం అమెరికా, రష్యాల మధ్య కుదిరిన సిరియా తాత్కాలిక శాంతి ఒప్పందం ఫలితంగా ఈ నెల 27 నుంచి సిరియా కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌ల టెలిఫోన్ సంభాషణ తదుపరి వెలువడటం వల్ల ఈ ప్రకటన ప్రత్యేక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇరాన్, సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌లు కూడా ఈ ఒప్పందాన్ని ఆమోదించారు. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే మిగతా విష యాలెలా ఉన్నా అతి పెద్ద అంతర్జాతీయ మానవతావాద సవాలుగా మారిన నిస్సహాయులైన సిరియా ప్రజలకు సహాయం అందించే అవకాశం ఏర్పడుతుంది. ఆహ్వానించదగిన ఈ పరిణామంపై అనుమానాల నీలి నీడలూ కమ్ముకుంటున్నాయి. ఈ కాల్పుల విరమణ పాక్షికమైనది కావడమూ అందుకు ఒక కారణం. ఉగ్రవాద సంస్థలుగా గుర్తిస్తున్న ఐఎస్ఐఎస్కు, జబాత్ అల్ నస్రా లేదా నస్రా ఫ్రంట్‌కు ఈ కాల్పుల విరమణ వర్తించదు. పైగా ఇటు ప్రభుత్వ బలగాలకు, అటు తిరుగుబాటుదార్లకు కూడా ఆత్మరక్షణ కోసం సమాన స్థాయి ప్రతిస్పందన హక్కు ఉంటుంది. మధ్యేవాద తిరుగుబాటుదార్లుగా పిలుస్తున్న సున్నీ ఇస్లామిక్ గ్రూపులు, ఉగ్రవాదులుగా గుర్తిస్తున్న నస్రా ఫ్రంట్ పనిచేసే ప్రాంతాలు కలగలిసి ఉండటం వల్ల కాల్పుల విరమణ ప్రాంతాలను నిర్వచించడమే కష్టమౌతుంది. అసలు ఎవరు ఉగ్రవాదులనే విషయంలోనే ఏకాభిప్రాయం లేదు. అమెరికా, నాటోలు ‘మధ్యేవాద గ్రూపులు’గా పేర్కొంటున్నవన్నీ నస్రా ఫ్రంట్‌తో సంబంధా లున్నవేనని పాశ్చాత్య మీడియా సైతం పేర్కొంటోంది. ఈ నెల 19 నుంచి అమ ల్లోకి రావాల్సి ఉన్న మ్యూనిచ్ కాల్పుల విరమణ ఒప్పందానికి పురిట్లోనే సంధి కొట్టింది. కాల్పుల విరమణకు ఉన్న వారం గడువులోగా తిరుగుబాటుదార్లపై రష్యా వైమానిక దాడులను ముమ్మరం చేయడంతో అసద్ సేనలు నిర్ణయాత్మక విజయాలను సాధించి, వారిని పూర్తి రక్షణ స్థితిలోకి నెట్టేశాయి. ఆ దాడులలో పౌర నివా సాలు, ఆసుపత్రులపై బాంబులు కురిపించి రష్యా యుద్ధ నేరాలకు పాల్పడిందని ఆరోపణలు కూడా వచ్చాయి. ఇప్పటికే సిరియాలోని ఐఎస్ఐఎస్ ప్రధాన ప్రాబల్య ప్రాంతమైన అలెప్పోను చుట్టుముట్టి పట్టుబిగిస్తున్న అసద్ సేనలు 27 నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చేలోగా అక్కడి ప్రతిఘటనను పూర్తిగా నిర్మూ లించేలా రష్యా వైమానిక దాడులను ఉధృతం చేస్తుందనే వాదన సహేతుకమే. ఆ లక్ష్యం నెరవేరకపోతే ఈ నెల 12న కుదిరిన మ్యూనిచ్ ఒప్పందంలాగే తాజా ఒప్పందాన్ని కూడా అమల్లోకి రానివ్వకపోవచ్చనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఐఎస్ఐఎస్ 2014లో వలే బలీయమైన శక్తిగా లేదు. గత ఏడాది మే నుంచి అది సాధించిన చెప్పుకోదగిన విజయాలు లేవు. ఇటు సిరియా, అటు ఇరాక్లలో అది కుర్దుల చేతుల్లో వరుస ఓటములను చవిచూస్తోంది. ఇరాక్‌లోని మొసుల్, సిరియాలోని ‘రాజధాని’ రఖాలను కూడా అది త్వరలోనే కోల్పోతుందని భావి స్తున్నారు. అందువల్లనే అసద్‌ను గద్దె దించడమా? లేక కొనసాగించనీయడమా? అనేదే ఇప్పుడు కీలకమైనదిగా మారింది. అమెరికా చొరవతో జరుగుతున్న ఈ శాంతి ప్రయత్నాలకు అసద్ ప్రభుత్వమేగాక, రష్యా సైతం సుముఖంగా లేదనే వాదన వినవస్తోంది. రష్యా వైమానిక దాడుల అండతో అసద్ ప్రభుత్వ బలగాలు తిరుగుబాటుదార్లను కొన్ని చిన్న ప్రాంతాలకు పరిమితం చేశాయి. మరికొన్ని వారాల్లోనే తిరుగుబాటుదార్లను తుడిచి పెట్టేసే అవకాశం ఉన్న ఈ దశలో కాల్పుల విరమణ కంటే కాలయాపనే ఉత్తమమని అవి భావిస్తాయనే వాదనను కొటి ్టపారేయలేం. గత ఏడాది సెప్టెంబర్ నుంచి సిరియాలో ఐఎస్ఐఎస్పై వైమానిక దాడులను ప్రారంభించిన రష్యా నవంబర్‌లో చిన్నదే అయినా బలమైన సైనిక బలగాన్ని పంపి టర్కీ సరిహద్దులకు సమీపంలోని సిరియా వైమానిక స్థావరం లతికియాను స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి సిరియా కేంద్రంగా మధ్య ప్రాచ్యంలోని బలాబలాల్లో మార్పు వచ్చింది. రష్యా తన వైమానిక బలగాల్లోని అత్యాధునికమైన ఎస్‌యూ-35 యుద్ధ విమానాలను, ఎస్-400 క్షిపణి వ్యవస్థలను లతికియాలో మోహరించి ఆగ్నేయాసియాలో అమెరికాతోపాటూ మరో ఆధిపత్య శక్తిగా గుర్తింపును పొందాలని తాపత్రయపడుతోంది. ఒక శాంతి ఒప్పందాన్ని కాలరాచిన వెంటనే మరో ఒప్పందం కోసం సిద్ధమైన అమెరికా వైఖరిని బట్టి చూస్తే ‘ఏది ఏమైనా అసద్ గద్దె దిగాల్సిందే’ అనే తన వైఖరి నుంచి దూరంగా జరుగుతోందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అదే నిజమైతే రష్యా, ఇరాన్‌లను విజేతలుగా అంగీకరించి, అది ఇరాక్ తదితర ప్రాంతాల్లోని ఐఎస్ఐఎస్ వ్యతిరేక యుద్ధానికి పరిమితం కావాల్సి ఉంటుంది. అందుకు అది సిద్ధపడు తుందా? లేక కనీసం నూతన అధ్యక్షుని రాకవరకు తాత్కాలిక శాంతితో కాల యాపన చేయాలనుకుంటుందా? అనేది ఇంకా స్పష్టం కాలేదు. ఒక వేళ ఈ తాత్కాలిక శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చినా అసద్‌ను గద్దె దించడం కోసం 2011 నుంచి అమెరికా ప్రోద్బలంతో సాగుతున్న తిరుగుబాటులో కీలక పాత్రధారులుగా ఉన్న సౌదీ అరేబియా, ఖతార్ తదితర జీసీసీ దేశాలు, నాటో దేశమైన టర్కీ ఎలాంటి వైఖరి తీసుకుంటాయనే విషయంలో అనిశ్చితి ఉంది. అసద్ బలగాలు తిరుగుబాటుదార్లపై పూర్తి ఆధిక్యతను ప్రదర్శిస్తున్న ఈ దశలో తాత్కాలిక శాంతి, అసద్ ప్రభుత్వం సంఘటితం కావడానికి తోడ్పడుతుందని అవి ఇప్పటికే అమెరికా శాంతి ప్రయత్నాలపట్ల అసంతృప్తితో ఉన్నాయి. ఈ నెల 15న టర్కీ, సిరియాలోకి సేనలను పంపి భూతల యుద్ధం సాగిస్తామంటూ ఉద్రిక్తతలను తారస్థాయికి చేర్చింది. అప్పటికే సిరియాలో తన అమెరికన్ తయారీ ఎఫ్-15 యుద్ధ విమానాలను మోహరించిన సౌదీ కూడా ఖతార్ తదితర మిత్ర దేశాల సేనలతో సిరియాలో భూతల యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించి ప్రచ్ఛన్న యుద్ధ కాలపు రోజులు పునరావృతమవుతున్నాయనే ఆందోళనను రేకెత్తించింది. అందుకు అమెరికా కనీసం ఇప్పుడు సిద్ధంగా లేదనడానికి దాని శాంతి ప్రయత్నాలే నిదర్శనమని భావించవచ్చనుకోవడం సహేతుకమే. టర్కీ, సౌదీలు ఎలాంటి దుస్సాహసానికి దిగకపోతే, రష్యా ఈ ఒప్పందానికి కట్టుబడితే తాత్కాలికంగానైనా నెలకొనే శాంతి సిరియా ప్రజలకు గొప్ప ఊరట కాగలుగుతుంది. -
ప్రవక్త జీవితం, సందేశం శాంతి
కొత్త కోణం: అరబ్బు ప్రపంచం తీవ్ర సంక్షోభంలో ఉండగా, తెగల మధ్య చెలరేగుతున్న నిరంతర హింసను ఆపడమెలాగని మహమ్మద్ ప్రవక్త యోచించారు. ప్రజలను ఐక్యం చేయాలని పరితపించారు. సమాజాన్ని హింసా ప్రవృత్తి నుంచి విముక్తం చేసి, శాంతియుత సహజీవనానికి అంకురార్పణ చేయడానికి ప్రవక్త చేసిన కృషి విజయవంతమైంది. ప్రజల మధ్య ఐక్యతను సాధించి అరబ్బు ప్రపంచంలో శాంతిని నెలకొల్పిన మహోన్నత వ్యక్తి మహమ్మద్ ప్రవక్త. ఆయన శాంతి, ఐక్యతల సందేశం అందరికీ అనుసరణీయం. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమాజంలోని వివిధ సంఘర్షణల నుంచి అద్భుతాలు ఆవిష్కృతమవుతుంటాయి. కొందరు ఆ సంక్షోభంలో పడికొట్టుకుపోతే, కొందరు ప్రవాహానికి ఎదురీది సమాజానికి నూతనో త్తేజాన్ని అందిస్తారు. సమాజాన్ని కొత్త పుంతలు తొక్కిస్తారు. అలాంటి వారినే ఒకప్పుడు ప్రవక్తలన్నారు. సమాజ అంగీకారాన్ని పొందిన కొందరు ప్రవక్తల ప్రబోధాలే మతాలై ప్రపంచాన్ని నడిపిస్తుంటాయి. ప్రపంచంలో అత్యధిక భాగానికి వ్యాపించిన బౌద్ధం, క్రైస్తవం, ఇస్లాం మతాలు అవి ఆవిర్భవించిన కాలాల్లో సామాజిక విప్లవాలుగా నిలిచాయి. సమాజ పురోగమనానికి, అభివృద్ధికి దోహదం చేశాయి. కాలంచెల్లిన బానిస సమాజపు పోకడలను కాలదన్ని వినూత్న ఆలోచనలకు అంకురార్పణ చేసిన ఇస్లాం మత ప్రవక్త మహమ్మద్ పుట్టిన రోజు నేడు. ప్రవక్త జన్మది నాన్నే మిలాద్-ఉన్-నబీగా జరుపుకుంటున్నాం. ఆయన జన్మించేనాటికి అరబ్బు ప్రపంచంలో ఉన్న పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆయన బోధనలు ఆనాటి సామాజాన్ని మౌఢ్యం సుడిగుండం నుంచి గట్టెక్కించి, సామాజిక సంక్షోభాన్ని పరిష్కరించాయని విశదమవుతుంది. అంధకారంలో మెరిసిన కాంతి రేఖ మూడు వైపులా సముద్రం చుట్టివున్న ద్వీపకల్పం లాంటి అరబ్బు ప్రాంతం ఆనాడు చాలా తెగలకు ఆవాసంగా ఉండేది. మూడు ముఖ్య తెగలు కీలకమై నవిగా ఉండేవి. మొదటి ప్రవక్తగా భావించే ఇబ్రహీం బోధనలను కాదని, వారు వివిధ రకాల విగ్రహాలకు పూజలు చేసేవాళ్ళు. ఇస్లాం సందేశానికి మూలమైన ‘‘తౌహీద్’’ ఏకేశ్వరోపాసన, దేవుని ఏకత్వ భావనకు వారి మత విశ్వాసాలు విరుద్ధమైనవి. సూర్యచంద్రులను, నక్షత్రాలను, గ్రహాలను, సన్యాసులను, నదులను, పర్వతాలను, మనుషుల్ని, చివరకు జంతువులను, రాళ్ళను, కొండలను, గుట్టలను వారు పూజించేవారు. ఈ బహు దైవారాధన తెగల మధ్య క్రమంగా నిరంతర సంఘర్షణలకు కారణమైంది. అంతర్గత యుద్ధాలతో అరబ్బు నేలపై రక్తం ఏరులై పారేది. ఫలితంగా రాజకీయ అస్థిరత నెలకొనడమే గాక, సామాజిక, ఆర్థిక జీవితం ఛిన్నాభిన్నమైంది. అనైక్యతతో, మౌఢ్యంతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ అరబ్బులు ఎవరికీ లొంగని స్వతంత్ర స్వభావులు. కఠోరమైన ఎడారి జీవితానికి తోడు, కర్తవ్య నిర్వహణ కోసం జీవితాన్ని ధారపోసే విశిష్ట స్వభావం వారిది. అరబ్బు ప్రపంచం తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆ సమయంలోనే మక్కాలో క్రీ.శ. 571 ఏప్రిల్ 22న ప్రవక్త మహమ్మద్ జన్మించారు. సామాజికంగా ఉన్నత స్థానంలో ఉన్న ఖురైష్ తెగకు చెందిన మహమ్మద్ ప్రవక్త చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి, తాత ఒడిలో పెరిగారు. అరబ్బు సంప్రదాయాల ప్రకారం పట్టణాలలో పుట్టిన పిల్లలు కూడా బాల్యాన్ని పల్లెల్లో గడిపేవారు. మహమ్మద్ ప్రవక్త కూడా అలా పల్లెలో గొర్రెల కాపరిగా ఎదిగారు. ఆ తెగ నాయకత్వ స్థానానికి రావడానికి కష్టభరితమైన ఆ జీవితం ఆయనకు ఎంతో ఉపకరించింది. తాత మరణం తర్వాత, ఆయన పినతండ్రి దగ్గరికి చేరాడు. ప్రవక్త శాంతి ప్రస్థానానికి నాంది అరబ్బులలోని మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాలు, అనైక్యత ఆయనను చిన్నతనం నుంచే కలవరపరిచాయి. ఖురైష్ తెగ సంప్రదాయాలను ఆయన ఆనాటి నుంచే వ్యతిరేకించారు. విగ్రహారాధనకు దూరంగా ఉన్నారు. ఖురైష్, కైస్ తెగల మధ్య జరిగిన ఫిజార్ యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త కూడా పాల్గొన్నారు. ఆ యుద్ధం ఆయనలో పెద్ద మార్పుని తీసుకొచ్చింది. యుద్ధం తదుపరి ఆయన పినతండ్రి జుబైర్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ చొరవతో ఖురెష్ ప్రముఖులు ఐదు అంశాల తీర్మానాన్ని ఆమోదించారు. 1. ఈ భూభాగం నుంచి అశాంతిని పారద్రోలి శాంతిని నెలకొల్పుతాము, 2. బాటసారుల కోసం రక్షణ సదుపాయాలు కలుగజేస్తాం, 3. నిరుపేదల అవసరాలను తీర్చడానికి సహాయం చేస్తాం, 4. దుర్మార్గుల దౌర్జన్యానికి గురయ్యేవారికి రక్షణ కల్పిస్తాం, 5. దౌర్జన్యపరులకు మక్కాలో స్థానం లేకుండా చేస్తాం. ఈ తీర్మానాన్ని రూపొందించడంలో మహమ్మద్ ప్రవక్తకు కూడా భాగం ఉంది. ఆయన తమ తెగ ఆచారం ప్రకారం వర్తకాన్ని వృత్తిగా స్వీకరించారు. అందులో ఆయన కనబరిచిన నిజాయితీ, సచ్ఛీలత ఎందరినో ఆకర్షించాయి. ప్రజలు ఆయనను సాదిక్ (సత్యసంధుడు), అమీన్ (విశ్వసనీయుడు) అని పిలిచేవారు. వ్యాపారంలో భాగంగా ఆయన సిరియా, బస్రా, యెమెన్ దేశాల్లో చాలా సార్లు పర్యటించారు. ఆ సమయంలోనే శ్రీమంతురాలు, వ్యాపారవేత్తయిన హజ్రత్ ఖదీజా, మహమ్మద్ ప్రవక్త దీక్షాదక్షతలను తెలుసుకొని, తన వ్యాపార బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఆయన నిజాయితీని మెచ్చిన ఆమె, ఆయనకు భార్య కావడానికి సుముఖత వ్యక్తం చేశారు. అలా వారిరువురు జీవిత భాగస్వాములయ్యారు. సఫా పర్వతంపై నుంచి తొలి సందేశం అయితే మహమ్మద్ ప్రవక్త రోజురోజుకూ సత్యాన్వేషణపై దృష్టిని కేంద్రీకరించారు. అరబ్బు ప్రపంచంలో చెలరేగుతున్న నిరంతర హింసను ఆపడమెలాగని యోచించారు. ఒంటరిగా నిత్యం తనలో తాను సంఘర్షించేవారు. బహు దేవతల ఆరాధనతో అనైక్యంగా ఉన్న ప్రజలందరినీ ఎలాగైనా ఐక్యం చేయాలని పరితపించేవారు. సంఘర్షణలు, యుద్ధాలు మాన్పించి, సమాజాన్ని శాంతి వైపు నడిపించాలని కలలుగనేవారు. ప్రజలనందరినీ ఏదైనా సందేశం వినిపించడానికో, హెచ్చరించడానికో చెట్టుమీదకు లేదా గుట్టమీదకు ఎక్కి అరవడం ఆ రోజుల్లో అలవాటుగా ఉండేది. ఒకరోజున మహమ్మద్ ప్రవక్త కూడా సఫా పర్వతంపై నుంచి అందర్నీ పిలిచి ‘‘కొండకు ఆవల ఒక పెద్ద సైన్యం నిలిచి ఉందని, అది మీపైకి దండెత్తడానికి సిద్ధంగా ఉందని నేనంటే నా మాటను నమ్ముతారా?’’ అని గట్టిగా అడిగారు. ‘‘నిస్సంకోచంగా నమ్ముతాం. మిమ్మల్ని సత్యసంధులుగా, విశ్వసనీయులుగానే చూశాం’’ అని ప్రజలు జవాబిచ్చారు. అప్పుడు మళ్ళీ మహమ్మద్ ప్రవక్త ‘‘జనులారా! నేను మిమ్మల్ని విగ్రహారాధన చేయరాదని కోరుతున్నాను. ఒకే ఒక్క దేవుణ్ణి ఆరాధించాలని అడుగుతున్నాను. మీరు ఇది కాదన్నారంటే భయంకరమైన శిక్షకు గురవుతారు’’ అని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. మహమ్మద్ ప్రవక్త తొలి సందేశం ఇదే. అయితే అది విన్న ఖురైష్ ప్రజల కోపం కట్టలు తెంచుకున్నది, కల్లోలం రేగింది. మహమ్మద్ ప్రవక్తపైకి కత్తులతో దూసుకువచ్చారు. హజ్రత్ అనే వ్యక్తి ప్రవక్తకు రక్షణగా నిలిచి ఆయన కోసం ప్రాణత్యాగం చేశారు. ఇస్లాం మార్గంలో మొట్ట మొదటి షహదత్ ఆయనే. ఆ దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డ ప్రవక్త, ఆ తర్వాతా భౌతిక దాడులకు గురయ్యారు. అడుగడుగునా ఛీత్కారాలను, అవమానాలను ఎదుర్కొన్నారు. అయినా క్రమంగా మహమ్మద్ ప్రవక్తను అనుసరించే ఇస్లామీయుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మొట్టమొదట ఇస్లాంను స్వీకరించిన వ్యక్తి మహమ్మద్ ప్రవక్త జీవిత భాగస్వామి ఖదీజానే కావడం విశేషం. ఇస్లాం చరిత్ర గతిని మార్చిన మదీనా రాజ్యాంగం కానీ ప్రవక్తపై ఖురైష్ తెగ దాడులు తీవ్రమయ్యాయి. ఆయన అనుయాయులపైనా హింసాకాండ పెచ్చరిల్లింది. దీంతో మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి తన కార్యస్థలాన్ని మార్చాలని భావిస్తుండగా... మదీనా నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. మహమ్మద్ ప్రవక్తకు అండదండలందిస్తానని మదీనా నుంచి సమాచారం అందింది. ప్రవక్త తన మొదటి సందేశం వినిపించిన తర్వాత 11 ఏళ్లకు ఆరుగురు ప్రతినిధుల బృందం మక్కా వచ్చి ఆయనతో విస్తృతంగా చర్చలు జరిపింది. మరుసటి ఏడాది వచ్చిన 12 మంది ప్రతినిధులు ప్రవక్తతో జరిపిన చర్చలు, చేసిన ప్రతిజ్ఞ ‘అకాబా ప్రతిజ్ఞ’గా పేరు మోశాయి. ఆ తరువాత ప్రవక్త మదీనా పట్టణానికి చేరారు. మక్కాలోని ముస్లింలంతా ఆయనను అనుసరించి మదీనాకు వెళ్లారు. మదీనాలోని ఒకటి, రెండు మినహా అన్ని తెగలూ ప్రతి కుటుంబం నుంచి ఒక యువకుడిని ఇస్లాం సేవకు పంపాయి. దీంతో ఇస్లామియా ఉద్యమం కొత్త ఊపుతో ముందుకు సాగింది. మదీనాలో మహమ్మద్ ప్రవక్త తీసుకున్న రాజకీయ నిర్ణయం ఇస్లాం చరిత్ర గతినే మార్చివేసింది. మదీనాలోని యూదులకు, ముస్లింలకు మధ్య ఒక సామాజిక ఒప్పందాన్ని ఖరారు చేయడం వల్ల ఇస్లాం ఒక ప్రత్యేక దశలోకి అడుగుపెట్టింది. దీనినే ‘మదీనా కాన్స్టిట్యూషన్’ అంటారు. ప్రపంచంలోని తొలి లిఖిత పూర్వక రాజ్యాంగంగా కూడా పిలుస్తారు. ఈ ఒప్పందం ఇస్లాం రాజ్యానికి పునాదులు వేసింది. వ్యవస్థీకృత సమాజంలో దేవునికే సర్వసత్తాక అధికారం ఉంటుందని, దైవిక చట్టాలకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తారని ఈ రాజ్యాంగం వ్యాఖ్యానించింది. మదీనాలోని స్థానిక అన్సార్లకు, మక్కా నుంచి వచ్చిన ముహజిర్లకు మధ్య సోదర సంబంధాలను నెలకొల్పడం ద్వారా ప్రవక్త నూతన సహోదర మానవ సంబంధాలకు పునాదిని వేశారు. సమాజాన్ని హింసా ప్రవృత్తి నుంచి విముక్తం చేయడానికి, శాంతియుత సహజీవనానికి అంకురార్పణ చేయడానికి మహమ్మద్ ప్రవక్త చేసిన ప్రయత్నం విజయవంతమైంది. ప్రపంచంలో చాలా దేశాల్లో ఇస్లాం మతం విస్తరించింది. ప్రజల మధ్య ఐక్యతను సాధించి అరబ్బు భూభాగాన్ని నవ నాగరికతలోకి నడిపిన మహోన్నత వ్యక్తి మహమ్మద్ ప్రవక్త. అందుకే ఆయన చూపిన శాంతి, ఐక్యత నుంచి స్ఫూర్తినొందడం అందరికీ అనుసరణీయమే. నేడు మిలాద్-ఉన్-నబీ సందర్భంగా... వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, మల్లెపల్లి లక్ష్మయ్య( మొబైల్: 97055 66213) -
మహిళలు దేశాధిపతులైతే..శాంతియుత ప్రపంచం!
చెన్నై: అసమ్మతి గళాలను కూడా గౌరవించాల్సిన అవసరముందని బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా పేర్కొన్నారు. అన్నిమత విశ్వాసాలనే కాదు.. ఏ మతవిశ్వాసం లేనివారిని కూడా గౌరవించడమే లౌకికవాదమని ఆయన అన్నారు. దేశంలో పరమత అసహనం పెరిగిపోయిందంటూ ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. 'మీతో ఏకీభవించనివారిని నిర్మూలించాలనుకోవడం సరికాదు' అని చెప్పారు. 'ప్రపంచ శాంతికి మానవ దృక్కోణం' అనే అంశంపై మద్రాస్ ఐఐటీలో దలైలామా మంగళవారం ఉపన్యసించారు. గడిచిన శతాబ్దమంతా హింసతో నిండిపోయిందని, ప్రస్తుతం కూడా అది కొనసాగడం మూర్ఖత్వమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 'ప్రపంచంలోని ఏడు వందల కోట్ల జనాభాలో వందకోట్లమంది వరకు మత అవిశ్వాసులు ఉన్నారు. వారిని కూడా గౌరవించాల్సిన అవసరముంది. ఎందుకంటే మత విశ్వాసం అనేది ఒకరి వ్యక్తిగత విషయం' అని చెప్పారు. మతసామరస్యంలో యావత్ ప్రపంచానికి భారత్ ఆదర్శప్రాయమని కొనియాడారు. తదుపరి దలైలామ మహిళ అయ్యే అవకాశముందా? అన్న ప్రశ్నకు తప్పకుండా అవ్వొచ్చు అని బదులిచ్చారు. 'నేను గతంలో చాలాసార్లు చెప్పాను. ఆమె అందంగా ఉండాలి. ఎందుకంటే ముఖం కూడా కొంత మార్పును తీసుకురాగలదు! కాదంటారా?' అని నవ్వుతూ చెప్పారు. మహిళలు దేశాధిపతులైతే ప్రపంచం మరింత శాంతియుతంగా ఉంటుందని దలైలామా అభిప్రాయపడ్డారు.