India has chosen side of peace: ఉక్రెయిన్ పై రష్యా ప్రస్తుతం భయంకరంగా విరుచుకుపడటమే కాకుండా యుద్ధ నేరాలకు పాల్పడుతోంది. అంతేకాకుండా బుచా నగరాన్ని శ్మశానంగా మార్చేసింది. ఈ నేపథ్యంతో భారత్ కూడా త్రీవ స్థాయిలో స్పందించింది. ఈ మేరకు బుధవారం లోక్‌సభలో ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చ సందర్భంగా ఉక్రెయిన్‌లోని బుచా నగరంలో జరిగిన హత్యలను భారత్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. దీనిపై స్వతంత్ర దర్యాప్తు కోసం మద్దతు ఇస్తున్నాం అని చెప్పారు. ఉక్రెయిన్, రష్యా మధ్య చర్చలను భారత్ ప్రోత్సహిస్తుందని, శత్రుత్వాలను తక్షణమే నిలిపివేయాలని ఉద్ఘాటించారు.
ఇది ఒక రకంగా రష్యా విదేశాంగ మంత్రి లావ్‌రోవ్‌కి ఇచ్చిన సందేశం. అంతేకాదు సాధారణ పౌరులు ఎలాంటి సమస్యలకు గురికాకుండా చూడటానికి భారత్ ప్రాధాన్యతనిస్తుందని భారత విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. అనేక దేశాలు భారత్‌తో నిమగ్నమై ఉన్నాయని, ఒకే అభిప్రాయాన్ని పంచుకున్నమని అన్నారు. ఈ విధంగా కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని జై శంకర్ పేర్కొన్నారు.
అంతేగాదు యూఎన్‌భద్రతా మండలి సమావేశంలో కూడా ఈ విషయమై భారత్ ఖండించడమే కాకుండా స్వతంత్ర దర్యాప్తు కోసం పిలుపునిచ్చింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితిలో భారత్ శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి మాట్లాడుతూ... “యుద్ధంలో భద్రతా పరిస్థితి క్షీణించింది, అలాగే మానవతా విలువలు కూడా క్షీణించాయి. ఇటీవల బుచాలో పౌర హత్యలకు సంబంధించిన నివేదికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మేము ఈ హత్యలను నిస్సందేహంగా ఖండిస్తున్నాము. స్వతంత్ర దర్యాప్తు పిలుపుకు మద్దతు ఇస్తున్నాము. అని అన్నారు.
( చదవండి: రష్యా ‘బుచా’ నరమేధం!.. భారత్ స్పందన ఇది)
Comments
Please login to add a commentAdd a comment