
మాస్కో: ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడికి దిగిన కొన్ని గంటల వ్యవధిలోనే దానికి ఉక్రెయిన్ ప్రతీకారం తీర్చుకుంది. రష్యాపై అతిపెద్ద డ్రోన్ దాడి చేసింది. ఉక్రెయిన్. 337 డ్రోన్లతో ఉక్రెయిన్ మెరుపు దాడులకు దిగింది. ఈ ఘటనలో రష్యాకు చెందిన ముగ్గురు మృతిచెందగా 18 మంది తీవ్రంగా గాయపడినట్లు రష్యా వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్ దాడితో రష్యా అప్రమత్తమైంది. 337 డ్రోన్లలో 91 డ్రోన్లను కూల్చేసింది.
ఒకవైపు శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామంటూనే రష్యా, ఉక్రెయిన్ దేశాలు పరస్పరం మెరుపు దాడులు చేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ శాంతి చర్చలు జరిపారు. ఆ చర్చలు విఫలం కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లయ్యింది.
రష్యా సైన్యం భీకర దాడులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. రాజధాని కీవ్ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో పై వైమానిక దాడులకు తెగ బడింది. అయితే.. ఆ దాడుల్ని తమ దేశ వైమానిక దళం సమర్థవంతంగా అడ్డుకుంటోందని కీవ్ మేయర్ విటాలి కీచ్‌కోస్ తెలిపారు.
తమకు పేలుడు శబ్దాలు ఎక్కువగా వినిపిస్తున్నాయని కీవ్(Kyiv)లోని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియరావాల్సి ఉంది. మరోవైపు.. సౌదీ అరేబియాలో ఉక్రెయిన్, అమెరికా అధికారులుశాంతి చర్చలు(జరపనున్నారు. ఈ నేపథ్యాన్ని పట్టించుకోకుండా రష్యా దాడుల ఉధృతిని పెంచింది.
రెండు రోజుల కిందట ఖర్‌కీవ్ రీజియన్‌లోని డోబ్రోపిలియా నగంపై రష్యా జరిపిన క్షిపణుల దాడిలో విధ్వంసం చోటు చేసుకుంది. దాడుల్లో 14 మంది మరణించగా.. 37 మంది గాయపడ్డారు. ఈ దాడులతో రష్యా ఉద్దేశాల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ.. తమ పౌరుల ప్రాణాలను రక్షించుకునేందుకు ఎంతకైనా తెగిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment