probe order
-
కేరళలో మండి బిర్యానీ తిని యువతి మృతి.. వారంలో రెండో ఘటన
కేరళలోని కొట్టాయంలో ఇటీవల(డిసెంబర్ 29) ఓ ఈవెంట్లో ఆహారం తిని నర్సు అస్వస్థతకు గురై చనిపోయిన విషయం తెలిసిందే. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఆమె మరణించినట్లు వార్తలు వినిపించాయి. ఈ ఘటన జరిగిన వారం రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో మరో విషాదం చోటుచేసుకుంది. మండి బిర్యానీ తిని 20 ఏళ్ల యువతి మృతిచెందింది. ఈ ఘటన కూడా ఫుడ్ పాయిజనింగ్‌కు సంబంధించి అనుమానాస్పద కేసుగా అనుమానిస్తున్నారు. వివరాలు.. కాసర్గోడ్ సమీపంలోని పెరుంబళకు ఎందిన అంజు శ్రీ పార్వతి డెసెంబర్ 31న రొమేనియా అనే రెస్టారెంట్ల నుంచి మండి బిర్యానీ (కుజిమంతి/కుళిమంతి) ఆర్డర్ చేసుకుంది. బిర్యానీ తిన్న తర్వాత అనారోగ్యానికి గురికావడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మంగళూరులోని మరో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించింది. బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలంతో బాలిక తీసుకున్న ఆహారం, ఆమెకు అందించిన చికిత్సపై అధికారులు ఆరాతీస్తున్నారు. ఫుడ్ పాయిజనింగ్‌కు గురైన హోటళ్ల లైసెన్స్‌ను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ (ఎఫ్ఎస్ఎస్ఏ) కింద రద్దు చేస్తామని తెలిపారు. చదవండి: Video: బాప్రే..! డ్రెస్ బటన్లలో కొకైన్.. రూ. 47 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ -
బుచా ఘటనపై స్పందించిన భారత్... స్వతంత్ర దర్యాప్తుకు మద్దతు
India has chosen side of peace: ఉక్రెయిన్ పై రష్యా ప్రస్తుతం భయంకరంగా విరుచుకుపడటమే కాకుండా యుద్ధ నేరాలకు పాల్పడుతోంది. అంతేకాకుండా బుచా నగరాన్ని శ్మశానంగా మార్చేసింది. ఈ నేపథ్యంతో భారత్ కూడా త్రీవ స్థాయిలో స్పందించింది. ఈ మేరకు బుధవారం లోక్‌సభలో ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చ సందర్భంగా ఉక్రెయిన్‌లోని బుచా నగరంలో జరిగిన హత్యలను భారత్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. దీనిపై స్వతంత్ర దర్యాప్తు కోసం మద్దతు ఇస్తున్నాం అని చెప్పారు. ఉక్రెయిన్, రష్యా మధ్య చర్చలను భారత్ ప్రోత్సహిస్తుందని, శత్రుత్వాలను తక్షణమే నిలిపివేయాలని ఉద్ఘాటించారు. ఇది ఒక రకంగా రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్కి ఇచ్చిన సందేశం. అంతేకాదు సాధారణ పౌరులు ఎలాంటి సమస్యలకు గురికాకుండా చూడటానికి భారత్ ప్రాధాన్యతనిస్తుందని భారత విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. అనేక దేశాలు భారత్‌తో నిమగ్నమై ఉన్నాయని, ఒకే అభిప్రాయాన్ని పంచుకున్నమని అన్నారు. ఈ విధంగా కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని జై శంకర్ పేర్కొన్నారు. అంతేగాదు యూఎన్భద్రతా మండలి సమావేశంలో కూడా ఈ విషయమై భారత్ ఖండించడమే కాకుండా స్వతంత్ర దర్యాప్తు కోసం పిలుపునిచ్చింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితిలో భారత్ శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి మాట్లాడుతూ... “యుద్ధంలో భద్రతా పరిస్థితి క్షీణించింది, అలాగే మానవతా విలువలు కూడా క్షీణించాయి. ఇటీవల బుచాలో పౌర హత్యలకు సంబంధించిన నివేదికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మేము ఈ హత్యలను నిస్సందేహంగా ఖండిస్తున్నాము. స్వతంత్ర దర్యాప్తు పిలుపుకు మద్దతు ఇస్తున్నాము. అని అన్నారు. ( చదవండి: రష్యా ‘బుచా’ నరమేధం!.. భారత్ స్పందన ఇది) -
బస్సులోనే మద్యం సేవించిన స్కూల్ విద్యార్థులు… వీడియో వైరల్
కదులుతున్న బస్‌లో పాఠశాల విద్యార్థులు మద్యం సేవిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో జరిగినట్లు గుర్తించారు. వీడియోలో ఓ పాఠశాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు యూనిఫామ్ ధరించి బస్‌లో ప్రయాణిస్తున్నారు. వీరిలో కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి బీర్ బాటిల్‌ను ఓపెన్ చేసి తాగుతూ కనిపించారు. ఈ తంతంగాన్నంతా తోటి విద్యార్థులు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో కాస్తా నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో బస్‌లోని విద్యార్థులంతా చెంగల్పట్టులోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన వారుగా తెలిసింది. తిరుకజుకుండ్రం నుంచి తాచూర్‌కు వెళుతున్నారు. అయితే ముందుగా ఈ వీడియో పాతది అనుకున్నారు. కానీ మంగళవారం జరిగిన ఘటనగా పోలీసులు గుర్తించారు. ఇలా విద్యార్థులు బస్‌లో మద్యం సేవిస్తున్న విషయం చివరికి అధికారులు దృష్టికి వెళ్లడంతో.. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. విచారణ పూర్తయ్యాక తగిన చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: ‘కశ్మీర్ ఫైల్స్’ మూవీ ఎఫెక్ట్.. ఢిల్లీలో కశ్మీర్ వ్యక్తికి చేదు అనుభవం.. -
రాజు ఆత్మహత్యపై విచారణ: 4 వారాలు గడువిచ్చిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: సైదాబాద్ ఘటన నిందితుడు రాజు మృతిపై తెలంగాణ హైకోర్టు జ్యుడీషియల్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. విచారణ జరిపి నాలుగు వారాల్లో సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించాలని తెలిపింది. ఈ మేరకు వరంగల్ మూడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌కు న్యాయస్థానం ఆదేశించింది. రాజు మృతిపై పౌర హక్కుల సంఘం నేత పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాజును పోలీసులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పిటిషనర్ వాదనలు వినిపించారు. చదవండి: విద్యార్థినికి ఘోర అవమానం.. పొట్టి దుస్తులు వేసుకోవడం నేరమా? అయితే ఆ వాదనలకు అడ్వకేట్ జనరల్ ప్రసాద్ ప్రతివాదనలు చేశారు. రాజు ఆత్మహత్య చేసుకున్నాడని స్పష్టం చేసింది. రాజు ఆత్మహత్యపై ఏడుగురి సాక్ష్యాల నమోదు ప్రక్రియ, పోస్టుమార్టం వీడియో చిత్రీకరణ చేసినట్లు ఏజీ నివేదిక ఇచ్చారు. ఆ వీడియోలను రేపు రాత్రి 8 గంటల్లోగా వరంగల్ జిల్లా జడ్జికి అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్టేషన్ ఘన్పూర్ సమీపంలో రైల్వే పట్టాలపై గురువారం ఉదయం రాజు మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే పోలీస్ వర్గాలు మాత్రం రాజుది ఆత్మహత్య అని స్పష్టంగా చెబుతున్నారు. కానీ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పౌర హక్కుల నాయకుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. చదవండి: నిర్మల్ సభలో ‘ఈటల’ స్పెషల్ అట్రాక్షన్: చప్పట్లు మోగించిన అమిత్ షా -
మహిళా ఐపీఎస్‌ను చిక్కులో పడేసిన ‘ఫ్రీ బిర్యానీ ఆర్డర్’
అధికారం చేతిలో ఉందని ఓ మహిళా పోలీస్ అధికారిణి చేసిన పని చివరికి ఆమెకు తలనొప్పిని తెచ్చిపెట్టింది. మహిళా ఐపీఎస్ అధికారిణి ఉచితంగా బిర్యానీ ఆర్డర్ చేయడం, ఈ విషయం ప్రభుత్వం వరకు చేరడంతో పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ విషయం ఆ రాష్ట్ర హోంమంత్రి వరకు వెళ్లింది. వెంటనే ఈ ఘటనపై విచారించాలని పోలీసులను ఆదేశించారు. మహారాష్ట్రలో డిప్యూటీ కమిషనర్ ర్యాంకులో మహిళా ఐపీఎస్ అధికారిణి తన సబార్డినేట్‌తో విశ్రాంబాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏ రెస్టారెంట్లో మంచి బిర్యానీ దొరుకుతుందని అడిగి తెలుసుకున్నారు. దీనికి అతను దేశీ ఘీ రెస్టారెంట్ అక్కడ ఫేమస్ అని చెప్పడంతో మటన్ బిర్యానీ తెప్పించాలని కోరింది. రెస్టారెంట్ వాళ్లు డబ్బులు అడిగితే స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్తో మాట్లాడించమని చెప్పింది. ఎందుకంటే తమ పరిధిలో డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉందా అని మహిళా అధికారిణి అడిగింది. దీనికి సబార్డినేట్ ‘మేము ఎప్పుడు బయట నుంచి ఆహారం ఆర్డర్ చేసినా డబ్బులు చెల్లించేవాళ్లం’ అని చెప్పాడు. దీనిపై స్పందించిన మహిళా ఐపీఎస్ ‘ఇప్పుడు సమస్య ఏంటి మా పరిధిలో ఉన్న రెస్టారెంట్‌కు కూడా డబ్బులు చెల్లించాలా, అక్కడి ఇన్స్పెక్టర్ చూసుకుంటాడని తెలిపింది. అయితే దీనికి సంబంధించిన ఈ ఆడియో క్లిప్ నెట్టింట వైరల్‌గా మారడంతో ఈ విషయంపై ఐపీఎస్ అధికారిణి స్పందించింది. తన ఆడియో క్లిప్‌ను మార్ఫింగ్ చేశారని ఆరోపించింది. ఇదంతా సీనియర్ పోలీసు అధికారులను బదిలీ చేసే ప్రక్రియ జరుగుతున్నప్పుడు బయటపడిందన్నారు. ‘ఇది నాపై వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర. నేను చేస్తున్న జోన్లో కొన్నేళ్లుగా కొంతమంది ఇక్కడే పనిచేస్తున్నారు. వారి ఆర్థిక ప్రయోజనాలు ఇక్కడే ఉన్నాయి. ఈ కుట్రలో కొందరు సీనియర్ అధికారులు కూడా ఉన్నారు. నేను ఇక్కడ బాధ్యతలు స్వీకరించిన తరువాత వారి కార్యకలాపాలు ఆగిపోయాయి. అందుకే నన్ను తొలగించాలనే అక్కసుతో ఇదంతా చేశారు’ అని తెలిపారు. దీనిపై సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించబోతున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ తతాంగమంతా ఆ రాష్ట్ర హోం మంత్రికి చేరింది. ఈ విషయంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పూణే పోలీస్ కమిషనర్ని కోరారు. దీనిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. -
Vaccine Corruption Scandal: బొల్సొనారోకు భారీ షాక్
కొవాగ్జిన్ వ్యాక్సిన్ డోసుల కోసం భారత్ బయోటెక్‌తో బ్రెజిల్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం.. ఆపై ముడుపుల విమర్శలతో రద్దు చేసుకున్న పంచాయితీ బ్రెజిల్ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. రాజకీయ ఒత్తిళ్లు, ప్రజా నిరసనల మధ్య బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారోకు భారీ షాకిచ్చింది అక్కడి అత్యున్నత న్యాయస్థానం. ఈ భారీ కుంభకోణంలో బొల్సొనారోతో సహా కీలక పదవుల్లో ఉన్నవాళ్లను సైతం విచారించాలని దర్యాప్తు బృందాలను ఆదేశించింది బ్రెజిల్ సుప్రీం కోర్టు. సావ్ పాలో: కొవాగ్జిన్ డీల్‌కు సంబంధించి ముడుపుల ఆరోపణలపై, ముఖ్యంగా ఆ ఆరోపణల్లో అధ్యక్షుడు జైర్ బొల్సొనారో కార్యాలయం పాత్రపై ప్రత్యేక దృష్టి పెట్టి దర్యాప్తు చేయాలని బ్రెజిల్ సుప్రీం కోర్టు, బ్రెజిల్ అత్యున్నత విచారణ&దర్యాప్తు బృందాలను ఆదేశించింది. శుక్రవారం రాత్రి హడావిడిగా ఆదేశాలను జారీ చేసిన జస్టిస్ రోసా వెబర్.. 90 రోజుల్లోగా పూర్తి నివేదికను సమర్పించాలని గడువు విధించారు. మరోవైపు బ్రెజిల్ కాగ్(సీజీయూ)ను ప్రత్యేకంగా ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని కోరింది న్యాయస్థానం. తగ్గని ఆగ్రహజ్వాలలు కరోనాను కట్టడి చేయడంలో ఘోరంగా విఫలమయ్యాడంటూ అధ్యక్షుడికి వ్యతిరేకంగా వేల మంది యాంటీ-బొల్సొనారో ఉద్యమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కరోనాతో ఐదు లక్షల మంది ప్రాణాలు పోయేందుకు కారణమయ్యాడంటూ బొల్సొనారోపై హత్యాయత్నం కేసులు సైతం నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో కొవాగ్జిన్ ముడుపుల ఆరోపణలు రావడంతో వాళ్లలో మరింత ఆగ్రహం పెల్లుబిక్కింది. దీంతో మూడురోజులుగా రోడెక్కి నిరసనలతో హోరెత్తిస్తున్నారు. శనివారం సైతం పార్లమెంట్ ఆవరణలో వీళ్లు నిరసనలు చేపట్టారు. ఇక బొల్సొనారోను గద్దె దించేందుకు ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. పాత-కొత్త ఆరోపణలు(కొవాగ్జిన్ డీల్ అంశం సహా), వివాదాలను ప్రస్తావిస్తూ ఈ వారంలోనే పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు పావులు కదుపుతున్నాయి. చదవండి: బొల్సొనారో రక్తపిశాచి.. జనాగ్రహంతో పెరిగిన కరోనా! అఘమేఘాల మీద రద్దు కాగా, ఈ ఫిబ్రవరిలో కొవాగ్జిన్ డోసుల కోసం బ్రెజిల్ ప్రభుత్వం భారత్ బయోటెక్‌తో ఒప్పందం చేసుకుంది. ఒక్కో డోస్‌కు 15 డాలర్ల చొప్పున.. సుమారు 2 కోట్ల డోసుల సరఫరాకు ఆ ఒప్పందం జరిగింది. ఈ డీల్ విలువ వేల కోట్లు కాగా, దాదాపు రూ.734 కోట్ల మేర ముడుపులు మధ్యవర్తి కంపెనీ ప్రిసిసా మెడికంతోస్తో పాటు.. బొల్సొనారోకు సైతం ముట్టినట్టు ప్రతిపక్ష సెనేటర్లు ఆరోపించారు. అయితే ఈ డీల్‌లో ఆరోపణలతో తమకు సంబంధం లేదని భారత్ బయోటెక్ ఒక ప్రకటన విడుదల చేసింది. తమకు ముందస్తు చెల్లింపులు తమకు జరగలేదని, ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని.. అయితే అత్యవసర అనుమతులు మాత్రం ఈమధ్యే జరిగాయని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. ఈలోపే బ్రెజిల్ ప్రభుత్వం ఒప్పందం రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం విశేషం. చదవండి: వ్యాక్సిన్‌తో మొసళ్లుగా మారుతున్న మనుషులా? -
సీజేఐపై ఆరోపణలు : విచారణకు సుప్రీం కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల వెనుక భారీ కుట్ర దాగి ఉందన్న న్యాయవాది దాఖలు చేసిన అఫిడవిట్‌పై లోతైన విచారణకు సుప్రీం కోర్టు మొగ్గుచూపింది. సీజేఐపై ఆరోపణల వ్యవహారంపై విచారణకు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలో సర్వోన్నత న్యాయస్ధానం గురువారం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్‌కు వ్యతిరేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి,ఆయన ప్రతిష్టను మసకబార్చేందుకు సహకరించాలని తనకు రూ 1.5 కోట్లు ఆఫర్ చేశారని న్యాయవాది ఉత్సవ్ బైన్స్ తన అఫిడవిట్లో కోర్టుకు నివేదించారు. పేరుప్రతిష్టలు, డబ్బు, హోదా కలిగిన వ్యక్తులు వ్యవస్ధను నడిపించాలని ప్రయత్నిస్తున్నారని, వీరి ఆటలు సాగవని మనం చాటిచెప్పాల్సిన అవసరం నెలకొందని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన సుప్రీం బెంచ్ సీజేఐ రంజన్ గగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై స్వతంత్ర కమిటీని నియమిస్తూ స్పష్టం చేసింది. కాగా, ఈ విచారణ ప్రధాన న్యాయమూర్తిపై వచ్చిన ఆరోపణలపై చేపట్టిన అంతర్గత విచారణపై ప్రభావం చూపబోదని కోర్టు పేర్కొంది. -
మహిళా సైనికుల నగ్న ఫొటోల కలకలం
న్యూయార్క్: అమెరికాలో మహిళా సైనికులకు అవమానం జరిగింది. నేవీలో పనిచేస్తున్న మహిళా సైనికుల నగ్న ఫొటోలను సోషల్ మీడియాకు, ఆయా వెబ్సైట్లకు ఎవరో లీక్ చేశారు. ఈ విషయం తెలిసి ప్రస్తుతం ఆ విభాగానికి చెందిన ఉన్నతాధికారులు సత్వర దర్యాప్తును ప్రారంభించారు. చిన్నస్థాయి నుంచి పెద్ద హోదాల్లో మహిళ సైనిక ఉద్యోగుల ఫొటోలు లీకయినవాటిల్లో ఉన్నాయంట. దీని వెనుక మిలిటరీ అధికారుల హస్తం ఉందని అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి నేవీ పటాల అధికారిక ప్రతినిధి ఓ మీడియాకు వివరాలు చెబుతూ దీని వెనుక ఎంతమంది మిలటరీ అధికారుల హస్తం ఉందో, ఎవరు ఈ కుట్ర చేశారో తెలియాల్సి ఉందని చెప్పారు. నేవి దళ నేరాలు పరిశోధించే దర్యాప్తు విభాగం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అక్కడి ఓ పేపర్ తెలిపిన వివరాల ప్రకారం నేవీ దళానికి సంబంధించి ఓ ఫేస్బుక్ గ్రూప్ పేజీ ఉంది. ఇందులో 30 వేలమంది సభ్యులు ఉన్నారు. ఈ గ్రూప్‌లోనే సదరు నేవీ మహిళా అధికారుల నగ్న చిత్రాలు పెట్టారంట. దీంతో ప్రస్తుతం ఈ ఫేస్బుక్ పేజీని మూసి వేశారు. మహిళా అధికారుల నగ్న చిత్రాలు, వారి వివరాలు, ర్యాంకులు, పేర్లు పనిచేస్తున్న విభాగం వివరాలతో సహా ఇందులో పోస్ట్ చేశారంట. ఈ ఘటనపై అమెరికా నేవీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.