కదులుతున్న బస్‌లో పాఠశాల విద్యార్థులు మద్యం సేవిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లాలో జరిగినట్లు గుర్తించారు. వీడియోలో ఓ పాఠశాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు యూనిఫామ్ ధరించి బస్‌లో ప్రయాణిస్తున్నారు. వీరిలో కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి బీర్ బాటిల్‌ను ఓపెన్ చేసి తాగుతూ కనిపించారు. ఈ తంతంగాన్నంతా తోటి విద్యార్థులు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఈ వీడియో కాస్తా నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో బస్‌లోని విద్యార్థులంతా చెంగల్‌పట్టులోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన వారుగా తెలిసింది. తిరుకజుకుండ్రం నుంచి తాచూర్‌కు వెళుతున్నారు. అయితే ముందుగా ఈ వీడియో పాతది అనుకున్నారు. కానీ మంగళవారం జరిగిన ఘటనగా పోలీసులు గుర్తించారు. ఇలా విద్యార్థులు బస్‌లో మద్యం సేవిస్తున్న విషయం చివరికి అధికారులు దృష్టికి వెళ్లడంతో.. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. విచారణ పూర్తయ్యాక తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
చదవండి: ‘కశ్మీర్ ఫైల్స్’ మూవీ ఎఫెక్ట్.. ఢిల్లీలో కశ్మీర్ వ్యక్తికి చేదు అనుభవం..
Comments
Please login to add a commentAdd a comment