Drinking alcohol
-
మహిళల్లో మద్యం అలవాటుకు ఈస్ట్రోజన్‌కు లింకు
న్యూఢిల్లీ: ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలు పెరిగిన సందర్భాల్లో మహిళల్లో మద్యం అతిగా తాగాలనే ఆలోచనలు ఎక్కువగా రావొచ్చని అమెరికాలో జరిగిన ఓ పరిశోధనలో తేలింది. అమెరికాలోని వెల్ కార్నెల్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల సంబంధిత అధ్యయనం వివరాలు తాజాగా ‘నేచర్ కమ్యూనికేషన్స్’జర్నల్‌లో ప్రచురతమయ్యాయి. ఈస్ట్రోజన్ స్థాయిలకు మహిళల్లో అతి మద్యపాన అలవాట్లకు మధ్య దగ్గరి సంబంధం ఉందని తొలిసారిగా కనుగొన్నామని పరిశోధకులు చెప్పారు. పురుషులతో పోలిస్తే ఈ ధోరణి మహిళల్లోనే ఉందని పేర్కొన్నారు. మహిళ ఒకేసారి నాలుగు కంటే ఎక్కువ పెగ్గులు తాగితే ఆ అలవాటును అతిమద్యపాన సేవనంగా పేర్కొంటారు. సంబంధిత ప్రయోగాన్ని ఎలుకలపై చేసి నిర్ధారించుకున్నారు. మగ ఎలుకలతో పోలిస్తే ఆడ ఎలుకల మెదడులో ‘స్ట్రియా టెరి్మనల్‌లోని బెడ్ న్యూక్లియస్’న్యూరాన్లు ఈస్ట్రోజన్ ఎక్కువ అయినప్పుడు అతిగా మద్యం తాగాలని ప్రేరేపిస్తున్నాయి. మద్యం అందించిన తొలి 30 నిమిషాల్లోనే వాటిలో ఈ అతిపోకడ కనిపించింది. మహిళల్లో అతిమద్యం అలవాట్లకు కారణం ఏమై ఉంటుందో ఇన్నాళ్లూ బోధపడలేదు. ఎందుకంటే ఇంతకాలం జరిగిన ఈ తరహా పరిశోధనలు కేవలం పురుషులమీదే జరిగాయి. ఈ పరిశోధన ఫలితాలు మహిళల్లో మద్యం అలవాట్లపై అధ్యయనానికి కొత్త బాటలు వేశాయి’’అని వెల్ కార్నెల్ మెడిసిన్‌లోని ఫార్మకాలజీ విభాగ అసోసియేట్ ప్రొఫెసర్, నివేదికలో కీలక రచయిత క్రిస్టీన్ పెయిల్ వ్యాఖ్యానించారు. మహిళల్లో నెలసరి రోజులులాగా ఎలుకల్లో ఈస్ట్రోజన్ చక్రం కొనసాగినంతకాలం ఈ పరిశోధన చేశారు. ఈస్ట్రోజన్ స్థాయిలు ఎక్కువ ఉన్నన్ని రోజులూ ఆడ ఎలుకలు మద్యం ఫూటుగా తాగడం గమనించారు. మద్యానికి బానిసలైన మహిళా బాధితులకు చికిత్సా విధానాల్లో మార్పుకు ఈ కొత్త పరిశోధన ఎంతగానో సాయపడనుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. -
కొంచెమైనా.. ముంచేస్తుంది!
అతిగా మద్యం తాగడం ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని అందరికీ తెలిసిందే. కానీ కొందరు వైద్యులు, సైంటిస్టులు, డైటీషియన్లు వంటివారు రోజూ స్వల్ప మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లాభం ఉంటుందని, గుండె జబ్బులను దూరం పెడుతుందని చెబుతూ ఉంటారు. కానీ దీనికి పక్కా ఆధారాలేమీ లేవని, రోజూ కాస్తంత ఆల్కహాల్ తీసుకున్నా కేన్సర్ బారినపడే ముప్పు పెరిగిపోతుందని అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి పలు అధ్యయనాలు, గణాంకాల్లో తేలిన అంశాలను ఆధారంగా చూపుతున్నారు. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై అవి కేన్సర్‌కు దారితీస్తాయంటూ ఎలా హెచ్చరికలు ముద్రిస్తారో.. అలా ఆల్కహాల్ ఉత్పత్తులపైనా ముద్రించాలని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఆయన నివేదిక ప్రకారం..ఆల్కహాల్‌కు కేన్సర్‌కు లింకేమిటి?⇒ తగిన జాగ్రత్తలు తీసుకుని నివారించుకునే అవకాశమున్న కేన్సర్లలో.. పొగాకు, ఊబకాయం తర్వాత ఎక్కువగా నమోదవుతున్నవి ఆల్కహాల్ కారణంగానే. ప్రపంచ ఆరోగ్య సంస్థ కేన్సర్ రీసెర్చ్ విభాగం కూడా ఆల్కహాల్‌ను ప్రధానమైన కేన్సర్ కారకాల్లో (గ్రూప్ 1 కార్సినోజెన్) ఒకటిగా గుర్తించడం గమనార్హం. ⇒ అమెరికాలో ఏటా ఆల్కహాల్ కారణంగా కేన్సర్ బారినపడి మరణిస్తున్నవారు.. 20 వేల మంది ⇒ 2020లో ప్రపంచవ్యాప్తంగా ఆల్కహాల్ వినియోగం కారణంగా నమోదైన కేన్సర్ కేసులు... 7.4 లక్షల మంది.(ఒక డ్రింక్ అంటే సుమారుగా.. 330 మిల్లీలీటర్ల బీరు లేదా 35 మిల్లీలీటర్ల విస్కీ)7 ఆల్కహాల్‌తో రకాల కేన్సర్ల ముప్పుపొగాకు నేరుగా కేన్సర్లకు కారణమైతే.. ఆల్కహాల్ ఏడు రకాల కేన్సర్లకు దారితీస్తుంది. మన దేశంలో కాలేయ కేన్సర్‌కు ముఖ్య కారణంగా ఆల్కహాల్ నిలుస్తోంది. ఇక ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులు రెండూ కలిస్తే కేన్సర్ల ముప్పు మరింత తీవ్రమవుతుందని కేన్సర్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ఆల్కహాల్ కేన్సర్‌కు దారితీసేదిలా.. 1. శరీరంలో ఆల్కహాల్ అసిటాల్డిహైడ్‌గా మారుతుంది. ఇది మన కణాల్లోని డీఎన్ఏను దెబ్బతీసి, కేన్సర్ ముప్పును పెంచుతుంది. 2. ఆల్కహాల్ శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను పెంచుతుంది. ఇది శరీరంలో కణాలు, ప్రొటీన్లు, డీఎన్ఏను దెబ్బతీసి కేన్సర్‌కు కారణమయ్యే ఇన్ఫ్లమేషన్కు కారణమవుతుంది. 3. ఆల్కహాల్ కారణంగా శరీరంలో వివిధ హార్మోన్లలో విపరీతమైన హెచ్చుతగ్గులు వస్తాయి. ఇది కేన్సర్‌కు దారితీస్తుంది. ముఖ్యంగా మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్‌పై ప్రభావం పడి రొమ్ము కేన్సర్ ముప్పు పెరుగుతుంది. 4. కేన్సర్‌కు కారణమయ్యే పదార్థాలను (కార్సినోజెన్లు) శరీరం ఎక్కువగా సంగ్రహించడానికి ఆల్కహాల్ కారణమవుతుంది.ఎంత తాగితే.. అతిగా తాగినట్టు? ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పలు అధ్యయనాల మేరకు.. రోజూ కనీసం ఒక డ్రింక్ ఆల్కహాల్ తాగేవారిలో కేన్సర్ల ముప్పు 10 నుంచి 40% వరకు పెరుగుతుంది. డ్రింక్స్ సంఖ్య పెరిగిన కొద్దీ.. ముప్పు అదే స్థాయిలో పెరుగుతూ పోతుంది. అక్కడి అధ్యయనం మనకెందుకు? ప్రపంచంలోనే అత్యధిక జనాభాకు తోడు ఆల్కహాల్ వినియోగం కూడా ఎక్కువగానే ఉండటంతో.. భారత్‌లోనూ ఈ కేన్సర్ల ముప్పు ఎక్కువ. ‘ది లాన్సెట్ అంకాలజీ’ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన వివరాల మేరకు... 2020లో భారత్‌లో కొత్తగా 62,100 ఆల్కహాల్ ఆధారిత కేన్సర్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేన్సర్ కేసుల్లో ఇవి 5 శాతానికన్నా ఎక్కువే కావడం గమనార్హం.మన దేశంలో కొన్నేళ్లుగా పెరిగిపోతున్న ఊబ కాయం సమస్యకు తోడుఆల్కహాల్, పొగాకు ఉత్పత్తుల వినియోగం ఈ పరిస్థితికి దారితీస్తోందని అంకాలజీ నిపుణులు చెబుతున్నారు.మరి ఈ కేన్సర్ల ముప్పు నుంచి బయటపడేదెలా?రోజూ స్వల్ప మొత్తంలో ఆల్కహాల్ తీసుకున్నా కేన్సర్ ముప్పు తప్పదని ఈ అధ్యయనం తేల్చింది. అంటే ఈ ముప్పు నుంచి బయటపడటానికి ఉన్న ఏకైక మార్గం... ఆల్కహాల్‌కు పూర్తిగా దూరంగా ఉండటమేనని అంకాలజీ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒక్కసారిగా అలవాటు మానుకోలేనివారు.. స్వల్పంగా తీసుకుంటూ మానేయాలని, అదే సమయంలో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులకు కచి్చతంగా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. –సాక్షి,సెంట్రల్ డెస్క్ -
ట్రైన్ లో తాగుతూ.. తూగుతూ..
-
Health: మందు మానేందుకు కూడా.. మందు ఉందా?
మా వివాహమై పదిహేనేళ్ళయింది. పెళ్ళికి ముందే ఆయనకు కొద్దిగా తాగుడు అలవాటుండేది. పోను పోను ఈ మధ్య మరీ ఎక్కువైంది. రెండేళ్ళ నుండి పగలు రాత్రి తేడా లేకుండా, తాగుతున్నారు. తాగనప్పుడు ఎంత మంచిగా ఉంటారో, తాగితే అంత గొడవ చేస్తారు. పొద్దున లేస్తూనే, ఒళ్ళంతా వణకటం, నీరసం, చికాకుగా, ... ఉందంటూ ఏ పనీ చేయలేకపోవడం, మళ్ళీ తాగితేనే గాని పని చేయలేనంటున్నారు.ఈ అలవాటు వల్ల, బిజినెస్ దెబ్బ తిని, చాలా నష్టపోవటమే కాకుండా, నలుగురిలో చులకన అయిపోయారు. పిల్లలు కూడా ఆయన్ను లెక్క చేయడం లేదు. తిండి, నిద్ర కూడా బాగా తగ్గి, చిక్కిపోయారు. ఇలాగే తాగుతుంటే ఆయన మాకు దక్కరేమోనని భయంగా ఉంది. డాక్టరు దగ్గరకు రమ్మంటే రావడం లేదు. మాకేదైనా పరిష్కారం చూపించగలరు. – కోమలి, రాజమండ్రితాగుడుకు అలవాటు పడటమనేది కూడా, ఒక మానసిక జబ్బు కిందే వస్తుందన్నది చాలామందికి తెలియదు. సరదాగా ్ర΄ారంభించి, చివరకు దానికి అలవాటు పడిపోతారు. మానాలనుకున్నా మానేయలేని స్థితికి వెళ్తారు. సమస్యలొచ్చినా, సంతోషమొచ్చినా, ఏదో ఒక కారణం పెట్టుకుని చాలామంది ఇలా తాగుడుకు బానిసలవుతారు. దీనివల్ల అన్ని విధాలా నష్టపోవడమే కాకుండా లివర్ దెబ్బతిని చివరకు ‘సిరోసిస్’ అనే వ్యాధి బారిన పడతారు. ్ర΄ాణాలకు ముప్పు ఉందని తెలిసినా తెగించి తాగే వారు కూడా చాలామంది ఉంటారు.మునుపటి కంటే ఇప్పుడు తాగుడు అలవాటు నుంచి పూర్తిగా విముక్తి కల్పించేందుకు ఆధునిక మానసిక వైద్య శాస్త్రంలో మంచి మందులు, చికిత్సా పద్ధతులు ఉన్నాయి. అయితే అందుకు ఆ వ్యక్తి సహకారం చాలా అవసరం. ఏదో ఒక విధంగా ఒప్పించి మీరు సైకి యాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. మద్యం పైన తపన తగ్గించేందుకు ‘యాంటీ క్రేవింగ్ డ్రగ్స్’, మద్యం పై ఎవర్షన్ కలిగించేందుకు ‘డిటెరెంట్స్’ అనే మందులతో ΄ాటు, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, ఫ్యామిలీ కౌన్సెలింగ్ లాంటి మానసిక చికిత్సా పద్ధతులతో మీ వారిని ఆ అలవాటు నుంచి పూర్తిగా బయట పడేయవచ్చు.– డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
ఇదేం పని ‘గురువా’!
శాంతిపురం: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థుల ముందే మద్యపానం చేస్తూ ఫొటోలకు చిక్కాడు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలోని శాంతిపురం మండలం కడపల్లి బాలయోగి గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాఠశాల ఆవరణలోని బాలుర హాస్టల్లో బుధవారం రాత్రి విద్యార్థులతో పాటు ఉన్న పీఈటీ మురళి అక్కడే మద్యం సేవించడం మొదలుపెట్టాడు. పిల్లల ముందే వారు నిద్రించే పడకపై కూర్చుని హాయిగా మద్యం తాగుతూ ఎవరితోనో ఫోన్లో గొడవ పెట్టుకున్నాడు. పాఠశాలకు వచ్చి ఈ విషయాన్ని గమనించిన రామకుప్పం మండలానికి చెందిన ఓ దళిత నాయకుడు ఈ దృశ్యాలను ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో విషయం వెలుగుచూసింది. దీనిపై ఇన్చార్జి ప్రిన్సిపాల్ రాజేంద్రను వివరణ కోరగా.. పిల్లల మధ్య కూర్చుని మద్యం సేవిస్తున్న కాంట్రాక్ట్ పీఈటీ ఫొటోలు తనకు కూడా వచ్చాయన్నారు. తాను ఈ విషయాన్ని డీసీవో దృష్టికి తీసుకెళ్లానని.. ఆమె గురువారం విచారణకు వస్తున్నారని చెప్పారు. -
వ్యక్తి ఆత్మహత్య.. తాగుడు ఇంత పని చేసిందా!
జైనథ్: మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై పురుషోత్తం తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన భౌనే భూపాల్ (42) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జీవితంపై విరక్తితోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుని భార్య సువర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
తాగుడుకు పైసలు లేవని.. ఓ వ్యక్తి తీవ్ర నిర్ణయం..
నల్గొండ: మద్యం తాగడానికి డబ్బులు లేక పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మునుగోడు మండలంలోని కొరటికల్ గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. కొరటికల్ గ్రామానికి చెందిన బోడిశ సత్తయ్య(45) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల సత్తయ్య మద్యానికి బానిసయ్యాడు. సోమవారం రాత్రి మద్యం తాగేందుకు అతడి వద్ద డబ్బులు లేకపోడంతో తట్టుకోలేక ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సత్తయ్య కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వచ్చేసరికి అప్పటికే అతడు మృతిచెందాడు. మృతుడి కుమారుడు మహేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com రోడ్డు ప్రమాదంలో క్లీనర్ మృతి విద్యుత్ స్తంభాల లోడ్‌తో వెళ్తున్న లారీ ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన పెద్దఅడిశర్లపల్లి మండలంలోని నీలంనగర్ సమీపంలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. గుడిపల్లి ఎస్ఐ రంజిత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలంలోని ఆలగడప నుంచి గద్వాల్ జిల్లాకు విద్యుత్ స్తంభాలు లోడ్‌తో వెళ్తున్న లారీ పెద్దఅడిశర్లపల్లి మండలం నీలంనగర్ సమీపంలో కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యుత్ స్తంభాలు తీసుకెళ్తున్న లారీ క్లీనర్ గుగులోతు నితిన్(20) క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. తీవ్రగాయాలైన అతడిని స్థానికులు 108 వాహనంలో దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తండ్రి సక్రాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మందేసుకుంటే కనిపెట్టేస్తుంది
మద్యం తాగి వాహనాలు నడపడం, ప్రమాదాలకు కారణమవడం దాదాపు ప్రపంచవ్యాప్త సమస్య. వాహనాలను నడిపే మందుబాబులను పట్టుకోవడానికి పోలీసులు నగరాల్లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుంటారు. మూతి దగ్గర గొట్టం పెట్టి ఊదమంటారు. ఊదితే ఎంత మందేశారో తెలిసిపోతుంది. కొందరు తెలివిమీరిన మందుబాబులు గొట్టం ముందు ఊదడానికి నానా విన్యాసాలు చేస్తారు. ఊదాల్సిన అవసరం లేకుండానే, మందుబాబులు ఏ డోసులో తాగారో ఇట్టే కనిపెట్టేసే బ్రాస్లెట్ ఇది. ‘సోబర్సేఫ్’ అనే అమెరికన్ కంపెనీ ‘సోబర్స్యూర్’ పేరుతో ఈ హైటెక్ బ్రాస్లెట్ను గత నెలలోనే మార్కెట్లోకి తెచ్చింది. ఇందులో జీపీఎస్ టెక్నాలజీని కూడా అమర్చడంతో, దీనిని తొడుక్కున్న వారు ఎక్కడ ఉన్నారో తేలికగా కనిపెట్టవచ్చు. దీనిని వాచీలా చేతికి తొడుక్కుంటే, ఒంట్లో ఆల్కహాల్ ఎంత మోతాదులో ఉందో ఇట్టే తెరపై చూపిస్తుంది. దీని ధర 38 డాలర్లు (రూ.3,159) మాత్రమే! -
ఫుల్లుగా తాగి ముగ్గురు అమ్మాయిల రచ్చ
-
మద్యం కూడా మంచిదే బాసూ.. కానీ దానికీ ఓ లెక్కుంది
మద్యపానం ఆరోగ్యానికి హానీకరం అన్న విషయం తెలిసిందే. ఆల్కహాల్ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, కాబట్టి దీనికి దూరంగా ఉండటమే బెటర్ అని ఇప్పటివరకు చాలాసార్లు వింటూ వచ్చాం. అయితే మద్యాపానంతో ఆరోగ్యమే అంటున్నారు నిపుణులు. కాస్త విడ్డూరంగా ఉన్నా ఇది నిజమే. మితంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని, గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ జరిపిన అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా ఙ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందట. మితంగా మద్యపానం తీసుకోవడం కలిగే కలిగే లాభాలు ఏంటి? శరీరానికి ఆల్కహాల్ ఏ విధంగా మేలు చేస్తుందన్నది ఇప్పుడు చూద్దాం.. ►మితిమించనిది ఏదైనా మంచిదే. ఆల్కహాల్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి ఎంత నష్టమో ప్రత్యేకంగా చెప్పనరక్కర్లేదు. కాలేయం దెబ్బతినడంతో పాటు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ మద్యం మితంగా తీసుకుంటే మంచిదే అని మీకు తెలుసా? సరైన పద్దతుల్లో మద్యం తీసుకుంటే శరీరానికి మంచే చేస్తుందట. ► మితంగా మద్యపానం తీసుకోవడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. ► తక్కువ మొత్తంలో మద్యపానం తీసుకోవడం వల్ల ఆయుష్షు పెరుగుతుందట. 25% మరణాల రేటును ఇది తగ్గిస్తుంది. ► రెడ్ వైన్‌లో యాంటీ ఏజినింగ్ గుణాలు ఉంటాయి. చాలా తక్కువ మొత్తంలో ఇది తీసుకోవడం వల్ల చర్మం గ్లో పెరిగి యవ్వనంగా కనిపిస్తారు. ► వైన్ ద్రాక్ష తొక్కలో ఉండే రెస్వెరాట్రాల్ జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కాబట్టి కొద్దిగా వైన్ తీసుకోవడం మంచిదే అంటున్నారు నిపుణులు. ► బీర్, వైన్స్‌లో అధికమొత్తంలో సిలికాన్ ఉంటుంది. ఇది బలమైన, ఆరోగ్యకరమైన ఎముకలకు సహాయపడుతుంది. ► మితమైన మద్యపానం తీసుకోవడం వల్ల కొన్ని మానసిక ప్రయోజనాలు ఉన్నాయి. ► తక్కువ మొత్తంలో మద్యం తాగేవారికి కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం తక్కువట. అదే అధికంగా తీసుకుంటే డీహైడ్రేషన్‌కు గురై కిడ్నీల్లో రాళ్లు వచ్చే అవకాశం ఉంది. గమనిక: మద్యపానం ఆరోగ్యానికి హానికరం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అతి తక్కువ మొత్తంలో ఆల్కహాల్‌ను తీసుకుంటేనే ప్రయోజనకరం అన్నది ఈ ఆర్టికల్ సారాంశం. మద్యం సేవించడాన్ని ప్రోత్సహించడం మా ఉద్దేశం కాదు. గమనించగలరు. Disclaimer: The information provided in this article is based on general information. Please contact the relevant expert before taking alcohol consumption. -
మందుబాబు చెంప చెల్లుమనిపించిన ఎస్ఐ రాజు
-
విమానంలో పెద్దాయన పాడుపని..ఫ్లైట్ అటెండెంట్‌కి బలవంతంగా..
ఇటీవల విమానంలో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనలకు సంబంధించి ఏదో ఒక ఘటనను తరుచుగా వింటున్నాం. అవన్నీ మరువకే మునుపే అచ్చం అలాంటి మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. దీంతో సదరు ప్రయాణకుడు కటకటాల పాలయ్యాడు కూడా. ఈ ఘటన డెల్టా ఎయిర్‌లైన్స్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఏప్రిల్ 10న మిన్నెసోటా నుంచి అలస్కాకు ప్రయాణిస్తున్న డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలో 61 ఏళ్ల డేవిడ్ అలాన్ బర్క్ అనే వృద్ధ ప్రయాణికుడు ఫ్లైట్ అటెండెంట్ పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించాడు. ఆ వృద్ధ ప్రయాణకుడు ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్ సీటులో కూర్చొన్నాడు. అక్కడే ఓ మగ ఫ్లైట్ అటెండెంట్ పనిచేస్తున్నాడు. సాదారణంగా ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు టేకాఫ్ చేయడానికి ముందు ఫ్లైట్ అటెండెంట్ నుంచి డ్రింక్స్‌ని స్వీకరిస్తారు. అయితే ఆ అటెండెంట్ ఆ వృద్ధ ప్రయాణికుడు బర్క్‌కి నచ్చిన రెడ్ వైన్ ఆల్కాహాల్ని అందించలేదు. దీంతో ఆ ప్రయాణికుడు ఒకింత అసహనానికి గురయ్యాడు. ఆ తర్వాత భోజన ఆర్డర్లను తీసుకోవడానికి ఆ ఫ్టైట్ అటెండెంట్ వస్తుండగా.. ఆ ప్రయాణికుడు బర్క్ అతనిని అందంగా ఉన్నావంటూ బలవంతంగా ముద్దు పెట్టుకునే యత్నం చేశాడు. దీంతో ఫ్లైట్ అటెండెంట్ ఒక్కసారిగా గురయ్యాడు. పాపం ఆ అటెండెంట్ ఆ ప్రయాణికుడి కాంప్లీమెంట్కి ధన్యావాదాలు చెబుతూ వద్దు సార్ అంటూ వెనక్కి వెళ్లే యత్నం చేసిన మెడపై ముద్దు పెట్టే యత్నం చేశాడు. వాస్తవానికి ఆ ప్రయాణకుడు రెస్ట్‌రూమ్‌కి వెళ్లేందుకు లేచాడని ఆ తర్వాత తాను ఎదురపడగానే అతను ఇలా అనుచితంగా ప్రవర్తించినట్లు సిబ్బంది పేర్కొన్నారు. దీంతో ఆ ఫ్టైట్ అటెండెంట్ డెల్టా ఎయిర్‌లైన్స్‌కి జరిగిన విషయాన్ని ఫోన్ కాల్ ద్వారా తెలయజేసి ఫిర్యాదు చేశారు. అలాగే అతను తాగిన మత్తుమలోనే అలా ప్రవర్తించాడని, పైగా పైలట్ భోజనం ట్రైని కూడా పగలుగొట్టి భయబ్రాంతులకు గురిచేసేలా ప్రవర్తించాడని ఫిర్యాదు చేశాడు ఫ్లైట్ అటెండెంట్. ఆ ప్రయాణికుడు నిద్రపోయే ముందు మరో రెండు గ్లాస్‌ల రెడ్వైన్ని అడిగినట్లు సమాచారం. ఈ మేరకు ఆ విమానం ఎయిర్‌పోర్ట్‌లో దిగిన వెంటనే అధికారులు ఆ వికృత వృద్ధ ప్రయాణికుడిరి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ నెల ఏప్రిల్ 27న కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంది. (చదవండి: సెప్టెంబర్‌లో భారత్‌కు బైడెన్) -
ఆ సినిమాలో నిజంగానే నాతో బీర్ తాగించారు: ఆమని
నటి ఆమని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అప్పట్లో శుభలగ్నం, మావిడాకులు, మిస్టర్ పెళ్ళాం.. వంటి సినిమాల్లోని ఆమె పాత్రల్లో ఎప్పటికీ గుర్తిండిపోతాయి. అనేక హిట్ చిత్రాల్లో నటించి సహజమైన తన నటనతో అందరి మన్ననలు అందుకున్నారు. కెరీర్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే సినిమాల నుంచి తప్పుకొని వ్యక్తిగత జీవితంలో బిజీ అయిపోయారు. అయితే చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమని ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలు చేస్తూ బిజీ అవుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన ఫస్ట్ మూవీ ‘జంబలకిడి పంబ’ షూటింగ్‌లోని ఓ ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకుంది. ఈ సినిమాలో మందుకొట్టే సీన్ ఉంటుందని డైరెక్టర్ ముందు నాకు చెప్పలేదు. డైరెక్ట్‌గా షూటింగ్ స్పాట్‌కు వెళ్లాక ఆ సీన్ చేయాలన్నారు. బాటిల్లో ఏదైనా కూల్‌డ్రింక్ కలిపి ఇస్తారేమో అనుకున్నా. కానీ నిజంగానే బీర్ ఇచ్చి జస్ట్ ఒక సిప్ చేయమన్నారు. అప్పుడు హీరో నరేష్ కూడా ఏం కాదమ్మ తాగు అని అన్నారు. అలా మొదటి సినిమాలోనే మందుతాగే సీన్ చేశాను అంటూ చెప్పుకొచ్చారు. -
మద్యం మత్తులో కానిస్టేబుల్ హల్చల్.. నడిరోడ్డుపై డ్రెస్ విప్పేసి..
తాగిన మైకంలో ఓ పోలీసు కానిస్టేబుల్ రెచ్చిపోయాడు. పీకాల దాకా మద్యం సేవించి నడిరోడ్డుపై పట్టపగలే హల్చల్ చేశాడు. తాను రోడ్డుపై ఉన్న విషయం కూడా తెలియని స్థితిలో షర్ట్, ప్యాంట్ రెండూ తీసేసి.. చుట్టుపక్కల వాళ్లపై విసిరేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాలోని పోలీసు స్టేషన్లో సుశీల్ మాండవి అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే, సుశీల్‌కు మద్యం సేవించే అలవాటు ఉండటంతో ఇప్పటికే పలుమార్లు ఫుల్‌గా మందుకొట్టి పోలీసుల అధికారుల దృష్టిలో పడటంతో వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే సుశీల్ శుక్రవారం సాయంత్రం ఫుల్‌గా మద్యం సేవించి నడిరోడ్డుమీద హల్చల్ చేశాడు. తాగిన మైకంలో రోడ్డుపై గట్టిగా కేకలు వేస్తూ.. ఒంటిపై ఉన్న పోలీస్ యూనిఫాం తీసేశాడు. షర్ట్, ప్యాంట్ రెండూ తీసేసి, చుట్టుపక్కల వాళ్లపై విసిరేశాడు. ఈ విషయంలో చుట్టుపక్కల వాళ్లు అతడికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు. మద్యం మత్తులో వారితోనే వాగ్వాదానికి దిగాడు. కాగా, అక్కడున్న వారు ఈ తతంగాన్ని అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, ఈ వీడియో పోలీసు ఉన్నతాధికారులకు చేరడంతో సుశీల్‌పై చర్యలకు దిగారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ స్పందిస్తూ సుశీల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో సుశీల్ మద్యం తాగి వాహనం నడిపి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అప్పుడు అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. కాగా, అతడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు. -
మద్యం మత్తు తెచ్చిన చేటు...ఇదే అవకాశంగా భావించి...
కొచ్చి: ఒక మహిళ మద్యం మత్తులో ఉండటంతో అఘాయిత్యానికి తెగబడ్డాడు ఒక రాపిడో బైక్ డ్రైవర్. ఈఘటన కేరళలో చోటు చేసకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....22 ఏళ్ల కేరళ మహిళపై సాముహిక అత్యాచారం జరిగింది. స్నేహితుడి ఇంటికి వెళ్లిన మహిళ తిరుగు ప్రయాణంలో రైడ్ షేరింగ్ అప్లికేషన్ ర్యాపిడోలో బైక్ బుక్ చేసుకుంది. ఐతే ఆమె ఆ సమయంలో మద్యం మత్తులో ఉంది. ఆమె గమ్యస్థానానికి వచ్చినా దిగే పరిస్థితిలో లేదు. దీంతో దీన్నే అవకాశంగా తీసుకున్న ఆ డ్రైవర్ ఆ మహిళను తన ఇంటికి తీసుకువెళ్లి తన సహచరుడితో కలసి ఆమెపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమె స్ప్రుహలోకి రావడంతో తీవ్ర నొప్పికి గురయ్యింది. దీంతో ఆమె నిందితుడి ఇంటి నుంచి బయటపడి ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు పరీక్షించి పోలీసులు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు భాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఐతే ఈ ఘటనలో బాధితురాలు పశ్చిమ బెంగాల్ చెందిన మహిళ కాగా, నిందితులిద్దరూ బెంగళూరు చెందిన వారని చెప్పారు. (చదవండి: తండ్రికి గుండె నొప్పి వచ్చిందని...కంగారులో కారుని వేగంగా పోనివ్వడంతో...) -
స్నేహితుడి వంచన... మందు కొట్టి మరీ రూ. 75 లక్షలు చోరీ
మలక్‌పేట: అర్థరాత్రి వరకు కలిసి మద్యం తాగి స్నేహితుని ఇంట్లో రూ. 75 లక్షల నగదు దోచుకెళ్లాడు ఓవ్యక్తి. ఈ సంఘటన శనివారం మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. రియల్ ఎస్టేట్ వ్యాపారి సాయిప్రకాశ్‌రెడ్డి మూసారంబాగ్ డివిజన్ సలీంనగర్ పద్మావతి రెసిడెన్సీలో ఉంటున్నాడు. గోవాలో ఉంటున్న అతని ఫ్రెండ్ ఫిరోజ్ ఈనెల 29న సలీంనగర్‌కు వచ్చాడు. ఇద్దరూ కలిసి ఇంట్లో మద్యం సేవించారు. తరువాత ఫిరోజ్ పబ్‌కి వెళ్దామని అంటే రాత్రి 10 గంటలకు కొత్తపేటలోని ఓ పబ్‌కి వెళ్ళారు. పబ్‌లో పాత ఫ్రెండ్ రాజేష్ కలిశాడు. రాత్రి 1.30 గంటలకు సాయిప్రకాశ్‌రెడ్డి, ఫిరోజ్, రాజేష్, రాజేష్ స్నేహితుడు నలుగురు కలిసి మద్యం తాగడానికి సలీంనగర్‌కు వచ్చారు. ఫిరోజ్ ఒక గదిలో పడుకున్నాడు. మిగిలిన ముగ్గురూ కలిసి హాల్లో మద్యం తాగుతుండగా.. రాజేష్ నిద్రవస్తుందని చెబితే సాయిప్రకాశ్‌రెడ్డి అతనిని మరొగదిలోకి తీసుకెళ్లి పడుకోమని చెప్పి వాష్‌రూమ్‌కు వెళ్లాడు. వాష్ రూమ్ నుంచి బయటికి వచ్చేసరికి మంచంపై ఖాళీ బ్యాగు పడి ఉండటాన్ని గమనించాడు. రాజేష్, అతని ఫ్రెండ్ ఇంట్లో లేరు. ఇంట్లో పెట్టిన రూ. 75 లక్షల నగదు ఉన్న బ్యాగ్ కన్పించలేదు. వెంటనే కిందకి వెళ్లి చూడగా రాజేష్ కనిపించాడు. అతన్ని ఆపి అడుగుతుండగా గేట్ దూకిపారిపోయాడు. భూమి అమ్మిన రూ.75 లక్షలు నల్లరంగు బ్యాగులో ఉండగా రాజేష రాజేష్ ఫ్రెండ్ దొంగతనం చేశారని బాధితుడు సాయిప్రకాశ్‌రెడ్డి శనివారం మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. (చదవండి: కళాశాల విద్యార్థికి ఉగ్రవాదులతో లింక్!) -
లిక్కర్ తాగితే ఆరోగ్యానికి మేలేనటా.. అది ఎలాగంటే!
లండన్: ఆల్కాహాల్ తీసుకోవటం వల్ల ఆరోగ్యం చెడిపోతుందని వైద్యులు చెబుతుంటారు. తాగి ఇంటికొస్తే పెద్దలు తిడతారు. అయితే.. మద్యం తాగితే ఆరోగ్య ప్రయోజనాలు సైతం ఉన్నాయని లాన్సెట్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం తేల్చింది. అవునండి అది నిజమేనటా? లిక్కర్ తాగితే చాలా రోగాలు దరిచేరవటా! కానీ, దానికో షరతు ఉంది. మీరు 40 ఏళ్ల వయసు దాటి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటే.. చిన్న గ్లాస్ రెడ్ వైన్, బీరు బాటిల్, విష్కి లేదా ఇతర లిక్కర్‌ను ప్రామాణిక మోతాదులో తీసుకోవచ్చని తేల్చింది. దాంతో గుండె, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు, గుండపోటు, మధుమేహం వంటివి వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని వెల్లడించింది. మరోవైపు.. వృద్ధులతో పోలిస్తే యువత ఆల్కాహాల్ తీసుకోవటం ద్వారా ఎక్కువ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని పేర్కొంది. 15-39 ఏళ్ల వయసు వారు లిక్కర్ తీసుకోవటం ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవటా. ప్రస్తుతం మద్యం సేవిస్తున్నవారిలో వీరి వాటానే ఎక్కువ. ఈ వయసు వారిలోనే 60 శాతానికిపైగా ఆల్కాహాల్ సంబంధిత సమస్యలకు గరువుతున్నట్లు అధ్యయనం తేల్చింది. బైక్ ప్రమాదాలు, ఆత్మహత్యలు, దాడులు ఎక్కువగా జరుగుతున్నట్లు పేర్కొంది. 'యువత ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. 40 ఏళ్లు పైబడిన వారు కొద్దిగా లిక్కరు తీసుకోవటం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. యువత ఆల్కహాల్‌కు దూరంగా ఉంటారని నమ్మకం లేకపోయినప్పటికీ.. మా అధ్యయనంతో కొంత వరకైనా మారుతారనే నమ్మకం ఉంది.' అని పేర్కొన్నారు వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఎమ్మాన్యూయెల్ గాకిడో. మహిళలు, పురుషుల్లో ఆల్కహాల్ తీసుకుంటే వచ్చే ముప్పుపై అధ్యయనం చేశారు పరిశోధకులు. క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు వంటి 22 సమస్యలపై.. వ్యాధులతో ప్రపంచ వ్యయం 2020 డేటాను వినియోగించుకున్నారు. 15-95 ఏళ్ల వయసువారిపై పరిశోధన.. 1990- 2020 మధ్య 15-95 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులు, ఆడవారిపై అధ్యయనం చేశారు పరిశోధకులు. 2020 గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ డేటాను ఉపయోగించి హృదయ వ్యాధులు, క్యాన్సర్లతో సహా 22 ఆరోగ్య ఫలితాలపై ఆల్కహాల్ వినియోగం ప్రమాదాన్ని పరిశీలించారు. 204 దేశాల్లో ఈ పరిశోధన చేపట్టారు. 40-60 ఏళ్ల మధ్య ఉన్నవారు రోజుకు ప్రామాణిక మేతాదులో సగం తీసుకోవటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తేల్చారు. 65 ఏళ్లు పైబడిన వారిలో రోజులో మూడు ప్రామాణిక మోతాదులకన్నా ఎక్కువ మోతాదు తీసుకున్నట్లయితే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మరోవైపు.. 15-39 వయసు వారు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే రోజుకు ప్రామాణిక మోతాదులో 0.136 వంతు తీసుకోవాలని పేర్కొన్నారు. అయితే.. మహిళలకు రోజుకు 0.273గా ఉన్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: 11ఏళ్ల తర్వాత హాలిడే.. ఎగ్జైట్మెంట్లో తాగి విమానంలో రచ్చ రచ్చ.. -
తండ్రి బాధ్యతగా లేడని..
టెక్కలి రూరల్ : తండ్రి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం, నిత్యం తాగి వచ్చి గొడవలు పడటంతో విసిగిపోయిన కుమారుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కోటబొమ్మాళి మండలం ప్రకాష్‌నగర్ కాలనీలోచోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాష్‌నగర్ కాలనీకి చెందిన కాశి సాయికుమార్ (20) డిగ్రీ వరకు చదివాడు. తండ్రి గోవిందరావు మద్యానికి బానిస కావడం, ఆదాయం అంతంత మాత్రం కావడం, కుటుంబపోషణ భారం కావడంతో సాయి చదువును మధ్యలో ఆపేసి అప్పు చేసి ఆటో కొన్నాడు. అయినా తండ్రి బాధ్యత లేకుండా తాగి వస్తూ నిత్యం వీధుల్లో కేకలు పెడుతూ పరువు పోగొడుతున్నాడంటూ తండ్రీకొడుకులు ఆదివారం రాత్రి గొడవపడ్డారు. మనస్థాపానికి గురైన సాయి రాత్రి ఒంటి గంట వరకు తన తల్లితో మాట్లాడి.. తల్లి నిద్రలోకి వెళ్లాక చీరను పట్టుకొని సమీపంలో ఉన్న ఎంపీపీ పాఠశాల (బీసీ మోడల్ స్కూల్) మధ్యాహ్న భోజన పథకం వంటషెడ్లోకి వెళ్లాడు. అక్కడ దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం అదే దారిలో వెళ్లిన వారికి షెడ్లో వేలాడుతున్న సాయిని గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ వై.రవికుమార్, క్లూస్‌టీం సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: కలెక్టర్, జేసి సంతకాల ఫోర్జరీ కేసు: తీగ లాగితే కదులుతున్న డొంక) -
బస్సులోనే మద్యం సేవించిన స్కూల్ విద్యార్థులు… వీడియో వైరల్
కదులుతున్న బస్‌లో పాఠశాల విద్యార్థులు మద్యం సేవిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో జరిగినట్లు గుర్తించారు. వీడియోలో ఓ పాఠశాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు యూనిఫామ్ ధరించి బస్‌లో ప్రయాణిస్తున్నారు. వీరిలో కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి బీర్ బాటిల్‌ను ఓపెన్ చేసి తాగుతూ కనిపించారు. ఈ తంతంగాన్నంతా తోటి విద్యార్థులు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో కాస్తా నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో బస్‌లోని విద్యార్థులంతా చెంగల్పట్టులోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన వారుగా తెలిసింది. తిరుకజుకుండ్రం నుంచి తాచూర్‌కు వెళుతున్నారు. అయితే ముందుగా ఈ వీడియో పాతది అనుకున్నారు. కానీ మంగళవారం జరిగిన ఘటనగా పోలీసులు గుర్తించారు. ఇలా విద్యార్థులు బస్‌లో మద్యం సేవిస్తున్న విషయం చివరికి అధికారులు దృష్టికి వెళ్లడంతో.. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. విచారణ పూర్తయ్యాక తగిన చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: ‘కశ్మీర్ ఫైల్స్’ మూవీ ఎఫెక్ట్.. ఢిల్లీలో కశ్మీర్ వ్యక్తికి చేదు అనుభవం.. -
ఎత్తిన బాటిల్ దించకుండా తాగేవాడిని: అమీర్ ఖాన్
Aamir Khan Given Up Alcohol Says He Down The Entire Bottle At Times: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మార్చి 14న 57వ ఏట అడుగుపెట్టాడు. 1988లో 18 ఏళ్ల వయసులో ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయమైన అమీర్ ఖాన్ ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇటీవల తన కుటుంబం, ఆధ్యాత్మికత, మతం వంటి తదితర అంశాలపై మాట్లాడారు. ఓ ఇంటర్వ్యూలో తనకున్న మద్యం అలవాటు గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. చదవండి: రెండుసార్లు విడాకులు: తొలిసారి స్పందించిన ఆమీర్ ఖాన్ 'నేను ఇంతకుముందు అప్పుడప్పుడు డ్రింక్ చేసేవాడిని. కొంతమంది రెండు పెగ్గులు తీసుకుంటారు. కానీ రెగ్యూలర్‌గా తాగుతారు. నేను అలాంటి వాళ్లలో ఒకరిని కాదు. నేను అకెషనల్గా అప్పుడప్పుడు మాత్రమే తాగేవాడిని. కాకపోతో తాగడానికి కూర్చున్నప్పుడు బాటిల్ మొత్తం పూర్తి చేసేవాడిని. అది కొంచెం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. మీరు మత్తులో ఉన్నప్పుడు ఏవైనా రిగ్రీట్ ఫీల్ అయ్యేటువంటి పనులు చేశారా అని ఆలోచించుకోవాలి. నేనైతే అలా ఏం చేయలేదు. కానీ మనం సొంత నియంత్రణను కోల్పోవడమనేది నాకు నచ్చలేదు. అందుకే ఇకపై నేను తాగను.' అని అమీర్ ఖాన్ తెలిపాడు. చదవండి: సినిమా చూసి ఏడ్చేసిన స్టార్ హీరో, టీ షర్ట్‌తో కన్నీళ్లు తుడుచుకుంటూ.. అలాగే తన కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత జీవితం, కెరీర్ గురించి కూడా అమీర్ చెప్పుకొచ్చాడు. 'ఎక్కడో నాకు అనిపించింది. నేను సరిగా నా బాధ్యతలను నిర్వర్తించలేదని. నా తల్లిదండ్రులు, నా తోబుట్టువులు, నా మొదటి భార్య రీనా, తన తల్లిదండ్రులు, రెండో భార్య కిరణ్, తన తల్లిదండ్రులు, నా పిల్లలు వీళ్లందరూ నాకు చాలా సన్నిహితులు. నేను చిత్ర పరిశ్రమలో చేరినప్పుడు నాకు 18 ఏళ్లు. నేను చాలా నేర్చుకుని, చాలా చేయాలనుకున్నాను. ఈరోజు నాకు సన్నిహితంగా ఉన్న వ్యక్తులకు నేను కోరుకున్న విధంగా చేయలేకపోయాను. వారికి తగిన సమయం ఇవ్వలేకపోయానని నాకు అనిపించింది.' అని అమీర్ పేర్కొన్నాడు. -
గల్లీల్లో ఘర్షణ.. టెన్షన్లో జనం
సాక్షి, అంబర్‌పేట(హైదరాబాద్): ఆకతాయిలు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. గల్లీ ఘర్షణలు ఎక్కువవుతున్నాయి. అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు బస్తీల్లో ఆకతాయిల ఆగడాలు మితిమీరుతున్నాయి. కాస్త చీకటి పడగానే గల్లీల్లో తిష్టవేసి వారు చేసే ఆగడాలకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రేమ్‌నగర్, ఆజాద్‌నగర్, మహ్మద్‌నగర్, న్యూ పటేల్‌నగర్, గోల్నాకలోని లంకా బస్తీలు, దుర్గానగర్ తదితర ప్రాంతాల్లో ఆకతాయిల ఆగడాలు హద్దులు దాటుతున్నాయి. దీంతో మహిళలు, యువతులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఫిర్యాదులకు కనిపించని స్పందన.. ► ఆకతాయిల ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఫిర్యాదు చేసినప్పుడే తూతూ మంత్రంగా ఘటనా స్థలాన్ని సందర్శించి పోతున్నారు. మితిమీరిన ఆగడాలతో స్థానికులు ఫిర్యాదు చేయడానికి సైతం ధైర్యం చేయడం లేదు. నేరుగా ఫిర్యాదులు చేస్తేనే పట్టించుకుంటామని పోలీసులు తేల్చి చెబున్నారు. ఇప్పటికైనా పోలీసులు ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించి ఆకతాయిల ఆగడాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. మత్తులో యువత హంగామా.. ► యువకులు డ్రగ్స్, మద్యం మత్తులో ఘర్షణ పడుతున్నారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ స్థానికంగా భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. వీరి మధ్యలో అడ్డుపడితే వారిపై సైతం దాడులు చేస్తున్నారు. ఇలాంటి ఫిర్యాదులు వచ్చినా పోలీసులు పెద్దగా స్పందిస్తున్న దాఖలాలు లేవు. వారిలో వారు కొట్టుకుంటున్నారులే అనే చందంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సాయంత్రం అయిందంటే బయటకు వెళ్లే పరిస్థితి లేదని, పోలీసులు తక్షణమే స్పందించి ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని స్థానిక మహిళలు కోరుతున్నారు. చదవండి: మహంకాళి దేవాలయం వద్ద మొండెం లేని మనిషి తల -
మద్యం తాగే వయసు 21 ఏళ్లకు కుదింపు! ఆ రాష్ట్రాల్లో పూర్తిగా నిషేధం..
Legal Drinking Age Around The World హర్యానా: రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ చట్టాన్ని తాజాగా సవరించింది. తాజా చట్ట సవరణ ప్రకారం మద్యపానం చేయడానికి, కొనడానికి కనీస వయస్సును 25 నుంచి 21కి తగ్గించింది. ఈ మేరకు డిసెంబర్ 22 (బుధవారం)న విధానసభలో వయోపరిమితి మార్పు సవరణ బిల్లుకు ఆమోదం పొందింది. అర్ధాంతరంగా వయసును తగ్గండానికి గల కారణాలను వివరిస్తూ ఇతర రాష్ట్రాలు, దేశాల్లో అమల్లో ఉన్న పరిమితులను ఉదాహరించింది. ఆ వివరాలు ఇలా.. ఐఏఆర్డీ 2020 సేకరించిన సమాచారం మేరకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో లీగల్ డ్రింకింగ్ ఏజ్ ఈ విధంగా ఉంది.. ►ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, కువైట్, లిబియా ఆల్కహాల్, సౌదీ అరేబియా అమ్మడం, కొనడం, వాడటం ఇక్కడ పూర్తిగా నిషేధం. ►ఆస్ట్రేలియా: 18 ఏళ్లు నిండిన వారు మద్యం కొనుగోలు చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో పెద్దలతో కలిసి మద్యం సేవించడానికి ఇక్కడ అనుమతి ఉంటుంది. ►బంగ్లాదేశ్: నార్కొటిక్స్ కంట్రోల్ శాఖ అనుమతి ఉంటే తప్ప, అన్ని వయసుల వారు మద్యపానం చేయడం నిషేధమిక్కడ. కేవలం ముస్లీంలు మాత్రమే వైద్య కారణాల రిత్యా మద్యం సేవిస్తారు. ►కెనడా: పెద్దల పర్యవేక్షణలో మైనర్లు మద్యంపానం చేయడానికి అనుమతి ఉంటుంది. ►ఈజిప్టు: 18 ఏళ్లు, ఆపై వయసువారు ఎవరైనా మద్యం అమ్మవచ్చు, కొనొచ్చు, తాగొచ్చు. చదవండి: వీడి దుంపదెగా! ఎంత చలి పుడితేమాత్రం ఇన్ని సెగలా? ►జర్మనీ: 16 ఏళ్లవారు బీరు, వైన్, 18 ఏళ్లవారు స్పరిట్స్ సేవించడానికి అనుమతి ఉంటుంది. ఐతే బార్లు, నైట్‌క్లబ్బుల్లో 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారికి అనుమతి లేదు. ►మలేషియా: ముస్లింలకు మద్యం అమ్మడం నిషేధం. ముస్లిమేతరులకు మద్యం అమ్మకానికి చట్టపరమైన వయస్సు 21 సంవత్సరాలు. ►శ్రీలంక: 21 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారు మద్యం సేవించడానికి అనుమతి ఉంటుంది. ►యూఏఈ: షార్జాలో మద్యపానం నిషేధించబడింది. ఇతర ప్రదేశాల్లోనైతే వయోపరిమితి 21 సంవత్సరాలు. ►అమెరికా: ఆల్కహాల్ సేవించడానికి చట్టపరమైన వయస్సు 21 సంవత్సరాలు. ►యూకే: 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వాళ్లు పెద్దలతో కలిసి మద్యం సేవించడానికి అనుమతి ఉంటుంది. ఐతే కొనుగోలు చేయడం చట్ట విరుద్దం. మనదేశంలోనైతే ఇలా.. ►గోవా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, సిక్కిం, పుదుచ్చేరిలలో మద్యం కొనుగోలు చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు. ►బీహార్, గుజరాత్, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్ మరియు లక్షద్వీప్‌లతో సహా రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు నిషేధించబడ్డాయి. ►ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, జమ్మూ అండ్ కశ్మీర్, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరం, ఒరిస్సా (ఒడిశా), రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో 21 సంవత్సరాలు, హర్యానా, మేఘాలయ, పంజాబ్, ఢిల్లీలో 25గా ఉంది. ఐతే ప్రస్తుత చట్ట సవరణ బిల్లు ద్వారా అది 21 సంవత్సరాలుగా మార్చబడింది. కాగా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల్లో మద్యపాన దుఖాణాలు, పార్టీలపై పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే! ఈ సమయంలో హర్యానా ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. చదవండి: Hyderabad: పబ్బుల యాజమాన్యాలకు సీపీ సీరియస్ వార్నింగ్!! -
మద్యం మత్తులో వరుడు.. షాక్ ఇచ్చిన వధువు
తిరువొత్తియూరు: మరికొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉంది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. వధువు, ఆమె బంధువులు ఆలయానికి చేరుకున్నారు. వరుడు ఎంతకూ రాకపోవడంతో అతని ఇంటికి వెళ్లి చూడగా మద్యం మత్తులో పడివున్నాడు. తీరా అతన్ని తీసుకురాగా వివాహం చేసుకోవడానికి వధువు నిరాకరించింది. మద్యం జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో తెలిపే ఈ ఉదంతం కృష్ణగిరిలో జరిగింది. వివరాలు.. ధర్మపురి జిల్లా మారండహళ్లి సమీపంలోని తొట్ట హడక్కాన్ హళ్లికి చెందిన శరవణన్ (32) కార్మికుడు. ఇతనికి తిరువణ్ణామలైలోని చెంగం నెహ్రునగర్‌కు చెందిన యువతి (22)తో శుక్రవారం పెళ్లి నిశ్చయించారు. రాయకోటై వజ్రపళ్లం శివాలయంలో ఏర్పాట్లు చేశారు. ఉదయం వధువు తరఫు వారు ఆలయానికి చేరుకున్నారు. చాలా సమయం అయినా వరుడి ఇంటి వారు రాకపోవడంతో అతని ఇంటికి వెళ్లి చూశారు. శరవణన్ మద్యం మత్తులో లేవడానికి వీలుకాని స్థితిలో పడి ఉన్నాడు. అతన్ని మారండహళ్లి పోలీసులకు అప్పగించారు. మద్యం మత్తు నుంచి తేరుకున్న శరవణన్ క్షమించమని కోరినా వధువు ఒప్పుకోకపోవడంతో వివాహం ఆగిపోయింది. వివాహానికి చేసిన ఖర్చును వరుడి ఇంటి వారు తిరిగి ఇవ్వాలని పోలీసుస్టేషన్లో ఒప్పందం చేసుకున్నారు. -
పూటుగా మద్యం తాగి గేట్‌మ్యాన్ నిద్ర.. ఆగిన రైలు
నంద్యాల రూరల్: కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని ఊడుమాల్పురం రైల్వేగేట్ వద్ద కాపలా ఉన్న గేట్‌మ్యాన్ శ్రీనివాసులు అదివారం తన స్నేహితుడితో కలిసి మద్యం తాగి అదే గదిలో నిద్రపోయాడు. సాయంత్రం కర్నూలు–నంద్యాల డెమో రైలు సమీపానికి వచ్చినా గేట్ వేయలేదని గమనించిన లోకోపైలెట్ రైలును ఆపి హారన్ మోగించారు. స్థానికులు రూమ్‌లో ఉన్న గేట్‌మ్యాన్‌ను నిద్రలేపారు. గేట్ వేయడంతో డెమో రైలు నంద్యాలకు వెళ్లింది. ఈ సమాచారం అందిన రైల్వే ఉన్నతాధికారులు అక్కడికి వచ్చి గేట్‌మ్యాన్‌ను విచారించారు. అతడు మద్యం తాగాడని తెలుసుకుని విధుల నుంచి తొలగించారు. చదవండి: శభాష్ ఆర్టీసీ.. శభాష్ సజ్జనార్.. తెలంగాణ ఆర్టీసీపై కిన్నెర మొగులయ్య పాట, వైరల్ -
చనిపోతున్నానంటూ తమ్ముడికి వీడియో కాల్.. ట్విస్ట్ ఏంటంటే..
సాక్షి, మహదేవపూర్(వరంగల్): బతుకుమీద విరక్తి చెందిన వ్యక్తి తన తమ్ముడికి వీడియో కాల్ చేసి తాను చనిపోతున్నానంటూ చెప్పి అదృశ్యమైన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన వావిలాల రాజేందర్‌కు మహారాష్ట్రకు చెందిన యువతితో వివాహం జరిగింది. రెండేళ్లుగా రాజేందర్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం అతను తన తమ్ముడికి, స్నేహితులకు వీడియో కాల్ చేసి తాను బతకను.. చనిపోతానని చెబుతూ కాల్ కట్ చేశాడు. దీంతో రాజేందర్ భార్య ఆర్తి మహదేవపూర్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై రాజ్‌కుమార్ గాలింపు చర్యలు చేపట్టి ఆచూకీ కనుగొని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
వైరల్: ఏం ఫిలాసఫీ బాబు.. మద్యం తాగితే కరోనా సోకదా?
దేశంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిస్తుంటే.. పలువురు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ మద్యం సేవిస్తే కరోనా రాదని సలహా ఇస్తున్నారు. ‘పైగా మేం పాటిస్తున్నాం. మీరు కూడా పాటించండి’ అంటూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నుంచి సురక్షితంగా ఉండేందుకు పలువురు అశాస్త్రీయ మార్గాల్ని ఎంచుకుంటున్నారు. ఇటీవల కరోనా నుంచి సురక్షితంగా ఉండేందుకు ఆవు పేడను ఒంటికి పూసుకోవాలన్న ఓ ఘటన హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ‘కరోనా సోకకుండా, ఆస్పత్రి పాలు కాకుండా తమని తాము రక్షించుకోవాలంటే మద్యం సేవించాలి. గంజాయి పీల్చాలి. నేను అలాగే చేస్తున్నానంటూ ఓ పెద్దాయన చెప్పిన వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ సింగ్ షేర్ చేశారు. ఇలాంటి వాటిని నమ్మోద్దని రూపిన్ సింగ్ కామెంట్ జతచేశారు. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘ఏం ఫిలాసఫీరా బాబు.. మద్యం తాగితే కరోనా సోకదా’.. ఏం చెబుతున్నావో నీకు తెలుస్తుందా.. ఏ ఊరమ్మా మనది’ అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కానీ డాక్టర్లు మాత్రం కరోనా వైరస్ నుంచి సురక్షితంగా ఉండేందుకు మాస్క్‌లు ధరించడం, లాక్డౌన్ నిబంధనల్ని పాటించాలని సూచిస్తున్నారు. మద్యం సేవించడం వల్ల రోగనిరోధక శక్తి బలహీన పడుతుందని, ధూమపానం వల్ల ఒత్తిడి పెరిగి ఊపిరితిత్తుల వ్యవస్థపై దాడి చేస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. #Gyaani#ज्ञानी सुनिए इन्हें भी pic.twitter.com/0FlrlGhsCy — Rupin Sharma IPS (@rupin1992) May 25, 2021 -
మద్యం తాగొద్దన్నందుకు తండ్రిని కొట్టి చంపిన కొడుకు
సాక్షి, నూతనకల్: మద్యం తాగొద్దన్నందుకు ఓ తనయుడు తండ్రిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన నూతన్‌కల్ మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఉప్పుల వెంకన్న(50) గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య, కుమారుడు, కుమార్తె సంతానం. కుమారుడు మల్లయ్య తమకున్న రెండెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ భార్యా పిల్లలను పోషించుకుంటున్నాడు. కాగా, మల్లయ్య ఇటీవల తాగుడుకు బానిసయ్యాడు. ఇదే విషయంపై తండ్రికొడుకుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి కుమారుడు తాగి రావడంతో తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో వెంకన్న తలపై మల్లయ్య కర్రతో దాడిచేయగా అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంకన్నకు ఎలాంటి వైద్యచికిత్స అందించకపోవడంతో మంగళవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం నిమిత్తం మృతదేహాన్ని తుంగతుర్తి ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య నీలమ్మ ఫిర్యాదు మేరకు సీఐ రవి పర్యవేక్షణలో ఎస్ఐ శివకుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ( చదవండి: చికెన్, మటన్ గొడవ..! నిండు ప్రాణం బలి ) -
స్కూల్లో తప్పదాగి చిందులేసిన ఎంఈఓ.. వీడియో వైరల్
సాక్షి,ఆదిలాబాద్: విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు మద్యానికి బానిసై అనుచితంగా ప్రవర్తించిన ఘటనలు చూశాం. తాగి పాఠశాలకు వెళ్లిన టీచర్లపై అధికారులు చర్యలు తీసుకున్న వార్తలు చదివాం. అయితే, ఉపాధ్యాయుల పనితీరును పర్యవేక్షించే మండల విద్యాధికారే పాఠశాల ఆవరణలో మందు పార్టీ చేసుకుంటూ పట్టుబడిన ఘటన తాజాగా బయటపడింది. తాగిన మైకంలో ఆయన చిందులేస్తున్న వీడియో ఒకటి బయటికొచ్చింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఎంఈఓ నర్సింహులు మద్యం సేవించి ఓ స్కూల్ ఆవరణలో డ్యాన్స్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎంఈవో, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ చేస్తున్నారు. ‘ఎంఈవో అధికారి తాగి చిందులేయడం దారుణం, ఇది చాలా హేయమైన చర్య’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: లైసెన్స్ లేని వారికి వాహనం ఇస్తే జైలుకే.. -
మద్యం తాగితే కరోనా రాదనేది అపోహే!
ఒంగోలు: మద్యం తాగితే కరోన రాదంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వి.లక్ష్మణరెడ్డి అన్నారు. సోమవారం ఒంగోలు ఎక్సయిజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయమై స్పష్టత ఇచ్చిందని, కనుక ప్రజలు ఈ విషయాన్ని గమనించి మద్యం వైపు దృష్టిసారించ వద్దని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మార్చి 22న జనతా కర్ఫ్యూ, మరుసటి రోజు నుంచి లాక్డౌన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 3500 మద్యం షాపులు, 800కుపైగా ఉన్న బార్లను మూసివేయడం జరిగిందన్నారు. కొంతమంది మద్యం వ్యాపారులు, ప్రభుత్వ మద్యం దుకాణాలలోని సిబ్బంది చేతివాటం చూపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపై కఠిన చర్యలు కూడా చేపడుతున్నామన్నారు. ఏ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధి అయినా మద్యం అక్రమాలను ప్రోత్సహిస్తే సహించవద్దని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు. జనతా కర్ఫ్యూ రోజు నుంచి ఈనెల 19వ తేదీవరకు రాష్ట్రవ్యాప్తంగా 2178 అక్రమ మద్యం కేసులు నమోదుచేసి 2213 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. 16405 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేయడం, 3,61,500 లీటర్ల పులిసిన బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలనుంచి తరలిస్తున్న 1420 లీటర్ల మద్యాన్ని సీజ్‌చేయడం జరిగిందని, 3వేల లీటర్ల కల్లును పట్టుకున్నారన్నారు. అక్రమ మద్యం రవాణాకు వినియోగిస్తున్న 464 వాహనాలను సీజ్ చేశారంటూ ఎక్సయిజ్ సిబ్బందిని అభినందించారు. వాస్తవానికి కొంతమంది సిబ్బంది అక్రమాలకు పాల్పడుతుండడంతో వారిని ఇప్పటికే ప్రభుత్వానికి సరెండర్ చేయాల్సి వచ్చిందని, దీంతో సిబ్బంది సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికి బాగా పని చేస్తున్నారన్నారు. నిర్లక్ష్యం, అక్రమాలను సహించేదిలేదన్నారు. సంపూర్ణ మధ్య నిషేధ ప్రభుత్వ సంకల్పానికి ప్రస్తుత లాక్డౌన్ పీరియడ్ మద్యం ప్రియులు మద్యం వ్యసనాన్ని మానడానికి ఒక ట్రయల్ రన్‌గా భావిస్తున్నామన్నారు. మద్యం మానాలనుకునే వారి కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లా వైద్యశాలల్లో, బోధన ఆసుపత్రుల్లో డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అక్రమ మద్యానికి సంబంధించిన సమాచారాన్ని 14500 లేదా 18004254868 నంబర్లను సంప్రదించాలని, గుంటూరు న్యూలైఫ్ డీ అడిక్షన్ సెంటర్ సేవలను 9849347500 ద్వారా పొందవచ్చన్నారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సయిజ్ డిప్యూటీ కమిషనర్ పి.శ్రీమన్నారాయణ మాట్లాడుతూ చీరాలలో ఒకటి, ఒంగోలులో ఒక బార్లో మద్యం నిల్వలకు సంబంధించి వ్యత్యాసాలు వెలుగు చూశాయని, ఒకటి రెండు రోజుల్లో లైసెన్స్‌లను సస్పెండ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. గిద్దలూరులో ఒక ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేసే సిబ్బందిపై కూడా కేసు నమోదు చేశామన్నారు. మార్చి 22 నుంచి ఈనెల 19వ తేదీ నాటికి 8 బెల్టు షాపులపై కేసులు నమోదు చేసి 18 మందిని అరెస్టు చేశామని, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిన మద్యం కేసులు మూడు, నాటు సారా తయారీ కేసులు 35 నమోదు చేసి మొత్తం 24 వాహనాలను కూడా సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సయిజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
నేను బాగా మందేస్తా, అదేమైనా నేరమా: నటి
'మద్యపానం ఆరోగ్యానికి హానికరం' అనే కొటేషన్ వినీవినీ బోర్ కొట్టేసింది అంటోంది మళయాళీ భామ వీణ నందకుమార్. మద్యపానం హానికరం అన్నారేగాని నేరమని ఎవరూ ఎక్కాడా చెప్పలేదు. ఇక విషయానికొస్తే.. మాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న మలయాళీ భామ వీణ నందకుమార్ తన తాగుడు గురించి బాహాటంగా చెప్పేసింది. తాను ఫుల్లుగా మద్యం సేవిస్తానని అయితే తాగాక మాత్రం ఎవరినీ ఇబ్బంది పెట్టనంటూ వీణ చెప్తోంది. చదవండి: నేను తప్పు చేశా! : రకుల్ అంతేగాక ఈ అలవాటును తనకు తానుగా చేసుకున్నానని చెప్పింది. తాను తాగుతానన్న విషయాన్ని చెప్పడానికి కూడా భయపడబోనని తెలిపింది. అసలు తాగడం నేరమేమీ కాదు కదా అంటూ ప్రశ్నిస్తోంది. బీర్ తాగడం కుర్రాళ్లకు బాగా అలవాటైపోయింది. నేనూ కూడా వాళ్లలాగే.. అందులో తప్పేముందంటోంది. వీణ నందకుమార్ తాజాగా నటించిన చిత్రం 'కెట్టోయ్‌లాన్ ఎంటె మాలఖా' అనే చిత్రం హిట్ కావడంతో మూవీ ఆఫర్లు ఊపందుకున్నాయి. చదవండి: అనుష్క విషయంలో ఇదీ వదంతేనా? -
ప్రభుత్వ పాఠశాలలో మందుబాబుల వీరంగం
-
పాఠశాలను బార్గా మార్చేసి..
సాక్షి, హైదరాబాద్: ఫిలింనగర్ ప్రభుత్వ పాఠశాలలో మందు బాబులు వీరంగం సృష్టించారు. దర్జాగా ప్రభుత్వ పాఠశాలనే బార్గా మార్చేసి న్యూ ఇయర్ పార్టీ చేసుకున్నారు. సరస్వతి కొలువే ఉండే చోట తరగతి గదుల్లో మద్యం తాగి సీసాలు పగలు గొట్టారు. గురువారం ఉదయం పాఠశాలను రీ ఓపెన్ చేయడంతో తాగుబోతుల బాగోతం బయటపడింది. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. సుమారు 1600 మంది విద్యార్థులు రోడ్డుపైనే ఉండిపోయారు. పాఠశాలలో తాగుబోతుల ఆగడాల పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. -
భర్తను కడతేర్చిన భార్య
సాక్షి, ఆసిఫాబాద్: తాగుడుకు బానిసై వేధింపులకు గురిచేస్తున్న భర్తను కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు ఇచ్చి కడతేర్చిన సంఘటన రెబ్బెన మండలంలోని లక్ష్మిపూర్‌లో మంగళవారం వెలుగుచూసింది. ఎస్సై దీకొండ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం... రెబ్బెన మండలంలోని లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన చౌదరి శంకర్ (34) 11 సంవత్సరాల క్రితం ఆసిఫాబాద్ పరిధిలోని చిలాటిగూడకు చెందిన రూపతో వివాహమైంది. ప్రస్తుతం వీరికి హరిక, కీర్తణ ఇద్దరు కూమార్తెలు ఉన్నారు. ఇటీవల భార్యభర్తలకు తరుచుగా గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో శంకర్ తాగుడుకు బానిసగా మారాడు. సోమవారం సాయంత్రం శంకర్ కూల్‌డ్రింక్ కావాలని భార్యను కోరాడు. కూల్‌డ్రింక్ తెప్పించిన రూప బాటిల్లోని కొంత పిల్లలకు పోసి మిగిలిన దాంట్లో పురుగుల మందు కలిపి శంకర్‌కు ఇచ్చింది. దానిని తాగిన శంకర్ చేదుగా ఉందని భార్యను నిలదీశాడు. అప్పటికే శంకర్ పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో స్థానిక ఆర్ఎంపీని పిలిపించి పరీక్షించారు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో కాగజ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మంచిర్యాలకు తరలించేలోగా మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి యశోద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పబ్లిగ్గా తాగొద్దన్నందుకు పోలీసుపై..
సాక్షి, చెన్నై : రోడ్డుపై మద్యం తాగొద్దని వారించిన పోలీసుపై దాడి చేశారు నలుగురు తాగుబోతు యువకులు. మద్యంమత్తులో పోలీసు కానిస్టేబుల్ అని చూడకుండా దుర్భాషలాడారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14న చెన్నైలోని రోడ్డు పక్కన ఓ కారు ఆగి ఉంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసులు కారు దగ్గరకు వెళ్లి చూడగా కొంతమంది మద్యం సేవిస్తున్నారు. పబ్లిగ్గా మద్యం సేవించవద్దని పోలీసు వారిని హెచ్చరించారు. దీంతో కోపోద్రుక్తులైన యువకులు పోలీసు అధికారిపై దాడి చేశారు. అసభ్యపదజాలంతో తిడుతూ అతని వద్ద ఉన్న లాఠీని లాక్కున్నారు. వారి నుంచి తప్పించుకునేందుకు పోలీసు ప్రయత్నిచగా అతని చేతులను పట్టుకొని దాడి చేశారు. చివరకు అటుగా వెళ్తున్న వాహనదారులు వచ్చి ఆపడంతో పోలీసును వదిలేశారు. కానిస్టేబుల్‌పై దాడి చేసిన నలుగురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని చెన్నై పోలీసులు పేర్కొన్నారు. -
తాగిన మైకంలో.. సెల్‌టవర్ ఎక్కి హల్చల్..
టేకులపల్లి: తాగిన మైకంలో సెల్ టవర్ ఎక్కి అందరినీ ముచ్చెమటలు పట్టించిన సంఘటన మండలంలోని కోయగూడెంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చీమల భద్రయ్య కూలి పనులు చేసుకుంటూ జీవిస్తుంటాడు. బుధవారం సాయంత్రం తాగి ఇంటికి వచ్చిన భర్తను భార్య సారమ్మ మందలించింది. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. మనస్తాపానికి గురైన భద్రయ్య గ్రామం చివరిలో ఉన్న సెల్ టవర్ పైకి ఎక్కాడు. చుట్టుపక్కల వారు గుర్తించి కుటుంబ సభ్యులకు తెలిపారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ ఉమ, మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య సంఘటన స్థలానికి చేరుకును పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్, డయల్ 100 వచ్చింది. ఎంత ప్రయత్నం చేసినా స్పందన లేదు.విద్యుత్ సరఫరా ఉంటుందనే భయంతో ఎవరూ పైకి ఎక్కడానికి సాహసించలేదు. రెస్క్యూ టీంని పిలిపించారు. వారు కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈలోగా భారీ వర్షం మొదలైంది. టెక్నీషియన్‌తో మాట్లాడి ఆఫ్ చేయించారు. మైక్‌లో ఎస్ఐ మాట్లాడుతూ నిన్ను ఏమీ అనం .. కిందికి రావాలని కోరాడు. ఎస్ఐ విజ్ఞప్తి మేరకు భద్రయ్య కిందికి దిగి పారిపోయాడు. -
మళ్లీ నిఘా..
మోర్తాడ్(బాల్కొండ): పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడానికి మద్యం పంపిణీ చేయకుండా నిరోధించడానికి మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ అధికారులు నిఘా ఉంచారు. ముందుస్తు ఎన్నికల తరహాలో మద్యం వ్యాపారుల నుంచి రోజువారి లెక్కలను సేకరిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. అలాగే రెండో విడత, మూడో విడత ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో మద్యం వ్యాపారులు గతేడాది ఇదే నెలలో ఎంత మేర మద్యం విక్రయించారో అంతే మొత్తంలోమద్యం విక్రయిస్తున్నారా లేక ఎక్కువగా విక్రయిస్తున్నారా తేల్చడానికి ఎక్సైజ్ అధికారులు రంగంలోకి దిగారు. నిజామాబాద్ జిల్లాలో 530 గ్రామ పంచాయతీలు, కామారెడ్డి జిల్లాలో 526 గ్రామ పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. తొలి విడత పోలింగ్ ఈనెల 21న, రెండో విడత పోలింగ్ 25న, మూడో విడత పోలింగ్ 30న జరగనుంది. సర్పంచ్ స్థానాలకు, వార్డు స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ గెలుపుకోసం ఓటర్లకు మద్యం, మాంసంతో విందు ఏర్పాటు చేయడం కొనసాగుతుందని ఎన్నికల సంఘం అధికారులు భావిస్తున్నారు. మద్యం అమ్మకాలను నియంత్రిస్తే ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించవచ్చని భావించిన ఎన్నికల సంఘం.. మద్యం అమ్మకాలపై నిఘా ఉంచాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించింది. రోజువారి అమ్మకాలకంటే ఎక్కువ మద్యం విక్రయిస్తే వ్యాపారులు అందుకు తగిన కారణాలను ఎన్నికల సంఘానికి నివేదించాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం ఆదేశాలను ఎక్సైజ్ అధికారులు పాటిస్తూ మద్యం వ్యాపారులతో సమన్వయం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 150 వరకు మద్యం దుకాణాలు ఉండగా.. మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లోనే దాదాపు 100 వరకు మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల పరిధిలో ఎంత మద్యం విక్రయిస్తున్నారు, ఎవరైనా నాయకులు కొనుగోలు చేస్తున్నారా లేక సాధారణ ప్రజలే మద్యం కొనుగోలు చేస్తున్నారా అనే అంశాలపై ఎక్సైజ్ అధికారులు వివరాలను సేకరించనున్నారు. మూడు విడతల ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు మద్యం అమ్మకాలపై నిఘా కొనసాగనుంది. -
దసరా దమాకా
సాక్షి, రంగారెడ్డి: జిల్లా దసరా సందర్భంగా మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. మందుబాబులు యమ కిక్కు పొందారు. ఒకవైపు పండుగ.. మరోవైపు ఎన్నికల వాతావరణంతో మద్యాన్ని మంచినీళ్లలా తాగేశారు. సాధారణ రోజులతో పోల్చుకుంటే పండుగ ఒక్క రోజు వంద శాతం అదనంగా విక్రయాలు జరిగినట్టు ఎౖక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 412 వైన్సులు, 405 బార్లు మద్యం ప్రియులతో కిటకిటలాడాయి. వీటి ద్వారా సాధారణ రోజుల్లో నిత్యం రూ.13 కోట్ల విలువైన మద్యం అమ్ముడవుతుంది. పండుగ సందర్భంగా ఏకంగా రూ.26 కోట్ల విలువైన విక్రయాలు జరిగినట్టు అంచనా. అంటే రూ.13 కోట్ల విలువైన మద్యాన్ని అదనంగా తాగేశారన్నమాట. నిత్యం 53వేల పైచిలుకు ఐఎంఎల్, బీర్ల కాటన్లు అమ్ముడవుతున్నాయి. దసరాను పురస్కరించుకుని లక్షా రెండు వేల కాటన్లు విక్రయించినట్టు ఆబ్కారీ శాఖ వర్గాలు తెలిపాయి. -
వారానికి రెండు రోజులు మద్యానికి దూరంగా..
లండన్ : అతిగా మద్యం సేవించే వారు ఆరోగ్యం మెరుగుపరుచుకునేందుకు, మద్యానికి బానిసలు కాకుండా ఉండేందుకు వారానికి రెండు రోజులు లిక్కర్ హాలిడే పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బ్రిటన్‌లో ప్రతి ఐదుగురిలో ఒకరు అతిగా మద్యం సేవిస్తున్నారని, ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.వారంలో రెండు రోజులు మద్యం తీసుకోకుండా లక్ష్యంగా నిర్ధేశించుకోవాలని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ మద్యపాన ప్రియులను కోరింది. రోజూ రాత్రి డిన్నర్‌తో పాటు ఓ గ్లాస్ వైన్ తీసుకునే వారిలో మూడింట రెండు వంతుల మంది మద్యం ముట్టకుండా ఉండటం పొగతాగడం వదిలివేయడం కన్నా కష్టమని భావిస్తున్నట్టు దాదాపు 9000 మందిపై నిర్వహించిన పోల్‌లో వెల్లడైంది. మద్యంతో కాలేయ వ్యాధులతో పాటు హైబీపీ, గుండె జబ్బులు, పలు క్యాన్సర్లు వచ్చే ముప్పు అధికమని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డంకన్ సెల్బీ హెచ్చరించారు. మద్యపానంతో త్వరగా స్థూలకాయం వచ్చే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. ప్రతివారంలో కనీసం రెండు, మూడు రోజులు మద్యం ముట్టకుండా టార్గెట్‌గా పెట్టుకుంటే మద్యం తక్కువగా తీసుకున్న ఫలితంగా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చన్నారు. వారానికి వరుసగా రెండు రోజులు మద్యానికి విరామం ఇస్తే కాలేయ వ్యాధులతో పాటు తీవ్ర అనారోగ్యాల ముప్పును తప్పించుకోవచ్చని పలు అథ్యయనాలు సూచిస్తున్నాయి. నిత్యం మద్యపాన సేవించడం ద్వారా కేలరీలు అధికమై ఒబెసిటీకి దారితీయడంతో పాటు టైప్ టూ మధుమేహం బారిన పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
ప్రాణం మీదకు తెచ్చిన మందు పందెం
కోదాడ అర్బన్ : ఇద్దరు లారీ డ్రైవర్లు మద్యం తాగే విషయంలో వేసుకున్న పందెం ఓ డ్రైవర్ ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ ఘటన గురువారం కోదాడ లో చోటు చేసుకుంది. వివరాలు.. లారీ డ్రైవర్లు మామిడి లక్ష్మయ్య, బ్రిటిష్‌స్నేహితులు. వీరు ఉదయం లారీ అసోసియేషన్ వద్ద మద్యం తాగేం దుకు ఉపక్రమంచారు. ఆ సమయంలో వారద్దిరి మద్యం తాగే విషయంలో వాదన మొదలైంది. మామిడి లక్ష్మయ్య తాను మద్యంలో నీళ్లు కలపకుండా అరగంటలో ఫుల్‌బాటిల్ తాగుతానని బ్రిటిష్‌తో పందెం కట్టాడు. అలా తాగితే తాను రూ.5వేలు ఇస్తానని పందెం కాశాడు. ఈ సందర్భంగా వారు తాగిన తరువాత ఏదైనా జరిగితే పందెం కాసిన వారికి సంబంధం లేదని ఒక కాగితంపై రాసుకున్నారు. అనంతరం లక్ష్మయ్య పందెం ప్రకారం ఎంసీ విస్కీ ఫుల్‌బాటిల్‌ను పావుగంటలోనే తాగి పడిపోయాడు. దీంతో బ్రిటిష్ పందెం మొత్తాన్ని లక్ష్మయ్య చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. లక్ష్మయ్య పరిస్థితి గమనించిన స్థానికులు అతడిని స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని, రేపటి వరకు ఎలా ఉంటుందనేది చెప్పలేమని వైద్యులు చెప్పారు. మొత్తం మీద మందుపందెం ప్రాణం మీదకు తెచ్చింది. -
మాస్టారు.. ఇదేం పద్ధతి?
వీరఘట్టం : విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు మద్యం మత్తులో జోగుతుండడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఆ ఉపాధ్యాయుడిని పాఠశాల నుంచి పంపించేయాలని, లేని పక్షంలో పిల్లల టీసీలు ఇచ్చేయాలని స్పష్టంచేశారు. విక్రమపురం ప్రాథమిక పాఠశాల వద్ద సర్పంచ్ మాచర్ల వెంకటరమణ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. విక్రమపురం పాఠశాలలో ప్రస్తుతం ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఒకరు నిత్యం మద్యం తాగి పాఠశాలకు రావడం.. పనివేళలో తరగతి గదిలోనే నిద్రపోవడం వంటివి చేస్తున్నారు. ఈ విషయాలను విద్యార్థులు తమ తల్లిదండ్రులకు వివరించారు. ఈ మేరకు ఈ ఉపాధ్యాయుడిపై ఆరు నెలల నుంచి జన్మభూమి–మా ఊరు గ్రామసభలో, మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో, పలుమార్లు గ్రీవెన్స్‌లో గ్రామస్తులు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. అయినా ఉన్నతస్థాయి అధికారులు పట్టించుకోవడంతో ఉపాధ్యాయుడు నిత్యం పాఠశాల వద్దే మద్యం తాగడం ప్రారంభించాడు. దీనిపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని నిలదీశారు. తగ్గిన విద్యార్థుల సంఖ్య ఉపాధ్యాయుల ప్రవర్తనా నియమావళి బాగా లేకపోవడంతో ఈ ఏడాది ఒక్క కొత్త అడ్మిషన్ కూడా జరగలేదు. రెండేళ్ల క్రితం 80 మంది విద్యార్థులతో 8 మంది సిబ్బందితో ప్రాథమికోన్నత పాఠశాలగా ఉండే విక్రమపురం పాఠశాల నేడు అధ్వానంగా మారింది. విద్యార్థుల సంఖ్య క్రమేపీ తగ్గడంతో ప్రాథమిక పాఠశాలగా మారింది. ప్రస్తుతం పాఠశాలలో ఉన్న 37 మందికి కేవలం 11 మంది మాత్రమే పాఠశాలకు వస్తున్నారు. మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించేశారు. ఇంకా వీరికి టీసీలు మాత్రం ఇవ్వలేదు. ప్రస్తుతం ఉన్న 11 మంది విద్యార్థుల తల్లిదండ్రులు పేదలు కావడంతో ప్రైవేటు పాఠశాలలకు పంపించడం లేదు. గతం ఘనం.. వీరఘట్టం మండలంలో విక్రమపురం పాఠశాలకు ఘన చరిత్ర ఉంది. ఈ పాఠశాలలో చదువుకున్న 80 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. నిత్యం పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి తమ వంతు సాయం అందిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుల తీరు బాగోలేకపోవడంతో వీరు కూడా ఇటు చూడడం మానేశారు. తక్షణమే ఈ ఉపాధ్యాయులను బదిలీ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మారడం లేదు మందు తాగి పాఠశాలకు రావొద్దని ఎన్నో సార్లు చెప్పాం. అయినా ఆ ఉపాధ్యాయుడి పద్ధతి మారలేదు. అంతేకాక పిల్లలతో కాళ్లు పట్టించుకోవడం, మందు కోసం గ్లాసులు తెప్పించుకోవడం చేస్తున్నాడు. పాఠాలు చెబుతారని పంపిస్తే పిల్లలతో ఇలాంటివి చేయిస్తున్నాడు. తక్షణమే ఈ ఉపాధ్యాయుడిని బదిలీ చేయాలి. – ఎన్.మరియమ్మ, విద్యార్థి తల్లి, విక్రమపురం ప్రైవేటు బడికి పంపే స్తోమత లేదు ఉపాధ్యాయుల పద్ధతి బాగోలేకపోవడంతో స్తోమత ఉన్నవారు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చేర్పిస్తున్నారు. మాకు స్తోమత లేదు. ఇక్కడే చదివించగలం. అటువంటప్పుడు మద్యం తాగి పాఠశాలకు రావడం పద్ధతి కాదు. అధికారులు విచారణ జరిపి చర్యలు చేపట్టాలి. – బి.నారాయణరావు, విద్యార్థి తండ్రి, విక్రమపురం -
మద్యం మత్తులో యువకుల మధ్య ఘర్షణ
సాక్షి, నెల్లూరు : మద్యం మత్తులో యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటన శనివారం నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలం బూధనంలో జరిగింది. పూటుగా మద్యం సేవించిన యువకులు చిన్న కారణంతో పరస్పర దాడి చేసుకున్నారు . యువకులు ఒక్కసారిగా మారాణాయుదాలతో దాడికి దిగడంతో అక్కడ ఉన్న ప్రజలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ దాడిలో ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళా పరిస్ధితి విషమంగా ఉండడంతో అమెను నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. -
వారానికి 10 గ్లాసుల వైన్ తాగుతున్నారా..?
లండన్: మందుబాబులు..మీరు వారానికి 10 గ్లాసుల వైన్ తాగుతున్నారా..? అయితే ఇక మీ జీవితంలో రెండు ఏళ్ల ఆయుషు తగ్గిపోయినట్లేనని అంటున్నారు కేంబ్రిడ్జి యూనివర్సీటీ పరిశోధకులు. ఇటీవలే వారు మద్యంపై వైద్య పరంగా ఓ విస్తృతమైన పరిశోధన చేశారు. వారి అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ వ్యక్తి వారానికి పది లేదా అంత కంటే ఎక్కువ గ్లాసుల వైన్‌ను సేవిస్తే రెండేళ్ల ఆయుషు తగ్గుతుందని యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పరిశోధన కోసం19 దేశాలకు చెందిన దాదాపు ఆరు లక్షల మందిని పరిశీలించామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 40 ఏళ్ల ఓ వ్యక్తి వారానికి 5 పెగ్గుల మద్యాన్ని సేవిస్తే తన జీవిత కాలంలో ఆరు నెలలు నష్టపోతాడని, 10 గ్లాసుల వైన్ తాగితే రెండేళ్లు, 18 గ్లాసులు తాగితే ఐదేళ్ల ఆయుషును కోల్పోతారని యూనివర్సీటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. యూనివర్సీటీ శాస్త్రవేత్త డాక్టర్ ఎంజెలా వుడ్ మాట్లాడుతూ..ఇప్పటికే మద్యం సేవించేవారు తాగడం తగ్గించాలని లేదంటే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మితిమీరిన మద్యం తాగడం వల్ల లివర్ క్యాన్సర్, రక్త పోటు లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. 60 ఏళ్లు దాటిన వారికి మద్యం సేవించడం వల్లే ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు పరిశోధనలో తేలిందన్నారు. -
గోవాలో అలా మద్యం సేవిస్తే జైలుకే!
పణజి : భారత్‌లో అత్యధికులు సందర్శించే ప్రాంతంగా.. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తలసరి ఆదాయంలో అగ్రగామిగా ఉన్న గోవాకు పర్యాటకమే ప్రాణవాయువన్న సంగతి తెలిసిందే. అందమైన బీచ్‌లు, నైట్‌లైఫ్‌తోపాటు మద్యసేవనానికి కూడా చాలా మంది పర్యాటకులు ఓటేస్తారు. అయితే ఇక నుంచి గోవాలో.. ఎక్కడపడితేఅక్కడ మందు తాగడం కుదరదు. ఎందుకంటే బహిరంగ మద్యసేవనాన్ని నేరంగా పరిగణించాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తున్నది, ఆ మేరకు రూపొందించిన చట్టాన్ని అతిత్వరలోనే అమలుచేయనుంది. రెండు కఠిన చట్టాలు : గురువారం పణాజిలో నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘గోవాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని నిషేధించబోతున్నాం. దానికి సంబంధించిన చట్టానికి ఫిబ్రవరి చివర్లో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఆమోదిస్తాం. దీనితోపాటు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడాన్ని కూడా నేరంగా పరిగణించేలా చట్టాల్లో మార్పులు చేస్తాం. ఈ రెండూ కఠినంగా అమలైతే గోవా పరిశుభ్రంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహంలేదు’ అని చెప్పారు. మందుబాబులకు షాకిచ్చిన కేరళ సర్కార్ : రాష్ట్రంలో తయారయ్యే విదేశీ మద్యంపై పన్నులు భారీగా పెంచుతూ కేరళ సర్కార్ నిర్ణయం తీసుకుంది. తద్వారా మందుబాబులకు షాకిచ్చింది. రూ.400లోపు విదేశీ మద్యంపై 200 శాతం, బీర్లపై 100 శాతం ట్యాక్స్ విధిస్తున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. -
ఖల్ 'నాయక్స్' ..
ప్రొద్దుటూరు క్రైం : నేరాలను అరికట్టాల్సిన, శాంతి భద్రతలను కాపాడాల్సిన రక్షక భటులే స్టేషన్లో మద్యం తాగి కొట్టుకుంటే ఏ శిక్ష విధించాలి.. ఇద్దరు కానిస్టేబుళ్లు బాహాబాహీ తలబడ్డ సంఘటన ప్రొద్దుటూరులోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో చోటు చేసుకుంది. కేకలు వేస్తూ వారి మధ్య ముష్టి యుద్ధం జరగడంతో దారిన వెళ్లే స్థానికులు పెద్ద ఎత్తున గుమికూడారు. ఒకానొక దశలో ఎస్ఐలు సర్దిచెప్పినా వారు వినిపించుకోలేదు. సుమారు 30 నిమిషాల పాటు వారి కేకలు, తిట్లతో స్టేషన్ పరిసరాలు మారుమోగిపోయాయి. స్టేషన్లో ఇద్దరు ఎస్ఐలు ఉన్నప్పుడే ఈ సంఘటన జరగడం విశేషం. విశ్వసనీయ వర్గాలు తెలిపిన మేరకు దీనికి సంబం«ధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్టేషన్లో చంద్రానాయక్, వెంకటేశ్వర్లు నాయక్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు పని చేస్తున్నారు. చంద్రానాయక్ ముఖ్యమైన కేసుల్లోని నిందితులను పట్టుకొని రావడం, చోరీ సొత్తు రికవరీ చేయడం చేస్తుంటాడు. ఈ కారణం చేతనే అతను అధికారులతో చాలా దగ్గరగా ఉంటాడని సిబ్బంది అంటున్నారు. దీంతో తమను లెక్కచేయడని హెడ్‌కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు వాపోతున్నారు. క్రికెట్ బెట్టింగ్ ఆడకున్నా పలువురిని డబ్బు ఇమ్మని వేధించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందరూ ఉండగానే... మంగళవారం మధ్యాహ్నం అందరూ స్టేషన్లో ఉండగా చంద్రానాయక్, వెంకటేశ్వర్లు నాయక్ గొడవ పడినట్లు తెలిసింది. వీళ్లిద్దరూ మద్యం మత్తులో ఉన్నారని స్టేషన్ సిబ్బంది చెబుతున్నారు. ఈ ఘర్షణలో వెంకటేశ్వర్లు నాయక్‌కు స్వల్పంగా గాయాలు కూడా అయ్యాయి. డబ్బు పంపకాల్లో తేడా రావడంతో గొడవ జరిగినట్లు కొందరు చెప్పగా, ఇంకొందరేమో ఇద్దరూ వరుసకు మామా అల్లుళ్లు కావడంతోనే తమాషాగా తిట్టుకున్నారని అంటున్నారు. ఈ సంఘటనపై స్టేషన్ అధికారులు ఎస్పీకి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. మద్యం సేవించి స్టేషన్‌కు రావడాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా పరిగణిస్తున్నారు. ఇన్ని రోజులు సివిల్ డ్రస్‌లో ఉన్న చాంద్రానాయక్ అధికారుల ఆదేశాల మేరకు యూనిఫాంతో వచ్చాడు. ఇకపై స్టేషన్లోనే ఉంటూ విధులు నిర్వర్తించాలని అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. స్పెషల్ బ్రాంచ్ అధికారులు నివేదిక పంపినట్లు తెలుస్తోంది. మనస్పర్థల వల్లనే.. కానిస్టేబుళ్లు ఇద్దరు ఒకే ప్రాంతానికి చెందిన వారని వన్‌టౌన్ సీఐ వెంకటశివారెడ్డి తెలిపారు. వారి గ్రామంలో ఉన్న మనస్పర్థల వల్ల స్టేషన్లో గొడవ పడ్డారన్నారు. ఇద్దరి మధ్య తోపులాట జరిగే క్రమంలో ఒక కానిస్టేబుల్‌కు బొటన వేలికి గాయం అయిందని, ఇద్దరిని మందలించినట్లు సీఐ వివరణ ఇచ్చారు. -
శ్మశానంలో మందు కొడుతున్న యువత
-
మేయర్ వెళ్లేసరికి మందేస్తూ యువకులు.. షాక్
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఓ ప్రముఖ శ్మశాన వాటికలో దూరి మందు కొడుతున్న యువకులను చూసి నగర మేయర్ బొంతు రామ్మోహన్ షాకయ్యారు. అనంతరం వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్టు చేయించి వారికి షాకిచ్చారు. ఈ సంఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పంజాగుట్ట హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి పనులు పరిశీలించేందుకు నగర మేయర్ బొంతు రామ్మోహన్ అక్కడికి వచ్చారు. ఆ సమయంలో కొంతమంది యువకులు సమాధులను టేబుళ్లుగా మార్చుకొని దర్జాగా మందుకొడుతూ కనిపించి మేయర్‌ను అవాక్కయ్యేలా చేశారు. వారిని చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన వెంటనే వారిని అదుపులోకి తీసుకోని స్టేషన్‌కు తరలించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారని పోలీసులను ప్రశ్నించారు. కాగా, మందు కొడుతున్న యువకుల్లో ఒకరు ఆ వార్డు సభ్యురాలు జయలక్ష్మీ కుమారుడు కూడా ఉండటం గమనార్హం. 21 ఏళ్ల లోపు వారికి వైన్స్లలో మద్యం ఇవ్వకపోవడం, మద్యం షాపుల్లో కూర్చొనివ్వకపోవడం చేస్తున్న కారణంగా కొంతమంది యువకులు ఇలా స్మశానాలను సైతం ఆశ్రయించి మందుకొడుతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు శ్మశానాల భద్రతలోపం కూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు. -
మద్యం సేవించి సీఐ ర్యాష్ డ్రైవింగ్
సాక్షి, హైదరాబాద్: ఓ సీఐ మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేసిన సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. సికింద్రాబాద్ రైల్వే సీఐ చంద్రయ్య మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేశారు. మితి మీరిన వేగంతో ప్రమాణిస్తూ ముగ్గురిని గాయపరిచారు. బాధితుల ఫిర్యాదుతో పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేశారు. -
శని, ఆదివారాలు వస్తే పాఠశాలే బార్
పెదవడ్లపూడి (తాడేపల్లి రూరల్): శని, ఆదివారాలు వస్తే పాఠశాలను బార్ అండ్ రెస్టారెంట్‌గా మార్చేసి మందుబాబులు తమ ఆగడాలను సాగిస్తూ చుట్టు పక్కల ప్రాంతాల వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ పెదవడ్లపూడి గ్రామ మహిళలు మంత్రి గంటా శ్రీనివాసరావు, డీజీపీ నండూరి సాంబశివరావుకు ఫిర్యాదు చేశారు. సదరు మహిళలు స్థానికంగా ఉన్న యువకులు చేస్తున్న ఆగడాలను చెప్పడంతో స్థానిక నేతలు ఆ మహిళలను గదిలోకి తీసుకువెళ్లి మాట్లాడించారు. అయితే ఆ మహిళలు స్థానికంగా ఉన్న 23 మంది యువకులు స్కూల్లో మద్యం సేవిస్తున్నారంటూ తెలియజేసినట్లు సమాచారం. అయితే మంగళగిరి రూరల్ పోలీసులు నలుగురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ నండూరి సాంబశివరావు మాట్లాడుతూ పెదవడ్లపూడి పాఠశాలల్లో మందుబాబుల ఆగడాలు ఎక్కువయ్యాయని, అక్కడి మహిళలు ఫిర్యాదు చేశారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి అరాచకాలు ఎవరు చేసినా వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రతి పోలీస్‌స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్‌కు పత్రికా ముఖంగా ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే పోలీస్ అమరవీరులకు నివాళులర్పిస్తూ రాష్ట్రంలోని కొన్ని పాఠశాలలను దత్తతకు తీసుకొని, ఆ పాఠశాలలను క్లీన్ అండ్ గ్రీన్ చేయడంతోపాటు రంగులు వేయడం, పిల్లలతో మమేకమై వారి వద్ద నుంచి సమాచారం సేకరించే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. -
బంజారాహిల్స్‌లో మత్తులో యువకుల హల్చల్
బంజారాహిల్స్ (హైదరాబాద్ సిటీ): మద్యం మత్తులో నగరంలో కొందరు యువకులు హల్చల్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నం.2లోని ఇందిరానగర్‌లోగల సుఖ్‌సాగర్ హోటల్‌కు ఆదివారం వేకువజామున ఇందిరానగర్‌లో నివసించే సాయి, రాజ్‌కుమార్ పటేల్‌తోపాటు మరో ఐదుగురు యువకులు మద్యం మత్తులో వచ్చారు. వచ్చి రాగానే ఇష్టం వచ్చినట్లు మాటలంటూ హోటల్ సిబ్బంది వెంకటేష్, అనిరుద్‌లపై దాడికి పాల్పడ్డారు. తాము వచ్చినప్పుడు పక్కకు జరగకుండా అడ్డుగా ఉన్నారంటూ సాయి వారితో వాగ్వాదానికి దిగాడు. జరుగుతున్నామని చెబుతున్నా వినిపించుకోకుండా మద్యం మత్తులో వారిని తీవ్రంగా కొట్టారు. బాధితులిద్దరూ సాయి ఇంట్లోనే కిరాయికి ఉంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. -
కన్నబిడ్డ మృతికి కారణమైన తండ్రి అరెస్టు
సోంపేట: కన్న బిడ్డ మృతికి కారణమైన కేసులో తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో ముద్దాయి మద్దిలి ధర్మారావును సోమవారం సోంపేట పోలీస్‌స్టేషన్‌లో కాశీబుగ్గ డీఎస్పీ సీహెచ్.వివేకానంద, ఇన్చార్జి సీఐ అవతారంలు మీడియా ఎదుట ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. మందస గ్రామంలోని కాపు వీధికి చెందిన ఎం.ధర్మారావుకు అదే వీధిలోని సత్యతో రెండేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఏడాదిన్నర కుమారుడు ఉమమహేశ్వరరావు ఉన్నారు. ధర్మారావు తన తల్లి, అక్కల ప్రోద్బలంతో భార్య సత్యను మద్యం మత్తులో నిత్యం వేధించేవాడు. దీంతో ఆమె తన కుమారుడితో కలిసి 8 నెలల క్రితం కన్నవారింటికి వెల్లిపోయింది. ధర్మారావు అత్తవారింటికి వెళ్లి కుమారుడిని ఇంటికి తీసుకొచ్చి ఆడుకున్న తర్వాత తిరిగి తన భార్య ఇంటికి పంపించేవాడు. ఇదే క్రమంలో సెప్టెంబరు 23న ధర్మారావు, భార్య సత్యల మధ్య మరోసారి వివాదం తలెత్తింది. అదే రోజు ఉదయం 10 గంటల సమయంలో తన కుమారుడిని ఇంటికి తీసుకువచ్చి పురుగుల మందు తాగించి తాను కూడా సేవించాడు. కొద్దిసేపటి తర్వాత సత్య తన కుమారుడిని తీసుకురమ్మని తమ్ముడు çషణ్ముఖను ధర్మారావు ఇంటికి పంపించింది. అక్కడ విగతజీవులై పడి ఉన్న «ధర్మారావు, ఉమామహేశ్వరరావులను గుర్తించి వెంటనే పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఉమామహేశ్వరరావు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి సత్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ధర్మారావుపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ధర్మారావు అక్క, తల్లిపై 498 ఎ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
మద్యం మత్తులో బావిలో పడి వ్యక్తి మృతి
కోవూరు : మద్యం మత్తులో బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికుల కథనం మేరకు.. కోవూరు బుద్ధివారి వీధిలో నివాసం ఉంటున్న వంగపాటి మహేష్ (35) బార్బర్ షాపుల్లో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహేష్ కొద్ది రోజులుగా మద్యానికి బాసిసయ్యాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఒక్కోసారి మద్యం తాగి రెండు..మూడు రోజులు కూడా ఇంటికి వచ్చేవాడు కాదు. ఈ క్రమంలో బుద్ధివారి సమీపంలో ఉన్న బావిలో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు బావిలో పరిశీలించగా మృతదేహం నీటిపై తేలాడుతుండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ వెంకట్రావు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహం వంగపాటి మహేష్‌గా గుర్తించారు. మృతదేహం బాగా ఉబ్బి దుర్గంధం వెదజల్లుతుంది. మృతుడు రెండు రోజులుగా ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.దీన్ని బట్టి మద్యం మత్తులో బావి మీద కూర్చోని అందులో పడి మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఎస్ఐ వెంకట్రావు తెలిపారు. -
బ్రాహ్మచారులు మద్యం మానాలంటే.. ఇదిగో చిట్కా!
న్యూయార్క్: కలిసి ఉంటే కలదు సుఖమని పెద్దలు చెప్పింది నిజమే అని సైన్స్ కూడా చెబుతోంది. వ్యక్తుల ప్రవర్తనలపై జరిపిన అధ్యయనాల్లో ఒంటరిగా ఉండేవాళ్లకంటే జతగా ఉన్నవాళ్లే ఎక్కువ సంతోషంగా ఉంటున్నారట. మరీ ముఖ్యంగా మద్యం తాగే అలవాటు కూడా ఒంటరిగా ఉండేవాళ్లకంటే మరొకరితో కలిసుండే వారికే తక్కువగా ఉంటుందట. ఒక వేళ ఎవరైతే ఒంటరిగా ఉండి విపరీతమైన తాగుడుకు బానిసలుగా ఉంటారో వారు ఆ అలవాటు నుంచి బయటపడేందుకు వెంటనే ఎవరితోనైనా స్నేహం చేయడమో.. లేకపోతే పెళ్లి చేసుకొని జీవిత భాగస్వామిని ఆహ్వానించడమో చేస్తే మంచిదని సూచిస్తున్నారు. వర్జీనియాలోనో ఓ విశ్వవిద్యాలయానికి చెందిన డియానా డినెస్కు అనే రచయిత ఈ విషయంపై వివరణ ఇస్తూ .. 'ఒంటరిగా ఉండటంకన్నా మరొకరితో కలిసి ఉండటం మేలు. దాని ద్వారా మద్యం అలవాటును తగ్గించుకోవచ్చు. మేం చేసిన అధ్యయనంలో ఎవరైతే వివాహం చేసుకున్నారో వారికి మద్యం తాగే అలవాటు బాగా తక్కువగా ఉంది. అదే ఒంటరిగా ఉండే వాళ్లు ఇష్టం వచ్చినంత ఘాటుమందు తాగుతారని తెలిసింది' అని ఆయన చెప్పారు. ఇద్దరు కవలలను తమ అధ్యయనానికి తీసుకున్నట్లు చెప్పారు. ఆ కవలల్లో ఒకరు ఒంటరివారు కాగా.. మరొకరు వివాహం అయిన వాళ్లు. దీంతోపాటు ఓ వెయ్యి జంటలపై కూడా ఒంటరివారి ప్రవర్తనలు, అలవాట్లపై అధ్యయనం చేసినట్లు ఆయన వెల్లడించారు. -
ఒక్కరోజైనా ‘గ్యాప్’ ఇవ్వండి
మద్యం ప్రియులు ఎన్ని రకాలుగా ఎంత సమర్థించుకున్న మద్యం తాగడం మంచిది కాదన్న మాటతో అందరు ఏకీభవించక తప్పదు. మద్యం అలవాటు వల్ల ‘లివర్ సిరోసిస్’(కాలేయ వ్యాధి) వస్తుందని, అది ముదురితే మృత్యువు తప్పదని డాక్టర్లు స్టెతస్కోప్ నెత్తికి కొట్టుకొని చెప్పినా మన మందుబాబులు వినిపించుకోరు. అయితే వారానికి ఎన్ని రోజులు ఎంత డోసు తీసుకుంటే మృత్యువును ముద్దాడాల్సి వస్తుందనే అంశంపైనే ప్రధానంగా దృష్టిపెట్టి డెన్మార్క్‌లోని కోపెన్హాగన్ విశ్యవిద్యాలయం నిపుణులు ఇటీవల అధ్యయనం చేశారు. ఇక్కడ ఒకరు ఎంత తాగుతారన్నది ముఖ్యం కాదని, వారానికి ఎన్ని రోజులు తాగుతారన్నదాన్ని బట్టే కాలేయ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయని డాక్టర్ గ్రోఆస్కార్డ్ బృందం తేల్చింది. వారానికి ఒకటి లేదా రెండు రోజులు తాగకుండా వుంటే కాలేయ వ్యాధి ముప్పు నుంచి ఎక్కువ వరకు బయటపడవచ్చని వారు దాదాపు 54 వేల మంది మందుభాయిలపై జరిపిన అధ్యయనంలో బయటపడింది. కనీసం వారానికి ఒక్కరోజైనా మందుకు ‘గ్యాప్’ ఇస్తే కాలేయం తనను తాను మరమ్మతు చేసుకోవడానికి వీలుంటుందని నిపుణుల బృందం పేర్కొంది...మానవ శరీరంలోని కీలక అవయవాల్లో ఒక్క కాలేయ కణాలకు మాత్రమే పునరుత్పత్తి లక్షణాలు ఉండడమే దీనికి కారణం. పూర్తి వివరాలకు హెపటాలజీ పత్రికను చూడవచ్చు. -
మద్యం మత్తులో ‘హెడ్’ వీరంగం!
పుల్కల్ : ఓ హెడ్ కానిస్టేబుల్ పూటుగా తాగి నడిరోడ్డుపై నానా హంగామా సృష్టించాడు. దీంతో 45 నిమిషాల పాటు రాకపోకలను స్తంభింపజేశాడు. ఈ ఘటన మెదక్ జిల్లా పుల్కల్లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. పుల్కల్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మల్లయ్య రాత్రి విధులు ముగించుకొని ఇంటికి బయలుదేరాడు. మధ్యలో ఫుల్‌గా మందుకొట్టాడు. పుల్కల్ బస్‌స్టాండ్ వద్ద మంతూర్ నైట్ హాల్ట్ బస్సు రాత్రి 10.15 నిమిషాలకు వచ్చింది. దీంతో బస్సు డ్రైవర్ కిరాణం షాపులో పెరుగు తీసుకునేందుకు బస్సును ఆపాడు. అప్పటికే ఆ ప్రాంతంలో మరో కారు పార్కు చేసి ఉంది. ఈ క్రమంలో కారులో వచ్చిన హెడ్‌కానిస్టేబుల్ రోడ్డుపై వాహనాన్ని ఆపి ఎలా వెళ్లాలి అంటూ ఆర్టీసీ డ్రైవర్‌పై బూతు పురాణం మొదలు పెట్టాడు. ఇంతలోనే మరో వాహనం వచ్చింది. ఆ వాహనడ్రైవర్ పక్క నుంచి వెళ్లేందుకు యత్నించగా.. స్థలం లేకపోవడంతో అక్కడే నిలిచిపోయాడు. అంతే.. హెడ్‌కు కోపం వచ్చింది. అప్పటి వరకు బస్సు డ్రైవర్‌పై కస్సుమన్న అతను మరో వాహన డ్రైవర్‌నూ వదలలేదు. వాహనాన్ని స్టేషన్‌కు తరలించాలని చెప్పడంతో.. అయితే తన వద్ద వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్లు, డ్రైవింగ్ లెసైన్స్ ఉన్నాయని, ఎందుకు స్టేషన్‌కు రావాలని వాదించడంతో.. అంత వరకు నోరును పారేసుకున్న హెడ్‌కానిస్టేబుల్.. చేతికి పని చెప్పేంత పని చేశాడు. ఇంతలో అక్కడున్న వారు ఎస్పీకి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వివరించారు. ఆమె వెంటనే స్థానిక ఎస్ఐకి ఫోన్ చేసి పుల్కల్ బస్టాండ్‌లో ఏం జరుగుతుందో తనకు పది నిమిషాల్లో తెలపాలని ఆదేశించించారు. దీంతో స్టేషన్ నుంచి సిబ్బంది బస్టాండ్ వద్దకు చేరుకుని హెడ్‌కానిస్టేబుల్‌ను అక్కడి నుంచి పిలుచుకుని వెళ్లారు. ఈ తతంగం పూర్తి అయ్యేందుకు సుమారు రాత్రి 11 గంటలైంది. బాధ్యత గత పోలీసులే ఇలా తాగి రోడ్డుపై వాహనాన్ని నిలిపివేయడంతో మంతూర్, సింగూర్, పెద్దారెడ్డిపేట గ్రామాలకు వెళ్లాల్సిన ప్రయణికులు రాత్రి 11 గంటల వరకు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఈ విషయమై ఎస్ఐ లోకేష్‌ను వివరణ కోరగా.. హెడ్ కానిస్టేబుల్ నుంచి వివరణ తీసుకుని నివేదిక పంపాలని ఎస్పీ సూచించినట్లు ఆయన వివరించారు. ఎస్పీ సూచన మేరకు తగిన చర్యలుంటాయన్నారు.