
నేను ఇంతకుముందు అప్పుడప్పుడు డ్రింక్ చేసేవాడిని. కొంతమంది రెండు పెగ్గులు తీసుకుంటారు. కానీ రెగ్యూలర్‌గా తాగుతారు. నేను అలాంటి వాళ్లలో ఒకరిని కాదు. నేను అకెషనల్‌గా అప్పుడప్పుడు మాత్రమే తాగేవాడిని.
Aamir Khan Given Up Alcohol Says He Down The Entire Bottle At Times: బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ మార్చి 14న 57వ ఏట అడుగుపెట్టాడు. 1988లో 18 ఏళ్ల వయసులో ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయమైన అమీర్ ఖాన్ ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇటీవల తన కుటుంబం, ఆధ్యాత్మికత, మతం వంటి తదితర అంశాలపై మాట్లాడారు. ఓ ఇంటర్వ్యూలో తనకున్న మద్యం అలవాటు గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.
చదవండి: రెండుసార్లు విడాకులు: తొలిసారి స్పందించిన ఆమీర్ ఖాన్
'నేను ఇంతకుముందు అప్పుడప్పుడు డ్రింక్ చేసేవాడిని. కొంతమంది రెండు పెగ్గులు తీసుకుంటారు. కానీ రెగ్యూలర్‌గా తాగుతారు. నేను అలాంటి వాళ్లలో ఒకరిని కాదు. నేను అకెషనల్‌గా అప్పుడప్పుడు మాత్రమే తాగేవాడిని. కాకపోతో తాగడానికి కూర్చున్నప్పుడు బాటిల్ మొత్తం పూర్తి చేసేవాడిని. అది కొంచెం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. మీరు మత్తులో ఉన్నప్పుడు ఏవైనా రిగ్రీట్ ఫీల్ అయ్యేటువంటి పనులు చేశారా అని ఆలోచించుకోవాలి. నేనైతే అలా ఏం చేయలేదు. కానీ మనం సొంత నియంత్రణను కోల్పోవడమనేది నాకు నచ్చలేదు. అందుకే ఇకపై నేను తాగను.' అని అమీర్ ఖాన్ తెలిపాడు.
చదవండి: సినిమా చూసి ఏడ్చేసిన స్టార్ హీరో, టీ షర్ట్‌తో కన్నీళ్లు తుడుచుకుంటూ..
అలాగే తన కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత జీవితం, కెరీర్ గురించి కూడా అమీర్ చెప్పుకొచ్చాడు. 'ఎక్కడో నాకు అనిపించింది. నేను సరిగా నా బాధ్యతలను నిర్వర్తించలేదని. నా తల్లిదండ్రులు, నా తోబుట్టువులు, నా మొదటి భార్య రీనా, తన తల్లిదండ్రులు, రెండో భార్య కిరణ్, తన తల్లిదండ్రులు, నా పిల్లలు వీళ్లందరూ నాకు చాలా సన్నిహితులు. నేను చిత్ర పరిశ్రమలో చేరినప్పుడు నాకు 18 ఏళ్లు. నేను చాలా నేర్చుకుని, చాలా చేయాలనుకున్నాను. ఈరోజు నాకు సన్నిహితంగా ఉన్న వ్యక్తులకు నేను కోరుకున్న విధంగా చేయలేకపోయాను. వారికి తగిన సమయం ఇవ్వలేకపోయానని నాకు అనిపించింది.' అని అమీర్ పేర్కొన్నాడు.