give up
-
నెల రోజులు పాలు, పెరుగు మానేస్తే ఏమవుతుందో తెలుసా?
రోజువారీ జీవితంలో పాలు పెరుగు లేకుండా పొద్దు గడవదు. చాయ్ రూపంలో లేదా పెరుగు రూపంలోనో పాలను తీసుకోకుండా ఉండలేం. అందులోనూ ఆఫీస్‌కి వెళ్లేవాళ్లకు ఓ కప్పు కాఫీ లేదా టీ తాగకుండా ఉండలేరు. అలాగే పెరుగన్నం తినకుండా భోజనం పూర్తి అయ్యిన ఫీల్ రాదు చాలామందికి. అయితే డాక్టర్లు మాత్రం ఈ పాల ఉత్పత్తులకు దూరంగా ఉంటే బరువు సులభంగా తగ్గుతారు అంటూ షాకింగ్ విషయాలు చెబుతున్నారు. అంతేగాదు ఈ పాల ఉత్పత్తులకు దూరంగా ఉంటే మన ఆరోగ్యంలో గొప్ప మెరుగైన మార్పులు సంభవిస్తాయని అన్నారు. అదేంటి పౌష్టికాహారం అయిన పాలే మానేయాలా? ఏంటిదీ..? ఒక నెల రోజుల పాటు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండేందుకు సిద్ధపడితే మంచి మెరుగైన ఫలితాలు అందుకోగలరని వైద్యులు నమ్మకంగా చెబుతున్నారు. ఈ డైరీ ఫ్రీ ప్రయోగం మంచి సత్ఫతితాలనిస్తుందని ధీమాగా చెబుతున్నారు. ఈ మేరకు యశోధ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ దిలీప్ గుడే డైరీ ప్రొడక్ట్స్‌కి దూరంగా ఉంటే ఆహారం నుంచి అదనపు సంతృప్త కొవ్వులు, చక్కెర, ఉప్పు ఆటోమెటిక్‌గా తగ్గిపోతాయని అన్నారు. ఈ డైట్ శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసి మెరుగ్గా ఉంచుతుందని చెబుతున్నారు. జస్ట్ మూడు వారాల్లోనే దీని ప్రయోజనాలు మన శరీరంలో కనిపించడం మొదలవుతుందని తెలిపారు. అంతేగాదు గుండె జబ్బులు, అల్జీమర్స్, మధుమేహం వంటి రుగ్మతలు దరిచేరవని చెబుతున్నారు. అలాగే ఈ డైరీ ఉత్పత్తులు మన ఆహారంలో తగ్గిచడం ప్రారంభిస్తామో అప్పుడూ వెంటనే మన బరువు నియంత్రణలో ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ డైట్ ప్రభావం వ్యక్తులు మధ్య వేర్వేరుగా ఉంటుందని చెప్పారు. ఈ డైట్ ఫాలో అయ్యేటప్పుడూ పోషకలోపాలను భర్తీ చేసేలా సమతుల్య ఆహారం శరీరానికి అందేలా చూసుకోవడం ముఖ్యం. అదే సమయంలో డైరీ ఉత్పత్తులను తగ్గిస్తే గట్ బ్యాక్టీరియా యాక్టివిటీలో మార్పులు వస్తాయాని, అవి ప్రతికూలం లేదా సానుకూలమైన కావొచ్చు. ఇది వ్యక్తలు ఆరోగ్య స్థితిని బట్టి ఆయా ఫలితాలు రావడం జరగుతుందని చెబుతున్నారు వైద్యులు. పాల ఉత్పత్తులకు దూరంగా ఉండటం వల్ల చర్మం ఆరోగ్యం మెరుగపడి, వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. ముఖ్యంగా మెటిమల సమస్య నివారణవవుతుంది. అయితే చర్మం మెరుగుదలకు అవసరమైన పాల ఉత్పత్తులకు సంబంధించిన కొన్ని హర్మోన్లలో హెచ్చు తగ్గులు ఏర్పడవచ్చు. అలాగే పాల ఉత్పత్తుల్లో ఎముకల ఆరోగ్యానికి మూలమైన కాల్షియం కొరత కూడా ఏర్పడే అవకాశం ఉంది. అలాంటప్పుడూ ఆ భర్తీని కాల్షియం, విటమిన్ డీ వంటి ప్రోటీన్ పోషకాలు అందించే బాదం, టోఫు, బ్రోకలీ, అత్తి పండ్లను, పొద్దుతిరుగుడు విత్తనాలతో పొందొచ్చు. ఇక్కడ పాల ఉత్పత్తులకు దూరంగా ఉండే డైట్ అనుసరించాలనుకుంటే ఆ పాలల్లో ఉండే కాల్షియంని పొందేలా ప్రత్యామ్నాయా ఆహార పదార్థాలను తీసుకోవడం ముఖ్యం. పాల వినియోగంతో ముడిపడే ఉండే రొమ్ము, అండాశయ, ప్రొస్టేట్ క్యాన్సర్లు వటి వ్యాధులు దరిచేరవని తెలిపారు. అలాగే జీవక్రియ, నిద్ర, జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని చెబుతున్నారు. అంతేగాక కొందరూ వ్యక్తులు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నవారు కూడా ఉన్నారన్నారు. ముఖ్యంగా జీర్ణక్రియ మెరుగపడి పలు విధాల అనారోగ్య సమస్యల నుంచి ఈజీగా బయటపడతామని పేర్కొన్నారు. ఈ పాల ఉత్పత్తులను తగ్గించిన వెంటనే కొందరిలో శ్లేష్మం తగ్గి శ్వాసకోస సమస్యలు తగ్గుముఖం పడుతున్నట్లు గుర్తించామన్నారు. ఈ ఫలితాలు వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుందని, అందువల్ల ఈ డైట్‌ఫాలో అయ్యేటప్పుడూ డ్రైరీ ప్రోటీన్లకూ దూరంగా ఉండటం వల్ల వచ్చే అసహనాన్ని ఓపిగ్గా ఎదుర్కొంటూ ఫాలో అయితే మంచి ఫలితాలను పొందుతారని వైద్యుల సూచిస్తున్నారు. (చదవండి: -
నమ్మలేని నిజం..'లైఫ్' అంటే చివరికి ఓ పడకమంచం మాత్రమేనా!…
ఆమె వయస్సు 85 ఏళ్లు… ముంబై నుంచి పూణెకు వెళ్లిపోతోంది… పూణెలో ఓ సీనియర్ సిటిజెన్స్ హోమ్‌కు… అనగా ఓ ప్రత్యేక వృద్ధాశ్రమానికి… ఆమె భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు… ఆమె చదువుకున్నదే… ముగ్గురు పిల్లల పెళ్లిళ్లు చేసింది. వాళ్లందరూ అమెరికా పౌరులు. అందరికీ ఇద్దరేసి పిల్లలు… వాళ్లంతా హైస్కూల్, కాలేజీ చదువుల్లో ఉన్నారు… ఈమె అమెరికాకు బోలెడుసార్లు వెళ్లింది… కాన్పులు చేసింది… వెళ్లిన ప్రతిసారీ ఆరు నెలలపాటు ఉండేది… ఇక చాలు అనుకుంది… ఇక తన అవసరం ఎవరికీ ఏమీ లేదు. అమెరికాకు వెళ్లాలని లేదు, రానని చెప్పేసింది… ఆరోగ్యంగా మిగిలిన జీవితం గడపాలి చాలు… అందుకే ఆమె సీనియర్ సిటిజెన్స్ హోంకు వెళ్లిపోతోంది… వాటినే రిటైర్మెంట్ హోమ్స్ అనండి… అమెరికాలో వాటినే నర్సింగ్ హోమ్స్ అంటారుట. ఇక ఆమె కొనసాగిస్తూ.. ‘‘వెళ్తున్నాను… ఇక తిరిగి ఎక్కడికీ రాను… నా విశ్రాంత, చివరి కాలం గడపటానికి ఓ స్థలం వెతుక్కున్నాను… వెళ్లకతప్పదు… తమ పిల్లల బాగోగుల గురించి నా పిల్లలు బిజీ… ఎప్పుడో గానీ నేను వారి మాటల్లోకి రాను… నేనిప్పుడు ఎవరికీ ఏమీ కాను… ఎవరికీ అక్కరలేదు… ఆశ్రమం అంటే ఆశ్రమం ఏమీ కాదు… అది రిటైర్మెంట్ హోం… బాగానే ఉంది… ఒక్కొక్కరికీ ఒక సింగిల్ రూం… మరీ అవసరమైన ఎలక్ట్రికల్ పరికరాలు… టీవీ… అటాచ్డ్ బాత్రూం… బెడ్డు… ఏసీ కూడా ఉంది… కిటికీ తెరిస్తే బయటి గాలి… ఫుడ్డు కూడా బాగుంది… సర్వీస్ బాగుంది… కానీ ఇవేమీ చవుక కాదు… ప్రియమైనవే… నాకొచ్చే పెన్షన్ బొటాబొటీగా ఈ అవసరాలకు సరిపోతుంది… సరిపోదంటే నాకున్న సొంత ఇంటిని అమ్మేయాల్సిందే… అమ్మేస్తే ఇక చివరి రోజులకు సరిపడా డబ్బుకు ఢోకాలేదు… నా తరువాత ఏమైనా మిగిలితే నా కొడుక్కి వెళ్లిపోతుంది… సో, ఆ చీకూచింత ఏమీ లేదు… ‘నీ ఇష్టం అమ్మా, నీ ఆస్తిని నీ అవసరాలకే వాడుకో…’’ అన్నాడు నా వారసుడు… వెళ్లిపోవడానికి సిద్ధమైపోతున్నాను… అకస్మాత్తుగా..అవి నావి ఎలా అవుతాయ్?.. ఓ ఇంటిని వదిలేయడం అంటే అంత సులభమా..? కాదుగా… బాక్సులు, బ్యాగులు, అల్మారాలు, ఫర్నీచర్, రోజువారీ మన జీవితంతో పెనవేసుకున్న బోలెడు పాత్రలు… అన్ని కాలాల్లోనూ మనల్ని కాపాడిన బట్టలు… సేకరణ అంటే నాకిష్టం… లెక్కలేనన్ని స్టాంపులు ఉన్నయ్… చాయ్ కప్పులున్నయ్… అత్యంత విలువైన పెండెంట్లు, బోలెడు పుస్తకాలు… అల్మారాల నిండా అవే… డజన్లకొద్దీ విదేశీ మద్యం సీసాలున్నయ్… బోలెడంత వంట సామగ్రి ఉంది… అరుదైన మసాలాలు… ఇవే కాదు, అనేక ఫోటో అల్బమ్స్… ఇవన్నీ ఏం చేయాలి..? నేను ఉండబోయే ఆ ఇరుకైన గదిలో వాటికి చోటు లేదు… నా జ్ఞాపకాల్ని అది మోయలేదు… అది భద్రపరచదు కూడా… ఏముంది ఆ గదిలో…? మహా అయితే ఓ చిన్న కేబినెట్, ఓ టేబుల్, ఓ బెడ్, ఓ సోఫా ఓ చిన్న ఫ్రిజ్, ఓ చిన్న వాషింగ్ మెషిన్, ఓ టీవీ, ఓ ఇండక్షన్ కుక్కర్, ఓ మైక్రోవేవ్ ఓవెన్… అన్నీ అవసరాలే… కానీ నా జ్ఞాపకాల్ని కొనసాగించే సౌకర్యాలు కావు… నేను నా విలువైన సంపద అనుకున్న ఏ సేకరణనూ నాతో ఉంచుకోలేను… అకస్మాత్తుగా అవన్నీ నిరుపయోగం అనీ, అవి నావి కావనీ అనిపిస్తోంది… అన్నీ నేను వాడుకున్నాను, అంతే… అవి ప్రపంచానికి సంబంధించినవి మాత్రమే… నావి ఎలా అవుతాయి..? నా తరువాత ఎవరివో… రాజులు తమ కోటల్ని, తమ నగరాల్ని, తమ రాజ్యాల్ని తమవే అనుకుంటారు… కానీ వాళ్ల తరువాత అవి ఎవరివో… నిజానికి ప్రపంచ సంపద కదా… మనతోపాటు వచ్చేదేముంది..? వెళ్లిపోయేది ఒక్క దేహమే కదా… అందుకని నా ఇంట్లోని ప్రతిదీ దానం చేయాలని నిర్ణయించాను… అన్నింటితో బంధం తెంచేసుకున్నా.. కానీ అవన్నీ కొన్నవాళ్లు ఏం చేస్తారు..? నేను అపురూపంగా సేకరించుకున్న ప్రతి జ్ఞాపకం వేరేవాళ్లకు దేనికి..? వాటితో వాళ్లకు అనుబంధం ఉండదుగా… బుక్స్ అమ్మేస్తారు… నా గురుతులైన ఫోటోలను స్క్రాప్ చేసేస్తారు… ఫర్నీచర్ ఏదో ఓ ధరకు వదిలించుకుంటారు… బట్టలు, పరుపులు బయటికి విసిరేస్తారు… వాళ్లకేం పని..? మరి నేనేం ఉంచుకోవాలి..? నా బట్టల గుట్ట నుంచి కొన్ని తీసుకున్నాను… అత్యవసర వంట సామగ్రి కొంత… తరచూ పలకరించే నాలుగైదు పుస్తకాలు… ఐడీ కార్డు, సీనియర్ సిటెజెన్ సర్టిఫికెట్, హెల్త్ ఇన్స్యూరెన్స్ కార్డ్, ఏటీఎం కార్డు, బ్యాంకు పాస్ బుక్కు… చాలు… అన్నీ వదిలేశాను… బంధం తెంచేసుకున్నాను… నా పొరుగువారికి వీడ్కోలు చెప్పాను… డోర్ వేసి, గడపకు మూడుసార్లు వంగి మొక్కుకున్నాను… ఈ ప్రపంచానికి అన్నీ వదిలేశాను… ఎవరో చెప్పినట్టు… ఏముంది..? ఓ దశ దాటాక… కావల్సింది ఒక మంచం… ఓ గది… అత్యవసరాలు… మిగిలినవన్నీ గురుతులు మాత్రమే… ఇప్పుడు అర్థమవుతుంది మనకు… మనకు పెద్దగా ఏమీ అక్కర్లేదు… మనం ఇకపై సంతోషంగా ఉండేందుకు మనకు ఇక ఎటూ పనికిరానివాటిని సంకెళ్లుగా మిగుల్చుకోవద్దు… వదిలేయాలి… వదిలించుకోవడమే… కీర్తి, సంపద, భవిష్యత్తు… అన్నీ ఓ ట్రాష్… లైఫ్ అంటే చివరికి ఓ పడకమంచం మాత్రమే… నిజంగా అంతే… అరవై ఏళ్లు పైబడ్డామంటే ఆలోచన మారాలి… ప్రపంచంతో అనుబంధం ఏమిటో తెలుసుకోవాలి… అంతిమ గమ్యం ఏమిటో, భవబంధాలేమిటో అర్థమవ్వాలి… మన ఫాంటసీలు, మన బ్యాగేజీతో పాటు మనం ఇక తినలేని, అనుభవించలేని, ఉపయోగించలేనివి వదిలేయక తప్పదు… అందుకే బంధం పెంచుకోవడమే వృథా… సో, ఆరోగ్యంగా ఉండండి… ఆనందంగా ఉండండి… ఏదీ మనది కాదు… ఎవరూ మనవాళ్లు కారు… మనిషి ఒంటరి… మహా ఒంటరి… వచ్చేటప్పుడు, పోయేటప్పుడు’’..!! -
ఆయన కోసం రాజభోగాలు వదులుకుంది!
ఓస్లో: అంతులేని వైభోగాలు.. నిత్యం వెన్నంటి ఉండే మందీమార్బలం.. సపర్యలు చేసి పెట్టడానికి వందల మంది సిబ్బంది.. ఇవన్నీ ఎవరు వదులుకుంటారు? కానీ, కొద్ది నెలల క్రితం బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ.. రాజరికాన్ని వదులుకుని అమెరికా వెళ్లిపోయిన సంగతి తెలిసింది. అదే దారిలో నార్వే యువరాణి మార్థా లూయీస్ నడిచారు. తన రాచరికాన్ని వదులుకుంటున్నట్లు మంగళవారం సంచలన ప్రకటన చేశారు. తనకు కాబోయ భర్తతో కలిసి ప్రత్యామ్నాయ ఔషధ వ్యాపారాలపై దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ప్రముఖ హాలీవుడ్ ఆధ్యాత్మిక గురువు, ఆఫ్రికన్-అమెరికన్ ఆరవ తరం షమన్ అయిన డ్యూరెక్ వెరెట్‌తో 51 ఏళ్ల యువరాణి మార్థా లూయీస్ ప్రేమలో ఉన్నారు. అయితే, షమన్‌తో యువరాణి అనుబంధం కారణంగా 17 శాతం మంది నార్వేయన్లు రాయల్ కుటుంబంపై వ్యతిరేకతతో ఉన్నట్లు గత సెప్టెంబర్‌లో జరిగిన ఓ పోల్ వెల్లడించింది. మరోవైపు.. ‘రాయల్ కుటుంబంలో ప్రశాంతతను తీసుకొచ్చేందుకు నేను తప్పుకుంటున్నాను’ అంటూ మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేశారు యువరాణి మార్థా లూయిస్. నార్వే రాజు ప్రకటన.. మరోవైపు.. రాయల్ ప్యాలెస్ సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. యువరాణి తన రాజరికాన్ని వదులుకుంటున్నారని, ఇకపై ఆమెకు ఎలాంటి అధికారాలు ఉండవని స్పష్టం చేసింది. అయితే, రాజు కోరిక మేరకు ఆమె యువరాణిగా పిలవబడతారని తెలిపింది. యువరాణి మార్థా ప్రకటన తర్వాత రాణి సంజాతో కలిసి మీడియాతో మాట్లాడారు నార్వే రాజు హరాల్డ్. యువరాణి రాయల్ కుటుంబానికి ఇకపై ప్రాతినిధ్యం వహించదని చెప్పేందుకు చింతిస్తున్నానని పేర్కొన్నారు. తన నిర్ణయంపై ఆమె ఎంతో స్పష్టంగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే వివాహం.. ముగ్గురు పిల్లలు.. దేవదూతలతో మాట్లాడగలనని చెప్పుకునే మార్థా లూయిస్‌కు ఇప్పటికే వివాహం జరిగి ముగ్గురు పిల్లలు ఉన్నాయి. అయితే, ఆమె తన భర్త అరిబెన్‌తో విడిపోయారు. 2002లో క్లైర్ వాయెంట్‌గా పని చేసేందుకు సిద్ధమైన క్రమంలో ‘హర్ రాయల్ హైనెస్’ అనే టైటిల్‌ను కోల్పోయారు. మరోవైపు.. 2019లో తన వ్యాపారాల విషయంలో ప్రిన్సెస్ టైటిల్‌ను ఉపయోగించబోనని అంగీకరించారు. గత జూన్‌లో షమన్ వెరెట్‌తో అనుబంధం ఏర్పడిన క్రమంలో వారు ప్రత్యామ్నాయ థెరపీలపై దృష్టిసారించారు. సోషల్ మీడియా వేదికగా వాటిపై విస్తృత ప్రచారం కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమెను కీలక బాధ్యతల నుంచి తప్పించాయి పలు హెల్త్‌కేర్ గ్రూప్‌లు. View this post on Instagram A post shared by Princess Märtha Louise (@princessmarthalouise) ఇదీ చదవండి: హ్యారీకి అవమానం -
ఎత్తిన బాటిల్ దించకుండా తాగేవాడిని: అమీర్ ఖాన్
Aamir Khan Given Up Alcohol Says He Down The Entire Bottle At Times: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మార్చి 14న 57వ ఏట అడుగుపెట్టాడు. 1988లో 18 ఏళ్ల వయసులో ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయమైన అమీర్ ఖాన్ ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇటీవల తన కుటుంబం, ఆధ్యాత్మికత, మతం వంటి తదితర అంశాలపై మాట్లాడారు. ఓ ఇంటర్వ్యూలో తనకున్న మద్యం అలవాటు గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. చదవండి: రెండుసార్లు విడాకులు: తొలిసారి స్పందించిన ఆమీర్ ఖాన్ 'నేను ఇంతకుముందు అప్పుడప్పుడు డ్రింక్ చేసేవాడిని. కొంతమంది రెండు పెగ్గులు తీసుకుంటారు. కానీ రెగ్యూలర్‌గా తాగుతారు. నేను అలాంటి వాళ్లలో ఒకరిని కాదు. నేను అకెషనల్గా అప్పుడప్పుడు మాత్రమే తాగేవాడిని. కాకపోతో తాగడానికి కూర్చున్నప్పుడు బాటిల్ మొత్తం పూర్తి చేసేవాడిని. అది కొంచెం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. మీరు మత్తులో ఉన్నప్పుడు ఏవైనా రిగ్రీట్ ఫీల్ అయ్యేటువంటి పనులు చేశారా అని ఆలోచించుకోవాలి. నేనైతే అలా ఏం చేయలేదు. కానీ మనం సొంత నియంత్రణను కోల్పోవడమనేది నాకు నచ్చలేదు. అందుకే ఇకపై నేను తాగను.' అని అమీర్ ఖాన్ తెలిపాడు. చదవండి: సినిమా చూసి ఏడ్చేసిన స్టార్ హీరో, టీ షర్ట్‌తో కన్నీళ్లు తుడుచుకుంటూ.. అలాగే తన కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత జీవితం, కెరీర్ గురించి కూడా అమీర్ చెప్పుకొచ్చాడు. 'ఎక్కడో నాకు అనిపించింది. నేను సరిగా నా బాధ్యతలను నిర్వర్తించలేదని. నా తల్లిదండ్రులు, నా తోబుట్టువులు, నా మొదటి భార్య రీనా, తన తల్లిదండ్రులు, రెండో భార్య కిరణ్, తన తల్లిదండ్రులు, నా పిల్లలు వీళ్లందరూ నాకు చాలా సన్నిహితులు. నేను చిత్ర పరిశ్రమలో చేరినప్పుడు నాకు 18 ఏళ్లు. నేను చాలా నేర్చుకుని, చాలా చేయాలనుకున్నాను. ఈరోజు నాకు సన్నిహితంగా ఉన్న వ్యక్తులకు నేను కోరుకున్న విధంగా చేయలేకపోయాను. వారికి తగిన సమయం ఇవ్వలేకపోయానని నాకు అనిపించింది.' అని అమీర్ పేర్కొన్నాడు. -
మా భూభాగాన్ని వదులుకోం: జిన్‌పింగ్
బీజింగ్: దక్షిణ చైనా సముద్రంలోని భూభాగాలను తాము వదులుకోబోమని, అదేసమయంలో అంతర్జాతీయంగా కల్లోల పరిస్థితులను సృష్టించే ఉద్దేశం తమకు లేదని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం చైనాలో ఉన్న అమెరికా రక్షణ మంత్రి మాటిస్‌తో జిన్‌పింగ్ సమావేశమయ్యారు. దక్షిణ చైనా సముద్రంలో ఆగ్నేయాసియా దేశాల సమీపంలోని చిన్న దీవులను ఆక్రమించడం, వాటిలో ఆధునిక ఆయుధ సంపత్తిని మోహరించడాన్ని భేటీ సందర్భంగా జిన్‌పింగ్ సమర్ధించుకున్నారు. ‘మేం పటిష్ట సామ్యవాద దేశాన్ని నిర్మించుకోవాల్సి ఉంది. శాంతి పూర్వక అభివృద్ధిని కాంక్షిస్తున్నాం. వలస, విస్తరణ వాదాలను కోరుకోవటం లేదు. అంతర్జాతీయంగా అలజడులను సృష్టించాలనుకోవటం లేద. పూర్వీకులు మాకిచ్చిన భూభాగాలపై మాకు హక్కుంది. ఆ భూభాగాల్లో ఒక్క అంగుళం కూడా వదలం’ అని అన్నారు. -
ఎల్పీజీ సబ్సిడీ వదులుకున్న వారు కోటి
న్యూఢిల్లీ: వంట గ్యాస్ సబ్సిడీ వదులుకున్న వినియోగదారుల సంఖ్య కోటి దాటిందని చమురు మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఖజానాకు వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయి. వంట చెరకుపై ఆధారపడిన కుటుంబాలకు ప్రభుత్వం కొత్త గ్యాస్ కనెక్షన్ ఇచ్చే వెసులబాటు కలుగుతుంది. ప్రస్తుతం మొత్తం 15.34 కోట్ల కనెక్షన్లకు సబ్సిడీ అందిస్తున్నారు. స్తోమత కలిగిన వారు సబ్సిడీని స్వచ్ఛందంగా విరమించుకోవాలని ప్రధాని మోదీ పోయిన ఏడాది మార్చి 27న పిలుపిచ్చిన సంగతి తెలిసిందే. -
భూములివ్వమంటున్న రైతులు